లక్నో: రాజకీయంగా కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ 12కు పైగా ఎంపీ సీట్లను ఇతర పార్టీలకు వదిలేసింది. ఇందులో ఎస్పీ–బీఎస్పీ–ఆరెల్డీ కూటమికి 7 సీట్లను వదిలేసినట్లు ప్రకటించింది. వీటితో పాటు అప్నాదళ్‌కు 2 సీట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ‘7 లోక్‌సభ స్థానాల్లో మా అభ్యర్థులను బరిలో నిలపడంలేదు. ఇందులో మైన్‌పురి, కనౌజ్, ఫిరోజాబాద్ ఉన్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆరెల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్, ఆయన కుమారుడు జయంత్ చౌదరి పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా మా అభ్యర్థులను నిలపడంలేదు’ అని యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ తెలిపారు.
అయితే ఏడో స్థానం గురించి కాంగ్రెస్ స్పష్టతనివ్వలేదు. రాయ్‌బరేలి (సోనియా గాంధీ), అమేథి (రాహుల్) పోటీ చేస్తున్న స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపడం లేదని ఎస్పీ–బీఎస్పీ–ఆరెల్డీ కూటమి ఇçప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మైన్‌పురి నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ములాయంసింగ్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కనౌజ్ నుంచి, బదౌన్, ఫిరోజాబాద్ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. అప్నాదళ్‌కు గోండా, పిలిభిత్ స్థానాలను వదిలేస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment