Seat Sharing
-
జార్ఖండ్ ఎన్నికలు.. ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్ ఖరారు
జార్ఖండ్‌లో ఎన్నికల సమరం మొదలైంది. 82 స్థానాల్లున్న రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 13, 20 రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకం, అభ్యర్థుల ఎన్నికల, ప్రచారాలపై పార్టీలన్నీ నిమగ్నమయ్యాయి. అధికారమే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష కూటమిలు పావులు కదుపుతున్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య సీట్ల షేరింగ్ ఫార్మూలా పూర్తయ్యింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) 43 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 30 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనుంది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఆరు స్థానాల్లో పోటీ చేయనుండగా, వామపక్షాలు మూడు స్థానాల్లో ( నిర్సా, సింద్రీ, బగోదర్) పోటీ చేయనున్నాయి. అయితే ధన్వర్, బిష్రాంపూర్, ఛతర్‌పూర్‌లోని మూడు స్థానాల్లో సీపీఐ-ఎంఎల్‌తో జేఎంఎం స్నేహపూర్వకంగా పోరాడుతుందని జేఎంఎం ప్రధాన కార్యదర్శి వినోద్ పాండే తెలిపారు. మరోవైపు ధన్వార్‌లో బీజేపీ తమ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బాబూలాల్ మరాండీని బరిలోకి దింపింది. జార్ఖండ్‌లోని 82 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఇదిలా ఉండగా జేఎంఎం ఇప్పటికే తమ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్హెట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయగా, ఆయన భార్య కల్పనా ముర్ము సోరెన్ గాండే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసే పోటీ చేస్తుందని, మొత్తం 82 స్థానాలకు గాను 70 స్థానాల్లో కాంగ్రెస్, జేఎంఎంలు అభ్యర్థులను నిలబెడతాయని సోరెన్ గతంలోనే చెప్పారు. -
బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీపై ట్రోలింగ్ షురూ!
ముంబై: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)నేత బాబా సిద్ధిఖీ తనయుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ తన బుద్ధిని చూపెట్టిందని వ్యాఖ్యానించారు. అయితే జీషన్ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ మహరాష్ట్ర మహా వికాస్ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఆ 255 స్థానాల్లో వాండ్రే సిట్టింగ్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ స్థానం సైతం ఉంది. ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా కాంగ్రెస్.. శివసేన (యూబీటీ) ఉద్దవ్ ఠ్రాకేకు అప్పగించింది. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ పోటీ చేయనున్నారు.అయితే సీట్ల పంపకంపై కాంగ్రెస్‌లో ఉన్న తన పాత స్నేహితుడు ఫోన్ చేశాడని, వాండ్రే స్థానాన్ని శివసేన వర్గం (యూబీటీ)కి అప్పగించిన విషయాన్ని తనతో చెప్పాడని అన్నారు. ఇదే విషయంపై జీషన్ సిద్ధిఖీ ట్వీట్ చేశారు. ఒకప్పుడు తాను సొంత పార్టీగా భావించిన కాంగ్రెస్ తనని ద్రోహం చేసిందని, వాండ్రే సీటును ఉద్దశ్ ఠ్రాకేకు కేటాయించి తన బుద్ధిని చూపెట్టిందన్నారు. నమ్ముకున్న వాళ్లకి మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ రక్తంలోనే లేదని అన్నారు.सुना है पुराने दोस्तों ने वांद्रे पुर्व में अपना उम्मीदवार घोषित कर दिया है । साथ निभाना तो कभी इनकी फितरत में था ही नहीं। “रिश्ता उसी से रखो जो इज़्ज़त और सम्मान दे, मतलब की भीड़ बढ़ाने का कोई फ़ायदा नहीं।”अब फैसला जनता लेगी!!!!— Zeeshan Siddique (@zeeshan_iyc) October 23, 2024 దీనిపై కాంగ్రెస్ మద్దతు దారులు జీషన్ సిద్ధిఖీని ట్రోల్ చేస్తున్నారు. జీషన్ సిద్ధిఖీ కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన పలు ఘటనల్ని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న జీషన్ సిద్ధిఖీ..ఎన్సీపీ చీఫ్ అజిత్ పవర్ చేసిన జన్ సన్మాన్ యాత్రలో పాల్గొన్నారు. ఆయాత్రకి కాంగ్రెస్‌కి సంబంధం లేదు. అలాంటప్పుడు మీరు అజిత్ పవార్‌తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని విమర్శిస్తున్నారు. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు. కాబట్టే పార్టీ నుంచి కాంగ్రెస్ బహిష్కరిస్తే ఎన్సీపీలో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరి తాజా జీషన్ సిద్ధిఖీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. They give you respect and honor and everything and you betray them on occasion, how will it work like this my brother?— Yadvendra Yadav (@yadusandy) October 23, 2024 -
యూపీ ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్ కంట్లో ఎస్పీ నలుసు
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తీరు కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు తెస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 37 పార్లమెంట్ స్థానాలు కొల్లగొట్టామన్న అతివిశ్వాసంతో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని కాలదన్నుతోంది. ఎస్పీ ఒంటెద్దు పోకడలు కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. యూపీలో తమతో మాటైన చెప్పకుండా ఎస్పీ అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్‌కు సమస్యగా మారింది. తాము పోటీలో ఉన్న మధ్యప్రదేశ్‌లో మరో అభ్యర్థిని బరిలో దించి పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చింది. మహారాష్ట్రతో మహా వికాస్ అఘాడీ కూటమిలో పొరపొచ్చాలు పెరిగేలా 12 సీట్లు కోరుతూ కాంగ్రెస్‌కు ఎస్పీ ఇక్కట్లు తెస్తోంది. యూపీలో ఏకపక్షంగా..ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న 9 స్థానాల్లో ఉమ్మడిగా ముందుకెళ్లాలని ఎస్పీ, కాంగ్రెస్‌లు ప్రాథమిక నిర్ణయానికొచ్చాయి. అయితే ఇంతవరకు పోటీ చేసే స్థానాలపై స్పష్టత రాలేదు. హరియాణా ఎన్నికల్లో అతి విశ్వాసం కారణంగా ఓటమిపాలైన కాంగ్రెస్‌తో పెట్టుకుంటే లాభం లేదని ఎస్పీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఏకపక్షంగా 6 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ స్థానాల్లో తమ ఓటుబ్యాంకు పటిష్టంగా ఉందని బల్లగుద్ది చెబుతోంది. కాంగ్రెస్‌తో కనీస అవగాహనకు రాకుండానే సొంత అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం సైతం మొదలుపెట్టింది. ప్రకటించని మూడు స్థానాల్లో ఘజియాబాద్ సదర్, ఖైర్, కుందర్కి అసెంబ్లీ స్థానాలుండగా ఇందులో ఘాజియాబాద్ సదర్, ఖైర్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని కోరుతోంది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ ప్రాభల్యం బలంగా ఉంది. ఘజియాబాద్ సదర్‌లో దాదాపు 80వేల మంది దళితులు, 60వేల మంది బ్రాహ్మణులు, 40వేల మంది బనియాలు, 35వేల మంది ముస్లిం, 20వేల మంది ఠాకూర్లు ఉన్నారు. ఇక్కడ బీఎస్పీ పోటీలో ఉండటంతో దళితుల ఓట్లు తనకు అనుకూలంగా మారతాయన్న నమ్మకం కాంగ్రెస్‌కు లేదు. ఠాకూర్లతో పాటు సంఖ్యాపరంగా ప్రాభల్యం ఉన్న బ్రాహ్మణ, బనియా వర్గాలు బీజేపీతో ఉండటంతో ఇక్కడ గెలుపు సులభం కాదని కాంగ్రెస్ అంచనావేస్తోంది. ఇక ఖైర్‌లో లక్ష ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జాట్లు పూర్తిగా ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడం, 55,000 దళిత ఓట్లలో బీఎస్పీ చీలిక తెస్తుందన్న భయం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. దీంతో ఎస్పీ ఇస్తామన్న రెండు సీట్లపై కాంగ్రెస్ అయిష్టత చూపుతోంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లో అసలు పొత్తులు ఉంటాయా? లేదంటే విడివిడిగా బరిలోకి దిగుతారా? అనే ప్రశ్న ఇరుపార్టీల శ్రేణుల్లో తలెత్తుతోంది. మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ రాజీనామా చేసిన బుద్నీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌ను వీడి ఎస్పీలో చేరిన అర్జున్ ఆర్యను ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ బుద్నీలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ అంశం సైతం కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు.మహారాష్ట్రలో అదే తీరుమహారాష్ట్రలో విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్‌పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) పార్టీల మధ్య పొత్తు విషయంలో చర్చలపై ఇంకా ఊగిసలాట కొనసాగుతోంది. ఈలోపే మధ్యలో దూరిన ఎస్పీ తమకు 12 సీట్లు కావాలని డిమాండ్‌చేస్తూ కొత్త పేచీలు మొదలెట్టింది. ఇప్పటికే రెండు స్థానాల్లో ఎస్పీ ఎమ్మెల్యేలు ఉండగా, ఆ అసెంబ్లీ స్థానాలకు చుట్టూ ఉన్న మరో 10 స్థానాలను తమకే కేటాయించాలని కోరుతోంది. ఇందులో మెజార్టీ స్థానాల్లో తమ అభ్యర్థుల్ని నిలపాలని ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాయి. ఎస్పీ అంతటితో ఆగకుండా బుధవారం ఏకంగా ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. దీంతో ఎస్పీతో ఎలా డీల్ చేయాలో కాంగ్రెస్‌కు అంతుపట్టని వ్యవహారంగా తయారైంది. -
మహాయుతిలో 225–230 సీట్లపై ఏకాభిప్రాయం: ప్రఫుల్
ముంబై: అధికార మహాయుతి కూటమిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 225–230 సీట్లపై ఏకాభిప్రాయం వచ్చిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ సోమవారం వెల్లడించారు. ఈ స్థానాల్లో ఎవరెక్కడ పోటీచేయాలనే దానిపై అంగీకారానికి వచ్చామని తెలిపారు. మరో రెండు లేదా నాలుగు రోజుల్లో మిగతా సీట్ల పంపకంపై నిర్ణయానికి వచ్చాక వివరాలను వెల్లడిస్తామన్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్), బీజేపీలు భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ఈ ఏడాది నవంబరు 26తో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఎన్సీపీతో కలిపి ఎన్నికలకు వెళితే నష్టపోతామని బీజేపీ, శివసేన నాయకులు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. -
Maharashtra: సీట్ల పంపకాలు పూర్తి.. 140 స్థానాల్లో బీజేపీ పోటీ?
ముంబై: లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. హర్యానా, జమ్మూకశ్మీర్, మహారాష్ట్రకు వరుసగా అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాజకీయ హడావిడీ నెలకొంది. గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు ఎన్నికల పోరుకు సమాయత్తం అవుతున్నాయిఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాకముందే.. అధికార, విపక్షాలు తమ ఫోకస్ పెంచాయి. తాజాగా మహయుతి ప్రభుత్వంలోని పార్టీల మధ్య (బీజేపీ, శివసనే,ఎన్సీపీ) సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. మూడు పార్టీలు సైతం తమ పట్టు నిలుపుకునేందుకు ఎక్కువ స్థానాల్లో పోటీ కోరినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు అధికార కూటమిలో సీట్ల పంపకాల చర్చ అప్పుడే కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 140 నుంచి 150 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 55 స్థానాల్లో పోటీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా చిన్న మిత్రపక్షాలకు మూడు సీట్లు కేటాయించనున్నట్లు వినికిడి.అయితే ప్రభుత్వానికి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కూటమి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 48 స్థానాల్లో 30 స్థానాలను గెలుచుకొని సత్తా చాటాయి ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్చంద్ర), శివసేన(ఉద్దవ్). లోక్‌సభ ఎన్నికల జోష్‌నే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మహా వికాస్ అఘాడి కూటమి తమ సీట్ల భాగస్వామ్యాన్ని ఇంకా ప్రకటించలేదు. మరోవైపు కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితమైన ఎన్డీయే కూటమి.. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చి అధికారాన్ని కాపాడుకునేందుకు యత్నిస్తోంది. కాగా గత 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అవిభక్త శివసేన కూటమి అఖండ విజయం సాధించింది.అయితే సీఎం పదవిపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. కానీ కొంతకాలానికే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. 2022లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే బయటకు వచ్చి బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కొంతకాలానికే ఎన్సీపీని చీల్చుతూ అజిత్ పవార్ బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు. -
మహారాష్ట్ర బీజేపీ కూటమిలో మొదలైన సీట్ల పంచాయితీ!
ముంబై: ఈ ఏడాది చివరల్లో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి పార్టీల్లో ఇప్పటి నుంచే సీట్ల పంపకం చర్చ మొదలైంది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్న మహారాష్ట్రలో ఏ పార్టీ ఏన్ని సీట్లు పోటీ చేయాలని దానిపై ఎన్డీయే కూటమి పార్టీల మధ్య పోరు ప్రారంభమైంది.బీజేపీ దాదాపు 150 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం శివసేన( షిండే) పార్టీ 100 సీట్లు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ 80 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. 40 సీట్లలో ఎవరు ఏ పార్టీ పోటీ చేస్తుందనే విషయంలో తీవ్ర అసమ్మతి నెలకొనటంతో సుదీర్ఘ చర్చలకు దారితీసినట్లు తెలుస్తోంది.లోక్‌సభ ఎన్నికలల్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. మొత్తం 48 లోక్ సీట్లలో ప్రతిపక్షం మహా వికాస్ అఘాడి 30 సీట్ల గెలుపొందగా.. బీజేపీ ఎన్డీయే కూటమి కేవలం 17 సీట్లకే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన, సీట్ల మధ్య విభేదాలు, ఇతర అంశాలు అసెంబ్లీ సీట్ల విభజనపై కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఎన్సీపీ నేత అజిత్ పవార్, బీజేపీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి గురువారం ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అయితే వారి భేటీ సీట్ల విభజన చర్చలోకి వచ్చినట్లు సమాచారం. అయితే సీట్ల విభజన జరుతున్నట్లు వస్తున్న వార్తలను మహాయుతి పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు.. శుక్రవారం కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మీడియాతో మాట్లాడుతూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
బీజేపీ కూటమి.. ఆ ఆరు స్థానాల్లో ఎవరు?
లోక్‌సభ ఎన్నికల మొదటిదశ పోలింగ్ మరో నాలుగు రోజులున్నా.. ఇంకా మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మరో ఆరు సీట్ల అభ్యర్థుల కేటాయింపు పెండింగ్‌లో ఉంది. ఆ ఆరు కీలక స్థానాల్లో మహాయుతి కూటమి పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఏ సీట్లు ఇవ్వాలో నిర్ణయం తీసుకోలేకపోతోందని పార్టీల్లో తీవ్ర చర్చ జరగుతోంది. ఇవే ఆ ఆరు స్థానాలు.. దక్షిణ ముంబై, థానే, పాల్ఘర్, రత్నగిరి-సింధుదుర్గ్ సీటు, నాసిక్ ఔరంగాబాద్. నాసిక్ సీటులో ఎన్సీపీ( అజిత్ పవార్) పార్టీ తరఫున మాజీ మంత్రి ఛగన్ భుజబల్‌ను ప్రతిపాధించగా.. సీఎం ఏక్నాథ్ షిండే(శివసేన) ఆ స్థానాన్ని వదులకోవడానికి సిద్ధం లేనట్టు తెలుస్తోంది. నాసిక్ స్థానం శిశసేన సిట్టంగ్ స్థానం. అక్కడ ఎంపీగా హేమంత్ గాడ్సే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఔరంగాబాద్ నుంచి బీజేపీ ఎంపీ పార్లమెంట్లో అడుగుపెడతారని ఇటీవల కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం పార్టీ కార్యకర్తల మీటింగ్ మాట్లాడుతూ.. ఔరంగాబాద్ నుంచి శివసేన అభ్యర్థి బరిలోకి దిగుతారని వ్యాఖ్యానించటం గమనార్హం. థానే, రత్నగిరి-సింద్‌దుర్గ్ రెండు స్థానాల్లో బీజేపీనే పోటీ చేయాలని భావించినప్పటికీ.. తర్వాత తన ఆలోచనను విరమించుకొని థానే సీటును శివసేన( షిండే)కు కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉమ్మడి శివసేన అభ్యర్థిగా 2019లో రాజన్ విచారే గెలుపొందారు. శివసేన పార్టీ చీలిన తర్వాత ఆయన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్నారు. అయితే శివసేనకు కంచుకోట అయిన థానే స్థానాన్ని షిండే వదలుకుకోవడాని సిద్ధంగా లేరని సమాచారం. అయితే థానేకు బదులు రత్నగిరి-సింద్దుర్గ్ను శివసేన బీజేపీకి ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. ఇక ఈ స్థానంలో బీజేపీ నారాయణ రాణేను బరిలోకి దించాలని యోచిస్తోంది. పాల్ఘర్ స్థానం బీజేపీ దక్కే అవకాశం ఉంది. 2019లో శివసేన గెలిచే వరకు పాల్ఘర్ బీజేపీ పట్టున్న స్థానం. ఇప్పటికే పలు స్థానాలను వదులుకున్న శవసేన.. సౌత్ ముంబై స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధం లేదు. సీఎం షిండే శివసేన మొదట్లో ముంబైలో మొత్తం 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అందులో ఇద్దరిని మార్పు చేశారు. నాలుగురికి టికెట్ తిరస్కరించింది. సీట్ల విషయంలో శివసేన ఒత్తిడిలో ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివసేనకు బలం ఉన్న ముంబై, ఇతర సీట్లను వదులుకోవడాని సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈసారి సౌత్ ముంబై, థానే, రత్నగిరి సింద్‌దుర్గ్, నాసిక్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు బీజేపీ భావిస్తోంది. అయితే శివసేన ఈ సీట్లను వదులుపోవడానికి సిద్ధంగా లేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ సిట్లలో ఎవరికి దక్కుతాయో కొలిక్కి రానుంది. ఇక.. అజిత్ పవార్ ఎన్సీపీ ఆశిస్తున్న నాసిక్ సీటు సైతం షిండే(శివసేన) దక్కించుకోనున్నట్లు సమాచారం.థానే సీటును ఏక్నాథ్ షిండే దక్కించుకునే అవకాశం ఉందని.. రత్నగిరి-సింధుదుర్గ్ సీటు బీజేపీకి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మహారాష్ట్రలో కూటమి సీట్ల పంపిణీ ఖరారు.. ఏ పార్టీకి ఎన్ని?
ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ ఎట్టకేలకు మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఇండియా కూటమి సీట్ల పంపిణీ ఒప్పందం కుందిరింది. ఈ మేరకు మంగళవారం మహావికాస్ఆఘాడీ నేతలు సంయుక్తంగా ప్రకటించారు. శివసేన(యూబీటీ) 21 సీట్లు, కాంగ్రెస్‌పార్టీ 17 సీట్లు, ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) 10 సీట్లతో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. మొదటి నుంచి ఆశించిన సంగాలి లోక్‌సభ నియోజకవర్గాన్ని శివసేన(యూబీటీ) దక్కించుకోగా.. భీవండి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మరోవైపు శివసేన(యూబీటీ)కి పట్టు ఉన్న ముంబై నార్త్ స్థానాన్ని సీట్ల పంపిణీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవటం గమనార్హం. సీట్ల పంపిణీ అనంతం శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ‘ప్రతిఒక్కరు అన్ని సీట్లలో గెలవడానికి తీవ్రంతా పోరాడాలి. పోరాడటంలో ఎలాంటి తప్పు లేదు. ఖచ్చితంగా అన్ని సీట్లలో గెవడానే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి’ అని ఉద్ధవ్ అన్నారు. మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. అయితే కొన్ని కీలకమైన సీట్ల విషయంలో మహా వికాస్ ఆఘాడీ కూటమి సీట్ల పంపకం కొంత జాప్యమైన విషయం తెలిసిందే. -
కుదిరిన సీట్ల ఒప్పందం.. కాంగ్రెస్‌కు ఏడు!
జార్ఖండ్‌లో విపక్ష కూటమి ‘ఇండియా’తో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఏడు స్థానాల్లో, జేఎంఎం ఐదు స్థానాల్లో పోటీ చేయనుంది. మరికొన్నింటిలో ఎమ్మెల్యేలతో పాటు ఐఎంఎల్ అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ బీహార్‌లో కూడా పొత్తు విషయపై చర్చలు జరిగాయని, అవి సఫలం అయ్యాయని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కాగా ఆర్జేడీకి జార్ఖండ్‌లోని చత్రా సీటు కేటాయించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా దుమ్కా లోక్‌సభ స్థానంపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. ఈ స్థానానికి చెందిన సోరెన్ కోడలు సీతా సోరెన్ బీజేపీలో చేరారు. మరోవైపు బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు సంబంధించి రబ్రీ దేవి నివాసంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఆర్జేడీ 25 నుంచి 28 స్థానాల్లో పోటీ చేయనుందని, కాంగ్రెస్‌కు 8 నుంచి 9 సీట్లు, సీపీఐ(ఎంఎల్)కి రెండు సీట్లు, సీపీఐకి ఒక సీటు కేటాయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతంలో జార్ఖండ్‌లోని 14 లోక్‌సభ స్థానాలలో 12 స్థానాల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. ఇందులో ఒక సీటు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భార్య గీతా కోడా కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే ఇప్పుడు ఆమె కూడా బీజేపీలో చేరారు ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారేలా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. -
సొంత పార్టీ అభ్యర్ధులపై టీడీపీలోనే వ్యతిరేకత
టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలిజాబితా ప్రకటించిన తర్వాత అన్ని స్థానాల్లోనూ ఏదో ఒకరకంగా రచ్చ జరుగుతోంది. అభ్యర్థులను ప్రకటించని ఏరియాల్లో సైతం గొడవలు మొదలయ్యాయి. స్థానికులను విస్మరించి బయటి ప్రాంతాల నుంచి అభ్యర్థులను దిగుమతి చేస్తే సహించేదిలేదంటూ గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతలు ఓపెన్‌గా ప్రకటిస్తున్నారు. కొన్ని చోట్ల స్థానికులను కూడా వివిధ కారణాలతో అక్కడి క్యాడర్ వ్యతిరేకిస్తోంది. ఇంతకీ తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో ఏం జరుగుతోందో చూద్దాం. జనసేనతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సొంత పార్టీ అభ్యర్ధులపై టీడీపీలోనే వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబికింది. పి.గన్నవరం అభ్యర్ధిగా మహాసేన రాజేష్ పేరును ప్రకటించడంతో.. స్థానిక నేతలు పార్టీ కార్యాలయానికి తాళాలు వేసి, తమ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మహాసేన రాజేష్‌ను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమంటూ బహిరంగంగానే ప్రకటించేశారు. ఆ తర్వాత జరిగిన టీడీపీ సమన్వయకమటీ సమావేశానికి వచ్చిన జనసేన కార్యకర్తలు టీడీపీ పార్లమెంటరీ ఇంఛార్జి హరీష్ మాథుర్ కారును ధ్వంసం చేశారు. రాజేష్ కు పి.గన్నవరం టిక్కెట్ ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో తనపట్ల తీవ్రస్థాయిలో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను చూసిన రాజేష్ పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలోని పరిస్థితి మరింత భిన్నంగా ఉంది. టీడీపీ సీనియర్ నేత రెడ్డి సుబ్రమణ్యం ఇక్కడ ఇంఛార్జిగా ఉన్నా, ఆయనను ఏ మాత్రం పట్టించుకోకుండా తనకే సీటు దక్కతుందనే ఆలోచనతో అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ నియోజకవర్గంలో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటాన్ని రెడ్డి సుబ్రమణ్యం తప్పుపడుతున్నారు. పార్టీ నాయకత్వం అసలు అభ్యర్ధినే ప్రకటించకుండా...సుభాష్ తానే అభ్యర్ధిలా వ్యవహరించడంపట్ల సుబ్రహ్మణ్యం మండిపడుతున్నారు. రౌడీ షీటర్ సుభాష్ మాకొద్దంటూ టీడీపీ కార్యకర్తలు ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతోపాటు ప్లెక్సీలు, బ్యానర్లు మంటల్లో వేసి దగ్ధం చేశారు. మరోవైపు అధికారికంగా అభ్యర్ధిని ప్రకటించకుండానే రామచంద్రాపురం నియోజకవర్గానికి రెడ్డి సుబ్రమణ్యం సతీమణి పేరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో కూడా దీనిపై తీవ్ర స్థాయిలో రగడ చెలరేగింది. చివరకు ఈ విషయం తనకు తెలియదని, పార్టీ ఎవరి పేరు ప్రకటిస్తే వారే అభ్యర్థిగా ఉంటారని రామచంద్రాపురం ఇంఛార్జి రెడ్డి సుబ్రమణ్యం స్పష్టం చేశాకే జనసేన వర్గాలు శాంతించాయి. -
గోదాట్లో కాపుల నిమజ్జనం.. నిండా ముంచేసిన చంద్రబాబు
కాపులే మా బలం.. మేమే కాపులకు అసలైనప్రతినిధులం అని చెప్పుకునే జనసేనకు సరైన చోట దెబ్బ పడింది. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో తమదే హవా.. అక్కడ మాకు మాగ్జిమమ్ సీట్లు ఇవ్వాలని .. ఇస్తారని ఆశించిన జనసేనకు వెన్నుపోటు రుచి ఏమిటో తెలిసొచ్చింది. ఆరెండు జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తొలివిడత మొత్తం 118 సీట్లలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశానికి 13 సీట్లు.. ఇవ్వగా రెండు స్థానాలు మాత్రం జనసేనకు ఇచ్చారు. అంటే ఇంకా అక్కడ 19 స్థానాలు ఉన్నాయ్.. అందులో జనసేనకు ఎన్ని ఇస్తారన్నది సందేహమే.. మొత్తం 34 స్థానాల్లో తమకు ఇరవై వరకూ సీట్లు ఇస్తారని సైనిక్స్ ఆశించారు.. గోదావరి జిల్లాలను స్వీప్ చేస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా చూస్తే ఇప్పుడిచ్చినవి రెండు సీట్లు పోనూ మిగిలిన 19 స్థానాల్లో మహా ఇస్తే పది ఇస్తారేమో .. అప్పుడు మొత్తం పన్నెండు ఇచ్చినట్లు అవుతుంది.. మరి గోదావరి జిల్లాల్లో జనసేన పెత్తనం .. పెద్దరికం.. ప్రాధాన్యం ఎక్కడుంది... చంద్రబాబు ప్లాన్ ఎలా ఉంటుందంటే ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కున్నట్లు ఉంటుంది. దీంతో జనసైనికులు మాత్రం చంద్రబాబును నమ్ముకుని నిలువుగా గోదావరిలో మునిగిపోయినట్లు అయిందని నిర్వేదంలో ఉన్నారు. గోదావరి రెండు జిల్లాల్లో మాదే హవా.. ప్రజలను, ఓటర్లను మేము శాసిస్తాం... అందుకే పెద్ద మొత్తంలో టిక్కెట్లను ఆశిస్తున్నాం అని చెప్పుకున్న జన సైనిక్స్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కాపుల మద్దతు మాత్రం కావాలి.. జనసేన ఓట్లు కావాలి కానీ వాళ్లకు టిక్కెట్లు మాత్రం ఎక్కువగా ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ మీద పని చేసిన చంద్రబాబు... సరిగ్గా తాను అనుకున్నట్లే దెబ్బ కొట్టారు.. దీంతో జనసైనికుల నడుం విరిగినంత పని అయింది.. కొన్నాళ్లుగా కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖలు రాస్తూ కాపులకు, జనసేనకు కనీసం యాభై టిక్కెట్లు ఇవ్వకపోతే పొత్తు పొసగదు అంటూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు మత్తులోపడిన పవన్... ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టారు.. దీంతో చంద్రబాబు తాను అనుకున్న ప్రకారమే గుప్పెడు సీట్లు పవన్ మొహాన పడేసి సింహభాగం తాను ఎత్తుకెళ్లారు. ఇదిలా ఉండగా జనసేనకు ప్రస్తుతం కేటాయించిన 24 సీట్లలో ఐదింటికి అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 19 చోట్ల అభ్యర్థులను తేల్చలేదు. అంటే అక్కడ కూడా చంద్రబాబే కొందర్ని పంపించి పోటీచేసే అవకాశాలు ఉన్నాయ్. ఏది ఏమైనా జనసేనకు టిక్కెట్లు, అభ్యర్థులను సైతం సప్లై చేస్తూ మెల్లగా ఆ పార్టీని నిర్వీర్యం చేసి జనసేనానిని పూర్తిగా పీల్చి పిప్పి చేసేసి వదిలేస్తారు అని సైనిక్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న చంద్రబాబు..లోకేష్.. బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ..అయ్యన్నపాత్రుడు వంటి వాళ్లంతా తమ నియోజకవర్గాలను ప్రకటించుకున్నారు. ఈ లిస్టులో వారి పేర్లు ఉన్నాయి కానీ ఆశ్చర్యంగా పవన్ కళ్యాణ్ మాత్రం తన నియోజకవర్గాన్ని సైతం బహిర్గత పరచలేదు..ముందే చెబితే ఓడగొట్టెందుకు సీఎం వైఎస్ జగన్ గట్టి ప్రణాళిక వేస్తారని భయపడ్డారో.. ఇంకేదైనా కారణం ఉందో కానీ పవన్ తన నియోజకవర్గాన్ని సైతం ప్రకటించే సాహసం చేయకపోవడం కాపులను, జనసైనికులను మరింత కలవరపరుస్తోంది.. ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్నా కనీసం తన నియోజకవర్గం పేరును వెల్లడించలేని నాయకుడు ఇక పార్టీని ఎలా నడుపుతాడు అని విమర్శలు వస్తున్నాయి. ::: సిమ్మాదిరప్పన్న -
బానిసిజానికి సరికొత్త అర్థం చెప్పిన ‘దత్తపుత్రుడు’
ఎన్నికల వేళ ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. తాము ఏం చేసినా క్యాడర్లో సమరోత్సాహం నిండేలా ప్లాన్ చేసుకుంటుంది. కానీ.. టీడీపీ, జనసేన పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా, విమర్శలు చేసినా, హామీలిచ్చినా.. క్యాడర్లో నిసత్తువ పెరుగుతూనే ఉంది. ఓటమి భయం ఎక్కువ అవుతూనే ఉంది. చివరకు అభ్యర్థుల జాబిత ప్రకటన కూడా.. ఇక మన పని అయిపోయిందన్న క్లారిటీకి క్యాడర్‌కి వచ్చేసింది. కాళ్లా, వేళ్లా పడ్డా కమలం కరుణించేటట్టు కనిపించడం లేదు. దీంతో...175 స్థానాల్లో పోటీకి అభ్యర్థులే లేని టీడీపీ, బాబు చెప్పిన పేర్లని ప్రకటించే జనసేన కలిసి...అభ్యర్థులను ప్రకటించి మమ..అనిపించేశారు. టీడీపీతో పొత్తుకి బీజేపీని ఒప్పించడానికి నానా చివాట్లు తిన్నానని గర్వంగా చెప్పుకున్న దత్తపుత్రుడు...పేపర్ మీద తమ పార్టీ అభ్యర్థుల పేర్లు రాసుకొచ్చి.. బానిసిజానికి సరికొత్త అర్థం చెప్పేశారు. స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు జైలు పాలైనప్పుడు.. ఆయనను పరామర్శించిన పవన్ కళ్యాణ్.. రాజమండ్రి సెంట్రల్ జైలు బయటే తన ముసుగు తీసేశారు. తాను చంద్రబాబు దత్తపుత్రుడ్నే అని తేల్చి చెప్పేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీతోనే కలిసి వెళుతున్నట్టు ప్రకటించేశారు. దీంతో.. టీడీపీకి బలమంతా మనమే అని...ఈ సారి కనీసం 80 స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్టు జనసేన అభిమానులు నాడు తెగ సంబరపడిపోయారు. సీన్ కట్ చేస్తే.. టీడీపీ, జనసేన కలిసి అభ్యర్థులను ప్రకటించేశారు. దత్తపుత్రుడికి చంద్రబాబు ఇచ్చింది 80 కాదు. 60 కాదు. 40 కాదు. జస్ట్ 24 స్థానాలు మాత్రమే. దీంతో.. జనసేన పార్టీ స్థాపన వెనుకే చంద్రబాబు ఉన్నారని, టీడీపీ పల్లకి మోయడమే లక్ష్యంగా జనసేన ఏర్పడిందని ఇప్పటి దాకా వినిపిస్తున్నవీ పచ్చి నిజాలే అని తేలిపోయింది. బానిసిజానికి బ్రాండ్ అంబాసిడర్లా మారిన పవన్ కళ్యాణ్‌ని చూసి జనసేన అభిమానులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇదిగో ఈ ఒక్క విషయం పరిశీలించండి. చంద్రబాబు, పవన్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. బాబు చేతిలో ప్రింట్ చేసిన అభ్యర్థుల లిస్ట్. మరి పవన్ చేతిలో ? హ్యాండ్ బుక్‌లో పెన్నుతో ఐదుగురు అభ్యర్థుల పేర్లు రాసి ఉన్నాయి కదా. రాజకీయంగా పవన్ దుస్థితికి, బానిసిజానికి ఇంత కన్నా ఉదాహరణ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను పవన్ ముందే డిసైడ్ చేసి ఉంటే.. ఈ సమావేశానికి వచ్చేటప్పుడే ప్రింటెడ్ కాపీతో వచ్చేవారని...అలా కాకుండా పెన్నుతో అభ్యర్థుల పేర్లు రాసి ఉన్నాయంటే.. అప్పటికప్పుడు రాసినవని అర్థమైపోతుందని పరిశీలకులు చెబుతున్నారు. జనసేన అభ్యర్థులెవరో బాబు డిక్టేట్ చేస్తే, పవన్ అప్పటికప్పుడు రాసేసుకున్నారని పొలిటికల్ ఎనలిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు. దేశ రాజకీయాల్లో తన పార్టీని తానే ఇంత ఘోరంగా అవమానించుకున్న ఏకైక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. సరే...అప్పటికప్పుడే అభ్యర్థులని డిసైడ్ చేశారు అనుకుందాం. 24 సీట్లు జనసేనకి కేటాయించినా, పట్టుమని పది మంది అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. ప్రకటించడానికి అసలు అభ్యర్థులు ఉంటే కదా. ఆ ఐదుగురు అభ్యర్థుల పేర్లని అయినా టైప్ చేసి ప్రింట్ తీసుకుని మీడియా ముందుకొస్తే హుందాగా అయినా ఉండేది కదా. అంటే... టీడీపీ పల్లకి మోయడం తప్ప మరేం ఆలోచించలేని దుస్థితిలో ఉన్న పవన్‌కి ఇన్నాళ్లు జై కొట్టామా అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. పవన్‌కి బాబు ఇచ్చిందే 24 స్థానాలు. అందులో మళ్లీ 19 స్థానాల్లో సస్పెన్స్ ఎపిసోడ్. పట్టుమని పాతిక స్థానాల్లో ప్రకటించడానికి అభ్యర్థులు కూడా లేని పవన్...ఇన్నాళ్లు అరుస్తూ, ఊగిపోతూ, తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో చిందులేస్తూ, చేసిన హడావుడి అంతా గుర్తుచేసుకుని ప్రజలు నవ్వుకుంటున్నారు. మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు సంగతేంటన్న ప్రశ్న తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారు. తనకు తెలిసిన నక్కజిత్తులన్నీ ప్రదర్శించారు. కానీ.. ఫలితం లేకపోయింది. 25 సార్లు బీజేపీ జాతీయ నాయకుల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి విఫలమైయ్యారు. ఒకవైపు దత్తపుత్రుడు, మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇలా అనేక కోణాల నుంచి ప్రయత్నిస్తే.. కాళ్ల బేరానికి అవకాశం దొరికింది. దీంతో.. శరణు శరణు.. పాహిమాం.. పాహిమాం అంటూ హస్తినలో కాళ్ల బేరం ఎపిసోడ్‌ని ఒక రేంజ్లో చంద్రబాబు పండించారు. నాటి నుంచి బీజేపీ వైపు నుంచి పొత్తుల మీద ఎలాంటి ప్రకటన రాలేదు. చిన్న ఫీలర్ కూడా లీక్ చేయలేదు. బాబు, పవన్ మాత్రం పొత్తు ఖాయమని బిల్డప్ ఇచ్చి.. హఠాత్తుగా ఇద్దరూ కలిసి అభ్యర్థులను ప్రకటించేశారు. బీజేపీ పొత్తుకి సిద్ధంగా లేదన్న స్పష్టత వచ్చిన తర్వాతే...బాబు, పవన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు.. కేవలం దత్తపుత్రుడితో కలిసే చంద్రబాబు ఎన్నికలకు వెళితే.. బీజేపీ విషయంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతోందన్న కోణం తన పరిధిని పెంచుకుంటోంది. అదే సమయంలో బీజేపీ వైపు వేలు చూపిస్తూ మైనార్టీలను దశాబ్దాలుగా చంద్రబాబు మోసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ మైనార్టీలను మోసం చేయడానికి చంద్రబాబు సరికొత్త స్కెచ్ గీస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో డిస్కషన్ నడుస్తోంది. -
‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట!
ఈ పవన్‌కు ఏమైంది? ఒకవైపు తాము లేనిదే టీడీపీ అధికారంలోకి రాదంటాడు.. మరోవైపు పావలా వంతు సీట్లు(175కి 24 సీట్లా?) కూడా ఇవ్వకున్నా నవ్వుతూ ప్రెస్ మీట్లో మాట్లాడతాడు. తమ ఆత్మగౌరవనైనా పట్టించుకోవాలని పార్టీ నేతలు చేస్తున్న విజ్ఞప్తి సైతం పట్టించుకోడు. ఏదైనా అంటే.. బాబుతో జట్టు రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటాడు. పొంతన లేని మాటలు.. నిలకడలేని తత్వం.. అసలు రాజకీయాలకు పనికొస్తాడా? అనే అనుమానం ఇప్పుడు జనసేనవాళ్లకే కలిగేలా చేస్తున్నాడు. ఎవరైనా పిలిచారా? లేదా తనంతట తానే వెళ్లాడా? తెలియదుగానీ.. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన సందర్భంగా ఆగమేఘాల మీద చంద్రబాబు ముందుకు ఉరికొచ్చాడు. లోపల ఏం జరిగిందో తెలియదుగానీ.. బయటకు వచ్చి పొత్తు ప్రకటన చేశాడు. ఆ ప్రకటన పక్కనే ఉన్న హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు బావ బాలకృష్ణకు సైతం ఆశ్చర్యం కలిగింది. దీంతో ఆ డీల్ ఎలా ఉండనుందా? అనే ఆసక్తి ఏపీ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే అవతల ఉంది చంద్రబాబు కాబట్టి.. ఎలాగైనా పవన్‌ను వంచేస్తాడనే మరో విశ్లేషణ కూడా బలంగానే నడిచింది. ఇక.. టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసి వస్తుందని.. ఢిల్లీ పెద్దలూ తనతో టచ్‌లో ఉన్నారంటూ పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కానీ, టీడీపీతో పొత్తు విషయంలో కమలం పెద్దలు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. పైగా పవన్ ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అగ్గి మీద గుగ్గిలం అయ్యింది కూడా. అందుకే పవన్‌కు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని టాక్ వినిపించింది. అలాంటి టైంలోనే.. కూటమిలో బీజేపీని కలిపేందుకు యత్నించి చివాట్లు తిన్నానంటూ పవన్ స్వయంగా చెప్పడంతో.. టీడీపీ-చంద్రబాబు గాలి కంబైన్డ్‌గా తీసేసినట్లయ్యింది. అయినా సిగ్గులేకుండా ఇవాళ జాబితా ప్రకటన సమయంలోనూ పొత్తుకు బీజేపీ ఆశీర్వాదం ఉందంటూ కబుర్లు చెప్పాడు. పవన్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. నాకు తిక్కుంది.. దానికో లెక్కుంది అని. కానీ, ఆ తిక్క ఊహించిన దానికంటే ఎక్కువేనని రియల్ లైఫ్‌లో.. అందునా రాజకీయ జీవితంలో చూపించుకుంటున్నాడు. కుప్పంలో బాబుకు రెస్ట్ ఇద్దామంటూ భువనేశ్వరితో చెప్పించి అయోమయం క్రియేట్ చేసి.. ఆ వెంటనే ఇవాళ సీట్లు ప్రకటించారు చంద్రబాబు. పనిలో పనిగా 57 స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్‌లో పెట్టాడు. ఇదంతా బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు ఆడుతున్న డ్రామా అని పవన్ అర్థం చేసుకోలేకపోతున్నాడా?. లేకుంటే కావాలనే చేస్తున్నాడా?.. రేపు ఒకవేళ పొత్తులో భాగంగా బీజేపీకి జనసేన కంటే ఎక్కువ సీట్లు ఇస్తే పరిస్థితి ఏంటి? పవన్‌ను ఇన్నేళ్లు అంటిపెట్టుకుని ఉన్న లీడర్లు.. దిగమింగుకోగలరా?.. పొత్తులో భాగంగా కేవలం 24 సీట్లు మాత్రమే జనసేనకు!.. పదేళ్ల చరిత్ర ఉన్న పార్టీ.. గత ఎన్నికల్లో 130కిపైగా స్థానాల్లో పోటీ చేసిన పార్టీకి ఈ దుస్థితి?. ఇది చాలదన్నట్లు.. జనసేనకు ఈ సీట్లు ఇవ్వడమే గొప్ప అంటూ అంటూ టీడీపీ అనుకూల ఛానెల్స్, భజన సైట్లు ఇప్పుడు కథనాలు ఇస్తున్నాయి. దీంతో జనసేన కేడర్ అవమాన భారంతో రగిలిపోతోంది. సోలోగా పోటీ చేసిన జనసేన అంతకుమించి సీట్లు ఈసారి దక్కించుకునే అవకాశం ఉండేది కదా అని బాధపడుతోంది. ఆఖరిగా పోనీ.. ఇచ్చిన 24 స్థానాలకైనా అభ్యర్థుల్ని ప్రకటించగలిగాడా? అంటే అదీ లేదు. కేవలం ఐదుగురి పేర్లను మాత్రమే ప్రకటించాడు. అంటే.. ఆ 19 స్థానాలకు అభ్యర్థులు లేరా?.. పోనీ ప్రకటించిన పేర్లైనా సవ్యంగా ఉన్నాయా అంటే అదీ లేదు. అదీ ఓ నోట్ బుక్‌పై రాసిన పేర్లను మీడియాకు ప్రదర్శించాడు. అదీ అప్పటికప్పడు రాసిన పేర్లని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాబితా ప్రకటన చివరి క్షణం దాకా కూడా ఎవరిని ఎక్కడ పెట్టాలో పవన్ నిర్ణయించుకోలేదనే విషయం ఇక్కడ అర్థమవుతోంది. అదేసమయంలో చంద్రబాబు వెల్ ప్రిపేర్డ్‌గా టీడీపీ జాబితాను ప్రకటించాడు. అంటే.. ఇక్కడా బాబు డామినేషన్ ముందు పవన్ తలవంచక తప్పలేదు. మరి తొలి నుంచి సీట్ల పంపకం విషయంలో పైచేయి ఉండాలని కోరుకుంటున్న కాపు సంక్షేమ అధ్యక్షుడు హరిరామ జోగయ్య.. తాజా పరిణామాలపై, పవన్ తీరుపై ఎలా స్పందిస్తారో చూడాలి. ::పొలిటికల్ డెస్క్ -
ఆప్, కాంగ్రెస్‌ల సీట్ షేరింగ్.. ఎవరికెన్ని సీట్లంటే..
న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)ల మధ్య సీట్ల పంపిణీ ఖాయమైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం కూడా పూర్తయిందని ఆ పార్టీ నేతలు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పొత్తులో భాగంగా ఢిల్లీలోని 7 సీట్లలో నాలుగింటిలో ఆప్, మూడింటిలో కాంగ్రెస్ పోటీ చేయనుంది. న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, తూర్పు ఢిల్లీల్లో ఆప్ పోటీ చేయనుండగా చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. 2014,2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా బీజేపీ ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లను కైవసం చేసుకోవడం విశేషం. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కొన్ని సీట్లను ఆప్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. ఇందులో భాగంగా హర్యానాలో ఒకటి, గుజరాత్లో రెండు సీట్ల నుంచి కూడా పొత్తులో భాగంగా ఆప్‌కు కాంగ్రెస్ ఆఫర్ చేసింది. ఈ వారంలోనే ఇండియా కూటమిలోని మరో ప్రధాన పార్టీ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)తో కాంగ్రెస్ సీట్ల పంపకం ఖరారైన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా యూపీలో ఎస్పీ 63, కాంగ్రెస్ 17 చోట్ల పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కూటమిలోని మరో పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ మాత్రం పశ్చిమబెంగాల్లోని మొత్తం 42 సీట్లలో తామే పోటీ చేస్తామని చెబుతుండడం ఇండియా కూటమి నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌కు భారీ ఝలక్ -
‘బైనాక్యూలర్లో చూసినా కాంగ్రెస్‌కు మూడో సీటు కనిపించటం లేదు’
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించటమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ఇండియా కూటమీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకంలో విషయంలో చర్చల వేగం పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్‌తో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో శివసేన( యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రేతో కూడా కాంగ్రెస్ చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో కూడా సీట్ల పంపకం గురించి మరోసారి సీఎం మమతా బెనర్జీ టీఎంసీతో చర్చలు జరుపుతారన్న వార్తలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లను కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల నేపథ్యంలో టీఎంసీకి చెందిన ఓ కీలక నేత స్పందించారు. ‘బైనాక్యూలర్లో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్ల కంటే ఎక్కువ కనిపించటం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి మూడో సీటును మేము గుర్తించలేకపోతున్నాం. ఏదేమైనా కాంగ్రెస్, టీఎంసీ మధ్య సీట్ల సర్దుబాటు జరిగితే త్వరలోనే ప్రకటిస్తాం’ అని అన్నారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి రెండు సీట్లను మాత్రమే కేటాయిస్తామని మమతా బెనర్జీ చెప్పిన విషయం తెలిసిందే. ఇక.. కాంగ్రెస్ పార్టీ మరిన్ని సీట్ల కేటాయింపుకు పట్టుపట్టినా మమతా బెనర్జీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాము కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే బెంగాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే పలుమార్లు రాహుల్ గాంధీ.. సీఎం మమతా బెనర్జీకి అనుకూలంగా మాట్లాడటంతో మళ్లీ సీట్ల పంపకంపై ఆశలు చిగురించాయి. తాజాగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో చోటు చేసుకుంటున్న సీట్ల పంపకాల పరిణామాలతో బెంగాల్ కూడా సీట్ల పంపకం చర్చకు వచ్చింది. ఇక.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన పంతం తగ్గించుకుని కాంగ్రెస్‌తో చర్చకు రెడీ అయినట్టు రాజకీయా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్లో దాదాపు ఆరు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. చదవండి: కాంగ్రెస్‌కు రిలీఫ్.. సీఎం మమత కీలక నిర్ణయం! -
ఉద్ధవ్ ఠాక్రేకు రాహుల్ గాంధీ ఫోన్.. సీట్ల పంపకంపై చర్చ!
ముంబై: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకం కసరత్తు విషయంలో వేగం పెంచుతోంది. ఈ క్రమంలో శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసిన సుమారు గంటసేపు మాట్లడినట్లు తెలుస్తోంది. భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ మాట్లాడటంపై ఇరు పార్టీల్లో సీట్ల పంపంకంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో.. ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై నార్త్ వెస్త్ సగ్మెంట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై సౌత్ సెంట్రల్ సీట్లను కలుపుకొని మొత్తం 18 లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ సీట్ల సర్దుబాటు ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) మధ్య సీట్ల పంపకంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సీట్ల పంపకంపై మాట్లాడినట్లు సమాచారం. మహారాష్ట్రలోని 48 సీట్లలో 8 సీట్ల విషయంలో ఉన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఉద్ధవ్‌కు కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి శివసేన గత 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో 48 సీట్లకు గాను 22 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక.. శివసేనలో చీలిక వచ్చి కొంత మంది ముఖ్యనేతలు ఏక్‌నాథ్‌షిండే వర్గంలో ఉండి బీజేపీలో చేరారు. అదే విధంగా మహాఘట్బంధన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఎన్సీపీలో సైతం చీలికలు వచ్చి అజిత్ పవార్ వర్గం బీజేపీలో చేరింది. మరోవైపు ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అశోక్ చవాన్, మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శివసేనతో సీట్ల పంపకం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్‌తో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఠాక్రేకు రాహుల్ కాల్ చేయటం చర్చనీయాంశంగా మారింది. -
పవన్ డెసిషన్.. ఇక నిప్పురవ్వలు లేవడమే తరువాయా?
సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఉంటాయి.. ఆ సినిమాల్లో వాళ్ళ పాత్ర నిడివి తక్కువే .. కానీ వారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. సినిమా మొత్తాన్ని సైతం ప్రభావితం చేసేంత పవర్ ఫుల్ గా ఆ పాత్రలను కథకులు రూపొందిస్తారు. అదేమాదిరి పాలిటిక్స్ లోనూ అతిథి పాత్రలు ఉంటాయి. వాళ్ళు కనిపించేది తక్కువే అయినా వాళ్ళ హడావుడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ లెక్కలు.. లాభనష్టాల బేరీజులు కూడా వేరేలేవేల్.. అంతా స్పాట్లో తేలిపోవాల్సింది.. ఆ కోవకు చెందినవారే జనసేనాని పవన్ కళ్యాణ్. మూన్నెళ్లకు ఒకసారి ప్రజల్లోకి వచ్చే అయన ఆమధ్య ఈస్ట్ గోదావరికి పర్యటించి రాజోలు, రాజనగరానికి అభ్యర్థులు ప్రకటించేశారు. దీంతోబాటు రాజమండ్రి రూరల్ కూడా తమ అభ్యర్థి కందుల దుర్గేష్ కు ఇవ్వాలని ఇస్తారని తేల్చేసారు.. అక్కడ ప్రస్తుతం ఆరుసార్లు గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు... ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ... నన్ను కాదని మీరు టిక్కెట్లు ఎలా ఇస్తారు అంటూ అయన ఇప్పటికే నిప్పు రాజేశారు..దీంతోబాటు రాజానగరం, రాజోలులోనూ టీడీపీ నాయకులూ ఇప్పటికే సుర్రుమంటున్నారు.. మళ్ళీ మూణ్ణెల్ల గ్యాప్ తీసుకుని ప్రజల్లోకి వచ్చిన పవన్ విశాఖ జిల్లా పాలిటిక్స్ మీద దృష్టిపెట్టారు. విశాఖలో అన్నయ్య నాగబాబుతోబాటు పలు సమీక్షలు సమావేశాలు నిర్వహించిన పవన్ ఏకంగా నాలుగూటిక్కెట్లు ప్రకటించేసారు.. తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పటికీ అలా ఏకపక్షంగా టిక్కెట్స్ ఎలా ఇచ్చారో తెలీడం లేదు కానీ భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ను ఇంచార్జ్ గా నియమించారు. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబును, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్ ను, యలమంచిలిని సుందరపు విజయ్ కుమార్ కు ప్రకటించేసారు. ఇక పెందుర్తి జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని టీడీపీ సీనియర్ బండారు సత్యనారాయణ మూర్తి ఇప్పటికే కత్తులు నూరుతున్నారు. ఇప్పుడు ఏకంగా నలుగురికి దాదాపు టిక్కెట్లు ఇచ్చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా ? ఇప్పటికే అక్కడ ఐదేళ్లుగా పని చేస్తున్న టీడీపీ క్యాడర్ ఎందుకు ఊరుకుంటుంది.. తమ ఎత్తులు.. తమ నిరసనలు వ్యక్తం చేస్తారు కదా అని అంటున్నారు. ఏకపక్షంగా టిక్కెట్లు ఇచ్చేస్తుంటే తెలుగుదేశం అధిష్టానం, చంద్రబాబు ఎందుకు ఊరుకుంటున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. పవన్ ఇప్పటికే ఈ విషయమై మాట్లాడుకుని బాబు దగ్గర హామీ తీసుకునే చెప్పారా అనే దావుట్లు వ్యక్తం అవుతున్నాయి.. ✍️సిమ్మాదిరప్పన్న -
పవన్ ఢిల్లీ డ్రామా.. జనసేనలో నైరాశ్యం!
సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ-జనసేన పొత్తులపై ఇప్పటికీ అయోమయం కొనసాగుతోంది. ఎన్నికలకు పట్టుమని 60 రోజులు కూడా లేదు. అయినా ఇంకా టిక్కెట్లు ఖరారు కాలేదు. ఈ తరుణంలో కేడర్ చేజారిపోకుండా ఉండేందుకు ఎన్ని డ్రామాలు ఆడాలో.. అన్నీ ఆడేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అందుకే మరోసారి తెరపైకి పవన్ ఢిల్లీ పర్యటన తీసుకొచ్చారు. ‘రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్తా..’ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పర్యటన గురించి జనసేన అధికారిక సమాచారం ఇచ్చింది కాదు. విశాఖ జిల్లా జనసేన కార్యకర్తలతో చర్చల సందర్భంగా కార్యకర్తలతో పవన్ చేసిన వ్యాఖ్యలివి. ఆ వ్యాఖ్యలే మీడియాకు లీకయ్యాయి. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన వ్యవహారంగానే అర్థమవుతోంది. టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత చంద్రబాబుతో పలు దఫాలుగా చర్చలు జరిపినా సీట్ల పంపకంపై ఎటూ తేల్చలేకపోయారు. ఓవైపు టీడీపీ ఏమో ఏకపక్షంగా పలు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతోంది. మరోవైపు టీడీపీ నేతలు పవన్‌ను కలిసి తమ స్థానాల వైపు రావొద్దంటూ కోరుతున్నారు. ఇంకోవైపు.. జనసేన ఆశిస్తున్న స్థానాల్లోనూ టీడీపీ(అదనంగా అందులో వర్గపోరు కూడా) ముందుకొస్తోంది. ఈ తరుణంలో.. బాబు-పవన్‌లు వెనువెనుకే ఢిల్లీ పర్యటనలకు వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. కానీ.. ఫలితం లేనట్లు కనిపిస్తోంది. అందుకే ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాతే ఇరు పార్టీల ఉమ్మడి సమావేశాలు రద్దు అయ్యాయి. పవన్ తన టూర్లు రద్దు చేసుకుని.. మంగళగిరి ఆఫీస్‌కే పరిమితం అయ్యారు. ఇప్పుడు ‘‘వ్యక్తిగత గెలుపు కోసం కాదు.. సమష్టి గెలుపు కోసమే తన వ్యూహాలు, అడుగులు ఉంటాయి. జనసేన కోసం తపించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత నాది’’ అంటూ త్యాగాలకి సిద్దం కావాలనే అర్థం వచ్చేలా పవన్ చేసిన వ్యాఖ్యలతో జనసేన నేతల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. అందుకే ఢిల్లీ పర్యటన అని చెప్పినా.. పెదవి విరిచేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలతో.. టీడీపీలో కలకలం టీడీపీతో కలవడం బీజేపీకి ఎంత మాత్రం ఇష్టం లేదు. నేనే ఒప్పించా.. అని కార్యకర్తలతో పవన్ చేసిన వ్యాఖ్యలు పొత్తు రాజకీయంపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో టీడీపీ కేడర్ నొచ్చుకుంది. ఈ క్రమంలోనే.. సోమవారం రాత్రి రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో కనీసం పవన్‌కు ఆహ్వానం పలికేందుకు కూడా టీడీపీ నేతలు రాలేదని స్పష్టమవుతోంది. గత నెలలోనూ ఇదే విధంగా లీకులు పవన్ ఢిల్లీ ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే.. ఇప్పటివరకు ఆయనకు బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ దొరక్కపోవడం!. ఇవాళో, రేపో అపాయింట్మెంట్ ఖరారు అవుతుందని జనసేన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. అయితే.. గత నెలలోనూ ఇదే విధంగా పవన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి లీకులు ఇచ్చాడు. అప్పుడూ ఇదే తరహాలో అపాయింట్మెంట్ దొరకలేదు. -
Lok Sabha polls 2024: ఇండియా కూటమికి బీటలు
కోల్‌కతా/చండీగఢ్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని అధికార బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న విపక్షాల ప్రయత్నాలకు ఆదిలోని హంసపాదు! కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ‘ఇండియా’ కూటమికి భాగస్వామ్య పారీ్టలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం రెండు భారీ షాకులిచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. పంజాబ్‌లోనూ తమది ఒంటరి పోరేనని ఆప్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామంతో ఆ పార్టీ ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగింది. మమత లేని విపక్ష కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. తృణమూల్‌తో పొత్తు చర్చలింకా సాగుతున్నాయని, బెంగాల్లో కలిసే పోటీ చేస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ ఆ వ్యాఖ్యలను మమత నిర్ద్వంద్వంగా ఖండించారు. పొత్తుపై కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలూ జరగడం లేదని స్పష్టం చేశారు. ఈలోపే, సీట్ల కోసం తృణమూల్‌ను వేడుకోబోమంటూ కాంగ్రెస్ అగ్ర నేత, బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలు మరింతగా మంటలు రేపాయి. 28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీసే పరిణామమేనని అంటున్నారు. బెంగాల్లో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తూ ఉండబోదని మీడియాతో మమత కుండబద్దలు కొట్టారు. ఆ పార్టీ మొండి వైఖరి వల్లే ఒంటరి పోరు నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని స్పష్టం చేశారు. సీట్లు సర్దుబాటుపై తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలించను కూడా లేదని ఆమె ఆరోపించారు. అంతేగాక బెంగాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగనణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఆచరణసాధ్యం కాని డిమాండ్లు తమ ముందుంచినట్టు తృణమూల్ వర్గాలు మండిపడ్డాయి. ఆది నుంచీ అంతంతే... విపక్ష ఇండియా కూటమికి మమత దూరంగానే మెలుగుతూ వస్తున్నారు. ఇటీవలి వర్చువల్ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. బెంగాల్లో ఆగర్భ శత్రువులైన తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్ రెండూ ఇండియా కూటమి భాగస్వాములే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 42 స్థానాలకు గాను తృణమూల్ 22 సీట్లు నెగ్గగా బీజేపీ ఏకంగా 18 స్థానాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి పొత్తులో భాగంగా అవే రెండు సీట్లు కాంగ్రెస్‌కు ఇస్తామని మమత ప్రతిపాదించడంతో కాంగ్రెస్ అవాక్కైనట్టు చెబుతున్నారు. అన్ని తక్కువ స్థానాలతో సరిపెట్టుకునేందుకు ససేమిరా అనడంతో చిర్రెత్తుకొచి్చన దీదీ మొత్తానికే అడ్డం తిరిగారని సమాచారం. పొత్తులో భాగంగా లెఫ్ట్ ఫ్రంట్‌కు కూడా కొన్ని సీట్లు వదులుకోవాల్సి రావడం కూడా ఆమెకు రుచించలేదని తృణమూల్ వర్గాలు వివరించాయి. బెంగాల్లో 2001, 2011 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా తృణమూల్, కాంగ్రెస్ జట్టుగా పోటీ చేశాయి. పంజాబ్‌లో ఒంటరి పోరే సీఎం భగవంత్ మాన్ వెల్లడి పంజాబ్‌లో మొత్తం 13 సీట్లలోనూ ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని స్పష్టం చేశారు. నిజానికి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గోవా, గుజరాత్‌ల్లో పొత్తు దిశగా కాంగ్రెస్, ఆప్ మధ్య చర్చలింకా జరుగుతూనే ఉన్నాయి. పైగా త్వరలో జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాన్ ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఆ పార్టీతో పొత్తు ప్రతిపాదనను పంజాబ్ ఆప్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారని మాన్ మీడియకు స్పష్టం చేశారు. మొత్తం 13 లోక్‌సభ స్థానాలకూ ఆప్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే చురుగ్గా సాగుతోందని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 13 స్థానాలకు గాను కాంగ్రెస్ 8 నెగ్గింది. అకాలీదళ్, బీజేపీ చెరో రెండు, ఆప్ ఒక స్థానంలో గెలిచాయి. కూటమిపై ఎవరికీ పెత్తనముండదు మమత నర్మగర్భ వ్యాఖ్యలు బెంగాల్లో పొత్తు లేకపోయినా జాతీయ స్థాయిలో మాత్రం విపక్ష ఇండియా కూటమికి తృణమూల్ కట్టుబడి ఉంటుందని మమత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘కావాలంటే కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా 300 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయమనండి. మిగతా 243 స్థానాల్లో ప్రాంతీయ పారీ్టలు బరిలో దిగుతాయి. కానీ బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ వేలు పెడతానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు’’ అంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. జాతీయ స్థాయిలో విపక్షాల వ్యూహం ఎలా ఉండాలో కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామని చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీని సమష్టిగా ఎదుర్కొనే విషయంలో ప్రాంతీయ పారీ్టలన్నీ ఒక్కతాటిపై ఉంటాయి. దాన్ని ఓడించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాం’’ అని స్పష్టం చేశారు. అయితే, విపక్ష కూటమి ఏ ఒక్క పారీ్టకో చెందబోదంటూ కాంగ్రెస్‌పై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్ర శుక్రవారం బెంగాల్లోకి ప్రవేశించనున్నా కనీసం మర్యాద కోసమన్నా దానిపై కాంగ్రెస్ తనకు సమాచారం కూడా ఇవ్వలేదని దీదీ ఆరోపించారు. మమత ప్రకటన బహుశా ఇండియా కూటమి వ్యూహంలో భాగమై ఉండొచ్చని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ (శరద్ పవార్) అభిప్రాయపడింది! -
‘ఇదెక్కడి న్యాయం.. బాబుగారూ?’
చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం ముందు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ విలవిలలాడిపోతున్నాడా?.. ఒకవైపు పొత్తు అంటూనే.. మరోవైపు జనసేన స్థానాల్లోనూ తమ అభ్యర్థుల్నే నిలబెట్టేందుకు దొడ్డిదారి యత్నాలు చేస్తున్నాడు యెల్లో బాస్. ఇప్పుడు సీట్ షేరింగ్ విషయంలోనూ జనసేనను పూర్తిగా ముంచేందుకు పావులు కదుపుతున్నాడు. అయితే తన సొంత పార్టీ నుంచే పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో సీట్ల పంపకంపై తాడే పేడో తేల్చుకునేందుకు పవన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కీలక చర్చల కోసం శనివారం రాత్రి చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నాడు. డిన్నర్ మీట్లో కలుసుకోనున్న ఈ ఇరువురు సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు 40లోపు ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లను జనసేన ఆశిస్తోంది. కానీ, తెలుగు దేశం మాత్రం 20 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లను మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు భోగట్టా. అయితే దీనిపై జనసేన అభ్యంతరాలకు టీడీపీ సమాధానం కూడా ఇస్తోందట. తెలంగాణలో బీజేపీ కేవలం 8 సీట్లే ఇచ్చిన విషయాన్ని టీడీపీ ప్రస్తావించగా.. ఏపీ కథ వేరంటూ జనసేన ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మావల్ల కాదు టీడీపీ పొత్తు విషయంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను వైఎస్సార్సీపీ కోవర్టులుగా భావిస్తామంటూ జనసేన నేతలకు ఓ హెచ్చరిక చేశాడు పవన్. దీంతో నొచ్చుకున్న కొందరు జనసేన నేతలు మౌనంగా ఉండిపోయారు. కానీ, గత పదేళ్లుగా పార్టీ వెంట తిరిగితే టికెట్లు దక్కకపోవడాన్ని మాత్రం వాళ్లు భరించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పవన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు వాళ్లు. దీంతో.. మాకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడెక్కడ ఇస్తారు? వెంటనే తేల్చేయాలనే డిమాండ్‌తో పవన్.. బాబుతో భేటీ అవుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: గందరగోళంలో తెలుగు దేశం! మావైపు రావొద్దు..! మరో వైపు పవన్ కల్యాణ్‌ను కొందరు టీడీపీ నేతలు కలవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పూల బోకేలు ఇస్తూ.. శాలువాలు కప్పుతూ చిరునవ్వులు చిందిస్తూనే.. మరోవైపు మా నియోజకవర్గాల వైపు చూడొద్దంటూ అల్టిమేటం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో ఉన్నాం.. ఇప్పుడు పొత్తుల పేరిట మావైపు రావొద్దని వాళ్లు పవన్‌ను కోరుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల విషయంలోనూ పవన్‌కు అభ్యంతరాలు వ్యక్తం అవుతాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. సీట్ల పంపకంపై ఇంకా నాచ్చితే పూర్తిగా నష్టపోతామని భావిస్తున్న పవన్.. డిన్నర్ భేటీలో ఈ విషయాలన్నింటిపై స్పష్టత అడగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆ లేఖ నేపథ్యంలో ఆసక్తి రెండు రోజుల కిందట కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య పవన్ కల్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు ఆ భేటీ సారాంశాన్ని ఇవాళ లేఖ రూపంలో విడుదల చేశారాయన. ఈ భేటీలో పవన్‌కు కీలక సూచనలు చేసినట్లు తెలిపిన హరిరామ జోగయ్య.. పవన్ ను సీఎంగా చూడాలని జనసైనికులు కోరుకుంటున్నారని, రెండున్నరేళ్లు పవన్ సీఎం పదవి చేపట్టాలని, పవర్ షేరింగ్ అంశం ప్రజల్లోకి వెళ్తే ఓటు బదిలీ అవుతుంది చెప్పారు. అయితే.. పొత్తులో భాగంగా సీట్ల దాకా అడగాలని తాను పవన్‌కు సూచిస్తే.. పవన్ 40 సీట్ల దాకా ఆశిస్తున్నట్లు తనతో చెప్పారని లేఖలో హరిరామ జోగయ్య వెల్లడించారు. అంతేకాదు.. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపైనా పవన్‌తో చర్చించినట్లు చెప్పారాయన. ఈ నేపథ్యంలో.. చంద్రబాబుతో డిన్నర్ భేటీలో కాపు నేత సూచనలను పవన్ ప్రస్తావించే అవకాశమూ లేకపోలేదు. -
నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం..
న్యూఢిల్లీ: అధికార బీజేపీ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈరోజు తొలిసారి భేటీ కానుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో నియోజకవర్గాల వారీగా బీజేపీ పార్టీకి వత్యతిరేకంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. ఒక్కటే ఎజెండా.. ముంబై వేదికగా ఇండియా కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఈరోజు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో సమావేశం కానుంది. త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజీపీకి వ్యతిరేకంగా ప్రతి స్థానంలోనూ ప్రతిపక్ష కూటమిలోని పార్టీలకతీతంగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. ఇటువంటి కార్యాచరణను అవలంబిస్తున్నప్పుడు పార్టీలో ఈగోలను పక్కన పెట్టి పనిచేయాల్సిన అవసరముందని ఇదివరకే ప్రతిపాదించింది కూటమి. ఇదే సమావేశాల్లో ఎన్నికల వ్యూహరచనకు సంబంధించిన అంశంపై కూడా చర్చలు నిర్వహించనున్నారు. అక్కడే అసలు సమస్య.. అసలే ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వీలైనంత తొందరగా ఈ జాబితాను సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇప్పటీకే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థుల కేటాయింపు పూర్తయినట్లేనని ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ వినతి ఇతర రాష్ట్రాల్లోని అభ్యర్థుల కేటాయింపే జటిలం కనుందని విపక్ష కూటమి వర్గాలు చెబుతున్నాయి. సమావేశాలకు ముందు ప్యానెల్ సభ్యుడైన రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు ఆచరించాల్సిన విధానాలు, సమైక్య ర్యాలీలను నిర్వహించేందుకు ప్రణాళికలు, డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాల గురించి ఎన్నికలకు సంబంధించిన ఇతర కార్యాచరణ గురించి చర్చిస్తారని తెలిపారు. కూటమి విజయవంతం కావాలంటే అన్ని పార్టీలు మహత్వాకాంక్ష, మతభేదం,మనోభేదం మూడు అంశాలను పక్కన పెట్టాలని అన్నారు. కమిటీలో ఎవరెవరంటే.. ఇండియా కూటమిలోని వివిధ పార్టీలకు చెందిన పద్నాలుగు మంది నేతలతో ఏర్పాటైన సమన్వయ కమిటీలో కె సి వేణుగోపాల్ (కాంగ్రెస్), టి ఆర్ బాలు (డిఎంకె), హేమంత్ సోరెన్ (జెఎంఎం), సంజయ్ రౌత్ (శివసేన-యుబిటి), తేజస్వి యాదవ్ (ఆర్జెడి), రాఘవ్ చద్దా (ఆప్), జావేద్ అలీ ఖాన్ (ఎస్పి), లాలన్ సింగ్ (జెడియు), డి రాజా (సిపిఐ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పిడిపి), అభిషేక్ బెనర్జీ (టిఎంసి) తోపాటు సీపీఐ(ఎం) ఒక అభ్యర్థి(ఖరారు కాలేదు) సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ సమన్వయ కమిటీ కూటమిలో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా కూడా పని చేస్తోంది. ఇది కూడా చదవండి: కేంద్రమంత్రిని గదిలో బంధించిన బీజేపీ కార్యకర్తలు -
ఇమ్రాన్ ఖాన్‌తో లాబీయింగ్ చేయించిన సిద్ధూ!
పంజాబ్ ఎన్నికల వేళ.. విమర్శలు-ప్రతివిమర్శలతో రాజకీయ ప్రచారాలు వాడీవేడిగా ముందుకు సాగుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్.. ఇవాళ సీట్ల పంపకాన్ని ఓ కొలిక్కి తెచ్చుకున్నారు కూడా. తదనంతరం ప్రత్యర్థి నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై షాకింగ్ కామెంట్లు చేశారాయన. తాను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సిద్ధూను కేబినెట్ నుంచి బయటికి పంపించేశాక.. ఒకరోజు ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందట. అది పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరపు నుంచి విజ్ఞప్తి. సిద్ధూను కేబినెట్లోకి తీసుకుంటే బాగుంటుందని, అతను తన పాత స్నేహితుడని, ఒకవేళ అతను గనుక సరిగా పని చేయకుంటే అప్పుడు తొలగించాలంటూ ఇమ్రాన్ ఖాన్ తరపున రిక్వెస్ట్ అందిందట. సిద్ధూ ఆ స్థాయిలో లాబీయింగ్ జరిపాడని, కానీ, దానికి తాను స్పందించలేదని అమరీందర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆరోపణలు చేసిన కాసేపటికి మీడియా ముందుకు వచ్చిన సిద్ధూ.. పై ఆరోపణలపై స్పందించేందుకు మాత్రం ఇష్టపడలేదు. సిద్ధూ-అమరీందర్ సింగ్ విభేధాల వల్లే పంజాబ్ రాజకీయంలో కిందటి ఏడాది కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ పీఎంగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లి.. అక్కడ ఆర్మీ ఛీఫ్ ఖ్వామర్ జావెద్ బజ్వాను సిద్ధూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంపై కెప్టెన్ అమరీందర్ సింగ్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు కూడా. ఇదిలా ఉంటే అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్, SAD సంయుక్త్‌లతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించిన బీజేపీ.. సోమవారం సీట్ల పంపకాలను ఖరారు చేసింది. మొత్తం 117 స్థానాల్లో.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ 37, ఎస్ఏడీ సంయుక్త్ 15, బీజేపీ 65 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు.. ఆదివారం 22 మందితో కూడిన తొలి జాబితాను అమరీందర్ సింగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ సంగతి ఏమోగానీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఎన్నికల్లో పోటాపోటీగా సత్తా చాటే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో పంజాబ్ పోలింగ్ జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. -
ఎస్పీ, ఆర్ఎల్డీ సీట్ల చర్చ
లక్నో: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) పొత్తు కుదుర్చుకున్నాయి. సీట్ల పంపకాలపై చర్చించేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరీలు మంగళవారం లక్నోలో భేటీ అయ్యా రు. భేటీ తర్వాత ‘మంతనాలు ముగిశాయి’ అనే శీర్షికతో జయంత్ ఒక ట్వీట్ చేశారు. అఖిలేశ్‌ను కలిసినప్పటి ఫొటోను ట్వీట్‌కు జతచేశారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఇంకా ఖరారుకాలేదు. -
కాషాయ దళానికి 20 సీట్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనేక తర్జనభర్జనల తరువాత ఎట్టకేలకు అన్నాడీఎంకే, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. బీజేపీకి 20 సీట్లు ఖరారయ్యాయి. 171 మందితో అన్నాడీఎంకే అభ్యర్థుల తుది జాబితా బుధవారం విడుదలైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పరంగా తొలిఘట్టమైన సీట్ల సర్దుబాటు, నియోజకవర్గాల కేటాయింపు బుధవారం ఒక కొలిక్కివచ్చింది. అన్నాడీఎంకే సారథులు పళనిస్వామి, పన్నీర్‌సెల్వం 171 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. ఇప్పటికే పళనిస్వామి, పన్నీర్ సెల్వంలతో కూడిన ఆరు పేర్లతో తొలి జాబితా విడుదలైంది. తుది జాబితాను కలుపుకుని అన్నాడీఎంకే నుంచి 177 మంది పోటీ చేస్తున్నారు. బీజేపీకి 20 సీట్లు బుధవారం ఖరారు కాగా నియోజకవర్గాల కేటాయింపు కూడా జరిగింది. కూటమి నుంచి డీఎండీకే వైదొలగడంతో తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) సీట్ల సంఖ్యను పెంచాలని పట్టుబడుతోంది. చిన్నపార్టీలకు సైతం సీట్లు కేటాయించాల్సి ఉన్నందున ఆ పార్టీకి 3, 4 సీట్లు మాత్రమే ఇస్తామని అన్నాడీఎంకే అంటోంది. 23 సీట్లు ఖరారు చేసుకున్న పీఎంకే నమూనా జాబితా సిద్ధం చేసుకుని నియోజకవర్గాల కేటాయింపు కోసం ఎదురుచూస్తోంది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 4.30 గంటల వరకు బీజేపీ, పీఎంకేలతో పన్నీర్‌సెల్వం, పళనిస్వామి భేటీ అయ్యారు. ఇంకా..టీఎంసీ, పుదియనీది కట్చి, ఇండియా కుడియరసు కట్చి సహా పలు చిన్న పార్టీలకు సీట్ల పంపకాలు చేయాల్సి ఉంది. డీఎంకే జాబితాలో జాప్యం.. ఇక అన్నాడీఎంకే ప్రధాన ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థుల జాబితా విడుదలలో జాప్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ సహా కూటమిలోని అన్ని మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటు ఖరారు కాగా 174 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను పోటీకి దించేందుకు స్టాలిన్ సిద్ధమయ్యారు. ఉదయసూర్యుడి చిహ్నంపై పోటీచేసే మిత్రపక్షాలను కలుపుకుంటే మొత్తం 187 స్థానాలవుతున్నాయి. 10న జాబితా విడుదల చేస్తామని స్టాలిన్ గతంలో ప్రకటించగా తుది జాబితా సిద్ధం చేసేందుకు మరికొంత సమయం పట్టొచ్చని తెలుస్తోంది. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ 70 మంది అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. డీఎండీకే ఒంటరిపోరు.. అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుని 234 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం బు«ధవారం సమావేశమయ్యారు. ఇప్పటికే 140 మంది అభ్యర్థుల జాబితా ఖరారైంది. డీఎండీకేను తమ వైపునకు తిప్పుకోవాలని దినకరన్, కమల్ ప్రయత్నిస్తున్నారు. డీఎంకే అధికారంలోకి వస్తే ఆనందమేనని విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకరన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది పరోక్షంగా డీఎంకేకు మద్దతివ్వడమేనని అంటున్నారు. -
తమిళనాట కొలిక్కివస్తున్న పొత్తులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి కూటములైన అన్నాడీఎంకే, డీఎంకేల్లో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కివచ్చింది. 178 స్థానాల్లో పోటీ చేయాలని డీఎంకే నిర్ణయించుకుంది. మూడో కూటమి కోసం నటుడు కమల్‌హాసన్ కసరత్తు చేస్తున్నారు. బీజేపీకి అన్నాడీఎంకే కూటమి 25 సీట్లు కేటాయించినట్లు తెలుస్తున్నా అధికారికంగా ప్రకటించలేదు. డీఎండీకే మినహా అన్ని పార్టీల్లో సీట్ల సర్దుబాటు పూర్తయింది. కూటమిలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన డీఎండీకే 20–25 సీట్లు కోరుతుండగా 15 స్థానాలకు పరిమితం కావాలని అన్నాడీఎంకే సూచిస్తున్న దశలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం మరోసారి అన్నాడీఎంకే, డీఎండీకే మధ్య మళ్లీ చర్చలు జరగ్గా 18 సీట్లు ఖరారైనట్లు సమాచారం. డీఎంకే సీట్ల పంపకాలు డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయింది. మొత్తం 234 స్థానాల్లో మిత్రపక్షాలకు కేటాయించినవి పోను మిగిలిన 178 నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేయనుంది. డీఎంకే కూటమిలో ఇండియన్ ముస్లీం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చికి 2, సీపీఐకి 6, ఎండీంకేకు 6, వీసీకేకు 6 సీట్ల కేటాయింపు జరిగింది. కాంగ్రెస్‌కు 25 సీట్లను కేటాయించారు. కన్యాకుమారి లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. సీపీఐ నేతలతో స్టాలిన్ సోమవారం చర్చలు జరిపి 6 సీట్లను, తమిళగ వాళ్వురిమై కట్చికి ఒక సీటు ఖరారు చేశారు. సోమవారం వరకు జరిపిన కేటాయింపుల తరువాత 180 స్థానాలు మిగిలి ఉండగా వీటిల్లో 178 డీఎంకే నియోజకవర్గాల్లో డీఎంకే బరిలోకి దిగనుంది. ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం అమ్మముక కూటమిగా చేరి కృష్ణగిరి, శంకరాపురం, వానియంబాడి నుంచి పోటీ చేస్తోంది. చందనం స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి తమిళగ వాళ్వురిమై కట్చి(టీవీకే)పార్టీలో ఉన్నారు. వీర్పప్పన్ కుమార్తె విద్యారాణి బీజేపీలో ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ, డీఎంకే కూటమిలోని టీవీకే ద్వారా వేర్వేరు స్థానాల్లో వీరువూరు పరస్పర ప్రత్యర్ది పార్టీల నుంచి తలపడేందుకు సిద్దం అవుతున్నారు. -
తమిళనాడు: 21 సీట్లిస్తాం.. వాటితోనే సర్దుకోండి
సాక్షి, చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే కూటమిలో అసెంబ్లీ సీట్ల పంపకం ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. తమకు 60 స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబడుతుండగా, 21 సీట్లే ఇస్తామని, వాటితోనే సర్దుకోవాలని అన్నాడీఎంకే చెబుతోంది. బీజేపీ మెట్టు దిగడం లేదు. దీంతో సీట్ల పంచాయితీ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్లింది. తమకు కేవలం 10 సీట్లే కేటాయిస్తామని అన్నాడీఎంకే చెప్పడంతో విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే సందిగ్ధంలో పడింది. అన్నాడీఎంకే, బీజేపీ, రాందాసు నేతృత్వంలో పీఎంకే, విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ పార్టీలు తమిళనాడులో గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక కూటమిగా కలిసి ప్రయాణించాయి. ఇదే కూటమి తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగనుంది. అయితే, సీట్ల పందేరం కూటమిలో వివాదాలు సృష్టిస్తోంది. మిత్రపక్షాలు అధిక సీట్లు డిమాండ్ చేస్తుండడంతో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో–కన్వీనర్ పళనిస్వామి డైలమాలో పడ్డారు. ఇప్పటికే పీఎంకేకు 23 సీట్లు కేటాయించారు. తమిళ మానిల కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ ఖరారు చేశారు. సీట్ల కోసం పార్టీల పట్టు రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కనీసం 170 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించాలని స్టాలిన్ నేతృత్వంలో ప్రతిపక్ష డీఎంకే నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు తగ్గట్టుగానే తమ అభ్యర్థులను సైతం బరిలోకి దించాలని అధికార అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కసరత్తు చేస్తోంది. కానీ, కూటమిలో సీట్ల సర్దుబాటే ఎటూ తేలడం లేదు. ప్రధానంగా బీజేపీ 60 సీట్లను ఆశిస్తుండడంతో సమన్వయ కమిటీ ఇరకాటంలో పడింది. ఆ పార్టీకి 21 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, బీజేపీ రాష్ట్ర నేతలు ఒప్పుకోవడం లేదు. పుదుచ్చేరి, విల్లుపురంలో ఎన్నికల ప్రచారం కోసం చెన్నైకు వచ్చిన అమిత్ షాతో ఆదివారం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు మురుగన్ బృందం గంటన్నరకు పైగా భేటీ కావడం గమనార్హం. ఎంపిక చేసిన 60 స్థానాలకు సంబంధించిన సమగ్ర వివరాలను వారు అమిత్ షా ముందు ఉంచినట్టు తెలిసింది. ఇందులో సగానికి పైగా సీట్లను అన్నాడీఎంకే నుంచి రాబట్టుకునే దిశగా ఆ పార్టీ సమన్వయ కమిటీతో అమిత్ షా మాట్లాడినట్టు సమాచారం. సీట్ల పంపకం లెక్కలు సోమవారం లేదా మంగళవారం నాటికి తేలవచ్చని కమలనాథులు పేర్కొంటున్నారు. మరోవైపు తమకు కేవలం 10 సీట్లు ఇస్తామనడం డీఎండీకేకు రుచించడం లేదు. తాము ఒంటరిగా పోటీ చేసినా పది శాతానికి పైగా ఓట్లను చీల్చగలమని డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ చెబుతున్నారు. దీంతో కూటమిలో ఆ పార్టీ కొనసాగేనా అన్న చర్చ మొదలైంది. చదవండి: (తమిళనాట మూడో కూటమి.. సూత్రధారి చిన్నమ్మ..!) (నరేంద్ర మోదీని నాగపూర్‌కు తరిమేద్దాం) -
కాంగ్రెస్‌కు అధిక సీట్లిస్తే అంతే సంగతులు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తాజా ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుని ఎలాగైనా అధికార పీఠం ఎక్కాలని పట్టుదలతో ఉన్న డీఎంకేకి మిత్రపక్షాల సీట్ల సర్దుబాటు సమస్యగా మారింది. అయితే రాజీలేని ధోరణితో ముందుకు సాగడమే శ్రేయస్కరమని తీర్మానించుకుంది. 40 సీట్లు కోరుతున్న కాంగెస్‌కు 20 సీట్లతో కళ్లెం వేయడమే మేలు, గత ఎన్నికల్లోలా మళ్లీ అధికారం చేజార్చుకోలేమని డీఎంకే స్పష్టీకరణతో తొలివిడత సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి రాకుండానే వాయిదా పడ్డాయి. తమిళనాడులో 2011, 2016 ఎన్నికల్లో వరుసగా అన్నాడీఎంకేనే అధికారంలో రావడంతో దశాబ్దకాలంగా డీఎంకే ప్రతిపక్షంగా సర్దుకుపోక తప్పలేదు. ప్రజాకర్షణ కలిగిన నేత కరుణానిధి కన్నుమూసిన తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన స్టాలిన్ తొలిసారిగా ఎదుర్కొంటున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవి. సీఎం కావాలనే తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు స్టాలిన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ‘మీ నియోజకవర్గంలో స్టాలిన్’ పేరున రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో కోటి కుటుంబాల సమస్యలు పరిష్కరిస్తా నంటూ గతంలో ఎన్నడూ ఎరుగని హామీలు గుప్పిస్తున్నారు. అన్నాడీఎంకే, బీజేపీలను ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ తమిళభాష, సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకమని, ఇలాంటి కేంద్రప్రభుత్వానికి అన్నాడీఎంకే ప్రభుత్వం దాసోహమై పోయిందని ప్రచారం చేస్తూ సెంటిమెంట్‌తో దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రుల అవినీతి చిట్టాను గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కు సమర్పించడం ద్వారా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసే ప్రయత్నం కూడా చేశారు. ఇదిలాఉండగా, స్టాలిన్‌కు స్వయానా సోదరుడైన అళగిరి దక్షిణ తమిళనాడులో ఓటర్లను ప్రభావితం చేయగల నేతగా ఉన్నారు. తండ్రి కరుణానిధికి కల్లబొల్లి మాటలు చెప్పి పార్టీ నుంచి వెళ్లగొట్టించాడని స్టాలిన్‌పై అగ్రహంతో ఉన్న అళగిరి డీఎంకే ఓటమిని కోరుకుంటున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి అన్నాడీఎంకే గెలుపు అవకాశాలను శశికళ నీరు గార్చగలరని స్టాలిన్ ఆశిస్తున్నా, ఇప్పటి వరకు శశికళ జోరు అంతగా లేదు. అన్న అళగిరి సర్దుకుపోవడం, రాజకీయంగా శశికళ రెచ్చిపోవడం అంటూ జరిగితే డీఎంకే గెలుపు నల్లేరుపై నడకగా మారగలదని స్టాలిన్ విశ్వసిస్తున్నారు. డీఎంకే 190.. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా 190 స్థానాల్లో డీఎంకే పోటీచేయాలని, మిగిలిన 44 స్థానాలను కూటమిలోని కాంగ్రెస్, వైగో నాయకత్వంలోని ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, వీసీకే, కొంగునాడు దేశీయ మక్కల్ కట్చి, మనిదనేయ మక్కల్ కట్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వంటి మిత్రపక్ష పార్టీలకు సర్దాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజా ఎన్నికల్లో 190 స్థానాల్లో పోటీ చేసి కనీసం 117 గెలుచుకోవడం ద్వారా అధికారం చేపట్టాలని డీఎంకే పట్టుదలగా ఉంది. 2011 ఎన్నికల్లో 119 సీట్లలో పోటీ చేసిన డీఎంకే కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుని అధికారాన్ని కోల్పోయింది. 2016 ఎన్నికల్లో 178 స్థానాల్లో పోటీ చేసి 89 చోట్ల గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికసీట్ల కేటాయింపుతో డీఎంకేకు అధికారం దూరమయింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 41 సీట్లలో పోటీచేసి 8 చోట్ల మాత్రమే గెలిచింది. డీఎంకే 89 సీట్లు సాధించింది. 117 సీట్లలో గెలుపొందడం ద్వారా అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. స్వల్పతేడాతో అధికారం చేజారడానికి కాంగ్రెస్సే కారణమని డీఎంకే ఆనాటి నుంచి ఆ పార్టీపై గుర్రుగా ఉంది. తాజా ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో ఆచితూచి అడుగేయాలని డీఎంకే నిర్ణయించుకుంది. డీఎంకే–కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుపై తొలి విడత చర్చలు ఈనెల 25న ప్రారంభమయ్యాయి. ఈసారి ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ 41 వరకు సీట్లు కోరడంతో డీఎంకే సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ప్రజల మద్దతు లేని కాంగ్రెస్‌కు అధికసీట్లు కేటాయించడం ద్వారా మరోసారి అధికారాన్ని చేజార్చుకునేందుకు సిద్ధంగా లేమని డీఎంకే స్పష్టం చేసింది. 15 సీట్లు కేటాయించాలని భావించాం, తుది నిర్ణయంగా 18 సీట్లకు మించి ఇచ్చేది లేదని డీఎంకే తేల్చిచెప్పడంతో కాంగ్రెస్ నిరాకరించింది. సుమారు గంటపాటు సాగిన చర్చలు ఎంతకూ కొలిక్కి రాకపోవడంతో మరోసారి బేటీ కావాలని ఇరువర్గాలు నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్‌కు గరిష్టంగా 20 సీట్లు, మిగిలిన మిత్రపక్షాలకు తలా రెండు సీట్లు కేటాయించాలని డీఎంకే తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇంతకంటే అదనంగా సీట్ల కోసం ఆయా పార్టీలు పట్టుబట్టే అవకాశం ఉంది. చదవండి: వెనక్కి తగ్గని శశికళ: ఆమె ఇంటికి సినీ ప్రముఖుల క్యూ రజనీ.. రండి కలిసి పనిచేద్దాం: కమల్ -
ఆర్జేడీకి 144, కాంగ్రెస్‌కు 70 సీట్లు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బహుళ పార్టీల మహాకూటమిలో సీట్ల పంపకం శనివారం దాదాపు పూర్తయ్యింది. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చీఫ్ తేజస్వీ యాదవ్‌ను కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీట్ల పంపకంలోనూ ఆ పార్టీకే అగ్రస్థానం దక్కింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా, ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్‌కు 70 సీట్లు, సీపీఐ(ఎంఎల్)కు 19, సీపీఐకి 6, సీపీఎంకు 4 సీట్లు కేటాయించారు. వాల్మీకీ నగర్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 7న జరగనున్న ఉలప ఎన్నికలో మహా కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలిపేలా ఒప్పందం కుదిరింది. తమ పార్టీకి దక్కిన 144 సీట్లలో కొన్ని స్థానాలను వికాశీల్ ఇన్సాస్ పార్టీకి(వీఐపీ), జేఎంఎంకు కేటాయిస్తామని ఆర్జేడీ ప్రకటించింది. సీట్ల పంపకంలో తీమకు అన్యాయం జరిగింది, ఇతర పార్టీల నేతలు వెన్నుపోటు పొడిచారని, మహా కూటమి నుంచి తాము తప్పుకుంటున్నట్లు వికాశీల్ ఇన్సాస్ పార్టీ అధినేత ముకేశ్ సాహ్నీ ప్రకటించారు. బిహార్ బీఎస్పీ చీఫ్ రాజీనామా బీఎస్పీ అధినేత మాయావతికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ బిహార్ శాఖ అధ్యక్షుడు భరత్ బింద్ శనివారం బీఎస్పీకి రాజీనామా చేసి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ ఆయనకు పార్టీ సభ్యత్వం అందజేశారు. సరికొత్త బిహార్ నిర్మాణానికి, యువజన వ్యతిరేకి అయిన ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి భరత్ తమ పార్టీలో చేరారని తేజస్వీ ట్వీట్‌చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీ, జనతాంత్రిక్ పార్టీ(సోషలిస్టు) కలిసి మహాకూటమిగా ఏర్పడి బరిలో దిగడం తెల్సిందే. -
మహాకూటమి : సీట్ల పంపకాలు ఖరారు
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీల మధ్య సీట్ల సర్ధుబాట్లు కొలిక్కివస్తున్నాయి. మహాకూటమిలో పార్టీల సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. కాంగ్రెస్ 70 స్ధానాల్లో పోటీ చేయనుండగా, వామపక్షాలు 30 స్ధానాల్లో తలపడనున్నాయని మహాకూటమి వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌కు 70 స్ధానాలు ఇచ్చేందుకు అంగీకరించిన ఆర్జేడీ ఆయా స్ధానాల ఎంపికను మాత్రం ఆ పార్టీకి విడిచిపెట్టేందుకు అంగీకరించలేదని తెలిసింది. మరోవైపు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని పాలక ఎన్డీయే సైతం సీట్ల ఖరారుపై భాగస్వామ్య పక్షాలతో పట్నాలో కీలక భేటీ నిర్వహించింది. ఎన్డీయే తరపున సీట్ల పంపకాలను ఈనెల 4లోగా ఢిల్లీలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇక అధికారాన్ని నిలుపుకునేందుకు ముఖ్యమంత్రి, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ తనదైన వ్యూహాలకు పదునుపెట్టారు. 2015లో తన విజయానికి బాటలుపరిచిన ఏడు సూత్రాల కార్యక్రమం 2.0ను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగారు. ఓట్ల వేటలో ఈ పథకం తనకు కలిసివస్తుందని ఆయన భావిస్తున్నారు. కాషాయ కూటమితో జతకట్టిన నితీష్‌ను ఈసారి ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు మహాకూటమిగా ముందుకొచ్చాయి. ఇక బిహార్‌లోని 71 స్ధానాలకు తొలి విడత పోలింగ్‌కు అప్పుడే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. బిహార్‌లో 243 అసెంబ్లీ స్ధానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈసీ వెల్లడించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి : బాబ్రీ తీర్పు.. బీజేపీకి నయా అస్త్రం -
బీజేపీకి ప్రశాంత్ కిషోర్ అల్టిమేటం..!
పట్నా : రానున్న కాలంలో బీజేపీకి మరో మిత్రపక్షం గుడ్‌బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో దశాబ్దాల కాలం పాటు స్నేహం చేసిన శివసేన, టీడీపీ ఇప్పటికే విభేదించి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో కేంద్రంపై నితీష్ ఇప్పటికే తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్ఆర్సీ ఆందోళనలు దానికి మరింత ఆజ్యంపోశాయి. బిహార్‌లో ఎన్ఆర్సీ అమలు చేసే ప్రసక్తే లేదని నితీష్ బహిరంగంగానే ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. సీట్ల పంపకాలపై బీజేపీ-జేడీయూలో ఇప్పటికే చర్చలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో అసక్తికరంగా మారాయి. ఆదివారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రశాంత్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకత్వం అంచనాలు వేస్తున్నట్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50:50 సీట్ల పంపకాల ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జేడీయూకే సింహాభాగం సీట్లు కేటాయించాలని అన్నారు. సీట్ల ఒప్పందంపై బీజేపీ నేతలు మరోసారి పునపరిశీలన చేసుకోవాలని సూచించారు. అలాగే 1:4 ఫార్మూలాను ఆయన తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సీట్ల పంపకాలపై ఇరు పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకుంటారని, దీనిలో ప్రశాంత్ తలదూర్చడం సరికాదని తప్పపట్టారు. (ఎన్డీయే నుంచి బయటకు రండి.. మద్దతిస్తాం) గత లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించిన 50:50 ఫార్మూలానే ఈసారి కూడా పాటిస్తామని బీజేపీ నేతలు స్పష్టంచేశారు. దీంతో ప్రశాంత్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పడిప్పుడే గళం విప్పుతున్న నితీష్‌కు అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాలుగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ-జేడీయూ మహా ఘట్ బంధన్‌గా ఏర్పడి విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం కూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ బీజేపీతో కలిసిపోయారు. -
వద్దన్న బీజేపీ... మళ్లీ ముందుకు!
తీర్పు స్పష్టంగానే వచ్చింది. కానీ పార్టీలే మాట తప్పాయి. ఇక్కడ ఏ పార్టీ మాట తప్పిందంటే... చెప్పటం కష్టం. మహారాష్ట్రలో బీజేపీ– శివసేన కూటమికి జనం అధికారమిచ్చినా... రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకుంటామని ముందు చెప్పి, తరవాత మాట తప్పుతున్నందుకే తాము బీజేపీతో కలవటం లేదని శివసేన చెబుతోంది. తాము అలాంటి హామీనే ఇవ్వలేదని, శివసేనే మాట మారుస్తోందని బీజేపీ చెబుతోంది. అందుకే... ఇద్దరి పొత్తూ పెటాకులైంది. బీజేపీకి సింగిల్‌గా బలం చాలదు కనక... గవర్నరు పిలిచినా... చేతులెత్తేసింది. శివసేనను పిలిచినా అదే కథ. కాకపోతే ఈ పార్టీ కొంచెం సమయం కావాలంది. దానికి నిరాకరిస్తూ మరో పార్టీ ఎన్సీపీని కూడా పిలిచారు గవర్నరు. అంతలోనే ఈ గొడవ తేలదంటూ ఈ వారం మొదట్లో గవర్నరు రాష్ట్రపతి పాలనకూ సిఫారసు చేశారు. కేంద్రం ఓకే చేసేసింది. ఇది అన్యాయమంటూ శివసేన సుప్రీంకోర్టుకు వెళ్లింది కూడా. 288 సీట్ల మహారాష్ట్రలో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 స్థానాలున్నాయి. బీజేపీగానీ, శివసేనగానీ లేకుండా ఏ ప్రభుత్వమూ ఏర్పాటయ్యే పరిస్థితి లేదు. అందుకే సేన కూడా మొండిపట్టు పడుతోంది. ప్రాంతీయ శక్తుల ఎదుగుదలకు అవకాశమున్న మహారాష్ట్రలో ముందుముందు బలోపేతం కావాలంటే అధికార పీఠం తన చేతిలో ఉండాలన్నది సేన మనోగతం. అందుకే మునుపటిలా బీజేపీకే ఐదేళ్లూ అవకాశం ఇవ్వకుండా తనకూ రెండున్నరేళ్లు సీఎం పీఠం కావాలంది. ఇదే ప్రతిపాదనతో ఎన్సీపీ– కాంగ్రెస్‌లతోనూ సంప్రదింపులు జరుపుతోంది. ఎన్సీపీ ఓకే అంటున్నా... కాంగ్రెస్ మాత్రం సైద్ధాంతిక వైరుధ్యాల దృష్ట్యా అంత సుముఖత వ్యక్తం చేయలేదు. కాకపోతే దేశ ఆర్థిక రాజధాని ముంబైని బీజేపీకి దూరం చేయాలంటే సేనకు మద్దతివ్వక తప్పదు. అందుకే ముగ్గురూ కలిసి ఓ అవగాహనకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి కాంగ్రెస్ కూడా సై అనే ప్రకటించింది. కాంగ్రెస్ ఎలాగూ శివసేనతో కలవదని, సేన తమ చెంతకే వస్తుందని ధీమాగా ఉన్న బీజేపీకి ఇది షాకే. అందుకే వేగంగా పావులు కదిపింది. తమకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, కాబట్టి ప్రభుత్వానికి అవకాశమివ్వాలని గవర్నరును శనివారం కోరింది. కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమని సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. ఏమో!! ఏం జరుగుతుందో... గవర్నరు ఏం చేస్తారో చూడాల్సిందే!!. కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమ’ని సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. -
సుప్తచేతనావస్థలోకి మహారాష్ట్ర అసెంబ్లీ!
ముంబై: మహారాష్ట్రలో కనుచూపు మేరలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు సాధ్యంకాని నేపథ్యంలో ఆ రాష్ట్ర కొత్త అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్లనుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీని గవర్నర్ తొలిసారి సమావేశపర్చేవరకూ 14వ అసెంబ్లీ సుప్తచేతనా వస్థలోనే ఉంటుందని అసెంబ్లీ వ్యవహరాల మాజీ అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర 13వ అసెంబ్లీ పదవీకాలం శనివారం రాత్రితో ముగిసింది. అయితే బీజేపీ, శివసేనల మధ్య ఎలాంటి సయోధ్య కుదరకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి శనివారం రాజ్‌భవన్‌లో కలిసి ఈ అంశంపై చర్చించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ సాధించినా ముఖ్యమంత్రి పదవి విషయంలో రెండు పార్టీల మధ్య పీటముడి కొనసాగుతోంది. శనివారం అయోధ్య వివాదంలో సుప్రీం తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. అసెంబ్లీని సమావేశపర్చే వరకూ అంతే.. ‘కొత్త అసెంబ్లీని గవర్నర్ సమావేశపర్చనంత వరకూ మహారాష్ట్ర 14వ అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్తుంది’అని మహారాష్ట్ర అసెంబ్లీ మాజీ ముఖ్య కార్యదర్శి అనంత కల్సే చెప్పారు. సుప్తచేతనావస్థలో ఎంత కాలం ఉంచాలన్న దానిపై నిర్దిష్ట సమయమేదీ లేదన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆ సమయంలో జీతాలు, ఇతర అలవెన్సులు అందుకుంటారన్నారు. ‘రాష్ట్రపతి పాలనే చివరి ప్రత్యామ్నాయం. కేబినెట్ సిఫార్సు లేకుండా గవర్నర్ కూడా కొత్త అసెంబ్లీని సమావేశపర్చలేరు. ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ లేదు’అని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 సీట్లకు గాను బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 సీట్లు గెలుచుకోగా.. ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించండి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయాలని కోరుతూ గవర్నర్ కోషియారీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు శనివారం లేఖ రాశారు. సీఎం పీఠం విషయంలో బీజేపీ, శివసేన మధ్య పక్షం రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన ఈ సూచన చేయడం గమనార్హం. ప్రభుత్వం ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలని ఆ లేఖలో కోరారు. ఈ పరిణామంపై ఎన్సీపీ స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పక్షంలో శాసనసభలో తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని స్పష్టం చేసింది. శివసేన కూడా బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అప్పుడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తమ ఎమ్మెల్యేలతో క్యాంపులు నడుపుతున్నాయి. -
సీట్ల సర్దుబాటు : బీజేపీ, శివసేన ఒప్పందం ఇలా..
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఒప్పందాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం ప్రకటించారు. సీట్ల సర్దుబాటు ఒప్పందం ప్రకారం శివసేన 124 స్ధానాల్లో పోటీ చేస్తుండగా, బీజేపీ ఇతర చిన్న పార్టీలు కలిసి 164 స్ధానాల్లో బరిలో దిగుతాయి. తనకు కేటాయించిన 164 స్ధానాల్లో రిపబ్లికన్ పార్టీ, రాష్ర్టీయ సమాజ్ పక్ష, రాయల్ క్రాంతి సంఘటన వంటి చిన్న పార్టీలకు 14 స్ధానాలను కాషాయ పార్టీ కేటాయిస్తుంది. సీట్ల సర్దుబాటును అధికారికంగా ప్రకటించిన సంయుక్త విలేకరుల సమావేశంలో శివసేన యూత్ ప్రెసిడెంట్ ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా పాల్గొన్నారు. కాగా ఆదిత్య ఠాక్రే వొర్లి నుంచి భారీ ఆధిక్యంతో గెలుపొందుతాడని మహారాష్ట్ర సీఎం, సీనియర్ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ-సేన కూటమి అధికారంలోకి వస్తే శివసేన సీఎం అభ్యర్థిగా ఆదిత్య ఠాక్రే ముందువరుసలో ఉంటాడని భావిస్తున్న క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ రాజకీయాల్లోకి వచ్చీరాగానే ముఖ్యమంత్రి కావాలనుకోవడం అర్ధం లేనిదని, ఆదిత్య ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నాడని, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. -
‘సగం సీట్లు ఇవ్వకుంటే కూటమి కూలుతుంది’
ముంబై : రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తమకు సగం స్ధానాలను ఇవ్వడంలో బీజేపీ విఫలమైతే కూటమి నుంచి వైదొలగుతామని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అమిత్ షాల సమక్షంలో ఇరు పార్టీల మధ్య కుదిరిన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను బీజేపీ గౌరవించాలని స్పష్టం చేశారు. తమకు సగం సీట్లు కేటాయించని పక్షంలో ఇరు పార్టీల మధ్య పొత్తు పొసగదని శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి రోట్ బుధవారం చేసిన వ్యాఖ్యలను సంజయ్ రౌత్ సమర్ధించారు. మరోవైపు శివసేనకు 124 స్ధానాలకు మించి ఇవ్వలేమని బీజేపీ చెబుతోందనే వార్తలతో శివసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒంటరి పోరుకు సిద్ధం కావాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే పార్టీ శ్రేణులను కోరినట్టు తెలిసింది. నాగపూర్ సహా అన్ని స్ధానాల్లో పోటీకి ఆసక్తికనబరిచే అభ్యర్ధుల వడపోతకు శివసేన శ్రీకారం చుట్టింది. -
కాంగ్రెస్-ఎన్సీపీల సీట్ల సర్ధుబాటు
ముంబై : రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై ప్రాంతంలో సీట్ల సర్దుబాటును కాంగ్రెస్, ఎన్సీపీలు ఖరారు చేశాయి. ఒప్పందం ప్రకారం ముంబై ప్రాంతంలోని 36 అసెంబ్లీ స్ధానాలకు గాను కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేయనుండగా, ఎన్సీపీ ఏడు స్ధానాల్లో తన అభ్యర్ధులను నిలపనుంది. ఈ కూటమిలో మరో భాగస్వామ్య పార్టీ ఎస్పీ ఒక స్ధానంలో పోటీకి దిగనుంది. మరో మూడు స్ధానాలను కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించాలని ప్రాధమికంగా నిర్ధారించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య సీట్ల సర్ధుబాటుపై జరిగిన భేటీలో సీనియర్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, మల్లిఖార్జున్ ఖర్గే, బాలాసాహెబ్ థొరాట్, ఏక్నాథ్ గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు, ముంబై సహా మహారాష్ట్రలో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్ధుల తుది జాబితాను ఈనెల 14న ప్రకటిస్తారని భావిస్తున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ చీఫ్‌లు సోనియా గాంధీ, శరద్ పవార్ల మధ్య ఢిల్లీలో జరిగిన భేటీ అనంతరం ఇరు పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ప్రక్రియ వేగవంతమైంది. -
‘ఎస్పీ–బీఎస్పీ’కి 7 సీట్లు వదిలిన కాంగ్రెస్
లక్నో: రాజకీయంగా కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ 12కు పైగా ఎంపీ సీట్లను ఇతర పార్టీలకు వదిలేసింది. ఇందులో ఎస్పీ–బీఎస్పీ–ఆరెల్డీ కూటమికి 7 సీట్లను వదిలేసినట్లు ప్రకటించింది. వీటితో పాటు అప్నాదళ్‌కు 2 సీట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ‘7 లోక్‌సభ స్థానాల్లో మా అభ్యర్థులను బరిలో నిలపడంలేదు. ఇందులో మైన్‌పురి, కనౌజ్, ఫిరోజాబాద్ ఉన్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆరెల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్, ఆయన కుమారుడు జయంత్ చౌదరి పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా మా అభ్యర్థులను నిలపడంలేదు’ అని యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ తెలిపారు. అయితే ఏడో స్థానం గురించి కాంగ్రెస్ స్పష్టతనివ్వలేదు. రాయ్‌బరేలి (సోనియా గాంధీ), అమేథి (రాహుల్) పోటీ చేస్తున్న స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపడం లేదని ఎస్పీ–బీఎస్పీ–ఆరెల్డీ కూటమి ఇçప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మైన్‌పురి నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ములాయంసింగ్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కనౌజ్ నుంచి, బదౌన్, ఫిరోజాబాద్ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. అప్నాదళ్‌కు గోండా, పిలిభిత్ స్థానాలను వదిలేస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. -
పొత్తు ఖరారు : బీఎస్పీ 38..ఎస్పీ 37
లక్నో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లో పొత్తును ఎస్పీ, బీఎస్పీలు గురువారం ఖరారు చేశాయి. యూపీలో మొత్తం 80 స్ధానాలకు గాను ఎస్పీ 37 స్ధానాల్లో, బీఎస్పీ 38 స్ధానాల్లో పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. ఈ మేరకు తాము పోటీ చేసే స్ధానాలను వెల్లడిస్తూ ఇరు పార్టీలు జాబితాను విడుదల చేశాయి. అమేథి, రాయ్‌బరేలిలో అభ్యర్ధులను ప్రకటించబోమని ఎస్పీ, బిఎస్పీలు ఇప్పటికే ప్రకటించగా, మిగిలిన మూడు స్ధానాల్లో అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ పోటీచేస్తుంది. ఇక ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఖరారు కావడంతో యూపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఖాయమని తేలింది. కాగా యూపీలో మొత్తం 80 స్ధానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను బరిలో దింపుతుందని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో పాటు యూపీ బాధ్యతలను ఆమెకు అప్పగించడంతో కీలక రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. -
తమిళనాట చేతులు కలిపిన బీజేపీ, ఏఐఏడీఎంకే
-
తమిళనాట చేతులు కలిపిన బీజేపీ, ఏఐఏడీఎంకే
చెన్నై : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని పాలక ఏఐఏడీఎంకే, బీజేపీ మంగళవారం అధికారికంగా ప్రకటించాయి. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌లు సంయుక్తంగా ఈ విషయం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఐదు స్ధానాల్లో పోటీ చేస్తుందని తాము తమిళనాడు, పుదుచ్చేరిలో ఉమ్మడిగా బరిలో దిగుతామని పన్నీర్‌సెల్వం పేర్కొన్నారు. పొత్తుపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్ మాట్లాడుతూ తమిళనాడులోని 21 అసెంబ్లీ స్ధానాల ఉప ఎన్నికల్లో తాము ఏఐఏడీఎంకేకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పన్నీర్‌సెల్వం, పళనిస్వామి నాయకత్వంలో, కేంద్ర స్ధాయిలో నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు తాము అంగీకరించామన్నారు. అంతకుముందు పీఎంకేతో పొత్తుపై ఏఐఏడీఎంకే ప్రకటించింది. ఆ పార్టీ ఏడు లోక్‌సభ స్ధానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించింది. పీఎంకేకు ఓ రాజ్యసభ సీటు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. అవగాహనలో భాగంగా తమిళనాడులో రానున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు పీఎంకే మద్దతు ప్రకటిస్తుంది. -
అన్నాడీఎంకేతో చర్చలకు చెన్నై చేరుకున్న పీయూష్ గోయల్
చెన్నై: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగాలని భావిస్తున్న అన్నాడీఎంకే, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అన్నాడీఎంకే నేతలతో గత రెండువారాలుగా సంప్రదింపులు జరుపుతున్నారు. అయినప్పటికీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాకపోవడంతో.. మంగళవారం ఆయన అన్నాడీఎంకే నేతలతో చర్చించడానికి చెన్నై చేరుకున్నారు. పీయూష్ గోయల్ రాకతో కూటమిలో బీజేపీకి కేటాయించే సీట్లపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేనతో పొత్తును ఖరారు చేసుకుని మంచి జోష్ మీదున్న కమల దళం.. తమిళనాడులో అన్నా డీఎంకేతో కలిసి మోజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని వ్యుహరచన చేస్తోంది. కొంగు బెల్ట్‌లో సీట్ల కేటాయింపుపై బీజేపీ పట్టుబడుతుండగా.. అందుకు అన్నాడీఎంకే ససేమిరా అంటుంది. కూటమిలోని మరో పార్టీతో కలిపి బీజేపీకి ఏడు లేదా ఎనిమిది సీట్లు మాత్రమే ఇస్తామని అన్నాడీఎంకే చెబుతోంది. 2014 ఎన్నికల్లో.. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గానూ.. అన్నాడీఎంకే 37 స్థానాలు కైవసం చేసుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో అప్పటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే, యూపీఏలో చేరిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే కూటమిలోకి పీఎంకే మరోవైపు పీఎంకే, అన్నాడీఎంకే కూటమిలో చేరింది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్పం నేతృత్వంలోని అన్నాడీఎంకేతో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ పొత్తు కుదుర్చుకున్నారు. పొత్తులో భాగంగా 7 స్థానాలకు పీఎంకే ఒప్పందం కుదుర్చుకుంది. తమిళనాడులో 21 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకేకు పీఎంకే మద్దతు ఇవ్వనుంది. -
పొత్తు ఫైనల్ : బీజేపీ 25, శివసేన 23 స్ధానాల్లో పోటీ
సాక్షి, ముంబై : మూడేండ్ల పాటు కలహాల కాపురం సాగించిన బీజేపీ-శివసేన మరోసారి భాయ్-భాయ్ అన్నాయి. మహారాష్ట్రలో చెరిసగం సీట్లకు పోటీచేసేందుకు అంగీకరించాయి. శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్‌షా చేపట్టిన మంత్రాంగం ఫలించింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్ధానాల్లో, శివసేన 23 స్ధానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికలకు ముందు పొత్తుపై బీజేపీతో అంగీకారానికి వచ్చినట్టు శివసేన నేత సంజయ్ రౌత్ అంతకుముందు వెల్లడించారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఇరు పార్టీల పొత్తుపై లాంఛనంగా ప్రకటన చేయనున్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే ప్రధాని మోదీని, బీజేపీని దుమ్మెత్తిపోయడం శివసేనకు రివాజుగా మారింది. మిత్రపక్షమే ఇలాంటి విమర్శలు చేయడమా? అని అందరూ నోళ్లు నొక్కుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా, ఓ దశలో శివసేన ఒంటరిగా పోటీ చేస్తుందేమో.. కమలానికి పక్కలో బల్లెంగా మారుతుందేమో అని అనుమానాలు కలిగాయి. కానీ మేమంతా నిజానికి ఒకటేనని, ఒకేగూటి పక్షులమని రెండు పార్టీలు తమ పొత్తు ఖరారు చేసుకున్నాయి.మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లలో 50-50 పద్ధతిలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీ జరుగుతుంది. అలాగే బీజేపీ 25 స్ధానాల్లో బరిలో నిలవనుండగా, సేన 23 స్థానాల్లో పోటీ చేయనుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-శివసేన మధ్య గత 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైరం ఏర్పడింది. విడివిడిగా పోటీచేశాయి. ఏ ఒక్క పార్టీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మారిన సమీకరణలు.. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. నిన్న, మొన్నటి వరకూ ఎడమొహం, పెడమొహంగా ఉన్న శివసేన మళ్లీ బీజేపీతో కలిసిపోయింది. రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలో చెరి సగం సీట్లు పంచుకుని రెండు పార్టీలు పొత్తును ఖరారు చేసుకున్నాయి. గత కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న బీజేపీ– శివసేనల మధ్య పొత్తు సోమవారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలుండగా అందులో శివసేన 23 స్థానాలు, బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 50:50 ఫార్ములాకు ఇరు పార్టీలు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో ఇరుపార్టీల నాయకుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెర దింపినట్లు అయింది. పొత్తుపై స్పష్టత రావడంతో బీజేపీ, శివసేన నాయకులు ఊపిరీ పీల్చుకున్నారు. శివసేన ఖాతాలోకి పాల్ఘర్! గత లోక్‌సభ ఎన్నికల్లో శివసేన 22 స్థానాల్లో పోటీ చేసింది. కానీ, పాల్ఘర్ లోక్‌సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ చింతామణ్ వంగా మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అక్కడ గత సంవత్సరం మేలో ఉప ఎన్నిక జరిగింది. చింతామణ్ వంగా చనిపోయిన తరువాత బీజేపీ నాయకులు తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఆయన కుమారుడు శ్రీనివాస్ వంగా శివసేనలో చేరారు. సానుభూతి ఓట్లతో కచ్చితంగా శ్రీనివాస్ గెలుస్తాడని భావించిన శివసేన బీజేపీని ఎన్నికల బరిలోంచి తప్పుకోవాలని సూచించింది. కానీ, ఆ స్థానం బీజేపీదేనని తమ అభ్యర్థిని బరిలోకి దింపుతామని బీజేపీ పట్టుబట్టింది. చివరకు అక్కడ జరిగిన ఉప ఎన్నికలో శ్రీనివాస్ ఓటమి పాలవగా బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గావిత్ గెలిచారు. కానీ, ఇప్పుడు ఈ స్థానాన్ని తమకే ఇవ్వాలని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ నాయకులు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో శివసేన ఈ స్థానంలో మళ్లీ శ్రీనివాస్‌ను బరిలోకి దింపుతుందా లేక మరో అభ్యర్థిని ఎంపిక చేస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, పాల్ఘర్ లోక్‌సభ నియోజక వర్గం శివసేన వాటాలోకి వెళ్లడంతో రాజేంద్ర గావిత్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి వీలులేకుండా పోయింది. దీంతో గావిత్ తప్పుకుంటారా లేక తిరుగుబాటు చేసి ప్రత్యర్థిగా బరిలోకి దిగుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని మొదటి నుంచి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటిస్తూ వస్తున్నారు. పార్టీ నాయకులు కూడా ఒంటరిగానే బరిలోకి దిగాలని ఉద్ధవ్‌పై ఒత్తిడి చేశారు. అయినప్పటికీ బీజేపీ నాయకులు కలిసే పోటీ చేస్తామని అనేక సందర్భాలలో ప్రకటిస్తూ వచ్చారు. అమిత్ షా- ఉద్ధవ్ థాకరే భేటీతో పొత్తులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం రూపొందించిన ఫార్మూల ప్రకారం లోకసభ ఎన్నికల్లో బీజేపీ–25, శివసేన–23, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–144, శివసేన–144 స్థానాల చొప్పున పోటీ చేస్తారు. ఇంతకుముందు శివసేనతో పొత్తు కుదరకపోవడానికి బీజేపీ మిత్రపక్షాలే ప్రధాన కారణమని తెలిసింది. సీట్లు సర్దుబాటు చేసే సమయంలో మిత్రపక్షాలు రాష్ట్రీయ సమాజ్ పార్టీ, ఆర్పీఐ (రాందాస్ ఆఠావలే వర్గం), శివ్ సంగ్రామ్ పార్టీలకు కనీసం 20 స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబట్టింది. కానీ, ఈ మిత్రపక్షాలు బీజేపీకి చెందినవి కావడంతో వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదని శివసేన స్పష్టం చేసింది. బీజేపీ తమ వాటాలోకి వచ్చిన స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని శివసేన పేర్కొంది. చివరకు శివసేన డిమాండ్‌కు బీజేపీ తలొగ్గినట్లు సమాచారం. తాజాగా ఇరు పార్టీలు సగం సీట్లు సర్ధుబాటు చేసుకోవడంతో మిత్ర పక్షాలకు ఎవరి వాటాలో వారే కేటాయించుకోవల్సి ఉంటుందని తెలిసింది. -
యూపీలో ఎస్పీ–బీఎస్పీ సీట్ల ఖరారు!
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం ఒప్పందంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ మరింత చేరువయ్యారు. ప్రతిపాదిత కూటమిపై తుది చర్చలు జరిపేందుకు మాయావతితో అఖిలేశ్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమైనట్లు ఎస్పీ వర్గాలు చెప్పాయి. దీనిపై ఇరు పార్టీల నుంచీ అధికారిక ప్రకటనేదీ రాలేదు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ సీట్లుండగా ఈ ఇరు పార్టీలు చెరో 37 స్థానాల్లో పోటీ చేసి, మిగిలిన 6 సీట్లను కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్ వంటి పార్టీలకు వదిలేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు అమేథీ, రాయ్‌బరేలీ సీట్లు ఇచ్చే చాన్సుంది. -
బిహార్‌లో సీట్ల పంపకం
న్యూఢిల్లీ: 2019 పార్లమెంట్ ఎన్నికలకు బీహార్‌లో బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీల మధ్య సీట్ల పొత్తు కుదిరింది. మొత్తం 40 సీట్లకు గాను బీజేపీ, జేడీయూ చెరో 17 సీట్లు, రామ్‌విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ మిగిలిన ఆరు సీట్లలోనూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఆదివారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఈ విషయం వెల్లడించారు. పాశ్వాన్‌ను ముందుగానే రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు అమిత్‌షా వెల్లడించారు. మోదీ ప్రభుత్వంలో ఇప్పటికే మంత్రిగా ఉన్న పాశ్వాన్, బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌తో చర్చల అనంతరం షా ఈ వివరాలు వెల్లడించారు. 2014లో గెలిచిన 31 సీట్లకు మించి ఈ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని, కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎస్ఎల్పీ అధికార కూటమి నుంచి నిష్క్రమించిన తరువాత ఆ అవకాశాన్ని ఎల్జేపీ సమర్థంగా ఉపయోగించుకుంది. బీజేపీనుంచి సంతృప్తికర స్థాయిలో సీట్లను దక్కించుకుంది. నితీశ్‌కుమార్ సైతం ఎన్డీయేలో తన ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు. 2014లో బీజేపీ పోటీ చేసి గెలిచిన అయిదు సీట్లను సైతం నితీశ్‌కుమార్ తన వాటాగా దక్కించుకున్నారు. 2014లో జేడీ(యూ) స్వతంత్రంగా పోటీ చేయగా, బీజేపీతో కలిసి పోటీచేసిన ఎల్జేపీ రెండు సీట్లతో సరిపెట్టుకుంది. 2019లో పోటీచేసే అభ్యర్థుల జాబితాతో త్వరలోనే అన్ని పార్టీలూ ఒక నిర్ణయానికి వస్తాయని అమిత్‌షా వెల్లడించారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సమర్థంగా పనిచేసిందని పాశ్వాన్ అన్నారు. మోదీ నేతృత్వంలోనే బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బిహార్‌లోని హాజిపూర్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న పాశ్వాన్‌ను రాజ్యసభకు పంపాలన్న నిర్ణయంపై నితీశ్‌కుమార్ వ్యాఖ్యానిస్తూ, పాశ్వాన్ దీర్ఘకాలంగా దేశానికి చేసిన సేవకు ఇది గుర్తింపు అని అన్నారు. -
బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ పోటీ చేసే స్ధానాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సీట్ల సర్ధుబాటును ఆదివారం ప్రకటించాయి. బిహార్‌లో ఎన్డీఏ కూటమిలోని మూడు కీలక పార్టీలు ఈ మేరకు అవగాహనకు వచ్చినట్టు వెల్లడించాయి. బిహార్‌లో బీజేపీ, జేడీ(యూ) చెరో 17 సీట్లలో పోటీ చేయనుండగా, ఎల్జేపీ ఆరు సీట్లలో బరిలో దిగనుంది. ఎల్జేపీ చీఫ్ రాం విలాస్ పాశ్వాన్‌ను ఎన్డీఏ రాజ్యసభకు నామినేట్ చేస్తుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము 2014 ఎన్నికల కంటే మెరుగైన సామర్ధ్యం కనబరుస్తామని సీట్ల సర్ధుబాటును ప్రకటిస్తూ బీజేపీ చీఫ్ అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ స్ధానాల్లో ఎవరు పోటీ చేస్తారనేది త్వరలో వెల్లడిస్తామని సీట్ల సర్ధుబాటులో బీజేపీతో సమానంగా సీట్లను రాబట్టిన బిహార్ సీఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు. 2009, 2014 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అధిక స్ధానాలు సాధిస్తామని నితీష్ ధీమా వ్యక్తం చేశారు. తీవ్ర తర్జనభర్జనలు, సుదీర్ఘ చర్చల అనంతరం బిహార్‌లో ఎన్డీఏ కూటమి సీట్ల సర్ధుబాటును కొలిక్కితెచ్చారు. కూటమిలో ఎల్జేపీ కొనసాగేందుకు వీలుగా ఆ పార్టీకి ఆరు స్ధానాలు కేటాయించడంతో పాటు పాశ్వాన్‌కు రాజ్యసభ సీటును ఆఫర్ చేశారు. మరోవైపు ఎన్డీఏ నుంచి ఉపేంద్ర కుష్వాహా సారథ్యంలోని ఆర్ఎల్ఎస్పీ వైదొలగడంతో పాశ్వాన్‌ను కూటమిలో కొనసాగేందుకు ఎన్డీఏ కసరత్తు చేసింది. ప్రస్తుతం ఇద్దరు ఎంపీలే ఉన్న జేడీ(యూ)కు 17 స్ధానాలు కట్టబెట్టడమంటే ఎన్డీఏ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ట్వీట్ చేశారు. -
మహకూటమిలో సీట్ల పంపకాలపై క్లారిటీ
-
కూటమి పొత్తుల్లో కొసమెరుపు!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో ప్రతి ఒక్క సీటును జాగ్రత్తగా అంచనా వేస్తున్న కాంగ్రెస్.. ఈ దిశగా మహాకూటమి పొత్తుల్లో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చింది. పొత్తుల్లో భాగంగా తెలంగాణ జనసమితికి ఇచ్చే సీట్ల విషయంలో వినూత్న ప్రతిపాదన చేసింది. టీజేఎస్ అభ్యర్థులు తమ పార్టీ గుర్తు (ఇంకా రావాల్సి ఉంది)తో ఎన్నికలకు వెళ్తే ఇబ్బంది అవుతుం దని అందువల్ల.. వీరిని కాంగ్రెస్ బీఫారంపైనే పోటీ చేయించాలని ప్రతిపాదించింది. ఇందుకోసం ఆ పార్టీ కోరుకుంటున్న స్థానాలు ఇచ్చేందుకు కాస్త.. అటు, ఇటుగానైనా అంగీకారం తెలపాలని ఆదివారం గోల్కొండ హోటల్లో జరిగిన పార్టీ కోర్‌కమిటీ భేటీలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై టీజేఎస్‌ను ఒప్పించడంతోపాటు.. కూటమిలోని మిగిలిన పార్టీల మధ్య పొత్తు సమన్వయం చేసే బాధ్యతలను సీనియర్ నేత జానారెడ్డికి అప్పగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియాతో పాటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాస కృష్ణన్లు పాల్గొన్నారు. సమావేశంలో కూటమిలో సీట్ల సర్దుబాటు, ఈనెల 20న రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. కూటమి పార్టీలకు కాంగ్రెస్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న స్థానాలు తెలుగుదేశం పార్టీకి.. 10-12 టీజేఎస్‌కు.. 8-10 సీపీఐకి.. 2 కోదండకు డిప్యూటీ సీఎం హోదా సీట్ల సర్దుబాట్లపై జరిగిన చర్చలో టీడీపీకి 10–12 స్థానాలు, టీజేఎస్‌కు 8–10 స్థానాలు, సీపీఐకి 2 స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే, టీజేఎస్ అభ్యర్థులను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనే సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ఆ పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం గౌరవానికి భంగం కలిగించకుండా.. టీజేఎస్ కోరుకుంటున్నట్లుగా.. 8–10 సీట్లు ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు. టీజేఎస్‌కు ఇచ్చే సీట్లలో పోటీచేసే నేతలకు కాంగ్రెస్ బీఫారం ఇచ్చి హస్తం గుర్తుపైనే బరిలో దించాలని నిర్ణయించారు. ఇలాగైతేనే.. కూటమికి మేలు జరుగుతుందని, టీజేఎస్ గుర్తు మీద పోటీ చేయడం ఇబ్బందికరంగానే ఉంటుందనే అభిప్రాయం వెల్లడించారు. అయితే, ఆ పార్టీ కోరుతున్న విధంగా కూటమి కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) అమలు చైర్మన్‌గా కోదండరాంను నియమించాలని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కమిటీకి చట్టబద్ధత కల్పించి కమిటీ చైర్మన్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని భేటీలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను టీజేఎస్ నేతల ముందుపెట్టి వీలున్నంత త్వరగా పొత్తుల వ్యవహారం తేల్చాలనుకుంటున్నారు. కోదండరాంను పోటీ చేయించడం కన్నా.. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. కోదండరాం పర్యటనల కోసం అవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్ సమకూర్చాలని, ఆయన పోటీలో ఉన్నదాని కన్నా ప్రచారంలో కీలకంగా ఉండడమే కూటమికి మేలు చేస్తుందని కోర్‌కమిటీ సమావేశంలో అభిప్రాయానికి వచ్చారు. ‘జానా అండ్ కో’బాధ్యతలు కూటమి పార్టీలను సమన్వయపరిచి వీలున్నంత త్వరగా పొత్తుల వ్యవహారం తేల్చే బాధ్యతను పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బృందానికి అప్పగిస్తూ కోర్‌కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో చిన్నారెడ్డి, పొన్నం ప్రభాకర్, పి.వినయ్‌కుమార్‌లను సభ్యులుగా ఉంచాలని, ఈ నలుగురి బృందం ఇతర పార్టీలతో పొత్తుల చర్చల్లో పాల్గొనాలని, మిగిలిన పార్టీ నేతలు ఇతర కార్యక్రమాలు చూసుకోవాలని నిర్ణయించారు. టీజేఎస్ నేతలతో భేటీ కోర్‌కమిటీ సమావేశం ముగిసిన వెంటనే జానారెడ్డి తన నివాసంలో టీజేఎస్ ముఖ్య నేతలు దిలీప్ కుమార్, రచనా రెడ్డిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కోర్‌కమిటీ ప్రతిపాదనలను జానారెడ్డి టీజేఎస్ నేతల ముందుంచారు. అయితే.. ఈ ప్రతిపాదనలపై పార్టీ అధినేత కోదండరాంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నేతలు వెల్లడించారు. సమావేశం అనంతరం దిలీప్ కుమార్, రచనా రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో చర్చించినట్టు తెలిపారు. తమ పార్టీ తరఫున పోటీచేయాలనుకుంటున్న 36 మంది జాబితాను కాంగ్రెస్‌కు ఇచ్చామని, ఎంతమందికి సీట్లు ఇస్తారన్నది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. సీట్ల సర్దుబాటు పెద్ద సమస్య కాదని, ఈ విషయంలో టీజేఎస్ అసంతృప్తితో ఉందన్నది అవాస్తవమన్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి వస్తాయని వెల్లడించారు. కాంగ్రెస్ గూటికి రాములు నాయక్? టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదివారం హోటల్ గోల్కొండకు వచ్చారు. కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే హోటల్‌కు వచ్చిన ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఇతర నేతలను కలిశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని.. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందు అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరినట్టు సమాచారం. అయితే, దీనిపై పార్టీ హైకమాండ్‌తో చర్చించి సమాచారం ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కొడంగల్‌లో రాహుల్ సభ? ఈనెల 20న రాహుల్ పర్యటన ఏర్పాట్లపై కూడా కాంగ్రెస్ కోర్‌కమిటీ చర్చించింది. భైంసా, కామారెడ్డిలతో పాటు హైదరాబాద్ పాతబస్తీలో జరిగే రాహుల్ పర్యటనను విజయవంతం చేయాలని, పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ఈనెల 27న మరోమారు రాహుల్ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఎక్కడ సభలు పెట్టాలన్న దానిపై కూడా చర్చించారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సభలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కూడా రాహుల్ సభ ఏర్పాటు చేయించాలన్నదానిపై చర్చ జరిగింది. కొడంగల్‌లో రాహుల్ సభ జరిగితే.. దక్షిణ తెలంగాణలో కూడా ప్రభావం ఉంటుందన్న కోణంలో చర్చ జరిగినప్పటికీ దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. -
బీహార్: ఎన్డియె కూటమి పక్షాల మధ్య కుదిరిన సీట్ల పంపకాలు
-
ఎన్డీఏ సీట్ల సర్దుబాటు ఖరారు!
పట్నా : రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బిహార్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సీట్ల సర్ధుబాటును ఖరారు చేశాయి. బీజేపీ 20 స్ధానాల నుంచి పోటీ చేయనుండగా, జేడీ(యూ) 12 సీట్ల నుంచి, లోక్ జనశక్తి పార్టీ ఐదు సీట్ల నుంచి బరిలో దిగుతాయని ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. ఎన్డీఏ కూటమి నుంచి రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) పోటీ చేస్తే ఆ పార్టీకి బిహార్‌లో రెండు సీట్లు కేటాయించేలా అంగీకారం కుదిరినట్టు తెలిసింది. 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు తమ పార్టీ కృషిచేస్తుందని కేంద్ర మంత్రి, ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహ పేర్కొన్నారు.కాగా బీజేపీ సీట్ల సర్దుబాటులో భాగంగా యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో సీటును జేడీ(యూ)కు ఇవ్వనున్నట్టు ఎన్డీఏ వర్గాలు వెల్లడించాయి. -
యూపీలో ఒక్కటైన నాలుగు పార్టీలు..
సాక్షి, న్యూఢిల్లీ : అత్యధిక లోక్‌సభ స్ధానాలున్న యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు సమిష్టిగా పోరాడాలని నిర్ణయించాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చాయి. యూపీలోని 80 పార్లమెంట్ స్ధానాల్లో ఏ పార్టీ ఎన్ని స్ధానాల్లో పోటీ చేయాలనే కసరత్తు తర్వాత చేపట్టాలని ఈ పార్టీలు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించాలంటే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో విపక్షాల మధ్య అవగాహన కీలకం. ఈ ఏడాది యూపీలో జరిగిన పలు ఉప ఎన్నికల్లో సమైక్యంగా పోటీచేసిన ప్రతిపక్షాలు మంచి ఫలితాలు రాబట్టిన సంగతి తెలిసిందే. గోరఖ్‌పూర్, పూల్పూర్, కైరానా, నూర్పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీపై కలిసికట్టుగా పోరాడిన విపక్షాలు దీటైన విజయాలు నమోదు చేశాయి. ఇదే ఊపుతో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సీట్ల సర్ధుబాటుకు పూనుకోవాలని ఎన్సీపీ నేత శరద్ పవార్, తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఇక మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీఎస్పీల మధ్య సీట్ల సర్ధుబాటు బెడిసికొట్టడం విపక్ష శిబిరంలో నిరుత్సాహం అలుముకుంది. బీఎస్పీ అధినేత్రి తమకు 50 స్ధానాలు కేటాయించాలని కోరతుండగా, కాంగ్రెస్ 22 సీట్లను ఇవ్వచూపింది. 30 స్ధానాలకు మించి బీఎస్పీకి ఇవ్వలేమని కాంగ్రెస్ స్పష్టం చేయడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు పొసగడం లేదు. -
సీట్ల పంపకంపై అమిత్ షా, నితీశ్ భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల పంపకం విషయంలో బీజేపీ చీఫ్ అమిత్ షా, జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. గతవారం ఇరువురు నేతల మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగాయని.. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. విపక్షాలు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతుండగానే.. షా, నితీశ్‌లు సీట్ల సర్దుబాటు కోసం భేటీ అవడం చర్చనీయాంశమైంది. 40 ఎంపీ స్థానాలున్న బిహార్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ 15 సీట్లను వదులుకోకూడదని జేడీయూ పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే బిహార్‌లో ఇతర ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కలుపుకుంటే.. జేడీయూకు 15 సీట్లు ఇవ్వడం కష్టమని బీజేపీ అంటోంది. -
ముందు సీట్ల సంగతి తేల్చండి..
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్ధుబాటుపై నిర్థిష్ట ఒప్పందం జరగాలని జేడీ(యూ) కోరుతోంది. సరైన తరుణంలో ఈ దిశగా బీజేపీ చొరవచూపాలని, దీనిపై ఇంతవరకూ ఆ పార్టీ నుంచీ ఎలాంటి సంకేతాలు లేవని జేడీ(యూ) వర్గాలు పేర్కొన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలు 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే పూర్తి భిన్నమైనవని గుర్తెరగాలని జేడీ(యూ) తేల్చిచెప్పింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూలంకషంగా చర్చించిన మీదట సీట్ల పంపకాలపై ఓ నిర్ణయానికి రావడం మేలని సూచించింది. క్షేత్రస్ధాయిలో ప్రస్తుత పరిణామాలను అంచనా వేసి సరైన ఎత్తుగడతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సీనియర్ జేడీ(యూ) నేత పేర్కొన్నారు. గత లోక్‌సభ ఎన్నికల ప్రాతిపదికన సీట్ల పంపకం ఉండాలన్న బీజేపీ ప్రతిపాదనను జేడీ(యూ) శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే దానికి నిదర్శనంగా భావించాలని స్పష్టం చేశాయి. బిహార్‌కు ప్రత్యేక హోదా వర్తింపచేయకపోవడం రానున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు 2020లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమికి ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మధ్యప్రదేశ్‌లో సీట్ల పంపకం సమస్యే కాదు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్ ద్వారాలను తెరిచిపెట్టిందనీ, ఇతర పార్టీలతో పొత్తుకు సీట్ల పంపకం సమస్యే కాదని ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. భావసారూప్య పార్టీలు కాంగ్రెస్‌తో జతకట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్, బీఎస్పీలు పొత్తు పెట్టుకుంటున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యమేర్పడింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన అతికొద్ది మంది ఎంపీల్లో సింధియా ఒకరు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఇన్చార్జ్గా ఉన్నారు. పొత్తు కోసం బీఎస్పీతోనూ చర్చలు జరుపుతామని, అన్ని రాష్ట్రాల్లోనూ బలమైన పార్టీలతో కూటమి ఏర్పాటుచేసి వారికి తగినన్ని సీట్లు ఇస్తామన్నారు. -
సీట్ల పంపకమే అసలు పేచీ
లక్నో: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నాలు కొనసాగుతుండగా.. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో పార్టీల మధ్య సీట్ల పంపకం అంత సులువుగా కనిపించడం లేదు. శనివారం పార్టీ కార్యకర్తల భేటీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యలతో ఆ విషయం స్పష్టమైంది. తమకు గౌరవప్రదమైన సీట్లను కేటాయిస్తేనే కూటమిలో చేరతామని, లేదంటే ఒంటరిగానే పోటీకి వెళ్లడం ఉత్తమమని మనసులో మాటను ఆమె బయటపెట్టారు. కార్యకర్తలు ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన పక్షంలో సీట్ల పంపకంపై ఎస్పీ, కాంగ్రెస్‌లపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే మాయావతి ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా.. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ 73 స్థానాలు(అప్నాదళ్ 2 సీట్లతో కలిపి), సమాజ్‌వాదీ 5, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్నాయి. బీఎస్పీ ఒక్కచోటా విజయం సాధించలేదు. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్‌లు కూటమిగా పోటీ చేశాయి. పొత్తు పెట్టుకున్నా.. ఆ రెండు పార్టీలు దాదాపు 12కు పైగా స్థానాల్లో ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి. సీట్ల ఒప్పందం చేసుకున్నా.. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య సఖ్యత కుదరలేదు. ఆ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ 298 స్థానాల్లో, కాంగ్రెస్ 105 స్థానాల్లో పోటీ చేయాల్సి ఉండగా.. పలు చోట్ల రెండు పార్టీలు పోటీపడడంతో నష్టపోయాయి. ‘కూటమిగా పోటీ చేస్తున్నప్పుడు పార్టీల మధ్య సీట్ల పంపకం అత్యంత కీలకం. తమకే ఎక్కువ సీట్లు కావాలని ప్రతీ పార్టీ ఆశిస్తుంది. అలాంటి సమయంలో సీట్ల పంపకంపై సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి’ అని రాజకీయ విశ్లేషకుడు జేపీ శుక్లా పేర్కొన్నారు. బీజేపీ ఓటమికి కూటమి తప్పనిసరి: ఎస్పీ యూపీ సీఎం ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ లోక్‌సభ నియోజకవర్గాలైన గోరఖ్‌పూర్, పూల్పూర్లో ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి బీఎస్పీ మద్దతిచ్చింది. ఆ రెండు స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. అఖిలేశ్ స్వయంగా మాయావతి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి సమాజ్‌వాదీ మద్దతిచ్చింది. ‘బీజేపీని ఓడించాలంటే కూటమి ఏర్పాటు తప్పనిసరి. సమ ప్రాధాన్యం దక్కేలా సీట్ల పంపకాన్ని మా అధినాయకత్వం నిర్ణయిస్తుంది’ అని ఎస్పీ నేత రాజ్‌పాల్ కశ్యప్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజీపడినా.. మొన్నటి వరకూ ప్రత్యర్థులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీలు.. సీట్ల పంపకంపై రాజీ ధోరణిలో వెళ్తాయా? లేదా? అన్నది తెలియాలంటే కొద్ది కాలం వేచిచూడాల్సిందే. -
టీడీపీకి 87, బీజేపీకి 63
-
టీడీపీ, బీజేపీ మధ్య 'గ్రేటర్' వార్
సీట్ల కేటాయింపుపై ఇరు పార్టీల్లోనూ అసంతృప్త జ్వాలలు నామినేషన్లు వేసుకోవాలంటూ అభ్యర్థులకు ఆదేశాలు నామినేషన్లు దాఖలు చేస్తున్న ఇరు పార్టీల అభ్యర్థులు హైదరాబాద్: మిత్రపక్షాల మధ్య గ్రేటర్ వార్ మొదలైంది. వార్డుల కేటాయింపులో మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చు రగిలింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 150 వార్డుల్లో టీడీపీ 90, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయాలని ఆయా పార్టీల నాయకత్వాలు చర్చల మధ్య సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ నిర్ణయమే ఇరు పార్టీల నేతల మధ్య చిచ్చు రేపింది. ప్రధానంగా బీజేపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రాజేసింది. గ్రేటర్ లో బలం ఉన్నప్పటికీ టీడీపీకి ఎక్కువ సీట్లు వదులుకోవడమేంటని కొందరు నేతలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, గెలిచే అవకాశాలున్న స్థానాలను టీడీపీకి వదులుకోవడం కూడా నేతల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. మరోవైపు గత ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సైతం టికెట్లు దక్కకపోవడంపై టీడీపీలోనూ అంతర్గత పోరు తీవ్రమైంది. కొందరు నేతలు శనివారం నేరుగా పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు వచ్చి ఆందోళన చేశారు. గతంలో గెలుచుకున్న స్థానాలను బీజేపీకి ఎలా కేటాయిస్తారని కొందరు ప్రశ్నించగా, ఎంతో కాలంగా డివిజన్ లో పోటీ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధపడి ఉన్నప్పుడు తీరా ఎన్నికల సమయానికి ఆ స్థానాన్ని బీజేపీకి ఎలా కేటాయిస్తారంటూ మరికొంత మంది నాయకులు టీడీపీ అగ్రనేతలను నిలదీశారు. దాంతో ఏం చేయాలో తెలియక సీట్ల సర్దుబాటు విషయంలో మరోసారి సమాలోచనలు చేయాలని ఇరు పార్టీల నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. సీట్ల కేటాయింపుల్లో కొన్ని మార్పులు చేయాలని, లేదంటే అసలుకే ఎసరొస్తుందని నేతలు చెబుతున్నారు. ఆదివారం నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ముందైతే నామినేషన్లు వేయండి... తర్వాత చూద్దాం అంటూ అసంతృప్తితో ఉన్న నేతలకు చెప్పారు. దాంతో అనేక డివిజన్లలో రెండు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఉండటంతో ఆలోగా ఏదో రకంగా బుజ్జగింపుల ద్వారా విరమించుకునేలా చేయొచ్చన్న భావనతో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు మాత్రం తాము విరమించుకునేది లేదని గట్టిగా చెబుతున్నారు. పార్టీ బీ ఫామ్ ఇవ్వని పక్షంలో ఇండిపెండెంట్ గానైనా సరే పోటీలో ఉంటామని బెదిరిస్తున్నారు. -
'అప్పుడు ఒకటే.. ఇప్పుడు మూడు...'
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, మిత్రపక్షాల మధ్య సీట్ల లొల్లి మొదలైంది. తమకే అత్యధిక సీట్లు ఇవ్వాలని మిత్రపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ 102 సీట్లకే పరిమితం కావాలని బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) సూచించింది. గత ఎన్నికల్లో బీజేపీ 102 స్థానాల్లో పోటీ చేసి మిత్రపక్షమైన జేడీ(యూ)కు 141 సీట్లు కేటాయించిందని, ఇప్పుడు అదేవిధంగా చేయాలని కేంద్ర మంత్రి, ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వవాహ అన్నారు. గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక మిత్రపక్షం మాత్రమే ఉందని, ఈసారి మూడు మిత్రపక్షాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తమ పార్టీ 67 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటుందని చెప్పారు. మరో మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ(ఎల్ జేపీ) 74 సీట్లు అడుగుతోందని తెలిపారు. అలాగే మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందూస్థాన్ అవామీ మోర్చా(హెచ్ ఏఎం)కు కొన్ని సీట్లు సర్దుబాటు చేయాల్సి వుంటుందన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పాట్నా పర్యటన నేపథ్యంలో ఉపేంద్ర కుష్వవాహ సీట్ల సర్దుబాటుపై స్పందించారు. బిహార్ లోని 243 స్థానాల్లో సొంత బలంతో 185 గెలవాలనుకుంటున్నట్టు ఈ ఏడాది ఆరంభంలో అమిత్ షా ప్రకటించారు. -
శివసేన, బీజేపీలో మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై బీజేపీ, శివసేనల మధ్య అవగాహన కుదిరింది. దాంతో పొత్తుపై ఇరుపార్టీల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగడంతో బీజేపీ, సేన పార్టీల నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. బీజేపీకి 130 సీట్లు ఇవ్వడానికి శివసేన అంగీకరించడంతో ఇరుపార్టీల మధ్య పొత్తు ముందుకు కొనసాగడానికి మార్గం సుగమమైంది. సీట్లు సర్ధుబాటు, ఎన్నికల పొత్తు ముందుకు కొనసాగించడానికి ఇరుపార్టీల నేతలు మంగళవారం ఉదయం భేటి అయ్యారు. అయితే సీట్ల సర్ధుబాటు విషయంలో శివసేన కోత విధించుకుంటుందా? లేక చిన్న పార్టీలు త్యాగం చేస్తాయా అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. -
ఒంటరిపోరుకు సిద్దమవుతున్న బీజేపీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ ఒంటరిపోరుకే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్ధుబాటు వ్యవహారంపై శివసేనతో అవగాహన కుదరకపోవడంతో మహారాష్ట్రలోని 288 స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ, సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోనుంది. -
288 స్థానాలకు శివసేన పోటీ?
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించేందుకు బీజేపీ, శివసేన పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. సర్ధుబాటు వ్యవహారంలో శివసేన పార్టీ ఖచ్చితంగా ఉండటంతో ఇరుపార్టీల మధ్య పోటీ చేసే సీట్ల సంఖ్యపై ఓ అవగాహనకు రాలేకపోయారు. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం మాతోశ్రీలో సమావేశమైంది. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరకపోతే మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని శివసేన యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల పొత్తుపై ఓ అవగాహనకు వచ్చేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్, సుష్మా స్వరాజ్ హాజరయ్యారు. -
అధిష్టానం నిర్ణయిస్తుంది
ముంబై: శివసేనతో పొత్తు కొనసాగింపు విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్భండారీ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లా. పొత్తు విషయంలో తాజా సమాచారం ఏదైనా ఉంటే మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడనవిస్ మీడియాకు తెలియజేస్తారు’ అని అన్నారు. కాగా ఉద్ధవ్‌ఠాక్రే శనివారం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక రాష్ట్రాల్లో మోడీ వేవ్ పనిచేయలేదని పేర్కొన్నారు. అందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో విజయాన్ని మోడీకి మాత్రమే ఆపాదింపజేయలేమన్నారు. మహారాష్ట్రలో విజయం విషయంలో శివసేన వాటాను కొట్టిపారేయలేనదని పేర్కొన్న సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలు బీజేపీ నాయకులు, కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిన సంగతి విదితమే. కార్యకర్తలు కలత చెందారు ప్రధానమంత్రి నరేంద్రమోడీపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ కార్యకర్తల్లో కలత రేపాయని బీజేపీ రాష్ట్ర శాఖ కోశాధికారి షైనా ఎన్సీ పేర్కొన్నారు. ‘మా నాయకుడిని ఉద్ధవ్ అవమానించారు. ప్రతి ఒక్కరికీ రాజకీయ ఆకాంక్షలు ఉంటాయి. అయితే ఇతర పార్టీ నాయకుల గురించి ఆచితూచి మాట్లాడాలి. విచక్షణతో మాట్లాడాలి’అని అన్నారు. కాగా మూడురోజుల పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 17వ తేదీన నగరానికి రానున్నారు. -
తాండూరులో నీకు నాకు సగం సగం
రంగారెడ్డి జిల్లా తాండూరులో మునిసిపల్ ఛైర్మన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ వీడిపోయింది. ఇక్కడ టీఆర్ఎస్, ఎంఐఎం ఇద్దరికీ గట్టిగా బలం ఉండటంతో ఎవరు ఛైర్మన్ కావాలన్న విషయమై తొలుత ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు రెండు వర్గాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మొత్తం పదవీ కాలం ఐదేళ్లు కావడంతో.. చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా మొదటి రెండున్నరేళ్లు టీఆర్ఎస్కు, తరువాత ఎంఐఎంకు వెళ్తాయి. టీఆర్ఎస్ కౌన్సిలర్లతో జరిపిన చర్చల్లో చైర్పర్సన్ అభ్యర్థిగా 28వ వార్డు నుంచి గెలిచిన కౌన్సిలర్ కోట్రిక విజయలక్ష్మి పేరు మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు. అయితే, ఆమె పేరుపై పార్టీ నాయకులు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 9వ వార్డు కౌన్సిలర్ నీరజకు చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని 8 మంది కౌన్సిలర్లు పట్టుబట్టారు. రాత్రి వరకు చర్చలు జరిగినా.. ఫలితం లేకపోవడంతో నీరజకు మద్దతిస్తున్న కౌన్సిలర్లు అలిగి మంత్రి నివాసం నుంచి వెళ్లిపోయారు. వాళ్లు ఏం చేస్తారన్నది మాత్రం ఇప్పటికీ ఉత్కంఠగానే ఉంది. అంతకుముందు ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు హాదీ, ఇతర నాయకులు, కౌన్సిలర్లతో కూడా మంత్రి చర్చలు జరిపారు. చేరో రెండున్నరేళ్లు చైర్పర్సన్ పదవిని పంచుకోవడానికి ఇరుపార్టీలు అంగీకరించాయి. -
పనికిమాలిన సీట్లు అంటగడతారా
టీడీపీ.. బీజేపీ మధ్య ఏ ముహూర్తంలో పొత్తు కుదిరిందో గానీ, రెండు పార్టీలకూ అది తలనొప్పిగానే మారింది. తెలంగాణ ప్రాంతంలో బీజేపీ నేతలు తమకు కావల్సిన సీట్లు కాక, పనికిమాలిన స్థానాలన్నీ టీడీపీ తమకోసం వదిలిపెట్టిందని మండిపడుతున్నారు. తాము కోరిన సీట్లు ఇవ్వకపోతే అన్ని పదవులకు రాజీనామా చేస్తామని రంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలు హెచ్చరించారు. ఈ మేరకు ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా నాయకులు సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. తాము కోరుతున్న స్థానాలు కాకుండా, వాళ్లకు ఇష్టం వచ్చిన స్థానాలు మాత్రమే ఇస్తామంటే ఊరుకునేది లేదని, అవసరమైతే సొంతంగా బరిలోకి దిగుతామని కూడా బీజేపీ నాయకులు తమ పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. -
సీఎం కుర్చీ.. 60 సీట్లు
-
టీడీపీతో బీజేపీ పొత్తు ఖరారే!
అరుణ్ జైట్లీకి బాధ్యతలు అప్పగింత సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కమలానికి సైకిల్‌పై సవారీ తప్పేలా లేదు. చివరి నిమిషంవరకు పొత్తు వద్దంటే వద్దని వారించిన పార్టీ రాష్ట్ర నేతలు ఎట్టకేలకు జాతీయ నాయకత్వం ఆదేశాలకు తలొగ్గాల్సిన పరిస్థితి వస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో గురువారం జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పొత్తుల వ్యవహారాన్ని సుదీర్ఘంగా చర్చించిన నేతలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టీడీపీతో పొత్తు ఖరారు బాధ్యతను రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీకి అప్పజెప్పారు. దీంతో ఆయన రాష్ట్ర పార్టీ నేతల్లో కొందర్ని సంప్రదించి... టీడీపీతో పొత్తుకు మానసికంగా సిద్ధం కావాలని సలహా ఇచ్చినట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర నాయకత్వం పొత్తుల్లో ఏయే సీట్లు పోతాయి, ఏవేవి దక్కుతాయనే దానిపై దృష్టి సారించింది. ఈనెల 15న జరిగే పార్టీ కోర్ కమిటీ సమావేశంలో దీనిపై స్పష్టత తీసుకురానున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణలో బీజేపీ చెప్పినట్టు టీడీపీ సర్దుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చెప్పినట్టు బీజేపీ వింటుంది. తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లపై పార్టీ ఎన్నికల కమిటీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేయగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు ప్రాథమిక సమాచార సేకరణే జరగలేదు. ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.హరిబాబు త్వరలో ఈ ప్రక్రియ చేపడతారు. పార్టీలో పలువురి చేరిక: నల్గొండ, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు నేతలు గురువారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ దేశ ప్రజలందరూ మోడీని ప్రధానిని చేయాలని కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, భువనగిరి టిక్కెట్ ఆశిస్తున్న వన్నాల శ్రీరాములు, జాతీయ జల యాజమాన్య విభాగం కన్వీనర్ వెదిరే శ్రీరాం, దాసరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కుర్చీ.. 60 సీట్లు
పొత్తుపై కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీల పొత్తుకు ముఖ్యమంత్రి పదవి ప్రధాన అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు... ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి తమకే ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు షరతు విధిస్తున్నారు. అంతేగాకుండా ఆ విషయాన్ని ఎన్నికలకు ముందే బహిరంగంగా ప్రకటించాలని కూడా ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు మాత్రం ఈ విషయంలో విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్‌కు లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఏ ఎన్నికల్లోనూ ఇంతవరకు అధికారికంగా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని గుర్తుచేస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఇరు పార్టీలకు వచ్చే సీట్లు, ఓట్ల ఆధారంగా సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్-టీఆర్ఎస్లకు 64-55 సీట్ల చొప్పున పంచుకుందామని కాంగ్రెస్ పెద్దలు ప్రతిపాదించారు. వీటిలో ప్రస్తుతమున్న సిట్టింగ్ స్థానాలన్నింట్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. అదేవిధంగా టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలన్నీ ఆ పార్టీకే వదిలేస్తామని ప్రతిపాదించారు. మిగిలిన సీట్లలో ఏ పార్టీ గెలిచే అవకాశాలున్నాయో, ఏ పార్టీ అభ్యర్థి బలంగా ఉన్నారో గుర్తించి పంచుకుందామని సూచించారు. కాంగ్రెస్ పెద్దల ప్రతిపాదన మేరకు ప్రస్తుతం తెలంగాణలో 48 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందిన వారున్నారు. వీరితోపాటు కుత్బుల్లాపూర్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా ఉన్నారు. టీఆర్ఎస్కు చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. పొత్తు కుదిరితే మొత్తం 50 సిట్టింగ్ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళతాయి. సిట్టింగ్ స్థానాలతోపాటు అదనంగా మరో 14 స్థానాల ను కాంగ్రెస్ కోరుతోంది. వాటిలో నిజామాబాద్ జిల్లాలో మూడు (నిజామాబాద్ పట్టణ, గ్రామీణ నియోజకవర్గాలతోపాటు ఆర్మూరు), కరీంనగర్లో రెండు (జగిత్యాల, పెద్దపల్లి), గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు (రాజేంద్రనగర్, అంబర్‌పేట, కూకట్పల్లి), మహబూబ్‌నగర్‌లో రెండు (వనపర్తి, కల్వకుర్తి), ఖమ్మంలో రెండు (సత్తుపల్లి, కొత్తగూడెం), వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గాన్ని (పాలకుర్తి, మునుగోడు) కాంగ్రెస్‌కు కేటాయించాలని కోరుతున్నారు. సిట్టింగ్ ఎంపీ స్థానాలన్నీ కాంగ్రెస్‌కే అలాగే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ స్థానాలన్నీ తమకే కేటాయించాలని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించారు. నాగర్‌కర్నూలు, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాథం, జి.వివేక్ టీఆర్ఎస్లోకి వెళ్లినందున ఆ స్థానాలకు బదులుగా ఖమ్మం, మెదక్ స్థానాలకు తమకు కేటాయించాలని కోరారు. మెదక్ సిట్టింగ్ ఎంపీ విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరినందున ఆ స్థానాన్ని కచ్చితంగా తమకు ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ స్థానాల విషయంలో కాంగ్రెస్ ప్రతిపాదనపట్ల సుముఖంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే సీట్ల విషయంలో మాత్రం చెరో సగం పంచుకోవాల్సిందేనని పట్టుపడుతున్నారు. వీట న్నింటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిని కూడా టీఆర్ఎస్కు ఇవ్వాలని షరతు విధిస్తున్నారు. అలాచేస్తే మరికొన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను వదులుకునేందుకు కూడా సిద్ధమేనని ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. - కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే తెలంగాణ లోక్‌సభ సీట్లు చాలా కీలకమైనవైనందున అభ్యర్థుల ఖరారుపై జాగ్రత్త వహించాలని కేసీఆర్ సూచిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో సగం మంది ఓడిపోతారని తన సర్వేల్లో తేలిందని, వారి స్థానాల్లో వేరేవారిని కాంగ్రెస్ అభ్యర్థులుగా నియమించుకోవాలని సూచించారు. నిజామాబాద్, వరంగల్, మల్కాజ్గిరి వంటి స్థానాలు ఓడిపోయే ఖాతాలో ఉన్నాయని చెప్పారు. - కేసీఆర్ సూచనలను హైకమాండ్ పెద్దలు పట్టించుకోలేదు. సిట్టింగ్ స్థానాల్లో ఎవరిని మార్చాలి? మరెవరిని కొనసాగించాలనేది తమ పార్టీ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. సీఎం పదవి విషయంలోనూ పట్టుపట్టవద్దని, అది ఆచరణ సాధ్యంకాదని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్కు మెజారిటీ సీట్లు వస్తే ముఖ్యమంత్రి పదవి విషయంలో అభ్యంతరం లేదని చెప్పినట్టు తెలిసింది. - కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్, ఏఐసీసీ రాష్ట్ర ఎన్నికల స్రీనింగ్ కమిటీ సభ్యుడు వయలార్ రవి టీఆర్ఎస్ నేతలతో అంతర్గతంగా చర్చలను కొనసాగిస్తున్నారు. అయితే చర్చల ప్రక్రియ మాత్రం ఇంకా కొలిక్కి రాకపోవడం, సీఎం పదవి తనకే ఇవ్వాలని కేసీఆర్ పట్టుపడుతుండటంతో పొత్తు ఖరారు బాధ్యతను హైకమాండ్ పెద్దలు దిగ్విజయ్‌సింగ్‌కు అప్పగించారు. - ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న దిగ్విజయ్‌సింగ్ సోమవారం సాయంత్రమే కేసీఆర్‌తో భేటీ అవుతారని పార్టీలో ప్రచారం జరిగినా ఇప్పటివరకు ఆ సమావేశం జరగలేదు. ఏదేమైనా రాష్ట్ర పర్యటన ముగిసేలోపు గులాబీ నేతలతో సమావేశమై పొత్తుపై ఒక స్పష్టతకు రావాలని, అనంతరం ఢిల్లీవెళ్లి పొత్తుల సారాంశం, టీఆర్ఎస్ ప్రతిపాదనలతో ఒక నివేదికను రూపొందించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ముందుంచాలని దిగ్విజయ్‌సింగ్ నిర్ణయించారు. పొత్తు కష్టమేనంటున్న టి.కాంగ్రెస్ నేతలు మరోవైపు టీఆర్ఎస్ పొత్తు ఆచరణ సాధ్యమయ్యేలా కన్పించడం లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ ప్రతిపాదనలను అంగీకరించడం సాధ్యంకాదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. టీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కడే సీఎం అభ్యర్థిగా ఉన్నారని, అదే కాంగ్రెస్‌లో ఏడెనిమిదిమంది నేతలు సీఎం సీటు కోసం సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే టీఆర్ఎస్తో పొత్తు కుదిరేలా లేదని అభిప్రాయపడుతున్నారు. -
పొత్తు పొడిచింది!
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైంది. ఇక అధికారికంగా ప్రకటించటమే మిగిలి ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై మైనారిటీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాగైతే మైనారిటీ ఓటు ఒక్కటీ పడదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మంగళవారం పార్టీ ముఖ్యనేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక, సాధారణ ఎన్నికల్లో సీమాంధ్ర, తెలంగాణల్లో వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్లు ప్రధాన శత్రువులన్నారు. భవిష్యత్ అవసరాలు, జాతీయరాజకీయాల్లో పార్టీ పోషించాల్సిన పాత్ర దృష్ట్యా బీజేపీతో కలిసి పనిచేయాలని సూచించారు. సాధారణ ఎన్నికలు పార్టీకి ముఖ్యం కాబట్టి బీజేపీ ఎన్ని స్థానా లు కోరితే అన్ని ఇవ్వాలన్నారు. టీడీపీతో పొత్తుండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెపుతుండడాన్ని పార్టీ నేతలు దృష్టికితేగా.. స్థానిక బీజేపీ నేతల్ని పట్టించుకోనక్కర్లేదని బాబు చెప్పారు. తాను నిత్యం బీజేపీ జాతీయ నేతలతో టచ్‌లో ఉన్నానని, వారూ తనతో చర్చలు జరుపుతున్నారన్నారు. మైనార్టీ నేతల్లో ఆగ్రహం: బీజేపీతో పొత్తుకు బాబు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటం పై పార్టీలోని మైనారిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2011 లో హైదరాబాద్‌లో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశానని, దీనివల్ల మైనార్టీలు దూరమయ్యారని, మళ్లీ అలాంటి పొరపాటు చేయనని చెప్పిన క్షమాపణలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. బాబు వైఖరికి నిరసనగా పొలిట్‌బ్యూరో సభ్యు డు, సియాసత్ ఉర్దూ దినపత్రిక సంపాదకుడు జాహెద్ ఆలీఖాన్ పార్టీని వీడాలని నిర్ణయించగా.. మరికొందరూ ఇదేబాటలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు నగరానికి వచ్చిన బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ను బాబు సూచన మేరకు ఎంపీ సుజనా చౌదరి కలిశారు. పొత్తులపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే తాను వ్యక్తిగతంగా కలిశానని సుజనా చెప్పడం గమనార్హం.