viral video 5 years old boy driving car busy road in pakistan - Sakshi
Sakshi News home page

కారు నడిపిన 5 ఏళ్ల బాలుడు.. తల్లిదండ్రులపై చర్యలు

Published Thu, Jan 28 2021 12:57 PM | Last Updated on Thu, Jan 28 2021 2:47 PM

Viral Video: 5 Years Old Boy Driving A Car In Busy Road In Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: అయిదేళ్ల బాలుడు పాకిస్తాన్‌లోని అత్యంత రద్దీ రోడ్డుపై కారు నడుపుతున్న వీడియో స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. వివరాలు.. పాకిస్తాన్‌లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన ముల్తాన్‌ రహదారిలో ఓ బాలుడు బ్లాక్‌ టయోట కారు నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆ బాలుడు స్టీరింగ్‌ ఎదురుగా నిలబడి బిజీ రోడ్డుపై అతి వేగంగా కారు నడుపుతూ కనిపించాడు. అయితే ఈ కారులో పెద్దవారు ఎవరూ లేకపోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ వీడియో పోలీసుల కంటపడింది. ఇక బాలుడి తల్లిదండ్రులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్‌ పోలీసు ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: వాలెంటైన్స్‌ డే: బాయ్‌ఫ్రెండ్‌ లేకపోతే కాలేజీకి రావొద్దు)

కాగా చీఫ్‌ ట్రాఫిక్‌ ఆఫీసర్‌ జాఫర్‌ బుజ్గార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆ చిన్నారితో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసిన బాలుడి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఆ బాలుడి వయసు కేవలం 5 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. దీంతో అతి చిన్న వయసులోనే కారు నడపడానికి అనుమతి ఇచ్చిన అతడి తల్లిదండ్రులపై నెటిజన్‌లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యానికి ఇది నిదర్శనం’, ‘అతడితో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ఈ బాలుడి తల్లిదండ్రులు ప్రమాదంలో పడేశారు’, ‘తమ సొంత పిల్లవాడిపై కూడా వారు శ్రద్ధ పెట్టలేక పోయారు’ అంటూ నెటిజన్‌లు విమర్శలు గుప్పిస్తున్నారు. (చదవండి: బాడీ ఉంటే సరిపోదు.. బుర్ర కూడా ఉండాలి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement