లక్నో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లో పొత్తును ఎస్పీ, బీఎస్పీలు గురువారం ఖరారు చేశాయి. యూపీలో మొత్తం 80 స్ధానాలకు గాను ఎస్పీ 37 స్ధానాల్లో, బీఎస్పీ 38 స్ధానాల్లో పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. ఈ మేరకు తాము పోటీ చేసే స్ధానాలను వెల్లడిస్తూ ఇరు పార్టీలు జాబితాను విడుదల చేశాయి. అమేథి, రాయ్‌బరేలిలో అభ్యర్ధులను ప్రకటించబోమని ఎస్పీ, బిఎస్పీలు ఇప్పటికే ప్రకటించగా, మిగిలిన మూడు స్ధానాల్లో అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ పోటీచేస్తుంది.
ఇక ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఖరారు కావడంతో యూపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఖాయమని తేలింది. కాగా యూపీలో మొత్తం 80 స్ధానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను బరిలో దింపుతుందని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో పాటు యూపీ బాధ్యతలను ఆమెకు అప్పగించడంతో కీలక రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment