పట్నా: దేశంలోని నియంతృత్వ శక్తులను ఓడిద్దామని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పరోక్షంగా విమర్శించారు. పట్నాలో శుక్రవారం విపక్ష పార్టీల భేటీపై శనివారం బిహార్ డెప్యూటీ సీఎం అయిన తేజస్వీ స్పందించారు. ‘ కన్యాకుమారి నుంచి కశీ్మర్‌దాకా నేతలంతా నియంతృత్వ శక్తులను ఓడిద్దామని విపక్షాలభేటీలో ప్రతినబూనారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలు మోదీ గురించో మరే ఇతర వ్యక్తి గురించో కాదు. ప్రజా సంక్షేమం గురించి. విపక్షాల ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై వచ్చేనెలలో సిమ్లాలో జరిగే సమావేశంలో చర్చిస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ తొలి అడుగు పడింది. గతంలో చరిత్రాత్మక చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం, జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమాలు బిహార్ నుంచే మొదలయ్యాయి ’ అని అన్నారు. ‘ సమావేశంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు.
ప్రతీ అంశాన్ని సామరస్యపూర్వక పరిష్కారం కోసమే స్వీకరించి చర్చించాం’ అని చెప్పారు. ఢిల్లీలో పరిపాలన సేవలపై కేంద్రం తెచి్చన ఆర్డినెన్స్‌లో కాంగ్రెస్ వైఖరి వెల్లడించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ నిరాకరిస్తుండటంతో శుక్రవారం భేటీ తర్వాత సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొనకుండానే కేజ్రీవాల్ ఢిల్లీకి వెనుతిరిగారు. ఈ విషయంపైనే తేజస్వీపైవిధంగా స్పందించారు. విపక్షాల భేటీని బీజేపీ అగ్రనేత అమిత్ షా ఫొటో సెషన్‌గా పేర్కొంటూ విమర్శించడంపై తేజస్వీ స్పందించారు. ‘ ఫొటో సెషన్ అంటే ఏమిటో వారికే బాగా తెలుసునన్నారు.
Comments
Please login to add a commentAdd a comment