
వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేలా రష్యాను ఒప్పించడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మంగళవారం మంతనాలు జరపనున్నారు. నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అగ్రరాజ్యం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కీలక పరిణామమని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. దీంతోబాటే సమకాలీన పరిస్థితులకు తగ్గట్లు అమెరికా విదేశాంగ విధానాలకు మార్చే సదవకాశం ట్రంప్‌కు దక్కనుంది.
‘‘ గత వారం రోజులుగా ఇందుకోసం ఎంతో కసరత్తు చేశాం. యుద్ధాన్ని ఎంత త్వరగా ముగింపు పలకగలమో ఈ చర్చల ద్వారా తెలుస్తుంది’’ అని ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో వస్తూ మీడియాతో ట్రంప్ చెప్పారు. ట్రంప్‌తో పుతిన్ చర్చించబోతున్నట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సోమవారం ధ్రువీకరించారు. అయితే ఇరుదేశాల అగ్రనేతల మధ్య ఎలాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయనే వివరాలను పెస్కోవ్ పేర్కొనలేదు.
Comments
Please login to add a commentAdd a comment