సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఉంటాయి.. ఆ సినిమాల్లో వాళ్ళ పాత్ర నిడివి తక్కువే .. కానీ వారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. సినిమా మొత్తాన్ని సైతం ప్రభావితం చేసేంత పవర్ ఫుల్ గా ఆ పాత్రలను కథకులు రూపొందిస్తారు. అదేమాదిరి పాలిటిక్స్ లోనూ అతిథి పాత్రలు ఉంటాయి. వాళ్ళు కనిపించేది తక్కువే అయినా వాళ్ళ హడావుడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ లెక్కలు.. లాభనష్టాల బేరీజులు కూడా వేరేలేవేల్.. అంతా స్పాట్లో తేలిపోవాల్సింది..
ఆ కోవకు చెందినవారే జనసేనాని పవన్ కళ్యాణ్. మూన్నెళ్లకు ఒకసారి ప్రజల్లోకి వచ్చే అయన ఆమధ్య ఈస్ట్ గోదావరికి పర్యటించి రాజోలు, రాజనగరానికి అభ్యర్థులు ప్రకటించేశారు. దీంతోబాటు రాజమండ్రి రూరల్ కూడా తమ అభ్యర్థి కందుల దుర్గేష్ కు ఇవ్వాలని ఇస్తారని తేల్చేసారు.. అక్కడ ప్రస్తుతం ఆరుసార్లు గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు... ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ... నన్ను కాదని మీరు టిక్కెట్లు ఎలా ఇస్తారు అంటూ అయన ఇప్పటికే నిప్పు రాజేశారు..దీంతోబాటు రాజానగరం, రాజోలులోనూ టీడీపీ నాయకులూ ఇప్పటికే సుర్రుమంటున్నారు..
మళ్ళీ మూణ్ణెల్ల గ్యాప్ తీసుకుని ప్రజల్లోకి వచ్చిన పవన్ విశాఖ జిల్లా పాలిటిక్స్ మీద దృష్టిపెట్టారు. విశాఖలో అన్నయ్య నాగబాబుతోబాటు పలు సమీక్షలు సమావేశాలు నిర్వహించిన పవన్ ఏకంగా నాలుగూటిక్కెట్లు ప్రకటించేసారు.. తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పటికీ అలా ఏకపక్షంగా టిక్కెట్స్ ఎలా ఇచ్చారో తెలీడం లేదు కానీ భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ను ఇంచార్జ్ గా నియమించారు. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబును, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్ ను, యలమంచిలిని సుందరపు విజయ్ కుమార్ కు ప్రకటించేసారు. ఇక పెందుర్తి జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని టీడీపీ సీనియర్ బండారు సత్యనారాయణ మూర్తి ఇప్పటికే కత్తులు నూరుతున్నారు.
ఇప్పుడు ఏకంగా నలుగురికి దాదాపు టిక్కెట్లు ఇచ్చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా ? ఇప్పటికే అక్కడ ఐదేళ్లుగా పని చేస్తున్న టీడీపీ క్యాడర్ ఎందుకు ఊరుకుంటుంది.. తమ ఎత్తులు.. తమ నిరసనలు వ్యక్తం చేస్తారు కదా అని అంటున్నారు. ఏకపక్షంగా టిక్కెట్లు ఇచ్చేస్తుంటే తెలుగుదేశం అధిష్టానం, చంద్రబాబు ఎందుకు ఊరుకుంటున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. పవన్ ఇప్పటికే ఈ విషయమై మాట్లాడుకుని బాబు దగ్గర హామీ తీసుకునే చెప్పారా అనే దావుట్లు వ్యక్తం అవుతున్నాయి..
✍️సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment