సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యాపారంలా నడిపిందని ఆ పార్టీ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలేందుకు 22 మంది ఎమ్మెల్యేలతో మంత్రాంగం నడిపిన సింధియా మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ అవినీతితో విసిగిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో సచివాలయంలో అవినీతి రాజ్యమేలిందని అన్నారు. తన సహచరుడు సచిన్ పైలట్‌ను రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పక్కనపెట్టడం విచారకరమని, నైపుణ్యం, సామర్ధ్యం ఉన్నవారికి కాంగ్రెస్‌లో ప్రాధన్యత ఉండదనేందుకు ఇది నిదర్శనమని సింధియా ట్వీట్ చేశారు.
2018లో రాజస్ధాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించిన సచిన్ పైలట్, సింధియాలు ఇద్దరికీ తాము కోరుకున్న పదవి దక్కకపోవడంతో పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేయడం గమనార‍్హం. ఇక రాజస్ధాన్‌లో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. సచిన్ పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ చీఫ్‌గా తప్పించడంతో రాజకీయ సంక్షోభం తారాస్ధాయికి చేరింది. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పైలట్ చెబుతుండగా, అసెంబ్లీలో తనకు పూర్తి మెజారిటీ ఉందని గహ్లోత్ ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను కలిసిన గహ్లోత్ తనకు పూర్తి మెజారిటీ ఉందని పేర్కొనగా, అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధం కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. చదవండి : మన రెవాలో ‘చైనా’
Comments
Please login to add a commentAdd a comment