
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో మెహంగై చౌపాల్(ధరల పెరుగుదల పై చర్చలు) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 17 నుంచి 23 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండీలు, రిటైల్ మార్కెట్లు వంటి తదితర ప్రదేశాల్లో ధరల పెరుగుదల పై ర్యాలీలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ తెలిపారు.
ఈ నిరసన ర్యాలీలు ఆగస్టు 28న ఢిల్లీలోని రాంలీలా గ్రౌండ్స్‌లో సీనియర్ నాయకులు ధరలపై నోరెత్తండి అనే ప్రసంగంతో ముగిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేరకంగా ఆగస్టు 5న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు ప్రజల్లో బలంగా వెళ్లి ప్రతి ధ్వనించాయని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చట్టబద్ధమైన నిరసనను చేతబడి లేదా క్షద్ర శక్షులుగా చిత్రకరించే ప్రయత్నం చేశారని అన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు తమ ప్రభుత్వ వైఫల్యాల విషయమైన మోదీలో కలుగుతున్న అభద్రత భావాన్ని తేటతెల్లం చేస్తోందంటూ... ఆరోపణలు చేశారు. రానున్న వారాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం పై వరుస నిరసనలతో కాంగ్రెస్ ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. మెదీ చేస్తున్న ఆర్థిక దుర్వినియోగాన్ని కూడా బయట పెడతామని అన్నారు.
ఈ మేరకు పెరుగు, మజ్జిగ , ఫ్యాకేజ్డ్ ఆహారధాన్యాల వంటి నిత్యావసర వస్తువుల పై అధిక పన్నుల విధించడం వల్ల ద్రవ్యోల్బణం తీవ్రమవుతోందన్నారు. అంతేకాదు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం, అగ్నిపథ్ వంటి తప్పుదారి పట్టించే పథకాలను ప్రవేశపెట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని జై రాం రమేష్ అన్నారు.
(చదవండి: ఈ ఫుడ్‌ని జంతువులు కూడా తినవు ... కానిస్టేబుల్ ఒకటే ఏడుపు)