
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్ ద్వారాలను తెరిచిపెట్టిందనీ, ఇతర పార్టీలతో పొత్తుకు సీట్ల పంపకం సమస్యే కాదని ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. భావసారూప్య పార్టీలు కాంగ్రెస్‌తో జతకట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం కాంగ్రెస్, బీఎస్పీలు పొత్తు పెట్టుకుంటున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యమేర్పడింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన అతికొద్ది మంది ఎంపీల్లో సింధియా ఒకరు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. పొత్తు కోసం బీఎస్పీతోనూ చర్చలు జరుపుతామని, అన్ని రాష్ట్రాల్లోనూ బలమైన పార్టీలతో కూటమి ఏర్పాటుచేసి వారికి తగినన్ని సీట్లు ఇస్తామన్నారు.