సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లోని జైలు ఉన్న కులభూషణ్ జాదవ్‌ను చూసేందుకు ఆయన తల్లి, భార్య వెళ్లిన సమయంలో పాకిస్థాన్ అధికారులు వ్యవహరించిన తీరుపట్ల భారత్‌లోని పలువురు నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పాక్ అధికారుల చర్యలపై జోకులు పేలుస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్‌లో ‘పాకిస్థాన్ ఓ చెప్పుల దొంగ’ అనే పేరిట యాష్ ట్యాగ్‌తో పాక్ దుమ్ముదులుపుతున్నారు. జాదవ్‌ను కలవడానికి ముందు భద్రత పేరుతో పాక్ జాదవ్ తల్లి, భార్య మంగళ సూత్రం, బొట్టు, గాజులతోపాటు వారి షూ కూడా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, మిగితా వస్తువులు ఇచ్చిన పాక్.. బూట్లు మాత్రం ఇవ్వలేదు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో పాక్‌పై సెటైర్లు వేస్తున్నారు.
‘పాక్ ఓ చెప్పుల దొంగ’ ‘పాక్ ఆర్థికంగా వెనుకబడిన దేశం అని మాకు తెలుసు.. కానీ మరీ చెప్పులు కూడా దోచుకునేంతనా అని ఇప్పుడే తెలుస్తోంది. వెంటనే మా దేశ భక్తురాలికి చెప్పులు తిరిగి ఇచ్చేయండి’ ‘పాక్ ఎందుకు జాదవ్ భార్య చెప్పులు దొంగిలించింది? వాటితో కూడా ఏదైనా జిహాదీకి ప్లాన్ చేస్తున్నారా’ ‘చెప్పులు కూడా దొంగిలించడానికి పాక్ సిగ్గుపడాలి’ ‘500 రూపాయల చెప్పుల కోసం పాక్ ఇంత కక్కుర్తిపడాలా?’ అంటూ ఇలా వరుసబెట్టి ట్విట్టర్‌లో యాష్ ట్యాగ్‌తో చప్పల్ చోర్ పాకిస్థాన్ పేరిట సెటైర్లు పేలుతున్నాయి.
So shameful that Pakistan has stolen slippers also. #ShameOnPakistan #ChappalChorPakistan
— Mili Rajpootani 🏹 (@milisilichilli) 26 December 2017
Why this beggar nation Pakistan kept shoes of #KulbhushanJadhav ‘s wife ? Any jihadi jadu-Tona planned? #ChappalChorPakistan https://t.co/HqB2LhYMPj
— Freelance bhakt (@ExSecular) 27 December 2017
@pid_gov we know that your economy is in bad condition but we seriously did not expected that you will resort to stealing chappals#ChappalChorPakistan https://t.co/os7zEBJtAG
— Amit 🕉️ #रुद्राक्षधारक (@The_AmitSpeaks) 27 December 2017
Aren't you ashamed of #ChappalChorPakistan .You stole bangles, bindi, Mangalsutra,earrings even shoes of diplomatically called ladies. You are internationally exposed & the whole world is watching your despicable deeds !
— Bane Singh (@bsdauphin) 26 December 2017
Comments
Please login to add a commentAdd a comment