ఆడాళ్లు పరువు హత్యలు మొదలుపెడితే...
ముంబై: వివాదస్పద మోడల్ కందిల్ బలోచ్ హత్యపై పాకిస్థాన్ కు చెందిన బాలీవుడ్ నటుడు అలీ జాఫర్ స్పందించాడు. కందిల్ హత్యకు గురికావడం బాధ కలిగిచిందని వ్యాఖ్యానించాడు. పడుతులు పరువు హత్యలు చేయడం మొదలు పెడితే మగాళ్లలో చాలా మందికి మూడినట్టేనని అన్నాడు. 'తమ గౌరవాన్ని నిలుపుకునేందుకు మనల్ని మహిళలు మర్డర్లు చేయడం మొదలుపెడితే, మనలో చాలా మంది చావడం ఖాయమ'ని ట్వీట్ చేశాడు. అయితే పాకిస్థాన్ లో పరిస్థితులు అంత దారుణంగా లేవని చెప్పాడు.
'సినిమాల్లో రొమాంటిక్ పాత్రల్లో నటిస్తాను. అదే సమయంలో సమాజంలో జరుగుతున్న వాటి గురించి స్పందిస్తాను. నేను ఆశావాదిని. పాకిస్థాన్ లో అంతా చెడే జరగడం లేదు. పాక్ సినిమా పరిశ్రమ వృద్ధి చెందుతోంది. అక్కడ అద్భుత ప్రతిభ కలిగిన కళాకారులున్నారు. పాక్ యువత కూడా చాలా ప్రొయాక్టివ్ గా ఉంటున్నారు. ఇది శుభపరిణామ'ని అలీ జాఫర్ పేర్కొన్నాడు.
If women started killing us to protect their honour, a lot of us would be dead!
— Ali Zafar (@AliZafarsays) 16 July 2016