
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలకు నగారా మోగింది. 6 రాష్ట్రాల్లోని 7 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అక్టోబర్ 14న నామినేషన్లు. అక్టోబర్ 15న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ. అక్టోబర్ 17 నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు.
ఉప ఎన్నికలు జరిగే స్థానాలు (7)
మహారాష్ట్ర-తూర్పు అంధేరి
బిహార్-మోకమ
బిహార్- గోపాల్‌గంజ్
హరియాణ-అదంపూర్
తెలంగాణ-మునుగోడు
ఉత్తర్‌ప్రదేశ్- గోల గోకరన్నాథ్
ఒడిశా- ధామ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment