రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల క్రమ సంఖ్యలను మార్చారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్:రాష్ట్ర విభజన అనంతరం కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల క్రమ సంఖ్యలను మార్చారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 294 నియోజకవర్గాలు ఉండగా శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల క్రమ సంఖ్య 120(ఇచ్ఛాపురం)తో మొదలై, 129(పాలకొండ)తో ముగిసేది. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాలు ఉండగా వాటి క్రమసంఖ్యను శ్రీకాకుళం జిల్లా నుంచే అదే ఇచ్ఛాపురం నుంచే మొదలు పెట్టడం విశేషం. 1(ఇచ్ఛాపురం) నంచి మొదల 10(పాలకొండ)తో ముగుస్తుంది.