
'కాంగ్రెస్ పార్టీతో జతకట్టం, సహకరిస్తాం'
కోల్ కతా: కాంగ్రెస్ పార్టీతో జత కట్టబోమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, హిందూత్వ ఎజెండాపై పోరాడేందుకు అన్ని సెక్యులర్ పార్టీల సహకారం తీసుకుంటామని చెప్పారు.
సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీతో తమకు సరిపడదని, అందుకే ఆ పార్టీతో కలవబోమని ఏచూరి వివరించారు. పార్లమెంట్ లో అంశాలవారీగా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తామని చెప్పారు. సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సీతారాం ఏచూరి.. పశ్చిమ బెంగాల్ కు వచ్చారు.