న్యూఢిల్లీ: అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈరోజు తొలిసారి భేటీ కానుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా బీజేపీ పార్టీకి వత్యతిరేకంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు.
ఒక్కటే ఎజెండా..
ముంబై వేదికగా ఇండియా కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో సమావేశం కానుంది. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజీపీకి వ్యతిరేకంగా ప్రతి స్థానంలోనూ ప్రతిపక్ష కూటమిలోని పార్టీలకతీతంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. ఇటువంటి కార్యాచరణను అవలంబిస్తున్నప్పుడు పార్టీలో ఈగోలను పక్కన పెట్టి పనిచేయాల్సిన అవసరముందని ఇదివరకే ప్రతిపాదించింది కూటమి. ఇదే సమావేశాల్లో ఎన్నికల వ్యూహరచనకు సంబంధించిన అంశంపై కూడా చర్చలు నిర్వహించనున్నారు.
అక్కడే అసలు సమస్య..
అసలే ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వీలైనంత తొందరగా ఈ జాబితాను సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇప్పటీకే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థుల కేటాయింపు పూర్తయినట్లేనని ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ వినతి ఇతర రాష్ట్రాల్లోని అభ్యర్థుల కేటాయింపే జటిలం కనుందని విపక్ష కూటమి వర్గాలు చెబుతున్నాయి. సమావేశాలకు ముందు ప్యానెల్ సభ్యుడైన రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ఆచరించాల్సిన విధానాలు, సమైక్య ర్యాలీలను నిర్వహించేందుకు ప్రణాళికలు, డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాల గురించి ఎన్నికలకు సంబంధించిన ఇతర కార్యాచరణ గురించి చర్చిస్తారని తెలిపారు. కూటమి విజయవంతం కావాలంటే అన్ని పార్టీలు మహత్వాకాంక్ష, మతభేదం,మనోభేదం మూడు అంశాలను పక్కన పెట్టాలని అన్నారు.
కమిటీలో ఎవరెవరంటే..
ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన పద్నాలుగు మంది నేతలతో ఏర్పాటైన సమన్వయ కమిటీలో కె సి వేణుగోపాల్ (కాంగ్రెస్), టి ఆర్ బాలు (డిఎంకె), హేమంత్ సోరెన్ (జెఎంఎం), సంజయ్ రౌత్ (శివసేన-యుబిటి), తేజస్వి యాదవ్ (ఆర్‌జెడి), రాఘవ్ చద్దా (ఆప్), జావేద్ అలీ ఖాన్ (ఎస్‌పి), లాలన్ సింగ్ (జెడియు), డి రాజా (సిపిఐ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పిడిపి), అభిషేక్ బెనర్జీ (టిఎంసి) తోపాటు సీపీఐ(ఎం) ఒక అభ్యర్థి(ఖరారు కాలేదు) సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ సమన్వయ కమిటీ కూటమిలో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా కూడా పని చేస్తోంది.
ఇది కూడా చదవండి: కేంద్రమంత్రిని గదిలో బంధించిన బీజేపీ కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment