ప్రముఖ రాజకీయ వేత్త, వామపక్ష మోధుడు కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. 72 ఏళ్ల ఏచూరి.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది వారాలుగా ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి నేడు ప్రాణాలు విడిచారు.
విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు : వైఎస్ జగన్
సీతారాం ఏచూరి మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన సీతారాం ఏచూరి, స్వశక్తితో జాతీయస్థాయికి ఎదిగారని ప్రశంసించారు. విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలు కనబర్చారని అన్నారు.
సీపీఎంలోనూ నాయకత్వ లక్షణాలు చూపి, పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక పోలిట్‌బ్యూరో సభ్యుడిగానూ, పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేశారని కొనియాడారు. సీతారాం ఏచూరి మృతి, దేశ రాజకీయాల్లో తీరని లోటని తెలిపిన వైఎస్ జగన్.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చదవండి: సీతారాం ఏచూరి జీవిత ప్రస్థానం
ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకం: సీఎం రేవంత్
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని తెలియజేశారు.
దేశంపై లోతైన అవగాహన: రాహుల్
సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మరణంపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. దేశ ఆలోచనల రక్షకుడని, భారత్ గురించి లోతైన అవగాహన ఉన్న వ్యక్తి ఏచూరి అని పేర్కొన్నారు. తాను ఏచూరితో కలిసి చేసిన సుదీర్ఘ చర్చలను ఇకపై మిస్ అవుతానని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.
జాతీయ రాజకీయాలకు తీరని లోటు: మమతా బెనర్జీ
సీతారాం ఏచూరి మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ‘సీతారాం ఏచూరి మరణించారని తెలిసి బాధగా ఉంది. ప్రముఖ పార్లమెంటేరియన్ అయిన ఆయన మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, సహోద్యోగులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని ఎక్స్‌లో తెలిపారు.
చాలా బాధాకరం: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని, చాలా బాధాకరమని నారాయణ అన్నారు. ఏచూరితో కలిసి అనేక జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన్నట్టు నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు.
ఏచూరిని తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు: బండి సంజయ్
సీతారాం ఏచూరి మరణం పట్ల కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవిత కాలం పనిచేశారన్నారు. తెలుగువాడిగా ఏచూరిని తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని బండి సంజయ్ అన్నారు. బలహీన వర్గాల హక్కుల కోసం ఏచూరి పోరాటం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం అదే పార్టీలో ఉండి పోరాడారన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి తీవ్ర లోటు: రాఘవులు
ఎల్లుండి సీతారాం ఏచూరికి అంతిమయాత్ర నిర్వహిస్తాం.
దేశ విదేశాల నాయకులు, ప్రతినిధులు దౌత్యవేత్తలు రాబోతున్నారు.
ఎల్లుండి మధ్యాహ్నం 10 గంటల నుంచి ఐదు గంటల వరకు సీపీఎం ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం సీతారాం ఏచూరి పార్తివ దేహాన్ని ఉంచుతాం.
ఆయన కోరిక మేరకు పార్థివదేహాన్ని పరిశోధనల కోసం ఆస్పత్రికి అప్పగిస్తాం.
సీతారాం ఏచూరి జీవితాంతం వామపక్ష ఉద్యమం కోసం పనిచేశారు
ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి.
ఏ పని అప్పగించిన అందులో తనదైన ముద్ర వేశారు.
కష్టకాలంలో సిపిఎం పార్టీని ముందుకు నడిపించారు.
ఇండియా కూటమి లో కీలకపాత్ర పోషించారు.
ఆయన పోరాట మార్గాన్ని ముందుకు తీసుకెళ్తాము
పీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కామెంట్స్.
చిన్ననాటి నుంచి వామపక్ష భావజానీకి ఆకర్షితుడై ,విద్యార్ధి ఉద్యమం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన మహా ధీరుడు సీతారాం ఏచూరి
జేఎన్‌యూ నుంచి అభ్యుదయ భావజాలాన్ని దేశ వ్యాప్తంగా విస్తరింప చేశారు .
అత్యున్నత యూనివర్సిటీ జె ఎన్ యు అధ్యక్షులుగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు.
ప్రపంచ దేశాలకు సైద్ధాంతిక చర్చకు వెళ్లేవారు.
చైనా , రష్యా లాంటి దేశాలకు సలహాలు ఇచ్చే వారు
ఆర్థిక సంస్కరణ లపై వీశ్లేషణ చేసే వరకు..
మన్మోహన్ సింగ్ లాంటి వారు రాజ్య సభ లో అయిన ప్రసంగం వినటానికి వచ్చే వారు..
చిన్న పెద్ద అందరినీ ఆప్యాయంగా పిలవడం అయినా గొప్పతనం..
దేశంలో అభ్యుదయ భావజాలాన్ని ప్రచారం చేశారు.
ఖమ్మం జిల్లా లో అనేక సందర్భాల్లో కూడా పిలిసిన వెంటనే వచ్చేవారు.
ఎంపీ గా తన బాధ్యత సక్రమంగా నేరేవేరుస్తూ ఆదర్శంగా నిలిచారు
మతోన్మాద శక్తులు పెరుగుతున్న సమయంలోకమ్యూనిస్టులకు ఆదరణ లేదు.
ఏచూరి లాంటి వారు చాలా అవసరం..
కమ్యూనిష్టులు ప్రజలకు అవసరం ఉన్నపుడు బలహీన పడ్డాం.
ఎల్లుండి బౌతికాయన్ని మెడికల్ కాలేజీ కి బౌతిక కాయని డొనేట్ చేస్తారు.
తెలంగాణ నుండి భారీ ఎత్తున అక్కడికి వెళ్తున్నాం.
ఏచూరి వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు: కపిల్ సిబల్
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణ వార్త తనను కలిచివేసిందని రాజ్యసభ ఎంపీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చీఫ్ కపిల్ సిబల్ విచారం వ్యక్తం చేశారు. ఏచూరి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని, తాము సుదీర్ఘకాలం ప్రయాణించామని చెప్పారు. 2005 నుంచి 2014 వరకూ ఆయన పార్లమెంట్‌లో తనతో ఉన్నారని గుర్తుచేసుకున్నారు. తాము ఎన్నో అంశాలపై చర్చించి పరిష్కరించేవారమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment