జమ్మూకశ్మీర్ బీజేపీలో అభ్యర్థుల జాబితా రగడ
44 మందితో లిస్ట్ విడుదల చేసిన అధిష్టానం
పారాచూట్లకే సీట్లా అని బీజేపీ నేతల ఆందోళన
జాబితా రద్దు చేసి తాజాగా 16 మంది పేర్ల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన బీజేపీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. తొలుత అధిష్టానం 44 మందితో జాబితా విడుదల చేసింది. ఆ జాబితాపై జమ్మూలో కమలం శ్రేణులు భగ్గుమన్నాయి. ఇతర పారీ్టల నుంచి వచి్చన వారికే టిక్కెట్లు ఇచ్చారంటూ పార్టీ కార్యాయంలో ఆందోళనకు దిగారు. వారికి సమాధానం చెప్పలేక పార్టీ అధ్యక్షుడు తన కార్యాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సి వచి్చంది. చివరికి ఆ జాబితాను రద్దు చేసి..16 మంది పేర్లతో మరో జాబితాను వెలువరించింది.
రగడ రాజుకుందిలా..!
పదేళ్ల తర్వాత జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ అధిష్టానం మొత్తం మూడు జాబితాలు విడుదల చేసింది. మూడు దశలకు కలిపి మొత్తం 44 మంది పేర్లను ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడగానే జమ్మూలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ కోసం జెండాలు మోసిన వారిని కాదని, ఇతర పారీ్టల నుంచి వచి్చన ‘పారాచూట్’లకు టికెట్లు ఇచ్చారంటూ ఆందోళకు దిగారు.
18 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనను పక్కనబెట్టి, ఇటీవలే పారీ్టలోకి వచి్చన ఓ వ్యక్తికి టికెట్ ఇవ్వడమేంటని బీజేపీ ఎస్‌సీ మోర్చా అధ్యక్షుడు జగదీశ్ భగత్ నిలదీశారు. అసంతృప్తులకు సమధానం చెప్పుకోలేక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా తన క్యాబిన్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెపె్టంబర్ 18న జరగనున్న తొలి దశ ఓటింగ్‌పై మాత్రమే దృష్టి సారించామని, ప్రతి కార్యకర్తతో తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని వివరించారు. తామంతా ఒక కుటుంబమని చెప్పారు.
వెనక్కి తగ్గిన అధిష్టానం
కార్యకర్తల ఆందోళన విషయంపై ఆదివారం సాయంత్రం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఈ విషయం చర్చించింది. తొలుత విడుదల చేసిన 44 మంది పేర్లను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి తొలగించింది. రెండు గంటల తర్వాత తొలి దశలో పోటీ చేయనున్న 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత కొంకర్‌నాగ్ నుంచి చౌదరి రోషన్ హుస్సేన్ ఒకే ఒక్క పేరుతో మరో జాబితా విడుదల చేసింది.
ఇందులో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతోపాటు మహిళా అభ్యర్థి షగున్ పరిహార్ పేరుంది. పరిహార్ సోదరులు బీజేపీలో కొనసాగుతున్నారు. షగున్ తండ్రి అజిత్ పరిహార్, అజిత్ సోదరుడు అనిల్ పరిహార్‌లను 2018లో ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. తొలిదశ పోలింగ్ కోసం నామినేషన్లకు ఈనెల 27 ఆఖరు తేదీ. కశీ్మర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు సెపె్టంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు అక్టోబర్ 4న వెలువడనుండటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment