జూన్‌ 9న... న్యూయార్క్‌లో... | Battle between India and Pakistan in the T20 World Cup is set | Sakshi
Sakshi News home page

జూన్‌ 9న... న్యూయార్క్‌లో...

Published Sat, Jan 6 2024 3:46 AM | Last Updated on Sat, Jan 6 2024 3:46 AM

Battle between India and Pakistan in the T20 World Cup is set - Sakshi

దుబాయ్‌: అమెరికా అభిమానుల సాక్షిగా టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్‌ నగరం వేదికగా జూన్‌ 9న టి20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో దాయాది జట్లు తలపడతాయి. ఈ ఏడాది జరిగే మెగా టోర్నీ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) శుక్రవారం రాత్రి విడుదల చేసింది.

న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక ఐసన్‌ హోవర్‌ పార్క్‌ స్టేడియంలో భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ పార్క్‌లో ఇప్పటి వరకు సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌లు మాత్రమే ఉండగా... ప్రపంచకప్‌ కోసం కొత్తగా క్రికెట్‌ మైదా నాన్ని సిద్ధం చేస్తున్నారు. జూన్‌ 1 నుంచి జూన్‌ 29 వరకు జరిగే ఈ ప్రపంచకప్‌ టోర్నీలో తొలిసారి 20 జట్లు ఆడనుండగా... వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు.  

గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న భారత్‌ లీగ్‌ దశలో తమ తొలి మ్యాచ్‌లో జూన్‌ 5న ఐర్లాండ్‌తో, జూన్‌ 9న పాకిస్తాన్‌తో, జూన్‌ 12న అమెరికాతో, జూన్‌ 15న కెనడాతో తలపడుతుంది.  
గ్రూప్‌ ‘బి’లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్, మాజీ విజేత ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్‌ జట్లు ఉన్నాయి. 
గ్రూప్‌ ‘సి’లో న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినీ జట్లకు చోటు కల్పించారు. 
గ్రూప్‌ ‘డి’లో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్‌ జట్లు ఉన్నాయి.  
లీగ్‌ దశ తర్వాత ఒక్కో గ్రూప్‌ నుంచి రెండు జట్లు ముందంజ వేస్తాయి. ఆ తర్వాత ఎనిమిది టీమ్‌లతో ‘సూపర్‌ ఎయిట్‌’ దశ జరుగుతుంది. ఆపై సెమీఫైనల్స్, ఫైనల్‌ను నిర్వహిస్తారు.  
వెస్టిండీస్‌లో 6 వేదికల్లో (బార్బడోస్, ట్రినిడాడ్, గయానా, ఆంటిగ్వా, సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌)... అమెరికాలోని 3 వేదికల్లో (న్యూయార్క్, ఫ్లోరిడా, డాలస్‌) కలిపి మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి.  
టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 30 నిమిషాల నుంచి (అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి) జరుగుతాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement