
కీవ్: రష్యా, చైనా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరు దేశాల అధినేతలు పుతిన్, షీ జిన్‌పింగ్ నిర్ణయానికొచ్చారు. వారు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం మినహా పలు అంశాలపై చర్చించుకున్నారు. భేటీని టీవీల్లో ప్రసారం చేశారు.
సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా రష్యా, చైనా బంధం బలోపేతం అవుతుండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇరు దేశాల సైన్యాలు పరస్పరం సహకరించుకోవాలని పుతిన్ ఆకాంక్షించారు! రెండు దేశాల సంబంధాల్లో సైనిక సహకారానికి ‘ప్రత్యేక ప్రాధాన్యం’ ఉందని ఉద్ఘాటించారు. రష్యా, చైనా సైనిక దళాల నడుమ సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. రష్యాలో పర్యటించాలని జిన్‌పింగ్‌ను ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment