disscussions
-
నేడు పుతిన్, ట్రంప్ చర్చలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేలా రష్యాను ఒప్పించడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మంగళవారం మంతనాలు జరపనున్నారు. నెలల తరబడి కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అగ్రరాజ్యం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కీలక పరిణామమని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. దీంతోబాటే సమకాలీన పరిస్థితులకు తగ్గట్లు అమెరికా విదేశాంగ విధానాలకు మార్చే సదవకాశం ట్రంప్‌కు దక్కనుంది. ‘‘ గత వారం రోజులుగా ఇందుకోసం ఎంతో కసరత్తు చేశాం. యుద్ధాన్ని ఎంత త్వరగా ముగింపు పలకగలమో ఈ చర్చల ద్వారా తెలుస్తుంది’’ అని ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో వస్తూ మీడియాతో ట్రంప్ చెప్పారు. ట్రంప్‌తో పుతిన్ చర్చించబోతున్నట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ సోమవారం ధ్రువీకరించారు. అయితే ఇరుదేశాల అగ్రనేతల మధ్య ఎలాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయనే వివరాలను పెస్కోవ్ పేర్కొనలేదు. -
ఆగస్టు 17 నుంచి 23 వరకు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ర్యాలీలు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో మెహంగై చౌపాల్(ధరల పెరుగుదల పై చర్చలు) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 17 నుంచి 23 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండీలు, రిటైల్ మార్కెట్లు వంటి తదితర ప్రదేశాల్లో ధరల పెరుగుదల పై ర్యాలీలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ తెలిపారు. ఈ నిరసన ర్యాలీలు ఆగస్టు 28న ఢిల్లీలోని రాంలీలా గ్రౌండ్స్‌లో సీనియర్ నాయకులు ధరలపై నోరెత్తండి అనే ప్రసంగంతో ముగిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేరకంగా ఆగస్టు 5న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు ప్రజల్లో బలంగా వెళ్లి ప్రతి ధ్వనించాయని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చట్టబద్ధమైన నిరసనను చేతబడి లేదా క్షద్ర శక్షులుగా చిత్రకరించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తమ ప్రభుత్వ వైఫల్యాల విషయమైన మోదీలో కలుగుతున్న అభద్రత భావాన్ని తేటతెల్లం చేస్తోందంటూ... ఆరోపణలు చేశారు. రానున్న వారాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం పై వరుస నిరసనలతో కాంగ్రెస్ ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. మెదీ చేస్తున్న ఆర్థిక దుర్వినియోగాన్ని కూడా బయట పెడతామని అన్నారు. ఈ మేరకు పెరుగు, మజ్జిగ , ఫ్యాకేజ్డ్ ఆహారధాన్యాల వంటి నిత్యావసర వస్తువుల పై అధిక పన్నుల విధించడం వల్ల ద్రవ్యోల్బణం తీవ్రమవుతోందన్నారు. అంతేకాదు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం, అగ్నిపథ్ వంటి తప్పుదారి పట్టించే పథకాలను ప్రవేశపెట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని జై రాం రమేష్ అన్నారు. (చదవండి: ఈ ఫుడ్‌ని జంతువులు కూడా తినవు ... కానిస్టేబుల్ ఒకటే ఏడుపు) -
పరిశోధనలపై లోతైన చర్చలు
రెండో రోజూ కొనసాగిన బయో ఆసియా-2015 సదస్సు హైదరాబాద్: జీవశాస్త్ర పరిశోధనలపై బయో ఆసియా-2015 సదస్సు రెండో రోజున ప్రతినిధులు లోతైన చర్చలు సాగించారు. మంగళవారం జరిగిన ఈ సదస్సుకు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పలు దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చించారు. ఔషధాలు, నూతన వ్యాక్సిన్లు, డ్రగ్స్, బయోటెక్నాలజీ వంటి వైద్య సంబంధిత అంశాలపై నిపుణులు ప్రసంగించారు. అలాగే భారత్‌లో ఔషధ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సదస్సు నిర్ణయించింది. చౌక ధరల్లో ఔషధాలను తీసుకురావాలని, వివిధ వ్యాధులకు ఔషధ ప్రయోగాలు చేపట్టాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు. నిపుణులకు అవార్డులు: ఔషధ రంగంలో కృషి చేసిన పలువురికి మంత్రి జూపల్లి అవార్డులు అందజేశారు. యూకేకు చెందిన విలియమ్ హార్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ మార్క్ కాల్ఫీల్డ్ ‘జీనోం వ్యాలీ అవార్డు’ను అందుకున్నారు. రక్తపోటు, రేడియో వాస్కులర్ అనే అంశంపై ఆయన కృషి చేశారు. ‘జీనోం వ్యాలీ స్పెషల్ ఎక్స్‌లెన్స్’ అవార్డును భారత్ యువ శాస్త్రవేత్త నటాషా పూనం వాలాకు దక్కింది. నెక్టార్ థెరపిటిక్స్ సంస్థ తరపున ఆమె ఔషధాలపై పరిశోధనలు చేశారు. బ్రిటిష్ డిప్యూటి హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్‌కు ప్రత్యేక బయో అవార్డును మంత్రి అందజేశారు. చైనాతో తెలంగాణ పారిశ్రామిక ఒప్పందం చైనాతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికంగా సంయుక్త కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించింది. దానిలో భాగంగా మంగళవారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో చైనా, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాయి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, చైనాలోని చైనా మెడికల్ సిటీ సంస్థలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇరు సంస్థలు సంయుక్తంగా వైద్య సంబంధిత ఔషధ ఉత్పత్తులను చేపట్టేందుకు నిర్ణయించారు.