ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ ఎట్టకేలకు మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఇండియా కూటమి సీట్ల పంపిణీ ఒప్పందం కుందిరింది. ఈ మేరకు మంగళవారం మహావికాస్‌ఆఘాడీ నేతలు సంయుక్తంగా ప్రకటించారు. శివసేన(యూబీటీ) 21 సీట్లు, కాంగ్రెస్‌పార్టీ 17 సీట్లు, ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) 10 సీట్లతో లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నారు.
మొదటి నుంచి ఆశించిన సంగాలి లోక్‌సభ నియోజకవర్గాన్ని శివసేన(యూబీటీ) దక్కించుకోగా.. భీవండి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మరోవైపు శివసేన(యూబీటీ)కి పట్టు ఉన్న ముంబై నార్త్ స్థానాన్ని సీట్ల పంపిణీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవటం గమనార్హం. సీట్ల పంపిణీ అనంతం శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు.
‘ప్రతిఒక్కరు అన్ని సీట్లలో గెలవడానికి తీవ్రంతా పోరాడాలి. పోరాడటంలో ఎలాంటి తప్పు లేదు. ఖచ్చితంగా అన్ని సీట్లలో గెవడానే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి’ అని ఉద్ధవ్ అన్నారు. మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. అయితే కొన్ని కీలకమైన సీట్ల విషయంలో మహా వికాస్ ఆఘాడీ కూటమి సీట్ల పంపకం కొంత జాప్యమైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment