సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో వారం రోజులుగా జరుగుతున్న వరంగల్ విజయగర్జన సన్నాహక సమావేశాలు శనివారం ముగిశాయి. ఈ నెల 18 నుంచి రోజుకు 20 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో విజయగర్జనకు జనసమీకరణపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఆరు రోజుల పాటు మొత్తం 103 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. గజ్వేల్‌తో పాటు హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ఈ నెల 30 తర్వాత కేటీఆర్ సమావేశమవుతారు. ఆరు రోజుల వ్యవధిలో జరిగిన విజయగర్జన సన్నాహక సమావేశాల్లో భాగంగా కేటీఆర్ సుమారు 8 వేలమంది పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment