Announcement of candidates
-
తూచ్ పదహారే..!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన బీజేపీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. తొలుత అధిష్టానం 44 మందితో జాబితా విడుదల చేసింది. ఆ జాబితాపై జమ్మూలో కమలం శ్రేణులు భగ్గుమన్నాయి. ఇతర పారీ్టల నుంచి వచి్చన వారికే టిక్కెట్లు ఇచ్చారంటూ పార్టీ కార్యాయంలో ఆందోళనకు దిగారు. వారికి సమాధానం చెప్పలేక పార్టీ అధ్యక్షుడు తన కార్యాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సి వచి్చంది. చివరికి ఆ జాబితాను రద్దు చేసి..16 మంది పేర్లతో మరో జాబితాను వెలువరించింది. రగడ రాజుకుందిలా..! పదేళ్ల తర్వాత జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ అధిష్టానం మొత్తం మూడు జాబితాలు విడుదల చేసింది. మూడు దశలకు కలిపి మొత్తం 44 మంది పేర్లను ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడగానే జమ్మూలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ కోసం జెండాలు మోసిన వారిని కాదని, ఇతర పారీ్టల నుంచి వచి్చన ‘పారాచూట్’లకు టికెట్లు ఇచ్చారంటూ ఆందోళకు దిగారు. 18 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనను పక్కనబెట్టి, ఇటీవలే పారీ్టలోకి వచి్చన ఓ వ్యక్తికి టికెట్ ఇవ్వడమేంటని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జగదీశ్ భగత్ నిలదీశారు. అసంతృప్తులకు సమధానం చెప్పుకోలేక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా తన క్యాబిన్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెపె్టంబర్ 18న జరగనున్న తొలి దశ ఓటింగ్‌పై మాత్రమే దృష్టి సారించామని, ప్రతి కార్యకర్తతో తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని వివరించారు. తామంతా ఒక కుటుంబమని చెప్పారు.వెనక్కి తగ్గిన అధిష్టానం కార్యకర్తల ఆందోళన విషయంపై ఆదివారం సాయంత్రం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఈ విషయం చర్చించింది. తొలుత విడుదల చేసిన 44 మంది పేర్లను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి తొలగించింది. రెండు గంటల తర్వాత తొలి దశలో పోటీ చేయనున్న 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత కొంకర్నాగ్ నుంచి చౌదరి రోషన్ హుస్సేన్ ఒకే ఒక్క పేరుతో మరో జాబితా విడుదల చేసింది. ఇందులో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతోపాటు మహిళా అభ్యర్థి షగున్ పరిహార్ పేరుంది. పరిహార్ సోదరులు బీజేపీలో కొనసాగుతున్నారు. షగున్ తండ్రి అజిత్ పరిహార్, అజిత్ సోదరుడు అనిల్ పరిహార్‌లను 2018లో ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. తొలిదశ పోలింగ్ కోసం నామినేషన్లకు ఈనెల 27 ఆఖరు తేదీ. కశీ్మర్లోని 90 అసెంబ్లీ స్థానాలకు సెపె్టంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు అక్టోబర్ 4న వెలువడనుండటం తెలిసిందే. -
ఐదుగురు పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పతకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదుగురు పోలీసు అధికారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి శౌర్య పతకాలను ప్రకటించింది. దాంతోపాటు ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని పోలీస్, విపత్తుల స్పందన దళం విభాగాల అధికారులు, సిబ్బందికి 255 వివిధ సేవా పతకాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి శౌర్య పతకాలు: కె.వాసు (సీఐ, మేడికొండూరు, గుంటూరు జిల్లా), బి.మధుసూదనరావు (ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె. వెంకట రమణ(రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె.సంపత్ రావు (ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.త్రిమూర్తులు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.భాస్కర రావు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో). పోలీసు శాఖలో: ఉత్తమ సేవా పతకాలు 35మందికి, కఠిన సేవా పతకాలు 30మందికి, సేవా పతకాలు 161మందికి విపత్తుల స్పందన విభాగంలో: ఉత్తమ సేవా పతకాలు నలుగురికి, సేవా పతకాలు 25మందికి. -
16న వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల సమర భేరి మోగించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. జనబలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే పరమావధిగా ఇప్పటికే శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశారు. ఒకవైపు టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై అసమ్మతి సెగలు పొగలు కక్కుతుండగా రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులను ఖరారు చేసి కదనరంగంలోకి దూకేందుకు వైఎస్సార్ సీపీ సన్నద్ధమైంది. ఈమేరకు ఈనెల 16వతేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద 2019 ఎన్నికల తరహాలోనే ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రోజుకు రెండు లేదా మూడు సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధమైంది. రోజూ ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు చోట్ల బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ఉరిమే ఉత్సాహంతో.. ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లో నిర్వహించిన సిద్ధం సభల ద్వారా వైఎస్సార్ సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. ఆ సభలకు జనం పోటెత్తడం, ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో ఉరిమే ఉత్సాహంతో కదనరంగంలోకి దూసుకెళ్లడానికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతను చాటుకున్నారు. ఈ ఎన్నికల్లోనూ అమలు చేయగలిగే హామీలతో మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అది తుది దశకు చేరుకుంది. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే మేనిఫెస్టోను విడుదల చేసి ప్రచార భేరి మోగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులను ప్రకటించేలోగా ప్రచారంలో దూసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. చేసిన మంచిని వివరిస్తూ.. మోసాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎంతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులు ప్రజల్లోనే ఉన్నారు. జనంతో మమేకమవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా 87 శాతం కుటుంబాల ఖాతాల్లో డీబీటీ రూపంలోనే రూ.2.65 లక్షల కోట్లను సీఎం వైఎస్ జగన్ నేరుగా జమ చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ఇంటి గుమ్మం వద్దే అందిస్తున్నారు. వీటితోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన అంశాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రచారపర్వంలో వివరించనున్నారు. ఇదే అంశాలను ఇంటింటా వైఎస్సార్సీపీ కార్యకర్తలు తెలియచేయనున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో 650 హామీలతో మేనిఫెస్టోను ప్రకటించి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చాక టీడీపీ–బీజేపీ–జనసేన ప్రభుత్వం పది శాతం హామీలను కూడా అమలు చేయకుండా ప్రజలను దారుణంగా మోసం చేసింది. మళ్లీ ఇప్పుడు అదే కూటమి ఎన్నికల బరిలోకి దిగి హామీలు గుప్పిస్తూ మరోసారి మోసం చేసేందుకు వస్తోందనే అంశాన్ని సీఎం జగన్ ప్రజలకు వివరించనున్నారు. ఇంటింటా ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు ఇవే అంశాలను తెలియచేస్తాయి. -
రేపు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను ఇటీవల 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసిన తెలిసిందే. బుధవారం నాటి భేటీలో పెండింగ్‌లోని మిగతా 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల బలాబలాలపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు కసరత్తు పూర్తిచేశాయి. ఈ క్రమంలోనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న, ఏకాభిప్రాయం కుదిరిన 9 మందితో తొలి జాబితాను ప్రకటించారు. టికెట్ కోసం పోటీ ఉన్న ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందనే దానిపై కసరత్తు చేశారు. పార్టీ పరంగా అంతగా బలమైన నాయకులు లేని వరంగల్, నల్లగొండ, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌లలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి నేతల చేరికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్కు చెందిన మరో సిట్టింగ్ ఎంపీ బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ సదరు ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించేయడంతో.. ఆయనను మరోసీటు నుంచి బరిలో దిగాల్సిందిగా బీజేపీ నాయకత్వం కోరినట్టు తెలిసింది. దీనిపై సదరు ఎంపీ పెద్దగా ఉత్సాహం చూపడం లేదని సమాచారం. అయితే సీట్లపై ప్రాథమిక కసరత్తు ముగిసిన నేపథ్యంలో.. కొన్ని కొత్తపేర్లు తెరమీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. -
సగం సీట్లపై స్పష్టత వస్తుందా?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో శనివారం జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక భేటీ తర్వాత రాష్ట్రంలో సగం లోక్‌సభ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడంతో నష్టం జరిగిందన్న వాదనల నేపథ్యంలో ఇప్పుడు 17 ఎంపీ స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు న్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలిచిన 4 ఎంపీ సీట్లలో మూడింటిలో సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపడంతో పాటు (ఆదిలాబాద్ మినహా), చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడంటే... ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వీరికి టికెట్లు ఖరారు కావొచ్చునని, కొన్ని స్థానాల్లో ఆయా నేతలు టికెట్ కోసం పోటీకి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్: కిషన్‌రెడ్డి కరీంనగర్: బండి సంజయ్ నిజామాబాద్: అర్వింద్ ధర్మపురి ఆదిలాబాద్: సోయంబాపూరావు లేదా బాపూరావు రాథోడ్, గుడెం నగేష్ మల్కాజిగిరి: ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, చాడ సురేష్ రెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, పొన్నా ల హరీష్‌రెడ్డి జహీరాబాద్: ఎం.జైపాల్‌రెడ్డి, ఆలె భాస్కర్, అశోక్ ముస్తాపురె / ఓ ప్రముఖ సినీ నిర్మాత చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గవర్నర్ బండారు దత్తాత్రేయ వియ్యంకుడు బి. జనార్దనరెడ్డి మహబూబ్‌నగర్: డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి, శాంతకుమార్ భువనగిరి: బి.నర్సయ్యగౌడ్, జి. మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, శ్యాంసుందర్‌రెడ్డి మెదక్: ఎం.రఘునందన్‌రావు, జి. అంజిరెడ్డి వరంగల్: మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతా సాంబమూర్తి నాగర్‌కర్నూల్: బంగారుశ్రుతి, కేఎస్ రత్నం హైదరాబాద్: టి.రాజాసింగ్, మాధవీలత, భగవంతరావు, పెద్దపల్లి: టి.కుమార్ లేదా ఎవరైనా కొత్త నేతకు అవకాశం నల్లగొండ: మన్నె రంజిత్‌యాదవ్ లేదా పార్టీలో చేరే మరో నాయకుడికి మహబుబాబాద్: హుస్సేన్‌నాయక్ / మరొకరికి ఖమ్మం: దేవకీ వాసుదేవరావు, వినోద్‌రావు, రంగా కిరణ్ -
రాజస్తాన్ సీఎం పీఠంపై ఫస్ట్‌టైం ఎమ్మెల్యే
జైపూర్: మధ్యప్రదేశ్‌లో రేస్లోలేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన బీజేపీ అధిష్టానం మరోసారి అలాంటి అనూహ్య నిర్ణయమే తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్‌లాల్ శర్మను రాజస్తాన్ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు బీజేపీ మంగళవారం ప్రకటించింది. దీంతో ఇటీవల బీజేపీ విజయబావుటా ఎగరేసిన మూడు రాష్ట్రాలు.. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కొత్త ముఖాలే సీఎం పీఠంపై కనిపించనున్నాయి. మంగళవారం జైపూర్‌లో 115 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై భజన్‌లాల్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ భేటీకి బీజేపీ అధిష్టానం తరఫున పార్టీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు. సమావేశం తర్వాత భజనలాల్ వెంటనే రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మి శ్రాను కలిశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సిందిగా భజన్‌లాల్‌కు గవర్నర్ ఆహ్వనం పలికారు. పదవుల్లో కులాల సమతుల్యం పాటిస్తూ బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్‌లాల్‌ను సీఎంగా, రాచరిక వారసురాలైన మహిళా ఎమ్మెల్యే దియా కుమారిని డిప్యూటీ సీఎంగా, దళిత నేత ప్రేమ్‌చంద్ బైర్వాలను డిప్యూటీ సీఎంగా, సింధ్ వర్గానికి చెందిన వాసుదేవ్ దేవ్నానీని స్పీకర్‌గా ఎంపికచేశారు. కాంగ్రెస్ అభ్యర్థిమరణంతో వాయిదాపడిన కరణ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో జనవరి 5న పోలింగ్ జరగనుంది నేడు మోహన్‌కు పట్టం భోపాల్: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతారు. సంస్థాగతం నుంచి సీఎం దాకా... భజన్‌లాల్ చాలా సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో సంస్థాగత పదవుల్లోనే కొనసాగారు. మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. వెనువెంటనే ఆయన్ను సీఎం పదవి వరించడం విశేషం. భరత్పూర్ జిల్లాకు చెందిన 56 ఏళ్ల భజన్‌లాల్.. సంగనేర్ నియోజకవర్గం నుంచి 48,000కుపైగా భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. గతంలో ఈయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)తో మంచి అనుబంధం ఉంది. విద్యార్థి దశలో రాజనీతి శాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. -
ఒక్క సీటుకు జాబితా.. దేనికి సంకేతం?
సాక్షి, హైదరాబాద్: కేవలం ఒకే ఒక సీటుకు అభ్యర్థి ని ప్రకటించి... అదీ రెండో జాబితా అంటూ పేర్కొనడం దేనికి సంకేతమనే చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతోంది. మొదటి జాబితాను 55 మందితో విడుదల చేయాలని భావించినా 52 మందితో ఈనెల 22న తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మిగిలిపోయిన మూడింటిలో ఒకటైన మహబూబ్‌నగర్‌కు పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి కుమారుడు ఏపీ మిథున్‌కుమార్‌రెడ్డి పేరును ఖరారు చేస్తూ ఢిల్లీ నుంచి ఒకే పేరుతో జాబితా వెలువడింది. పార్టీ టికెట్ కోసం మహబూబ్‌నగర్ నుంచి జితేందర్‌రెడ్డి, షాద్‌నగర్ నుంచి ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి దరఖాస్తు చేసుకోగా, ఒకే కుటుంబానికి రెండు సీట్లు కేటాయించే అవకాశాలు లేవని స్పష్టమైంది. తొలి జాబితా ఖరారుకు ముందే తాను లోక్‌సభకే పోటీచేస్తానని, మహబూబ్‌నగర్ సీటును తన కుమారుడికి కేటాయించాలని జితేందర్ కోరడాన్ని జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఐతే ఈ ఒక్క సీటుకోసం జాబితా ఇవ్వకుండా మిథున్‌కు టికెట్‌పై భరోసా ఇచ్చి మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే సరిపోయేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈవిధంగా జితేందర్‌రెడ్డి తన పంతం నెగ్గించుకోవడంతో మరికొందరు కూడా ఇలాగే తాము అసెంబ్లీకి కాకుండా లోక్‌సభకే పోటీ చేస్తామనే డిమాండ్‌ను ప్రోత్సహించినట్లవుతుందని అంటున్నారు. రెండో సీట్లో పోటీకి సంజయ్ సై? హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీకి ఈటలకు అవకాశమిచ్చినందున తనకూ కరీంనగర్‌తోపాటు వేములవాడలోనూ పోటీకి అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదేకాకుండా సంగారెడ్డి సీటును దేశ్‌పాండేకు ఇవ్వాలని సంజయ్ కోరుతుండగా, పులిమామిడి రాజుకు ఇవ్వాలని ఈటల పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి పోటీ చేయడానికి కిషన్‌రెడ్డి విముఖత వ్యక్తం చేస్తుండటంతో అంబర్‌పేట నుంచి ఎవరిని బరిలో నిలుపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి నగర సెంట్రల్ పార్టీ అధ్యక్షుడు డా.ఎన్.గౌతంరావును బరిలో దింపుతారా లేక బీసీకి ఇవ్వాలనే యోచనతో మాజీ ఎమ్మెల్యే సి.కృష్ణాయాదవ్‌కు అవకాశం కల్పిస్తారా అన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. మిగిలిన సీట్లపై కసరత్తు మరో 45 స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహఇన్‌చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర ముఖ్య నేతలు కిషన్‌రెడ్డి, డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్ శుక్రవారం కసరత్తు చేసినట్లు తెలిసింది. మలి జాబితాను నవంబర్ 1న ప్రకటిస్తారని అంటున్నారు. జనసేనకు ఆరుదాకా సీట్లు కేటాయించే అవకాశం ఉండటంతో వాటిని మినహాయించి... మిగిలిన సీట్లలో జాబితా ప్రకటించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. -
నేడే కాంగ్రెస్ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. గత నెలరోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఏ సమయంలోనైనా 58 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా వస్తుందని ఏఐసీసీ వర్గా లు వెల్లడించాయి. ఆ తర్వాత ఇంకొక్క జాబితాలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని కూ డా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈనెల 18న ఆ జాబితా కూడా వస్తుందని తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనా ఒకట్రెండు రోజులేనని, ఈనెల 20లోపు 119 మంది అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుందని ఆయా వర్గాలు వెల్లడించాయి. కాగా, అభ్యర్థుల ప్రకటన అంశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆదివారం 58 మందితో తొలి జాబితా వస్తుందని వెల్లడించడం గమనార్హం. -
15 లేదా 16వ తేదీన బీజేపీ ఫస్ట్ లిస్ట్
సాక్షి , హైదరాబాద్: ఈ నెల 15 లేదా 16వ తేదీన 38 మంది అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ నెల 14న అమావాస్య కావడంతో పాటు పితృపక్షం ఉండటంతో, అవి ముగిశాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఫస్ట్‌లిస్ట్‌ను విడుదల చేయాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. శని వారం దిల్‌కుశ అతిథిగృహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యనేతల భేటీలో 38 స్థానాలు, అభ్యర్థులపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ భేటీలో 21 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై స్పష్టత రాగా, త్వరలోనే మిగతా 17 సీట్లు, అభ్యర్థులపైనా కసరత్తు పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర ముఖ్యనేతలు డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యనేతల నుంచి ఆయా స్థానాలకు వారు ప్రతిపాదించే పేర్లతో జాబితాలు తీసుకుని, ఇతర జాబితాలతో వాటిని సరిపోల్చి కామన్‌గా ఉన్న పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను మూడు విడతల్లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని ముఖ్యనేతల సమాచారం. లోక్‌సభ ఎన్నికల కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపార్టీకి చెందిన ముఖ్యనేతలతో కూడా ఎమ్మెల్యే స్థానాలకు పోటీచేయించాలనే ఆలోచనతో జాతీయ, రాష్ట్ర నాయకత్వాలున్నాయని చెపుతున్నారు. అయితే కొందరు నేతలు కేవలం లోక్‌సభకు పోటీచేసేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయనకు తెలియజేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు సీఎం కేసీఆర్, మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు పోటీచేసే స్థానాల్లోనూ బీజేపీ నుంచి పేరున్న ముఖ్యనేతలను బరిలోకి దించాలనే ఆలోచనతోనూ నాయకత్వమున్నట్టు సమాచారం. దీనికి తగ్గట్టుగా ఆయా స్ధానాల నుంచి ఎవరెవరిని పోటీకి నిలిపితే మంచిదనే దానిపైనా రాష్ట్రపార్టీ కసరత్తు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పార్టీనేతల పేర్లు ఇప్పుడే బయటపెట్టకుండా కొంతకాలం పాటు వేచి చూసే ధోరణిని అవలంబించాలనే ఆలోచనతో ముఖ్యనేతలున్నట్టు తెలుస్తోంది. -
30న సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థులతో ఈ నెల 30వ తేదీన మొదటి జాబితా విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పొత్తులకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం సమావేశమైంది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల తరఫున చెరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు 30న సీపీఐ, సీపీఎం సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశ ముంది. వామపక్షాలతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ పార్టీ తేల్చిచెప్పడంతో ఈ రెండుపార్టీలు ఈ నిర్ణయానికి వచ్చాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో సీపీఐ నేతలు ఆదివారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఠాక్రే సీపీఎంతో కూడా సోమవారం సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే సరే సరే, లేకుంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీల తరఫున రెండో జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎవరితో పొత్తు లేకపోతే రెండు పార్టీలు కలిసి దాదాపు 20 నుంచి 24 మధ్య అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా, సీపీఎం రాష్ట్ర కమిటీలో బీఆర్ఎస్ తీరుపై వాడీవేడి చర్చ జరిగినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్తో పార్టీ వ్యవహరించినతీరుపై కూడా కొందరు నాయకులు విమర్శించినట్లు సమాచారం. బీఆర్ఎస్ తీరును ముందే ఎందుకు అర్థం చేసుకోలేకపోయామని నిలదీసినట్టు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాతంత్ర లౌకిక పార్టీలతో ముందుకు సాగాలని పార్టీ నిర్ణయించింది. -
మధ్యాహ్నం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన
-
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ
-
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పాలవలస విక్రాంత్(శ్రీకాకుళం), ఇషాక్ బాషా(కర్నూలు), డీసీ గోవిందరెడ్డి(కడప)లను వైఎస్సార్సీపీ ఖరారు చేసింది. ఈ మేరకు అభ్యర్థులను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. చదవండి: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు -
‘ఎస్పీ–బీఎస్పీ’కి 7 సీట్లు వదిలిన కాంగ్రెస్
లక్నో: రాజకీయంగా కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ 12కు పైగా ఎంపీ సీట్లను ఇతర పార్టీలకు వదిలేసింది. ఇందులో ఎస్పీ–బీఎస్పీ–ఆరెల్డీ కూటమికి 7 సీట్లను వదిలేసినట్లు ప్రకటించింది. వీటితో పాటు అప్నాదళ్‌కు 2 సీట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ‘7 లోక్‌సభ స్థానాల్లో మా అభ్యర్థులను బరిలో నిలపడంలేదు. ఇందులో మైన్‌పురి, కనౌజ్, ఫిరోజాబాద్ ఉన్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆరెల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్, ఆయన కుమారుడు జయంత్ చౌదరి పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా మా అభ్యర్థులను నిలపడంలేదు’ అని యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ తెలిపారు. అయితే ఏడో స్థానం గురించి కాంగ్రెస్ స్పష్టతనివ్వలేదు. రాయ్‌బరేలి (సోనియా గాంధీ), అమేథి (రాహుల్) పోటీ చేస్తున్న స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపడం లేదని ఎస్పీ–బీఎస్పీ–ఆరెల్డీ కూటమి ఇçప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మైన్‌పురి నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ములాయంసింగ్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కనౌజ్ నుంచి, బదౌన్, ఫిరోజాబాద్ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. అప్నాదళ్‌కు గోండా, పిలిభిత్ స్థానాలను వదిలేస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. -
బిహార్‌లో ఎన్డీఏ సీట్ల పంపిణీ
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌లో అధికార ఎన్డీఏ సీట్ల పంపిణీ ఖరారైంది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు గాను బీజేపీ, జేడీయూ చెరో 17 చోట్ల, ఎల్జేపీ 6 చోట్ల అభ్యర్థులను పోటీకి ఉంచనున్నాయి. ఆదివారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) రాష్ట్ర అధ్యక్షులు వరుసగా నిత్యానంద్ రాయ్, వశిష్ట నారాయణ్ సింగ్, పశుపతి కుమార్ పరాస్‌లు ఈ వివరాలను వెల్లడించారు. దీంతోపాటు ఎల్జేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కూడా అంగీకారం కుదిరిందని వారు తెలిపారు. ఇలా ఉండగా, రాష్ట్రంలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ), హిందుస్తాన్ ఆవామ్ మోర్చా– సెక్యులర్ (హెచ్ఏఎం(ఎస్), లోక్ తాంత్రిక్ జనతాదళ్, వికాస్ శీల్ ఇన్సాన్ తదితర పార్టీలతో కూడిన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. -
అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే, అన్నా డీఎంకే
చెన్నై: తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు లోక్‌సభ ఎన్నికల కోసం తమ అభ్యర్థులను ఆదివారం ప్రకటించాయి. కనిమొళి, దయానిధి మారన్, ఎ.రాజ, టీఆర్ బాలు సహా పలువురికి డీఎంకే లోక్‌సభ టికెట్లను కేటాయించింది. డీఎంకే జాబితాలో ఏకంగా 12 కొత్త ముఖాలున్నాయి. 20లో ఇద్దరు మహిళలకు మాత్రమే ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌తోపాటు తమిళనాడులోని పలు చిన్న పార్టీలు, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీతోపాటు చిన్న పార్టీలు ఉండటం తెలిసిందే. అన్నాడీఎంకే తమ పార్టీనేగాక, కూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో కలిపి 40 లోక్‌సభ స్థానాలుండగా, డీఎంకే, అన్నాడీఎంకేలు రెండూ చెరో 20 స్థానాల్లో పోటీ చేస్తూ మిగిలిన 20 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేశాయి. 8 స్థానాల్లో ఇరు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉండనుంది. డీఎంకే కూటమిలో అత్యధికంగా కాంగ్రెస్‌కు పది స్థానాలు దక్కగా, సీపీఐ, సీపీఎం, వీసీకేలు చెరో రెండు, మిగిలిన చిన్న పార్టీలు తలో సీటును దక్కించుకున్నాయి. ఇక అన్నా డీఎంకే కూటమిలో పీఎంకే 7, బీజేపీ 5, డీఎండీకే 4 చోట్ల పోటీ చేయనున్నాయి. మిగిలిన నాలుగు సీట్లను చిన్న పార్టీలకిచ్చారు. తొలిసారి లోక్‌సభకు కనిమొళి పోటీ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సోదరి కనిమొళి తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమె ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉండగా, ఆ పదవీకాలం ఈ జూలైతో ముగియనుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కనిమొళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటే తమిళనాడు లో 18 నియోజకవర్గాలకు శాసనసభ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా డీఎంకే ప్రకటించింది. -
లోక్‌సభకూ ముందుగానే అభ్యర్థులు!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు లోక్‌సభ ఎన్నికల విషయంలోనూ అదే పం థాను అనుసరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా పార్టీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులపై స్పష్టత ఇస్తున్నారు. ఈ నెల 20న సిద్దిపేటలో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల సభలో కేసీఆర్ ప్రసం గిస్తూ మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డిని 5 లక్షల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరా రు. శుక్రవారం మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్ నియోజకవర్గాల్లో జరిగిన ప్రచార సభల్లో మహబూబాబాద్ ఎంపీగా అజ్మీరా సీతారాం నాయక్‌ను 4–5 లక్షల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇలా రెండు లోక్‌సభ స్థానాలపై కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. తద్వారా లోక్‌సభ ఎన్నికల్లోనూ సిట్టింగ్‌లకు కచ్చితంగా టికెట్లు లభిస్తాయనే భరోసా ను ఆయా నేతల్లో కల్పిస్తున్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేలా లోక్‌సభ సభ్యులు పూర్తిస్థాయిలో పని చేస్తారనే వ్యూహంతోనే కేసీఆర్ ముందుగానే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు మినహా... గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం మెదక్ ఎంపీగా కేసీఆర్ రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి (కాంగ్రెస్), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), చామకూర మల్లారెడ్డి (టీడీపీ) టీఆర్ఎస్లో చేరారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇద్దరు లోక్‌సభ సభ్యులకు పోటీ చేసే అవకాశం కల్పించింది. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి, మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డిని మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దింపింది. టీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో 90 శాతం మంది సిట్టింగ్‌లకు పోటీ చేసే అవకాశం కల్పించిన తరహాలోనే పార్టీలోని మిగిలిన ఎంపీలకు కూడా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించేలా కేసీఆర్ వరుసగా ప్రకటనలు చేయనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ తర్వాతే టీఆర్ఎస్ మేనిఫెస్టో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో వెల్లడిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాతే టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికను విడుదల చేయాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేసింది. శనివారం ఈ ముసాయిదాను కేసీఆర్‌కు సమర్పించాలని ముందుగా నిర్ణయించింది. అయి తే ఈ కార్యక్రమం వాయిదా పడింది. త్వరలోనే ముసాయిదా ను కేసీఆర్‌కు సమర్పించనున్నట్లు తెలిసింది. కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం ఆదివారం నుంచి మొదలవుతోంది. ఈ నెల 28 వరకు వరుస షెడ్యూల్ ఇప్పటికే సిద్ధమైంది. దీంతో ఆలోపు మేనిఫెస్టో వెల్లడయ్యే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా మేనిఫెస్టోలోని కీలక విషయాలను కేసీఆర్ ఇప్పటికే వెల్లడించారు. అక్టోబర్ 16న పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. రూ.లక్ష రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రైతు బంధు సాయం రూ.10 వేలకు పెంచడం, ఆసరా పింఛన్ల మొత్తం రెట్టింపు వంటి కీలక హామీలను వెల్లడించారు. అనంతరం ప్రచారంలో భాగంగా పలు హామీలను ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపును ప్రచార సభలోనే ప్రకటించారు. మేనిఫె స్టోను వెల్లడించకుండా ఒక్కొక్కటిగా ప్రచారం లోనే చెప్పాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలి సింది. కాంగ్రెస్ మేనిఫెస్టో వెల్లడించిన తర్వాతే పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
పొలిటికల్ గేమ్‌లో నిలిచేదెవరు ? గెలిచేదెవరు?
-
ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు
చేవెళ్ల, న్యూస్‌లైన్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడంలేదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. మండల కేంద్రం లోని బస్‌స్టేషన్ వద్ద శనివారం నమోః చాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒంటరిగానే పోటీచేస్తామని పునరుద్ఘాటించారు. అభ్యర్థుల ఎంపికకు పార్టీ నాయకత్వం కసరత్తు ముమ్మరం చేసిందని, ఈనెల రెండో వారంలోగా జాబితా విడుదలవుతుం దని తెలిపారు. ప్రస్తుత సరళి, ప్రజల్లో చైతన్యం, మనోగతాన్ని చూస్తే బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. కొంతమంది రాజకీయ లబ్ధి, వ్యక్తిగత స్వార్థంతోనే పార్టీలు మారుతున్నారే తప్ప తెలంగాణకోసం కాదన్నారు. గుజరాత్‌ను ప్రపంచదేశాలు పొగిడేలా అభివృద్ధి చేసిన నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి కాంగ్రెస్‌పార్టీని అధికారం నుంచి కూకటివేళ్లతో పెకిలించి వేస్తేనే ఈ దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. టీ అమ్మడం నేరంకాదని, దేశాన్ని అమ్మడమే నేరమనే నినాదంతోనే ఎన్నికలకు వెళ్తున్నట్లు వివరిం చారు. తాను చేవెళ్ల లోక్‌సభ టికెట్‌ను ఆశిస్తున్నానని, ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసినట్లు చెప్పారు. టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరంలేదని, గెలిపించడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కంజర్ల ప్రకాష్, అత్తెల్లి విఠల్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ప్రభాకర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ జంగారెడ్డి, మండల అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, సీనియర్ నాయకులు కుంచం శ్రీనివాస్, దేవర ఎల్లారెడ్డి, గోపాల్‌రెడ్డి, ఎత్భార్పల్లి శేఖర్‌రెడ్డి, అనంతరెడ్డి పాల్గొన్నారు.