2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఆసక్తికర రాజకీయాలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలువురు సీనియర్ నేతలు తాము ఎన్నికల బరిలోకి దిగకుండా, తమ పిల్లలకు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్ యాదవ్, సుభా ఎస్‌పీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్, నిషాద్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ నిషాద్, కాంగ్రెస్ నాయకుడు పిఎల్ పునియా, ఇంద్రజిత్ సరోజ్, బ్రజ్‌భూషణ్ శరణ్ సింగ్ తదితరులు ఉన్నారు.
ఫిరోజాబాద్ లోక్ సభ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ నేత ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ ఎన్నికల బరిలో దిగారు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ సమాజ్ వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం ఆయన తన కుమారుని విజయం కోసం శ్రమిస్తున్నారు. శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ బదౌన్ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. బదౌన్‌లో మూడో దశలో ఎన్నికలు జరిగాయి. శివపాల్ తన కుమారుని విజయం కోసం ప్రచార కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు.
సంత్ కబీర్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రవీణ్ నిషాద్ ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయం కోసం ఆయన తండ్రి, యోగి ప్రభుత్వ మంత్రి, నిషాద్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ నిషాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక్కడ మే 25న ఓటింగ్ జరగనుంది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ఇటీవ పలు ఆరోపణల్లో చిక్కుకున్నారు. కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు రాజ్‌భర్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఆయన కుమారుడు అరవింద్ రాజ్‌భర్ ఘోసీ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగారు. ఓం ప్రకాష్ రాజ్‌భర్ తన కుమారుని విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. బారాబంకి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత పీఎల్ పునియా కుమారుడు తనూజ్ పునియా ఎన్నికల బరిలోకి దిగారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కింద తనూజ్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment