assembly Constituencies
-
ప్రజాభిప్రాయం.. సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: జన బలమే గీటు రాయిగా.. సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ.. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. యువతకు ప్రాధాన్యమిస్తూ 15 శాసనసభ స్థానాలకు, 6 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో జాబితాను ఖరారు చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో గురువారం రాత్రి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డిలు ఆ వివరాలను ప్రకటించారు. గత నెల 11న 11 శాసనసభ స్థానాలకు.. ఈ నెల 2న 24 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాలను విడుదల చేశారు. మొత్తం మూడు జాబితాల్లో కలిపి 50 శాసనసభ, 9 లోక్‌సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు. గత ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా.. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌ను సమన్వయకర్తగా నియమించారు. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి పెట్టగా, ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని సమన్వయకర్తగా నియమించారు. శ్రీకాకుళం లోక్‌సభ సమన్వయకర్తగా పేరాడ తిలక్(బీసీ)ను నియమించారు. మంత్రి గుమ్మనూరి జయరాం(బీసీ)ను కర్నూలు లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తిరుపతి లోక్‌సభ స్థానం(ఎస్సీ) సమన్వయకర్తగా, విజయవాడ లోక్‌సభ స్థానం సమన్వయకర్తగా కేశినేని నానిలను నియమించారు. బీసీలు, మహిళలు, మైనార్టీలకు పెద్దపీట మూడు జాబితాల్లో 50 శాసనసభ స్థానాల సమన్వయకర్తలను పరిశీలిస్తే.. సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. గతంలో అగ్ర వర్ణాలకు చెందిన అభ్యర్థులను పోటీ పెట్టిన ఏడు శాసనసభ స్థానాల్లో ఇప్పుడు ఐదు స్థానాల్లో బీసీ, రెండు స్థానాల్లో మైనార్టీ వర్గానికి చెందిన వారిని సమన్వయకర్తలుగా నియమించారు. ఆరు శాసనసభ స్థానాలకు మహిళలను, 18 స్థానాల్లో యువతను సమన్వయకర్తలుగా నియమించారు. మొత్తమ్మీద 50 శాసనసభ స్థానాలకు ప్రకటించిన సమన్వయకర్తల్లో.. ఎస్సీలు 14, ఎస్టీలు 3, బీసీలు 16, మైనార్టీలు 4, ఇతర వర్గాలు 13 (రెడ్డి, కాపు, వైశ్య) మంది ఉన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన 9 లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో.. బీసీలు 6, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓసీ ఉన్నారు. పెడన శాసనసభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమే‹Ùను పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిని సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తగా, ఎమ్మెల్సీ మేరిగ మురళిని గూడూరుకు, , ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలికి సమన్వయకర్తలుగా నియమించారు. ఏపీఐఐసీ ౖచైర్మన్, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని రాయదుర్గం, మాజీ ఎమ్మెల్యే మూతిరేవుల సునీల్‌కుమార్‌ను పూతలపట్టు, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ విజయానందరెడ్డిని చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. జెడ్పీ చైర్మన్లకు అవకాశం శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియ విజయను ఇచ్చాపురం శాసనసభ స్థానం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా సీఎం జగన్ నియమించారు. ఇచ్చాపురం జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మను శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. వైఎస్సార్ జిల్లా జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డిని రాజంపేట సమన్వయకర్తగా, చిప్పగిరి జెడ్పీటీసీ బూసినే విరూపాక్షిని ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. క్లీన్ స్వీప్ లక్ష్యం సీఎం వైఎస్ జగన్ గత 56 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూ.2.45 లక్షల కోట్లు.. నాన్ డీబీటీ రూపంలో రూ.1.67 లక్షల కోట్లు.. వెరసి రూ.4.12 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాలకు సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రయోజనం అందితే.. అందులో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉండటం గమనార్హం. గత 56 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన వల్ల రాష్ట్రంలో ప్రతి రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. ఆ మార్పు ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కళ్లెదుట కన్పిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమేనని పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. ప్రతి ఇంటా చేసిన మంచిని ప్రజలకు చెప్పి.. జనంతో మమేకమవుతూ సమస్యలు పరిష్కరించడం ద్వారా వారి మనసులు చూరగొని.. మరింత మంచి చేయడానికి ప్రజల ఆశీస్సులు కోరాలని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు మార్గ నిర్దేశం చేస్తూ వచ్చారు. ప్రజలతో మమేకం కాకుండా.. జనం మనసులు చూరగొనలేని వారికి టికెట్లు ఇవ్వలేనని ఆది నుంచి సీఎం వైఎస్ జగన్ తేల్చిచెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 175కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అవసరమైన స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా విడుదల
గుంటూరు, సాక్షి: అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా మూడో జాబితాను విడుదల చేసింది వైఎస్సార్సీపీ పార్టీ. ఆరు పార్లమెంట్ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది. తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు. శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ.. ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ మూడో జాబితాను రూపొందించడం గమనార్హం. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో జాబితాను 21 స్థానాలతో విడుదల చేసింది. వీటితో పాటు ప్రస్తుతం ఇచ్ఛాపురం జెడ్పీటీసీగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను.. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ తొలి జాబితా ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ రెండో జాబితా -
YSRCP ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇంఛార్జిల రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 27 మంది పేర్లతో కూడిన జాబితాను మంగళవారం పార్టీ సీనియర్ నేత.. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విస్తృత చర్చల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ తుది జాబితాను రూపకల్పన చేయించినట్లు తెలుస్తోంది. ‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సామాజీక సమీకరణాలే లక్ష్యంగా జాబితా రూపకల్పన జరిగినట్లు స్పష్టమవుతోంది. తాజా జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే.. పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి. ఎంపీలకూ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు. -
రిజర్వుడ్‌లో ఖమ్మం టాప్
సాక్షి, ఖమ్మం డెస్్క: తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 31 రిజర్వుడ్ నియోజవర్గాలు. వీటిల్లో 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2009లో చేపట్టిన డీ లిమిటేషన్ సందర్భంలో జనాభా ఆధారంగా వీటిని ఖరారు చేశారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఎక్కువగా రిజర్వుడ్ నియోజకవర్గాలు ఖమ్మంలోనే ఉన్నాయి. ఇక్కడ పది స్థానాలకు గాను ఏడు రిజర్వుడ్ స్థానాలే. ఇందులో ఐదు ఎస్టీ, రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే.... కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కూడా లేదు. ఎస్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉమ్మడి ఖమ్మం : పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, వైరా ఉమ్మడి ఆదిలాబాద్ : ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ ఉమ్మడి వరంగల్ : డోర్నకల్, మహబూబాబాద్, ములుగు ఉమ్మడి నల్లగొండ : దేవరకొండ ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉమ్మడి కరీంనగర్ : ధర్మపురి, చొప్పదండి, మానకొండూరు ఉమ్మడి ఖమ్మం : మధిర, సత్తుపల్లి ఉమ్మడి మహబూబ్‌నగర్ : అచ్చంపేట, అలంపూర్ ఉమ్మడి ఆదిలాబాద్ : చెన్నూరు, బెల్లంపల్లి ఉమ్మడి నల్లగొండ : నకిరేకల్, తుంగతుర్తి ఉమ్మడి వరంగల్ : స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట ఉమ్మడి రంగారెడ్డి : చేవెళ్ల, వికారాబాద్ ఉమ్మడి మెదక్ : జహీరాబాద్, అందోల్ హైదరాబాద్ : కంటోన్మెంట్ ఉమ్మడి నిజామాబాద్ : జుక్కల్ -
మంథని నియోజకవర్గంలో అధికారం వహించేది ఎవరు?
మంథని నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంధని నియోజకవర్గం నుంచి నాలుగోసారి విజయం సాదించారు. ఆయన సిటింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్టా మదుపై 16230 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా కాంగ్రెస్ ఓడిపోగా, ఒక్క శ్రీధర్ బాబే గెలవగలిగారు. 2014లో శ్రీధర్ బాబును మదు ఓడిరచగా, 2018లో శ్రీదర్ బాబు పైచేయి సాదించారు. శ్రీదర్ బాబుకు 89045 ఓట్లు రాగా, పుట్టా మధుకు 72815 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన స్వతంత్ర అభ్యర్ది కె.నాగార్జున కు 5400 పైగా ఓట్లు వచ్చి, మూడో స్థానంలో ఉన్నారు. శ్రీధర్ బాబు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత. ఈయన తండ్రి శ్రీపాదరావుకూడా మంథనినుంచి మూడుసార్లు గెలవగా, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రదాని పివి నరసింహారావు నాలుగుసార్లు గెలిచారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు మొత్తం పదకుండు సార్లు గెలిచి నట్లయింది. 2014 ఎన్నికలలో దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఈసారి ఓటమిపాలయ్యారు. వరసగా మూడుసార్లు గెలుస్తూ వచ్చిన ఈయన టిఆర్ఎస్ ప్రభంజనానికి ఓటమి పాలు కాక తప్పలేదు. టిఆర్ఎస్ అభ్యర్ధి పుట్ట మధు ఇక్కడ శ్రీధర్ బాబుపై 19360 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మధు అంతకుముందు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్‌లో ఉండి ఈ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల సమయంలో ఈయన ప్రజారాజ్యం పక్షాన పోటీచేసి ఓడిపోయారు. శ్రీధర్‌బాబు డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో ఉన్నత విద్యాశాఖమంత్రి అయ్యారు. రోశయ్య మంత్రి వర్గంలో కూడా వున్నారు. అనంతరం ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా శ్రీధర్‌బాబు మంత్రిగా కొనసాగారు. టరమ్ చివరిలో కిరణ్‌తో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేశారు. శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావు 1991 నుంచి నాలుగేళ్లపాటు శాసనసభ స్పీకరుగా పనిచేశారు. ఆయనను నక్సలైట్లు హత్యచేశారు. శ్రీపాదరావు ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిస్తే, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసింది కూడా మంధని నియోజకవర్గం కావడం ఒక ప్రత్యేకత. పి.వి. ఇక్కడ నుంచి నాలుగుసార్లు ఎన్నికై, నీలం, కాసు క్యాబినెట్లలో మంత్రిగా, రాష్ట్రముఖ్యమంత్రిగా, ఆ తరువాత కేంద్ర మంత్రిగా, ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టారు. మూడు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన నేతగా కూడా ప్రసిద్ధి గాంచారు. మన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని హన్మకొండ, నంద్యాలతోపాటు, మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి, ఒరిస్సాలోని బరంపురం నుంచి కూడా ఆయన లోక్‌సభకు గెలుపొందారు. మంథని నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
పార్టీ ఇచ్చిన పనిని అందరూ చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఇచ్చిన పనిని అందరూ చేయాల్సిందేనని, ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు స్పష్టం చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన నేతలు తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ పనులు చేసుకుంటూనే తమకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాల్సిందేనని వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయిన బోసురాజు.. రాష్ట్రంలో జరుగుతున్న హాథ్ సే హాథ్ జోడో అభియాన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ హాథ్ సే హాథ్ జోడోయాత్ర తమ నియోజకవర్గాల్లో కూడా నిర్వహిస్తున్నందున తమ కు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్లడం కష్టంగా ఉందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఎంపికైన నేతలు పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు చక్కబెట్టాల్సిందేనని, తమ నియోజకవర్గాలతో పాటు బాధ్యతలిచ్చిన 2, 3 నియోజకవర్గాల్లో కూడా హాథ్ సే హాథ్ జోడో యాత్రలపై అక్కడకు వెళ్లి నివేదికలు తయారు చేయాలని స్పష్టంచేశారు. ఈనెల 6 లోపు తమకు కేటాయించిన స్థానాల్లో వెళ్లి రిపోర్టు చేయాలని, అక్కడ హాథ్ సే హాథ్ జోడో యాత్రలు జరుగుతున్న తీరుపై పార్టీకి సమా చారం ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ముఖ్య నేతలు సంభాని చంద్రశేఖర్, గడ్డం వినోద్, చెరుకు సుధాకర్, సంగిశెట్టి జగదీశ్వరరావులతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వజ్రేశ్‌యాదవ్, విజయారెడ్డి, చరణ్‌కౌశిక్ యాదవ్, చల్లా నర్సింహారెడ్డి, భూపతిరెడ్డి నర్సారెడ్డి, బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీలపై కాంగ్రెస్ ‘నజర్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (పాతబస్తీ మినహా) గెలుపోటములపై ప్రభావితం చూపించే మైనార్టీ ఓట్లపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. గతంలో సాంప్రదాయక ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలు చాలా మంది బీఆర్ఎస్ వైపు మళ్లిన నేపథ్యంలో వారిని తిరిగి తమ ఖాతాలో వేసుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని యోచిస్తోంది. దీనిపై టీపీసీసీ ఇప్పటికే తాత్కాలిక షెడ్యూల్‌ను రూపొందించగా, పూర్తిస్థాయి వివరాలను పంపాలని అధిష్టానం కోరినట్టు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన దిగ్విజయ్ సింగ్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టాలా? మరేదైనా రూపంలో కార్యక్రమాన్ని చేపట్టాలా అన్న దానిపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఆ రెండు పార్టీలూ ఒకటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముస్లింలతో పాటు ఇతర మైనార్టీ వర్గాల ఆలోచనలో కూడా మార్పు వచ్చినట్టు పలు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. గతంలో ఎంఐఎంతో పాటు కాంగ్రెస్‌కు అండగా ఉన్న ఈ వర్గాలు చాలా వరకు ఎంఐఎంతో పాటు బీఆర్ఎస్ వైపు మళ్లినట్టు అర్థమవుతోంది. గత పదేళ్లుగా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారానికి దూరంగా ఉండడంతో మైనార్టీ వర్గాలు పార్టీ నుంచి కొంత దూరమయ్యాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని మైనార్టీలకు సంబంధించిన రెండు ప్రధాన డిమాండ్లతో ఆ వర్గాల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల కల్పన, మైనార్టీలకు స్వయం ఉపాధి కోసం రుణాల మంజూరు అనే అంశాలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లనుంది. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీగా, దేశ స్థాయిలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ వైపు మైనార్టీలు వచ్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు అంతర్గతంగా ఒక పార్టీకి మరోపార్టీ సహకరించుకుంటున్నాయనే విషయాన్ని మైనార్టీ వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా ఆ వర్గాలను ఆకర్షించాలనేది కాంగ్రెస్ పార్టీ యోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మైనార్టీల పక్షాన యాత్ర లేదంటే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని, జనవరి 26 నుంచి జరగనున్న హాత్‌సే హాత్ జోడో కార్యక్రమం సమయంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్టు సమాచారం. -
అసెంబ్లీ సెగ్మెంట్లవారీ పర్యటనలకు సంజయ్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటిదాకా పాదయాత్రలతో బిజీగా గడిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీ పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15న ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర ముగిసిన నేపథ్యంలో పాదయాత్రలకు కొంత విరామం ఇవ్వాలని పార్టీనాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. వచ్చే ఏడాది నిర్ణీత కాలవ్యవధిలోగానీ, ముందస్తుగా గానీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సంస్థాగతంగా పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలని రాష్ట్రపార్టీని జాతీయ అధినాయకత్వం ఆదేశించింది. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సంస్థాగతంగా అన్ని కమిటీల నియామకం పూర్తిచేయాలని నిర్దేశించింది. ఎన్నికలు, ఓటింగ్ సందర్భంగా కీలకంగా మారనున్న పోలింగ్ బూత్ కమిటీలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఈ నియామకాలు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించింది. ఐదు విడతల పాదయాత్రలో మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టివచ్చిన విషయం తెలిసిందే. ఇంకా మిగిలిన 63 శాసనసభా స్థానాల్లో తక్కువకాలంలో పాదయాత్రల నిర్వహించడం కష్టసాధ్యమని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇతర రూపాలు, పద్ధతుల్లో అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా కార్యక్రమాల్లో మార్పులు చేస్తున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున... పాదయాత్ర జరగని ప్రాంతాల్లోని నియోజకవర్గాలను చుట్టివచ్చేలా రూపొందించిన ‘ప్రజా గోస– బీజేపీ భరోసా’బైక్ ర్యాలీలను మరింత విస్తృతంగా చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. సంక్రాంతి పండుగ తర్వాత 15వ తేదీ నుంచి రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున 15 రోజులపాటుసాగే పర్యటనలను సంజయ్ ప్రారంభిస్తారు. జంటనగరాల పరిధిలోని 18, 20 అసెంబ్లీ స్థానాల్లో పాదయాత్ర లేదా మరే ఇతర పద్ధతుల్లోనైనా పర్యటించాలని, పార్టీ నాయకత్వం ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్న పక్షంలో బస్సుయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. పాదయాత్ర సాగని నియోజకవర్గాలు, పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహించే యోచనలో ఉన్నట్టు పార్టీనేత ఒకరు తెలిపారు. -
25 అసెంబ్లీ సీట్లపై సీపీఐ దృష్టి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గాలపై సీపీఐ దృష్టి కేంద్రీకరించింది. వచ్చే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 25 నియోజకవర్గాల్లో బలోపేతంపై కసరత్తు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, అన్ని నియోజకవర్గాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేయాలని, 25 సీట్లల్లో మాత్రం పార్టీని పటిష్టంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలన్నదానిపై పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఇతర పార్టీలతో పొత్తు కుదరకపోతే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసేలా సన్నద్ధం కావాలన్నది ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని సమాచారం. అంతేకాక పొత్తుల్లో ఎక్కువ సీట్లు అడగాలన్నా, 25 నియోజకవర్గాల్లో బలం ఉందని చూపించుకోవాలనేది ఆ పార్టీ వ్యూహంగా ఉందని చెబుతున్నారు. తాము మద్దతు ఇచ్చే పార్టీ గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి తమకుందని నిరూపించుకోవడం కూడా కీలకమన్న భావన ఉంది. బీజేపీకి ఉన్న బలమెంత? రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ తమకు పార్టీ కమిటీలున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన పార్టీ అని సీపీఐ నేతలు అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల్లో బలమైన పార్టీగా ఉన్నామని చెపుతున్నారు. వాస్తవంగా ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ డబ్బుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోందే కానీ, తమతో పోలిస్తే ఆ పార్టీ బలమెంత అని సీపీఐ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రచారం అధికంగా చేసుకుంటోందని, కానీ తాము అంత ప్రచారం చేసుకోవడంలేదని చెపుతున్నారు. ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని, తాము ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల్లో బలమైన చోట్ల సీట్లను అడిగి తీరుతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఇటీవల పార్టీ జాతీయ మహాసభలు విజయవాడలో జరిగిన విషయం విదితమే. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా జాతీయ నాయకత్వం నొక్కిచెప్పింది. పార్టీ బలం పెంచుకోకుండా ఎన్నికల్లో ముందుకు సాగలేమని నాయకత్వం భావిస్తోంది. పొత్తుల్లోనూ బలం నిరూపించుకోవాల్సిందేనని అంటున్నారు. ‘బీజేపీని ఓడించడమే లక్ష్యంగా రానున్న ఎన్నికలకు వెళతాము. అందుకోసం రాష్ట్రంలో వామపక్షాలు, టీఆర్ఎస్ లేదా ఇతర లౌకిక ప్రజాతంత్ర పార్టీల మధ్య పొత్తులు ఉంటాయి. అదే సందర్భంలో మేం గెలవగలిగే స్థానాలపై సరైన అవగాహనకు రావాల్సి ఉంది. పొత్తుల పేరుతో పార్టీకి బలం ఉన్న స్థానాలను వదులుకునే ప్రసక్తే లేదు’అని ఒక నేత అభిప్రాయపడ్డారు. కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శిగా పగ్గాలు చేపట్టాక పార్టీ పటిష్టత పైన, ప్రచారంపైన ప్రత్యేకంగా దృష్టిసారించారని నాయకులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా? -
మోగిన ఎన్నికల నగారా.. 6 రాష్ట్రాల్లో 7 సీట్లకు ఉప ఎన్నిక
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు నగారా మోగింది. 6 రాష్ట్రాల్లోని 7 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అక్టోబర్ 14న నామినేషన్లు. అక్టోబర్ 15న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ. అక్టోబర్ 17 నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు. ఉప ఎన్నికలు జరిగే స్థానాలు (7) మహారాష్ట్ర-తూర్పు అంధేరి బిహార్-మోకమ బిహార్- గోపాల్‌గంజ్ హరియాణ-అదంపూర్ తెలంగాణ-మునుగోడు ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్ ఒడిశా- ధామ్‌నగర్ -
ఆగస్టు 17 నుంచి 23 వరకు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ర్యాలీలు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో మెహంగై చౌపాల్(ధరల పెరుగుదల పై చర్చలు) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 17 నుంచి 23 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండీలు, రిటైల్ మార్కెట్లు వంటి తదితర ప్రదేశాల్లో ధరల పెరుగుదల పై ర్యాలీలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ తెలిపారు. ఈ నిరసన ర్యాలీలు ఆగస్టు 28న ఢిల్లీలోని రాంలీలా గ్రౌండ్స్‌లో సీనియర్ నాయకులు ధరలపై నోరెత్తండి అనే ప్రసంగంతో ముగిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేరకంగా ఆగస్టు 5న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు ప్రజల్లో బలంగా వెళ్లి ప్రతి ధ్వనించాయని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చట్టబద్ధమైన నిరసనను చేతబడి లేదా క్షద్ర శక్షులుగా చిత్రకరించే ప్రయత్నం చేశారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తమ ప్రభుత్వ వైఫల్యాల విషయమైన మోదీలో కలుగుతున్న అభద్రత భావాన్ని తేటతెల్లం చేస్తోందంటూ... ఆరోపణలు చేశారు. రానున్న వారాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం పై వరుస నిరసనలతో కాంగ్రెస్ ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. మెదీ చేస్తున్న ఆర్థిక దుర్వినియోగాన్ని కూడా బయట పెడతామని అన్నారు. ఈ మేరకు పెరుగు, మజ్జిగ , ఫ్యాకేజ్డ్ ఆహారధాన్యాల వంటి నిత్యావసర వస్తువుల పై అధిక పన్నుల విధించడం వల్ల ద్రవ్యోల్బణం తీవ్రమవుతోందన్నారు. అంతేకాదు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం, అగ్నిపథ్ వంటి తప్పుదారి పట్టించే పథకాలను ప్రవేశపెట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని జై రాం రమేష్ అన్నారు. (చదవండి: ఈ ఫుడ్‌ని జంతువులు కూడా తినవు ... కానిస్టేబుల్ ఒకటే ఏడుపు) -
బాధ్యులెవరు బాసూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని పదే పదే చెబుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులను మాత్రం చక్కదిద్దుకోలేకపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బాధ్యులు లేకు న్నా టీపీసీసీ అగ్ర నేతలు మిన్నకుండి పోవడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. మరో 10 చోట్ల అసలు ఇన్చార్జి ఎవరో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామనే ధీమా నుంచి ఇప్పుడు కనీసం నియోజకల బాధ్యులెవరో తేల్చుకోలేని పరిస్థితి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ వర్గాలు అం చనా వేస్తున్నాయి. ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించకపోతే రెండో స్థానం కోసం పోటీ పడటం తప్ప గత్యంతరం ఉండబోదని అంటున్నాయి. ఖమ్మంలో 8 సెగ్మెంట్లలో బాధ్యులెవరో! ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే పార్టీ చాలా బలంగా ఉందనుకుంటున్న ఖమ్మం జిల్లాల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు బాధ్యులెవరో తెలియని పరిస్థితి. మధిర, భద్రాచలంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు తప్పిస్తే ఎక్కడా పార్టీకి బాధ్యులు లేకుండా పోయారు. ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను గతంలో టీడీపీకి కేటాయించారు. కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, పాలేరుల నుంచి గెలిచిన ఎమ్మెల్యే లు టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. వైరాలో గత ఎన్నిక ల్లో పోటీ చేసిన అభ్యర్థి క్రియాహీనంగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలాగెలుస్తోందో ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలోనూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లగా అక్కడ ఇన్చార్జి లేడు. ఆలేరు నుంచి బూడిద భిక్షమయ్యగౌడ్ టీఆర్ఎస్లోకి వెళ్లాక పూర్తి స్థాయి ఇన్చార్జి లేని పరిస్థితి. బీర్ల అయిలయ్య క్రియాశీలంగానే పనిచేస్తున్నా ఆయనకు బాధ్యతలు ఇవ్వలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని కొల్లాపూర్‌లో హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరాక అభిలాశ్, జగదీశ్వర్‌రావు కాంగ్రెస్‌లోకి వచ్చినా వారిలో ఎవరికీ ఇన్చార్జి బాధ్యతలివ్వలేదు. మక్తల్‌లోనూ బాధ్యుడు లేని పరిస్థితుల్లో వాకిటి శ్రీహరి కొంత మేర పార్టీకి అండగా ఉంటున్నారు. రంగారెడ్డిలో ఇలా.. హైదరాబాద్‌లో అలా.. వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, మహబూబాబాద్ సీట్లలో బాధ్యుల్లేరు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి పాల్వాయి హరీశ్ బీజేపీలో చేరాక అక్కడ పార్టీకి ఓ నాథుడు లేని పరిస్థితి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోనూ ఇదే పరిస్థితి. కరీంనగర్లో జిల్లా కేంద్రం నుంచి గత ఎన్నికల్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటీ చేసినా ఇప్పుడు ఆయన కూడా అసెంబ్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించట్లేదు. సిరిసిల్లలో మహేందర్‌రెడ్డి క్రియాశీలంగా లేని పరిస్థితి. రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో కూడా బాధ్యుల్లేరు. హైదరాబాద్ పాత బస్తీని మినహాయించినా గోషామహల్, ముషీరాబాద్, సికింద్రాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి. మేమంటే మేం ఇన్‌చార్జులమంటూ..! కొన్ని చోట్ల ఇద్దరు, ముగ్గురు నేతలు తామంటే తాము ఇన్‌చార్జులమని చెప్పుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు సభ్యత్వం డబ్బులు ఎవరు కట్టాలో కూడా సమస్యగా మారుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. -
ప్రజాసమస్యలపై సంగ్రామం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమతోంది. వచ్చే ఏడాది చివరకల్లా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాసంగ్రామ యాత్ర పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించింది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండేలా అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. అధికార టీఆర్ఎస్కు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని భావిస్తోంది. ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు పురస్కరించుకుని కోడ్ అమల్లోకి రావడంతో.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అధికార టీఆర్ఎస్ విధానాలపై ఉద్యమ కార్యాచరణను, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండోవిడత పాదయాత్ర వంటి కార్యక్రమాలను బీజేపీ అనివార్యంగానే వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ నెల 16తో కోడ్ ముగుస్తుండడంతో.. తిరిగి కార్యాచరణపై దృష్టి పెట్టాలని భావిస్తోంది. వానాకాలం ధాన్యం కొనుగోలు, పెట్రో ధరలపై రాష్ట్ర వ్యాట్ తగ్గింపు, పూరిస్థాయిలో దళితబంధు అమలు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్ జారీ, నిరుద్యోగ భృతి అమలు వంటి వాటిపై మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ పార్టీ నుంచి ముఖ్యనేత ఒకరు రెండోవిడత సంజయ్ పాదయాత్రను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర మొదలుపెట్టిన తర్వాత కనీసం 50 రోజులు కొనసాగించే ఆలోచనలో కమల దళం ఉంది. వ్యూహానికి మరింత పదును బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజాసంగ్రామ యాత్ర’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, అధికారపార్టీల వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ ప్రయత్నించింది. ప్రభుత్వ పెద్దలు, మంత్రులపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించడం ద్వారా రాజకీయవేడిని పెంచు తూ ప్రజల దష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. తాజాగా హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ భారీ విజయం సాధించడంతో, ఇదే వ్యూహానికి మరింత పదును పెట్టి, దీర్ఘకాల కార్యాచరణ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతును కూడగట్టాలని నిర్ణ యించింది. టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపట్టా లని భావిస్తోంది. ఈటల గెలుపుతో పార్టీ కేడర్‌లో వచ్చిన నూతనోత్సాహాన్ని మరింత పటిష్టపరిచి సంస్థాగతంగా బలోపేతమయ్యేలా ముందుకెళ్లాల ని నిర్ణయించింది. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడేలా వివిధ కార్యక్రమాలతో మరింత ఉధృతంగా ముందుకెళ్లాలని, పకడ్బందీ వ్యూహంతో శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించింది. -
ముగిసిన టీఆర్ఎస్ విజయగర్జన సన్నాహక సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో వారం రోజులుగా జరుగుతున్న వరంగల్ విజయగర్జన సన్నాహక సమావేశాలు శనివారం ముగిశాయి. ఈ నెల 18 నుంచి రోజుకు 20 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో విజయగర్జనకు జనసమీకరణపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆరు రోజుల పాటు మొత్తం 103 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. గజ్వేల్‌తో పాటు హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ఈ నెల 30 తర్వాత కేటీఆర్ సమావేశమవుతారు. ఆరు రోజుల వ్యవధిలో జరిగిన విజయగర్జన సన్నాహక సమావేశాల్లో భాగంగా కేటీఆర్ సుమారు 8 వేలమంది పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయినట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
టీఆర్ఎస్కు తిరుగులేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే పార్టీ ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్‌లో జరగనున్న తెలంగాణ విజయగర్జన సభ సన్నాహాలపై ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నాలుగో రోజు గురువారం ఉమ్మడి మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌తో పాటు సంబంధిత నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేశాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు నోరు, నీరు లేకుండా పోయిందని, అలాంటి పరిస్థితుల్లో ఆవిర్భవించిన టీఆర్ఎస్తో తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం దక్కిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 103 మంది టీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించడం, 32 జిల్లా పరిషత్‌లను టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా కైవసం చేసుకోవడం గొప్ప విషయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే తెలంగాణ విజయగర్జన సభకు అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చేలా చూడాలని ఆయన సూచించారు. విజయగర్జన సభకు బయలుదేరే ముందు గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని ఆదేశించారు. పటాన్చెరు, నర్సాపూర్, మెదక్, అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, జగిత్యాల, మంథని, వేములవాడ, మానకొండూరు, భువనగిరి, ఆలేరు, మునుగోడు, కోదాడ, నాగార్జునసాగర్, నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ నియోజకవర్గాలకు చెందిన నాయకులకు మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. -
టీఆర్ఎస్ అవినీతిపై దృష్టి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: ఏడున్నరేళ్లుగా రాష్ట్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న టీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వారి అవి నీతి కార్యకలాపాలపై నివేదికలు రూపొందిం చాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీన్ని ఆధారాలతోసహా నిరూపిం చేలా నియోజకవర్గాల సమన్వయకర్తలు స్థానిక నేతలతో కలిసి పనిచేయాలని సూచించారు. గురువారం ఇందిరాభవన్‌లో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ కార్యక్రమం కోసం నియమించిన అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశం జరిగింది. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాని నేతలకు నోటీసులిచ్చి వివరణ కోరాలని, ఆసక్తి లేని వారిని ఇబ్బంది పెట్టి పనిచేయించు కోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతల అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థల విచారణకు డిమాండ్ చేయాలని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ హామీలను అమలుచేయడంలో ఎలా విఫలమయ్యారో వివరించాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని, ఇదే ఊపును అధికారంలోకి వచ్చేవరకు కొనసాగిం చాలని మాణిక్యం చెప్పారు. రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు: రేవంత్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 72 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. హైదరాబాద్ లో వరదలు వచ్చిన ప్పుడు రూ.10వేలు కూడా సరిగా ఇవ్వలేని కేసీఆర్ రాష్ట్రంలోని 30 లక్షల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎలా ఇస్తారో ప్రశ్నించాలన్నారు. సమన్వయకర్తలే ప్రచారం చేయాలి: భట్టి కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేసే బాధ్యత నియో జకవర్గాల సమన్వయకర్తలదేనని అన్నారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్ గౌడ్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, అజారు ద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి, పొడెం వీరయ్య తదితరులు కూడా పాల్గొన్నారు. -
కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనలో సంక్లిష్టతలు
జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో రాజకీయ మద్దతు తీసుకునే లక్ష్యంతోనే ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలే అక్కడి రాజకీయ పార్టీలతో భేటీ అయ్యారు. పర్యవసానంగా నియోజకవర్గాల పునర్విభజన కమిటీ ఆ మధ్య జమ్మూకశ్మీర్‌ను సందర్శించి ఈ అంశంపై ప్రాథమిక సమాచార సేకరణ కోసం శ్రీనగర్, కిష్వార్, పహల్ గామ్, జమ్మూ ప్రాంతాల్లోని 290 పైగా బృందాలతో సమావేశమైంది. నియోజకవర్గాల పునర్విభజనకి మద్దతుగా చేసే ప్రధాన వాదన ఏదంటే అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ అంశమే. వీరు ప్రధానంగా 1947లో శరణార్థులుగా భారత్‌కు వచ్చినవారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వీరిని పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులుగా ప్రస్తావిస్తుంటారు. పైగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిరావడం అనేది నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటుకు దారితీసింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సీట్ల పంపిణీ 1981 జనాభా లెక్కల ప్రాతిపదికన జరిగింది. 2019 ఆగస్టులో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్తగా పెంచింది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూకశ్మీర్ శాసనసభ స్థానాలు 83 నుంచి 90కి పెరగనున్నాయి. గత అసెంబ్లీలో కూడా ఎస్సీలకు రాజకీయపరమైన రిజర్వేషన్లు ఉనికిలో ఉండేవి. ఎస్సీల కోసం కేటాయించిన స్థానాల నుంచి పలువురు కీలక మంత్రులు గతంలో పదవులు చేపట్టగలిగారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్ కూడా వారిలో ఒకరు. ప్రధానితో ఇటీవలి సమావేశానికి ఈయన్ని కూడా ఆహ్వానించారు. కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తుందన్నది వాస్తవం. దీంట్లో ప్రధానంగా లబ్ధిదారులు గుజ్జర్లు. వీరు చాలావరకు ముస్లింలే. గత శాసనసభ ఎన్నికల్లో కశ్మీర్ లోయలోని లోలాబ్, కంగన్ అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను గుజ్జర్ అభ్యర్థులు ఎన్నికయ్యారు. జమ్మూలోని సురాన్ కోట్, మెంధర్, రాజౌరి, గులాబ్‌ఘర్, డర్హాల్, కాలాకోటె, గూల్ అర్నాస్ నియోజకవర్గాలకు కూడా గుజ్జర్ అభ్యర్థులే ప్రాతినిధ్యం వహించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, గుజ్జర్ల జనాభా పూర్వ రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 9 శాతంగా ఉండేది. జమ్మూకశ్మీర్ గత శాసనసభలో గుజ్జర్లకు 10.8 శాతం ప్రాతినిధ్యం ఉండేది. కశ్మీర్లో శాసన కార్యనిర్వాహక మార్పును మాత్రమే కోరుకుంటున్న రాజకీయ పార్టీలు అక్కడి గిరిజన అభ్యర్థులకు ఇకనైనా ప్రాధాన్యం ఇవ్వడంపై ఏమంత ఆసక్తిని ప్రదర్శించడం లేదు. కాబట్టి జమ్మూ కశ్మీర్ భవిష్యత్ శాసనసభలో కూడా గుజ్జర్ల ప్రాతి నిధ్యం 2014లో ఎన్నికైన గత అసెంబ్లీలో ఉన్న విధంగానే ఉంటుంది తప్పితే పెద్దగా మార్పు ఉండదు. కశ్మీర్లో కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మార్పు ఏమీ ఉండదు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ ఎన్నికలలో ఓటు వేసే అర్హత ఉన్న వారి సంఖ్య కొద్దిగా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పూర్వ రాష్ట్రంలో బయటనుంచి వచ్చిన వారి వాస్తవ సంఖ్య 1.6 లక్షలు మాత్రమే. వాస్తవానికి, గత కొన్ని సంవత్సరాలుగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే డిమాండ్ జమ్మూకశ్మీర్‌లోని కొన్ని రాజకీయ పక్షాలనుంచి వచ్చింది. గత అసెంబ్లీలో కశ్మీర్ లోయలో 46 అసెంబ్లీ సీట్లు ఉండగా జమ్మూలో 37 స్థానాలుండేవి. 19వ శతాబ్దిలో విభిన్న సాంస్కృతిక, భౌగోళిక ప్రాంతాలను కలిపి సృష్టించిన జమ్మూకశ్మీర్ 1947లో కీలక మార్పులను చవిచూసింది. జమ్మూలోని చీనాబ్ లోయలో రెండు మతాల జనాభా కలిసివుండే అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించడం సంక్లిష్టంగా మారనుంది. పైగా గత అసెంబ్లీ కంటే ఇప్పుడు ఏర్పడనున్న అసెంబ్లీలో ఎస్టీలకంటే ఎస్సీలకు కాస్త ఎక్కువ సీట్లు లభ్యం కానున్నాయి. ఈ నేపథ్యంలో రీజియన్లకు, దిగువశ్రేణి ప్రాంతాలకు రాజకీయ, ఆర్థిక అధికారాన్ని సంస్థా గతీకరించేటప్పుడు అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరిపిన ఇతర ప్రాంతాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. - లవ్ పురి వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత -
పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు
సాక్షి, అమరావతి: ప్రతి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలో మార్పులకు అవకాశం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రానికి అసెంబ్లీ నియోజకవర్గాలు దూరమవుతాయని, అందువల్ల అలాంటి వాటి పరిధిని మార్చాలనే చర్చ వచ్చింది. ఈ సందర్భంగా సీఎం స్పష్టమైన విధానాన్ని వివరించినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ► ‘ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పడితే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. అప్పుడే జిల్లాలు బాగుపడతాయి. కలెక్టర్లు బాగా పరిపాలన చేయగలుగుతారు. ఒక్కో జిల్లాలో 15, 17, 19 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఏ విధంగా న్యాయం చేయగలగుతాం?’ అని సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది. ► అరకు లోక్‌సభ నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉందని, దాని పరిధిని ఒక జిల్లాగా నిర్ణయిస్తే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. ఈ విషయమై సీఎం స్పందిస్తూ.. ‘అంతగా అయితే అరకు లోక్‌సభా పరిధిని రెండు జిల్లాలుగా చేద్దాం.. అప్పుడు 25 జిల్లాలకు అదనంగా మరొకటి పెరిగితే పెరుగుతుంది.. మిగతా చోట్ల మార్పులకు అవకాశం లేదు’ అని చెప్పినట్లు సమాచారం. ► కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లా కేంద్రానికి దూరమవుతాయని కొందరు అభిప్రాయపడగా, అలాంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి తన లాంటి వారికి అవకాశం ఇవ్వండని పేర్ని నాని అనడంతో.. ‘అంతే.. మరి’ అని ముఖ్యమంత్రి బదులిచ్చినట్లు తెలిసింది. వర్షాలు బాగా పడుతున్నాయ్.. ► రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతుండటం పట్ల మంత్రివర్గ సమావేశంలో హర్షం వ్యక్తమైంది. ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ‘ఇదంతా మీ మహిమ సార్’ అని పినిపె విశ్వరూప్ అన్నట్లు తెలిసింది. వెంటనే కురసాల కన్నబాబు జోక్యం చేసుకుని ఇదే మాట తాను విలేకరుల సమావేశంలో చెబితే టీడీపీ వారు విమర్శలు చేశారని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. జగన్ పాలనలో వర్షాలు బాగా పడుతున్నాయని ప్రజల్లో మూఢ నమ్మకాలు కలిగిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని ఆయన వివరించగా, ముఖ్యమంత్రి మాత్రం నవ్వుతూ మౌనం దాల్చారని సమాచారం. -
అప్పట్లో ఎమ్మెల్యే పదవి ఏడేళ్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 1957లో జరిగిన సాధారణ ఎన్నికలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర, రాయలసీమ జిల్లాలు కలిసి ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడ్డాయి. టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులు కాగా.. రాష్ట్రపతి పాలన అనంతరం 1955 మార్చిలో 196 అసెంబ్లీ నియోజకవర్గాలకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాయి. నీలం సంజీవరెడ్డి మొదటి సీఎం అయ్యారు. 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆంధ్రప్రాంతంలోని 196 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పటికే మధ్యంతర ఎన్నికలు జరిగినందున తెలంగాణలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఆంధ్ర, రాయలసీమకు చెందిన 196 మంది ఎమ్మెల్యేలు 1962 వరకూ ఏడేళ్లు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. -
కార్యకర్తలే కిరాయికి..
సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, ముఖ్య నాయకులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో ఈ తంతు సర్వసాధారణమే అయినా.. ఈ ఏడాది అన్ని పార్టీలకు ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారడంతో ప్రచారంలో ప్రజల సంఖ్యను ఎక్కువగా చూపి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజువారి కూలీలు ఆయా పార్టీలకు కార్యకర్తలుగా మారారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ప్రచార జోరు ఊపందుకుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరికొకరు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడిదే ఎంతో మంది పేదలకు ఉపాధి మార్గంగా మారింది. వివిధ పార్టీల అభ్యర్థులు, నాయకుల వెంట తిరుగుతూ లబ్ధి పొందుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారాన్ని సానుభూతి పరులు నిర్వహిస్తుంటారు. అయితే రానురాను ఆ పద్ధతి తగ్గిపోతోంది. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇలా ఏ కార్యక్రమాన్ని రాజకీయ పార్టీలు నిర్వహించాలన్నా డబ్బిచ్చి జనాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి. కార్యకర్తల సమావేశాలకు వచ్చే జనాలను కూడా కాసులివ్వాల్సి వస్తోంది. దీంతో పార్టీల కార్యక్రమాలు పేదలకు ఉపాధిగా మారాయి. వీళ్లందరినీ తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి మేస్త్రీగా వ్యవహరిస్తున్నాడు. రాజకీయ పార్టీలు పంపే వాహనాల్లో వీరంతా ఆయా ప్రాంతాలకు తరళివెళుతున్నారు. ఉదయం 8 గంటలకు నాయకులు సూచించిన చోటుకు చేరుకునే జనం ఆపై వారు చెప్పినట్లు నినాదాలు చేస్తూ రోజంతా పార్టీ జెండాలు మోస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. కృష్ణా జిల్లా పరిధిలో సుమారు 5000 మందికి పైగా ప్రచార కూలీలుగా పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఎన్నికలు, వాటి ఫలితాలు ఎలా ఉన్నా పేదలకు మాత్రం కొన్ని రోజులైనా ఇలా ఉపాధి దొరకడం హర్షణీయం. ప్రతి నియోజకవర్గంలో సగటున 500 నుంచి 600 మంది వరకు ఇదే పద్ధతి అవలంభిస్తున్నట్లు తెలిసింది. ఇక యువత, ఆటో కార్మికులు సైతం అధిక సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. వీరికి రోజుకు రూ.250 నుంచి రూ.400, మరి కొందరు భోజనాలు పెడుతున్నారు. మరి కొందరు బైక్‌లకు పెట్రోల్ పోసి, సాయంత్రం బిర్యానీ, రూ.300 ఇస్తున్నారు. బందరు నియోజకవర్గంలో గురువారం, శుక్రవారం కొన్ని పార్టీలు నిర్వహించిన నామినేషన్ కార్యక్రమానికి రూరల్ మండలం కోన, కరగ్రహారం, సీతారమపురం, చిన్నాపురం, పోలాటతిప్ప, గోపువానిపాలెం, సుల్తానగరం తదితర ప్రాంతాల నుంచి బారీగా కూలీలు వెళ్లారు. సమయం లేక.. పోలింగ్‌కు మరో కొద్ది రోజులు మాత్రమే సమయముండటంతో అభ్యర్థులే నియోజకవర్గమంతా తిరగడానికి తగినంత సమయం లేకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానిక నేతలతోనూ ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ జనం అవసరమవుతున్నారు. దీంతో కూలిచ్చి జనాన్ని తీసుకువచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. బూత్ లెవెల్ ఇన్చార్జి ద్వారా ఆ బూత్ పరిధిలో ప్రతి రోజూ ప్రచారం జరుగుతోంది. దాంతో పాటు అభ్యర్థులు ఉదయం కొన్ని చోట్ల.. సాయంత్రం కొన్ని చోట్ల ప్రచారానికి వెళుతున్నారు. వారి వెంట భారీగా జనం ఉండేలా చూసుకుంటున్నారు. ఇందుకోసం స్థానికంగా ఉండే పేదలకు ఒక్కోక్కరికీ ఒక్క పూటకు రూ.100 నుంచి రూ.200 ఇచ్చి తీసుకువస్తున్నట్లు సమాచారం. కొన్ని పార్టీలు రోజంతా వారితో జనాలను తిప్పుకుని భోజనం పెట్టి రూ.300 చెల్లిస్తున్నట్లు తెలిసింది. -
అటొక ఊరు.. ఇటొక ఊరు
సాక్షి, కృష్ణా : ఇళ్లన్నీ కలిసే ఉంటాయి.. కొత్తవారెవరైనా వచ్చి ఇది ఏ ఊరు? అనడిగితే వూత్రం ఒక్కొక్కరు ఒక్కో ఊరి పేరు చెబుతారు. అదే ఆ ప్రాంతం ప్రత్యేకత! ఇళ్లన్నీ ఒకే చోట ఉన్నా, రెండు జిల్లాలు, మూడు మండలాలకు చెందిన మూడు వేర్వేరు గ్రామాలవి. వినడానికి విచిత్రంగా ఉన్నా వాస్తవం ఇదే! కొల్లూరు మండలంలోని చిలుమూరులంక గ్రామం, కొల్లిపర మండలం అన్నవరపులంక గ్రామాలు కలిసే ఉంటాయి. ఈ రెండు గ్రామాలు గుంటూరు జిల్లావి కాగా, కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం ఐలూరు శివారు గ్రామం అయిన కనిగిరిలంక కూడా ఈ రెండింటితో కలిసే ఉంటుంది. చిలుమూరులంక, అన్నవరపులంక గ్రామాలను పంచాయతీ రోడ్డు వేరుచేస్తుంది. ఈ రెండు గ్రావూలను కలుపుతూ కొత్తూరులంక వెళ్లే తారురోడ్డుకు తూర్పునే ఉన్న ఇళ్లన్నీ కనిగిరిలంక గ్రామాం పరిధిలోనివి. గతంలో కొల్లిపర, కొల్లూరు మండలాలు దుగ్గిరాల నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండగా కనిగిరిలంక మాత్రం కృష్ణాజిల్లా ఉయ్యూరు నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనతో దుగ్గిరాల నియోజకవర్గం రద్దయిన విషయం తెలిసిందే. కొల్లూరు మండలంలోని చిలుమూరులంక వేమూరు (ఎస్సీ) నియోజకవర్గంలో చేరింది. కొల్లిపర మండలానికి చెందిన అన్నవరపులంక తెనాలి నియోజకవర్గం పరిధిలోకి వెళ్లింది. కృష్ణాజిల్లాకు చెందిన కనిగిరిలంక అదే జిల్లాలోని పామార్రు (ఎస్సీ)నియోజకవర్గంలోకి వెళ్లింది. అందరూ దాదాపుగా ఒకే చోట ఉంటున్న మూడు గ్రామాల ఓటర్లు, మూడు వేర్వేరు నియోజకవర్గాల ఓటర్లు ఓట్లు వేయనున్నారు. మిగతా వసతులు ఎలా ఉన్నా ఆ గ్రావూలన్నింటికీ కొల్లూరు మండలం నుంచే రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. -
ఓటుకు నోటు.. ఆపై ఒట్టు.!
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ బరితెగిస్తోంది. నిజాయితీగా వెళ్తే గెలవలేమనుకుందో ఏమో ‘అడ్డదారుల్లో’ దూసుకెళ్తోంది. సార్వత్రిక ఎన్నికల గంట మోగడానికి చాలా రోజుల ముందు నుంచే ఓటర్లకు ఎర వేసే పనిలో నిమగ్నమైన ఆ పార్టీ.. ఇప్పుడు గెలుపోటముల్లో ప్రధాన పాత్ర పోషించే ఒక వర్గం ఓటర్లపై కన్నేసింది. ఇందుకోసం స్థానిక నాయకులు, ద్వితీయశ్రేణి నేతలను రంగంలోకి దిచ్చింది. ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు జరిగే సమయానికి వెళ్లడం, అక్కడ డబ్బులు పంచడం, తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని వారితోనే ప్రతిజ్ఞ చేయించడం సర్వసాధారణమైంది. నిర్వాహకులతో బేరాలు.. కొన్ని చోట్ల ప్రార్థనాలయాల నిర్వాహకులతోనే ఓట్ల బేరం పెడుతున్నట్లు తెలుస్తోంది. మీ వద్దకు ఎంతమంది వస్తారు? ఎంత మందిని ఒప్పించగలరు? ఎన్ని ఓట్లు వేయించగలరు? అని తేల్చుకుని ఆయనకే గంపగుత్తగా సొమ్ములందిస్తుండటం విశేషం. అధికారపార్టీ ఎంపీ అభ్యర్థులు ఇందుకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. తన పార్టీ అసెంబ్లీ అభ్యర్థులందరికీ వారు ఆర్థికంగా సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. వల ఆ వర్గం వారికే.. పెడన, విజయవాడ తూర్పు, సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నిరుపేదలు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై అధికార పార్టీ నేతలు గురిపెట్టారు. సెంట్రల్‌లోని మాచవరం, మొగల్రాజపురం, కొండప్రాంతాలు, అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, తూర్పులోని కృష్ణలంక తదితర ప్రాంతాల్లో ఇది జోరుగా సాగుతోంది. డబ్బుతోపాటు ఆ పార్టీ నాయకులు మతం కార్డునూ ఉపయోగిస్తున్నారు. మనందరిదీ ఒకే మతమని మనకే ఓటు పడాలని తప్పుడు పద్ధతుల్లో ప్రచారానికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. నేతల లెక్కలు.. నియోజకవర్గం మొత్తం ఓట్లు ఎన్ని? అందులో పోలయ్యే ఓట్లు ఎన్ని? వాటిలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని వస్తాయనే అంచనాల్లో అధికారపార్టీ నేతలు ఉన్నారు. ఎన్ని ఓట్లు వస్తే గెలుపునకు వీలుంటుంది. ఎవరెవరు ఎన్ని ఓట్లు చీలుస్తారు? అనే విషయాలను పోలింగ్ కేంద్రం వారి లెక్కలు తీస్తున్నారు. పార్టీ ఓట్లు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి? డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా వచ్చే ఓట్లు ఎన్ని? కొనుగోలు చేయాల్సినవి ఎన్ని? ప్రభావితం చేయగల నాయకులు ఎవరు? అనే అంచనాల్లో అభ్యర్థులు, వారి ముఖ్య అనుచరులు తలమునకలై ఉన్నారు. ఓట్ల కొనుగోలు ఎలాగూ తప్పదనే నిర్ణయానికి వచ్చిన అధికారపార్టీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఓటుకు రూ. వెయ్యి.. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఓట్ల కొనుగోళ్లకు తెరతీశారు. ఓటుకు రూ. 1,000 తక్కువ కాకుండా ఇస్తున్నారు. ఓ అభ్యర్థి అయితే రెండు రోజుల కిందటే ఈ ప్రక్రియ ప్రారంభించారు. ఆయన గెలుపే ధ్యేయంగా నియోజకవర్గంలోని 75 శాతం మంది ఓటర్లకు డబ్బు అందేలా చూడాలని తన అనుచరులకు హుకుం జారీ చేశారు. అలాగే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఓటుకు రూ. 500 నుంచి రూ. 1,000 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. నమ్మకం లేని కొందరు అభ్యర్థులు డబ్బులు ఇచ్చిన తర్వాత ఓటర్ల వద్ద ప్రమాణాలు చేయించుకుంటారనేది విశ్వసనీయ సమాచారం. జాప్యమైతే నష్టమని.. జాప్యమయ్యే కొద్దీ ఒత్తిడి పెరుగుతుందని, పోలీసులు, ప్రత్యర్థుల పర్యవేక్షణ పెరుగుతుందని అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు. అందువల్లే ప్రచారం సమయం పూర్తయ్యేలోగా నగదు పంపిణీ పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. -
రెండు అసెంబ్లీ స్ధానాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ
-
ముంచినా.. తేల్చినా.. వారే దిక్కు!
సాక్షి, అమరావతి : నియోజకవర్గ స్థాయి మొదలు గ్రామస్థాయి వరకు ప్రతి పార్టీలో పదుల సంఖ్యలో ఉన్న ప్రధాన అనుచరులే ఆయా పార్టీల అభ్యర్థులకు పెద్ద దిక్కువుతున్నారు. వీరి కష్టం మీదనే అన్ని పార్టీలు ఆధారపడుతున్నాయి. సాధారణ వేళల్లో ఎలా ఉన్నా ఎన్నికల తరుణంలో మాత్రం వీరి సహకారం లేనిదే అభ్యర్థులు కాలు కూడా కదపలేని పరిస్థితి. ఎన్నికల్లో తమ నాయకుడిని గెలిపిస్తే ఐదేళ్ల పాటు భరోసా ఉంటుందన్న భావనలో ఊరూర తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇప్పుడే పట్టు సాధించాలన్న ఉద్దేశంతో చాలా మంది కార్యకర్తలు తామే పోటిలో ఉన్నట్లు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఓటు అడగడం మొదలు పార్టీ ప్రచారం, ఇతరత్రా కార్యకలపాల్ని పర్యవేక్షిస్తూ చక్కబెడుతున్నారు. బుజ్జగింపులు.. చేరికలు సొంత పార్టీలోని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్న విషయాన్ని ముందుగానే గ్రహించి వారిని బుజ్జగించటం లేదా నాయకుడి దగ్గరకు తీసుకెళ్లడంలో మండలస్థాయి నాయకులదే పాత్ర కీలకం. స్థాయిని బట్టి అభ్యర్థులే వారి ఇంటికి పోయి వారిని బుజ్జగిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తులను పసిగట్టి వారిని సొంత పార్టీలోకి లాక్కుంటున్నారు. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించటానికి తమకున్న అనుభవాన్నంతా రంగరిస్తున్నారు. అవసరాన్ని బట్టి కాలు దూస్తుండటం, తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహ హస్తాన్ని అందించడంలో విభిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. మండల స్థాయిలోనే ఎంతలేదన్నా ఒక్కో పార్టీకి 40 నుంచి 50 మంది వరకు ముఖ్య నాయకులుంటారు. వీరందరిని కలుపుకుపోతే గెలుపు పక్కా కావటంతో అభ్యర్థులందరూ వీరికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వారి సూచనలతోనే.. ప్రచారంలో భాగంగా ఓటర్ల వద్దకు వెళ్లే నాయకులు ముందు స్థానిక ద్వితీయ శ్రేణి నాయకుల సూచనలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు, ఇప్పటివరకు చేసిన అభివృద్ధి వంటి వాటిని చర్చించుకుంటున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతలు ఎదురవుతున్న సందర్భాల్ని ఎలా డీల్ చేయాలో ముందస్తు వ్యూహరచన అమలు చేయటంలో వీరే కీలకం. అభ్యర్థులను పీడుస్తున్న భయం నాయకుల కోవర్టు ఆపరేషన్లు. తన వెంటే ఉంటూ ప్రత్యర్థులకు ఎప్పటికప్పుడు పార్టీ బలాలు, బలహీనతలను చేరవేసి ప్రత్యర్థులకు సాయం చేయటం. కీలక సమయంలో సహాయనిరాకరణ చేసి అభ్యర్థిని ఓడించాలన్నా సదరు ద్వితీయ శ్రేణి నాయకుల చేతిలోనే ఉంది. -
ఓట్ల పండుగ వచ్చేసింది
సాక్షి, శ్రీకాకుళం : సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు మొదటి విడతగా ఏప్రిల్ 11న పోలింగ్ జరిపేందుకు ఎన్నికల కమిషన్ మూహూర్తం నిర్ణయించింది. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో మరింత వేగం చేస్తున్నారు. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం ఉంది. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, వీటిలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నంలు ఉన్నాయి. అరకు పార్లమెంటు నియోజకవర్గంలో పాలకొండ అసెంబ్లీ నియోజవర్గం ఉండగా, రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు (మండలాల వారీగా) శ్రీకాకుళం : శ్రీకాకుళం అర్బన్, శ్రీకాకుళం రూరల్, గార ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట పలాస : పలాస, మందస, వజ్రపుకొత్తూరు టెక్కలి: టెక్కలి, కోటబోమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం నరసన్నపేట: నరసన్నపేట, జలుమూరు, పోలాకి, సారవకోట ఆమదాలవలస: ఆమదాలవలస, పొందూరు,బూర్జ, సరుబుజ్జిలి పాతపట్నం: పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, మెళియాపుట్టి, కొత్తూరు పాలకొండ : పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని రాజాం: రాజాం, సంతకవిటి, వంగర, రేగిడి ఆమదాలవలస ఎచ్చెర్ల: ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, జి.సిగడాం జిల్లాలో ఓటర్లు 20,64,330 మంది.. శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14,57,096 మంది ఓటర్లు ఉండగా, జిల్లా నుంచి అరకు పార్లమెంటుకు పాలకొండ నియోజకవర్గం నుంచి 1,74,219 మంది ఓటర్లు ఉన్నారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల నంచి 4,33,015 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 20,64,330 మంది కాగా, వీరిలో పురుషులు 10,35,623 మంది, స్త్రీలు 10,28,460 మంది, ఇతరులు 247 మంది ఉన్నారు. ఇంకా ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 40 వేల మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరో వారం రోజుల పాటు నమోదుకు గడువు ఉంది. ప్రసుతం ఉన్న ఓటర్లకు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. అన్ని నియోజకవర్గాల్లోనూ కొత్తగా ఓటర్లు చేరే అవకాశం ఉంది. సిక్కోలు నైసర్గిక స్వరూపం.. జిల్లా 5,837 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన, ఉత్తరాన ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు, దక్షిణాన విజయనగరం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. భౌగోళికంగా ఒడిశాకు దగ్గరలో ఉన్నందున భిన్న సంస్కృతులు కలిగి ఉంది. ప్రధానంగా వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ నదులు ఉన్నాయి. మూడు రెవెన్యూ డివిజన్లు, 38 మండలాలు ఉన్నాయి. జనాభా.. జిల్లాలో ప్రస్తుత జనాభా సుమారు 30 లక్షల మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా 27,03,114 మంది ఉన్నారు. వీరిలో 13,41,738 పురుషులు ఉండగా, 13,61,376 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో 62.3 శాతం మంది అక్షరాష్యులు ఉన్నారు. సమస్యాత్మక పోలింగ్స్టేషన్లు.. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2084 ప్రాంతాల్లో 2908 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, వీటిలో 1025 ప్రాంతాల్లో 1523 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. వీటి పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా తగు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్ధను కాపాడేవారికే ఓటు సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేవారికే ఓటు వేయాలి. దేశ భవిష్యత్‌ను మార్చగలిగే సత్తా మన ఓటుకు ఉంది. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలి. ఎన్నికల సమయంలో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. మరో నెల రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అర్హులైనవారినే ఎన్నుకుందాం. – దత్తి మురళీకృష్ణ, ప్రైవేటు వైద్యుడు, వీరఘట్టం -
పర్స్..పటాస్!
పండుగ వచ్చిందంటే ఇల్లంతా సంతోషం... కొత్త బట్టలు, అలంకరణలు, చుట్టాలు, పిండివంటలతో సందడే సందడి. తెలుగు ప్రజలు పండుగలకిచ్చే ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. కానీ, ఇప్పుడు కొందరికి ఈ పండుగలు ఎందుకొచ్చాయిరా బాబూ అనిపిస్తోందట. ఎన్నికలకు ముందే ఈ పండుగలు రావాలా అని చిరాకు పుడుతోందట. ఒక్కోసారి ఎటయినా కనిపించకుండా పోదామా అని కూడా అనిపిస్తోందట. ఏంటీ పండుగలు? ఎవరికి చిరాకు పుట్టిస్తున్నాయి? అనుకుంటున్నారా.. అయితే చదవండి. సరదాగా గడిచిపోవాల్సిన ‘ఫన్’డుగలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఎందుకొచ్చిన దండగరా బాబూ అనిపిస్తున్నాయట. మొన్నీమధ్యే వినాయకచవితి వేళ.. ఔత్సాహికపోటీదారుల గుండెల్లో బాజాలు మోగిస్తే.. మొన్నటి దసరా వేళ కార్యకర్తలు, అనుచరుల అత్యుత్సాహానికి ‘జేబు’ సరదా తీరిపోయింది. తాజాగా రానున్న దీపావళికి ఇప్పటి నుంచే జేబుల్లో టపాసులు పేలుతున్నాయి. ఎన్నికల పండుగ ముందు వచ్చిన ఈ మూడు పండుగల పేరుతో ఇప్పటికే కొన్ని పార్టీల తరఫున అభ్యర్థులుగా ఖరారైన వారు, కొన్ని పార్టీల ఆశావహులు, తాజా మాజీ ఎమ్మెల్యేలకు తడిసి మోపెడవుతోందట. ముఖ్యంగా సెప్టెంబర్‌లో వచ్చిన వినాయకచవితి పండుగ కోసం విగ్రహాలు, మంటపాలు, అన్నదానాలు, కోలాటాలు, డీజేలు, కోలాట బృందాలకు చీరలు.. ఇలా బాగానే వదిలించుకున్నారట. ఇక, అక్టోబర్‌లో వచ్చిన దసరాకు ‘మామూళ్లు’ అయితే అరుసుకున్నయంట. యువజన సంఘాలు, బస్తీ, కాలనీ కమిటీలు దుర్గామాత విగ్రహాల పేరుతో రాజకీయుల గుమ్మం తొక్కడంతో ఎన్నికల ముందు ఔననలేక, కాదనలేక అందుబాటులో ఉన్నంతా సమర్పించేసుకున్నారట. మళ్లీ ఇప్పుడు నవంబర్‌లో దీపావళి. అసలే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల. ఎవరు అలిగినా కష్టమే కదా! అందుకే పటాసులకు అడిగిందే తడవు ఫటాఫట్ తీసిచ్చేస్తున్నారట. మొత్తమ్మీద సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్.. ఒక్కో నెలలో వచ్చిన ఒక్కో పండుగ నేతల జేబుకు చిల్లు పెట్టి నోట్ల కట్ల వరద పారించిందన్నమాట. ఇంకా నయం ఎన్నికలు జరిగే డిసెంబర్లో ఇంకో పండుగ వచ్చి ఉంటే తీట తీరిపోయేదని ఆశావహులు అనుకుంటున్నారట. అబ్బా... ఇన్ని కోట్లా! రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 23, జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణ ప్రాంతాల్లో ఉన్న 70 వరకు పోను గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గాలు 25 ఉన్నాయి. గ్రామీణ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నేతలు కలిపి ఒక్కో నియోజకవర్గంలో కనీసం రూ.2 కోట్ల వరకు ఈ మూడు పండుగలకు ఖర్చు పెట్టి ఉంటారని అంచనా. అంటే అవే రూ.50 కోట్లు. ఇక, పట్టణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాల్లో ఈ ఖర్చు రెట్టింపే.. కనీసం ఒక్కో అభ్యర్థి లేదా ఆశావహుడు రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు సమర్పించుకోవాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఒక్కోచోట రూ.4 కోట్ల వరకు ఖర్చయినా.. రూ.280 కోట్లు లెక్క తేలుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో అయితే నియోజకవర్గంలో ఉండే వందలాది బస్తీల్లోని గల్లీగల్లీల్లో పెట్టే విగ్రహాలు, మంటపాలు, అన్నదానాలకు కనీసం నియోజకవర్గానికి రూ.6 కోట్లయినా పెట్టి ఉంటారని అంచనా. ఒక్క గ్రేటర్ పరిధిలోనే రూ.140 కోట్ల వరకు నేతల చేతి చమురు వదలిందన్న మాట. మొత్తం లెక్క చేస్తే రూ.470 కోట్ల వరకు మూడు పండుగలు మింగేశాయంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఇరవయ్యో..ముప్పయ్యో అటూ ఇటూ ఖర్చయి ఉంటాయిలే అనుకుంటే ఎన్నికల జాతర ముందొచ్చిన మూడు పండుగల వల్ల ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న ఆశావహుల కాసుల పెట్టెల్లో రూ.500 కోట్లు గల్లంతయినట్టే! అబ్బా.. అప్పుడే ఇంత ఖర్చా? అనుకోవద్దు. ఎందుకంటే.. ‘ఇన్ ఫ్రంట్ దేరీజ్ క్రొకడైల్ ఫెస్టివల్!’ అంటున్నారు రాజకీయాలను నిశితంగా పరిశీలించే వారు. - మేకల కల్యాణ్ చక్రవర్తి ఓడించే గోడ... షాద్‌నగర్: గోడకు కొట్టిన బంతి వెనక్కి వచ్చేయడం ఎంత నిజమో ఈ గోడపై ఎవరిదైనా లీడర్ బొమ్మ పడినా.. ఆయన ఓడిపోవడం ఖాయం. ఇది స్థానికంగా బాగా నాటుకుపోయిన ఓ ‘నమ్మకం’. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని జానంపేట వెంకటేశ్వరస్వామి దేవాలయం ఎదురుగా రథశాల ఉంది. ఎన్నికల సమయంలో ఈ రథశాలపై ఏ పార్టీ అభ్యర్థికి సంబంధించిన వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీ, జెండాలు ఏర్పాటు చేస్తే ఆ అభ్యర్థి ఓడిపోతాడనే ప్రచారం ఉంది. ఈ రథశాల గోడపై గతంలో కొందరు అభ్యర్థుల పోస్టర్లు వెలిస్తే.. వారు ఓటమి చెందారట. ఇలా ఓడిపోయిన వారిలో మాజీ మంత్రులు, ప్రముఖ నాయకులు ఉన్నారట. అందుకే అప్పటి నుంచి ఈ రథశాల గోడపై ఏ ఒక్క పోస్టరూ పడదు. -
కత్తిమీద సాముగా సీట్ల సర్దుబాటు!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేస్తున్న అధికార టీఆర్ఎస్ అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. రానున్న ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలోకి దింపాల్సిన గెలుపు గుర్రాల ఎంపిక అంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సారి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల సీట్ల సర్దుబాటు టీఆర్ఎస్ నాయకత్వానికి కత్తిమీద సాము కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడిచిన మూడేళ్లలో దాదాపు అన్ని జిల్లాల్లో ఇతర పార్టీలనుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరిగాయి. దీంతో పాత, కొత్త నేతలతో అసెంబ్లీ నియోజకవర్గాలు కిక్కిరిసిపోయాయి. ఇలా టీఆర్ఎస్లో చేరిన నేతల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలూ ఉన్నారు. వీరంతా తమ రాజకీయ భవిష్యత్ కోసమే గులాబీ గూటికి చేరారన్నది బహిరంగ రహస్యం. వీరిలో అత్యధికులు వచ్చే ఎన్నికల్లో పోటీకి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నవారే. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు కనీసం వెయ్యి మంది ఆశావహులు ఉంటారన్నది ఒక అంచనా. ఈ పరిస్థితుల్లో అధినేత కేసీఆర్ ఏ సమీకరణాలతో టికెట్లు ఇస్తారన్నది అధికార పార్టీలో ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది చివరిలోగా ముందస్తు ఎన్నికలు ముంచుకు వచ్చే అవకాశం ఉందని, అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పార్టీ నేతలకు సమాచారం అందడంతో నియోజకవర్గాల్లో ‘రాజకీయం’వేగం పుంజుకుంది. అయిదు వర్గాలుగా ఆశావహులు.. టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని ఉబలాట పడుతున్న నేతలు అయిదు వర్గాలుగా ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన వారు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి నియోజకవర్గ ఇన్చార్జులుగా కొనసాగుతున్న వారు, వివిధ పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరి టికెట్లు ఆశిస్తున్న వారు... ఇలా మొత్తంగా అయిదు వర్గాల నేతలు ఆశావహులుగా ఉన్నారు. ఏపీ పునర్విభజన చట్టం మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగకుంటే టికెట్లకోసం మరింత ఒత్తిడి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాల్లో గెలవగా, ఉప ఎన్నికల్లో మరో రెండు చోట్ల గెలిచింది. దీంతో ఆ సంఖ్య 65కు చేరగా, వివిధ పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు 25 మందిని కలిపితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంఖ్య 90కి చేరింది. వీరందరికీ టికెట్లు ఇస్తారనుకున్నా, ఇక మిగిలేది కేవలం 29 నియోజకవర్గాలు మాత్రమే. కానీ, టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య దీనికి పదింతలకు పైనే ఉందని, ఈ లెక్కన వడబోత అంత తేలిక కాదని అంటున్నారు. పునర్విభజనపై ఆశలు.. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అదనంగా మరో 34 స్థానాలు పెరుగుతాయని, దీంతో కొంత ఒత్తిడిని అధిగమించవచ్చన్న భావనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. జరగని పక్షంలో పనితీరు ప్రాతిపదికన కొందరు సిట్టింగ్‌లపై వేటు తప్పదని తెలుస్తోంది. కనీసం 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల మెడలపై కత్తి వేలాడుతోందని చెబుతున్నారు. ఆశావహుల జాబితాను తగ్గించేందుకు నామినేటెడ్ పదవుల భర్తీని చేపట్టారు. దీంతో రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కిన వారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కొత్తా జిల్లాలండి..!
మహానగరంలో రెండు, ప్రాంతాలతో మరొకటి పెరగనున్న రెవెన్యూ డివిజన్లు, మండలాలు కలెక్టర్లతో సమీక్ష తర్వాత ప్రకటన! సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. జంట జిల్లాల్లో తొలి నుంచి నెలకొన్న జిల్లాల విభజన గందరగోళానికి సిటీలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల వర్క్ షాపులో కొంత స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ సదస్సులో జంట జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా జిల్లాల పునర్వవ్యస్థీకరణ కసరత్తును సీసీఎల్ఏ పూర్తి చేసినట్టు తెలిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం ఉనికి, రూపు రేఖలు, చారిత్రక ప్రాధాన్యత దెబ్బతినకుండా జంట జిల్లాలను మూడు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జంట జిల్లాల్లో కొత్తగా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి (వికారాబాద్ కేంద్రం) జిల్లాలు ఆవిర్భవించే అవకాశముంది. అదే విధంగా జంట జిల్లాలో కొత్తగా మూడు రెవెన్యూ డివిజన్లు, 10 మండలాలు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 20 మండలాలు, సికింద్రాబాద్ జిల్లా పరిధిలో 23 మండలాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 20 మండలాలు ఉండనున్నట్టు తెలుస్తోది. రంగారెడ్డి జిల్లాను వికారాబాద్ కేంద్రంగా గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేయనున్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని మండలాల ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. అధికారుల నివేదిక ఆధారంగా ఈ నెలాఖరులో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలకు సంబంధించిన అంశాలపై జంట జిల్లాల ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత మళ్లీ కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. -
2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి సాధ్యమే
ఆకివీడు/తాడేపల్లిగూడెం : తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నియోజకవర్గాల పెంపుపై చర్చలు జరుగుతున్నట్టు ప్రకటించడంతో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేగుతోంది. పెంపు ఎలా జరుగుతుంది, ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి వంటి విషయాలపై చర్చసాగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన నేపథ్యంలో కొత్తగా మరో నాలుగైదు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలను 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించింది. దీంతో జనాభా ప్రాతిపదికన విభజన జరుగుతుందా? లేక భౌగోళిక పరిస్థితులను బట్టి చేస్తారా? అనేదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే జిల్లాకు ఐదు కొత్త నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపు మండలాలు కుకునూరు, వేలేరుపాడు జిల్లాలో కలిశాయి. దీంతో మొత్తం మండలాల సంఖ్య 48కి చేరింది. ఈ నేపథ్యంలో ఎస్టీ నియోజకవర్గమైన పోలవరం రెండుగా చీలే అవకాశం ఉందనే వాదన వినబడుతోంది. గత విభజన లోపభూయిష్టం గతంలో 2009కి ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజన లోపభూయిష్టంగా, అశాస్త్రీయంగా జరిగిందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. భౌగోళిక పరిస్థితులను బేరీజు వేసుకోకుండా చేశారనే ఆరోపణలు వచ్చాయి. భౌగోళికంగా పెద్ద మండలాలను, దూరంగా ఉన్న మండలాలను కలిపి నియోజకవర్గంగా ఏర్పాటు చేశారనే వాదనలు వినిపించాయి. ఉండి, భీమవరం నియోజకవర్గాల కూర్పు ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. ఉండి నియోజకవర్గంలో భాగమైన పాలకోడేరు మండలం భౌగోళికంగా ఓ మూలన దూరంగా ఉంటుంది. అలాగే భీమవరం నియోజకవర్గంలో చేర్చిన వీరవాసరం మండలం, భీమవరం పట్టణానికి మధ్య మరో మండలం ఉంది. దానిని వేరే నియోజకవర్గంలో చేర్చడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే తరహాలోనే మిగిలిన నియోజకవర్గాలూ ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితులను పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ప్రజలు పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత పునర్విభజన సమయంలో జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉండగా, ఆ సంఖ్యను 15కి కుందించారు. అప్పట్లో అత్తిలి, పెనుగొండ నియోజకవర్గాలు అంతర్ధానమయ్యాయి. ఈ నియోజకవర్గాల్లోని మండలాలను తణుకు, ఉంగుటూరు, ఆచంట నియోజకవర్గాల్లో కలిపారు. దీంతో సామాజిక బలాబలాల్లోనూ తేడాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారైనా.. శాస్త్రీయంగా పునర్విభజన చేపట్టాలని రాజకీయవర్గాలతోపాటు ప్రజలు కోరుతున్నారు. భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. నియోజకవర్గాలు చిక్కే అవకాశం ! పునర్విభజన జరిగితే పాత నియోజకవర్గాలు చిక్కిపోతాయనే భావన వ్యక్తమవుతోంది. తాడేపల్లిగూడెం పరిధి తగ్గిపోతుందని, ఆ మండలంలోని డెల్టా ప్రాంత గ్రామాలు, పెంటపాడు మండలంలోని 13 గ్రామాలు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీతో కలిసి నియోజకవర్గంగా ఏర్పడవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలను విడదీసి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాలతోపాటు, తాడేపల్లిగూడెం మండలంలోని అడ్డరోడ్డుగా పేరున్న గ్రామాలను కలిపి ద్వారకాతిరుమల నియోజకవర్గం ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది. గాలిపటం తోకల్లా నియోజకవర్గాల విభజన గాలి పటం తోకల్లా ఉండకూడదు. ప్రజలకు సౌలభ్యంగా ఉండాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విభజన ప్రక్రియ చేయవద్దు. నియోజకవర్గానికి దగ్గరలోని గ్రామాలన్నింటినీ కలుపుకోవాలి. భౌగోళిక పరిస్థితులు ముఖ్యం. -మేకా శేషుబాబు, ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి సాధ్యమే నియోజకవర్గాల పునర్విభజన వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయవచ్చు. దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం 20 ఏళ్లకొకసారి నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అయితే రాష్ర్ట విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నియోజకవర్గాలను పెంచాలని కోరాయి. దీనికి కేంద్రం స్పందించి వెంటనే కమిటీ ఏర్పాటు చేస్తే వచ్చే ఎన్నికల నాటికి ప్రక్రియ పూర్తవుతుంది. కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది. పార్లమెంటు ఆమోదంతో ఎన్నికల కమిషన్ దానిని అమలు జరుపుతుంది. -యర్రా నారాయణస్వామి, రాజ్యసభ మాజీ సభ్యులు -
నియోజకవర్గాల నెంబర్లు మారాయ్!
శ్రీకాకుళం పాతబస్టాండ్:రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల క్రమ సంఖ్యలను మార్చారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 294 నియోజకవర్గాలు ఉండగా శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల క్రమ సంఖ్య 120(ఇచ్ఛాపురం)తో మొదలై, 129(పాలకొండ)తో ముగిసేది. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాలు ఉండగా వాటి క్రమసంఖ్యను శ్రీకాకుళం జిల్లా నుంచే అదే ఇచ్ఛాపురం నుంచే మొదలు పెట్టడం విశేషం. 1(ఇచ్ఛాపురం) నంచి మొదల 10(పాలకొండ)తో ముగుస్తుంది. -
ఓటర్లు40 లక్షలు
40 లక్షల ఓటర్లు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 40,07,054 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటర్ల ముసాయిదా జాబితాను గురువారం ఎన్నికల అధికారులు విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల నాటికి జిల్లాలో 39,644,78 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఈనెల 12 వరకు 42వేల మందికి పైగా ఓటర్లుగా నమోదయ్యారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 40 లక్షలు దాటింది. ఇందులో 21,28,972 పురుష, 18,77,606 మహిళాఓటర్లతోపాటు 476 మంది ఇతర ఓటర్లుగా జాబితాలో ఉన్నారు. ఈ ముసాయిదా జాబితాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో, పోలింగ్ కేంద్రాల భవనాల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వచ్చేనెల 8వ తేదీ వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. 2015 జనవరి 5వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అదే నెల 15న ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు. సంక్షిప్తంగా షెడ్యూలు.. అంశం తేదీలు ఓటర్ల ముసాయిదా జాబితా వెల్లడి నవంబర్ 13 అభ్యంతరాల స్వీకరణ నవంబర్13 - డిసెంబర్ 8 వార్డు సభల్లో ఓటర్ల వివరాలు వెల్లడి నవంబర్ 19, 26 ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నవంబర్ 16,23,30, డిసెంబర్ 7 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం డిసెంబర్ 22 తాజా జాబితా తయారీ, కొత్త ఓటర్ల చేర్పు జనవరి 5 ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా జనవరి 15, 2015 -
34 కొత్త నియోజకవర్గాలు
తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు కసరత్తు షురూ ►119 స్థానే 153కు చేరనున్న తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య ►ఎస్సీలకు 23, ఎస్టీలకు 19 స్థానాలు కేటాయించే అవకాశం ►రంగారెడ్డిలో అత్యధిక స్థానాలు, నిజామాబాద్‌లో అత్యల్పం ►కొత్త వాటిల్లోనే 2019 ఎన్నికలు, 2026 వరకు కొనసాగింపు కొత్త రాష్ట్రంలో మరిన్ని శాసనసభ నియోజకవర్గాలు ఏర్పాటు కాబోతున్నాయి. తెలంగాణ పది జిల్లాల్లో మరో 34 శాసనసభ స్థానాలు ఏర్పాటు దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమిక కసరత్తును ప్రారంభించటంతో రాజకీయ పార్టీలు, నాయకుల్లో మళ్లీ ఆసక్తికరమైన చర్చలకు తెరలేస్తోంది. దీంతో ప్రస్తుత శాసనసభ నియోజకవర్గాల హద్దులు మారిపోవటం, కొత్తగా మరిన్ని ఏర్పాటు అవుతుండడం, ఎస్సీ, ఎస్టీలకు ఇంకొన్ని నియోజకవర్గాలు రిజర్వు కానున్న నేపథ్యంలో అందరి దృష్టి నియోజకవర్గాల పునర్విభజనపై పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త నియోజకవర్గాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో 2,30,064 జనాభా సగటును ప్రామాణికంగా తీసుకుని ప్రక్రియను ప్రారంభించనున్నారు. ప్రస్తుతవుున్న 119 శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 153కు చేరుకోనుంది. ఈ పునర్విభజనలో అత్యధిక స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పెరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏకంగా పదకొండు కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నారుు. మహబూబ్‌నగర్ జిల్లాల్లోనూ నాలుగు నియోజకవర్గాలు ఏర్పాటై మొత్తం సంఖ్య 18కి చేరనుంది. పునర్విభజన సాగేదిలా... 2001 జనాభా లెక్కల మేరకు ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్‌సభ, 119 శాసనసభ స్థానాలున్నాయి. వీటిలో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12లకు రిజర్వు అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలు విడిపోవటంతో 42 లోక్‌సభ పరిధిలో కొత్తగా రెండేసి చొప్పున శాసనసభ నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో 34 (119+34=153) శాసనసభ స్థానాలు పెరుగుతాయి. లోక్‌సభ స్థానాలు 2026 వరకు యథావిధిగా ఉంటాయి. 2011 జనాభా లెక్కల వివరాలను పరిగణనలోకి తీసుకుని శాసనసభ స్థానాల పునర్విభజన జరుగుతుంది. ఈ ప్రకారం తెలంగాణ జనాభా 3,51,93,978గా తేల్చారు. దీంతో మొత్తం జనాభాను 153తో విభజిస్తే వచ్చే సగటు మేరకు నియోజకవర్గాల ఏర్పాటు జరుగుతుంది. అంటే 2,30,026 జనాభాకు ఒక్క నియోజకవర్గం ఏర్పాటవుతున్నట్లు లెక్క. అయితే పునర్విభజన చట్టం మేరకు ప్రత్యేక పరిస్థితుల్లో నియోజకవర్గ జనాభా రాష్ట్ర సగటు కంటే 10 శాతం తక్కువ లేదా 10 శాతం ఎక్కువతోనైనా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. దళితులకు 23 శాసనసభ స్థానాలు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దళితుల జనాభా 16.19 (2001 జనాభా) శాతంగా నమోదు కాగా, విడిపోయిన అనంతరం తెలంగాణలో దళితుల జనాభా సగటు 15.44 శాతంగా తేలింది. రాష్ట్రంలో ఎస్సీలకు ప్రస్తుతం 19 స్థానాలు ఉండగా పునర్విభజన తర్వాత 23కు చేరుకోనున్నాయి. జిల్లాలోని ఎస్సీ జనాభా ఆధారంగా ఈ స్థానాలను రిజర్వ్ చేస్తారు. అత్యధికంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎస్సీలకు మూడేసి చొప్పున నియోజకవర్గాలు రిజర్వయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కరీంనగర్లో దళితులకు మూడు నియోజకవర్గాలు రిజర్వు కాగా, పెరిగే స్థానాలు వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కేటాయించే అవకాశం ఉంది. ఎస్టీలకు 16 స్థానాలు... ఎస్టీలకు ప్రస్తుతం 12 శాసనసభ స్థానాలు ఉండగా పునర్విభజన తర్వాత 16కు చేరుకోనుంది. 2011 జనాభా లెక్కల మేరకు తెలంగాణ రాష్ట్రంలో 9.34 శాతం గిరిజనులు ఉన్నట్లు లెక్కతేల్చారు. ఈ మేరకు గిరిజనులకు మరో నాలుగు స్థానాలు పెరుగుతాయి. రిజర్వేషన్లను మాత్రం రాష్ట్ర యూనిట్‌గా తీసుకుని కేటాయింపు చేస్తారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎస్టీలకు మరిన్ని సీట్లు రిజర్వు కానున్నాయి. గ్రేటర్‌లోనే కొత్తగా పది స్థానాలు పునర్విభజనలో గ్రేటర్ హైదరాబాద్‌లో కనీసం పది శాసనసభ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ కోర్‌సిటీ(హైదరాబాద్ జిల్లా)లో రెండు నియోజకవర్గాలు పెరుగుతుండగా, గ్రేటర్ హైదరాబాద్‌లో భాగమైన శివార్లు(రంగారెడ్డి జిల్లా) కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మహేశ్వరం తదితర నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలన్నీ విడిపోయి కనీసం ఎనిమిది కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పునర్విభజన ఇలా.. తెలంగాణ జనాభా(2011) : 3,51,93,978 నియోజకవర్గ సగటు జ నాభా : 2,30, 026 మొత్తం నియోజకవర్గాలు : 153 ఎస్సీలకు రిజర్వు అయ్యేవి : 23 ఎస్టీలకు రిజర్వు అయ్యేవి : 16 అత్యధిక స్థానాల జిల్లా : రంగారెడ్డి (23) తక్కువ స్థానాల జిల్లా : నిజామాబాద్(11) -
ఒకటా.. రెండా.. మూడా..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయా? ఒక్కో పార్లమెంటు స్థానంలో రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున పెంచితే జిల్లాలో పెరిగే నియోజకవర్గాల సంఖ్య మూడుకు చేరుతుందా? ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లడంతో ఒక్కటే పెరుగుతుందా? కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలేంటి? ఖమ్మం-2 వస్తుందా? ఏన్కూరు కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటవుతుందా? కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు తప్పవా?...అనే చర్చ ప్రస్తుతం జిల్లాలో జోరుగా సాగుతోంది. తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాయడంతో ‘పునర్విభజన’ లెక్కలు మళ్లీ మొదలయ్యాయి. పునర్విభజన జరిగితే జిల్లాలో 12 నియోజకవర్గాలవుతాయని, కొత్తగా ఏర్పడే రెండు స్థానాలు జనరల్‌కు రిజర్వ్ అవుతాయని చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో కూడా అసెంబ్లీ స్థానం పెంపు అంశం ఉండడంతో 2019 ఎన్నికల నాటికి జిల్లాలోని నియోజకవర్గాల స్వరూపంలో మార్పులు కచ్చితంగా వస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలు ప్రకియ్ర ప్రారంభమయ్యేందుకు చాలా సమయమున్నా... ముఖ్యమంత్రి లేఖ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, మేధావులతో పాటు సామాన్య ప్రజల్లో కూడా డీలిమిటేషన్ చర్చ జరుగుతోంది. ఏం జరగవచ్చు..? జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ పార్టీల్లో పలురకాల చర్చలు నడుస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్యతో పాటు రిజర్వేషన్ల మార్పుల అంశంపైనా ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రాథమిక అంచనా మేరకు జిల్లాలో పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు 12కు పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల అంచనా. కొత్తగా ఖమ్మం-2, ఏన్కూరు నియోజకవర్గాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలంటున్నాయి. వారి అంచనాల ప్రకారం... ఖమ్మం త్రీటౌన్ ప్రాంతం (రైల్వే ట్రాక్‌కు అవతలి వైపు), రూరల్ మండలాలను కలిపి ఖమ్మం-2 నియోజకవర్గం ఏర్పాటవుతుంది. ప్రస్తుతం ఖమ్మం అసెంబ్లీలో భాగంగా ఉన్న ఖమ్మం 1, 2 టౌన్లు, రఘునాధపాలెం మండలం యథావిధిగా ఉంటాయి. ఇక పాలేరు నియోజకవర్గంలో ఉన్న రూరల్ మండలం ఖమ్మం-2లో కలిస్తే ముదిగొండ మండలం మళ్లీ పాలేరులోకి రానుంది. మధిర నుంచి విడిపోయి మళ్లీ పాతస్థానంలో కలిసే అవకాశం ఉంది. ఇక, మిగిలిన మధిర, బోనకల్, ఎర్రుపాలెం, చింతకాని మండలాలతో మధిర కొనసాగుతుంది. ఇల్లెందు నియోజకవర్గంలో కొత్తగా గుండాల మండలం కలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు పినపాక నియోజకవర్గంలో ఉన్న ఆ మండలం ఇల్లెందుకు వచ్చే అవకాశాలుంటాయి. అయితే, ఇప్పటివరకు ఇల్లెందులో ఉన్న కామేపల్లి విడిపోతుంది. ఇల్లెందు, బయ్యారం, గార్ల, టేకులపల్లి, గుండాల మండలాలతో కలిపి ఇల్లెందు నియోజకవర్గం అవుతుంది. వైరా నియోజకవర్గం కూడా స్వరూపాన్ని మార్చుకోనుంది. ఆ నియోజకవర్గం నుంచి మూడు మండలాలు విడిపోయి రెండు మండలాలు కలవనున్నాయి. ఇప్పటివరకు వైరాలో ఉన్న ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లితో పాటు కామేపల్లిని కలుపుకుని ఏన్కూరు కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటవుతుందని అంచనా. ఇక వైరాలో వైరా, కొణిజర్ల, తల్లాడ, కల్లూరు మండలాలు ఉంటాయి. అదే జరిగితే సత్తుపల్లి మున్సిపాలిటీ, రూరల్, వేంసూరు, పెనుబల్లి మండలాలు సత్తుపల్లి నియోజకవర్గంలో ఉంటాయి. అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఆంధ్రలో కలవనుండగా, మిగిలిన మండలాలతో (అశ్వారావుపేట, చంద్రుగొండ, ములకలపల్లి, దమ్మపేట) అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పాటు కానుంది. ఇక ముంపు ప్రాంతం కింద ఆంధ్రలోనికి వెళ్లే భద్రాచలం నియోజకవర్గంలోని మండలాలు పోను భద్రాచలం టౌన్, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాలు భద్రాచలం అసెంబ్లీ పరిధిలో ఉంటాయి. పినపాక నుంచి గుండాల పోను మణుగూరు, పినపాక, బూర్గంపాడు (ఆరు గ్రామాలు ఆంధ్రలోనికి వెళ్తాయి.), అశ్వాపురం మండలాలతో ఈ నియోజకవర్గం కొనసాగుతుంది. కొత్తగూడెం మాత్రం యథావిధిగా కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, మండలాలతో కలిపి కొనసాగుతుంది. రిజర్వేషన్లలోనూ మార్పు! పునర్విభజన జరిగితే అసెంబ్లీ నియోజకవర్గాల రిజర్వేషన్లలోనూ మార్పులు జరగనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే పాలేరు నియోజకవర్గంలో ముదిగొండ మండలం కలిస్తే అది ఎస్సీకి రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లోని ఎస్సీ జనాభాలో ఉన్న 0.5 శాతం వ్యత్యాసం కారణంగా సత్తుపల్లి ఎస్సీకి రిజర్వ్ అయింది. అదే ముదిగొండ మండలాన్ని మళ్లీ పాలేరులో కలిపితే అదే వ్యత్యాసంతో పాలేరును ఎస్సీకి రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అలా జరిగితే మళ్లీ సత్తుపల్లి జనరల్ కావచ్చు. ఇక, వైరాలో మార్పులు జరిగితే అది జనరల్‌కు రిజర్వ్ అవుతుందని, ఏన్కూరు కేంద్రంగా ఏర్పడే నియోజకవర్గం ఎస్టీకి రిజర్వ్ చేస్తారని అంచనా. మొత్తంమీద జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల సంఖ్యలో మార్పుండదు కానీ ఈ రెండు నియోజకవర్గాల రిజర్వేషన్లు మారొచ్చని అంచనా. దీంతోపాటు కొత్తగా ఏర్పడే ఖమ్మం - 2, తోపాటు వైరా నియోజకవర్గాలు కూడా జనరల్‌కు రిజర్వ్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అప్పుడు జిల్లాలో జనరల్ నియోజకవర్గాల సంఖ్య ఐదుకు చేరుతుంది. ఇప్పటివరకు ఉన్న జనరల్స్థానాల కరువు కూడా తీరుతుంది. కాగా, తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మేరకు కొత్తగూడెం లేదా భద్రాచలం కేంద్రంగా మరో జిల్లా ఏర్పడినప్పటికీ.. నియోజకవర్గాలను రాష్ట్రం యూనిట్‌గానే పరిగణిస్తున్నందున ఇందులో మార్పు ఉండదని పరిశీలకులు భావిస్తున్నారు. పార్లమెంటుకు రెండు చొప్పున.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అంటే కొత్తగా 34 స్థానాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలుంటే, ఒక్కో ఎంపీ స్థానానికి రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున పునర్విభజన జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగాల్సి ఉంటుంది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో రెండు, మహబూబాబాద్ పరిధిలో ఓ స్థానం పెరిగే అవకాశం ఉన్నా, ముంపు ప్రాంతం కింద ఏడు మండలాల్లోని రెండు లక్షలకు పైగా జనాభా ఆంధ్రప్రదేశ్‌లో కలవడంతో ఒక నియోజకవర్గం తగ్గుతుందని అంచనా. అసలేం జరుగుతుంది? కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ లేఖ రాసినప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇప్పటికిప్పుడే జరిగే అవకాశం లేదు. సీఎం రాసిన లేఖకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభిస్తే దీనిపై సీఈసీ ఓ కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం పునర్విభజనపై కసరత్తు చేస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎలా చేయాలి? ఎంత జనాభా యూనిట్‌గా వస్తుంది? దాన్ని బట్టి మండలాలు, గ్రామాల సరిహద్దులు చెరిగిపోకుండా జనాభా లెక్కకు మించకుండా శాస్త్రీయ పద్ధతిలో ఒక ప్రతిపాదనను తెస్తుంది. ఆ ప్రతిపాదన తయారు చేసే క్రమంలో అన్ని రాజకీయ పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుంటారు. అదే విధంగా అభ్యంతరాల నమోదును కూడా పరిశీలించి ఆ తర్వాత తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు. -
డీఎంకేలో ప్రక్షాళన
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి డీఎంకే నేతల కంటిపై కునుకు లేకుండా చేసింది. ప్రత్యర్థి అన్నాడీఎంకే జయకేతనం వారిని మరింత కృంగదీసింది. పార్టీని ప్రక్షాళన చేయడం ద్వారా కోల్పోయిన జవసత్వాలను కూడగట్టుకునే పనిలో పడింది. ఓటమి భారంతో అస్తమించిన ‘సూర్యుడి’ని మళ్లీ ఉదయింపజేసేందుకు సన్నద్ధం అవుతోంది. - రాజీనామా లేదా తొలగింపు - కొత్తగా 10 జిల్లా కమిటీలు - జూన్ 2న ఉన్నతస్థాయి సమావేశం చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని అంశాల్లో ఎదురుదెబ్బలు తింటున్న డీఎంకేకు లోక్‌సభ ఎన్నికలు మరో చేదు అనుభవాన్ని మిగి ల్చారుు. 37 స్థానాల్లో ఒంటి చేత్తో విజయం సాధిం చిన సీఎం జయలలిత దూకుడుకు కళ్లెం వేయలేని డీఎంకే డీలా పడింది. స్వయంగా పోటీ చేసిన 35, మిత్రపక్షాలకిచ్చిన ఐదు ఏ ఒక్కింటినీ డీఎంకే దక్కించుకోలేక పోయింది. పైగా అనేక చోట్ల డిపాజిట్టు కోల్పోయి అవమానాల పాలైంది. ఈలం తమిళుల సమస్య, అవినీతి, అక్రమాల ఆరోపణలపై సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రులు ఏ రాజా, దయానిధి మారన్‌లను పోటీకి దింపడం, కరుణ పెద్ద కుమారుడు అళగిరి బహిష్కరణతో పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాలు తమ కొంపముంచాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ ప్రతిష్ట అడుగంటిపోయిన స్థితిలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే మీమాంసలో పడిపోయారు. ప్రక్షాళన, పదవులతో పూర్వ వైభవం పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేస్తూ సంస్కరించడం ద్వారా పూర్వవైభవం సాధించాలని డీఎంకే అగ్రనాయకత్వం ఆశిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కోశాధికారి, కరుణ తనయుడు స్టాలిన్ రాజీనామా చేయడం, పార్టీ నిరాకరించడం, ఆయన ఉపసంహరిచడం వంటి హైడ్రామా సాగింది. ఇందుకు కొనసాగింపుగా జూన్ 2న పార్టీ ఉన్నతస్థాయి సమావేశానికి ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ పరాజయంపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చలు జరపనుంది. అధిక సంఖ్యలో అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన 10 జిల్లాలను పార్టీపరంగా రెండుగా విభజించి రెండు కమిటీలను వేయాలని భావిస్తోంది. తద్వారా ఎక్కువమందికి పార్టీ పదవులను కట్టబెట్టితే వారు ఉత్తేజితులు కాగలరని అదిష్టానం ఆశపడుతోంది. పార్టీ అధ్యక్ష, కార్యదర్శ పదవుల్లో సుదీర్ఘకాలంగా ఉన్నవారిని తొలగించి కొత్తవారికి ఇవ్వాలని సంకల్పించింది. సుమారు 20 ఏళ్లుగా అధ్యక్ష, కార్యదర్శులున్నవారు 50 శాతం మంది ఉన్నారు. వీరందరికీ పదవీ వియోగం తప్పేట్లు లేదు. జిల్లా స్థాయిలో మార్పులు, కూర్పులు చేసేందుకు వీలుగా నేతల నుంచి స్వచ్ఛందంగా రాజీనామాలు కోరాలని, కాదన్నవారిని బలవంతంగా తప్పించాలని భావిస్తోంది. -
నేడే తెర
ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు అసెంబ్లీ నియోజకవర్గాలు : 14 పార్లమెంట్ నియోజకవర్గాలు: 2 పోటీ పడిన అభ్యర్థులు: 205 లెక్కింపు కేంద్రాలు 5 కౌంటింగ్ సిబ్బంది: 1,512 మంది మొత్తం రౌండ్లు: 14 నుంచి 20 వరకు ఒక్కో రౌండ్‌కు పట్టే సమయం: 15 నిమిషాలు మొదటి ఫలితం: శ్రీశైలం లేదా మంత్రాలయం సాక్షి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. సరిగ్గా శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకాబోతోంది. మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చేస్తుంది. ఏ నియోజక వర్గంలో ఏ పార్టీ పాగా వేసింది.. రాష్ట్రాన్ని ఏలబోయే పార్టీకి జిల్లాలో ఎన్ని స్థానాలు వచ్చాయనేది కూడా తేలనుంది. ఇంతకీ విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది. ఇదే ఇప్పుడు అందరిలో టెన్షన్..! లెక్కింపు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అటు అభ్యర్థుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటి వరకు పురపాలిక, పరిషత్తు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లోనూ తమకు తిరుగేలేదన్న ధీమా వారిలో కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా వస్తాయని చెబుతోంది. ప్రాదేశిక పోరులో స్వతంత్ర అభ్యర్థులతో కూడా సమానంగా ఓట్లు సాధించలేని కాంగ్రెస్ పరువు కోసం పాకులాడుతోంది. పూజా కార్యక్రమాలు, విహార యాత్రలు ముగించుకుని నియోజకవర్గాలకు చేరుకున్న అభ్యర్థులు గురువారమే వారి మద్దతుదారులతో కలిసి కౌంటింగ్ కేంద్రాలున్న కర్నూలు, నంద్యాలకు చేరుకున్నారు. మొత్తం మీద రెండు పార్లమెంటు స్థానాల్లో బరిలో నిలిచిన 26 మంది, 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న 179 మంది అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. పకడ్బందీ ఏర్పాట్లు.. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జిల్లాలో ఐదు కేంద్రాల్లో జరగనుంది. కర్నూలు లోక్‌సభ స్థానంతోపాటు, దీని పరిధిలోని కర్నూలు, పత్తికొండ, కోడుమూరు శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతుంది. రవీంద్ర మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నంద్యాల పార్లమెంట్ స్థానంతోపాటు దాని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పాణ్యం సమీపంలోని ఆర్జీఎం క్యాంపస్‌లో జరుగుతుంది. అలాగే ఆళ్లగడ్డ, శ్రీశైలం శాసనసభ స్థానాల ఓట్ల లెక్కింపు నెరవాడలోని శాంతిరామ్ ఫార్మసీ కళాశాలలోను, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, డోన్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలోను, నంద్యాల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లను, రిటర్నింగ్ అధికారికి, పరిశీలకుడికి చేరొక టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రోఅబ్జర్వర్ ఉంటారు. ఈ విధంగా ప్రతి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గానికి రిజర్వరు సిబ్బందితో కలిపి 108 మంది విధులు నిర్వర్తిస్తారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ కొనసాగిస్తున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు... సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించే 8 గంటలలోపు మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ నియోజకవర్గానికి 2 నుంచి 3 టేబుళ్లను ఏర్పాటు చేయగా.. పార్లమెంటు నియోజకవర్గాలకు ఇందుకు భిన్నంగా ఏర్పాటు చేశారు. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు 8 టేబుళ్లను ఏర్పాటు చేశారు. నంద్యాల పార్లమెంటు స్థానానికి 9 టేబుళ్లను సిద్ధంగా ఉంచారు. వీటి తర్వాతే ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. ఎవరి ధీమా వారిదే.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలతో వాళ్లు ఉన్నారు. జిల్లాలో పురపాలక, పరిషత్తు ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా రావడం, వివిధ సర్వేలు కూడా తమకే అనుకూలంగా ఉండడంతో సార్వత్రిక ఎన్నికల్లోనూ తిరుగులేని అధిపత్యం సాధించగలమని వైఎస్సార్సీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. జిల్లాలోని 8 పురపాలక సంఘాలకుగాను 5 చోట్ల విజయబావుటా ఎగురవేయడం, 53 జెడ్పీటీసీలకుగాను 30 గెలుచుకుని తిరుగులేని అధిపత్యం సాధించడం, 23 మండల పరిషత్‌లను కూడా కైవసం చేసుకోవడం వైఎస్సార్సీపీ శ్రేణులకు కొండంత బలాన్నిస్తోంది. మరోవైపు టీడీపీ పుర, పరిషత్తు ఎన్నికల ఫలితాలతో ఇప్పటికే డీలా పడింది. టీడీపీ నాయకులు, శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతింది. ఎవరూ కిమ్మనకుండా.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామన్న నమ్మకం కాంగ్రెస్ నాయకుల్లో కొరవడింది. ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ లోక్‌సభ, శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. 16వ తేదీన ఉదయం 6 గంటలకే ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం వద్దకు రావాలన్నారు. పాస్‌లు పొందిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. లోపలికి వెళ్లిన ఏజెంట్లు బయటకు వస్తే మళ్లీ తిరిగి లోపలికి అనుమతించబోమన్నారు. ఐదు కేంద్రాల్లో చేపట్టే లెక్కింపు కార్యక్రమంలో 1512 మంది సిబ్బంది పని చేస్తారని చెప్పారు. మొత్తం 14 నుంచి 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభమవుతుందని.. దాదాపు 12 గంటలలోపు అన్ని ఫలితాలు వెల్లడవుతాయన్నారు. ఒక్కో రౌండ్ 15 నిమషాల్లోపు పూర్తవుతుందని, ఆదోని లేదా శ్రీశైలం, మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించి మొదటి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అత్యధిక పోలింగ్ కేంద్రాలు ఉన్న పాణ్యం నియోజకవర్గం ఫలితం వెలువడే సరికి కొంత ఆలస్యం కావచ్చని పేర్కొన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యధికంగా అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఫలితం కొంత ఆలస్యం కానుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వేర్వేరుగా మీడియా సెంటర్లు ఉంటాయని చెప్పారు. ప్రతి రౌండులో టేబుల్ వారీగా అభ్యర్థులకు వచ్చిన వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తారని, వీటి జిరాక్స్ కాపీలు రౌండు వారీగా మీడియా సెంటర్లకు పంపుతామని పేర్కొన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలు ఎప్పటికప్పుడు ఎన్నికల వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు సహకరించాలని కోరారు. -
ఓటేయని బద్ధకస్తులు 7,85,377
జిల్లాలో సాధారణ ఎన్నికల పోలింగ్ శాతం మారింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 72.21 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు గురువారం ప్రకటించారు. మొదట జిల్లాలో 75.20 శాతం పోలింగ్ జరిగినట్టు వెల్లడించగా, తుది లెక్కల అనంతరం 3 శాతం తగ్గింది. జిల్లావ్యాప్తంగా 28,25,939 మంది ఓటర్లు ఉండగా, 20,40,562 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 7,85,377 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే, ఈసారి ఐదు శాతం పోలింగ్ పెరగడం విశేషం. 2009 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో 67.05 శాతం పోలింగ్ నమోదైంది. సాక్షి, కరీంనగర్ : జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, సిరిసిల్ల మున్సిపాలిటీలు, హుజూరాబాద్, హుస్నాబాద్, వేములవాడ, పెద్దపల్లి, జమ్మికుంట నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే ఓటర్లు ఎక్కువగా ఉంటారు. విద్యావంతులు, మేధావుల సంఖ్య కూడా ఎక్కువే. అయినా సాధారణ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లోనే తక్కువగా పోలింగ్ న మోదు కావడం గమనార్హం. కరీంనగర్లో 57.88 శాతం, రామగుండంలో 61.79 శాతం పోలింగ్ జరగడం ఉదాహరణగా చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంత ఓటర్లలో మాత్రం చైతన్యం వెల్లివిరిసింది. ఓటర్లు ప్రతి పోలింగ్ కేంద్రం ముందు బారులు తీరారు. ఓటుపై జిల్లా యంత్రాంగం, స్వచ్ఛందసంస్థలు ఎంత ప్రచారం చేసినా నగరాలు, పట్టణాల్లో ఫలితమివ్వలేదు. మంథని వంటి మారుమూల ప్రాంతంలో జిల్లాలోనే అత్యధికంగా పోలింగ్ నమోదు కావడం గ్రామీణ ఓటరు చైతన్యానికి నిదర్శనం. మహిళలు, యువ ఓటర్ల జోరు.. జిల్లాలో మహిళా ఓటర్లు తమదైన ముద్ర వేసుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓట్లు పురుషుల కంటే ఎక్కువగా పోలయ్యాయి. రెండు విడతలుగా జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 7,74,359 మంది పురుషులు ఓటేస్తే.. 8,44,923 ఓట్లతో మహిళలు ముందంజలో ఉన్నారు. సాధారణ ఎన్నికల్లోనూ మహిళలు తమ చైతన్యం చాటారు. కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుస్నాబాద్ సెగ్మెంట్లలో మహిళలు పురుషులకు మించి ఓట్లేశారు. జిల్లాలో 14,18,011 పురుష ఓటర్లుండగా, 9,97,737 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 14,07,785 మంది మహిళా ఓటర్లకు.. 10,42,821 మంది ఓటు వేశారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనూ మహిళా ఓట్లే అభ్యర్థుల విజయావకాశాలను నిర్ణయించనున్నాయి. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 11,22,258 ఓట్లు పోలైతే.. అందులో 5,50,760 ఓట్లు పురుషులవి కాగా, మహిళలవి 5,71,498 ఓట్లు పోలయ్యాయి. యువ ఓటర్లు, తొలిసారిగా ఓటుహక్కు పొందిన వారు ఓటు వేసేందుకు ఉత్సాహం కనబరిచారు. గత రెండు నెలల వ్యవధిలో జిల్లాలో 82,715 మంది కొత్తగా ఓటుహక్కు పొందారు. వీరిలో 90 శాతం మంది తొలి ఓటును వినియోగించుకోవడం విశేషం. -
తొలిదశకు భారిగా బందోబస్తు
-
తొలిదశకు 90 వేల మందితో బందోబస్తు: డీజీపీ ప్రసాదరావు
రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిదశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం తెలంగాణలోని 10 జిల్లాల పరిధిలో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ బందోబస్తు కోసం 90 వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ బయ్యారపు ప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు పోలింగ్ సామగ్రి, సిబ్బందితో పాటు పోలీసు బలగాలను తరలించడానికి వాయుసేనకు చెందిన నాలుగు హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. వీటికి తోడు అత్యవసర సమయాల్లో సేవలు అందించడం కోసం రెండు ఎయిర్ అంబలెన్సులను పోలీసు విభాగం సిద్ధం చేశామన్నారు. మావోయిస్టు యాక్షన్ టీమ్స్ విరుచుకుపడవచ్చనే అనుమానం ఉన్న మూడు జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల అదనపు భద్రతకోసం ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణతో పాటు సమీక్ష కోసం తెలంగాణలో 11 మంది ఐపీఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించినట్టు తెలిపారు. ఇప్పటివరకు 32,18,143 మద్యం బాటిళ్లు, రూ. 122,94,08,385 నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. -
సీమాంధ్ర అసెంబ్లీ బరిలో 2,922 మంది!
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో చివరకు 2,922 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,177 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో పరిశీలన అనంతరం 1,255 మంది అభ్యర్థుల దరఖాస్తులను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇక ఇక్కడి మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు 455 మంది నామినేషన్లు వేశారు. ఇందులో 59 మంది దరఖాస్తులను తిరస్కరించగా చివరకు 396 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ప్రాంతంలో మే 7వ తేదీన ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. -
భారీగా నామినేషన్లు
ఒకేరోజు 101 దాఖలు మిగిలింది ఒక్కరోజే టీడీపీకి రెబెల్స్ బెడద వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన బుగ్గన, ఐజయ్య కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. ఒక్కరోజులోనే 85 మంది అభ్యర్థులు 101 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఇప్పటివరకు రెండు పార్లమెంటు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 156 మంది అభ్యర్థులు 215 నామినేషన్ పత్రాలు సమర్పించారు. శుక్రవారం సెలవు కావడంతో శనివారం ఒక్కరోజే మిగిలి ఉంది. గురువారం కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ తరఫున ఎస్.పి.వై.రెడ్డి మరో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. కర్నూలు పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా బి.టి.నాయుడు నామినేషన్ వేయగా, మాజీ మంత్రి కె.ఇ.ప్రభాకర్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కె.ఇ.ప్రభాకర్ తెలుగుదేశం అభ్యర్థిగా ఒక సెట్, ఇండిపెండెంట్‌గా మరో సెట్ నామినేషన్లు వేశారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి 8 మంది, కర్నూలు పార్లమెంటు నుంచి ఏడుగురు ఒకే రోజు నామినేషన్లు వేశారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా పలువురు మరో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా శోభా నాగిరెడ్డి, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నందికొట్కూరు నుంచి వై.ఐజయ్య, పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి, నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి, డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పత్తికొండ నుంచి కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆదోని నుంచి వై.సాయిప్రతాప్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అందరూ నిరాడంబరంగా నామినేషన్లు వేయడం విశేషం. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థిగా ఎం.ఎ.గఫూర్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా తమ్మడపల్లి విక్టర్ నామినేషన్ వేయడం గమనార్హం. నామినేషన్ల పర్వం శనివారంతో పూర్తికానుండడంతో ప్రచారం ఊపందుకోనుంది. -
ఉద్దండుల బరి
ఖమ్మం.... ఉద్యమ గుమ్మం.... రాజకీయ చైతన్యానికి ప్రతిరూపం. సాయుధ పోరు నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు అన్ని ప్రజాపోరాటాల్లోనూ ఇక్కడి ప్రజలు కీలకభూమిక పోషించారు. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ఈ జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రతిష్టాత్మకమే. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ స్థానం పోరు రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. తెలంగాణలోని అన్ని పార్లమెంటు స్థానాల పరిస్థితి ఒక ఎత్తయితే ఖమ్మంది మరో ఎత్తు. మహామహులు బరిలో ఉండే ఈ స్థానంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులెలా ఉన్నాయో ఒక్కసారి పరికిద్దాం. ఖమ్మం: లోక్‌సభ నియోజకవర్గం ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 11, సీపీఎం - 1, టీడీపీ - 1, పీడీఎఫ్ - 2 తొలి ఎంపీ: టి.బి.విఠల్‌రావు (పీడీఎఫ్) ప్రస్తుత ఎంపీ: నామా నాగేశ్వరరావు (టీడీపీ) ప్రస్తుత రిజర్వేషన్: జనరల్ నియోజకవర్గం పరిధిలోనికి వచ్చేఅసెంబ్లీ స్థానాలు: ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం (జనరల్), మధిర, సత్తుపల్లి (ఎస్సీ), అశ్వారావుపేట, వైరా (ఎస్టీ) మొత్తం ఓటర్లు: 14,07,887 కొత్త ఓటర్లు: 50 వేల పైచిలుకు నియోజకవర్గ ప్రత్యేకతలు: సింగరేణి కార్మికుల ఓట్లు, సామాజిక కోణం, పూర్తిస్థాయి రాజకీయ చైతన్యం, కమ్యూనిస్టుల ప్రభావం, గిరిజనులు, మైనార్టీలు, దళితుల ఓట్లు అధికసంఖ్యలో ఉండడం. ప్రస్తుతం బరిలో నిలిచింది: 27 ప్రధాన అభ్యర్థులు వీరే.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి (వైఎస్సార్సీపీ) డాక్టర్.కె.నారాయణ (సీపీఐ) నామా నాగేశ్వరరావు (టీడీపీ) బుర్హాన్‌బేగ్ (టీఆర్ఎస్) మేకల కల్యాణ్ చక్రవర్తి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసే అవకాశం వస్తే వలస నేతలు ఎగిరి గంతేస్తారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన ఇతర జిల్లాల నాయకులు కచ్చితంగా విజయం సాధిస్తారని అన్ని పార్టీల నేతల్లో ధీమా. నాటి లక్ష్మీకాంతమ్మ నుంచి నేటి నామా నాగేశ్వరరావు వరకు ఇతర జిల్లాల నేతలే ఖమ్మం నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. పీవీ రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కరరావు లాంటి మహామహులతో పాటు రేణుకాచౌదరి, నామా నాగేశ్వరరావు కూడా ఇతర ప్రాంతాలకు చెందిన వారే. గెలిస్తే కేంద్రమంత్రి చాన్స్ తెలంగాణలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి గెలిస్తే కేంద్రమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జలగం వెంగళరావు 1980లో ఖమ్మం ఎంపీగా ప్రాతి నిధ్యం వహించారు. ఇందిర కేబినెట్లో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించారు. ఆ తర్వాత 1991లో గెలిచిన పీవీ రంగయ్యనాయుడు రాజీవ్‌గాంధీ కేబినెట్లో సమాచార మంత్రిగా పనిచేశారు. ఆయన తర్వాత గెలిచిన రేణుకా చౌదరికి కూడా కేంద్రమంత్రివర్గంలో స్థానం దక్కింది. మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో ఆమె స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. ఇక్కడి నుంచి గెలిచినప్పుడు కేంద్రంలో అధికారంలో లేకపోయినా ఖమ్మం ఎంపీలు జాతీయస్థాయిలో కీలకపాత్రే పోషించారు. పెద్ద కామ్రేడ్‌కు కలిసొచ్చేనా? తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రభావం ఎలా ఉంటుందనేది జిల్లాలో చర్చనీయాంశమయింది. కాంగ్రెస్ పార్టీతో సర్దుబాటులో భాగంగా ఆయన ఖమ్మం ఎంపీ స్థానానికి పోటీచేస్తున్నారు. సీపీఐకి మూడు, నాలుగు నియోజకవర్గాల్లో కేడర్ ఉండగా, మిగిలిన చోట్ల ఆయన కాంగ్రెస్ ఓటింగ్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. పాలేరు. వైరా, కొత్తగూడెం, ఖమ్మం అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ కేడర్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమేరకు సహకరిస్తాయనేదానిపైనే ఆయన విజయం ఆధారపడి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో సీపీఐ పోషించిన పాత్ర, పార్టీలో అత్యున్నత పదవిలో ఉండడం ఆయనకు కలిసివచ్చే అంశం. ‘నామా’కు తుమ్మల గండం ప్రస్తుతం ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న నామా నాగేశ్వరరావు మరోసారి టీడీపీ తరఫున ఎంపీ స్థానానికి బరిలో దిగనున్నారు. పార్టీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో అంతర్గత పోరుపై పెట్టిన దృష్టి జిల్లా ప్రజల అభివృద్ధిపై పెట్టలేదని సొంతపార్టీ నుంచే విమర్శలున్నాయి. ఈసారి ఎన్నికల్లో కూడా ఇరువర్గాలు కయ్యానికి సై అంటున్నారు. మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారు కావడంతో మైనార్టీ ఓట్లు నామాకు దూరం కానున్నాయి. అయితే, తన సామాజిక వర్గం ఓట్లతో పాటు ఆర్థిక బలంపైనే పూర్తిగా ఆధారపడిన ఈయనకు ఈసారి విజయం ముళ్లబాటేనని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. గు‘లాబీయింగ్’ లేని ఖమ్మం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అంకురార్పణ జరిగిన ఈ జిల్లాలో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా టీఆర్ఎస్కు అది ఓటుబ్యాంక్ రూపంలోకి మారలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మైనార్టీ వర్గానికి చెందిన షేక్ బుర్హాన్‌బేగ్ అనే విద్యాధికుడికి అవకాశం ఇచ్చింది. తద్వారా మైనార్టీ ఓట్లను రాబట్టి, గులాబీ జె ండా ఎగరేయాలని ఆశపడుతున్నా ఒకటి, రెండు నియోజకవర్గాల్లో తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేకపోవడం ఆ పార్టీకి ప్రతికూలతగా మారనుంది. ‘ఫ్యాన్’తో ‘సీను’ మారనుందా..! ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి (శీనన్న) రాజకీయాలకు కొత్త. మొదటిసారి వైఎస్సార్‌కాంగ్రెస్ ద్వారా ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అనతికాలంలోనే జిల్లా ప్రజలకు సుపరిచితులయ్యారు. రాజకీయాల్లోకి రాకముందే తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన పొంగులేటి రాఘవరెడ్డి-స్వరాజ్యం ట్రస్టు ద్వారా పేదలకు సాయం చేస్తున్నారు. గతనెల ఐదో తేదీన ఖమ్మంలో నిర్వహించిన జనభేరి సభలో పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి స్వయంగా శీనన్న అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ బలంగా ఉండడంతో మిగిలిన అభ్యర్థుల కంటే పొంగులేటి ముందంజలో ఉన్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని సత్తుపల్లి నియోజకవర్గం ఆయన స్వస్థలం కావడంతో స్థానికత ఈయనకు కలిసివచ్చే మరో అంశం. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలైన అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తనను ఆదరిస్తారని, ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతుల రుణమాఫీ లాంటి పథకాలు తన ను విజయతీరాలకు చేరుస్తాయని శీనన్న భావిస్తున్నారు. నే.. గెలిస్తే.. * అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా సమస్యలు పరిష్కరిస్తా. * రైతాంగానికి గిట్టుబాటు ధర, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి సౌకర్యాల కల్పన, రుణసౌకర్యం అందేలా ప్రయత్నిస్తా. * నిరుద్యోగ యువత కోసం పరిశ్రమలను ఏర్పాటు చేసి, ఉపాధి కల్పనకు కృషి చేస్తా. * వైఎస్. బాటలో అభివృద్ధి, సంక్షేమం కోసం అంకితమవుతా. * ప్రజలందరి భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్‌ప్లాన్ రూపొం దించి నిర్ణీత కాలంలో అమలుపరుస్తా. - పొంగులేటి శ్రీనివాసరెడ్డి * ఖమ్మం జిల్లాలో అపారమైన బొగ్గునిల్వలున్నాయి. అండర్మైన్ బొగ్గు బావులు నిర్మించాలి. తద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించేలా కృషి చేస్తా. * మణుగూరులో ఎన్టిపీసీ ప్లాంటు ఏర్పాటుకు కృషి చేస్తా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తా. * దుమ్ముగూడేం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేస్తా. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై పోరాడుతా. - కె.నారాయణ * దుమ్ముగూడెం, మున్నేరు, మొండికుంట ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తా. * జిల్లా కేంద్రంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, మండల కేంద్రాల్లో పీహెచ్‌సీల ఏర్పాటు. * ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఆదివాసీలకు వైద్య, విద్య సౌకర్యాల కోసం కృషి చేస్తా. * సంక్షోభంలో ఉన్న గ్రానైట్ పరిశ్రమను గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తా. * మణుగూరులో థర్మల్ పవర్ స్టేషన్‌ను ఏర్పాటు చేయిస్తా. ఖమ్మం జిల్లాను మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణగా తయారుచేసేందుకు కృషి చేస్తా. - ఎస్.బి.బేగ్ * జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు స్టీల్‌ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తా * భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ.1000 కోట్లు కేంద్రం నుంచి తీసుకువచ్చి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తా. * అన్ని ప్రధాన రహదారులను ఫోర్వే లైన్లుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తా. * వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించేలా ప్రయత్నిస్తా. - నామా నాగేశ్వరరావు -
జేఎస్పీ తెలంగాణ అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) తెలంగాణలో మూడు లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు బుధవారం ఆఖరిరోజు కావడంతో ఆ పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రెసిడెన్షియల్ బ్యూరో మంగళవారం సమావేశమై పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చుండ్రు శ్రీహరిరావుతో కలసి అధికార ప్రతినిధి నూతన్‌నాయుడు జాబితా ప్రకటించారు. లోక్‌సభ స్థానాలకు.. కల్పగూర్ శ్రీనివాసులు (సికింద్రాబాద్), గూడూరు జనార్దన్‌రెడ్డి (భువనగిరి), చెరుకూరు నాగార్జునరావు (ఖమ్మం)ను నిర్ణయించారు. అసెంబ్లీ స్థానాల కు.. మహమ్మద్ వజాహత్ అలీ(నర్సాపూర్), కోదాటి సుహాసిని (పటాన్చెరు), పిట్ల శ్రీనిరాజు(మల్కాజిగిరి), గున్నం నరేంద్రరెడ్డి (ఎల్బీ నగర్), సయ్యద్ ఒమర్ (రాజేంద్రనగర్), కె. రాణి (ముషీరాబాద్), ఇ.రాజు (ఖైరతాబాద్), సుదర్శనం వెంకటేశ్వర్లు (జూబ్లీహిల్స్), చెర్లపల్లి నీతాగౌడ్ (సనత్‌నగర్), మహమ్మద్ అయూబ్‌ఖాన్ (చార్మినార్), నర్సింగోరు నర్సింహాచారి (ఆలేరు), కణితి కృష్ణ (పినపాక), ముక్తిరాజు (ఇల్లెందు), షేక్ పాషా (ఖమ్మం), అప్పల లింగమూర్తి (పాలేరు), మల్లు శివరాం (మధిర), వాసం రామకృష్ణదొర (వైరా), తమ్మల రాజేష్‌కుమార్ (సత్తుపల్లి), నార్ల సత్యనారాయణ (కొత్తగూడెం), పాయం పోతయ్య దొర (అశ్వారావుపేట), కురుసం సుబ్బారావు (భద్రాచలం)ను ప్రకటించారు. -
48 అసెంబ్లీ స్థానాలకు పోటీ: కారెం శివాజీ
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో 48 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను నిలుపుతున్నట్లు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ తెలిపారు. సోమవారం విశాఖపట్నంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మాలలంతా ఏకమై ‘మన ఓటు మనకే’ అనే నినాదంతో మాలమహానాడు అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. -
నేడే నామినేషన్లు
ఎన్నికల క్షేత్రంలో ప్రధాన అంకమైన నామినేషన్ల ఘట్టానికి నేడు తెరలేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల బరిలో నిలిచే నేతలు తమ నామినేషన్ దాఖలుతో సమరానికి సై అంటున్నారు. నోటిఫికేషన్ తేదీ ఏప్రిల్ 2 నేడు కాగా నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 9. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 10న ముగుస్తుంది. ఉపసంహరణకు ఏప్రిల్ 12 చివరి తేది. ఇక పోలింగ్ ఏప్రిల్ 30న జరగనుండగా పోరుబరిలో ఉన్న నేతలు నువ్వానేనా అని పోటీపడనున్నారు. అందుకు తగ్గట్లుగా అభ్యర్థుల ప్రచారంతో నగరంలో ఎన్నికల పండగ బుధవారం నుంచే మొదలు కానుంది. సికింద్రాబాద్ మొత్తం ఓటర్లు: 2,26,001 పురుషులు: 1,17,727 మహిళలు: 1,08, 261 ఇతరులు: 13 పోలింగ్ బూత్‌లు: 199 ప్రిసైడింగ్ అధికారి పేరు: ప్రీతిమీనా సందేహాలు, ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నెంబర్: 99638 56784 శేరిలింగంపల్లి మొత్తం ఓటర్లు: 5,31,352 పురుషులు: 2,91,560 మహిళలు: 2,39,727 ఇతరులు: 65 పోలింగ్ బూత్‌లు: 492 రిటర్నింగ్ అధికారి పేరు: పి.పంకజ సందేహాలు, ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నెంబర్: 99899 30589 కూకట్పల్లి మొత్తం ఓటర్లు: 4,72,044 పురుషులు : 2,58,557 మహిళలు : 2,13,428 ఇతరులు: 59 పోలింగ్ బూత్‌లు : 442 రిటర్నింగ్ అధికారి పేరు: బి.వి.గంగాధర్‌రెడ్డి సందేహాలు, ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నెంబర్: 98499 05907 మల్కాజిగిరి మొత్తం ఓటర్లు: 4,35,825 పురుషులు : 2,26,598 మహిళలు : 2,09,198 ఇతరులు: 29 పోలింగ్ బూత్‌లు : 402 రిటర్నింగ్ అధికారి పేరు: వెంకటేశ్వరరావు సందేహాలు, ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నెంబర్: 98499 05902 -
ఎన్నికల ఖర్చు రూ. 330 కోట్లు
పోలీసు భద్రతకు రూ.30 కోట్లు సిబ్బందికి రూ.60 కోట్లు సాక్షి, చెన్నై : తమిళనాడులో ఎన్నికల నిర్వహణ ఖర్చు రూ.330 కోట్లు. ఇందులో పోలీసు భద్రతకు రూ.30 కోట్లు, సిబ్బంది అలవెన్సులకు రూ.60 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 39 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం తలమునకలై ఉంది. పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ బూత్‌ల ఎంపిక పూర్తయింది. ఆయా కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులు, సిబ్బంది నియామకం, ఎన్నికల రోజున వ్యవహరించాల్సిన విధి విధానాలపై కసరత్తుల్లో అధికార యంత్రాంగం ఉంది. అలాగే రాష్ట్రంలో ఓటర్లకు తాయిలాల పంపిణీ, నగదు బట్వాడాకు అడ్డుకట్ట లక్ష్యంగా ఎన్నికల యంత్రాంగం ముందుకెళుతోంది. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి బలగాల్ని రప్పించారు. ప్రత్యేక స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు మొదలు, నామినేషన్ల పరిశీలనా వ్యవహారాలు, ఎన్నికల కోసం నియోజకవర్గాల్లో ప్రత్యేక ఇన్‌చార్జ్‌ల నియామకం... ఇలా అన్ని రకాల పనుల్లో ఎన్నికల అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఐదేళ్లకు ఓ మారు వచ్చే ఎన్నికల్ని ఎదుర్కోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని అన్నది అందరికీ తెలిసిందే. ఈ పర్యాయం ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో రూ.330 కోట్లు ఖర్చుకానుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో చేపట్టిన కట్టుదిట్టమైన భద్రత కన్నా, ఈ పర్యాయం అంతకు రెండింతలు భద్రత కల్పించడంతో పాటు అన్ని రకాల తాయిలాల కట్టడి లక్ష్యంగా ఈసీ ముందుకు సాగుతోంది. ఇందు కోసం పెద్ద ఎత్తున బలగాలు తనిఖీల్లో ఉన్నాయి. అలాగే రాష్ట్రంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రతా విధులకు పారా మిలటరీ రంగంలోకి దిగనుంది. ఈ భద్రతా ఖర్చుల నిమిత్తం రూ.30 కోట్లు కేటాయించారు. అలాగే భద్రత, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కోసం రూ.60 కోట్లు ఖర్చుకానున్నాయి. ఎన్నికల విధులతో పాటు, నామినేషన్ల పర్వం ఆరంభం, ఎన్నికల నిర్వహణ, ఎన్నిక రోజు చేపట్టనున్న ఏర్పాట్లు, ఈవీఎంలు, వెబ్ కెమెరాలు, వీడియో చిత్రీకరణ తదితర వ్యవహారాలతో పాటు ఓట్ల లెక్కింపు ఖర్చు మరో రూ.240 కోట్లు ఖర్చుకానున్నాయి. దీనిపై ఈసీ ప్రవీణ్‌కుమార్ మీడియూతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌కు మొత్తం రూ.330 కోట్లు అవసరం కానుందని పేర్కొన్నడం గమనార్హం. -
ముస్లింలే కీలకం..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో అతిచిన్న నియోజకవర్గమైన చాందినీచౌక్‌లో రాజకీయ దిగ్గజాల మధ్య పోటీ జరుగనుంది. కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ కపిల్ సిబల్ కాంగ్రెస్ అభ్యర్థిగా, ఆమ్ఆద్మీ పార్టీ తరఫున మాజీ టీవీ జర్నలిస్టు ఆశుతోష్ , బీజేపీ అభ్యర్థిగా ఢిల్లీ శాఖ అధ్యక్షుడు హర్షవర్ధన్ పోటీచేస్తున్నారు. హేమాహేమీలు తలపడుతోన్న ముక్కోణపు పోరులో విజేతను నిర్ధారించడంలో ముస్లిం ఓటర్లు కీలకపాత్ర పోషించనున్నారు. ఇటీవ లి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ రెండింటిని, ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగింటిని, బీజేపీ మూడింటిని గెలుచుకున్నాయి. జేడీయూకు చెందిన షోయబ్ ఇక్బాల్ ఒక సీటును గెలుచుకున్నారు. కాంగ్రెస్ గెలిచిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు-చాందినీ చౌక్, బల్లీమారన్లతో పాటు మటియా మహల్ అసెంబ్లీ స్థానాలలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు పరిస్థితిలో తేడా ఉండడం వల్ల లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశముంది. కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్ మూడవసారి ఈ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో విజయలక్ష్మి కపిల్ సిబల్‌ను సులువుగా వరించింది. కానీ అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికల్లో గెలవడం సిబల్‌కు అంత సులభం కాదు. కేంద్రంలో యూపీఏ సర్కారుకు వ్యతిరేకంగా వీస్తోన్న పవనాలు సిబల్ గెలుపుపై కూడా ప్రభావం చూపనున్నాయి. ి సబల్ వంటి అగ్రనేత తమకు చేయవలసినంత మేలు చేయలేదని ముస్లింలు అసంతృప్తితో ఉన్నారు. ఆయనస్థానికులకు అందుబాటులో ఉండరన్న అభిప్రాయం చాలామంది ఓటర్లకు ఉంది. నరేంద్ర మోడీని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని, ఇందుకు ఆమ్ ఆద్మీ పార్టీయే తగినదని కొందరు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి తమకు విజయం తథ్యమన్న ఉద్దేశంతో ఆశుతోష్‌ను బరిలోకి దింపింది. అయితే పార్టీలో కొత్తగా చేరిన బయటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఆప్ కార్యకర్తలకే మింగుడు పడలేదు. ఆశుతోష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. అయితే ఆప్‌కున్న జనాదరణతో పాటు నరేంద్ర మోడీ వ్యతిరేక ముస్లిం ఓట్లు ఆప్‌కు అనుకూలించవచ్చని అంటున్నారు. ఆశుతోష్ కావడం కూడా కలిసివచ్చే అవకాశముంది. అయితే 49 రోజుల్లోనే అధికారం వదిలి పారిపోయిందన్న మచ్చ ఆప్‌ను వేధిస్తోంది. ఢిల్లీ బీజేపీ నేతలందరికల్లా ఎక్కువ ప్రజాదరణ కలిగిన నేతగా ముద్రపడిన డాక్టర్ హర్షవర్ధన్‌ను చాందినీచౌక్ నుంచి అభ్యర్థిగా నిలబెట్టి ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఆ పార్టీ చిత్తు చేసిందనే చెప్పాలి. కానీ అంతటి బలమైన అభ్యర్థికి సైతం చాందినీచౌక్‌లో విజయం సాధించడం అంతసులువుగా లేదు. చాందినీచౌక్లోనే తాను 15 ఏళ్లు పెరిగానని హర్షవర్ధన్ చెప్పుకుంటునప్పటికీ ముస్లిం ఓటర్లు ఆయనను అక్కున చేర్చుకోవడానికి వెనుకాడుతున్నారు. ముఖ్యంగా నరేంద్రమోడీ భయం వారిని వేధిస్తోంది. ముస్లిం ఓటర్ల వ్యతిరేకత హర్షవర్ధన్‌కు మైనస్ పాయింట్ కాగా బీజేపీకి అనుకూలంగా ఉన్న లోక్‌సభ ఎన్నికల వాతావరణం, విశ్వసనీయుడైన నేతగా హర్షవర్ధన్కున్న పేరు, వైశ్యుడు కావడం ఆయనకు ప్లస్ పాయింట్లని అంటున్నారు. చరిత్ర: ఢిల్లీ సిటీ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని రెండుగా విభిజించడంతో 1957లో నియోజకవర్గంగా ఆవిర్భవించిన చాందినీచౌక్ 2004 వరకు దేశంలోనే అతి చిన్న లోక్‌సభ నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. అప్పట్లో ఈ నియోజకవర్గం పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండేవి. అయితే ఇప్పుడీ నియోజకవర్గం పరిధి పాత ఢిల్లీని దాటిపోయింది. పలు పునరావాస కాలనీలు, మురికివాడలు ఇప్పుడీ నియోజకవర్గం పరిధిలోకి చేరాయి. ఈ నియోజకవర్గంలోని వైశ్యులు, పంజాబీలు సంప్రదాయకంగా బీజేపీ ఓటర్లుగా ఉండేవా రు. కానీ కాలక్రమేణా వారు పొరుగున ఉన్న ఘజియాబాద్, నోయిడా, షహిబాబాద్ గుర్గావ్, ఫరీదాబాద్‌లకు వలస వెళ్లడంతో బీజేపీ పరిస్థితి ఇరుకునపడింది. ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. పాత ఢిల్లీ వెలుపలి ప్రాంతాల్లో ఓబీసీ, దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని 14 లక్షల ఓటర్లలో 35 శాతం మంది వైశ్య ఓటర్లు కాగా, 12 శాతం మంది పంజాబీ ఓటర్లున్నారు. ముస్లిం ఓటర్లు 21 శాతమున్నారు. షెడ్యూల్డు కుల ఓటర్లు 26 శాతముండగా, 9 శాతం బ్రాహ్మణ ఓటర్లున్నారు. -
కేసీఆర్ నన్నూ అమ్మాలనుకున్నాడు: చంద్రబాబు
ఖమ్మం ప్రజాగర్జనలో చంద్రబాబు దళితుడిని సీఎం చేస్తానని ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు టీఆర్ఎస్కు ఓట్లేస్తే తెలంగాణనూ అమ్మేస్తాడు కేసీఆర్ సోమరిపోతు.. తెలంగాణను దోచుకునేందుకే పుట్టాడు సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘‘గత ఎన్నికల్లో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుని 45 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇస్తే 10 స్థానాల్లో గెలిచాడు. కౌంటింగ్ కూడా పూర్తికాక ముందే ఢిల్లీ వెళ్లి బీజేపీతో బేరాలాడాడు. నన్ను కూడా అమ్మేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయన్ని నమ్మి టీఆర్ఎస్కు ఓట్లేస్తే తెలంగాణను కూడా అమ్మేస్తాడు’’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. కేసీఆర్ తెలంగాణను దోచుకోవడానికే పుట్టాడు తప్ప ఉద్ధరించడానికి కాదని అన్నారు. శనివారం ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజాగర్జన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే. నా దగ్గర పనిచేసినప్పుడు ఆయన సోమరిపోతు. ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం అంటే 12 గంటలకు వచ్చేవాడు. ఇప్పుడు పోజులు కొడుతున్నాడు. కేసీఆర్‌కు ఇటలీ నుంచి వచ్చిన సోనియా అంటే భయం, ప్రేమ. నేనంటే చులకనగా మాట్లాడుతున్నాడు. అయినా ప్రజల కోసం ఏదైనా పడతాం. కానీ ప్రజలకు అన్యాయం చేస్తే గుండెల్లో నిద్రపోతాం’’ అని అన్నారు. కేసీఆర్ ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తానని చెపుతున్నాడని, అధికారంలోకి వస్తే ఫాంహౌజ్‌లో కూర్చుని ఎకరాకు 5 కోట్లు సంపాదిస్తానని చెప్పే దుర్మార్గుడని వ్యాఖ్యానించారు. తెలంగాణలో దళితుడుని సీఎం చేస్తానని, మైనార్టీలను డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఆ ఉసెత్తడం లేదని అన్నారు. తెలంగాణ ఇవ్వాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలియదని చెప్పిన కేసీఆర్.. మరి తెలంగాణ తెచ్చానని గుర్రాలు, ఒంటెలపై ఎలా ఊరేగాడని ఎద్దేవా చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తానేనని, సంపదను పెంచానని, అయితే ఆ సంపద కేసీఆర్ కుటుంబం కోసం కాదని చంద్రబాబు అన్నారు. ఇటీవలే ఒక కొత్త పార్టీ వచ్చిందని, ఆ పార్టీ ఎంపీ స్థానానికి రూ.50 కోట్లు, ఎమ్మెల్యేకు రూ.10 కోట్లు, ఎస్సీలకయితే రాయితీ ఇచ్చి రూ.6 కోట్లకు టికెట్ ఇస్తానని బేరం పెడుతున్నాడని ఆరోపించారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రలో తామే అధికారంలోకి వచ్చి ఢిల్లీలో చక్రం తిప్పుతామని అన్నారు. తెలంగాణలో టీడీపీని ఖాళీ చేయిస్తామని అంటున్నారని, అది ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. సైకిల్ స్పీడ్ పెంచి బుల్లెట్లా దూసుకెళుతుందని, అడ్డం వస్తే తొక్కుకుని వెళుతుందే తప్ప వెనక్కు తగ్గేదిలేదని చెప్పారు. తెలంగాణలో ఉన్న 10 జిల్లాలను కూతురికి, కొడుక్కి, అల్లుడికి మూడుమూడు జిల్లాల చొప్పున సామంత రాజ్యాలుగా పంచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మరో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎమ్మెల్యే టికెట్ అడిగితే మెడపట్టి గెంటిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. కేసీఆర్ ఆమెకు టికెట్ ఇవ్వకపోతే తామే ఇస్తామని చెప్పారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, ఊకె అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో బాబు ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. దీంతో సభకు హాజరైన జనం ఆయన ప్రసంగిస్తుండగానే మెల్లమెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
చెదరని సెగ్మెంట్లు
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనే అంశాన్ని కేంద్ర కేబినేట్ సవరించింది. ఇప్పుడున్న నియోజకవర్గాలకే ఈసారి ఎన్నికలు జరుగుతాయని, తర్వాతే పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేసింది. ముసాయిదా బిల్లులో నియోజకవర్గాల జాబితాలో ఉన్న ధర్మపురి సెగ్మెంట్ పేరును ధర్మపురి (ఎస్సీ రిజర్వుడు)గా సవరించింది. దీంతో జిల్లాలోని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు చేర్పులకు ఆస్కారం లేదని తేలిపోయింది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడున్న 119 స్థానాలుండగా, 153కు పెంచాలనే డిమాండ్‌ను పరిశీలించిన కేబినేట్ సాధారణ ఎన్నికల తర్వాతే పునర్విభజన ప్రక్రియకు ఆమోదం తెలిపింది. దీంతో 2019 ఎన్నికల నాటికి అదే దామాషా ప్రకారం జిల్లాలోనూ రెండు లేదా మూడు నియోజకవర్గాలు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో మానకొండూరు, చొప్పదండి, ధర్మపురి ఎస్సీ రిజర్వుడు స్థానాలు. తాజా నిర్ణయంతో ఈ సెగ్మెంట్లకు యథాతథంగా ఎన్నికలు జరుగనుండటంతో ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తమ స్థానాలు చెదిరిపోతాయనే అనుమానాలు తొలిగిపోవటంతో పోటీకి ఉరకలేస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో విజేతలతో పోటీపడ్డ ప్రత్యర్థులు సైతం నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. నిన్నటివరకు పునర్విభజన దడతో వెనుకడుగు వేసిన అభ్యర్థులు సైతం తమకు లైన్ క్లియర్ అయిందంటూ ఎన్నికల సరంజామా సర్దుకుంటున్నారు. ఈ నెలాఖరులోనే ఎన్నికల షెడ్యూలు వెలువడుతుందనే ప్రచారం జరుగుతోంది. జిల్లా యంత్రాంగం సైతం ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది. అదే సమయంలో ప్రధాన పార్టీలన్నింటా ఎన్నికల కోలాహలం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఏకంగా అభ్యర్థిత్వాలపై కసరత్తు ప్రారంభించింది. పార్టీ పరిశీలకులు రహస్యంగా రాహుల్ దూతల పర్యటనలతో ఎవరు ఎక్కణ్నుంచి పోటీ చేస్తారు? ఎవరికి టిక్కెట్టు దక్కుతుంది? అనే ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో టీఆర్ఎస్ విలీనమైతే ఎవరెవరి సీట్లు ఎవరెవరు పోటీ చేయాలనే విషయంలోనూ ఆ రెండు పార్టీల అభ్యర్థులు ఎవరికివారుగా అంచనాలు వేసుకుంటున్నారు. మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు విప్ ఆరెపల్లి మోహన్, ప్రవీణ్‌రెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున అత్యధికంగా ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ఈటెల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, చెన్నమనేని రమేశ్, విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ తమ తమ స్థానాల్లో పాతుకుపోయారు. దీంతో రెండు పార్టీలు ఒక్కటైతే బలం, బలగం పెరిగిపోతుందనే ధీమా ముఖ్య నేతల్లో వ్యక్తమవుతోంది. కానీ రెండు పార్టీలకు ముఖ్య నేతలున్న హుస్నాబాద్, కోరుట్ల, సిరిసిల్ల నియోజకవర్గాలలో సర్దుబాటు కొంత తలనొప్పిగా మారుతుందనే అభిప్రాయాలున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్తో పాటు జిల్లాలో ముగ్గురు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ఈసారి బీజేపీతో పొత్తు కుదురుతుందనే ధీమాతో ఎల్.రమణ, విజయరమణారావు మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారు. పార్టీ మారుతారంటూ పలుమార్లు వార్తల్లోకెక్కిన సుద్దాల దేవయ్య ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు. తనకు బదులుగా తన కుమారుడు గౌతమ్‌ను రాజకీయాల్లోకి దింపే ఆలోచనతో ఉన్నారని, చివరి క్షణం వరకు ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయంలో తేల్చుకోలేకపోతున్నారనే ప్రచారం చొప్పదండి సెగ్మెంట్లోని టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. నరేంద్రమోడీపై పెరిగిన ఆకర్షణను ప్రచారాస్త్రంగా ఎంచుకున్న బీజేపీ సైతం ఈసారి అన్ని సెగ్మెంట్ల నుంచి అభ్యర్థులను సిద్ధం చేస్తోంది. టీడీపీతో పొత్తు కూడితే ముఖ్య నేతలను ఎక్కడినుంచి బరిలోకి దింపాలనే విషయంలోనూ ముందస్తు కసరత్తు చేసింది. -
ఆగ్రహ జ్వాలలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిల ఎంపిక వ్యవహారం తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోంది. ఇన్చార్జిల నియామకాలకు శ్రీకారం చుట్టి ఒక్కరోజు కూడా గడవక ముందే ఆ పార్టీలో ముసలం పుట్టింది. కోవూరు తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జి ఎంపిక కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సన్నిహితుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఇంటింటికి టీడీపీ పేరుతో జరుపుతున్న పాదయాత్రకు అధిష్టానం బ్రేక్ వేసింది. పాదయాత్రను వెంటనే నిలిపివేసి హైదరాబాద్ రావాల్సిందిగా ఎన్టీయార్ ట్రస్ట్భవన్ నుంచి సోమవారం ఉదయం ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయన పాదయాత్రకు పుల్‌స్టాప్ పెట్టి హుటాహుటిన రాజధానికి పయనమయ్యారు. అదే సమయంలో సోమవారం ఉదయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి భేటీ అయ్యారు. ఈ పరిణామాలు నియోజకవర్గపార్టీలో అంతర్గత కలహాలకు దారితీస్తున్నాయి. ఒక వర్గం నాయకులు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని, మరో వర్గం పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని ప్రతిపాదిస్తోంది. ఈ ఇద్దరు కాకుండా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి కూడా ఇన్చార్జి పదవిని ఆశిస్తున్నారు. మూడు రోజుల కిందట ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాలపై అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. అనూహ్యంగా ఆత్మకూరు ఇన్చార్జి పదవిని కన్నబాబుకు ఇస్తూ అదివారం ప్రకటించారు. కోవూరుకు వచ్చే సరికి పీటముడి పడింది. నలుగురు రేసులో ఉన్నప్పటికీ ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పారిశ్రామికవేత్త పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పోలంరెడ్డికి అవకాశాలు మెండుగా ఉండటం, పాదయాత్రను నిలిపివేయాలని పెళ్లకూరుకు ఆదేశాలు రావడంతో ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. కాంగ్రెస్‌లో ఉంటూ పదేళ్లుగా టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన పోలంరెడ్డికి ఇన్చార్జి పదవి ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌లో పది సంవత్సరాలు అధికారం అనుభవించి అక్కడ మనుగడ లేదని తెలిసిన తరువాత టీడీపీ ఆదరించడం అంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుందని వారు అధిష్టానానికి స్పష్టం చేసినట్టు సమాచారం. వెంటనే పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ఇన్చార్జి పదవిని ప్రకటించకపోతే రాజీనామాలు చేస్తామని ఇందుకూరుపేట, కొడవలూరు, విడవలూరు మండలాలకు చెందిన పార్టీ ముఖ్యులు అధిష్టానానికి హెచ్చరికలు పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కోవూరు ఉప ఎన్నికల తరువాత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పార్టీకి దిక్కయ్యారని అంటున్నారు. అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు లక్షల రూపాయలు ఖర్చు చేసిన నేతను వదిలేసి సొంత లాభం కోసం గోడ దూకుతున్న వారికి ప్రాధాన్యం ఎలా ఇస్తారని వాపోతున్నారు. సోమవారం నాటి పరిణామాలతో ఆ పార్టీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. నేడు నిర్ణయం కోవూరు ఇన్చార్జి ఎంపిక వ్యవహారానికి మంగళవారం ముగింపు పలకాలని అధిష్టానం భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పదవిని ఆశిస్తున్న పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డితో ఎన్టీయార్ ట్రస్ట్‌భవన్‌లో చర్చలు జరపేందుకు నిర్ణయం తీసుకున్నారు. వ్యవహారం ఒక కొలిక్కి తెచ్చిన తరువాత ఇద్దరిని చంద్రబాబుతో మాట్లాడించి అదే రోజు ఇన్చార్జి ఎంపికను అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. అయితే పోలంరెడ్డి మాత్రం సంక్రాంతి పండగ తరువాత పార్టీలో చేరుతానని బాబుతో చెప్పినట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 10వ తేదీ నుంచి నియోజకవర్గంలో పర్యటించేందుకు పోలంరెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నట్టు ఆ వర్గాలు చెప్పాయి. పెళ్లకూరు ఇంటి వద్ద సందడి పాదయాత్రను అర్ధాంతరంగా నిలిపివేసిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డిని నియోజకవర్గంలోని పలు మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులు సోమవారం నెల్లూరులోని ఆయన నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము వెంటనే పార్టీకి రాజీనామాలు చేస్తామని చెప్పగా పెళ్లకూరు సర్ది చెప్పినట్లు తెలిసింది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలను ఆదరించిన వారిని విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదని కొందరు అక్కడే శాపనార్థాలు పెట్టినట్టు సమాచారం.