తొలిదశకు 90 వేల మందితో బందోబస్తు: డీజీపీ ప్రసాదరావు | 90 thousands of police protection for first phase general elections: DGP | Sakshi
Sakshi News home page

తొలిదశకు 90 వేల మందితో బందోబస్తు: డీజీపీ ప్రసాదరావు

Published Wed, Apr 30 2014 2:10 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

తొలిదశకు 90 వేల మందితో బందోబస్తు: డీజీపీ ప్రసాదరావు - Sakshi

తొలిదశకు 90 వేల మందితో బందోబస్తు: డీజీపీ ప్రసాదరావు

రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తొలిదశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం తెలంగాణలోని 10 జిల్లాల పరిధిలో 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ బందోబస్తు కోసం 90 వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ బయ్యారపు ప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు పోలింగ్ సామగ్రి, సిబ్బందితో పాటు పోలీసు బలగాలను తరలించడానికి వాయుసేనకు చెందిన నాలుగు హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు.

వీటికి తోడు అత్యవసర సమయాల్లో సేవలు అందించడం కోసం రెండు ఎయిర్ అంబలెన్సులను పోలీసు విభాగం సిద్ధం చేశామన్నారు. మావోయిస్టు యాక్షన్ టీమ్స్ విరుచుకుపడవచ్చనే అనుమానం ఉన్న మూడు జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలతో పాటు మరికొన్ని చోట్ల అదనపు భద్రతకోసం ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణతో పాటు సమీక్ష కోసం తెలంగాణలో 11 మంది ఐపీఎస్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించినట్టు తెలిపారు.  ఇప్పటివరకు 32,18,143 మద్యం బాటిళ్లు,  రూ. 122,94,08,385 నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement