ఆ మోడల్ ఎవరికీ భయపడరు! | Qandeel Baloch is never fear and be brave | Sakshi
Sakshi News home page

ఆ మోడల్ ఫ్యాన్స్ ఆందోళన

Published Sat, Sep 23 2017 12:36 PM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM

Qandeel Baloch is never fear and be brave - Sakshi

ఇస్లామాబాద్: ఇంటర్నెట్ సెన్సేషన్, పాకిస్తాన్ మోడల్ కాందిల్ బలోచ్ గత ఏప్రిల్‌లో హత్యకుగురైనా.. నిందితులకు శిక్షపడకపోవడంపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డేర్ అండ్ డాషింగ్‌గా వ్యవహరించే కాందిల్‌ను సొంత సోదరుడు మహ్మద్ వసీమ్, హక్ నవాబ్‌ అనే వ్యక్తితో కలిసి హత్యచేసినట్లు ఆరోపణలున్నాయి. గతంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినా విచారణ చేపట్టని కారణంగా శిక్షపడలేదని పాక్ నెటిజన్లు మండిపడుతున్నారు.

కాందిల్ హత్యకు గురై ఏడాది కావస్తున్న నేపథ్యంలో గతంలో కాందిల్ బలోచ్ ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మత నిబంధలను ఉల్లంఘిస్తూ తరచుగా వివాదాల్లో నిలిచే కాందిల్.. ఎప్పుడూ ముక్కుసూటిగా వ్యవహరించేవారని, ఏ విషయంలోనూ ఎవరికీ భయపడే మనస్తత్వం ఆమెది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 'పాకిస్తాన్ కిమ్ కర్దాషియన్' కాందిల్‌ను దారుణహత్య చేశారంటూ ముల్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు.

ముందుగా డ్రగ్స్ తీసుకుని, ఆ తర్వాత పీకనొక్కి తన సోదరిని చంపినట్లు నిందితుడు వసీమ్ గతంలోనే అంగీకరించాడు. నవాజ్ పాత్ర ఏంటన్నది తేలుస్తామని చెప్పిన పోలీసులు విచారణ కొనసాగించారా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంతో గందరగోళం నెలకొని స్పష్టత కరువైందని మృతిచెందిన మోడల్ కాందిల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement