ఏచూరికి ప్రముఖుల ఘన నివాళి
పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నివాళులు అర్పించిన వివిధ పార్టీల నేతలు
పినరయి, సోనియా, శరద్ పవార్, ఉదయనిధి, చిదంబరం తదితరులు
వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ విజయసాయిరెడ్డి
భౌతికకాయం ఎయిమ్స్‌కు అప్పగింత
బారులుతీరిన కామ్రేడ్లు, జనసంద్రమైన హస్తినలోని సీపీఎం కార్యాలయం
సాక్షి, న్యూఢిల్లీ: అశ్రునయనాల మధ్య, కడసారి చూపు కోసం తరలివచ్చిన వేలాదిమంది అభిమానులు, కార్యకర్తల మధ్య కామ్రేడ్ సీతారాం ఏచూరి నివాళులు పూర్తి అయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు, నేతలు ఏచూరికి తుది వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాం«దీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బృందా కారత్, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తదితర ప్రముఖులు ఏచూరి పారి్థవ దేహానికి ఘన నివాళులు అర్పించారు.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, సచిన్ పైలట్, డీఎంకే పార్టీ మంత్రి ఉదయనిధి స్టాలిన్, ఎంపీ కనిమొళి, టీఆర్ బాలు, దయానిధి మారన్, ఆప్ నేత మనీశ్ సిసోడియా, కాంగ్రెస్ నేతలు చిదంబరం, జైరాం రమేష్, అజయ్ మాకెన్, రాజీవ్ శుక్లా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, చైనా, వియత్నాం రాయబారులు నివాళులర్పించారు.
అనంతరం ఏచూరి భార్య సీమాచిస్తీ, కుమార్తె అఖిల, కుమారుడు డాని‹Ùలను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఏచూరిని కడసారి చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ బృందం, ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, విదేశాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఢిల్లీ గోల్‌మార్కెట్‌లోని సీపీఎం కేంద్ర కార్యాలయం నుంచి ఎయిమ్స్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. జోరు వానను లెక్కచేయకుండా ‘ఇక సెలవు కామ్రేడ్, రెడ్ సెల్యూట్ ఏచూరి’అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 6 గంటలకు వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం ఏచూరి పార్థివ దేహాన్ని కుటుంబీకులు, పార్టీ నేతలు ఎయిమ్స్‌కు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment