సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో చివరకు 2,922 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,177 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో పరిశీలన అనంతరం 1,255 మంది అభ్యర్థుల దరఖాస్తులను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇక ఇక్కడి మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు 455 మంది నామినేషన్లు వేశారు. ఇందులో 59 మంది దరఖాస్తులను తిరస్కరించగా చివరకు 396 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ప్రాంతంలో మే 7వ తేదీన ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.