kotla vijaya baskhar reddy
-
అనామకంగా ఆరంభమై అభివృద్ధిపథంలో!
అది 1992 అక్టోబర్ 9. కోట్ల విజయ భాస్కరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు. హైదరాబాద్‌కు ఫోన్ చేస్తే, ఢిల్లీలోనే ఉన్నారని వర్తమానం. పీవీ క్యాబినెట్లో న్యాయశాఖ, కంపెనీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారప్పుడు. ఢిల్లీ నివాసానికి ఫోన్ చేస్తే, విజయ భాస్కరరెడ్డి ఫోన్ ఎత్తారు. ‘ఏమిటి సార్ ఈరోజే ప్రమాణ స్వీకారం అన్నారు. మీరింకా ఇక్కడే ఉన్నారేమిటంటే – ‘ఉదయం విమానం అందుకోలేక పోయాను. ప్రత్యేక విమానంలో వెళ్లబోతున్నాన’న్నారు. సరే వారిని అభినందించి, విజయవాడలో దంత వైద్య కళాశాల నెలకొల్పమని సలహా ఇచ్చాను. ‘ఊరుకో శివాజీ! నా ముందున్న ముఖ్యమంత్రి వైద్య కళాశాలల జోలికిపోయి ఉద్యోగం పోగొట్టుకొన్నాడు. నాకు ఈ సలహా ఇస్తున్నావు’ అన్నారు. ‘అది కాదులెండి, నేను హైదరాబాద్ వచ్చి వివరిస్తాను’ అని అప్పటికా సంభాషణ ముగించాను.మూడు నాలుగు రోజుల్లో హైదరాబాదు ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసి సవివరంగా వివరించాను. అప్పటికి అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ఉస్మానియా వైద్య కళాశాలలో మాత్రమే దంత వైద్య విద్య ఉంది. దానిలో మొత్తం సీట్లు 32. అందులో 7 సీట్లు జమ్మూ–కశ్మీరుకు కేంద్ర ప్రభుత్వ కోటాలో పోతే... మిగిలిన 25 సీట్లలో ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు వరుసగా 11, 6, 8 సీట్లు పంచుతారు. కనుక ‘విజయవాడలో హెల్త్ యూనివర్సిటీలో ఒక కళాశాల నెలకొల్పితే, మరొక 40 సీట్లు వస్తాయి. దానికి పెద్దగా నిధులు కూడా అవసరం ఉండదు కదా! మొదటి, రెండు సంవత్సరాల చదువుకు – అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, బాక్టీరియాలజీ, ఫార్మకాలజీలకూ; వాటి నాన్క్లినికల్ సబ్జెక్టులకు వైద్య కళాశాలలోనున్న వసతులు సరిపోతాయి కదా.మూడో సంవత్సరం వచ్చేసరికి కాస్త అవుట్ పేషెంట్ పార్టులో ఓ 10, 15 డెంటల్ థియరీలు, కాస్త ఆపరేషన్ థియేటర్, ఇన్‌పేషెంట్లకు వసతి వంటివి ఏర్పాటు చేసుకోవడానికి నామమాత్రపు కేటాయింపులు సరిపోతాయ’ని చెప్పాను. వైద్య విశ్వవిద్యాలయం కులపతిగా ఉన్న డాక్టర్ లింగం సూర్యనారాయణను పిలిపించి, దానికి అవసరమైన నివేదిక తయారు చేయమని పురమాయించమని కోరాను. ఇది ప్రభుత్వ రంగంలో నెలకొంటుంది గనక అవినీతి ఆరోపణలకు తావుండదనీ చెప్పాను.ఈ సంగతి డాక్టర్ లింగం గారికి ముందుగానే తెలియజేస్తే – ‘అమ్మో! వారిని కలవడం మాటలా? నావల్ల కాదని’ కంగారుపడ్డారు. తరువాత రెండు, మూడు రోజులకు వారికి ఫోన్ చేసి చెప్పాను... ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కబురు వస్తుందనీ, కంగారు పడకుండా సవివరంగా నివేదిక తయారు చేసుకొని వెళ్లమనీ. ‘ఫోను వచ్చింది – శివాజీ ఈరోజే వెడుతున్నాను’ అని సెలవిచ్చారు. ముఖ్యమంత్రి ఆ నివేదిక పరిశీలించి వెంటనే ఐదు లక్షల రూపాయలు కేటాయించి, విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండు భవనాన్ని బదలాయించి, కాలేజీ మొదలు పెట్టమన్నారు.ఇకపై, ప్రభుత్వం నుండి నిధుల కోసం ఎదురు చూడకుండా, మీ కాళ్ల మీద మీరు నిలబడి కాలేజీ నడుపుకోవాలని కూడా హెచ్చరించారు. అలా 1992–93లో 40 వార్షిక ప్రవేశాలతో, విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ యాజమాన్యంలో ఈ కాలేజీ పురుడు పోసుకుంది. ఇది అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో, ద్వితీయ దంత వైద్య కళాశాల. హెల్త్ యూనివర్సిటీ మొత్తం అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు చెందింది కనుక, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దానిలో ప్రవేశాలకు అవిభక్త రాష్ట్రమంతటికీ అన్ని జిల్లాలకూ పది సంవత్సరాల పాటు అర్హత ఉంది. ఇప్పుడు ఆ గడువు ముగిసింది కనుక విభజిత ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యింది.ఇదిలా ఉండగా, డాక్టర్ లింగం పదవీ విరమణ తర్వాత వారి స్థానంలో డాక్టర్ సీఎస్ భాస్కరన్ వైస్ ఛాన్స్లర్ అయ్యారు. వారు బ్యాక్టీరియాలజీ ప్రొఫెసర్. వారికి హాస్పిటల్ పని, ఆపరేషన్లు, రోగులు, వైద్యం వంటి బాధ్యతలు ఉండవు. దానితో వారు అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి కేంద్రీకరించారు. గతంలో కూడా డాక్టర్ డి. జగన్నాథరెడ్డి, డాక్టర్ డి. భాస్కర్ రెడ్డి, డాక్టర్ హరినాథ్ వంటి వారు వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్గాను, వైద్య విద్యాశాఖ సంచాలకులుగాను బాగా రాణించారు. డాక్టర్ భాస్కరన్ విజయవాడలో ప్రైవేట్ ప్రాక్టీసులో ఉన్న సీనియర్ దంత వైద్యులను పిలిచి ‘ఈ కళాశాల అమ్మా, అబ్బా లేని అనాథ. మీరు ఈ ప్రాంతం వారు. ఇవి బతికి, బట్టగట్టేటట్లు కాపాడవలసిన గురుతర బాధ్యత మీ మీద ఉంది. జీతం–భత్యం ఆశించకుండా పని చేయండి’ అని విన్నవించారు. అలాగే పనిచేసి, వారు దాన్ని నిలబెట్టారు. అదే నేడు బీడీఎస్‌తో పాటుగా ఎమ్‌డీఎస్ కోర్సుల్లో కూడా తర్ఫీదునిస్తూ రాష్ట్రంలో అత్యుత్తమ కళాశాలగా నిలదొక్కుకుంది.– డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త, రాజ్యసభ మాజీ సభ్యులు -
మచ్చలేని నాయకుడు ‘కోట్ల’
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కరరెడ్డి మచ్చలేని నాయకుడని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కొనియాడారు. కోట్ల 95వ జయంతి వేడుకలను శనివారం కర్నూలులో ఘనంగా నిర్వహించారు. స్థానిక కళావెంకట్రావ్ భవనంలో పెద్దాయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం స్థానిక కిసాన్ ఘాట్‌లోని మాజీ ముఖ్యమంత్రి సమాధిపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ కోట్లు సంపాదించలేకపోయినా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన మేరు నగధీరుడు విజయభాస్కరరెడ్డి అన్నారు. హుందాతనం, పెద్దరికం సద్గుణాలను కోట్ల తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలో చూశానన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీలను అమలు చేయలేక ప్రజలను మోసగిస్తుందని మండిపడ్డారు. రైతు, డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2019 నాటికి కాంగ్రెస్‌కు పూర్వ వైభవం: రాష్ట్రంలో 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దాయన జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రైతులు సేద్యం మానుకోవాలని చెప్పిన చంద్రబాబు నాయుడు స్వాతంత్ర వేడుకల్లో రైతాంగానికి మేలు చేస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నిజంగా రైతులపై ప్రేమే ఉంటే పెండింగ్‌లో ఉన్న గురురాఘవేంద్ర ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలన్నారు. అంతకుముందు ఎన్ఎస్ఐయూ జిల్లా అధ్యక్షుడు పూడూరు నాగమధుయాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు డీసీసీ కార్యాలయం నుంచి కిసాన్ఘాట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు, పీసీసీ సెక్రటరీ రవిచంద్రారెడ్డి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు చిన్నస్వామి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, మాజీ డీసీసీ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, సర్దార్ బుచ్చిబాబు, కాంగ్రెస్ నాయకులు చెరుకులపాడు నారాయణరెడ్డి, వై.వి.రమణ, తిప్పన్న, ఎస్.ఖలీల్‌బాష, సలాం, మజరుల్‌హక్, సేవాదళ్ చక్రపాణిరెడ్డి, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జలు పాల్గొన్నారు. -
పెద్దాయన కొడుకు చిన్నబోయాడు!
పట్టు నిలుపుకునేందుకు కోట్ల ప్రయత్నాలు కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కె.జి.రాఘవేంద్రారెడ్డి: కర్నూలు జిల్లా పేరు వింటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించిన కోట్లను జిల్లా ప్రజలు ప్రేమగా ‘పెద్దాయన’ అని పిలుచుకుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన విజయభాస్కర్ రెడ్డి చివరివరకు జిల్లాపై పట్టు కొనసాగించారు. కర్నూలు పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను చెప్పిన వ్యక్తులకే టికెట్లు ఇప్పించుకోవడం.. వారిని గెలిపించుకోవడం ద్వారా తనకు ఎదురు లేదనిపించుకున్నారు. కాలంతో పాటు కర్నూలు జిల్లా రాజకీయాల్లోనూ పెనుమార్పులు సంభవించాయి. ఈ నేపథ్యంలో పెద్దాయన కొడుకు కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రాష్ట్ర విభజన పాపం వుూటగట్టుకున్న కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండటం.. మరోవైపు అభివృద్ధి పనుల్లో వ్యక్తిగత ఆరోపణలు ఎదుర్కొంటుండటం ఆయునకు పెనుసవాళ్లుగా వూరారుు. దీంతో హారతులు పట్టిన ఊళ్లలోనే కన్నెత్తి చూసేందుకు కూడా జనం ఇష్టపడటం లేదు. మొత్తం మీద గెలుపు కోసం కాకపోయినా మరిన్ని ఓట్లు సంపాదించి పరువు నిలుపుకునేందుకు పెద్దాయన కొడుకు పాకులాడుతున్నారు. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత... రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఉవ్ముడి రాష్ట్రం కోసం రాజధానిని త్యాగం చేశామని.. ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించడంతో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఇందుకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ధ్ది చెబుతామంటున్నారు. కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను తుడిచేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదే ఇప్పుడు కోట్లకు ప్రాణసంకటంగా మారింది. కనిపించని అభివృద్ధి జాడలు! ఎంపీగా, కేంద్ర మంత్రిగా కోట్ల నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు న్నాయి. గ్రామాల్లో ప్రజలు నీటి సవుస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వస్తే రోడ్లు బురదమయమే. ఎంపీగా తవు సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. కోట్ల మనిషిగా ముద్రపడిన ప్రస్తుత కోడుమూరు తాజా మాజీ ఎమ్మెల్యే వుురళీ కృష్ణ తమ గ్రామాలకు ఒక్కసారి కూడా రాలేదని వారు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌కు.. ప్రత్యేకించి దశాబ్దాల తరబడి కోట్ల కుటుంబం వెంట ఉన్నప్పటికీ తమకు ఒరిగిందేమీ లేదనేది కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఈసారి తాము కోట్ల కుటుంబం వెంట ఉండేదే లేదని తేల్చి చెబుతున్నారు. పైసలిస్తేనే పనులు! అభివృద్ధి పనుల్లో కోట్ల జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నారుు. కర్నూలు-కోడుమూరు రహదారి విస్తరణ పనుల్లో రూ.10 కోట్లు ఇస్తేనే పనులు చేయనిస్తానని కాంట్రాక్టర్‌ను కోట్ల బెదిరించినట్లు విమర్శలున్నాయి. దీంతో కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే వదిలేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. బుట్టాకు అనుకూల పవనాలు! కోట్లపై జనాగ్రహం... మరోవైపు టీడీపీలో ఉన్న అసంతృప్తులు వైఎస్సార్ సీపీ అభ్యర్థి బుట్టా రేణుకకు కలిసి వస్తున్నారుు. టీడీపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన కేఈ ప్రభాకర్ చివరకు చల్లబడినా... పోటీలో ఉన్న బీటీ నాయుడుకు సహకరిస్తారన్న నమ్మకం లేదని తెలుగు తమ్ముళ్లే పేర్కొంటున్నారు. వైఎస్ పథకాలు, జగన్‌పై అభిమానం ఆమెకు కలిసివచ్చే అంశాలు. దీనికితోడు బలమైన ఓటు బ్యాంకు కలిగిన చేనేత వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆమెకు అదనపు అర్హత అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బుట్టా రేణుకకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయుపడుతున్నారు. -
సీఎం రేసులో కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి?
విభజన అంశం రోజుకో ట్విస్ట్ తిరుగుతున్న దశలో ఇప్పుడు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి కీలక వార్తల్లో చోటు సంపాదించారు. ఆయనను సీఎం పదవి వరించనుందనే ప్రచారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆశల మోసులు.. పెదవి విరుపులు కలగలిపి జిల్లాలో అందరి నోటా ఇదే చర్చ. అన్నకు ప్రమోషనంటూ అభిమానుల్లో ఒకటే హడావుడి. సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి మరోసారి ‘కోట’ల కుటుంబాన్ని వరిస్తోందనే ఆశలు జిల్లా ప్రజలను ఊరిస్తోంది. మరోవైపు సీఎం పదవి ఖరారైందని, ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించటమే తరువాయని ఆయన వర్గీయులు తెగ ప్రచారం చేస్తున్నారు. జిల్లా పెద్దాయన కోట్ల విజయభాస్కరరెడ్డి మరణం తరువాత ఆయన కుమారుడు జయసూర్యప్రకాష్‌రెడ్డి రాజకీయ వారసుడుగా ఎదిగారు. ఎంపీగా గెలుపొందిన ప్రతిసారీ కేంద్రంలో ఆయనకు బెర్త్ ఖాయమని ప్రచారం సాగేది. పలుమార్లు ఇలా పదవి దోబూచులాడినప్పటికీ ఎట్టకేలకు యూపీఏ ప్రభుత్వం తన విభజన ఎత్తుగడలో భాగంగా సూర్యప్రకాష్‌రెడ్డికి కేంద్ర రైల్వే సహాయ మంత్రి పోస్టును కట్టబెట్టిన సంగతి విదితమే. అది చేపట్టిన నాటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉధృతంగా సాగుతుండటం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు పెద్దగా రాకపోవటం ఆయనను నిరుత్సాహానికి గురిచేసేది. అయినా ఎక్కడా అధిష్టానాన్ని ధిక్కరించకుండా కోట్ల వ్యూహాత్మకంగానే వ్యవహరించేవారు. సమైక్య ఉద్యమ హోరు నేపథ్యంలో ఇటీవల తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించినప్పటికీ ఆ తరువాత అధినేతలు వారించటంతో వెనక్కుతగ్గారు. దీంతో అధిష్టానం దృష్టిలో కోట్ల విధేయునిగా మార్కులు కొట్టేశారు. దీంతో మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి సదభిప్రాయం కలిగిందని ఆయన సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘కోట్ల’ కూడా తన వంతు ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర విభజన జరిగిన పక్షంలో పరిష్కరించాలంటూ అధిష్టానం ముందు మూడు డిమాండ్లు పెట్టినట్లు సన్నిహితుల కథనం. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన వాటిని బహిర్గత పరచడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు సీఎం రేసులో ఉండడం కొత్త చర్చకు తావిస్తోంది. 9న అధినేత్రిని కలవనున్న మంత్రి ? కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డికి సీఎం పదవి వరిస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 9న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని కలవనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ రోజు కేవలం మంత్రి కోట్ల ఒక్కరికే సోనియా అప్పాయింట్ మెంట్ ఇచ్చారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఆ రోజు సీఎం పదవిని కట్టబెట్టే విషయంపై స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని భోగట్టా. ఈ అంశం గతంలో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కోర్‌కమిటీ సమావేశంలో తెరపైకి వచ్చినట్లు తెలిసింది. ఆ తరువాత హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన రహస్య సమావేశంలోనూ సీఎం ప్రతిపాదన ప్రస్తావన జరిగిందని విశ్వసనీయ వర్గాల కథనం. అయితే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే తప్ప ఇంకొకరికి అయ్యే అవకాశం రాదని రాజకీయవర్గాలు అంచనా చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం మార్పు ఉండకపోవచ్చనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఎన్నికలకు కేవలం కొద్దిమాసాలు మాత్రమే ఉన్న ఈ తరుణంలో పెద్ద పదవిని తీసుకుని లేని సమస్యలను నెత్తికెత్తుకోవటం ఎందుకనే అభిప్రాయం కోట్ల వర్గీయులే మరి కొందరు అంటున్నారు. మొత్తానికి ఈ అంశం జిల్లాలోనూ, అయన ఇంట్లోను హాట్ టాపిక్‌గా మారిపోయింది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం ముఖ్యమంత్రి మార్పు లేదని శుక్రవారం ఢిల్లీలో స్పష్టం చేశారు. సీఎం మార్పు ఊహాగానాలేనని కొట్టిపారేశారు. అయితే కాంగ్రెస్ లో అవునంటే....కాదనిలే....కాదంటే అవుననిలే అనే నానుడి ఉన్న నేపథ్యంలో ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లు అన్నకు సీఎం పదవి వరిస్తుందేమో?