చైనా అధినేత షీ జిన్‌పింగ్ వెల్లడి
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు
బీజింగ్: ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవడానికి త్వరలోనే రాజకీయ పరిష్కారం కనుగొంటామని చైనా అధినేత షీ జిన్‌పింగ్ సంకేతాలిచ్చారు. ఐరోపా ఖండంలో శాంతి, స్థిరత్వం తిరిగి నెలకొంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. గురువారం చైనా రాజధాని బీజింగ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు.
చైనా–రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాలను దెబ్బతీసేందుకు అమెరికా చేసే ప్రయత్నాలను సహించకూడదని, గట్టిగా ఎదిరించాలని నిర్ణయానికొచ్చారు. తమ రెండు దేశాల సంబంధాల్లో కలుగజేసుకోవద్దని అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఉయదం రష్యా నుంచి చైనాకు చేరుకున్న పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది.
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పుతిన్ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. చర్చల అనంతరం జిన్‌పింగ్, పుతిన్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి త్వరగా తెరపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చైనా–రష్యా సంబంధాలను మూడోదేశం ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. అలా ప్రభావితం చేసేందుకు సాగే ప్రయత్నాలను అడ్డుకుంటామని వెల్లడించారు.
తమ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని స్పష్టం చేశారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలం కంటే ఇప్పుడు తమ బంధం ఇంకా దృఢమవుతోందని పేర్కొన్నారు. తమ చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను కచి్చతంగా కాపాడుకుంటామని తేలి్చచెప్పారు. అణు ఇంధనం నుంచి ఆహార సరఫరా దాకా భిన్న రంగాల్లో చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని పుతిన్ వెల్లడించారు.
రష్యాలో చైనా కార్ల తయారీకి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నందుకు చైనాకు పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చైనా–రష్యా మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఒకఒప్పందంపై జిన్‌పింగ్, పుతిన్ సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఇరుదేశాల అధికారుల మధ్య విస్తృత స్థాయి చర్చల తర్వాత 30 పేజీల ఈ ఒప్పందం డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్లు రష్యా ప్రతినిధి యూరి ఉషకోవ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment