సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) తెలంగాణలో మూడు లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు బుధవారం ఆఖరిరోజు కావడంతో ఆ పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రెసిడెన్షియల్ బ్యూరో మంగళవారం సమావేశమై పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చుండ్రు శ్రీహరిరావుతో కలసి అధికార ప్రతినిధి నూతన్‌నాయుడు జాబితా ప్రకటించారు.
లోక్‌సభ స్థానాలకు.. కల్పగూర్ శ్రీనివాసులు (సికింద్రాబాద్), గూడూరు జనార్దన్‌రెడ్డి (భువనగిరి), చెరుకూరు నాగార్జునరావు (ఖమ్మం)ను నిర్ణయించారు. అసెంబ్లీ స్థానాల కు.. మహమ్మద్ వజాహత్ అలీ(నర్సాపూర్), కోదాటి సుహాసిని (పటాన్‌చెరు), పిట్ల శ్రీనిరాజు(మల్కాజిగిరి), గున్నం నరేంద్రరెడ్డి (ఎల్‌బీ నగర్), సయ్యద్ ఒమర్ (రాజేంద్రనగర్), కె. రాణి (ముషీరాబాద్), ఇ.రాజు (ఖైరతాబాద్), సుదర్శనం వెంకటేశ్వర్లు (జూబ్లీహిల్స్), చెర్లపల్లి నీతాగౌడ్ (సనత్‌నగర్), మహమ్మద్ అయూబ్‌ఖాన్ (చార్మినార్), నర్సింగోరు నర్సింహాచారి (ఆలేరు), కణితి కృష్ణ (పినపాక), ముక్తిరాజు (ఇల్లెందు), షేక్ పాషా (ఖమ్మం), అప్పల లింగమూర్తి (పాలేరు), మల్లు శివరాం (మధిర), వాసం రామకృష్ణదొర (వైరా), తమ్మల రాజేష్‌కుమార్ (సత్తుపల్లి), నార్ల సత్యనారాయణ (కొత్తగూడెం), పాయం పోతయ్య దొర (అశ్వారావుపేట), కురుసం సుబ్బారావు (భద్రాచలం)ను ప్రకటించారు.
జేఎస్పీ తెలంగాణ అభ్యర్థులు వీరే
Published Wed, Apr 9 2014 4:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement
Advertisement