పెద్దాయన కొడుకు చిన్నబోయాడు!
పట్టు నిలుపుకునేందుకు కోట్ల ప్రయత్నాలు
కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కె.జి.రాఘవేంద్రారెడ్డి: కర్నూలు జిల్లా పేరు వింటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించిన కోట్లను జిల్లా ప్రజలు ప్రేమగా ‘పెద్దాయన’ అని పిలుచుకుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన విజయభాస్కర్ రెడ్డి చివరివరకు జిల్లాపై పట్టు కొనసాగించారు. కర్నూలు పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను చెప్పిన వ్యక్తులకే టికెట్లు ఇప్పించుకోవడం.. వారిని గెలిపించుకోవడం ద్వారా తనకు ఎదురు లేదనిపించుకున్నారు. కాలంతో పాటు కర్నూలు జిల్లా రాజకీయాల్లోనూ పెనుమార్పులు సంభవించాయి.
ఈ నేపథ్యంలో పెద్దాయన కొడుకు కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రాష్ట్ర విభజన పాపం వుూటగట్టుకున్న కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండటం.. మరోవైపు అభివృద్ధి పనుల్లో వ్యక్తిగత ఆరోపణలు ఎదుర్కొంటుండటం ఆయునకు పెనుసవాళ్లుగా వూరారుు. దీంతో హారతులు పట్టిన ఊళ్లలోనే కన్నెత్తి చూసేందుకు కూడా జనం ఇష్టపడటం లేదు. మొత్తం మీద గెలుపు కోసం కాకపోయినా మరిన్ని ఓట్లు సంపాదించి పరువు నిలుపుకునేందుకు పెద్దాయన కొడుకు పాకులాడుతున్నారు.
కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత...
రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఉవ్ముడి రాష్ట్రం కోసం రాజధానిని త్యాగం చేశామని.. ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించడంతో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఇందుకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ధ్ది చెబుతామంటున్నారు. కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను తుడిచేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదే ఇప్పుడు కోట్లకు ప్రాణసంకటంగా మారింది.
కనిపించని అభివృద్ధి జాడలు!
ఎంపీగా, కేంద్ర మంత్రిగా కోట్ల నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు న్నాయి. గ్రామాల్లో ప్రజలు నీటి సవుస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వస్తే రోడ్లు బురదమయమే. ఎంపీగా తవు సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. కోట్ల మనిషిగా ముద్రపడిన ప్రస్తుత కోడుమూరు తాజా మాజీ ఎమ్మెల్యే వుురళీ కృష్ణ తమ గ్రామాలకు ఒక్కసారి కూడా రాలేదని వారు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌కు.. ప్రత్యేకించి దశాబ్దాల తరబడి కోట్ల కుటుంబం వెంట ఉన్నప్పటికీ తమకు ఒరిగిందేమీ లేదనేది కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈసారి తాము కోట్ల కుటుంబం వెంట ఉండేదే లేదని తేల్చి చెబుతున్నారు.
పైసలిస్తేనే పనులు!
అభివృద్ధి పనుల్లో కోట్ల జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నారుు. కర్నూలు-కోడుమూరు రహదారి విస్తరణ పనుల్లో రూ.10 కోట్లు ఇస్తేనే పనులు చేయనిస్తానని కాంట్రాక్టర్‌ను కోట్ల బెదిరించినట్లు విమర్శలున్నాయి. దీంతో కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే వదిలేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
బుట్టాకు అనుకూల పవనాలు!
కోట్లపై జనాగ్రహం... మరోవైపు టీడీపీలో ఉన్న అసంతృప్తులు వైఎస్సార్ సీపీ అభ్యర్థి బుట్టా రేణుకకు కలిసి వస్తున్నారుు. టీడీపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన కేఈ ప్రభాకర్ చివరకు చల్లబడినా... పోటీలో ఉన్న బీటీ నాయుడుకు సహకరిస్తారన్న నమ్మకం లేదని తెలుగు తమ్ముళ్లే పేర్కొంటున్నారు. వైఎస్ పథకాలు, జగన్‌పై అభిమానం ఆమెకు కలిసివచ్చే అంశాలు. దీనికితోడు బలమైన ఓటు బ్యాంకు కలిగిన చేనేత వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆమెకు అదనపు అర్హత అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బుట్టా రేణుకకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయుపడుతున్నారు.