
సాక్షి, హైదరాబాద్: ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామన్న టీఆర్‌ఎస్ నేతల హామీలు నోటి మాటలేనని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా విమర్శించారు. హామీలకు మించి 2.25 లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
2021 పీఆర్సీ కమిటీ రాష్ట్రంలో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వ శాఖ ల్లో 39% మేరకు ఉద్యోగులే లేరని చెప్పిన విష యాన్ని గుర్తుచేశారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం గత ఎనిమిదేళ్లలో 35 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు స్పష్టమవుతుందని షర్మిల ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment