Political Alliance
-
కామ్రేడ్స్‌పై కపట ప్రేమ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఆయా పార్టీలను తన రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు అన్న విషయం కూడా జగది్వదితమే. తాజాగా ఆయన ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్స్’ అంటూ కమ్యూనిస్టులతో లోపాయికారీ వ్యవహారాలు నడుపుతుండటం ఆయన నైజాన్ని చెప్పకనే చెబుతోంది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత గత నెల 26న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో పాటు ఆ పార్టీ కీలక నేతలు ఎంఏ గఫర్, సీహెచ్ బాబూరావు, వై.వెంకటేశ్వరరావు ఆయన్ను కలసి అభినందించారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ.. సీఎం దృష్టికి ప్రజా సమస్యలు తీసుకెళ్లినట్టు వివరించారు. ఆ తర్వాత గత నెల 31న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర కీలక నేతల బృందం బాబును కలిసి అభినందించి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించినట్టు ప్రకటించారు. కలయికలో మర్మం అదేనా?.. ఉభయ కమ్యూనిస్టు నేతలు పోటీ పడి మరీ సీఎంను కలిసి ప్రజా సమస్యలు వివరించడంలో తప్పులేదని.. అయితే దీని వెనుక పెద్ద మంత్రాంగం నడిచిందని వామపక్ష శ్రేణులే చెబుతున్నాయి. బాబు పథకం ప్రకారమే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ ద్వారా కమ్యూనిస్టు నేతలను తన వద్దకు పిలిపించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు నుంచి వామపక్షాలకు టచ్‌లో ఉన్న జనార్దన్ వారిని టీడీపీకి అనుకూలంగా మలుచుకునేలా పనిచేశారని కమ్యూనిస్టు శ్రేణులే చెబుతున్నాయి. ఎన్నికల ముందు పాలకపక్షానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు ప్రజాసంఘాలు ఉద్యమించడంతో టీడీపీకి మేలు జరిగేలా జనార్దన్ ప్రయత్నాలు చేసినట్టు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక వారిని బాబు వద్దకు తీసుకెళ్లడంలో కూడా జనార్దన్ కీలకంగా వ్యవహరించారన్నారు. ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు ఉద్యమించకుండా ఉండేందుకే ఈ తతంగం నడిచిందని, అందుకే తమ పార్టీ నేతలపై బాబు కపట ప్రేమ కనబరచారని కమ్యూనిస్టు నేతలు చెబుతున్నారు. పథకంలో భాగమే లోకేశ్ స్పందన.. తండ్రికి తగ్గట్టుగానే తనయుడు లోకేశ్ సైతం కామ్రేడ్స్‌పై ఎన్నడూ లేని ప్రేమను ఒలకబోయడం వెనుక చంద్రబాబు పథకం ఉందని చెబుతున్నారు. ఈ నెల 1న శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సందర్భంగా సీపీఎం నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా స్పందిస్తూ.. తాము ఎటువంటి నిరసనకు పిలుపు ఇవ్వకపోయినా తమ నేతలను అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నారా లోకేశ్ ఎక్స్‌లో స్పందిస్తూ “మమ్మల్ని మన్నించండి కామ్రేడ్స్’ అంటూ పోస్టు చేశారు. కమ్యూనిస్టుల గృహనిర్భందం నెపాన్ని పోలీసులపై నెట్టేశారు. ఈ వ్యవహారాలన్నీ చూశాక.. పాలకపక్షాన్ని ప్రశ్నించే కమ్యూనిస్టుల్లో మార్పు వచి్చందా? పథకం ప్రకారం పాలకపక్షమే వారిని ప్రజల్లో పలచన చేస్తోందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
నైతిక, రాజకీయ ఓటమి...
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రధాని నరేంద్ర మోదీకి నైతిక, రాజకీయ ఓటమిగా సోనియాగాంధీ అభివర్ణించారు. ‘‘కనుక మోదీ దేశానికి నాయకత్వం వహించే నైతిక హక్కు కోల్పోయారు. ఎందుకంటే బీజేపీని, భాగస్వామ్య పక్షాలను పూర్తిగా పక్కన పెట్టారు. కేవలం తన పేరుతోనే ప్రజా తీర్పు కోరారు. కనుక ఓటమికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలి. కానీ ఆ పని చేయకపోగా మరోసారి గద్దెనెక్కేందుకు సిద్ధపడుతున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా తిరిగి ఎన్నికయ్యారు. శనివారం సీడబ్ల్యూసీ భేటీ అనంతరం పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలంతా ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఎంపీలనుద్దేశించి ఆమె మాట్లాడారు. ‘‘మోదీ నైజం తెలిసిన వారెవరూ ప్రజా తీర్పును ఆయన గౌరవిస్తారని, పాలన తీరుతెన్నులను మార్చుకుంటారని అనుకోరు. కనుక మోదీ సర్కారు తీరును వేయి కళ్లతో గమనించడం, ప్రజా వ్యతిరేక చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం మనందరి బాధ్యత. లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే యత్నాలను అడ్డుకుంటూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి’’ అని ఎంపీలకు ఉద్బోధించారు. ‘‘అయితే లోక్‌సభలో కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి సభ్యుల సంఖ్య భారీగా పెరిగింది. పార్లమెంటులో మోదీ సర్కారు ఏకపక్ష పోకడలు గత పదేళ్ల మాదిరిగా సాగబోవు. చర్చల్లేకుండా బిల్లుల ఆమోదం, విపక్ష సభ్యులను అవమానించడం, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం వంటివి చెల్లబోవు’’ అన్నారు. మనకు ఏకంగా శ్రద్ధాంజలి ఘటించారు... ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎలాగైనా కుప్పకూల్చేందుకు అధికార పార్టీ చేయని ప్రయత్నం లేదని సోనియా అన్నారు. ‘‘పారీ్టని ఆర్థికంగా కుంగదీశారు. అందరిపైనా కేసులు పెట్టి వేధించారు. చాలామంది కాంగ్రెస్‌కు ఏకంగా శ్రద్ధాంజలే ఘటించారు! కానీ బీజేపీ కుటిల యత్నాలన్నింటినీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మొక్కవోని దీక్షతో అడ్డుకున్నారు. కలసికట్టుగా శ్రమించి మంచి ఫలితాలు సాధించారు. వారి ధైర్యానికి మా సెల్యూట్. ఈ విజయంలో అధ్యక్షుడు ఖర్గేది కీలక పాత్ర. ఆయన మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఖర్గే నుంచి అందరూ ఎంతో నేర్చుకోవాలి. అలాగే చరిత్రాత్మక భారత్ జోడో యాత్రలు చేసిన రాహుల్ ప్రత్యేక అభినందనలకు అర్హుడు’’ అన్నారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించకపోవడంపై ఆత్మశోధన జరగాలని ఎంపీలను కోరారు. సీపీపీ చైర్‌పర్సన్‌గా తిరిగి ఎన్నికవడం తనకెంతో భావోద్వేగపూరిత క్షణమని సోనియా అన్నారు. ‘‘మీరంతా నాపై ఎంతో ప్రేమ చూపుతూ వస్తున్నారు. మీ నమ్మకాన్ని కాపాడుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తా’’ అని చెప్పారు. -
China–Russia relations: ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం
బీజింగ్: ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవడానికి త్వరలోనే రాజకీయ పరిష్కారం కనుగొంటామని చైనా అధినేత షీ జిన్‌పింగ్ సంకేతాలిచ్చారు. ఐరోపా ఖండంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. గురువారం చైనా రాజధాని బీజింగ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. చైనా–రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాలను దెబ్బతీసేందుకు అమెరికా చేసే ప్రయత్నాలను సహించకూడదని, గట్టిగా ఎదిరించాలని నిర్ణయానికొచ్చారు. తమ రెండు దేశాల సంబంధాల్లో కలుగజేసుకోవద్దని అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉయదం రష్యా నుంచి చైనాకు చేరుకున్న పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పుతిన్ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. చర్చల అనంతరం జిన్‌పింగ్, పుతిన్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి త్వరగా తెరపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చైనా–రష్యా సంబంధాలను మూడోదేశం ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. అలా ప్రభావితం చేసేందుకు సాగే ప్రయత్నాలను అడ్డుకుంటామని వెల్లడించారు. తమ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని స్పష్టం చేశారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం కంటే ఇప్పుడు తమ బంధం ఇంకా దృఢమవుతోందని పేర్కొన్నారు. తమ చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను కచి్చతంగా కాపాడుకుంటామని తేలి్చచెప్పారు. అణు ఇంధనం నుంచి ఆహార సరఫరా దాకా భిన్న రంగాల్లో చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని పుతిన్ వెల్లడించారు. రష్యాలో చైనా కార్ల తయారీకి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నందుకు చైనాకు పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చైనా–రష్యా మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఒకఒప్పందంపై జిన్‌పింగ్, పుతిన్ సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఇరుదేశాల అధికారుల మధ్య విస్తృత స్థాయి చర్చల తర్వాత 30 పేజీల ఈ ఒప్పందం డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్లు రష్యా ప్రతినిధి యూరి ఉషకోవ్ చెప్పారు. -
పిల్లల వెంట తండ్రులు.. యూపీలో ఆసక్తికర రాజకీయాలు!
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర రాజకీయాలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలు తాము ఎన్నికల బరిలోకి దిగకుండా, తమ పిల్లలకు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ యాదవ్, సుభా ఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్, నిషాద్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ నిషాద్, కాంగ్రెస్ నాయకుడు పిఎల్ పునియా, ఇంద్రజిత్ సరోజ్, బ్రజ్భూషణ్ శరణ్ సింగ్ తదితరులు ఉన్నారు.ఫిరోజాబాద్ లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ నేత ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ ఎన్నికల బరిలో దిగారు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ సమాజ్ వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం ఆయన తన కుమారుని విజయం కోసం శ్రమిస్తున్నారు. శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ బదౌన్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. బదౌన్‌లో మూడో దశలో ఎన్నికలు జరిగాయి. శివపాల్ తన కుమారుని విజయం కోసం ప్రచార కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు.సంత్ కబీర్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రవీణ్ నిషాద్ ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయం కోసం ఆయన తండ్రి, యోగి ప్రభుత్వ మంత్రి, నిషాద్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ నిషాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ మే 25న ఓటింగ్ జరగనుంది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ఇటీవ పలు ఆరోపణల్లో చిక్కుకున్నారు. కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు రాజ్‌భర్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఆయన కుమారుడు అరవింద్ రాజ్‌భర్ ఘోసీ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు. ఓం ప్రకాష్ రాజ్‌భర్ తన కుమారుని విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. బారాబంకి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత పీఎల్ పునియా కుమారుడు తనూజ్ పునియా ఎన్నికల బరిలోకి దిగారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కింద తనూజ్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. -
బాబు పొత్తులను చిత్తుచేయండి
సాక్షి, అమరావతి: చంద్రబాబు అవకాశవాద పొత్తులపై రాష్ట్రంలోని క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు కత్తులు నూరుతున్నారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీలతో కలిసి పోటిచేసి అధికారం చేపట్టిన ఆయన అప్పట్లో ఇచ్చిన ఏ హామీని అమలుచేయలేదని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే, ముస్లిం మైనారిటీ వర్గాల సంక్షేమానికి 2014 మేనిఫెస్టోలో హామీలు గుప్పించిన చంద్రబాబు వాటినీ అటకెక్కించేరన్నారు. ఉదా.. హజ్ యాత్రికుల సౌకర్యం కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్‌హౌస్‌లు నిర్మిస్తానని, ముస్లిం జనాభా ప్రాతిపదికన వారికి బడ్జెట్‌లోను, స్థానిక సంస్థల ఎన్నికల్లోను సీట్లు కేటాయిస్తానని, మైనారిటీలకు చెందిన వక్ఫ్ ఆస్తులు, చర్చిల ఆస్తుల రికార్డులను పక్కాగా తయారుచేసి వాటిని పరిరక్షిస్తామంటూ ఆయన ఇచ్చిన ప్రధాన హామీలేవీ అమలుకు నోచుకోలేదని మైనారిటీలు గుర్తుచేస్తున్నారు.నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు, వ్యాపారం కోసం వడ్డీలేని రుణాలు ఇస్తామని, వడ్డీలేని ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమలుచేస్తామని చెప్పిన మాట కూడా అమలుకు నోచుకోలేదంటున్నారు. ఇక క్రిస్టియన్ మైనార్టీలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు పరిశీలిస్తే.. కబ్జాదారుల నుంచి పేద క్రిస్టియన్లు, బలహీనవర్గాల భూములు కాపాడతామని, క్రైస్తవ సంస్థల ఆస్తులను పరిరక్షిస్తామని, దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేరుస్తామని, క్రిస్టియన్ శ్మాశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తామన్న హామీలను అధికారం చేపట్టిన అనంతరం పట్టించుకున్న పాపాన పోలేదు. 2014లో ఇచ్చిన హామీలు అమలుచేయని ఇదే చంద్రబాబు.. మళ్లీ అదే బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తుతో మరోసారి దగా చేసేందుకు వస్తున్నాడని, పొత్తులతో కట్టకట్టుకుని వస్తున్న ఆయనకు బుద్ధిచెప్పాలని క్రిస్టియన్, ముస్లిం నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. బీజేపీతో కలిసి బాబు పెద్ద తప్పుచేశారు మతతత్వ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకుని చంద్రాబాబు పెద్ద తప్పుచేశారు. 2024 ఎన్నికల్లో గెలుపుకోసం చంద్రబాబు అనేక విష ప్రయోగాలు చేస్తున్నారు. 2014లో ఆయన బీజేపీతో పెట్టుకుని 2019లో ఆ పార్టీని వీడి ప్రధాని మోదీని టెర్రరిస్టుతో పోల్చి మళ్లీ ఇప్పుడు ఆయన కాళ్లబేరానికి వచ్చాడు. బీజేపీ, జనసేనలతో కలిసి వస్తున్న చంద్రబాబును రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చిత్తుచిత్తుగా ఓడిస్తారు. సంక్షేమం, అభివృద్ధి ద్వారా తనదైన ముద్ర వేసుకున్న సీఎం వైఎస్ జగన్‌ను 2024 ఎన్నికల్లో ప్రజలు మళ్లీ సీఎంను చేస్తారు. – పెరికె వరప్రసాదరావు, నేషనల్ దళిత క్రిస్టియన్ రైట్స్ చైర్మన్ ముస్లింలను అణగదొక్కిన బాబుకు బుద్ధిచెబుతాం చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ముస్లింలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరింత అణగదొక్కారు. మైనారిటీ శాఖను మైనారిటీలకు కాకుండా చేశారు. ఐదేళ్లపాటు ముస్లింలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వని బాబు ఎన్నికల ముందు కంటితుడుపు చర్యగా ఇచ్చామనిపించారు. బీజేపీతో కలిసి అధికారం పంచుకున్న బాబు అదే పోకడలతో ముస్లింలలో నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేశారు. ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ గెలిపించుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో బాబుకు బుద్ధిచెప్పడం ఖాయం. – షేక్ మునీర్ అహ్మద్, ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కర్వీనర్ -
రాజకీయ పొత్తులను నియంత్రించలేం: ఈసీ
న్యూఢిల్లీ: రాజకీయ పొత్తులను నియంత్రించేందుకు చట్టపరంగా తమకు ఎలాంటి అధికారమూ లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టుకు ఈసీ సోమవారం ఈ మేరకు తన స్పందన తెలియజేసింది.‘‘మాకు పారీ్టల నమోదుకు, ఎన్నికల నిర్వహణకు మాత్రమే అధికారముంది. అంతే తప్ప రాజ్యాంగంలోని ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజకీయ పొత్తులకు నియంత్రిత కూటములుగా గుర్తింపునిచ్చే అధికారం కూడా లేదు. పైగా కేరళ హైకోర్టు గత తీర్పు మేరకు ఈ కూటములను చట్టబద్ధమైన సంస్థలుగా కూడా పరిగణించలేం’’ అని వివరించింది. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడం తాలూకు చట్టబద్ధత తమ పరిధిలోని అంశం కాదని వివరించింది. విపక్ష కూటమికి ఇండియాగా పేరు పెట్టడాన్ని సవాలు చేస్తూ గిరీశ్భరద్వాజ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
భారతదేశం మీ తాతల సొత్తు కాదు
న్యూఢిల్లీ: కొద్దిరోజుల క్రితం డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఎంతటి రాజకీయా దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసందే. ఈ వ్యాఖ్యలు ఇండియాకూటమి చేసినా వ్యాఖ్యలుగా భావంచకూడదని ఏవి ఒక పార్టేకి చెందిన చిన్న నేత చేసినవని అన్నారు ఆప్ నేత రాఘవ్ చద్దా. ఎవరో చిన్న నేత.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ రాఘవ్ చద్దా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి ఇండియా కూటమి భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ నేను సనాతన ధర్మానికి చెందిన వాడిని. ఇటువంటి వ్యాఖ్యలకు అందరూ దూరంగా ఉండాలి. మనం అన్ని మతాలను గౌరవించాలన్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరో ఒక పార్టీకి చెందిన చిన్ననేత చేసిన వ్యాఖ్యలని ఇండియా కూటమి అధికారికంగా చేసినవి కాదని అన్నారు. అదే మా ప్రణాళిక.. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి చేసిందన్నట్లుగా బీజేపీ పార్టీ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. దేశం ఇంతకంటే పెద్ద సమస్యలను ఎదుర్కుంటోందని ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి మేము లేవనెత్తాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్నారు. ఇక ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో జరగనున్న సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించబోయే అంశాల గురించి ప్రస్తావించగా ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు ఒక్కో రీతిగా ఉంటాయని వాటిప్రకారం ఎన్నికల ప్రణాళికను రూపొందించే విషయమై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. కూటమి అవసరాన్ని బట్టి ఆయా పార్టీలు కొన్ని త్యాగాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆ సీన్ రిపీట్ అవుతుంది.. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి గురించి ప్రశ్నించగా మేము కూటమిలో నమ్మకమైన సైనికుడిగా ఉన్నామని ప్రధాని అభ్యర్థి గురించి కూటమి కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వానికి అర్హులైన చాలామంది ముఖ్య నాయకులు ఉన్నారని ఎన్డీయే కూటమిలోలా ఒక్కరి పేరు చెప్పుకుని ఎన్నికల్లోకి వెళ్ళమని అన్నారు. 1977లో కూడా ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పడిందని అప్పుడు కూడా ప్రధాని అభ్యర్థిని ముందుగా నిర్ణయించలేదని కానీ ఆ కూటమి ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని గుర్తు చేస్తూ 2024లో కూడాఅదే కథ పునరావృతమవుతుందని అన్నారు. భయం మొదలైంది.. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా ఇండియా కూటమి నాలుగింట విజయం సాధించగా ఎన్డీయే కూటమి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింద అక్కడ కూడా వారికి స్వల్ప ఆధిక్యత మాత్రమే దక్కిందన్నారు. ఇండియా బలమైన కూటమని ఎన్డీయే సిద్ధాంతాలు చెప్పే కూటమని అన్నారు. ఇప్పటికే వారిలో భయం పుట్టుకుందని అందుకే ఏకంగా దేశం పేరు మార్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పదలచుకున్నాను. ఇండియా వారి తాతల సొత్తు కాదు. 135 కోట్ల భారతీయులదని అన్నారు. త్వరలో జరుగనున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి చెబుతూ ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలకు కూడా మాట్లాడే అవకాశమివ్వాలని అజెండా లేకుండా సమావేశాలు ఏమిటో నాకర్ధం కావడం లేదని అసలు ఈ సమావేశాల ఎజెండా ఏమిటో ఒకరిద్దరు బీజేపీ నేతలకు మినహాయిస్తే ఎవ్వరికి తెలియదని అన్నారు. ఇది కూడా చదవండి: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం.. -
నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం..
న్యూఢిల్లీ: అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈరోజు తొలిసారి భేటీ కానుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా బీజేపీ పార్టీకి వత్యతిరేకంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ఒక్కటే ఎజెండా.. ముంబై వేదికగా ఇండియా కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో సమావేశం కానుంది. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజీపీకి వ్యతిరేకంగా ప్రతి స్థానంలోనూ ప్రతిపక్ష కూటమిలోని పార్టీలకతీతంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. ఇటువంటి కార్యాచరణను అవలంబిస్తున్నప్పుడు పార్టీలో ఈగోలను పక్కన పెట్టి పనిచేయాల్సిన అవసరముందని ఇదివరకే ప్రతిపాదించింది కూటమి. ఇదే సమావేశాల్లో ఎన్నికల వ్యూహరచనకు సంబంధించిన అంశంపై కూడా చర్చలు నిర్వహించనున్నారు. అక్కడే అసలు సమస్య.. అసలే ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వీలైనంత తొందరగా ఈ జాబితాను సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇప్పటీకే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థుల కేటాయింపు పూర్తయినట్లేనని ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ వినతి ఇతర రాష్ట్రాల్లోని అభ్యర్థుల కేటాయింపే జటిలం కనుందని విపక్ష కూటమి వర్గాలు చెబుతున్నాయి. సమావేశాలకు ముందు ప్యానెల్ సభ్యుడైన రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ఆచరించాల్సిన విధానాలు, సమైక్య ర్యాలీలను నిర్వహించేందుకు ప్రణాళికలు, డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాల గురించి ఎన్నికలకు సంబంధించిన ఇతర కార్యాచరణ గురించి చర్చిస్తారని తెలిపారు. కూటమి విజయవంతం కావాలంటే అన్ని పార్టీలు మహత్వాకాంక్ష, మతభేదం,మనోభేదం మూడు అంశాలను పక్కన పెట్టాలని అన్నారు. కమిటీలో ఎవరెవరంటే.. ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన పద్నాలుగు మంది నేతలతో ఏర్పాటైన సమన్వయ కమిటీలో కె సి వేణుగోపాల్ (కాంగ్రెస్), టి ఆర్ బాలు (డిఎంకె), హేమంత్ సోరెన్ (జెఎంఎం), సంజయ్ రౌత్ (శివసేన-యుబిటి), తేజస్వి యాదవ్ (ఆర్జెడి), రాఘవ్ చద్దా (ఆప్), జావేద్ అలీ ఖాన్ (ఎస్పి), లాలన్ సింగ్ (జెడియు), డి రాజా (సిపిఐ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పిడిపి), అభిషేక్ బెనర్జీ (టిఎంసి) తోపాటు సీపీఐ(ఎం) ఒక అభ్యర్థి(ఖరారు కాలేదు) సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ సమన్వయ కమిటీ కూటమిలో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా కూడా పని చేస్తోంది. ఇది కూడా చదవండి: కేంద్రమంత్రిని గదిలో బంధించిన బీజేపీ కార్యకర్తలు -
'ఇండియా' కూటమి తర్వాతి ప్రణాళిక అదుర్స్!!
పాట్నా: ముంబైలో ముచ్చటగా మూడో సారి సమావేశమైన ఇండియా విపక్ష కూటమి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై జమిలి ఎన్నికల కమిటీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇదే క్రమంలో ఇండియా తదుపరి కార్యాచరణ గురించి కీలకమైన సమాచారమిచ్చారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దానికోసం యావత్ భారత్ దేశం పండుగలా జరుపుకునే గాంధీ జయంతిని వేదికగా చేసుకున్నట్లు తెలిపారు. ఇండియా కూటమి తర్వాతి కార్యాచరణ గురించి కీలక సమాచారమిచ్చారు బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్. ముంబైలో ఇండియా కూటమి సమావేశం ముగించుకుని పాట్నా చేరుకున్న ఆయన మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్ రాయ్ జన్మదినోత్సవాల్లో పాల్గొని వచ్చేనెల ఇండియా కూటమి గాంధీ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఇదే నెలలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల కోసం పిలుపునిచ్చిన ప్రభుత్వం వాటి ఎజెండా ఏమిటో చెప్పకపోవడంపై కూడా అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక జమిలి ఎన్నికల పేరుతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని మేమంతా ఏకకంఠంతో వ్యతిరేకించడంతో షాక్‌కు గురయ్యారన్నారు. కేంద్రం ఎప్పుడో నిర్వహిస్తామని చెప్పిన కులగణన గురించి ఇప్పటికీ నోరువిప్పకపోవడం చాల ఆశ్చర్యకరంగా ఉందని వారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేలోపే మేము మా రాష్ట్రంలో కులగణన తోపాటు జనాభా గణన కూడా పూర్తి చేశామని అన్నారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చేందుకే బహుశా వారు ఈ సమావేశాలకు పిలుపునిచ్చారనిపిస్తోందని మేము కూడా ఇదే సమావేశాల్లో జనాభాగణన గురించి కేంద్రాన్ని నిలదీయనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ టికెట్టు కోసం ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ -
ఎందుకీ కన్ఫ్యూజన్..! ఆ విషయంలో పవన్ లెక్క తప్పాడా?
పొత్తు ఎవరితో ఉంటుందో ఇప్పటి వరకు క్లారిటీ లేదని ఆయనే చెబుతున్నారు. ప్రజల మద్దతు తనకు ఉంటుందో లేదో అన్న డైలమాని ఆయనే బయట పెట్టుకున్నారు. ఎవరితో పొత్తులు పెట్టుకుంటే జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తోరో ఇంత వరకు క్లారిటీయే రాలేదు. కానీ తాను మాత్రం ముఖ్యమంత్రి సీటుపై కూర్చోడానికి రెడీ అంటున్నారు పవన్ కళ్యాణ్. లెక్కలేనంత తిక్క.. తలతిక్కను మించిన కన్ఫ్యూజన్ను అణువణువునా నింపుకున్న పవన్ కల్యాణ్ అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్ధం అవుతోందా? అని రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు. గోదావరి జిల్లాల తర్వాత విశాఖలో వారాహి యాత్ర ముగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనలో ఉన్న అయోమయాన్ని బయట పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే పరిస్థితిలో లేని టీడీపీతో కానీ.. లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కానీ జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం కచ్చితంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. పొత్తులు అయితే గ్యారంటీగా ఉంటాయి కానీ.. అది బీజేపీతో ఉంటుందా? లేక టీడీపీతో ఉంటుందా? అన్న అంశాలపై చర్చ నడుస్తోందన్నారు పవన్. అంటే ఎవరితో పొత్తు ఉంటుందో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదన్నట్లే అంటున్నారు రాజకీయ పండితులు. సరే పొత్తులు బీజేపీ, టీడీపీల్లో ఏదో ఒక పార్టీతో ఉంటాయా లేదంటే 2014 తరహాలో మళ్లీ మూడు పార్టీలు కలిసి జట్టు కడతాయా? అన్నదాంట్లోనూ క్లారిటీ లేదు. ఒక వేళ టీడీపీతో కానీ బీజేపీతో కాని పొత్తులు పెట్టుకుంటే అపుడు ఆ పార్టీలు జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తాయి? అన్నదానిపై క్లారిటీ లేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఓ పాతిక సీట్లు జనసేనకు ఇవ్వచ్చని ప్రచారం జరుగుతోంది. మరీ ఎక్కువ అనుకుంటే 40 స్థానాల దాకా ఇవ్వచ్చు. ఒక వేళ జనసేనకి 40 స్థానాలు కేటాయిస్తే ఆ 40 నియోజక వర్గాల్లోనూ జనసేన అభ్యర్ధులను బరిలోకి దింపితే పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్నింట్లో విజయాలు సాధించే అవకాశాలుంటాయన్నది ప్రశ్న. గత ఎన్నికల్లో జనసేన గెలుచుకున్నది ఏక్ నిరంజన్ లా ఒకే ఒక్క సీటు. జనసేన ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఆ జోడీ మొత్తానికి 88 స్థానాలు దక్కితేనే మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోగలుగుతాయి. కానీ క్షేత్ర స్థాయిలో జనసేనతో టీడీపీ కలిసినా బీజేపీ కలిసినా ఈ ఫిగర్‌కు దరిదాపుల్లో కూడా స్థానాలు దక్కే పరిస్థితి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చదవండి: బాబూ.. కాస్త ప్రధాని మోదీని చాలెంజ్ చేయొచ్చుగా! అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాబోయేది మిశ్రమ ప్రభుత్వం అంటున్నారు. అంతే కాదు తాను ఈ సారి సీఎం సీటు ఎక్కడానికి రెడీ అంటున్నారు. అయితే దానికి ప్రజలు బలంగా తనకు మద్దతు తెలపాలంటున్నారు పవన్. దీని మీదనే సోషల్ మీడియాలో పవన్‌ను బాగా ట్రోల్ చేస్తున్నారు. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు అమితాబ్ బచ్చన్న అన్నట్లు పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ పొత్తు పెట్టుకోబోయే పార్టీకి కానీ, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమయ్యే సీట్లు వస్తాయన్న గ్యారంటీయే ప్రస్తుతానికి లేదు. కానీ పవన్ మాత్రం సీఎం సీటుకు తాను రెడీ అంటున్నారు. సీఎం సీటులో కూర్చోడానికి పవన్ రెడీ కావచ్చు. కానీ రెడీగా ఉండాల్సింది సీఎం సీటు కదా? సీఎం సీటు రెడీగా ఉండాలంటే అసలు పవన్‌ని సీఎంగా చేయడానికి ప్రజలు రెడీగా ఉండాలి కదా? ఆ ప్రజలే పవన్‌ను సీఎంగా చేయడానికి రెడీగా ఉండే పరిస్థితులు ఉంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవలసిన అగత్యం ఎందుకొస్తుంది? తాను అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నానన్న దౌర్బల్య పరిస్థితిలోనే కదా పవన్ పొత్తుల కోసం పరితపిస్తున్నది. పొత్తులు లేనిదే తాను పోటీచేయలేనని చెప్పుకోడానికి నామోషీ అయ్యే కదా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే సవాల్ విసిరినట్లు పవన్ నటించింది? తన వైఫల్యలపై కూడా పవన్ కళ్యాణ్ మంచి కామెడీ చేస్తుంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ గందరగోళంలోనే తనకున్న కన్ఫ్యూజన్ ని పవన్ అందరికీ పంచిపెడుతున్నారని వారు సెటైర్లు వేస్తున్నారు. -
సీఎం రేసులో లేను.. ఆ మాట టీడీపీ ఎలా చెబుతుంది?: పవన్ కల్యాణ్
సాక్షి, అమరావతి/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను అసలు ముఖ్యమంత్రి పదవి రేసులోనే లేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పరోక్షంగా తేల్చి చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయమంటూ సంకేతాలిస్తూ, పొత్తుల్లో జనసేన పార్టీకే ముఖ్యమంత్రి పదవి కావాలని అడగడానికి ఓ స్థాయి ఉంటుంది కదా అంటూ వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ గురువారం మీడియాతో మాట్లాడారు. టీడీపీతో పొత్తు చర్చలు జరుగుతున్నాయి కదా, అవి ఎంతవరకు వచ్చాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఖచ్చితంగా పొత్తులు పెట్టుకుంటాం. మాట్లాడతాం. (బీజేపీని ఉద్దేశించి) కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. ఒప్పిస్తాం. వాస్తవాలు, గణాంకాలు చూపి ఒప్పిస్తాం’.. అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల చంద్రబాబు–పవన్ భేటీ తర్వాత కొంతమంది జనసేన నేతలు మీరు తగ్గడం ఏమిటని, మీరు ముఖ్యమంత్రిగా అయితే తప్ప పొత్తులు పెట్టుకోకూడదని, మీరు సీఎం అభ్యర్థిగా ఉండాలి కదా అని మాట్లాడడాన్ని పవన్ తప్పుబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 30–40 సీట్లు వచ్చి ఉంటే సీఎం పదవి అడిగే వాళ్లమేమో.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే తప్ప పొత్తులు పెట్టుకోకూడదని అనేవాళ్లు ఎవరైనా సరే, అలాంటి ఆలోచనతో ఉంటే వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. జనసేన గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేసింది. ఎన్ని గెలిచాం? పొత్తుల్లో ఇతర పార్టీలను సీఎం స్థానం కోసం డిమాండ్ చేయాలంటే కనీసం 30–40 స్థానాలు ఉండాలి. అప్పుడే ఆ వాదనకు బలం ఉండేది. ఇక తాను ఇప్పటివరకూ ఎవరికైనా పెద్దన్న పాత్ర వహించాలని చెప్పానంటే అది బాధ్యత వహించడం అని అర్ధం. అంతేగానీ, ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమది. సీఎం పదవి కావాలని కండిషన్లు పెడితే జరగవు.. ఒక మాట చెబుతున్నా.. పోయిన ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీచేశాం. 30–40 స్థానాల్లో కూడా గెలిపించలేకపోయారు. అలాంటప్పుడు మన వాదన (సీఎం పదవి కావాలనే)కు పస ఉండదు. సినిమాల్లో నన్ను ఎవరూ సూపర్‌స్టార్ చేయలేదు. నేను సాధించుకున్నదే. రాజకీయాల్లో కూడా టీడీపీ కావొచ్చు. బీజేపీ కావొచ్చు.. నన్ను సీఎంను చేస్తామని ఎందుకంటారు. నేను టీడీపీ అధ్యక్షుడిని అయినా ఆ మాటలు అనను. మనం బలం చూపించి, సత్తా చూపించి పదవి తీసుకోవాలి. కండిషన్లు పెడితే, అవి జరగవు. సీఎం పదవి అన్నది తానై వరించాలి తప్ప నేను దాని కోసం వెంపర్లాడను. పొత్తులకు జనసేన పార్టీ పెట్టే కండిషను వైఎస్సార్సీపీని అధికారం నుంచి దించాలి అంతే. అలాగే, పొత్తులతో ప్రభుత్వం ఏర్పడాలి. నాదెండ్ల మనోహర్ మాట్లాడిన మాటలపై ఎవరైనా అనుచితంగా మాట్లాడితే వాటిని ఉపసంహరించుకోవాలి. ఓటు చీలనివ్వను అంటే ప్రధానంగా బలాలు ఏ పార్టీలకు ఉన్నాయో ఆ పార్టీలు కలవాలన్నది నా ఉద్దేశం. ప్రధాన పార్టీలకు సంబంధించే ఆ వ్యాఖ్యలు చేశాను. ఇక ఎన్నికలు ముందే వస్తాయని అనిపిస్తోంది. అందుకని జూన్ నుంచి రాష్ట్రంలోనే ఉండి పర్యటిస్తా. నాతో నడిచే వాళ్లే నా వాళ్లు.. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలకు మీ అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచే విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందేమోనని ఒక విలేకరి (సాక్షి కాదు) అన్నప్పుడు.. ‘విమర్శలు వస్తాయని నాకు భయాలు లేవు. అభిమానులు నిరాశ పడడానికి ఇదేమి సినిమా కాదు. కార్యకర్తలైనా సరే.. నాతో నడిచేవారే నా వాళ్లు. అర్ధంచేసుకునే వాళ్లు అర్ధంచేసుకుంటారు’.. అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఆఖరి గింజ కొనేవరకు పోరాటం మరోవైపు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలోనూ పవన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆఖరి ధాన్యం గింజ కొనేంత వరకూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్వాకంవల్ల రైతుల ఇళ్లలో ధాన్యం నిల్వలు పెరిగిపోయాయన్నారు. అలాగే, రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు వేయడంలేదన్నారు. క్షేత్రస్థాయిలోని వాస్తవ నివేదికలను సీఎం జగన్ పరిశీలించడంలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం ఇద్దామని వెళ్తే రైతుల్ని అరెస్టుచేస్తున్నారని, ఇలా అయితే తీవ్ర పరిణామాలుంటాయని పవన్ హెచ్చరించారు. అంతకుముందు.. పవన్ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. -
రౌడీ రాజకీయాలు
-
మహారాష్ట్ర,హర్యానాలో పెరిగిన రాజకీయ వేడి
-
ముంబై హోటల్ వద్ద హైడ్రామా
-
బీజేపీ దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ వెనుకంజ!
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయే కూటమికి సారథ్యం వహిస్తున్న బీజేపీ, మిత్రపక్షాల పొత్తుల విషయంలో వేగంగా ముందుకు దూసుకుపోతుంటే మహాకూటమే లక్ష్యం అంటూ ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ, పొత్తుల విషయంలో ఇంకా ఎందుకు వెనకబడిపోతోంది? ఎందుకు మిత్రపక్షాల మధ్య పొరపొచ్చాలు ఇంకా కొనసాగుతున్నాయి ? రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఉమ్మడి కార్యక్రమం రూపొందించేందుకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ తదితరులు ఇటీవల సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో ఓ అవగాహనకు రావాలని, రాష్ట్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా పరస్పరం పోటీ చేయవచ్చని రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఆది నుంచి ఇదే ఉద్దేశంతో ఉన్న రాహుల్ గాంధీ, ఎన్నికల పొత్తు విషయంలో రాష్ట్ర పీసీసీలకే పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఆ పార్టీకి కొన్ని రాష్ట్రాల్లో డోలాయమానం తప్పడం లేదు. పశ్చిమ బెంగాల్లో తణమూల్ కాంగ్రెస్‌తోని కలిసిపోవాలా లేదా వామపక్షాలతో కలిసిపోవాలా ? అని యోచిస్తోంది. రేపు ప్రధాని అభ్యర్థిత్వంపై కొరివి పెట్టకుండా మమతా బెనర్జీతో కలిసిపోవాలని రాహుల్ భావిస్తున్నారు. బెంగాల్లో నాలుగు సీట్లు సాధించుకోవాలంటే వామపక్షాలతో కలిసి పోవాలని అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ కోరుకుంటోంది. ఆ రోజు శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశంలో ముందే మహాకూటమిని ఏర్పాటు చేయడం కన్నా రాష్ట్ర స్థాయిలో పొత్తులు పెట్టుకొని ఫలితాల అనంతరం కూటమిగా ఏర్పడితే బాగుంటుందని కొంతమంది ప్రతిపక్ష నాయకులు సూచించారట. దాని వల్ల ప్రధాని అభ్యర్థి విషయంలో గొడవలు ఉండవని కూడా చెప్పారట. ముందే మహా కూటమిని ఏర్పాటు చేయడం బీజేపీకే కలసి వస్తుందని, అప్పుడు బీజేపీ పక్షాలు ‘మోదీ వర్సెస్ రాహుల్’ అంటూ ప్రచారం చేస్తారని, అలా చేయడం వల్ల మోదీ ముందు రాహుల్ తేలిపోయి మొత్తం కూటమి నష్టపోవాల్సి వస్తుందన్నది వారి వాదన. రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల, రాష్ట్రాల అంశాల ప్రాతిపదికన ఎన్నికల ప్రచారం, ఓటింగ్ జరుగుతుంది కనుక గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నది కూడా వారి అభిప్రాయం. ఈ వాదనలో నిజం లేకపోలేదు! అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ వస్తుందని పలు ముందస్తు సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో ఎన్నికల అనంతరం ఏది అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించే అవకాశం ఉంది. ముందే మహా కూటమి ఏర్పడితే, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకన్నా ఎక్కువ సీట్లు వస్తే కూటమినే ఆహ్వానించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పుడు అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ, ప్రభుత్వం ఏర్పాటుకు అటల్ బిహారి వాజపేయిని ఆహ్వానించారు. ఇటీవల కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లను సాధించిన పార్టీగా ఆవిర్భవించడంతో ఆ రాష్ట్ర గవర్నర్ బీజేపీ నాయకుడు యడ్యూరప్పకు అవకాశం ఇచ్చారు. ఈ రెండు ఉదంతాల్లో వారు తమ ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోవడంలో విఫలమయ్యారు. ఇలాంటి కారణాల రీత్య ముందే మహా కూటమిగా ఏర్పడాలన్నది కొందరు నాయకుల అభిప్రాయం. ఇలాంటి తర్జనభర్జనలు జరుగుతుండగానే తమిళనాడులో డీఎంకేతో పొత్తు కుదుర్చుకోవడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ విషయంలో తాత్సారం చేయడం వల్ల ఈ కూటమిలో చేరాల్సిన పీఎంకే పార్టీ బీజేపీ కూటమిలో చేరిపోయింది. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఇప్పటికే పొత్తు కుదుర్చుకున్నాయి. సోనియా, రాహుల్ పోటీచేసే రెండు స్థానాలను మాత్రం ఆ పార్టీలు వదిలేశాయి. ఈసారి సోనియాకు బదులుగా ప్రియాంక గాంధీ పోటీచేసే అవకాశం ఉంది. పొత్తుకు సిద్ధమై ఎస్పీ, బీఎస్పీ పార్టీలపై ఒత్తిడిచేస్తే కాంగ్రెస్‌కు మరో మూడు లోక్‌సభ స్థానాలు దక్కవచ్చు. అలా కాదని ప్రియాంక గాంధీ వచ్చిందన్న అంచనాలతో ఎక్కువ సీట్లకు పోటీ చేస్తే అది బీజేపీకే మేలు చేయవచ్చు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో నష్టపోయామన్న ఉద్దేశంతో ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఈ కారణంగా పార్టీ నుంచి సీనియర్ నాయకులు వైఎస్ఆర్ పార్టీలోకి వలస వెళుతున్నారు. ఢిల్లీలో కూడా ఇప్పటికీ ఆప్, కాంగ్రెస్ పార్టీల పొత్తు పట్ల సందిగ్ధత కొనసాగుతోంది. ఢిల్లీలో పొత్తుకు బదులుగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో తమ పార్టీకి ఎక్కువ సీట్లు కావాలని అరవింద్ కేజ్రివాల్ డిమాండ్ చేస్తున్నారు. అది ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒంటరిగా వెళ్లేందుకే మొగ్గు చూపుతోంది. ఇప్పటి వరకు పొత్తుల ఖరారులో పాలకపక్ష బీజేపీయే ముందుంది. అందుకు కారణం గెలుపే ప్రధాన లక్ష్యంగా పావులు కదపడం. గెలుపుతోపాటు తాను ప్రధాన మంత్రయ్యే అవకాశాలను జారవిడుచుకోరాదన్నది రాహుల్ గాంధీ లక్ష్యం అవడం వల్ల ఆయన పార్టీ వెనకబడి పోతోంది. -
‘రాష్ట్ర సమీకరణాల ఆధారంగానే పొత్తులు’
న్యూఢిల్లీ: రాష్ట్ర స్థాయి సమీకరణాల ఆధారంగానే ఎన్నికల పొత్తులను పార్టీ నిర్ణయిస్తుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రెండు రోజుల పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మహాగఠ్‌బంధన్‌లో ముందస్తు కూటమి సాధ్యం కాదు. రాష్ట్రాల వారీగా వచ్చిన నివేదికల ఆధారంగానే మా ఎన్నికల వ్యూహాలు ఉంటాయి’అని సీతారాం స్పష్టం చేశారు. ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటామన్న దానిపై పార్టీకేంద్ర కమిటీ మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించే సమావేశంలో నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కూటమిని ఓడించడమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తుందని, లోక్‌సభలో సీపీఎంను బలోపేతం చేసి కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. -
3 లక్ష్యాలు.. 3 అవార్డులు!
‘వ్యక్తులకు బిరుదులు అలంకారం కాదు. వ్యక్తులే బిరుదులకు వన్నె తెస్తారు’ అనేది నానుడి. ఇటీవల ప్రకటించిన కొన్ని అవార్డుల ఎంపికలో పారదర్శకత లోపించడం, ప్రజాభిప్రాయ సేకరణ జరగకపోవడంతో విమర్శలు తలెత్తాయి. ఎన్నికల వేళ ఓట్లు రాబట్టుకోవడం కోసం వ్యక్తులు, సంస్థలకు అవార్డులు ఇవ్వడం సహజమే. 2019 ఏడాదికి భారతరత్న పొందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ గాయకుడు భూపేన్ హజారికాలు ఈ అవార్డుకు అర్హులే. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందే వారిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికచేయడం పట్ల బీజేపీ ఉద్దేశం స్పష్టంగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ను కొన్ని దశాబ్దాల పాటు పాలించిన సీపీఎం బలహీనపడటంతో అక్కడ ధీటైన ప్రతిపక్షం లేకుండా పోయింది. ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య విద్వేషం పెరిగింది. అక్కడ మమత బెనర్జీకి పోటాపోటీగా నిలవాలని చాన్నాళ్లుగా బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ‘బెంగాలీ పుత్రుడు’ ప్రణబ్ పేరును చూపి సెంటిమెంట్‌తో ఆ రాష్ట్రంలో కేడర్‌ను బలోపేతం చేసుకోవాలని బీజేపీ ఆశిస్తూ ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పౌరసత్వ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా అస్సాం అట్టుడుకుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి అస్సాం గణపరిషత్ ఇప్పటికే తప్పుకుంది. రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలను బుజ్జగించడానికి ఆ ప్రాంత గాయకుడు అయిన హజారికాకు భారతరత్న ప్రకటించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక నానాజీ దేశ్‌ముఖ్‌కు భారతరత్నను ఇవ్వడం ద్వారా బీజేపీ ఆచితూచి అడుగులేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే, గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన సేవల్ని ప్రతిపక్షాలు కూడా గుర్తించాయి. దీంతో బీజేపీ రెండు ఆశయాల్ని నెరవేర్చుకుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఒకటి ఆరెస్సెస్‌ను సంతృప్తిపరచడం, రెండోది మేధావుల వారసత్వాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలే కాదు తాము కూడా గౌరవించగలమని చాటి చెప్పడం. ఎన్నికల ఎత్తుగడే కానీ.. ‘మమతా బెనర్జీకి చెక్ పెట్టి బెంగాల్లో పాగా వేయాలి. పౌరసత్వ బిల్లు వల్ల దూరమయ్యేలా కనిపిస్తున్న ఈశాన్య ప్రాంత ప్రజల్ని మళ్లీ తమ వైపు తిప్పుకోవాలి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఒత్తిడి పెంచుతున్న ఆరెస్సెస్‌ను ఎలాగైనా శాంతపరచాలి’..ఈ లక్ష్యాలతోనే బీజేపీ అనూహ్యంగా భారతరత్నకు ముగ్గురు విశిష్ట వ్యక్తుల్ని ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నా విపక్షాలు తప్పు పట్టలేని పరిస్థితి. జీవిత కాలమంతా కాంగ్రెస్‌కే సేవచేసిన ప్రణబ్ 2సార్లు ప్రధాని పదవిని తృటిలో కోల్పోయారు. రాష్ట్రపతి అయ్యాక బీజేపీ ఆయనతో మంచి సంబంధాలే కొనసాగించింది. ఇటీవల ఆరెస్సెస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హజారికాతో బీజేపీకి రాజకీయ సంబంధాలున్నాయి. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ టికెట్‌పై పోటీచేసి ఓటమిపాలయ్యారు. పౌరసత్వ బిల్లుతో అస్సాం రాజకీయ పార్టీలతో పెరిగిన దూరాన్ని హజారికా రూపంలోనైనా తగ్గించుకోవాలని బీజేపీ యత్నిస్తోంది. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నానాజీ దేశ్‌ముఖ్ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1977లో మొరార్జీ దేశాయ్ కేబినెట్లో మంత్రి పదవి ఇస్తామన్నా వద్దనుకుని సామాజిక సేవకు అంకితమయ్యారు. ఓవైపు, ఆయన సేవల్ని గౌరవిస్తూనే, మరోవైపు ఆరెస్సెస్ వ్యక్తికి భారతరత్న ఇచ్చుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది. – సాక్షి నేషనల్ డెస్క్ -
పొత్తు లేకుండా బాబు గట్టెక్కిన ఎన్నిక ఉందా?
-
అంతర్యుద్దాలు మొదలయ్యాయి..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించడంతో రాజకీయం రసకందాయంలో పడింది. ఐదు నియోజకవర్గాలకు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క నియోజకవర్గానికే అభ్యర్థిని ప్రకటించింది. మధిర నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కకు టికెట్ ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఇక మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. సత్తుపల్లి స్థానాన్ని టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు, ఖమ్మంకు మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావుకు ఖరారు చేస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇక వైరా నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించగా.. ఆ పార్టీలో ఇటీవలే చేరిన డాక్టర్ విజయను అభ్యర్థిగా ప్రకటించాలని నిర్ణయించింది. అధికారికంగా ఆమె పేరును బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. ఇక జిల్లాలో కీలక స్థానంగా ఉన్న పాలేరులో పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించకపోవడంతో ఈ సీటుపై ఏర్పడిన ఉత్కంఠ ఇంకా తొలగలేదు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీపడిన ఆశావహులకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీకి ఈ సీటు కేటాయించడం ఎంతమాత్రం సమంజసం కాదని పలువురు కాంగ్రెస్ నాయకులు తమ వాదనలను ఇటు హైదరాబాద్‌లోనూ.. అటు ఢిల్లీలోనూ మంగళవారం సైతం వినిపించే ప్రయత్నం చేశారు. ఖమ్మం టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పార్టీ నాయకుడు మానుకొండ రాధాకిషోర్ చివరి నిమిషం వరకు ఖమ్మం స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించాలని ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసినా.. పార్టీ మాత్రం టీడీపీకే ఇవ్వడానికి మొగ్గు చూపినట్లు సమాచారం. ఇక నామా అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌లోని పలు వర్గాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, శాసన మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అనుచరులు మంగళవారం ఖమ్మంలో సమావేశమై అనేక ఏళ్లుగా పార్టీలో పనిచేస్తూ.. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న పొంగులేటికి టికెట్ ఇవ్వకపోవడం సమంజసం కాదని, ఈ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని కోరారు. పార్టీ ఆదేశాలను జవదాటకుండా పనిచేస్తున్న సుధాకర్‌రెడ్డికి ఖమ్మం టికెట్ కేటాయించే విషయంపై పార్టీ ఆలోచించాలని వారు కోరారు. ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన వద్దిరాజు రవిచంద్రకు టికెట్ లభించకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర నిర్వేదంలో ఉన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఎలా స్పందించాలనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో రవిచంద్ర అనుచరులతో సమావేశం అవుతారని ప్రచారం జరుగుతుండగా.. టికెట్ ఆశించిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు సామాజిక సమతూకం పాటించలేదన్న భావనను పార్టీ అంతర్గత సమావేశాల్లో వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వైరాలో అసమ్మతి సెగలు.. ఇక వైరా నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌లో అస మ్మతి సెగలు రాజుకుంటున్నాయి. ఈ సీటును గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్–సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించగా.. మళ్లీ సీపీఐకే కేటాయించడంపై ఆ నియోజకవర్గంలోని కాంగ్రె‹ Ü శ్రేణులు, నేతలు పలువురు భగ్గుమంటున్నారు. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ పోలీస్ అధికారి రాములునాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు ఒత్తిడి తెస్తు న్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పాలేరులో కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఖరారు చేస్తుందనే అంశం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. పాలేరు అభ్యర్థి గా కందాల ఉపేందర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైం దని ప్రచారం జరుగుతున్నా.. ఈ సీటుపై మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పట్టు వీడకపోవడం తో దీనిని కాంగ్రెస్ పార్టీ పెండింగ్‌లో పెట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మహాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థులుగా ఖరారైన నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య ఒకటి, రెండు రోజుల్లో నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మధిర అభ్యర్థిగా అధికారికంగా ఖరారు కావడంతో రెండు, మూడురోజుల్లో ఆయన సైతం నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ కీలక నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచం ద్రకు సమీప జిల్లా అయిన వరంగల్‌లో సీటు సర్దుబాటు చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో ఆయన అనుచరవర్గం వేచిచూసే ధోరణి అవలంబిస్తోంది. ఖమ్మం నుంచి మహాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న నామా నాగేశ్వరరావు బుధవారం జిల్లాకు చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీశ్రేణులు భారీ ఏర్పాట్లు చేసుకుం టున్నాయి. పార్టీ తన పేరు ఖమ్మం నియోజకవర్గానికి అధికారికంగా ఖరారు చేసేంత వరకు తన అంతరంగాన్ని వెలిబుచ్చకుండా వేచిచూసే ధోరణి అవలంబించిన నామా.. నియోజకవర్గంపై పూర్తిస్థాయి దృష్టి సారించేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సీట్ల కేటాయింపుపై కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి సైతం కొంత అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ సామాజిక వర్గానికి ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు కూడా లభించకపోవడం, జిల్లాలో పలు స్థానాల అభ్యర్థులను ఎంపిక చేయడంలో సరైన రీతిలో వ్యవహరించలేదని తనను కలిసిన జిల్లా నేతలతో అభిప్రాయపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి జిల్లాలో టీడీపీ అశ్వారావుపేట నియోజకవర్గంలో.. కాంగ్రెస్ కొత్తగూడెం నియోజకవర్గంలో.. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను ప్రకటించింది. కేవలం ఇల్లెందులో కాంగ్రెస్ ఆశావహుల మధ్య అత్యంత పోటీ నెలకొనడంతో టికెట్ ఎవరికి ఖరారు చేయాలనే అంశంపై ఎటూ తేల్చుకోలేక పెండింగ్‌లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం నియోజకవర్గ మహాకూటమి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు 15 లేదా 19వ తేదీన నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెండింగ్‌లో ఉన్న పాలేరు అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీ బుధవారం నాటికి ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎదుర్కొనే దీటైన వ్యక్తి కోసం కాంగ్రెస్ అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. ఇందుకోసమే సీటును పెండింగ్‌లో పెట్టార ని పుకార్లు షికార్లు చేస్తున్నా.. ఈ సీటు కందాల ఉపేందర్‌రెడ్డికే దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. -
మొక్కజొన్న‘పొత్తులు’
ఎలక్షన్ పొత్తులకు మొక్కజొన్న పొత్తులకు సామ్యం ఉంది. మొక్కజొన్న పొత్తును అర్థం చేసుకుంటే ఎన్నికల పొత్తుల ఎత్తులూ జిత్తులూ కసరత్తుల గురించీ అర్థమవుతుంది. మొదట మొక్కజొన్న పొత్తు తీరు... ఆ గింజల విన్యాసాన్ని ఒకసారి చూద్దాం. మొక్కజొన్న కండెపై మంచి ఆకర్షణీయమైన రంగులో గింజలు పేర్చినట్టుంటాయి. కానీ కండె చివర సన్నటి భాగంలో మాత్రం గింజలు చిన్నవిగానూ, దూరంగా చెదిరినట్టుగానూ ఉంటాయి. తినడానికి అంత అనువుగా ఉండవు. కొన్ని నియోజకవర్గాలూ అంతే. కొందరికి అంతగా ప్రాధాన్యం లేనివిగా అనిపిస్తాయి. గెలుపునకు అనువుగా అనిపించవు. కొంతమంది అభ్యర్థులకు ఆ స్థానాల్లో షూర్ విన్ ఛాన్సెస్ ఉండకపోవచ్చంటూ అంచనాలుంటాయి. అనుమానాలుంటాయి. విశ్లేషణలుంటాయి. దాంతో వివాదాలొస్తాయి. ఇప్పుడు మళ్లీ మొక్కజొన్నపొత్తులోని మధ్యలో ఉండే గింజలను చూద్దాం. అక్కడవి చాలా ఆకర్షణీయంగా, దట్టంగా ఉంటాయి. తినడానికి అనువుగానూ ఉంటాయి. వీటిని నియోజకవర్గాలకు అన్వయిస్తే అవి గెలుపునకు కేక్వాక్ స్థానాలనుకోవచ్చు. ఒకే కండెను ముగ్గురు పంచుకొని తినాలనుకోండి. వాటాల దగ్గర గొడవలైపోతుంటాయి. కండెలోని మొదలు భాగం లేదా చివర ఉండే సన్నటి భాగం మాకొద్దంటే మాకొద్దంటూ భాగస్వాములు అంటారు. మంచిగా ఉన్న మధ్యభాగమే కావాలని పట్టుబడతారు. ఏతావాతా తేలేదేమంటే ఎలక్షన్ పొత్తయినా, మొక్కజొన్న పొత్తయినా భాగస్వాముల మధ్య తగాదాలు తప్పవన్నమాట. కొంత ఘర్షణ తర్వాత భాగస్వాముల బలాన్ని బట్టి ఎవరికి దక్కాల్సింది వారికి దక్కుతుంది. కానీ ఒక్కోసారి వాటాలన్నీ పూర్తయిపోయాక్కూడా తమకు దక్కింది గింజల్లేని తెల్లటి కండేనని కొందరికి అనిపించవచ్చు. దాంతో ఎంతటి ఉత్తములకైనా తాము మోసపోయామనే ఉడుకుమోత్తనం రావచ్చు. ఇలాంటప్పుడు ఎదుటివాడికి చేతికందిన దాన్ని నోటికి అందకుండా ప్రయత్నాలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితే పొత్తుమిత్రుల మధ్య వస్తే.. అప్పుడు ఎంతటి మిత్రులైనా సదరు నియోజకవర్గంలో పోటీకి ఎదురెదురు నిలబడతారు. ఇదేమిటని ఎవరైనా అంటే ఇది ‘స్నేహపూర్వక పోటీ’ అనో మరొకటనో అంటారు. ఇది పొత్తుల గురించి ఒక అనుభవశాలి ఉవాచ. ‘పొత్తు’ అని పేరుపెట్టుకున్నందుకు మొక్కజొన్న కండెలో ఇంతటి ఎన్నికల విజ్ఞానం దాగుందా అని ఒకాయన ఆశ్చర్యపోయాడట. -
2019లో గద్దెనెక్కాలంటే దోస్తీ కట్టాల్సిందే!
దేశంలో సుదీర్ఘకాలం అధికారం చలాయించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏంటి? కేంద్రంలోనూ.. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయి బక్కచిక్కిన హస్తం పార్టీకి మళ్లీ పూర్వవైభవం సాధ్యమేనా? రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తులుగా ఎదిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగించాలంటే ఆయా ప్రాంతీయ పార్టీల పంచన చేరాల్సిందేనా? ఇటీవల జరిగిన అనేక ఉపఎన్నికల్లో కమలం పార్టీ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. బీజేపీపై మిత్రుల అసంతృప్తి ఒకవైపు.. బీజేపీయేతర పార్టీలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థులను నిలబెడుతుండటం మరోవైపు.. ఈ పరిస్థితుల్లో బీజేపీ భవిష్యత్తు ఏమిటి? మొత్తంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గరకొచ్చేవేళ.. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ‘సమర్థ్ సంపర్క్’పేరుతో మేధావి వర్గాన్ని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెడితే.. నిన్న మొన్నటి వరకూ ఉప్పునిప్పులా ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యే పని మొదలుపెట్టాయి. కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు 14 పార్టీలకు చెందిన సీఎంలు, నేతలు చేయి చేయి కలపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఫలితాలు ఎలా ఉండవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆరు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ! రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే అధికారం మారుతోంది. ఈ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పక్షాలు ఉన్నా వాటికి దక్కే అసెంబ్లీ సీట్లు నామమాత్రమే. బీఎస్పీకి గతంలో ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు బలముండేది. కానీ ఇటీవల పరిస్థితి మారింది. ఈ ఆరు రాష్ట్రాల్లో మొత్తం 101 లోక్‌సభ స్థానాలుంటే అందులో రెండే స్థానాలున్న గోవాలోనే ప్రాంతీయపక్షాలకు కొంతబలం ఉంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాది డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయావకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఇటీవలే పూర్తయిన రెండు సర్వేలు స్పష్టం చేశాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీఎస్పీకి ఒకప్పుడు ఒక మోస్తరు బలం ఉండేదిగానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పైగా హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్, బీఎస్పీ పొత్తు పెట్టుకున్నా బీజేపీకి పెద్దగా నష్టం లేదని 2014 ఎన్నికల్లో ఆ పార్టీలకు పోలైన ఓట్లు సూచిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఈ రెండు పార్టీల పొత్తుతో బీజేపీకి రెండు లోక్‌సభ స్థానాల నష్టం జరగవచ్చని అంచనా. మధ్యప్రదేశ్‌లో మాత్రం బీజేపీ నాలుగు సీట్లు కోల్పోయే అవకాశముంది. దక్షిణాదిన కర్ణాటకలోనే పొత్తుకు అవకాశం! కేరళలోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఏ ఎన్నికల్లోనూ వామపక్షాలు, కాంగ్రెస్ చేతులు కలపడానికి ఆస్కారం లేదు. సంఘ్ పరివార్ పెద్ద ఆరెస్సెస్ దన్నుతో బీజేపీ విస్తరిస్తున్నా ఒంటరిపోరులో ఒక్క లోక్‌సభ సీటు కూడా దానికి దక్కే అవకాశాలులేవు. గత సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం లబ్ధి పొందింది. ఆ పార్టీ ఇటీవల కాషాయపక్షంతో తెగదెంపులు చేసుకుని కేంద్రంలోని ఎన్డీఏ నుంచి వైదొలిగింది. తెలంగాణలో పాలకపక్షం టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ వ్యతిరేకమే. బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక ఫెడరల్ ఫ్రంట్కే ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకూలం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ దాదాపుగా అస్థిత్వం కోల్పోయింది. తమిళనాడులో సినీనటులు రజనీకాంత్, కమల్‌హాసన్ పార్టీలు, పాలక ఏఐఏడీఎంకే ఎవరితో పొత్తు పెట్టుకుంటాయో తెలియనిస్థితి. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యం నామమాత్రమే. డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు కొనసాగవచ్చు. పుదుచ్చేరితో కలిపి 130 లోక్‌సభ సీట్లున్న దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలోనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు వీలుంది. ఒడిశా, బెంగాల్లో నామమాత్ర ప్రభావం ప్రాంతీయ పక్షమైన బిజూ జనతాదళ్(బీజేడీ) 18 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఒడిశాలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. ఆరంభంలో బీజేపీతో చేతులు కలిపిన బీజేడీ నేత నవీన్ పట్నాయక్ 2009లో దానితో తెగదెంపులు చేసుకున్నారు. తర్వాత బీజేపీ బలహీనపడి 2014లో ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. కాంగ్రెస్ ఖాతాయే తెరవలేదు. అయితే ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేడీ తర్వాత స్థానం బీజేపీ సంపాదించింది. కానీ, టీఆర్ఎస్ మాదిరిగానే బీజేడీ కూడా కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ సమాన దూరంలో ఉన్నట్టు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యవహారశైలి సీపీఎం నాయకత్వంలోని వామపక్షాలు తృణమూల్‌తో జతకట్టడానికి అనుకూలంగా లేవు. మొత్తం 63 సీట్లున్న ఈ తూర్పు రాష్ట్రాల్లో కూడా బీజేపీ వ్యతిరేక మహా కూటమి ఏర్పడినా కాంగ్రెస్‌కు లభించే ప్రయోజనం అంతంత మాత్రమే. ఈశాన్యంలో అస్సాం, త్రిపురలోనే చాన్స్! 24 లోక్‌సభ సీట్లున్న ఈశాన్యంలో అస్సాం(14), త్రిపుర(2)లోనే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు అవకాశాలున్నాయి. అస్సాంలో 2014లో మోదీ ప్రభంజనంతో ఏడు లోక్‌సభ సీట్లు సంపాదించిన బీజేపీ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఏజీపీ, బీపీఎఫ్‌తో కలసి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఈ రెండు ఎన్నికల్లోనూ బాగా దెబ్బతింది. ముస్లింల పార్టీగా అవతరించిన ఏఐయూడీఎఫ్ విడిగా పోటీ చేయడంతో బీజేపీ బాగా లబ్ధి పొందింది. ఈసారి బీజేపీ కూటమిని ఓడించాలంటే ఏఐయూడీఎఫ్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకతప్పదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 36.5, కాంగ్రెస్‌కు 29.6, ఏఐయూడీఎఫ్‌కు 15 శాతం ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన ఏఐయూడీఎఫ్‌తో కాంగ్రెస్ జతకడితే అత్యధిక సీట్లు సాధించే వీలుంది. వామపక్షాల కంచుకోట త్రిపురలో ఓ ఆదివాసీ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 51.6, వామపక్ష కూటమికి 46.7, కాంగ్రెస్‌కు 1.8 శాతం ఓట్లు లభించాయి. ఇదే తరహాలో లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీలకు ఓట్లు దక్కే పక్షంలో కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. యూపీలో కొంత ప్రయోజనం.. బిహార్‌లో అనుమానం మొత్తం 120 లోక్‌సభ సీట్లున్న ప్రధాన హిందీ రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌లో ఒక్క యూపీలోనే బీజేపీయేతర పార్టీలు ఎస్పీ, బీఎస్పీ, మరో చిన్న ప్రాంతీయపక్షం ఆర్ఎల్డీ కలసి బక్కచిక్కిపోయిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ విషయం గోరఖ్‌పూర్, ఫూల్పుర్ ఉపఎన్నికలు నిరూపించాయి. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి 41.3, ఎస్పీ 28, బీఎస్పీ 22, కాంగ్రెస్ 6 శాతం ఓట్లు సాధించాయి. అంటే బీజేపీయేతర పార్టీల ఓట్లు 56 శాతం దాటిపోయాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఈ పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను నిలిపితే మూడొంతుల సీట్లు కైవసం చేసుకోవచ్చు. బిహార్‌లో మూడేళ్ల తర్వాత బీజేపీతో చేతులు కలిపిన జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వచ్చే ఎన్నికల్లో తన సంకీర్ణ మిత్రపక్షాలైన బీజేపీ, ఎల్జేపీ, ఆర్ఎలెస్పీతో కలసి పోటీచేస్తే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించవచ్చని ఇటీవలి సర్వేలు చెబుతున్నాయి. 14 సీట్లున్న పొరుగు రాష్ట్రం జార్ఖండ్‌లో పాలక కూటమి బీజేపీ–ఏజేఎస్యూపై కాంగ్రెస్, జేఎంఎం ఇతర చిన్న పార్టీలు కలిసి పోటీ చేస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, కశ్మీర్లో.. బీజేపీ సర్కారు అధికారంలో ఉన్న హరియాణాలో ప్రధాన ప్రతిపక్షం ఐఎన్ఎల్డీ, కాంగ్రెస్, ఆరెల్డీ కలసి పోటీ చేస్తే బీజేపీకన్నా ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవచ్చు. ఢిల్లీలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా పాలకపక్షమైన ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ తదితర కమలం వ్యతిరేక పార్టీలు చేతులు కలిపితే అత్యధిక సీట్లు గెలిచే వీలుందని అంచనా. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 46.4, ఆప్ 32.9, కాంగ్రెస్ 15.1 శాతం ఓట్లు సంపాదించాయి. ఆప్, కాంగ్రెస్ ఓట్లు కలిస్తే బీజేపీని ఓడించవచ్చని ఓట్ల వివరాలు సూచిస్తున్నాయి. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(38.5), ఆప్(23.7)కు పడిన ఓట్లు దాదాపు 60 శాతం. ఈ రెండు పార్టీలూ బీఎస్పీతో కలసి పోటీ చేస్తే అకాలీదళ్–బీజేపీ కూటమిని ఒకట్రెండు సీట్లకే పరిమితం చేయవచ్చు. పీడీపీ–బీజేపీ సంకీర్ణ సర్కారు పాలన సాగుతున్న జమ్మూకశ్మీర్‌లో ఇప్పటి మాదిరిగానే రెండు జాతీయ పక్షాలతో రెండు ప్రాంతీయ పార్టీల పొత్తు కొనసాగితే ఫలితాల్లో చెప్పుకోదగ్గ మార్పులుండకపోవచ్చు. కలసి పోటీచేస్తే గెలుపు ఖాయం కాదు.. బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ ఎలాంటి సైద్ధాంతిక సారూప్యం లేకుండా లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీచేస్తే గెలుపు సాధ్యం కాదని పాత అనుభవాలు చెబుతున్నాయి. గతంలో వివిధ పార్టీలు సాధించిన ఓట్లను కూడికలు, తీసివేతలతో కొత్త లేక్కలేసి రాబోయే ఎన్నికల ఫలితాలను అంచనావేయడం సరికాదని ఎన్నికల విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఎలాంటి ఉమ్మడి కార్యాచరణ లేకుండా క్షేత్ర స్థాయి పరిస్థితులతో పనిలేకుండా వివిధ పార్టీలు పెట్టుకునే పొత్తులు పనిచేయవని కూడా కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాలకపక్షంగా కొనసాగిన కాలం నాటి ఎన్నికలు నిరూపించాయి. మిత్రపక్షాలను సంప్రదించాలంటున్న జేడీయూ, లోక్‌జనశక్తి బిహార్ సంకీర్ణ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పార్టీ జేడీయూ జోకీహాట్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఓడిపోవడంతో బీజేపీపై ఆ పార్టీ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ఇంధన ధరలు పెరగడం, కీలక విషయాల్లో బీజేపీ నేతలు ఎన్డీఏ మిత్రపక్షాలతో సంప్రదించకపోవడాన్ని నితీశ్, జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి తప్పుబట్టారు. బిహార్‌కు చెందిన మరో ఎన్డీఏ భాగస్వామి లోక్‌జనశక్తి కూడా మిత్రపక్షాలను బీజేపీ పట్టించుకోవాలని, ఆధిపత్య ధోరణి విడనాడాలని చెబుతోంది. ఇదే రాష్ట్రానికి పరిమితమైన మరో చిన్న భాగస్వామి రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ నేత, కేంద్రమంత్రి ఉపేంద్ర కాష్వాహా కూడా ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడానికి బీజేపీ నాయకత్వం మిత్రులతో చర్చించి విధానాలు రూపొందించాలని, పెద్దన్నలా వ్యవహరించడం మానుకోవాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మిత్రపక్షం తెలుగుదేశం ఇటీవల ఎన్డీఏ నుంచి బయటపడింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమనేలా వ్యవహరిస్తోంది. మొదట్నించీ కాంగ్రెస్, బీజేపీలను సమానంగా వ్యతిరేకించిన ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి వెనకాడననే రీతిలో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్.. 2014 పార్లమెంటు ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను ఓడించడం అలవాటుగా మారింది. లోక్‌సభలో 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌ను మరింత బలహీనం చేయడానికి మోదీ–షా ద్వయం ప్రతి ఎన్నికల్లోనూ ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అనే నినాదాన్ని తెర మీదకు తెచ్చింది. ఈ క్రమంలో ప్రతిపక్షాలులేని దేశంగా మార్చడానికి ఈ అగ్రనేతలిద్దరూ ప్రయత్నిస్తున్నారని గ్రహించిన కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు ఏకం కావడం కిందటేడాదే మొదలైంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్ పొత్తు పనిచేయలేదు. ఈ ఏడాది యూపీలోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ ఉపఎన్నికల్లో ఎస్పీకి బీఎస్పీ మద్దతు పలకడం, బీజేపీని ఓడించడంతో ప్రతిపక్షాల ఐక్యతకు ప్రాచుర్యం లభించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయేతర ప్రతిపక్షాల మధ్య పొత్తు ప్రయత్నాలు ఫలించలేదు. మళ్లీ యూపీ ఉపఎన్నికల్లో(కైరానా, నూర్పూర్) ప్రతిపక్షాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని నిలిపి విజయం సాధించడంతో బీజేపీకి కొత్త సవాల్ ఎదురైంది. ప్రతిపక్షాల మధ్య అనైక్యతను నాలుగేళ్లగా ఉపయోగించుకున్న కాషాయ పక్ష నేతలు తమ దూకుడుతో ప్రతిపక్షాల మధ్య కొత్త ఐక్యతకు పరోక్షంగా కారకులయ్యారు. ఫలితంగా ఒకవైపు ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తిని, మరోవైపు ప్రతిపక్షాల మధ్య రోజురోజుకు వెల్లివిరుస్తున్న ఐకమత్యాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు బీజేపీ నాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకత్వాన ప్రతిపక్షాలు ఏకమవ్వడానికి ఇంకా ఏడాది సమయం ఉండడం కూడా కమలం నేతలను అలజడికి గురిచేస్తోంది. పడిపోతున్న బీజేపీ ఓట్ల శాతం కిందటి లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఉత్తర్‌ప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఏడు లోక్‌సభ సీట్లు కోల్పోవడమేగాక దాని ఓట్ల శాతం కూడా ఆందోళన కలిగించే రీతిలో పడిపోయింది. అంతకుముందు బీజేపీ గెలుచుకున్న నాలుగు పార్లమెంటు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రెండు సీట్లను ఎస్పీ, ఒక సీటును ఆర్ఎల్డీ కైవసం చేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో 2014లో బీజేపీకి లభించిన 51.4 శాతం ఓట్లు మరుసటి ఏడాది ఉపఎన్నికలో పది శాతం తగ్గి 40.8 శాతానికి పడిపోయాయి. పంజాబ్‌లో కిందటేడాది జరిగిన గురుదాస్‌పూర్ లోక్‌సభ ఉపఎన్నికలో కూడా బీజేపీ ఓడిపోవడమేగాక పది శాతం తక్కువ ఓట్లు సంపాదించింది. రాజస్తాన్‌లోని ఆల్వార్, అజ్మేర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో కూడా బీజేపీకి ఓటమితోపాటు ఓట్ల శాతం తగ్గిపోయింది. ఈ ఏడాది యూపీలోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ ఉపఎన్నికల్లోనూ బీజేపీ ఓట్లు వరుసగా 5.2, 13.6 శాతం చొప్పున తగ్గిపోయాయి. ఈ రెండు సీట్లు ౖకైవసం చేసుకున్న ఎస్పీ రెండుచోట్లా తన ఓట్ల శాతాన్ని పాతికకు పైగానే పెంచుకోగలగడం బీజేపీకి ఆందోళన కలిగించే అంశం. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 13 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎనిమిది సీట్లు కోల్పోయింది. కశ్మీర్లో సంకీర్ణ భాగస్వామి పీడీపీ ఒక సీటు పోగొట్టుకుంది. గళమెత్తుతున్న భాగస్వాములు! ఇటీవల నాలుగు లోక్‌సభ, పది అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల కారణంగా కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ఎన్డీఏలో బీజేపీపై మిత్రపక్షాల నుంచే బాహాటంగా విమర్శలు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికలు ఏడాదిలోపే ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాలకు ఇంటాబయటా మున్నెన్నడూ లేని ఇబ్బందికర పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తోంది. రెండుమూడేళ్లుగా దేశంలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ప్రగతి బాటలో లేదనే భావనతోపాటు ఇటీవల పెట్రో ధరలు అడ్డగోలుగా పెరగడంతో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలతోపాటు ఎన్డీఏ మిత్రులు జతకలవడం బీజేపీని రాజకీయ సంక్షోభం దిశగా నడిపిస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే తర్వాతి ఉపఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోవడం కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతోంది. రెండేళ్ల క్రితమే బీజేపీకి మానసికంగా దూరమైన ప్రధాన భాగస్వామ్య పక్షం శివసేన భవిష్యత్తు ఎన్నికల్లో కమలం పార్టీతో పొత్తు ఉండదని ప్రకటించింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఈసీ తోడ్పాటుతో, రిగింగ్ చేసి బీజేపీ గెలిచిందనే వరకూ ఈ పార్టీ నేత ఉద్ధవ్ ఠాక్రే వెళ్లారు. అయితే, అమిత్‌షా మిత్రపక్షాలను బుజ్జగించే పని వెంటనే ప్రారంభించారు. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రేతో ముంబైలో భేటీ అయ్యారు. మరో వైపు అకాలీదళ్ డిమాండ్లను తీర్చడం ప్రారంభించారు. బిహార్‌లోనూ సంకీర్ణ మిత్రపక్షాలతో విభేదాలు తొలగించుకోవడానికి బీజేపీ నాయకత్వం పట్నాలో సమావేశం జరిపింది. - కథనాలు సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తెలంగాణలో పొత్తులుంటాయి
-
తెలంగాణలో పొత్తులుంటాయి : చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అవసరమైతే తమ పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని.. అయితే ఆ పొత్తు ఏ పార్టీతో అన్నది సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం ఎన్.చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సుదీర్ఘ విరామం అనంతరం బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఉంటుందని, కొందరు నేతలు పార్టీని వీడినా నష్టం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ పార్టీ నేతలు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ఓ నేత మాట్లాడుతూ.. తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలనే ప్రతిపాదనను మానుకోవాలని, లేదంటే తాము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. దానిపై స్పందించిన చంద్రబాబు.. ఇతర పార్టీలో టీడీపీ విలీనమన్న ప్రసక్తే ఉండదని, అలా చేసే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. అదే సమయంలో టీఆర్ఎస్తో పొత్తు కూడా వద్దని కొందరు కార్యకర్తలు నినాదాలు చేయగా.. చంద్రబాబు ఈ విషయంలో స్పందించలేదని తెలుస్తోంది. ఇక సమావేశంలో మరికొందరు నేతలు, కార్యకర్తలు.. రాష్ట్ర టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు, లేదంటే లోకేశ్‌కు ఇవ్వాలని నినాదాలు చేశారు. దీనికి స్పందించిన సీఎం.. జూనియర్ ఎన్టీఆర్, లోకేశ్‌లు కాదని, తమ కాళ్ల మీద తాము నిలబడాలని సూచించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అరవింద్‌కుమార్‌గౌడ్, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా గురువారం ఉదయం తెలంగాణకు చెందిన టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు తన నివాసంలో మరోసారి భేటీ కానున్నారు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్తో పొత్తుండదు
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలయిన కాంగ్రెస్, టీఆర్ఎస్లలో ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. గత 25 ఏళ్లుగా పలు రాజకీయ పక్షాలతో పొత్తులు పెట్టుకున్న తాము రాజకీయంగా బలహీనపడ్డామని, ఈ పరిస్థితుల్లో వామపక్ష ప్రజాతంత్ర ఫ్రంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు. బుధవారం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కాకుండా, ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ద్వారా ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రజల్లోకి తీసుకెళ్తామని, అందులో భాగంగానే 28 రాజకీయ పక్షాలతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ ప్రజలు బాగుపడాలంటే ఈ రెండు పార్టీలతో సాధ్యం కాదని, అందుకే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. సీపీఐ కూడా తమతో కలసి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కోదండరాం పెట్టే పార్టీ విధానాలు తమకు నచ్చితే కలుపుకుపోతామని చెప్పారు. 20, 25 తేదీల్లో బీఎల్ఎఫ్ భేటీలు ఈనెల 20న ఉమ్మడి మెదక్ జిల్లా బీఎల్ఎఫ్ సదస్సును సంగారెడ్డిలో, 25న ఉమ్మడి పాలమూరు జిల్లా సదస్సు మహబూబ్‌నగర్‌లో నిర్వహిస్తున్నామని తమ్మినేని చెప్పారు. ఈ సదస్సుల్లో బీఎల్ఎఫ్ భాగస్వామ్య పక్షాల సభ్యులే కాకుండా స్వతంత్రులు, రాబోయే ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న వారెవరు వచ్చినా స్వాగతిస్తామని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో అన్యాయం.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కేసీఆర్ ఈ విషయంలో కనీస ఆగ్రహాన్ని కూడా వెలిబుచ్చలేదని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, బి.వెంకట్, టి.జ్యోతిలు పాల్గొన్నారు. -
రజనీ కాషాయమైతే పొత్తు నో
కేంబ్రిడ్జ్ (మసాచుసెట్స్): సూపర్‌స్టార్ రజనీకాంత్ కాషాయ(బీజేపీ) రాజకీయాలు చేస్తే ఆయనతో ఎటువంటి రాజకీయ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ప్రకటించారు. తాము రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇటీవల రజనీకాంత్, కమల్‌హాసన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన యాన్యువల్ ఇండియన్ కాన్ఫరెన్స్‌లో కమల్‌హాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన స్పందించారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. తమ ఆలోచనలు, మేనిఫెస్టోలో ఏకాభిప్రాయం ఉంటే రజనీకాంత్‌తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే తమ మధ్య ప్రస్తుతం ఉన్న వ్యత్యాసం మతం.. కాషాయం మాత్రమే అని చెప్పారు. అవసరమైతే ఎవరితోనైనా చేయి కలిపేందుకు సిద్ధమని చెప్పారు. ఎన్నికల ముందు ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అనే ప్రశ్నకు లేదని సమాధానం చెప్పారు. ఎవరికీ మెజారిటీ రాకుండా ప్రజలు తీర్పు ఇస్తే.. తాను ప్రతిపక్షంలోనే కూర్చుంటానని, తర్వాత ఎన్నికల కోసం సిద్ధమవుతానని స్పష్టం చేశారు. తమిళనాడులోని అన్ని జిల్లాల్లోనూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోనున్నట్లు కమల్ వెల్లడించారు. కాగా, ఈ నెల 21న కమల్ హాసన్ ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.