కుటుంబం పోషాణార్థం లేదా అప్పుల పాలవ్వడం వల్లో విదేశాల్లో పని కోసం ఏజెంట్ల సాయంతో వెళ్తుంటారు కొంతమంది . అలా వెళ్లి వెనక్కి రాలేక తిప్పలు పడినవారెందరో. వీసా గడువు పూర్తి అయిపోవడంతో అక్కడ నుంచి వచ్చే మార్గం కానరాక దిక్కుతోచని స్థితిలో జైలు పాలై జీవచ్ఛవాలుగా ఉన్నవారెందరో. వారి ఆచూకీ కోసం తపించిన బంధువుల ప్రయత్నాలు సఫలమై కనపడిన వారు కొందరే. అచ్చం అలాంటి ఘటన ఎదురైంది ఇక్కడొక మహిళకు. ఆమె తన అమ్మ ఆచూకీ కోసం పడ్డ 20 ఏళ్ల తపన ఫలించింది. కానీ ఆమె తన తల్లి చేరుకోవాలంటే ప్రభుత్వ సాయం చేయాలని కోరుతోంది.
వివరాల్లోకెళ్తే....ముంబై నివాసి యాస్మిన్ షేక్ తన తల్లి తరుచుగా రెండు లేదా నాలుగేళ్ల కొకసారి పని నిమిత్తం ఖతార్ వెళ్లేదని చెప్పారు. ఎప్పటిలానే మరోసారి తన ఏజేంట్ సాయంతో వెళ్లి మళ్లీ తిరిగి రాలేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆమె ఆచూకి కోసం తాను చేయని ప్రయత్నం అంటూ లేదని చెప్పారు. అంతేకాదు తాను ఫిర్యాదు చేద్దాం అన్న సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేకపోయమని వాపోయారు. ఆమె తన తల్లి హమీదా బాను 2002లో దుబాయ్‌లో వంట మనిషిగా పనిచేసేందుకు వెళ్లారని చెప్పారు. ఆమె వెళ్లిన తర్వాత నుంచి తన కుటుంబాన్ని సంప్రదించనే లేదని చెప్పుకొచ్చారు.
ఆమె తన తల్లిని దుబాయ్‌కి పంపించిన ఏజెంట్‌ని కలిసిన ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు. కానీ యాస్మిన్‌కి తన అమ్మ ఆచూకి అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలియరాలేదు. ఐతే ఒక యూట్యాబ్ ఛానెల్ యాస్మిన్‌కి తన అమ్మ ఆచూకి తెలిపింది. యాస్మిన్ తల్లి హమీదా బాను ఏజెంట్ చేతిలో మోసపోయి పాకిస్తాన్‌కి చేరుకుంది. ఆమె అక్కడ ఒక స్థానిక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమెకు ఒక బిడ్డ కూడా ఉంది. అయితే ఆమె తన భర్త చనిపోవడంతో అనాధగా బిక్కుబిక్కుమంటూ ఉంది.
అయితే పాకిస్తాన్‌లోని ఒక సోషల్ మీడియా వినియోగదారుడు వలీవుల్లా మరూఫ్ ఆమె కథను యూట్యూబ్‌లో వివరిస్తూ.. ఆమె తన కుటుంబాన్ని కలవాలనుకుంటుందని సాయం చేయండి అంటూ ఒక వీడియోని అప్‌లోడ్ చేశారు. అంతేకాదు సదరు వలీవుల్లా మరుఫ్ ముంబైలో కొంతమంది సామాజిక కార్యకర్తల సాయంతో హమీదా భాను(తప్పిపోయిన తల్లి) కూతురు ఆచూకి తెలుసుకుని ఆమెకు ఈ వీడియో చూపించారు.
అప్పటి వరకు యాస్మిన్‌కి తన తల్లి బతికే ఉందని తెలియదు. ఇన్నాళ్లుగా తన తల్లి దుబాయ్‌లో ఉందనుకున్న తనకి పాకిస్తాన్‌లో ఉందని తెలియడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఈ మేరకు యాస్మిన్ కుటంబం తన తల్లితో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత గానీ ఆమె తన తల్లి అని వారు ఒక నిర్థారణకు రాలేకపోయారు. 20 ఏళ్ల తర్వాత తన తల్లి ఆచూకీ తెలియడం చాలా అద్భుతంగానూ, సంతోషంగానూ ఉందని చెప్పింది. కానీ తన అమ్మను భారత్‌కి తీసుకురావడానికి భారత ప్రభుత్వం సాయం చేయాలని యాస్మిన్ కోరింది. ఈ మేరకు 70 ఏళ్ల వృద్ధురాలు సోషల్ మీడియా సాయంతో తన కుటుంబం గురించి తెలుసుకోగలిగింది. ఈఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: వరదల్లో చిక్కుకున్న కారు... కానీ ఆ కారులోని కుక్క...: వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment