Opposition parties Leaders
-
‘ఇండియా’కు మద్దతు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమికి 18 చిన్న పార్టీలు, 50కి పైగా పౌర సంఘాలు మద్దతు ప్రకటించాయి. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆ కూటమిలోని పారీ్టల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించాయి. ‘ఇండియా గెలుస్తుంది: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సామాజిక న్యాయం కోసం జాతీయ సదస్సు‘ పేరుతో వాటి నేతలు శుక్రవారం ఇక్కడ భేటీ అయ్యారు. ముఖ్యంగా విపక్ష అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోతున్న 100 నుంచి 150 లోక్‌సభ స్థానాల్లో ఈసారి వారికి దన్నుగా నిలుస్తామని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 20కి పైగా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు సదస్సుకు హాజరైనట్టు చెప్పారు. -
నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం..
న్యూఢిల్లీ: అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈరోజు తొలిసారి భేటీ కానుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా బీజేపీ పార్టీకి వత్యతిరేకంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ఒక్కటే ఎజెండా.. ముంబై వేదికగా ఇండియా కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో సమావేశం కానుంది. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజీపీకి వ్యతిరేకంగా ప్రతి స్థానంలోనూ ప్రతిపక్ష కూటమిలోని పార్టీలకతీతంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. ఇటువంటి కార్యాచరణను అవలంబిస్తున్నప్పుడు పార్టీలో ఈగోలను పక్కన పెట్టి పనిచేయాల్సిన అవసరముందని ఇదివరకే ప్రతిపాదించింది కూటమి. ఇదే సమావేశాల్లో ఎన్నికల వ్యూహరచనకు సంబంధించిన అంశంపై కూడా చర్చలు నిర్వహించనున్నారు. అక్కడే అసలు సమస్య.. అసలే ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వీలైనంత తొందరగా ఈ జాబితాను సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇప్పటీకే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థుల కేటాయింపు పూర్తయినట్లేనని ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ వినతి ఇతర రాష్ట్రాల్లోని అభ్యర్థుల కేటాయింపే జటిలం కనుందని విపక్ష కూటమి వర్గాలు చెబుతున్నాయి. సమావేశాలకు ముందు ప్యానెల్ సభ్యుడైన రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ఆచరించాల్సిన విధానాలు, సమైక్య ర్యాలీలను నిర్వహించేందుకు ప్రణాళికలు, డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాల గురించి ఎన్నికలకు సంబంధించిన ఇతర కార్యాచరణ గురించి చర్చిస్తారని తెలిపారు. కూటమి విజయవంతం కావాలంటే అన్ని పార్టీలు మహత్వాకాంక్ష, మతభేదం,మనోభేదం మూడు అంశాలను పక్కన పెట్టాలని అన్నారు. కమిటీలో ఎవరెవరంటే.. ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన పద్నాలుగు మంది నేతలతో ఏర్పాటైన సమన్వయ కమిటీలో కె సి వేణుగోపాల్ (కాంగ్రెస్), టి ఆర్ బాలు (డిఎంకె), హేమంత్ సోరెన్ (జెఎంఎం), సంజయ్ రౌత్ (శివసేన-యుబిటి), తేజస్వి యాదవ్ (ఆర్జెడి), రాఘవ్ చద్దా (ఆప్), జావేద్ అలీ ఖాన్ (ఎస్పి), లాలన్ సింగ్ (జెడియు), డి రాజా (సిపిఐ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పిడిపి), అభిషేక్ బెనర్జీ (టిఎంసి) తోపాటు సీపీఐ(ఎం) ఒక అభ్యర్థి(ఖరారు కాలేదు) సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ సమన్వయ కమిటీ కూటమిలో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా కూడా పని చేస్తోంది. ఇది కూడా చదవండి: కేంద్రమంత్రిని గదిలో బంధించిన బీజేపీ కార్యకర్తలు -
నియంతృత్వ శక్తులను ఓడిద్దాం: తేజస్వీ యాదవ్
పట్నా: దేశంలోని నియంతృత్వ శక్తులను ఓడిద్దామని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పరోక్షంగా విమర్శించారు. పట్నాలో శుక్రవారం విపక్ష పార్టీల భేటీపై శనివారం బిహార్ డెప్యూటీ సీఎం అయిన తేజస్వీ స్పందించారు. ‘ కన్యాకుమారి నుంచి కశీ్మర్దాకా నేతలంతా నియంతృత్వ శక్తులను ఓడిద్దామని విపక్షాలభేటీలో ప్రతినబూనారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు మోదీ గురించో మరే ఇతర వ్యక్తి గురించో కాదు. ప్రజా సంక్షేమం గురించి. విపక్షాల ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై వచ్చేనెలలో సిమ్లాలో జరిగే సమావేశంలో చర్చిస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ తొలి అడుగు పడింది. గతంలో చరిత్రాత్మక చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం, జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమాలు బిహార్ నుంచే మొదలయ్యాయి ’ అని అన్నారు. ‘ సమావేశంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ప్రతీ అంశాన్ని సామరస్యపూర్వక పరిష్కారం కోసమే స్వీకరించి చర్చించాం’ అని చెప్పారు. ఢిల్లీలో పరిపాలన సేవలపై కేంద్రం తెచి్చన ఆర్డినెన్స్‌లో కాంగ్రెస్ వైఖరి వెల్లడించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ నిరాకరిస్తుండటంతో శుక్రవారం భేటీ తర్వాత సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొనకుండానే కేజ్రీవాల్ ఢిల్లీకి వెనుతిరిగారు. ఈ విషయంపైనే తేజస్వీపైవిధంగా స్పందించారు. విపక్షాల భేటీని బీజేపీ అగ్రనేత అమిత్ షా ఫొటో సెషన్‌గా పేర్కొంటూ విమర్శించడంపై తేజస్వీ స్పందించారు. ‘ ఫొటో సెషన్ అంటే ఏమిటో వారికే బాగా తెలుసునన్నారు. -
Mamata Banerjee: రాష్ట్రపతి ‘అభ్యర్థి’పై... మాట్లాడుకుందాం రండి
కోల్‌కతా: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. దీనిపై వ్యూహరచన చేసేందుకు 15న ఢిల్లీలో భేటీ అవుదామంటూ ఆహ్వానించారు. ఈ మేరకు 22 విపక్ష పార్టీలకు దీదీ లేఖలు రాశారు. ‘‘కాన్స్టిట్యూషన్ క్లబ్బులో మధ్యాహ్నం మూడింటికి జరిగే సమావేశంలో ఆయా పార్టీల అధినేతలందరం హాజరవుదాం’’ అని కోరారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, పంజాబ్ ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలతో పాటు కొన్నాళ్లుగా ఉప్పూనిప్పుగా ఉంటున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కూడా ఆహ్వానం పంపడం విశేషం. ‘‘బీజేపీ విభజన రాజకీయాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రపతి ఎన్నిక సరైన అవకాశం. ప్రగతిశీల భావాలున్న ప్రతిపక్ష పార్టీలందరం కలిసి ఈ దిశగా వ్యూహరచన చేసుకుందాం. జాతీయ రాజకీయాల్లో ఎలా ముందుకెళ్లాలో చర్చించుకుందాం. ప్రజాస్వామ్యం సమస్యల్లో ఉన్నప్పుడు విపక్ష గళాలన్నీ ఏకమై అణచివేతకు గురవుతున్న, ప్రాతినిధ్యం కరువవుతున్న సామాజిక వర్గాలవైపు నిలుద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థల ద్వారా విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని దుయ్యబట్టారు. సమాజంలో అది తెస్తున్న చీలికల వల్ల అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లిందన్నారు. ‘‘ఇలాంటి వేళ దేశాధ్యక్షుడు, మన ప్రజాస్వామ్య పరిరక్షకుడు అయిన రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు వచ్చిన గొప్ప అవకాశమిది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం’’ అని కోరారు. మమత లేఖలను బీజేపీ తేలిగ్గా తీసుకుంది. ఈ సమావేశంతో ఒరిగేదేమీ లేదంటూ పెదవి విరిచింది. ‘‘2017లోనూ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఇలాంటి ప్రయత్నాలే చేశారు. చివరికేమైందో అందరికీ తెలుసు’’ అని బెంగాల్ బీజేపీ నేత సమిక్ భట్టాచార్య అన్నారు. ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఐక్యతకు భంగం: ఏచూరి మమత తలపెట్టిన భేటీ వ్యతిరేక ఫలితాలకే దారి తీస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 15వ తేదీనే సోనియాగాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్ తదితరులు సమావేశమవుతున్నారని గుర్తు చేశారు. ‘‘మమత కూడా అదే రోజు సమావేశం పెట్టడం సరికాదు. ఆమె ఏకపక్ష నిర్ణయం విపక్షాల ఐక్యతకు భంగకరం’’ అన్నారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెడదాం: కాంగ్రెస్ విభేదాలను పక్కనబెట్టి ఉమ్మడి అభ్యర్థిని నిలపాలన్నదే కాంగ్రెస్ అభిప్రాయమని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. కాంగ్రెస్ ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రతిపాదించబోదని ఆయన చెప్పడం విశేషం. ఇది కూడా చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్ -
ఢిల్లీలో గాంధీ విగ్రహం వద్ద విపక్షాల ధర్నా
-
గవర్నర్ నరసింహన్‌ను కలిసిన అఖిలపక్షం నేతలు
-
కడప బంద్ : హోరెత్తిన ఉక్కు నినాదం
సాక్షి, కడప : ఉక్కు ఉద్యమం హోరెత్తుతోంది. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు, అఖిలపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్నారు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రభుత్వాల సాచివేత ధోరణికి నిరసనగా శుక్రవారం వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు సంయుక్తంగా జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ విజయవంతం చేయడం ద్వారా కేంద్రప్రభుత్వానికి ఉక్కు సెగ తగిలేలా చేస్తామని అఖిలపక్షం నాయకులు అన్నారు. బీజేపీ విభజన హామీలను విస్మరించినా గత నాలుగేళ్లుగా నోరు మెదపని టీడీపీ నేతలు తగుదనమ్మా అంటూ దీక్షలకు ఉపక్రమించడం రాజకీయ స్టంట్ అన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అఖిలపక్ష నేతలు నిర్ణయించామన్నారు. మైదుకూరు : మైదుకూరులో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉక్కు పరిశ్రమ సాధనకై జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీతో పాటు ఇతర అఖిలపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఇరంగం రెడ్డి, వామపక్ష నేతలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పులివెందులలో ఉక్కు నినాదం హోరెత్తింది. విభజన చట్టంలో హామీల అమలను డిమాండ్ చేస్తూ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బస్టాండ్ వద్ద బైఠాయించారు. అనంతరం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. బద్వేలు : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జిల్లా బంద్‌కు అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు బద్వేలు నేతలు బంద్ నిర్వహించారు. బస్ డిపో ముందు బైఠాయించి బస్సులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రజాసంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నినాదాలతో బద్వేల్ హోరెత్తింది. ఈ మేరకు బస్సులు డిపోలకు పరిమితం అవ్వగా ప్రవేటు వాహనాలు కూడా బంద్‌కు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. రాయచోటి : అఖిలపక్షం పిలుపు మేరకు ఉక్కుసంకల్పం పేరుతో రాయచోటిలో బంద్ జరుగుతోంది. ఆర్టీసి డిపో ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు భైఠాయించారు. బంద్ సందర్భంగా విద్యాసంస్థలు ఒక రోజు ముందే సెలవు ప్రకటించాయి. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు మదన్మోహన్ రేడ్డి, జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్, సీపీఐ నాయకులు విశ్వనాథ్, వైఎస్సార్ మున్సిపల్ కౌన్సిలర్లు బంద్‌లో పాల్గోన్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ఇతర నేతలు, కార్యకర్తలు సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు : వైఎస్సార్సీపీ ఇంచార్జ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు బంద్ నిర్వహించారు. వామపక్షాలు, జనసేనలు వైఎస్సార్సీసీ తలపెట్టిన బంద్‌కు మద్దతు తెలిపాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రాజంపేట : ఆకేపాటి అమర్నాథ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, జనసేనలతో పాటు ఇతర విద్యార్ధి సంఘాల నేతలు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ దీక్ష నిజమైతే టీడీపీ బంద్‌లో ఎందుకు పాల్గొనడం లేదని అమర్ నాథ్ రెడ్డి ప్రశ్నించారు. కడప : ఆర్టీసీ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నేతలు బంద్ నిర్వహించారు. తెల్లవారు జామున నాలుగు గంటలకే అన్ని పార్టీల నేతలు రోడ్డు మీదకు వచ్చారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. కడప మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అంజాద్ బాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, జనసేన జిల్లా నాయకుడు రంజిత్ సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య నగర కార్యదర్శి వెంకట శివ పాల్గొన్నారు. -
ఎన్నికలయ్యాకే ప్రధాని అభ్యర్థిని చెప్తాం
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాతే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయించాలని జేడీఎస్ ప్రధాన కార్యదర్శి డానిష్ అలీ అన్నారు. బీజేపీని ఓడించేందుకు భావసారూప్యం కలిగిన పార్టీలన్నీ కలిసి రావాలన్నారు. గతంలో 3 సందర్భాల్లో ఎన్నికల తర్వాతే ప్రధాని ఎంపిక జరిగిందన్నారు. ‘ఎన్నికల తర్వాతే వీపీ సింగ్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేశారు. 1996లో కూడా ఎన్నికల తర్వాత ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ హెచ్డీ దేవెగౌడను ప్రధానిగా చేసింది. అదేవిధంగా, ఎన్నికల అనంతరమే యూపీఏ–1 హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఎంపికయ్యారు’అని ఆయన చెప్పారు. బహుళ పార్టీ ప్రజాస్వామ్యంలో సాధారణ ఎన్నికల తర్వాతే నాయకత్వం అంశం నిర్ణయమవుతుందని అన్నారు. ఏకాభిప్రాయంతోనే ప్రధానమంత్రిని నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయితే అసలు లక్ష్యమే దెబ్బతింటుందని తెలిపారు. కాంగ్రెస్ లేకుండా రూపొందే ప్రతిపక్ష కూటమి బీజేపీకి ప్రత్యామ్నాయం కాబోదన్నారు. గత ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కేవలం 31శాతం మాత్రమే పొందిన బీజేపీ ప్రతిపక్షం లేని భారత్ తెస్తానంటూ కలలు కంటోందని ఎద్దేవా చేశారు. కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే 28 లోక్‌సభ స్థానాలకు గాను 25పైగానే గెలుచుకుంటాయన్నారు. రెండు పార్టీలు కలిసి ఎన్నికల కోసం కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందిస్తాయన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పూర్తికాలం ఐదేళ్లు కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్ని విభేదాలున్నా పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ ఐదేళ్లూ జేడీఎస్‌కే సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ లిఖితపూర్వకంగా అంగీకరించిందన్నారు. -
ఆర్నెల్లలో అభివృద్ధి అవుతుందా?: కేటీఆర్
ముస్తాబాద్: ‘ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేస్తే గాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు. అరవై ఏళ్లలో చేయని పనులు ఆరు నెలల్లో ఎలా చేస్తారు. కేసీఆర్‌ను జైల్లో పెట్టాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. పేదల అభివృద్ధి కోసం ఎవరూ చేయని పనులను చేస్తున్నందుకే జైల్లో పెట్టాలా?’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీలో భాగంగా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని తొమ్మిది గ్రామాలకు సాగునీరందించే ఎగువమానేరు హైలెవెల్ కెనాల్ పనులను సోమవారం నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీమాంధ్రులు అప్పులు పంచి ఆస్తులు పట్టుకుపోయారని, తెలంగాణ అభివృద్ధికి సమయం పడుతుంద న్నారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పథకంలో 46 వేల చెరువులను రూ. 26 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం గంభీరావుపేట మండలం ఎగువమానేరు గెస్ట్‌హస్‌లోప్రాణహిత-చేవెళ్ల, మిషన్ కాకతీయ పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ చైరపర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మద్దికుంట రైతు బహిరంగసభలో కేటీఆర్ మాట్లాడుతూ తన్నీరు అంటే మంచినీరని, మంత్రి తన్నీరు హరీశ్ మెట్ట ప్రాంతానికి నీరందించాలని ఛలోక్తి విసిరారు.