defeats
-
మూడోసారీ ‘సున్నా’!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పూర్వ వైభవాన్ని సాధించాలని ఆశపడ్డ కాంగ్రెస్ పార్టీకి వరుసగా మూడోసారి కూడా భంగపాటే ఎదురైంది. అధికార పీఠాన్ని అధిరోహించే శక్తి లేకున్నా కనీసం తమ అస్థిత్వాన్ని నిలుపుకోవాలన్న ఆశలపై ఢిల్లీ ఓటర్లు పూర్తిగా నీళ్లు చల్లారు. హ్యాట్రిక్ విజయాలతో 1998 నుంచి వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. వరుసగా మూడు సార్లు ఓడిపోవడం కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర నిరాశకు గురిచేసింది. గత ఎన్నికల కంటే కొంత మెరుగైన స్థాయిలో ఓట్లు సాధించినప్పటికీ సీట్ల ఖాతా తెరవలేదు. దెబ్బకొట్టిన ఒంటరి పోరు ఢిల్లీలో 2015, 2020 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా నెగ్గని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో కనీసంగా 10 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇందుకు అనుగుణంగా ఎన్నో హామీలు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. అయితే అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు లేకపోవడం దెబ్బకొట్టింది. అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు ఆప్ నిరాకరించడంతో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. ప్రధాన పోటీ బీజేపీ, ఆప్‌ల మధ్యే కొనసాగుతుండటంతో కాంగ్రెస్‌ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 2008లో 48 శాతం ఓట్లతో 43 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ 2013లో 24.70 శాతం సీట్లతో 7 సీట్లకు పరిమితమైంది. 2015లో కాంగ్రెస్‌కు 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓట్లు వచ్చినా ఒక్క సీటు కూడా గెలువలేదు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ దాదాపు 6.38 శాతం ఓట్లను రాబట్టుకుంది. 70 శాతానికి పైగా అభ్యర్థులు డిపాజిట్లు సైతం కోల్పోయారు. ఆప్‌తో పొత్తుపెట్టుకొని పోటీ చేస్తే కనీసం ఖాతా తెరిచే పరిస్థితి అయినా ఉండేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పనిచేయని హామీలు ఢిల్లీ అసెంబ్లీలో ఎలాగైనా పాగా వేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఓటర్లపై అనేక హామీలు గుప్పించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఐదు గ్యారంటీలను ప్రకటించింది. ‘ప్యారీ దీదీ యోజన’ కింద మహిళలకు నెలకు రూ.2,500, రూ.500లకే ఎల్పీజీ సిలిండర్, కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, పింఛను రూ.2,500 నుంచి రూ.5,000కు పెంపు, నిరుద్యోగ యువతకు ఏడాదిపాటు నెలకు రూ.8,500 ఆర్థిక సహాయం వంటి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. తన మేనిఫెస్టోలో సైతం కులగణనæ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, వితంతువుల కుమార్తెల పెళ్లికి రూ.1.10 లక్షల ఆర్థిక సాయం, ఢిల్లీవ్యాప్తంగా 100 ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటు వంటి హామీలతో ముందుకెళ్లినా ఆ పార్టీని జనం పట్టించుకోలేదు. వీటికితోడు యమునా నదీ కాలుష్యాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకున్నా ఉపయోగపడలేదు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంక గాం«దీ, మల్లికార్జున ఖర్గే తదితరులు ప్రచారం చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్ కీలక నేతలైన సందీప్ దీక్షిత్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో 25,520 ఓట్ల తేడాతో ఓటమి చెందగా, కల్కాజీ నియోజకవర్గంలో అల్కా లాంబ 47,691 ఓట్ల తేడాతో, నాంగ్లోయి నుంచి రోహిత్ చౌదరి 36,401 ఓట్ల తేడాతో ఓడిపోయారు. -
Britain: రిషి వారసుడెవరో?!
బ్రిటన్‌లో రిషి సునాక్ వారసునిగా విపక్ష కన్జర్వేటివ్ పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సూటి వ్యాఖ్యలకు పెట్టింది పేరైన 44 ఏళ్ల కేమీ బేడ్‌నాక్ మొదలుకుని పార్టీకి పరమ విధేయుడైన జేమ్స్ క్లెవర్లీ దాకా నలుగురు నేతలు రేసులో ఉన్నారు. ఎన్నికల్లో దారుణ పరాజయంతో నైరాశ్యంలో కూరుకుపోయిన శ్రేణుల్లో నూతన జవసత్వాలు నింపగల నేత వీరిలో ఎవరన్న దానిపై బహుశా బుధవారం స్పష్టత వచ్చే అవకాశముంది.గత జూలైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతుల్లో ఘోర పరాజయంతో కన్జర్వేటివ్ (టోరీ) పార్టీ కకావికలైంది. దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న అనంతరం టోరీలు ఘోర ఓటమి చవిచూశారు. పార్టీ 190 ఏళ్ల చరిత్రలోనే అత్యంత దారుణ ఓటమిగా అది రికార్డులకెక్కింది. పార్లమెంటులో టోరీ ఎంపీల సంఖ్య 365 నుంచి ఎకాయెకి 121కి పడిపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి జనాదరణ పొందేందుకు ఏం చేయాలన్న దానిపై నాయకులంతా వర్గాలుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీకి నూతన దిశానిర్దేశం చేయడం కొత్త నాయకునికి పెను సవాలే కానుంది. భారత మూలాలున్న మాజీ హోం మంత్రి ప్రీతీ పటేల్, మెల్ స్ట్రైడ్ తొలి రౌండ్లలోనే వైదొలిగి రేసులో నలుగురు మిగిలారు. వారిలో క్లెవర్లీకే మొగ్గున్నట్టు పలు సర్వేలు తేల్చినా టోరీ ఎంపీలు, నేతలు జెన్రిక్ వైపే మొగ్గుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.కేమీ బేడ్‌నాక్ (44)నైజీరియా తల్లిదండ్రులకు లండన్‌లో జన్మించారు. 2017, 2022ల్లో ఎంపీగా గెలిచారు. బోరిస్ జాన్సన్ తప్పుకున్నాక పార్టీ నేత పదవికి తొలిసారి పోటీ పడి నాలుగో స్థానంలో నిలిచారు. ముక్కుసూటి నాయకురాలిగా పేరు. దివంగత ప్రధాని మార్గరెట్ థాచర్ తనకు ఆదర్శమంటారు. ట్రాన్స్జెండర్ల హక్కులు మొదలుకుని ప్రతి అంశంపైనా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సమర్థులకు కీలక బాధ్యతలివ్వడం ద్వారా పార్టీలో సమూల ప్రక్షాళనే లక్ష్యమని చెబుతున్నారు.జేమ్స్ క్లెవర్లీ (54)పార్టీకి అత్యంత నమ్మకస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలం సైన్యంలో పని చేశారు. పార్టీలో చేరి ఎంపీగా అయ్యాక హోం, విదేశాంగ మంత్రిగా చేశారు. బ్రెగ్జిట్‌కు గట్టి మద్దతుదారు. పార్టీకి బ్రిటన్‌లోని నల్లజాతీయుల మద్దతు సాధించి పెట్టే ప్రయత్నంలో తలమునకలుగా ఉన్నారు. పార్టీలో ఇటు వామపక్ష, అటు రైట్‌వింగ్ నేతల ఆదరణ సాధించేందుకు సెంట్రిస్ట్ ఇమేజీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నేత. పలు సర్వేల్లో ముందంజలో ఉన్నారు.రాబర్ట్ జెన్రిక్ (42)పార్టీలో అతివాద నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వలసలపై మరింత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. వాటి కట్టడికి ఉద్దేశించిన రువాండా స్కీం ఆశించిన ఫలితాలివ్వడం లేదంటూ గత డిసెంబర్లో వలసల మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. మిగతా నేతలకు గట్టి పోటీ ఇస్తున్నారు.టామ్ టూగన్హాట్ (51)మాజీ సైనికుడు. ఇరాక్‌లో పని చేశారు. అరబిక్‌లో ధారాళంగా మాట్లాడగలరు. సెంట్రిస్ట్ నాయకుడు. 2022లో పార్టీ నేత పదవికి జరిగిన పోరులో లిజ్ ట్రస్ చేతిలో ఓడారు. ఎంపిక ఇలా...టోరీల సారథి ఎంపిక ప్రక్రియ కాస్ల సంక్లిష్టంగా ఉంటుంది. తుది రేసులో ఉన్న నలుగురు నేతలు పార్టీ ఎంపీలు, ముఖ్య నేతల మద్దతు గెలుచుకోవడం కీలకం. అందుకోసం పలు అంశాలపై తమ వైఖరిని వారి ముందుంచాలి. ఈ ప్రక్రియ తుది దశకు చేరింది. టోరీ ఎంపీలు, నేతల 4 రోజుల కీలక సదస్సు బర్మింగ్‌హాంలో ఆదివారం మొదలైంది. అభ్యర్థులను వారు మంగళవారం దాకా ఇంటర్వ్యూ చేస్తారు. చివరి రోజైన బుధవారం అభ్యర్థులకు ప్రధాన పరీక్ష ఎదురవుతుంది. ఒక్కొక్కరు 20 నిమిషాల పాటు చేసే ప్రసంగం కీలకం కానుంది. ఎంపీలు, నేతలను ఆకట్టుకునే వారి ఎన్నిక దాదాపు లాంఛనమే అవుతుంది. అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగే టోరీ ఎంపీల ఓటింగ్ ప్రక్రియ అనంతరం చివరికి ఇద్దరు అభ్యర్థులు రేసులో మిగులుతారు. వారి నుంచి తమ నాయకున్ని ఎన్నుకునేందుకు 1.7 లక్షల పై చిలుకు టోరీ సభ్యులు అక్టోబర్ 15 నుంచి 31 దాకా ఆన్లైన్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. విజేత ఎవరన్నది నవంబర్ 2న తేలుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాపై మానసికంగా ప్రభావం పడింది: సింధు
న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఈ ఏడాది కలిసి రావడంలేదు. 2023లో సింధు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోగా, మాడ్రిడ్ మాస్టర్స్ టోరీ్నలో రన్నరప్‌గా నిలవడం ఆమె అత్యుత్తమ ప్రదర్శన. తాజాగా యూఎస్ ఓపెన్‌లో సింధు క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది. దాంతో ఆమె తీవ్ర నిరాశ చెందింది. ఈ ఓటమి అనంతరం సోషల్ మీడియాలో స్పందించింది. ఆశ్చర్యకరంగా గతంలో ఎన్నడూలేని రీతిలో తన భావోద్వేగాలను ప్రదర్శించింది. ‘ఈ ఓటమి మానసికంగా నాపై తీవ్ర ప్రభావం చూపించింది. ముఖ్యంగా అన్ని ప్రతికూలతలు ఎదురవుతున్న ఈ ఏడాదిలో ఇలాంటి ఫలితం రావడం బాగా నిరాశపర్చింది. తాజా పరాజయంతో నేను చాలా బాధపడ్డాను. నా ఈ భావోద్వేగాలను సరైన రీతిలో మలచుకొని నా ఆట ను మరింత మెరుగుపర్చుకొనేందుకు, ఎక్కువగా సాధన చేసేందుకు వాడుకుంటా. రాబోయే కొరియా, జపాన్ టోరీ్నల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. మీ అభిమానమే నాకు సర్వస్వం. దానికి కృతజ్ఞురాలిని’ అని సింధు పోస్ట్ చేసింది. -
నియంతృత్వ శక్తులను ఓడిద్దాం: తేజస్వీ యాదవ్
పట్నా: దేశంలోని నియంతృత్వ శక్తులను ఓడిద్దామని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పరోక్షంగా విమర్శించారు. పట్నాలో శుక్రవారం విపక్ష పార్టీల భేటీపై శనివారం బిహార్ డెప్యూటీ సీఎం అయిన తేజస్వీ స్పందించారు. ‘ కన్యాకుమారి నుంచి కశీ్మర్దాకా నేతలంతా నియంతృత్వ శక్తులను ఓడిద్దామని విపక్షాలభేటీలో ప్రతినబూనారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు మోదీ గురించో మరే ఇతర వ్యక్తి గురించో కాదు. ప్రజా సంక్షేమం గురించి. విపక్షాల ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై వచ్చేనెలలో సిమ్లాలో జరిగే సమావేశంలో చర్చిస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ తొలి అడుగు పడింది. గతంలో చరిత్రాత్మక చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం, జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమాలు బిహార్ నుంచే మొదలయ్యాయి ’ అని అన్నారు. ‘ సమావేశంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ప్రతీ అంశాన్ని సామరస్యపూర్వక పరిష్కారం కోసమే స్వీకరించి చర్చించాం’ అని చెప్పారు. ఢిల్లీలో పరిపాలన సేవలపై కేంద్రం తెచి్చన ఆర్డినెన్స్‌లో కాంగ్రెస్ వైఖరి వెల్లడించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ నిరాకరిస్తుండటంతో శుక్రవారం భేటీ తర్వాత సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొనకుండానే కేజ్రీవాల్ ఢిల్లీకి వెనుతిరిగారు. ఈ విషయంపైనే తేజస్వీపైవిధంగా స్పందించారు. విపక్షాల భేటీని బీజేపీ అగ్రనేత అమిత్ షా ఫొటో సెషన్‌గా పేర్కొంటూ విమర్శించడంపై తేజస్వీ స్పందించారు. ‘ ఫొటో సెషన్ అంటే ఏమిటో వారికే బాగా తెలుసునన్నారు. -
Thailand Open 2023: సింధు, శ్రీకాంత్‌లకు చుక్కెదురు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రియాన్షు రజావత్, మిథున్ మంజునాథ్... మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, మాళవిక తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మరోవైపు కిరణ్ జార్జ్, లక్ష్య సేన్, సైనా నెహ్వాల్, అష్మిత చాలిహా తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌కు కిరణ్ షాక్ పురుషుల సింగిల్స్‌లో 26వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో 21వ ర్యాంకర్ శ్రీకాంత్ 8–21, 21–16, 14–21తో ఓడిపోయాడు. సాయిప్రణీత్ 14–21, 16–21తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, ప్రియాన్షు 19–21, 10–21తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా) చేతిలో, సమీర్ వర్మ 15–21, 15–21తో జొహాన్సన్ (డెన్మార్క్), మిథున్ (భారత్) 21–17, 8–21, 15–21తో కున్లావుత్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. ప్రపంచ 59వ ర్యాంకర్ కిరణ్ జార్జ్ 21–18, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2018 ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ షి యు కి (చైనా)పై సంచలన విజయం సాధించగా... లక్ష్య సేన్ 21–23, 21–15, 21–15తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై కష్టపడి గెలిచాడు. 26 నిమిషాల్లోనే... దాదాపు రెండు నెలల తర్వాత మరో అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో కేవలం 26 నిమిషాల్లో 21–13, 21–7తో వెన్ జు జాంగ్ (కెనడా)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ అష్మిత 21–17, 21– 14తో భారత్‌కే చెందిన మాళవికను ఓడించింది. తొమ్మిదేళ్ల తర్వాత... కెనడా ప్లేయర్, ప్రపంచ 15వ ర్యాంకర్ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 13వ ర్యాంకర్ పీవీ సింధు 8–21, 21–18, 18–21తో ఓటమి చవిచూసింది. మిచెల్లి చేతిలో సింధు ఓడిపోవడం తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13,18–21, 21–17తో రస్ముస్ జెర్ –సొగార్డ్ (డెన్మార్క్) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
రూడ్, జబర్లకు షాక్!
మెల్బోర్న్: ఈ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. సీడెడ్ స్టార్లు రెండో రౌండే దాటలేకపోతున్నారు. నాలుగో రోజు పోటీల్లో రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), 12వ సీడ్, ఒలింపిక్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఇంటిదారి పట్టారు. నాదల్ ఇది వరకే అవుటైన ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా మారిన సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో నిరుటి వింబుల్డన్, యూఎస్ ఓపెన్ రన్నరప్, రెండో సీడ్ అన్స్ జబర్ (ట్యూనిషియా), తొమ్మిదో సీడ్ వెరొనికా కుడెర్మెతొవ (రష్యా), 16వ సీడ్ అనెట్ కొంటావిట్ (ఈస్టోనియా)లు కంగు తిన్నారు. ఈ విభాగంలో నాలుగో సీడ్ కరొలిన్ గార్సియా (ఫ్రాన్స్), ఐదో సీడ్ అరిన సబలెంక (బెలారస్), 12వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) ముందంజ వేశారు. బ్రూక్స్‌బి ‘హీరో’చితం పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో 22 ఏళ్ల యువ అమెరికన్ జెన్సన్ బ్రూక్స్‌బి సంచలన ప్రదర్శనతో రూడ్‌ను కంగుతినిపించాడు. దీంతో గతేడాది ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్లలో రన్నరప్‌గా నిలిచిన రూడ్ ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్‌లో అనూహ్యంగా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 3 గంటల 55 నిమిషాల సమరంలో బ్రూక్స్‌బి 6–3, 7–5, 6–7 (4/7), 6–2తో రూడ్‌ను ఓడించాడు. 8వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) అయితే వైల్డ్‌కార్డ్ ప్లేయర్ అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా) చేతిలో చేతులెత్తేశాడు. ఫ్రిట్జ్ 7–6 (7/4), 6–7 (2/7), 4–6, 7–6 (8/6), 2–6తో 23 ఏళ్ల అలెక్సీ పోరాటానికి తలవంచాడు. నాలుగో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–1, 6–7 (5/7), 6–2, 6–0తో క్వాలిఫయర్ ఎంజో కౌకాడ్ (మారిషస్)పై గెలుపొందగా, జ్వెరెవ్‌కు 7–6 (7/1), 4–6, 3–6, 2–6తో మైకేల్ మో (అమెరికా) చేతిలో చుక్కెదురైంది. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–2, 6–4, 6–7 (2/7), 6–3తో ఎమిల్ రుసువురి (ఫిన్లాండ్)పై నెగ్గాడు. మూడో రౌండ్లో గార్సియా, సబలెంక మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 7–6 (7/5), 7–5తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై, ఐదో సీడ్ సబలెంక (బెలారస్) 6–3, 6–1తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై వరుస సెట్లలో విజయం సాధించారు. అయితే గతేడాది సూపర్ ఫామ్‌లో ఉన్న రెండో సీడ్ జబర్ (ట్యూనిషియా) 1–6, 7–5, 1–6తో మర్కెట వొండ్రొసొవా (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయం పాలైంది. 9వ సీడ్ కుడెర్మెతొవ (రష్యా) 4–6, 6–2, 2–6తో అమెరికాకు చెందిన క్వాలిఫయర్ కేటీ వొలినెట్స్ చేతిలో ఇంటిదారి పట్టింది. 12వ సీడ్ బెన్సిచ్ 7–6 (7/3), 6–3తో క్లెయిర్ లియూ (అమెరికా)పై గెలుపొందగా, 16వ సీడ్ కొంటావిట్ (ఈస్టోనియా) 6–3, 3–6, 4–6తో మగ్ద లినెట్ (పోలాండ్) చేతిలో కంగుతింది. 30వ సీడ్ కరోలినా ప్లిస్కొవా (చెక్ రిపబ్లిక్) 6–0, 7–5తో పుతినెత్సవ (రష్యా)పై గెలిచింది. -
అర్జెంటీనా గర్జన.. జగజ్జేతగా మెస్సీ బృందం
ఏమా ఆట... ఎంతటి అద్భుత ప్రదర్శన... ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు... ప్రపంచకప్ ఫైనల్ అంటే ఇలా ఉంటుంది... కాదు, కాదు.. ఇంత గొప్పగా, ఇలాగే ఉంటుంది అనిపించేలా సాగిన ఆట... మైదానంలో ఆటగాళ్లు కొదమసింహాల్లా పోటీపడుతుంటే... స్టేడియంలో 90 వేల మంది ప్రేక్షకులే కాదు, ప్రపంచం మొత్తం ఊగిపోయింది... ఫైనల్లో ఆడుతున్న జట్లు మాత్రమే కాదు... ఏ జట్టుతో సంబంధం లేకపోయినా, రెప్పార్పకుండా చూసిన వీరాభిమానుల సంఖ్యకు లెక్కే లేదు... ఆట ఆరంభంలో అర్జెంటీనా దూకుడు చూస్తే మ్యాచ్ ఏకపక్షమే అనిపించింది... ఒకసారి కాదు, రెండుసార్లు కాదు... పదే పదే అటాక్ మంత్రంగా ఆ జట్టు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది... రెండు గోల్స్ ఆధిక్యం సాధించాక మెస్సీ మాయలో ఊగిపోతున్న అర్జెంటీనా అభిమానులు సంబరాలు షురూ చేసేశారు... తొలి అర్ధ భాగం చూస్తే అసలు ఫ్రాన్స్ ఫైనల్ చేరిన జట్టేనా అనిపించింది... స్టార్ ఆటగాళ్ల జాడే కనిపించలేదు. రెండో అర్ధభాగంలో కూడా కూడా అర్జెంటీనా తగ్గలేదు... మొత్తం 67 నిమిషాల ఆట సాగినా... ఒక్క షాట్ కూడా గోల్ పోస్ట్‌పై కొట్టలేకపోయింది. అప్పుడొచ్చాడు ఎంబాపె... అప్పటి వరకు కనీసం పాస్‌లు కూడా అందుకోలేకపోయిన ఈ సంచలన ఆటగాడు తనేంటో చూపించాడు... 97 సెకన్ల వ్యవధిలో రెండు గోల్స్ చేసేసి అర్జెంటీనాను ఒక్కసారిగా అచేతనంగా మార్చాడు. ఆపై తమదే ఆట అన్నట్లుగా ఫ్రాన్స్ దూసుకుపోగా, మెస్సీ సేన నిస్సహాయంగా కనిపించింది... స్కోరు సమం చేయడం సంగతేమో కానీ డిఫెన్స్‌తో తమ గోల్‌పోస్ట్‌ను కాపాడుకోవడమే అర్జెంటీనాకు కనాకష్టంగా మారింది. నిర్ణీత సమయం ముగిసింది... ఇంజ్యూరీ టైమ్ కూడా అయిపోయింది. స్కోర్లు సమంగానే ఉన్నాయి. అప్పుడు అదనపు సమయం తప్పలేదు. మళ్లీ మెస్సీపైనే గెలుపు భారం పడింది... తన కోసం, తన దేశం కోసం అన్నట్లుగా ఒక్కసారిగా శక్తి పుంజుకున్న మెస్సీ మరో గోల్‌తో ముందంజలో నిలిపి విజయధ్వానం చేశాడు... అయితే అది కొద్ది క్షణాలకే పరిమితమైంది... ఎంబాపె మళ్లీ మ్యాజిక్ ప్రదర్శించడంతో స్కోరు మళ్లీ సమమైంది. దాంతో ఫలితం పెనాల్టీ ‘షూటౌట్’కు వెళ్లింది. ‘అర్జెంటీనా జట్టు గెలవాలని ప్రపంచం మొత్తం కోరుకుంటోంది. మా దేశంలో కూడా అలాంటివారు ఉన్నారు’... ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్ కోచ్ డెషాంప్స్ చేసిన వ్యాఖ్య ఇది. సగటు ఫుట్‌బాల్ అభిమాని దృష్టిలో ఇది నిజంగా నిజం... అందుకు ఒకే ఒక్క కారణం లయోనల్ మెస్సీ... ప్రపంచవ్యాప్తంగా అతడిని అభిమానించే వారెందరో అతను వరల్డ్‌కప్‌ను అందుకోవాలని కోరుకున్నారు. వారంతా ఫైనల్ రోజు అర్జెంటీనా అభిమానులుగా మారిపోయారు... అందుకే మెస్సీ కొట్టిన ప్రతీ గోల్ వారిని ఆనందంతో ముంచెత్తితే... ఎంబాపె ఆట చూస్తుంటే ఎక్కడో గుండెల్లో అలజడి... ఎక్కడ అతను మ్యాచ్‌ను లాగేసుకుంటాడేమోనని ఆందోళన... కానీ అందరి కల నెరవేరింది... ఐదో ప్రపంచకప్ ప్రయత్నంలో మెస్సీ తన టీమ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. ఆ ఒక్క లోటును అధిగమించి ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచాడు. సంవత్సరం క్రితం దివికేగిన డీగో మారడోనా పైనుంచి ఆశీర్వదించినట్లుగా 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా చాంపియన్‌గా మారింది. దోహా: గొంజాలో మోంటీల్... కొన్ని క్షణాల ముందు అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలో ఉండి గెలుపు ఖాయమనుకుంటున్న దశలో అప్రయత్నంగానే మోచేతికి బంతికి తగిలించాడు... దాంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ కిక్ దక్కి స్కోరు సమమైంది. సబ్‌స్టిట్యూట్‌గా కొన్ని నిమిషాల క్రితమే మైదానంలోకి దిగి ఒక్క పొరపాటుతో విలన్‌గా మారిపోయాడు... కానీ మరికొన్ని నిమిషాల తర్వాత అతనే హీరోగా నిలిచాడు. షూటౌట్లో అర్జెంటీనా ఓడి ఉంటే తన తప్పిదపు భారాన్ని అతను జీవితకాలం మోయాల్సి వచ్చేదేమో... షూటౌట్లో అర్జెంటీనా 3–2తో ఉండగా మోంటీల్ పెనాల్టీ తీసుకున్నాడు... అతను కొట్టిన కిక్ ఫ్రాన్స్ గోల్ కీపర్ లోరిస్‌ను దాటి నెట్లో పడింది! అంతే... అర్జెంటీనా బృందం విజయ గర్జన చేసింది... కన్నీళ్లతో మోంటీల్ భావోద్వేగభరితమయ్యాడు. ఆదివారం జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా 4–2 (షూటౌట్లో) తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయం, అదనపు సమయం కలిపి ఇరు జట్లు 3–3తో సమంగా నిలవగా, షూటౌట్లో ఫలితం తేలింది. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మెస్సీ (23వ నిమిషం, 108వ నిమిషం), మరియా (36వ నిమిషం) గోల్స్ చేయగా... ఫ్రాన్స్ తరఫున ఎంబాపె ఒక్కడే (80వ నిమిషం, 81వ నిమిషం, 118వ నిమిషం) మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ నమోదు చేశాడు. హోరాహోరీ... విజిల్ మోగిన దగ్గరి నుంచి అర్జెంటీనా ఆధిపత్యమే సాగింది. వరుసగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై జట్టు దాడులు చేస్తూ పోయింది. అదే జోరులో ఫలితం రాబట్టింది. పెనాల్టీ ఏరియాలో ఫ్రాన్స్ వింగర్ ఉస్మాన్ డెంబెలెను దాటి అర్జెంటీనా ఆటగాడు డి మరియా బంతితో దూసుకుపోయాడు. అతడిని నిలువరించే క్రమంలో ఉస్మాన్ వెనకనుంచి మరియాను తోసేశాడు. దాంతో మరో మాట లేకుండా రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ ప్రకటించాడు. మెస్సీ ప్రశాంతంగా ఎడమ కాలితో కుడి వైపు చివరకు కిక్ కొట్టగా, మరోవైపు దూకిన గోల్ కీపర్ హ్యూగో లోరిస్ బంతిని ఆపడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఆ తర్వాత మెస్సీ, అల్వారెజ్ అద్భుత సమన్వయంతో పాస్‌లు ఇచ్చుకుంటూ దూసుకుపోయారు. బంతి అలిస్టర్‌కు చేరగా, అతడి నుంచి పాస్ అందుకున్న మరియా అద్భుత గోల్‌గా మలిచాడు. తొలి అర్ధభాగంలో అసలు ఫ్రాన్స్ ఆటగాళ్లు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. పాస్‌లు సరిగా అందుకోలేకపోగా, కదలికల్లో కూడా వేగం లోపించింది. రెండో అర్ధభాగంలో కూడా అర్జెంటీనా ఆట చూస్తే తామే వెనుకబడి ఉన్నామా అన్నట్లు అనిపించింది. మళ్లీ మళ్లీ అదే దూకుడుతో వారు ప్రత్యర్థిపై చెలరేగారు. అయితే నికోల్స్ పొరపాటుతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ దక్కింది. దీనిని గోల్‌గా మలచిన ఎంబాపె తర్వాతి నిమిషంలో అద్భుత ఆటతో ఫీల్డ్ గోల్ నమోదు చేశాడు. మెస్సీ సేన బేలగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత మాత్రం అర్జెంటీనా కాస్త తేరుకుంది. దాంతో అదనపు సమయం మొత్తం పోటాపోటీగా సాగింది. మెస్సీ, ఎంబాపె ఇద్దరూ తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తూ చెరో గోల్‌తో మళ్లీ మ్యాచ్‌లో జీవం పోశారు. చివరకు పెనాల్టీ షూటౌట్ విశ్వవిజేతను తేల్చింది. –సాక్షి క్రీడా విభాగం -
ఓటమి దిశగా సౌత్‌జోన్
కోయంబత్తూర్: వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్ ఓటమి దిశగా సాగుతోంది. 529 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన సౌత్‌జోన్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. నేడు చివరిరోజు సౌత్‌జోన్ గెలవాలంటే మరో 375 పరుగులు చేయాలి. వెస్ట్‌జోన్ నెగ్గాలంటే మరో నాలుగు వికెట్లు తీయాలి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 376/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్‌జోన్ 4 వికెట్లకు 585 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (265; 30 ఫోర్లు, 4 సిక్స్‌లు) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 56 పరుగులు జోడించి అవుటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (127 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీతో చెలరేగగా... హెట్ పటేల్ (51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. -
Japan Open: పోరాడి ఓడిన ప్రణయ్
జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. టోక్యోలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–15, 20–22తో ఆరో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకదశలో ప్రణయ్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ముఖాముఖిగా ఇప్పటివరకు చౌ తియెన్ చెన్, ప్రణయ్ ఎనిమిదిసార్లు తలపడగా... ఐదుసార్లు చౌ తియెన్ చెన్, మూడుసార్లు ప్రణయ్ గెలిచారు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన ప్రణయ్‌కు 4,125 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 28 వేలు)తోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Indonesia Masters 2022: సింధు నిష్క్రమణ
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. పీవీ సింధు, లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 12–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ సింధు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. రచనోక్ చేతిలో సింధుకిది తొమ్మిదో ఓటమి. 2018 వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో చివరిసారి రచనోక్‌పై నెగ్గిన సింధు ఆ తర్వాత ఈ థాయ్ ప్లేయర్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 62 నిమిషాల్లో 16–21, 21–12, 14–21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సింధు, లక్ష్య సేన్‌లకు 2,160 డాలర్ల (రూ. లక్షా 68 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
2022 BMW Open: క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట ఓటమి
బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ నుంచి రోహన్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంట క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. మ్యూనిక్‌లో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–మిడిల్‌కూప్ ద్వయం 3–6, 4–6తో మటోస్ (బ్రెజిల్)–డేవిడ్ వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 4,950 యూరోల (రూ. 3 లక్షల 98 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
పోరాడి ఓడిన బోపన్న–జేమీ ముర్రే జంట
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–జేమీ ముర్రే (బ్రిటన్) జంట పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–జేమీ ముర్రే ద్వయం 6–3, 6–7 (4/7), 9–11తో టాప్ సీడ్ జో సాలిస్బరీ (బ్రిటన్)–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–జేమీ ముర్రే జంటకు 76,560 యూరోల (రూ. 63 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 360 పాయింట్లు లభించాయి. -
అన్నీ ఎదురు దెబ్బలే: 2021లో టీడీపీకి వరుస పరాజయాలు
-
2021 రివైండ్: టీడీపీకి పరాభవ ‘నామం’
సాక్షి, అమరావతి: సాధారణ ఎన్నికల్లో అత్యంత అవమానకరమైన ఓటమితో కుదేలైన తెలుగుదేశం పార్టీకి 2021 పరాభవ నామ సంవత్సరంగా మిగిలింది. సాధారణ ఎన్నికల్లో అత్యంత అవమానకరమైన ఓటమితో కుదేలైన ఆ పార్టీ ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలతో పాతాళంలో కూరుకుపోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది ఘోరమైన ఛీత్కారాలు ఎదురయ్యాయి. ప్రతిపక్ష పాత్ర పోషించలేని స్థితిలో ఎన్నికల్ని బహిష్కరించడం దగ్గర నుంచి తమకు ఓటు వేయలేదనే అక్కసుతో ప్రజలనే నిందించడం, శాపనార్థాలు పెట్టడం ఈ ఏడాది ఆ పార్టీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఏ దశలోను పోటీపడలేక బురద జల్లడమే పనిగా పెట్టుకున్నా ప్రజల నుంచి ఎటువంటి సానుకూలత టీడీపీకి రాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: వంగవీటి రాధాకు ప్రభుత్వ భద్రత స్థానిక ఎన్నికల ఫలితాలతో కుంగుబాటు ఈ ఏడాది స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడాన్ని బట్టి ప్రజల్లో ఆ పార్టీకి ఉన్న స్థానం ఏమిటో మరోసారి తేటతెల్లమైంది. స్థానిక ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా టీడీపీ చతికిలపడడం చూసి రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. జనవరిలో పార్టీ గుర్తులేకుండా జరిగిన మూడు దశల పంచాయతీ ఎన్నికల్లో తమకు 35 శాతానికి పైగా పంచాయతీలు వచ్చినట్లు చంద్రబాబు అదేపనిగా బుకాయించి ప్రజల తీర్పును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం పంచాయతీలు కూడా దక్కలేదు. కానీ, పార్టీ గుర్తుల్లేకుండా జరిగిన ఎన్నికలు కావడంతో ఆ ఎన్నికల్ని వివాదం చేసి తమ ఓటమిని కప్పిపుచ్చుకోవాలని చూశారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీల్లో టీడీపీ 14 మాత్రమే గెలవడంతో చంద్రబాబు బుకాయింపు గాలి బుడగలా పేలిపోయింది. 30 ఏళ్లు చంద్రబాబుకు అండగా నిలిచిన కుప్పం ప్రజలు తొలిసారి ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో టీడీపీకి శరాఘాతంగా మారింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పాతాళానికి.. మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే ఒకే ఒక మున్సిపాల్టీని ఆ పార్టీ గెలుచుకోగలిగింది. 11 మున్సిపాల్టీల్లో అసలు టీడీపీ అడుగే పెట్టలేకపోయింది. ప్రజల్లో టీడీపీకి ఉన్న ఆదరణను మున్సిపల్ ఎన్నికల ఓటమి స్పష్టంచేసింది. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలోను చిత్తుగా ఓడిపోయింది. ఇక పోటీ ఇవ్వలేక పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు. ఆ తర్వాత బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికలోను అభ్యర్థిని ప్రకటించి తర్వాత తప్పుకున్నారు. మలి విడత జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీచేసినా ఆ పార్టీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ఇందులో ఏకంగా కుప్పం మున్సిపాల్టీనే చంద్రబాబు చేజార్చుకున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలుచుకోలేకపోయింది. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి ఉన్న పట్టు సాధారణ ఎన్నికల కంటే ఇంకా దిగజారినట్లు ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైంది. ఓటములతో నేతల అసహన పర్వం ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ప్రజలపైనే విరుచుకుపడుతూ తమ అసహనాన్ని పదేపదే బహిర్గతం చేసుకున్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో ప్రజలకు సిగ్గులేదని, ఎవరికి ఓటేయాలో కూడా తెలీదంటూ చంద్రబాబు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టారు. రాజకీయంగా కునారిల్లిన దశలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పట్టాభిరామ్ తదితర నేతలు సీఎం వైఎస్ జగన్, మంత్రులను పరుష పదజాలంతో రాయలేని భాషలో దూషించి ప్రజల దృష్టిలో ఇంకా చులకనయ్యారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. సీఎంను బోషడీకే అంటూ టీడీపీ నాయకుడు పట్టాభి దూషించడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించగా.. తదనంతరం ప్రజల్లో టీడీపీపై ఆగ్రహం పెల్లుబికింది. పూర్తిగా ప్రజాదరణ కోల్పోయిన టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై బురద జల్లడమే పనిగా ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా అభూత కల్పనలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకున్నారనే అభిప్రాయం నెలకొంది. అన్ని రకాలుగా కుంగిపోయిన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పరిమితమయ్యారు. చంద్రబాబు పిలుపు ఇచ్చినా ఆందోళనలు, నిరసనల్లో ఆ పార్టీ కేడర్ పాల్గొనే పరిస్థితి లేకుండాపోయింది. రాజకీయ పతనంలో 2021 సంవత్సరం టీడీపీకి కొత్త కోణాన్ని పరిచయం చేసింది. -
టి20 ప్రపంచ కప్ నుంచి షకీబ్ అవుట్
దుబాయ్: హ్యాట్రిక్ పరాజయాలతో ఇప్పటికే టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌కు మరో దెబ్బ. తొడ కండరాల గాయంతో ఆ జట్టు ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ మెగా టోర్నీ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. గత శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. అనంతరం అతడిని 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచిన వైద్యుల బృందం షకీబ్ కోలుకోవడానికి మరికొంత సమయం అవసరమని తెలిపింది. దాంతో బంగ్లాదేశ్ ఆడే తదుపరి మ్యాచ్‌ల్లో అతడు బరిలోకి దిగడం లేదు. -
UEFA EURO 2020: పోర్చు‘గల్లంతు’
సెవిల్లె (స్పెయిన్): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ పోర్చుగల్ జట్టు కథ ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బెల్జియం 1–0 గోల్ తేడాతో క్రిస్టి యానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టును ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. ఆట 42వ నిమిషంలో ఎడెన్ హజార్డ్ గోల్‌తో బెల్జియం ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇటలీతో బెల్జియం ఆడుతుంది. సోమవారం జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 5–3తో క్రొయేషియాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
టీడీపీ మద్దతుదారులకు ఆరు చోట్ల ‘0’
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మరోసారి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. 175 నియోజకవర్గాల్లోని పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ఆరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ మద్దతుదారులు ఖాతా కూడా తెరవలేకపోయారు. పుంగనూరు, మాచర్ల, పులివెందుల, జమ్మలమడుగు, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల్లో విపక్షం మద్దతుదారులు ఒక్కటంటే ఒక్క పంచాయతీలో కూడా గెలవలేదు. మరో 39 నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్ పంచాయతీలకే పరిమితమయ్యారు. అందులో చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరితోపాటు ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం కూడా ఉండడం విశేషం. నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏ జిల్లాలోనూ టీడీపీ మద్దతుదారులు ప్రభావం చూపలేకపోయారు. 13,081 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కేవలం 2,100 పంచాయతీలకే ఆ పార్టీ మద్దతుదారులు పరిమితమయ్యారు. అంటే 16 శాతం సీట్లనే గెలుచుకోగలిగారు. కానీ ఓటమిని ఒప్పుకోకుండా చంద్రబాబు ఎదురుదాడి చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 41 శాతం పంచాయతీల్లో తాము గెలిచినట్లు ప్రకటించిన చంద్రబాబు 4,230 పంచాయతీలు తమ ఖాతాలో పడినట్లు చెప్పారు. ఈ లెక్క ఏమిటో టీడీపీ నాయకులకే అంతుబట్టని విధంగా మారింది. ఆయన చెప్పిన శాతానికి, గెలిచిన పంచాయతీలకు ఏమాత్రం పొంతన లేకపోవడం విశేషం. ఆయన చెప్పినట్లు గెలిచిన పంచాయతీలను బట్టి చూస్తే అది 32 శాతమే. కానీ 41 శాతం ఏమిటనే దానికి సమాధానం లేదు. పోనీ గెలిచిన పంచాయతీలు ఏవో చూపించమన్నా సరైన స్పందన లేదు. చాలా చోట్ల తామే గెలిచినా అధికారులు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచినట్లు ప్రకటించారని, కరెంటు కట్ చేసి దౌర్జన్యం చేశారని ఎదురుదాడికి దిగారు. వాస్తవానికి చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నాయకులు సొంత నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోలేకపోయారు. ‘అనంత’లో నామమాత్రం.. అనంతపురం జిల్లాలో చంద్రబాబు బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ కుదేలైంది. అక్కడ కేవలం 8 పంచాయతీల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. ఈ నియోజకవర్గంలో మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి పట్టున్న కిరికెర, లేపాక్షి, చిలమత్తూరు, కోడూరు పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు నెగ్గారు. హిందూపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి సొంత గ్రామం రొద్దంలో వైఎస్సార్సీపీ గెలుపొందింది. ఆయన నివసిస్తున్న వార్డులో కూడా టీడీపీ ఓడిపోవడం విశేషం. చంద్రగిరిలో రెండు చోట్ల మాత్రమే.. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో 89 పంచాయతీలకు గానూ కేవలం 14 చోట్లే టీడీపీ మద్దతుదారులు గెలిచిన విషయం తెలిసిందే. ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టీడీపీ మద్దతుదారులు రెండు పంచాయతీల్లో గెలుపొందారు. ఈ నియోజకవర్గం పరిధిలోని తిరుపతి రూరల్ మండలంలో ఒక్క పంచాయతీని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గమైన శ్రీకాళహస్తిలో 121 పంచాయతీలకు టీడీపీ ఒకే ఒక పంచాయతీలో గెలిచింది. మదనపల్లి నియోజకవర్గంలో అతి తక్కువగా ఆరు పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు గెలిచారు. కడప, కర్నూలులో విపక్షం కకావికలం.. ► వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఒక్క పంచాయతీని కూడా టీడీపీ దక్కించుకోలేకపోయింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ ఖాతా తెరవలేకపోయింది. ► కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్‌తోనే సరిపెట్టుకుంది. ఆదోని–5, ఎమ్మిగనూరు–6, నంద్యాల–2, శ్రీశైలంలో 7 పంచాయతీలను మాత్రమే ఆ పార్టీ మద్ధతుదారులు గెలుచుకున్నారు. ► నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు ఒక్క పంచాయతీని కూడా గెలుచుకోలేకపోయారు. కావలి నియోజకవర్గంలోనూ నాలుగు పంచాయతీలకే పరిమితమయ్యారు. మాచర్లలో అధికార పార్టీ క్లీన్ స్వీప్.. ► గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ ఖాతా తెరవలేకపోయింది. ఇక్కడ వైఎస్సార్సీపీ మద్దతుదారులు క్లీన్‌స్వీప్ చేశారు. రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజవర్గంలో కేవలం 9 పంచాయతీలను మాత్రమే టీడీపీ గెలుచుకుంది. రాజధాని గ్రామాలకు ఆనుకుని ఉన్న చోట్ల కూడా టీడీపీ ఓడిపోయింది. రాజధాని పక్కనే ఉన్న తాడికొండ, అమరావతి మేజర్ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు గెలుపొందారు. గురజాల నియోజకవర్గంలో మూడు, నర్సరావుపేట–1, తెనాలిలో 7 పంచాయతీలను మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. కృష్ణాలో సైకిల్ బోల్తా ►కృష్ణా జిల్లాల్లో టీడీపీ పరిస్థితి దిగజారింది. మచిలీపట్నం 4, పెనమలూరు 6, మైలవరం 7, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 8 పంచాయతీలు మాత్రమే ఆ పార్టీ మద్దతుదారులు గెలిచారు. ► పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. భీమవరం, నరసాపురం నియోజకవర్గాల్లో మూడు, కొవ్వూరులో 7, తణుకులో 8 పంచాయతీల్లో మాత్రమే గెలిచింది. దెందులూరు నియోజకవర్గం పరిధిలోని ఏలూరు రూరల్ మండలంలో కొల్లేటి లంకల్లో ఒకే ఒక గ్రామాన్ని టీడీపీ గెలుచుకోవడం విశేషం. గతంలో ఈ గ్రామాలన్నీ టీడీపీకి కంచుకోటలుగా ఉండగా ఇప్పుడు అవి కూలిపోయాయి. ‘తూర్పు’న సింగిల్ డిజిట్... ► తూర్పుగోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్ పంచాయతీలనే గెలుచుకుంది. కాకినాడ రూరల్ 1, పిఠాపురం 5, ముమ్మిడివరం 8, పెద్దాపురం 6, రామచంద్రాపురం 2, అనపర్తి 7, తుని 3, మండపేటలో 6 పంచాయతీలను మాత్రమే ఆ పార్టీ మద్దతుదారులు గెలవగలిగారు. భీమిలీలో నిల్... ► విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో తొమ్మిది పంచాయతీలనే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. భీమిలి నియోజకవర్గంలో భీమిలి మండలంలో ఒక్క పంచాయతీని కూడా ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది. నాలుగో విడతలో 117 పంచాయతీలకు ఎన్నికలు జరిగి™తే కేవలం 24 పంచాయతీలకు పరిమితమైంది. నేతల సొంత గ్రామాల్లోనూ టీడీపీ కుదేలు.. ► శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో 5 పంచాయతీలను మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావుకు పట్టున్నట్టు చెప్పుకునే రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ఆ పార్టీ నామమాత్రంగానే పంచాయతీలను గెలుచుకుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ సొంత నియోజకవర్గంలో టీడీపీ చతికిలపడింది. టీడీపీ ముఖ్య నాయకులు గౌతు శ్యాంసుందర్ శివాజీ, కూన రవికుమార్, బెందాళం అశోక్, కలమట వెంకటరమణ, ప్రతిభా భారతి, కొండ్రు మురళీమోహన్ సొంత గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులు ఓడిపోయారు. ► విజయనగరం జిల్లాలోని పార్వతీపురం నియోజకవర్గంలో 7 పంచాయతీల్లోనే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. నాలుగో విడతలో ఇక్కడ 239 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 50 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలవగలిగారు. 40 ఏళ్ల పాటు ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్న గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి విముక్తి లభించింది. ఎన్నో ఏళ్లుగా టీడీపీ చేతుల్లో ఉన్న ఆ పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతుదారు విజయఢంకా మోగించారు. గ్రామస్తులంతా సోమవారం ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. -
నాదల్ కల చెదిరె..
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బుధవారం సంచలన ప్రదర్శనలు నమోదయ్యాయి. పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఏకై క ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాలనుకున్న స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ రాఫెల్ నాదల్ కల చెదిరింది. మహిళల విభాగంలోనూ టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)కి చుక్కెదురైంది. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఓడిపోయి ఇంటి దారి పట్టారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 13వ సారి క్వార్టర్స్ చేరిన నాదల్ గెలుపు అంచుల నుంచి ఓటమిని ఆహ్వానించాడు. 4 గంటల 5 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–2, 6–7 (4/7), 4–6, 5–7తో ఐదో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీక్) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు సెట్లను నెగ్గి, నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్‌లో అనవసర తప్పిదాలతో నాదల్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ టైబ్రేక్ 3/3తో సమమైన దశలో 3 అనవసర తప్పిదాలు చేసిన నాదల్ 4/7తో సెట్‌ను సిట్సిపాస్‌కు కోల్పోయాడు. మరోవైపు అనూహ్యంగా పుంజుకున్న సిట్సిపాస్ జాగ్రత్తగా ఆడుతూ నాలుగో సెట్లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 5–4తో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చాడు. అదే జోరులో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 6–4తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఐదో సెట్లో ఓ దశలో ఇద్దరూ 5–5తో సమంగా నిలిచారు. అయితే పదకొండో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిట్సిపాస్... పన్నెండో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 7–5తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. తద్వారా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నాదల్‌తో మ్యాచ్‌లో తొలి రెండు సెట్లలో వెనుకబడి తర్వాత విజయం సాధించిన రెండో ప్లేయర్‌గా 22 ఏళ్ల సిట్సిపాస్ ఘనత వహించాడు. 2015 యూఎస్ ఓపెన్‌లో ఫాబియో ఫాగ్నిని ఇదే తరహాలో నాదల్‌పై గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో సిట్సిపాస్ 18, నాదల్ 15 ఏస్‌లు సంధించారు. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో 2019 యూఎస్ ఓపెన్ రన్నరప్, నాలుగో సీడ్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 7–5, 6–3, 6–2తో ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)పై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగే సెమీస్‌లో సిట్సిపాస్‌తో మెద్వెదెవ్ తలపడతాడు. బార్టీకి షాక్ మహిళల విభాగంలో సొంత మైదానంలో జరిగిన పోరులో టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ యాష్లే బార్టీకి 25వ సీడ్ కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) షాకిచ్చింది. గంటా 7 నిమిషాల పాటు సాగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో బార్టీ 1–6, 6–3, 6–2తో ముచోవా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 3 ఏస్‌లు సంధించిన బార్టీ 3 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరోవైపు 2 ఏస్‌లే సంధించిన ముచోవా... ప్రత్యర్థి సర్వీస్‌ను 4సార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను 3 సార్లు కోల్పోయింది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) 4–6, 6–2, 6–1తో జెస్సికా పెగులా (అమెరికా)పై నెగ్గి సెమీస్‌లో అడుగుపెట్టింది. నేడు జరిగే మహిళల తొలి సెమీస్‌లో సెరెనా (అమెరికా)తో నయోమి ఒసాకా (జపాన్), రెండో సెమీస్‌లో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) తలపడతారు. -
పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్
చండీగఢ్: పంజాబ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను ఇప్పటివరకు 6 కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. మరో కార్పొరేషన్‌లోనూ పాగా వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చేదు అనుభవమే ఎదురయ్యింది. అధికార పక్షానికి గట్టి పోటీ కూడా ఇవ్వలేక బీజేపీ చతికిలపడింది. శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. కొన్నిచోట్ల తమ ఉనికిని చాటుకున్నాయి. 2020లో జరగాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న నిర్వహించారు. బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. భటిండా, హోషియార్పూర్, కపుర్తలా, అబోహర్, బటాలా, పటాన్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్ వశమయ్యాయి. ఇక మరో ఆరు వార్డులు గెలుచుకుంటే చాలు మోగా కార్పొరేషన్‌లోనూ కాంగ్రెస్ విజయం ఖాయం కానుంది. మొహాలీ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు గురువారం జరుగనుంది. ఇక్కడ రెండు బూత్‌ల్లో రీపోలింగ్ నిర్వహించారు. 109 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీల్లోనూ మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఈ విజయం ప్రతి పంజాబీ విజయం: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు పెద్ద ఉత్తున పోరాటం సాగిస్తున్నారు. వారికి కాంగ్రెస్ అండగా నిలుస్తోంది. తాజా ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీలో ఉత్సాహం ద్విగుణీకృతమయ్యింది. ఈ విజయం ప్రతి పంజాబీ విజయమని అభివర్ణిస్తూ సీఎం అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలు కేవలం అభివృద్ధిని కోరుకుంటున్నారని.. విద్వేష, విభజన, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలను కాదని తేల్చిచెప్పారు. బీజేపీ, ఆప్, శిరోమణి అకాలీ దళ్ పార్టీల ప్రజా వ్యతిరేక చర్యలను జనం ఛీకొట్టారని అన్నారు. ఆయా పార్టీలు పంజాబ్‌ను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నాయని ధ్వజమెత్తారు. ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జక్కర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పంజాబ్‌పై వివక్ష చూపుతోందని ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ నాయకత్వానికి ఆయన మద్దతు పలికారు. మొత్తం 1,817 వార్డులకు గాను ఇప్పటివరకు కాంగ్రెస్ 1,102, ఎస్ఏడీ 252, ఆప్ 51, బీజేపీ 29, బీఎస్పీ 5 వార్డులు గెలుచుకున్నాయి. 374 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్: బియాంక, క్విటోవా అవుట్
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ విభాగంలో 2019 యూఎస్ ఓపెన్ చాంపియన్, ఎనిమిదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా)... 2011, 2014 వింబుల్డన్ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) కూడా రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను 2019 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడించిన బియాంక మోకాలి గాయం కారణంగా గతేడాది మొత్తం ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది నేరుగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన బియాంక రెండో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయింది. 35 ఏళ్ల సె సువె (చైనీస్ తైపీ) 6–3, 6–2తో తొమ్మిదో ర్యాంకర్ బియాంక ఆండ్రెస్కూను ఓడించి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. టాప్–10లోని క్రీడాకారిణులను ఓడించడం 71వ ర్యాంకర్ సె సువెకిది ఎనిమిదోసారి కావడం విశేషం. 83 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో బియాంక ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 25 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్‌లో సొరానా కిర్‌స్టియా (రొమేనియా) 6–4, 1–6, 6–1తో క్విటోవాపై సంచలన విజయం సాధించింది. రెండు గంటల మూడు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సొరానా ఆరుసార్లు క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెరెనా జోరు... కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన అమెరికా దిగ్గజం సెరెనా మరో అడుగు ముందుకేసింది. నినా స్లొజనోవిచ్ (సెర్బియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ సెరెనా 6–3, 6–0తో గెలిచి మూడో రౌండ్‌కు చేరింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–2, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 4–6, 6–4, 7–5తో తమియనోవిచ్ (ఆస్ట్రేలియా)పై, ఏడో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/5), 6–3తో కసత్కినా (రష్యా)పై, 15వ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–2, 6–4తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై గెలిచి మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 1–6, 0–6తో క్వాలిఫయర్ సారా ఎరాని (ఇటలీ) చేతిలో, 17వ సీడ్ ఎలీనా రైబకినా (కజకిస్తాన్) 4–6, 4–6తో ఫియోనా ఫెరో (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. అయ్యో వావ్రింకా... పురుషుల సింగిల్స్ విభాగంలో 17వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) చేజేతులా ఓడిపోయాడు. ప్రపంచ 55వ ర్యాంకర్ మార్టన్ ఫుచోవిచ్ (హంగేరి)తో 3 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా 5–7, 1–6, 6–4, 6–2, 6–7 (9/11)తో పరాజయం పాలయ్యాడు. నిర్ణాయక ఐదో సెట్ టైబ్రేక్‌లో వావ్రింకా 6–1తో ఆధిక్యంలో నిలిచి విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే ఫుచోవిచ్ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి స్కోరును 6–6తో సమం చేశాడు. చివరకు ఫుచోవిచ్ 11–9తో టైబ్రేక్‌లో గెలిచి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–7 (3/7), 7–6 (7/2), 6–3తో టియాఫో (అమెరికా)పై, మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–0, 6–2తో కోఫెర్ (జర్మనీ)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 6–4, 6–3తో క్రెసీ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 6–2, 6–0, 6–3తో ములెర్ (ఫ్రాన్స్)పై గెలిచారు. 11వ సీడ్ షపోవలోవ్ (కెనడా), 14వ సీడ్ రావ్‌నిచ్ (కెనడా), 15వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్), 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–బెన్ మెక్లాలన్ (జపాన్) జంట 4–6, 6–7 (0/7)తో జీ సుంగ్ నామ్–మిన్ క్యు సాంగ్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
ఈ బెంగ తీరనిది..!
‘విలియమ్సన్ క్యాచ్‌ను పడిక్కల్ పట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో’... ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓడిన తర్వాత రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య ఇది! ఇదొక్కటి చాలు ఐపీఎల్లో అతని నాయకత్వ వైఫల్యానికి ఉదాహరణగా చూపించేందుకు. బ్యాటింగ్‌లో 131 పరుగులే చేయగలిగిన తమ వైఫల్యాన్ని చెప్పుకోకుండా 17 బంతుల్లో రైజర్స్ 27 పరుగులు చేయాల్సిన స్థితిలో ఎంతో కష్టసాధ్యమైన క్యాచ్‌ను తీవ్రంగా ప్రయతి్నంచిన తర్వాత కూడా ఒక యువ ఆటగాడు అందుకోలేకపోతే పరాజయాల్లో దానిని ఒక కారణంగా చూపించడం కోహ్లి పరిణతిని ప్రశ్నిస్తోంది. గత మూడు సీజన్లలో వరుసగా ఎనిమిది, ఆరు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన బెంగళూరు జట్టు ఈసారి కొంత మెరుగ్గా నాలుగో స్థానంతో ముగించింది. అయితే తొలి సీజన్ నుంచి అభిమానులు ఆశిస్తున్న టైటిల్ కోరిక మాత్రం తీరలేదు. ఆటగాడిగా, భారత కెప్టెన్‌గా ఘనమైన రికార్డు ఉన్న కోహ్లి ఐపీఎల్ నాయకత్వంపై కూడా ఈ ప్రదర్శన సందేహాలు రేకెత్తిస్తోంది. –సాక్షి క్రీడా విభాగం ఈసారి ఐపీఎల్లో తాము ఆడిన చివరి నాలుగు లీగ్ మ్యాచ్‌లు, ఎలిమినేటర్ కలిపి వరుసగా ఐదు మ్యాచ్‌లలో బెంగళూరు ఓటమి పాలైంది. ఈ ఐదుసార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు ఒక్కసారిగా మాత్రమే 160 పరుగులు దాటగలిగింది. ఇలాంటి ప్రదర్శనతో ఐపీఎల్లో గెలుపును కోరుకోవడం అత్యాశే అవుతుంది. 2019 ఐపీఎల్లో ఆర్సీబీ టోర్నీ తొలి ఆరు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. తర్వాత ఐదు మ్యాచ్‌లు గెలిచినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయి ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే 2008 నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే ఈసారి కూడా బెంగళూరు అభిమానులు మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడైనా కోహ్లి ట్రోఫీని అందిస్తాడని నమ్మారు. అందుకు తగినట్లుగా తొలి 10 మ్యాచ్‌లలో 7 గెలవడంతో ఆర్సీబీ సరైన దిశలోనే వెళుతున్నట్లు అనిపించింది. కానీ కథ మళ్లీ మొదటికి వచి్చంది. ఆ తర్వాత ఒక్క గెలుపూ దక్కక... రన్‌రేట్ అదృష్టం కలిసొచ్చి నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరినా, ఎలిమినేటర్‌లోనే జట్టు ఆట ముగిసింది. ఏబీ మెరుపు ప్రదర్శన... బెంగళూరు తరఫున ఏబీ డివిలియర్స్ ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. ఏకంగా 158.74 స్ట్రయిక్‌రేట్‌తో అతను 454 పరుగులు సాధించాడు. ఏబీ అర్ధసెంచరీ చేసిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు సార్లు జట్టు గెలిచింది. డివిలియర్స్‌కు ఇతరుల నుంచి సహకారం లభించలేదు. తొలి ఐపీఎల్ ఆడిన యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జట్టు తరఫున అత్యధికంగా 473 పరుగులు చేయడం మరో చెప్పుకోదగ్గ అంశం. బౌలింగ్‌లో 21 వికెట్లతో చహల్ సత్తా చాటగా, ఆరుకంటే తక్కువ ఎకానమీ నమోదు చేసిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నాడు. ఆ్రస్టేలియా కెపె్టన్ ఫించ్ వైఫల్యం (268 పరుగులు–1 అర్ధ సెంచరీ) జట్టును బాగా దెబ్బ తీసింది. గాయంతో మోరిస్ 9 మ్యాచ్‌లకే పరిమితం కావడం కీలక సమయంలో సమస్యగా మారింది. సీనియర్ పేసర్లు స్టెయిన్ (11.40 ఎకానమీ), ఉమేశ్ యాదవ్ (11.85)లు ఘోరంగా విఫలమవ్వగా... కోల్‌కతాతో (3/8) ప్రదర్శన మినహా సిరాజ్ భారీగా పరుగులిచ్చాడు. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడే ఒక్క బ్యాట్స్‌మన్ కూడా లేకపోవడం జట్టులో పెద్ద లోటుగా కనిపించింది. కోహ్లి అంతంతే... అన్నింటికి మించి కోహ్లి వ్యక్తిగత వైఫల్యం కూడా జట్టును ఇబ్బంది పెట్టింది. కెపె్టన్ మొత్తంగా 466 పరుగులు చేసినా...స్ట్రయిక్‌రేట్ 121.35కే పరిమితమైంది. 2012 సీజన్లో వెటోరి మధ్యలో తప్పుకోవడంతో కెపె్టన్‌గా కోహ్లి బాధ్యతలు స్వీకరించాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు అతనే సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఎనిమిది పూర్తి సీజన్లలో కూడా కోహ్లి తన జట్టుకు టైటిల్ అందించలేకపోవడం అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. 2016లో రన్నరప్‌గా నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన. 125 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తే గెలిచిన మ్యాచ్లకంటే (55) ఓడిన మ్యాచ్‌ల సంఖ్య (63) ఎక్కువ. ఈ నేపథ్యంలో కోహ్లి ఇంకా కెప్టెన్‌గా కొనసాగుతాడా, ఫ్రాంచైజీ యాజమాన్యం మార్పు కోరుకుంటుందా అనేది చూడాలి. బ్యాటింగ్‌పరంగా తాను నెలకొలి్పన ప్రమాణాలను కోహ్లి అందుకోలేకపోయాడు. అతనివైఫల్యమే జట్టును ముందుకు తీసుకుపోలేకపోయింది. ఇంత కాలం బౌలింగ్ బలహీనంగా ఉండి ఓడిన బెంగళూరు ఇప్పుడు బ్యాటింగ్ బలహీనతతో ఓడింది. –సునీల్ గావస్కర్ 100 శాతం కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనేదే నా అభిప్రాయం. ఈ పరాజయాలకు నేనే కారణమని అతనే చెప్పుకోవాలి. ఎనిమిదేళ్లు అంటే చాలా ఎక్కువ సమయం. ఇన్నేళ్లు ఒక్క ట్రోఫీ గెలవకుండా కూడా కెపె్టన్‌గా ఎవరైనా కొనసాగగలరా. కెప్టెన్సీ విషయంలో ధోని (3 టైటిల్స్), రోహిత్ (4 టైటిల్స్)లతో కోహ్లికి అసలు పోలికే లేదు. సరిగ్గా చెప్పాలంటే బెంగళూరుకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అర్హతే లేదు. ఒక్క డివిలియర్స్ ప్రదర్శనతోనే వారు ముందుకొచ్చారు. – గంభీర్ -
సీడెడ్ ఆటగాళ్లకు షాక్
గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించాలంటే అత్యంత నిలకడగా ఆడటమే ప్రధానం. ఆ నిలకడ లేకపోతే ఆశించిన ఫలితాలు రాలేవు. భవిష్యత్‌లో ‘బిగ్ త్రీ’ ఫెడరర్, నాదల్, జొకోవిచ్ స్థానాలను భర్తీచేయగల సామర్థ్యమున్న ఆటగాళ్లుగా పేరొందిన డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్), కరెన్ ఖచనోవ్ (రష్యా) ఊహించని పరాజయాలు ఎదుర్కొన్నారు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరెట్స్ రేసులో ఉన్న ఈ ముగ్గురూ తొలి రౌండ్ అడ్డంకినే అధిగమించలేక ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్ విభాగంలోనూ సంచలన ఫలితాలు నమోదయ్యాయి. 2017 చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) కూడా తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో సంచలనాల మోత మోగింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఒకేరోజు టాప్–10లోని నలుగురు ఆటగాళ్లు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఎనిమిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), తొమ్మిదో సీడ్ కరెన్ ఖచనోవ్ (రష్యా), పదో సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్) తొలి రౌండ్లోనే చేతులెత్తేశారు. మహిళల సింగిల్స్‌లో 2017 చాంపియన్, 11వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), 2004 చాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా), మాజీ నంబర్‌వన్ ప్లేయర్లు అజరెంకా (బెలారస్), 24వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) కూడా తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. వరుసగా రెండేళ్లు ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన థీమ్ 2 గంటల 23 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో 4–6, 6–3, 3–6, 2–6తో ఫాబియానో (ఇటలీ) చేతిలో ఓడిపోగా... అన్‌సీడెడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 3 గంటల 54 నిమిషాల పోరులో 6–4, 6–7 (5/7), 7–6 (7/5), 7–5తో ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ సిట్సిపాస్‌ను బోల్తా కొట్టించాడు. 216వ ర్యాంకర్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా) 3 గంటల 51 నిమిషాల్లో 4–6, 7–5, 7–5, 4–6, 6–3తో ఖచనోవ్పై... కుకుష్కిన్ (కజకిస్తాన్) 3–6, 6–1, 6–3, 3–6, 6–3తో అగుట్పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. ఇతర మ్యాచ్‌ల్లో షపోవలోవ్ (కెనడా) 6–1, 6–1, 6–4తో 18వ సీడ్ అగుల్ (కెనడా)పై, అందుజార్ (స్పెయిన్) 3–6, 7–6 (7/1), 7–5, 5–7, 6–2తో 30వ సీడ్ ఎడ్మండ్ (బ్రిటన్)పై, సాండ్‌గ్రెన్ (అమెరికా) 1–6, 6–7 (2/7), 6–4, 7–6 (7/5), 7–5తో మాజీ ఐదో ర్యాంకర్ సోంగా (ఫ్రాన్స్)లపై గెలిచారు. నాదల్ శుభారంభం నాలుగో టైటిల్‌పై గురి పెట్టిన రెండో సీడ్ రాఫెల్ నాదల్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ఈ స్పెయిన్ స్టార్ 6–3, 6–2, 6–2తో మిల్మన్ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–1, 6–3, 3–6, 4–6, 6–2తో ఆల్బోట్ (మాల్డోవా)పై అతికష్టమ్మీద గెలిచాడు. 14వ సీడ్ ఇస్నెర్ (అమెరికా) 6–3, 6–4, 6–4తో లోపెజ్ (స్పెయిన్)పై, 28వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 6–3, 7–6 (7/1), 6–4తో జాన్సన్ (అమెరికా)పై నెగ్గారు. మూడో రౌండ్లో ప్లిస్కోవా మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ప్లిస్కోవా 6–1, 6–4తో మరియం బోల్క్వాద్జె (జార్జియా)ను ఓడించింది. మరోవైపు నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్) తీవ్రంగా శ్రమించి తొలి రౌండ్‌ను దాటారు. హలెప్ 6–3, 3–6, 6–2తో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న అమెరికా అమ్మాయి నికోల్ గిబ్స్‌పై గెలుపొందగా... వొజ్నియాకి 1–6, 7–5, 6–3తో యాఫన్ వాంగ్ (చైనా)ను ఓడించింది. క్వాలిఫయర్ కలిన్స్కాయ (రష్యా) 6–3, 6–4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై, తొమ్మిదో సీడ్ సబలెంకా (బెలారస్) 3–6, 6–3, 6–4తో అజరెంకాపై, రిస్కీ (అమెరికా) 2–6, 6–1, 6–3తో ముగురుజాపై, క్రిస్టీ ఆన్ (అమెరికా) 7–5, 6–2తో కుజ్నెత్సోవాపై సంచలన విజయాలు సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. అమెరికా టీనేజ్ సంచలనం, 15 ఏళ్ల కోరి గౌఫ్ 3–6, 6–2, 6–4తో పొటపోవా (రష్యా)ను ఓడించింది. -
టైటాన్స్ తెలుగు నేలపై చేతులెత్తేసింది..!
సాక్షి, హైదరాబాద్: తెలుగు టైటాన్స్ తెలుగు నేలపై చేతులెత్తేసింది. సొంతప్రేక్షకులు మద్దతిచ్చినా... అసలు బోణీనే కొట్టలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యింది. శుక్రవారం జరిగిన హైదరాబాద్ అంచె ఆఖరి పోరులో టైటాన్స్ 22–34 స్కోరుతో పట్నా పైరేట్స్ చేతిలో పరాజయం చవిచూసింది. కోటి ఆశల సిద్ధార్థ్ దేశాయ్ మళ్లీ నిరాశపరిచాడు. స్టార్ రైడర్‌గా బరిలోకి దిగిన దేశాయ్ 12 సార్లు రైడింగ్‌కు వెళ్లి కేవలం 5 పాయింట్లే తెచ్చాడు. ఒక టాకిల్ పాయింట్ సాధించాడు. డిఫెండర్లు అబొజర్ మిఘాని (2), విశాల్ భరద్వాజ్ (2)లు ప్రత్యర్థి రైడర్లను టాకిల్ చేయలేకపోయారు. దీంతో తెలుగు జట్టు భారీ తేడాతో ఓడిపోయింది. మరోవైపు పట్నా జట్టులో స్టార్ ఆటగాళ్లయిన ప్రదీప్ నర్వాల్, జైదీప్‌లు ఆరంభం నుంచే పట్టుబిగించారు. రైడింగ్‌లో నర్వాల్ 7 పాయింట్లు సాధించగా, డిఫెం డర్ జైదీప్ (6) టైటాన్స్ రైడర్లను చక్కగా ఒడిసిపట్టాడు. మిగతా ఆటగాళ్లలో జంగ్ కున్ లీ (4), నీరజ్ కుమార్ (3) ఆకట్టుకున్నారు. మొహమ్మద్ ఎస్మెల్, హాది ఒస్తరక్ చెరో 2 పాయింట్లు చేశారు. అంతకుముందు మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 44–19 స్కోరుతో యూపీ యోధపై ఘనవిజయం సాధించింది. గుజరాత్ తరఫున రైడింగ్‌లో రోహిత్ గులియా (10), డిఫెన్స్‌లో పర్వేశ్ బైస్వాల్ (6) రాణించారు. యూపీ జట్టులో రైడర్ శ్రీకాంత్ జాదవ్ (5) ఒక్కడే మెరుగనిపించాడు. నితీశ్ కుమార్, మోను గోయత్, ఆజాద్ రెండేసి పాయింట్లు చేశారు. అతిథిగా కోహ్లి నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ పోటీలు ముంబైలో జరుగుతాయి. శనివారం ఇక్కడ జరిగే ఆరంభ వేడుకకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అతిథిగా హాజరు కానున్నాడు. నేటి మ్యాచ్‌లు యు ముంబా X పుణేరి పల్టన్ రా.గం. 7.30 నుంచి జైపూర్ X బెంగాల్ వారియర్స్ రా.గం. 8.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్–2లో ప్రత్యక్షప్రసారం -
వీగిపోయిన అమెరికా వలస బిల్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు గురువారం ప్రతినిధుల సభలో వీగిపోయింది. దేశాల వారీ గ్రీన్‌కార్డు కోటాను రద్దు చేయడంతో పాటు భారత్ వంటి వర్ధమాన దేశాల పౌరులు చట్టబద్ధంగా అమెరికాకు వలస వెళ్లేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపర్చిన సంగతి తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ సభ్యుడు బాబ్ గుడ్‌లాటె ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 121 ఓట్లు, వ్యతిరేకంగా 301 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేయాలని ఓటింగ్‌కు ముందు ట్రంప్ ఇరు పార్టీల సభ్యులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. రిపబ్లికన్లు ఏకపక్షంగా ప్రవేశపెట్టిన మరో బిల్లు ఓటమిపాలైందని డెమొక్రటిక్ పార్టీ విప్ హోయర్ వ్యాఖ్యానించారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమయ్యేలా బిల్లులో మార్పులు చేయడమే మిగిలిన ఏకైక మార్గమని మరో సభ్యుడు టాడ్ షూల్టె అన్నారు. చట్టబద్ధంగా వలసొచ్చే వారికి తాజా బిల్లు ప్రతికూలంగా మారిందని, వలస కుటుంబాలు, వారి పిల్లల నిర్బంధాన్ని సమర్థించేలా ఉందన్నారు. -
టీమిండియాను ఓడిస్తే.. న్యూడ్ డాన్స్ చేస్తా..
ఇస్లామాబాద్: టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే న్యూడ్ షో అంటూ అప్పట్లో సంచలనం సృష్టించిన బాలీవుడ్ భామ పూనం పాండే బాటలో తాజాగా మరో భామ వెలుగులోకి వచ్చింది. షాహిద్ ఆఫ్రిది సారధ్యంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టు...టీమిండియాను మట్టి కరిపిస్తే స్ట్రిప్ డ్యాన్స్ (ఒంటిపై ఉన్న బట్టలు ఒక్కోటి విప్పుతూ చేసే డ్యాన్స్) చేస్తానంటూ పాకిస్తానీ మోడల్ కాందీల్ బాలోచ్ సోషల్ మీడియాలో సంచలన ప్రకటన చేసింది. దీంతోపాటుగా ఆ డ్యాన్స్ ను పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి అంకితం అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న భారత్ - పాక్ మ్యాచ్ లో టీమిండియాపై పాక్ గెలిస్తే , అందరి ముందు తాను 'స్ట్రిప్ డాన్స్' చేస్తానంటూ తన ఫేస్ బుక్ ఖాతా లో వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేసింది. అంతేకాదు, ఇదంతా పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి అంకితమిస్తానని, ఒకే ఒక్కసారి ఇండియాను ఓడించమంటూ షాహిద్ అఫ్రిదిని వేడుకుంది ఈ బ్యూటీ. దీంతో ఇప్పుడు అమ్మడి ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను దాదాపు నాలుగున్నర లక్షలమంది వీక్షించారు. -
నాకౌట్ దశకు చేరిన బెల్జియం
-
ఓడిపోతా.. గిన్నిస్ బుక్ ఎక్కేస్తా!!
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటే అందరికీ ఇష్టమే. అయితే దాన్ని సాధించడానికి ఒక్కొక్కళ్లు ఒక్కో మార్గం ఎంచుకుంటారు. ఎన్నికలు కూడా గిన్నిస్ రికార్డ్స్‌కు దగ్గర దారి అనే విషయం మీకు తెలుసా? నరేంద్రనాథ్ దూబే అనే ఆయన ఈ విషయాన్ని సరిగ్గా తెలుసుకున్నాడు. ఎన్నికల్లో అత్యంత ఎక్కువ సార్లు ఓడిపోయిన వ్యక్తిగా తాను గిన్నిస్ రికార్డులలోకి ఎక్కాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకీ ఆయనకు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడో.. 1984లో. వచ్చిందే తడవుగా అమలుచేయడం మొదలుపెట్టాడు. మునిసిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు ఏ ఒక్క ఎన్నికనూ వదలకుండా ప్రతిదాంట్లో పోటీ చేయడం.. వరుసపెట్టి ఓడిపోవడం ఇదే ఆయనకు బాగా అలవాటైపోయిన విషయం. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పొరపాటునైనా గెలవని నరేంద్రనాథ్, ఈసారి కూడా అదే మాటకు కట్టుబడి ఉంటానని ఘంటాపథంగా చెబుతున్నాడు. ఈయన మొట్టమొదటిసారిగా 1984 ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చెరాల్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశాడు. ఆ తర్వాత మునిసిపాలిటీ స్థాయి నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు పలు ఎన్నికల్లో పోటీచేసి, అప్రతిహతంగా తన పరాజయ పరంపరను ఏమాత్రం వదలకుండా కొనసాగించారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి జనశక్తి ఏకతా పార్టీ అభ్యర్థిగా దూబే బరిలోకి దిగారు. గిన్నిస్ రికార్డు సాధించడమే తన ఏకైక లక్ష్యమని, ఈసారి కూడా ఎప్పటి మాదిరిగానే ఓడి తీరుతానని ఈ ఓటు వీరుడు ధీమాగా చెబుతున్నారు. ఇప్పటివరకు అత్యంత ఎక్కువ సార్లు ఎన్నికల్లో పోటీచేసి, ఓడిపోయిన రికార్డు మాత్రం కెనడాకు చెందిన జాన్ టర్మెల్ అనే పెద్దమనిషి పేరుమీద ఉంది. 63 ఏళ్ల ఈ పెద్దమనిషి ఇంతవరకు 80 ఎన్నికల్లో పోటీచేసి, 79 సార్లు అప్రతిహతంగా ఓడిపోయాడు. ఒక్కసారి మాత్రం పొరపాటున ఎలాగోలా గెలిచేశారు. అయినా కూడా ఎక్కువసార్లు పోటీచేసి, ఓడిపోయిన గిన్నిస్ రికార్డు ఈయన పేరుమీదే ఉంది. 28 ఏళ్ల వయసులో తొలిసారి ఒటావా వెస్ట్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు కేవలం 193 ఓట్లు మాత్రమే లభించాయి. మొన్న కూడా 2014 ఫిబ్రవరి నెలలో జరిగిన ప్రొవిన్షియల్ ఉప ఎన్నికల్లో పాపర్ పార్టీ తరఫున పోటీచేసి 49 ఓట్లు సాధించి ఓడిపోయాడు.