గుంటూరు, సాక్షి: అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా మూడో జాబితాను విడుదల చేసింది వైఎస్సార్‌సీపీ పార్టీ. ఆరు పార్లమెంట్ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది. తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను మీడియాకు తెలియజేశారు.
శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ.. ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యం ఇస్తూ మూడో జాబితాను రూపొందించడం గమనార్హం. తొలి జాబితాలో 11 నియోజకవర్గాల్లో, రెండో జాబితాలో మరో 27 స్థానాలకు మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో జాబితాను 21 స్థానాలతో విడుదల చేసింది. వీటితో పాటు ప్రస్తుతం ఇచ్ఛాపురం జెడ్పీటీసీగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను.. శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
‘‘మొత్తం 175కు 175 సీట్లు మనం గెలవాలి. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ మేరకు ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండడం కోసం మార్పులు, చేర్పులు అవసరమవుతాయి. అందుకు మీరంతా సహకరించండి. రాబోయే రోజుల్లో తగిన గుర్తింపు ఇస్తాం’’ అని సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటములను బేరీజు వేసుకున్న తర్వాతనే మార్పులు చేర్పులు చేసినట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ తొలి జాబితా
ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ రెండో జాబితా
Comments
Please login to add a commentAdd a comment