dissatisfaction
-
బీజేపీ దళిత వ్యతిరేకి
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌లో కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడం పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తంచేశారు. దళితుల హక్కులు, ప్రయోజనాలను కాపాడే బాధ్యత కలిగిన కమిషన్‌లో ఖాళీలను భర్తీ చేయకపోవడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రెండు కీలక పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉంటున్నప్పటికీ పట్టించుకోవడం లేదంటే అధికార బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. దళితుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని గుర్తుచేశారు. కమిషన్‌ను ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చడం రాజ్యాంగంపై, దళితుల సామాజిక హక్కులపై ప్రత్యక్షంగా దాడి చేయడమే అవుతుందని తేల్చిచెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలని, కమిషన్‌లో ఖాళీలను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కమిషన్ అచేతనంగా మిగిలిపోతే దళితులు సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. వారి ఫిర్యాదులపై ఎవరు స్పందించారని ప్రశ్నించారు. -
ఎయిర్ ఫోర్స్ వన్ కోసం పాత విమానాలకు మార్పులు చేయిస్తాం
వాషింగ్టన్: కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం బోయింగ్ కంపెనీ ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలను అందజేయడంలో ఆలస్యం చేస్తుండటంపై అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా బోయింగ్ పాత విమానాలను కొనుగోలు చేసి, వాటిని అవసరాలకు అనుగుణంగా మార్చనున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి పర్యటనల కోసం ప్రత్యేకంగా వాడే ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానాలను బోయింగ్ కంపెనీ రూపొందిస్తుంది. రెండు విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఖరీదు చాలా ఎక్కువైందంటూ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలో కాంట్రాక్టును మార్చారు. మారిన నిబంధనల ప్రకారం 2024లోనే బోయింగ్ మొదటి విమానాన్ని అందజేయాల్సి ఉంది. కానీ, ఉద్యోగుల సమ్మె, కరోనా మహమ్మారి వంటి కారణాలతో ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి పనులు నిలిచిపోయాయి. తాజా అంచనాల ప్రకారం, మొదటిది 2027లో, 2028లో ట్రంప్ పదవి నుంచి దిగిపోయే సమయానికి రెండో విమానం అందుతుంది. 35 ఏళ్లనాటి బోయింగ్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానంలో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..బోయింగ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాంట్రాక్టుకు ప్రత్యామ్నాయం చూస్తున్నామన్నారు. యూరప్ కంపెనీ ఎయిర్ బస్ నుంచి కొంటారా అన్న ప్రశ్నకు ఆయన.. అలాంటిదేమీ లేదన్నారు. విదేశీ కంపెనీ కంటే స్వదేశీ కంపెనీకి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బోయింగ్ కంపెనీకే చెందిన వాడిన విమానాన్ని కొని, దానిలో మార్పులు చేయిస్తామని చెప్పారు. ఖరీదు ఎక్కువనే కారణంతో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో డిజైన్ చేసిన కొత్తతరం వీసీ–25బీ రకం విమానాలను సైతం ట్రంప్ తిరస్కరించారు. గాలిలో ఉండగానే ఇంధనం నింపుకునే సౌకర్యంతోపాటు అధ్యక్షుడికి అవసరమైన మరెన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇలా ఉండగా, అధ్యక్షుడు ట్రంప్ శనివారం బోయింగ్ 747–800 రకం కొత్త విమానాన్ని పరిశీలించారని వైట్ హౌస్ తెలిపింది. ఇందులో అత్యాధునిక హార్డ్‌వేర్, ఇతర సాంకేతిక ప్రత్యేకతలను ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా, పామ్‌బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కు చేసిన ఉన్న ఖతార్ రాజకుటుంబానికి చెందిన 15 ఏళ్లనాటి ప్రైవేట్ విమానం లోపల కూడా ఆయన తిరిగి చూశారని తెలిపింది. -
తూచ్ పదహారే..!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన బీజేపీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. తొలుత అధిష్టానం 44 మందితో జాబితా విడుదల చేసింది. ఆ జాబితాపై జమ్మూలో కమలం శ్రేణులు భగ్గుమన్నాయి. ఇతర పారీ్టల నుంచి వచి్చన వారికే టిక్కెట్లు ఇచ్చారంటూ పార్టీ కార్యాయంలో ఆందోళనకు దిగారు. వారికి సమాధానం చెప్పలేక పార్టీ అధ్యక్షుడు తన కార్యాలయంలోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సి వచి్చంది. చివరికి ఆ జాబితాను రద్దు చేసి..16 మంది పేర్లతో మరో జాబితాను వెలువరించింది. రగడ రాజుకుందిలా..! పదేళ్ల తర్వాత జమ్మూకశీ్మర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీజేపీ అధిష్టానం మొత్తం మూడు జాబితాలు విడుదల చేసింది. మూడు దశలకు కలిపి మొత్తం 44 మంది పేర్లను ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడగానే జమ్మూలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ కోసం జెండాలు మోసిన వారిని కాదని, ఇతర పారీ్టల నుంచి వచి్చన ‘పారాచూట్’లకు టికెట్లు ఇచ్చారంటూ ఆందోళకు దిగారు. 18 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనను పక్కనబెట్టి, ఇటీవలే పారీ్టలోకి వచి్చన ఓ వ్యక్తికి టికెట్ ఇవ్వడమేంటని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జగదీశ్ భగత్ నిలదీశారు. అసంతృప్తులకు సమధానం చెప్పుకోలేక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా తన క్యాబిన్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెపె్టంబర్ 18న జరగనున్న తొలి దశ ఓటింగ్‌పై మాత్రమే దృష్టి సారించామని, ప్రతి కార్యకర్తతో తాను వ్యక్తిగతంగా మాట్లాడుతానని వివరించారు. తామంతా ఒక కుటుంబమని చెప్పారు.వెనక్కి తగ్గిన అధిష్టానం కార్యకర్తల ఆందోళన విషయంపై ఆదివారం సాయంత్రం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఈ విషయం చర్చించింది. తొలుత విడుదల చేసిన 44 మంది పేర్లను పార్టీ అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి తొలగించింది. రెండు గంటల తర్వాత తొలి దశలో పోటీ చేయనున్న 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత కొంకర్నాగ్ నుంచి చౌదరి రోషన్ హుస్సేన్ ఒకే ఒక్క పేరుతో మరో జాబితా విడుదల చేసింది. ఇందులో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతోపాటు మహిళా అభ్యర్థి షగున్ పరిహార్ పేరుంది. పరిహార్ సోదరులు బీజేపీలో కొనసాగుతున్నారు. షగున్ తండ్రి అజిత్ పరిహార్, అజిత్ సోదరుడు అనిల్ పరిహార్‌లను 2018లో ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. తొలిదశ పోలింగ్ కోసం నామినేషన్లకు ఈనెల 27 ఆఖరు తేదీ. కశీ్మర్లోని 90 అసెంబ్లీ స్థానాలకు సెపె్టంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు అక్టోబర్ 4న వెలువడనుండటం తెలిసిందే. -
విజయనగరం టీడీపీలో మంత్రి పదవుల చిచ్చు
ఏపీ నూతన మంత్రివర్గంలో పదవుల పందేరం విజయనగరం జిల్లాలో అసంతృప్తి జ్వాలలకు కారణం అయింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల టీడీపీ వాట్సప్ గ్రూపుల్లో పార్టీ కార్యకర్తలు నాయకత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి పదవులు దక్కని వారంతా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు తీరుపై మండిపడుతున్నారు. విజయనగరం రాజు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు?ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ కూర్పుతో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో మంటలు రేగుతున్నాయి. మంత్రి పదవులు తప్పనిసరిగా దక్కుతాయనుకున్నవారికి పార్టీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. చంద్రబాబు, బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చల వరకు మంత్రి పదవులు లిస్ట్ లో చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన పేర్లు ఉన్నాయని స్థానికంగా ప్రచారం జరిగింది.అయితే అనూహ్యంగా గవర్నర్ కు ఇచ్చిన జాబితాలో వీరిద్దరి పేర్లు మాయం అయ్యాయి. సీనియర్లకు బదులుగా ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీలోకి వచ్చి టికెట్ కొట్టేసిన ఎన్.ఆర్.ఐ, గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కింది. పార్టీ కోసం ఏనాడు పనిచేయని శ్రీనివాస్ కు మంత్రి పదవి ఎలా ఇస్తారని సీనియర్ లు దుమ్మెత్తి పోస్తున్నారు.విజయనగరం జిల్లా రాజకీయాల్లోకి కళా వెంకట్రావు రాకను అశోక్ గజపతిరాజు తొలినుండి అడ్డుకుంటూనే ఉన్నారు. కళా వెంకటరావు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి వీళ్ల మద్య విభేదాలు ఉన్నాయనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల టికెట్ ఆశించిన కళావెంకటర్రావుని విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి పోటీకి దింపారు.ఇక్కడ బొత్స సత్యన్నారాయణపై గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని చంద్రబాబు చెప్పినట్టు అప్పట్లో జిల్లాలో వార్తలు వినిపించాయి. చంద్రబాబు హామీ మేరకు..ఎన్నికల్లో విజయం సాధించిన కళావెంకటరావు మంత్రి పదవి ఆశించారు. విజయనగరం జిల్లా టిడిపిలో కూడా కళాకే మంత్రి పదవి అంటూ హోరెత్తించారు. మరో పక్క బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయనకు కూడా చంద్రబాబు మంత్రి పదవి హామీ ఇచ్చారని ఎన్నికల ప్రచారంలోనే ఆయన చెప్పుకున్నారు.ఇక్కడే జిల్లాలో సీనియర్ నేత, మాజీ కేంద్రం మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. బొబ్బిలి రాజులకు విజయనగరం రాజులకు ఉన్న శతాబ్దాల వైరం కారణంగా.. ఇప్పుడు బొబ్బిలి రాజ వంశస్తుడు అయిన బేబినాయనకి మంత్రి పదవి దక్కకుండా అశోక్గజపతరాజు అడ్డు చక్రం వేశారని సమాచారం. ఇదే విషయం బొబ్బిలి టిడిపి వాట్సప్ గ్రూపుల్లో హల్ చల్ చేసింది. దీనికి బేబినాయన కూడా వాయిస్ మెసేజ్ ద్వారా కేడర్ కు సమాధానం చెప్పుకున్నారు.రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావుకు, అశోక్ గజపతిరాజు, ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులతో గతంలో ఉన్న విభేదాలే ఆయనకు మంత్రి పదవిని దూరం చేశాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నుండి కళా వెంకటరావును అచ్చెన్నాయుడు తరిమేయగా, విజయనగరం జిల్లాలో బొత్స సత్యన్నారాయణ లాంటి ఉద్దండుడుపై ఓటమి తప్పదనే పోటీకి అవకాశం ఇచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కళా వెంకటరావు గెలిచారు. అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి రాకుండా అశోక్ గజపతి రాజు అడ్డుకున్నారంటూ జిల్లాలో చర్చసాగుతోంది.రాజాం, ఎస్.కోట నియోజకవర్గాల నుండి గెలిచిన కొండ్రు మురళీ మోహన్, కోళ్ల లలిత కుమారి కూడా మంత్రి పదవి ఆశించిన వారిలో ఉన్నారు. సామాజికవర్గం ప్రాధాన్యతల దృష్ట్యా అవకాశం కోసం లాబీయింగ్ చేసుకున్నా వీళ్లకూ అశోక్ గజపతి రాజు ఆశీస్సులు దక్కలేదు. విజయనగరం జల్లాలో మంత్రిపదవులు ఆశించి భంగపడ్డ సీనియర్ల అసంతృప్తికి అశోక్ గజపతిరాజే కారణం అని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. -
క్షమించే ఉదారగుణం మాకు లేదు
న్యూఢిల్లీ: తమ సంస్థ ఉత్పత్తుల వాణిజ్య ప్రకటనల విషయంలో మరోసారి ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడబోమంటూ యోగా గురు రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ తాజాగా సమరి్పంచిన బేషరతు క్షమాపణల అఫిడవిట్లపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. మీ క్షమాపణలను అంగీకరించే ఉదారగుణం మాకు లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంలో నాలుగైదేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ ఉద్దేశపూర్వకంగా కళ్లు మూసుకుందని కోర్టు ఆగ్రహంవ్యక్తంచేసింది. తమ క్లయింట్లు ఇద్దరూ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెబుతుండగా.. ‘ ఆ సారీలను మేం అంగీకరించట్లేము. కోర్టు ఆదేశాలను పాటిస్తామంటూ మీ క్లయింట్లు ఇచి్చన పాత అఫిడవిట్లకు మీ క్లయింట్లే ఏమాత్రం విలువ ఇవ్వనప్పుడు తాజా అఫిడవిట్లకు మేం మాత్రం ఎందుకు విలువ ఇవ్వాలి?. మేం కూడా అలాగే చేయొచ్చుకదా? అని జస్టిస్ హిమా కోహ్లీ ప్రశ్నించారు. విదేశీప్రయాణం పేరు చెప్పి రామ్‌దేవ్, బాలకృష్ణ ఉద్దేశపూర్వకంగా కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకున్నారని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీనీ కోర్టు తలంటింది. జిల్లా ఆయుర్వేదిక్, యునానీ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదని అథారిటీ జాయింట్ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 16వ తేదీకి వాయిదావేసింది. -
ఏపీ బీజేపీలో ముసలం.. సీనియర్ల ‘రహస్య’ భేటీ
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో ముసలం ఏర్పడింది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతపై బీజేపీ సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేసులో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజుని ప్రచారం చేస్తుండటంపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అరకుకి కొత్తపల్లి గీత, రాజమండ్రికి పురందేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు ఇస్తుండగా, ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతలు రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం పట్ల సీనియర్లు మండిపడుతున్నారు. జీవీఎల్, సోము వీర్రాజు లాంటి సీనియర్ల పేర్లు లేకుండా టీడీపీ కుట్రలపై సీనియర్లు చర్చిస్తున్నారు. చంద్రబాబు కోసం పనిచేసే నేతలకి సీట్ల ప్రాధాన్యతపై కూడా చర్చిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసేవారికి ప్రాధాన్యతనివ్వాలని సీనియర్లు అంటున్నారు. ఇదీ చదవండి: బాబు కన్నింగ్.. ఏపీ బీజేపీ గగ్గోలు ! -
అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏ పార్టీలోనైనా కొన్ని అసంతృప్తులు సహజమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మా పార్టీ మంచి ఫామ్‌లో ఉంది కాబట్టే.. పోటీ చేయటానికి నాయకులు పెద్దసంఖ్యలో వస్తున్నారన్నారు. ‘‘అసంతృప్తుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసంతృప్తులు లేకపోతే అది చెల్లని పార్టీ అనుకుంటారు’ అని పేర్కొన్నారు. జనవరిలో విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబోతున్నాం. అంబేద్కర్ ఆశయ సాధనలో వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముందుంటుందని సజ్జల అన్నారు. ఇదీ చదవండి: కులం పేరిట బాబు విష రాజకీయం -
పెద్ద పదవులు కోరుకోవడం లేదు: నితీశ్
పాట్నా: గత వారం ఢిల్లీలో జరిగిన విపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పట్ల తాను అసంతృప్తితో ఉన్నానంటూ వెలువడిన వార్తలను బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ ఖండించారు. తమ కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు త్వరలోనే పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యరి్థగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్ సోమవారం పాటా్నలో మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా తనకు పెద్ద కోరికలేవీ లేవని తెలిపారు. పెద్ద పదవులను తాను ఆశించడం లేదన్నారు. ‘ఇండియా’ కూటమి నిర్ణయాలపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఉద్ఘాటించారు. జేడీ(యూ) నేతల మధ్య తీవ్ర విభేదాలున్నాయన్న ప్రచారాన్ని నితీశ్ కొట్టిపారేశారు. పారీ్టలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. -
కొలీజియం సిఫార్సుల అమలేదీ?
న్యూఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, నచి్చన జడ్జిలనే బదిలీ చేయడం, ఇతరులను పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వైఖరి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని వెల్లడించింది. 11 మంది జడ్జిలను బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేయగా, ఐదుగురిని కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఆరుగురి బదిలీ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. కొలీజియం సిఫార్సుల అమలు విషయంలో 2021 నాటి సుప్రీంకోర్టు తీర్పునకు కేంద్ర న్యాయ శాఖ కట్టుబడటం లేదని, కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్‌తోపాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు జడ్జిలుగా పలువురి పేర్లను కొలీజియం ఇటీవల సిఫార్సు చేయగా, 8 మంది పేర్లకు కేంద్రం ఇంకా ఆమోదం తెలియజేయాలని గుర్తుచేసింది. కేంద్రం జడ్జిలుగా నియమించిన వారికంటే వీరిలో కొందరు సీనియర్లు ఉన్నారని వెల్లడించింది. -
అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తి!
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంపై, అధికార బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఉందని బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌షా చెప్పారు. పరిస్థితి బీజేపీకి సానుకూలంగా ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు యావత్ పార్టీ యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడేది బీజేపీ సర్కారే అనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల సమయంలో ముఖ్యనేతలు ఆధిపత్య పోరుకు, గ్రూపులకు ఆస్కారం ఇవ్వకుండా ఐక్యంగా ముందుకెళ్లాలని ఆదేశించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సహాయ సహకారాలు అందించేందుకు జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదివారం ఖమ్మంలో ‘రైతు గోస– బీజేపీ భరోసా’బహిరంగ సభ అనంతరం రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, కోర్ కమిటీతో సమావేశమైన అమిత్‌షా ఎన్నికలకు సంబంధించిన అంశాలపై దిశానిర్దేశం చేసినట్టు పార్టీవర్గాలు వెల్లడించాయి. 5సీ ప్రాతిపదికగా పనిచేయాలి బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో పనిగట్టుకుని సాగుతున్న దుష్ప్రచారాన్ని కార్యకర్తలు ఖండిస్తూ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని షా ఆదేశించారు. రాష్ట్ర నేతల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం వద్ద రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఉన్న సమాచారం, వివిధ రూపాల్లో నిర్వహించిన సర్వేల్లో వెల్లడైన వివరాలు వెల్లడించారు. పార్టీ గెలుపు విషయంలో నాయకులు పూర్తి విశ్వాసంతో ముందుకెళ్లాలని, పార్టీ కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపాలని సూచించారు. క్లారిటీ, కాన్ఫిడెన్స్, కమిట్మెంట్, కోఆర్డినేషన్, క్రెడిబిలిటీ (5 సీ) ప్రాతిపదికగా పనిచేయాలని, ప్రజలకు అన్ని విషయాల్లో స్పష్టత ఇస్తూ నేతలు చిత్తశుద్ధి, సమన్వయంతో పార్టీపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచేలా కృషి చేయాలని చెప్పారు. అవినీతిని వెలికితీసి ప్రచారం చేయండి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అమిత్‌షా చర్చించినట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ రెండు పార్టీలతో పాటు మజ్లిస్ రాజకీయ ఎత్తుగడలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికతో సాగాలని సూచించారు. గత తొమ్మిదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు సహా వివిధ కార్యక్రమాలు, పథకాల అమల్లో బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి సంబంధించిన వివరాలు, సమాచారాన్ని వెలికితీసి వాటిని ప్రజల్లో ప్రచారం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్త నేతలు, టికెట్ దక్కనివారితో పాటు రెండు పార్టీల అసంతృప్త ద్వితీయ శ్రేణి నాయకులు, కేడర్‌ను బీజేపీలో చేర్చుకునే విషయంలో వేగం పెంచాలని చెప్పారు. ఎన్నికల మేనేజ్మెంట్, వ్యూహ, ప్రతివ్యూహాలు, ఎత్తుగడలకు సిద్ధం కావాలన్నారు. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని సూచించారు. ఎన్నికల సన్నద్ధతపై లోతుగా సమీక్ష రాబోయే 3, 4 నెలల్లో జరగనున్న అసెంబ్లీ, వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర పార్టీ సన్నద్ధతపై అమిత్‌షా సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. పార్టీపరంగా పట్టున్న, కచి్చతంగా గెలిచే అవకాశాలున్న ఎమ్మె ల్యే, ఎంపీ స్థానాలెన్ని? వీటితో పాటు బీజేపీ బలా లు కేంద్రీకరించి విజయం కోసం కృషిచేస్తున్న నియోజకవర్గాలు, పార్టీ రెండోస్థానంలో నిలిచే అవకాశాలున్న సీట్లు ఏవేవి అన్న దానిపై ఆరా తీసినట్టు సమాచారం. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్, తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు పాల్గొన్నారు. 29, 30 తేదీల్లో సమీక్ష సమావేశాలు బీజేపీ ఈ నెల 29, 30 తేదీల్లో ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది. ఎమ్మెల్యేల ప్రవాస యోజన, అసెంబ్లీ స్థానాల వారీగా బూత్ కమిటీలు, సెపె్టంబర్ 7న చలో హైదరాబాద్, నా మట్టి నా దేశం, బస్సు యాత్ర, ఓటర్ వెరిఫికేషన్, సెపె్టంబర్ 17 తదితర అంశాలపై చర్చించనుంది. పార్టీ ముఖ్య నేతలు సునీల్ బన్సల్ (మెదక్, ఖమ్మం), అరవింద్ మీనన్ (అదిలాబాద్, నిజమాబాద్), తరుణ్ ఛుగ్ (కరీంనగర్, నల్లగొండ), ప్రకాష్ జవదేకర్ (మహబూబ్‌నగర్, వరంగల్), బండి సంజయ్ (ఆదిలాబాద్), డీకే అరుణ (నిజామాబాద్) హాజరుకానున్నారు. -
కాంగ్రెస్‌లో సరికొత్త ముసలం.. సచిన్ పైలట్‌కు కోపం ఎందుకు వచ్చింది?
ఎస్.రాజమహేంద్రారెడ్డి సచిన్ పైలట్‌కు హఠాత్తుగా కోపం వచ్చింది. నాలుగున్నరేళ్లుగా లోలోపల రగిలిపోతున్న అసంతృప్తిని ఒకే ఒక్క చర్యతో బలంగా బహిర్గతం చేశారు. ఎంత బలంగా అంటే, కాంగ్రెస్ అధిష్టానం కంగుతినేంతగా! రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఉక్కిరిబిక్కిరయ్యేంతగా! మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె అవినీతిపై విచారణకు ఆదేశించకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ గహ్లోత్ తీరును బాహాటంగానే దుయ్యబట్టిన పైలట్ ఈ నెల 11న ఏకంగా ఒక రోజు నిరసన దీక్షకు కూడా కూర్చున్నారు! అధిష్టానం హెచ్చరించినా, బుజ్జగించినా ఆయన ససేమిరా అన్నారు. దీన్ని ఏమీ పట్టించుకోనట్టుగా గహ్లోత్ పైకి గాంభీర్యం ప్రదర్శించినా లోలోపల తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. స్వపక్షీయుడే అయిన మాజీ కేంద్ర మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం అయిన పైలట్ ప్రతిపక్షంలా తనపైనే దాడికి దిగడం గహ్లోత్‌కు అసలు మింగుడు పడలేదు. ఎవరేమనుకున్నా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి కావాలన్న తన లక్ష్యాన్ని పైలట్ కాస్త గట్టిగానే వినిపించారు. ఒకవిధంగా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టారన్నమాట! సీఎం పదవిపై ఉన్న కాంక్షను వెలిబుచ్చడం ఒకటైతే, ప్రస్తుత ముఖ్యమంత్రి గహ్లోత్, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజెల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని వేలెత్తిచూపడంరెండోది. అంతా బాగుందనుకున్న రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఇది సరికొత్త ముసలం...! ► గహ్లోత్–పైలట్ తలనొప్పిని ఎలా పరిష్కరించాలో తెలియక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకు కూర్చుంది. ఇలాంటి అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో ఆరితేరిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం ఎవరినీ ఏమీ అనలేక, మధ్యేమార్గంగా ‘మేజర్ సర్జరీ’తో వివాదం సద్దుమణిగేలా చేస్తామన్నారు. అయితే ఆ శస్త్రచికిత్స ఎప్పుడు, ఎలా అన్నది మాత్రం దాటవేశారు. బహుశా సోనియా, రాహుల్‌గాంధీల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టుంది. పైలట్‌లో ఈ రీతిన అసంతృప్తి పేరుకుపోవడానికి అధిష్టానం వైఖరే కారణం. రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా 2018లో పార్టీని విజయపథాన నడిపించిన పైలట్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినట్టే పెట్టి, గహ్లోత్ చాణక్యానికి తలవంచడం అసంతృప్తిని రాజేసింది. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆనందం ఆవిరవకుండా పైలట్‌ను బుజ్జగించి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మమ అనిపించారు. సందర్భాన్ని బట్టి అప్పట్లో ఆ పదవితో పైలట్ సంతృప్తి పడినట్టు కనిపించినా రెండేళ్లు తిరిగేసరికి తనను తాను సర్దిబుచ్చుకోలేక రాజీనామా చేసి అసంతృప్తిని వెళ్లగక్కారు. తాజాగా దీక్షకు దిగి గహ్లోత్తోనూ, అధిష్టానంతోనూ అమీతుమీకే సిద్ధమయ్యానన్న సంకేతాలను పంపగలిగారు. క్రమశిక్షణ చర్యలు తప్పవని రాజస్తాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఎస్.ఎస్.రణ్‌ధవా నేరుగానే హెచ్చరించారు. అయితే పైలట్ మాత్రం ఇవన్నీ పట్టించుకునే స్థితిలో ఉన్నట్టు లేదు. ఈసారి సీఎం పదవి చేజారితే మరో ఐదున్నరేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందని ఆయన భయం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ గహ్లోత్‌నే సీఎంగా చూడటం పైలట్‌కు సుతరామూ ఇష్టం లేదు. మరోవైపు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతున్న రాజస్తాన్ పడవ వివాదాల సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోవడం కాంగ్రెస్ అధిష్టానానికి రుచించడం లేదు. గహ్లోత్‌ను మళ్లీ సీఎం పదవి నుంచి తప్పించడానికి అధిష్టానం విముఖంగా ఉంది. ఎన్నికల ముందు సీఎంను మార్చి ఓటర్లను గందరగోళంలో పడేయడం తప్పుడు సంకేతాలను పంపినట్టవుతుందని భావిస్తోంది. గహ్లోత్‌పై పైలట్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చడం కూడా కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టం లేదు. పంజాబ్‌లో సిద్ధూ ఉదంతం అక్కడి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్నిచ్చిందో కాంగ్రెస్‌కు అనుభవమే కాబట్టి మరోసారి అదే తప్పును పునరావృతం చేయడానికి సాహసించడం లేదు. అయితే ఈ సాకులన్నీ తనను మోసగించడానికేనని పైలట్ గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అంతర్గత పోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేయడం గమనార్హం. ఇప్పటికిప్పుడు బీజేపీ పరిస్థితి అమాంతం మెరుగయ్యేలా లేకపోయినా కులం కార్డు తమకు ఈసారి లాభిస్తుందని కమలనాథుల ఆశ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీపీ జోషి (బ్రాహ్మణ్), బీజేపీ పక్ష నాయకుడిగా రాథోడ్ (రాజ్‌పుత్), ఉప నాయకుడిగా సతీశ్ పునియా (జాట్)లను నియమించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. పథకాలను నమ్ముకున్న గహ్లోత్ 2018 నుంచి ఇప్పటిదాకా తను ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలు 2023లో మరోసారి విజయం అందిస్తాయని గహ్లోత్ దృఢంగా నమ్ముతున్నారు. పార్టీలకు అతీతంగా ఇతర నాయకులతో తనకున్న సత్సంబంధాలు కూడా విజయావకాశాలను ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తున్నారు. ఇటీవలే వందేభారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఒక అడుగు ముందుకేసి గహ్లోత్ గుణగణాలను ప్రశంసించడం గమనార్హం. అయితే మరో ఆరేడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే గహ్లోత్–పైలట్ తమ విభేదాలను పక్కన పెట్టి సామరస్యంగా పనులు చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇదే కోరుకుంటోంది. కానీ వారు బహిరంగంగానే సై అంటే సై అనుకోవడం కాంగ్రెస్‌పై ఓటర్లకున్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉంది. వివాదాలను తెగేదాకా లాగడం కాంగ్రెస్ అధిష్టానానికి అలవాటుగా మారింది. సెప్టెంబరులోనే అధికార మార్పిడికి ఒకసారి విఫలయత్నం చేసి చేతులెత్తేసిన గాంధీలు మరోసారి అలాంటి సాహసానికి దిగే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. ఖర్గే కూడా గాంధీల మార్గంలోనే పయనిస్తున్నారు. ఉన్నపళంగా పైలట్‌ను సీఎం చేసే దుస్సాహసానికి ఒడిగట్టే స్థితిలో ఆయన కూడా లేరు. పైలట్ కూడా ఇప్పటికిప్పుడు సీఎం పీఠం అధిష్టించాలన్న ఆలోచనలో లేరు. తాను వచ్చే ప్రభుత్వానికి ‘పైలట్’ కావాలని మాత్రమే కోరుకుంటున్నారు. 2020లో తిరుగుబాటు చేసినప్పుడు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో పైలట్ విఫలమై ఉన్న డిప్యూటీ సీఎం పదవి కూడా వదులుకున్నారాయన. ప్రస్తుతం ఆయన ముందున్న లక్ష్యం మరోసారి ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షునిగా ఎంపికై తన మద్దతుదార్లకు ఎక్కువ టికెట్లు ఇప్పించుకోవడం ఒక్కటే! అదీ అధిష్టానం అనుకూలంగా ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ తాజా దీక్షతో ఆ అవకాశం కూడా పైలట్ చేజారినట్టు కన్పిస్తోంది! ఇక పైలట్‌కు మిగిలింది... ► చిన్న పార్టీలైన హనుమాన్ బెనీవాల్ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీలతో జతకట్టి స్వతంత్రంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం. ► సొంతంగా ప్రాంతీయ పార్టీ స్థాపించి భావసారూప్యం గలవారిని చేర్చుకోవడం. ► పైలట్ గుజ్జర్ వర్గానికి చెందిన వారు కాబట్టి గుజ్జర్ల ఓట్లతో గెలవగలిగిన మొత్తం 30 అసెంబ్లీ సీట్లపైనా పూర్తిగా పట్టు బిగించడం. ► ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయడం. అయితే రాజకీయాల్లో తనకన్నా జూనియర్ అయిన కేజ్రీవాల్‌తో కూడటం ఆయనకు రుచించకపోవచ్చు. ► కాంగ్రెస్‌లోనే ఉంటూ పోరాటం కొనసాగిస్తూనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం. కొసమెరుపు.. రాజస్తాన్ ప్రభుత్వాన్ని పైలట్‌గా ముందుండి నడిపించాలన్న సచిన్ ఆశ నెరవేరుతుందో లేదో ఇప్పటికిప్పుడే చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం. కాంగ్రెస్ గనక ఈసారి ఆయన లేకుండా ఎన్నికల బరిలోకి దిగితే 2013లో వచ్చిన 21 సీట్లు కూడా రాకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా. అంటే సచిన్ కాస్త కష్టపడితే రాష్ట్రానికి ‘పైలట్’ అవుతారనే కదా!! -
బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలంటూ ఆవేదన
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో పదవులు వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయని దాదాపు నెలరోజుల క్రితం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా విస్తతస్థాయి సమావేశం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హామీ ఇచ్చారు. పదవులు నడచుకుంటూ రావడం కాదు కదా.. ఇప్పటివరకు కనీసం జిల్లా, డివిజన్‌స్థాయి కార్యవర్గాలు సైతం ఏర్పాటు కాకపోవడంతో ఆయా నేతల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నా లోలోపలే అణచుకుంటున్నారు. అవి ఏ క్షణాన్నయినా భగ్గుమనేలా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. పెద్దస్థాయి నేతలు కొందరికి పదవులుంటే సరిపోతుందా? డివిజన్లలో స్థానికంగా పనిచేసే తమకు ఎలాంటి పదవి, గుర్తింపు లేకుంటే తమను గుర్తించేదెవరు? అని పలు డివిజన్ల నేతలు ఆవేదన చెందుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేదెలా? గ్రేటర్‌లోనే ఉన్న ఇతర జిల్లాల్లో నామినేటెడ్ పదవులు ఇస్తున్నా హైదరాబాద్ జిల్లా వారికి మాత్రం నామినేటెడ్ పదవులు కాదు కదా కనీసం పార్టీ కమిటీలు కూడా పూర్తిగా భర్తీ చేయకపోవడంతో నేతలు తీవ్ర నిరాశా నిస్పహల్లో మునిగారు. పదవులు నడచుకుంటూ వచ్చేది ఎప్పుడు.. పైస్థాయిలోని కొందరికి మాత్రం పదవులుంటే సరిపోతుందా.. అసెంబ్లీ ఎన్నికలు ఏ క్షణాన వస్తాయో తెలియని పరిస్థితి. ఈలోగా ఎలాంటి పదవులు లేకుంటే తాము ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. నోటిఫికేషన్ వస్తే నామినేటెడ్ పోస్టులెలాగూ ఇవ్వరు. అప్పటికప్పుడు డివిజన్ కమిటీలు భర్తీ చేసినంత మాత్రాన ప్రయోజనమేముంటుంది. నియోజకవర్గ స్థాయి నేతలకు నామినేటెడ్ పోస్టులు లేకుంటే తాము ప్రజల తలలో నాలుకలా పనులు చేయాలంటే.. అధికారుల వద్దకు వెళ్లి చేయించాలంటే ఏదో ఒక పదవి కనీసం ఉండాలి కదా? అని గోషామహల్ నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు వేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘హస్తం’లో కొత్త కోణం.. ఏళ్లుగా వైరం.. సేవ్ కాంగ్రెస్‌తో ఒక్కటైన వైనం అంతర్మథనంలో పార్టీ శ్రేణులు.. క్రమశిక్షణో, అధిష్టానానికి భయపడో బీఆర్ఎస్లో ఇప్పటి వరకు ఎలాంటి అసమ్మతి సెగలు బయటకు కనిపించలేదు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యే స్థాయి నాయకులే మంత్రి తీరుపై తమ అసమ్మతి, అసంతప్తి గళాల్ని వినిపించడంతో ఎలాంటి హోదా, పదవులు లేని తాము ఎలా పనిచేయగలమని పలు డివిజన్లు, నియోజకవర్గాల స్థాయి నేతలు తీవ్ర అసంతప్తితో ఉన్నారు. ప్రభుత్వం ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినప్పుడు అగ్రనేతలకు క్షీరాభిషేకాలు, భారీ ఊరేగింపులు, కటౌట్ల ఏర్పాట్లవంటి పనులే తమకు సరిపోతున్నాయని, తమను పట్టించునే నాయకుడే లేకుండా పోయారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్ స్థాయి నేతలు సైతం ఏదో ఒకదశలో రగులుతున్న తమ బడబాగ్నిని బహిరత్గం చేసే అవకాశం లేకపోలేదని జిల్లా స్థాయి నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు, జిల్లా మంత్రి డివిజన్ నేతల మనోగతాన్ని అర్థం చేసుకొని వివిధ కమిటీలు భర్తీ చేయాలని, నామినేటెడ్ పోస్టులిప్పించాలని వివిధ స్థాయిల నేతలు కోరుతున్నారు. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే.. మరోవైపు, ఆయా స్థాయిల నేతలకు పొసగడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలోకొచ్చే ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే లేకుండా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు మేయర్ గోబ్యాక్ అంటూ ఆందోళనలు చేశారు. నియోజక వర్గాల సమ్మేళనాలెప్పుడో? రెండు మూడు రోజుల్లో నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనాలు ఖరారు చేస్తామని ప్రకటించి నెలరోజులవుతోంది. ఇంతవరకు ఆ ఊసే లేదు. అనేక డివిజన్లలో పార్టీ కమిటీల్లేవు. ఏడాది కిందట ఏర్పాటు చేసిన కమిటీల్లో ఎన్ని పనిచేస్తున్నాయో తెలియదు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల నడుమ విభేదాలతో చాలా డివిజన్ల కమిటీలు నిద్రాణంగా ఉన్నాయి. చాలా డివిజన్లలో అసంపూర్ణ కమిటీలున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల్లో అన్నీ చర్చించి భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు అతీగతీ లేకపోవడంపై పార్టీ శ్రేణులు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఎంపీ గల్లా కనపడటం లేదు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నియోజకవర్గ ప్రజలకు కనపడటం లేదు. రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి వచ్చిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఎంపీ ల్యాడ్స్ నిధులు కూడా ఖర్చు చేయని పరిస్థితి ఉంది. రెండేళ్లుగా అసలు ప్రతిపాదనలే పంపలేదు. 2019–20 సంవత్సరానికి సంబంధించి ఐదు కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ కేటాయించింది. ఇందులో రూ.4.86 కోట్లకు సంబంధించి ప్రతిపాదనలు ఇచ్చినా ఇప్పటివరకూ ఖర్చు పెట్టింది రూ.కోటీ 25 లక్షలు మాత్రమే. మిగిలిన పనుల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. 2020–21 సంవత్సరంలో కోవిడ్ కారణంగా నిధులు విడుదల చేయలేదు. 2021–22 సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల నిధులు కేంద్రం కేటాయించింది. అందులో రూ.31 లక్షలకు ప్రతిపాదనలు ఇచ్చినా ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ఐదు కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. ఇప్పటికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు గడిచిపోయినా ఒక్క ప్రతిపాదన కూడా ఎంపీ నుంచి రాలేదు. అదే రాజసభ్య సభ్యునిగా ఎన్నికైన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి 2020–21కి గాను రూ.3.80 కోట్ల నిధులు తీసుకురాగా రూ.3.50 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. 2021–22 సంవత్సరానికి రూ.2.26 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ వస్తున్నారు. లోక్‌సభ సమావేశాలు లేని సమయంలో దాదాపుగా తమ నియోజకవర్గాల్లోనే పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. అయితే గుంటూరు ఎంపీ గల్లా మాత్రం దీనికి భిన్నంగా అసలు రాజకీయాల్లో ఉన్నారా లేదా అన్న డౌట్ వచ్చేలా వ్యవహరిస్తున్నారు. అమలుకానీ హామీలు.. వరుసగా రెండుసార్లు గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించినా గల్లా జయదేవ్ నియోజకవర్గ ప్రజల కోసం చేసిందేమీ లేదనే చెప్పాలి. మొదటిసారి 2014లో ఇంటికో ఉద్యోగం వచ్చేలా చేస్తానని, 2019లో తన పరిశ్రమలను గుంటూరు చుట్టుపక్కల స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలు గుప్పించారు. హామీలు అమలు చేయకపోగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఆయన కార్యాలయం కూడా ఉన్నా లేనట్లుగానే ఉంది. ఏ సమస్యపై వెళ్లినా స్పందించే వారే లేరని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందినప్పటికీ గుంటూరు పార్లమెంట్ నుంచి గెలుపొందిన గల్లా జయదేవ్ తర్వాత కాలంలో గుంటూరు మొహం చూడటం మానుకున్నారు. గెలిచిన తర్వాత అసలు నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారో అసలు జనానికే తెలియని పరిస్థితి ఉంది. అసలు గుంటూరుకు ఎంపీ ఉన్నారా అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. ఈ ఏడాదిలో రెండుసార్లు మాత్రమే జిల్లాకు వచ్చారు. అది కూడా వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు. తన అత్త దశదిన కర్మలో భాగంగా బుర్రిపాలెంకు, తన మామ సూపర్‌స్టార్ కృష్ణ అస్థికలు కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు మాత్రమే ఆయన జిల్లాలో అడుగు పెట్టారు. ఇటువంటి ఎంపీని ఎన్నుకోవడం మా ఖర్మ అని తెలుగుదేశం కేడర్ భావిస్తోంది. -
న్యాయమూర్తుల నియామకంలో జాప్యమా?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి చేసిన సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కొలీజియం సిఫార్సులపైనా నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. జడ్జీలుగా చేరకుండా నిరుత్సాహపర్చేలా వ్యవహరించవద్దని సూచించింది. పేర్లను చాలాకాలం పెండింగ్‌లో పెట్టడం ద్వారా వారి అంగీకారాన్ని బలవంతంగా వెనక్కి తీసుకొనేలా చేయడం సమంజసం కాదంది. ఉన్నత న్యాయ స్థానాల్లో ఖాళీలను నిర్దేశిత గడువులోగా భర్తీ చేయడానికి టైమ్‌ఫ్రేమ్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై స్పందించాలని ఆదేశిస్తూ కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన 11 పేర్లు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. కొలీజియం ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తే నాలుగు వారాల్లోగా న్యాయమూర్తులుగా నియమించాలని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర్వు జారీ చేసింది. -
జీవిత భాగస్వామి విషయంలో అసంతృప్తి ఉండకూడదు..!
మనిషి జీవితంలో తనకున్న వాటిలో ముఖ్యంగా మూడు విషయాల్లో ఎప్పుడూ అసంతృప్తి పొందకూడదని పెద్దలు చెబుతారు. సంతోషస్త్రిషు కర్తవ్యో కళత్రే భోజనే ధనే... వాటిలో మొదటిది కళత్రం. అంటే తనకు జీవిత భాగస్వామిగా లభించినవారు. అంటే వివాహం తరువాత తాను తాళికట్టి తెచ్చుకున్న భార్య. ఏడడుగులు వేసి సహధర్మచారిణిగా ఉంటానని భర్తగా అంగీకరించి అతని వెంట నడిచి వచ్చిన స్త్రీ. ధర్మం, అర్థం, కామం... ఈ మూడూ వారికే పరిమితం. పరస్పరం దాటి వెళ్ళడానికి వీలు లేదు. సముద్రుడు చాలా శక్తిమంతుడు. తలచుకుంటే భూమినంతటినీ ముంచెత్తగలడు. అయినా తనకు తాను ఒక నియమం పెట్టుకున్నాడు. నేను చెలియలికట్ట దాటను... అన్నాడు. అందువల్ల కెరటాలు ఒడ్డువరకు వచ్చి వెనక్కి వెళ్లిపోతాయి. అలా కాకుండా ఏ రోజయినా సునామీలాంటివి వచ్చి చెలియలికట్ట దాటితే అది చరిత్రలో భయంకరమైన రోజవుతుంది. అంటే తమలో వచ్చిన భావావేశాన్ని భార్యాభర్తలలో ఏ ఒక్కరయినా నియంత్రించుకోలేకపోతే ... అది చెలియలికట్ట దాటిన పరిస్థితి. అందుకే ఎప్పుడూ వారిరువురూ పరస్పరం పూర్తి సంతృప్తి పొంది ఉండాలి. ఏకారణం చేతనయినా వారిలో ఏ ఒక్కరికయినా అసంతృప్తి పొడసూపిందనుకోండి. అప్పుడెలా ఉండాలి... అంగవైకల్యంతో తమ కడుపున పుట్టిన బిడ్డను తల్లిగా కానీ, తండ్రిగా కానీ ఎంత ఎక్కువ శ్రద్ధతో, అధిక ప్రేమానురాగాలతో, అన్నిటికీ మించి అత్యధిక ఓర్పుతో చూసుకుంటారో భార్యాభర్తలు కూడా తమలో పుట్టిన అసంతృప్తిని దిగమింగి తమ భాగస్వామిని అంత శ్రద్ధగా చూసుకోగలగాలి. బంగారు పాత్రలో పోసుకు తాగినా పాయసమే, కడుక్కుని కుండలో పోసుకు తాగినా పాయసమే. పాత్రలు వేరయినా పాయసం మాత్రం ఒక్కటే. అందుకే జీవిత భాగస్వామిని దాటి ధర్మార్థకామములను పొందే ప్రయత్నం చేయవద్దు. అలా చేస్తే అధార్మికమైన కార్యాలపట్ల మనసు లగ్నం అవుతుంది. దానివలన ధర్మం పట్టుకోల్పోతుంది. అశాంతి కలుగుతుంది. ప్రశాంతంగా ఉండలేరు. కారణం... ఉన్నదానిలో తృప్తి లేదు. కోరుకున్నది అన్నివేళలా అందుబాటులో ఉండదు. పైగా చేయకూడనిది చేస్తున్నానేమో అన్న అపరాధ భావన వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, జీవితాలను పతనం చేస్తుంది. ‘పరస్త్రీసంగ దోషేన బహవో మరణంగతా..’ పరస్త్రీ (పరపురుషుడి) వ్యామోహం ... ఆ భావన, ఆ ఉద్వేగం, ఆ భయం... లోపల ఆ రహస్యాన్ని దాచుకోవడంలో ఉన్న ఉద్విగ్నత... అనారోగ్యానికి, అకాలమరణానికి కూడా దారితీస్తాయి. అందుకే జీవిత భాగస్వామి విషయంలో ఎప్పుడూ అసంతృప్తి అన్నమాట దరిచేరనీయవద్దు. భార్యలో భర్తకు కానీ, భర్తలో భార్యకు కానీ బలముంటే సంతోషించాలి, బలహీనతుంటే... భగవంతుడిచ్చిన పిల్లల విషయంలో చూపిన ఓర్పు, సానుభూతి, ప్రేమానురాగాలనే చూపాలి. అంతేతప్ప జీవితంలో జీవిత భాగస్వామి విషయంలో ఎప్పుడూ అసంతృప్తికి స్థానం ఇవ్వకూడదు. -
విధేయుని అసమ్మతి
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌ను వీడటం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఆయన కొంతకాలంగా పార్టీపై బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా దశాబ్దాల పాటు ఆయన పార్టీలో, ప్రభుత్వంలో ఎన్నో కీలక పదవులు అనుభవించారు. ఏ సంక్షోభాన్నయినా సులువుగా పరిష్కరిస్తారని పేరు తెచ్చుకున్నారు. ఏ రాష్ట్రంలోనైనా పార్టీలో చీలికలొచ్చినా, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్నా అధిష్టానానికి మొదట గుర్తుకొచ్చే పేరు ఆజాదే. ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇన్చార్జ్గా అంతర్గత సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరించారు. నాయకత్వంపై బహిరంగ విమర్శలు 1970లో కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచీ అర్ధ శతాబ్దం పాటు గాంధీల కుటుంబానికి వీరవిధేయుడిగా ఆజాద్‌కు పేరుంది. అలాంటి నేత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో పార్టీకి కాయకల్ప చికిత్స జరగాలనే డిమాండ్‌తో 2020లో ఏర్పాటైన జీ23 సభ్యుల గ్రూప్‌లో ఆజాద్ కీలకంగా వ్యవహరించడం ఆందరినీ విస్మయానికి లోను చేసింది. ఇప్పటికైనా మేల్కొనకపోతే పార్టీ మునిగిపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పార్టీలో కలకలం రేపాయి. నాటినుంచీ పలు సందర్భాల్లో పార్టీ నాయకులపై ఆజాద్ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా ఓటముల నేపథ్యంలో పార్టీలోని ఫైవ్ స్టార్ కల్చర్‌ను ఏకిపారేశారు. ‘టికెట్ రాగానే మా నాయకులు ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ బుక్ చేస్తారు. ఏసీ కారులేకుండా బయటకు అడుగు కూడా వేయరు. ఈ సంస్కృతి మారనిదే ఎవరూ గెలవలేరు‘‘ అన్నారు. మోదీపై ‘వీడ్కోలు’ పొగడ్తలు ఈ ఏడాది జనవరిలో కేంద్రం ఆజాద్‌కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. అప్పుడే ఆయన బీజేపీలో చేరతారన్న విశ్లేషణలు వినిపించాయి. దాన్ని ఆయన స్వీకరించరని పార్టీ ఆశించింది. కానీ ఆజాద్ మౌనమే వహించారు. ఎనిమిదిసార్లు రాజ్యసభ ఎంపీగా చేసిన ఆయన, తాజాగా ఫిబ్రవరిలో పదవీ కాలం ముగిసిన సందర్భంగా చేసిన వీడ్కోలు ప్రసంగం కూడా కలకలం రేపింది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు ప్రధాని మోదీని కూడా ఆకాశానికెత్తారు. ‘‘మోదీపై నేనెన్నోసార్లు మాటల దాడి చేశా. అయినా ఆయనెప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. అందుకు ధన్యవాదాలు. ఆయనకు కృతజ్ఞుడినై ఉంటా’’ అని చెప్పుకొచ్చారు. ఇటీవల జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవి చేపట్టడానికి ఆజాద్ నిరాకరించారు. సొంత కుంపటే! బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు ప్రస్తుతానికైతే ఆజాద్ తెరదించారు. ‘‘కశ్మీర్లో ఎన్నికలున్నందున సొంత పార్టీ పెట్టి బరిలో దిగుతా. అక్కడ గెలిచాక జాతీయ స్థాయిలో పార్టీని విస్తరిస్తా’’ అని ఓ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ పార్టీ వెనక బీజేపీ హస్తమే ఉందంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ సంబరాలకు ఫడ్నవీస్ దూరం
ముంబై: మహారాష్ట్ర సీఎం అవుతారని అంతా భావించగా బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయంతో ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్న దేవేంద్ర ఫడ్నవీస్ ఈ పరిణామంపై అసంతృప్తిగా ఉన్నారా? ఆయన వ్యవహార శైలి ఈ అనుమానాలను బలపరిచేలానే ఉందంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినందుకు శుక్రవారం రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంబరాలకు ఆయన డుమ్మా కొట్టారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా హాజరు కాబోరని సమాచారం. ఆదివారం నుంచి జరిగే రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన చర్చల్లో ఫడ్నవీస్ బిజీగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. షిండే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తామని ఆయన గురువారం ప్రకటించడం, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దాన్ని వెంటనే ఖండించడం తెలిసిందే. బీజేపీ కూడా ప్రభుత్వంలో చేరుతుందని, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అవుతారని నడ్డా ప్రకటించారు. 2014 నుంచి 19 దాకా ఐదేళ్ల పాటు ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో షిండే ఆయన కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ఇప్పుడు షిండే మంత్రివర్గంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా చేరాల్సి వచ్చింది! మరోవైపు షిండే ప్రమాణస్వీకారం ముగుస్తూనే ఎన్సీపీ నేత ధనంజయ్ ముండేతో ఫడ్నవీస్ భేటీ అయినట్టు చెబుతున్నారు. అయితే ఫడ్నవీస్ డిప్యూటీ అవడం అనూహ్యమేమీ కాదని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చెప్పుకొచ్చారు. ‘‘ఇది చాలా మందికి షాకిచ్చిందని నాకు తెలుసు. కానీ ఇందులో అనూహ్యమేమీ లేదు. హిందూత్వ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు షిండేకు సీఎం పోస్టు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. కానీ షిండే స్వయంగా ఫడ్నవీస్‌ను తన మంత్రివర్గంలో చేరాల్సిందిగా కోరారు. దాంతో ఢిల్లీ పెద్దల అనుమతితో ఆయన చేరారు’’ అని చెప్పారు. మనకింద పని చేసిన వ్యక్తి సారథ్యంలో పని చేయాలంటే ఎంతో పెద్ద మనసుండాలన్నారు. -
జాప్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లే
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) వద్ద వెయ్యికి పైగా కేసులు పెండింగ్‌లో ఉండడం పట్ల పార్లమెంటరీ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇందులో 66 కేసులు గత ఐదేళ్లకుపైగా పెండింగ్‌లోనే ఉండిపోవడం ఏమిటని ప్రశ్నించింది. న్యాయం చేకూర్చడంలో జాప్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లేనని ఉద్ఘాటించింది. కేసుల విచారణను సుదీర్ఘకాలం కొనసాగించడం సరైంది కాదని పేర్కొంది. పెండింగ్ కేసుల పరిష్కారంపై ఒక కచ్చితమైన రోడ్‌మ్యాప్ రూపొందించాలని సీబీఐకి సూచించింది. ఈ మేరకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్‌కుమార్ మోదీ నేతృత్వంలో కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీసంఘం తాజాగా తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి 1,025 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు, ఇందులో 66 కేసులు ఐదేళ్లకుపైగా పెండింగ్ ఉన్నట్లు సీబీఐ లిఖితపూర్వకంగా తెలిపిందని నివేదికలో పేర్కొంది. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి సీబీఐలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. డిప్యూటేషన్లపై ఆధారపడడం తగ్గించుకోవాలని, స్వస్తి పలకాలని, కనీసం డీఎస్పీ స్థాయి వరకు అధికారులను శాశ్వత ప్రాతిపాదికన నియమించుకొనేందుకు చర్యలు తీసుకోవాలని సీబీఐకి పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. -
కారులో కాస్త.. సౌండ్ పెరిగింది.. నెక్స్ట్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: ‘గులాబీ తోట’లో అసంతృప్తి పెరుగుతోందా? పార్టీ అధిష్టానం తమను పట్టిం చుకోవడం లేదని నేతలు భావిస్తున్నారా? టికెట్ రాకపోయినా ఎన్నికల బరిలో దిగాలనే ఆలోచనతో ఉన్నారా? నాయకత్వంతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా?.. ఈ అంశాలపై అధికార టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పార్టీ అవిర్భావం నుంచి మొదలుకుని నిన్నా మొన్నటి దాకా వివిధ పార్టీల నుంచి చేరికలతో ఓవర్ లోడ్ అయిన ‘కారు’లో అసంతృప్తి స్వరం విన్పిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా.. ముందస్తు ఎన్నికలు వస్తే తమకు టికెట్ దక్కే అవకాశాలను ఇప్పటి నుంచే బేరీజు వేసుకుంటున్న నేతలు టికెట్ సాధన దిశగా ముందస్తు జాగ్రతలు తీసుకుంటున్నారు. పార్టీలోని తమ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాల్లో ఇది ముదిరిపాకాన పడుతోంది. అటు మహబూబ్‌నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు విషయం హాట్‌టాపిక్‌గా మారుతోంది. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో 103 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం తో టీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా ఉంది. అయితే సగం నియోజకవర్గాల్లో బలమైన బహుముఖ నాయకత్వం ఉండటం సమస్యగా మారి నేతల్లో అసంతృప్తికి తావిస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడంతో పాటు సొంత పార్టీ్టలో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. కొందరు నేతలు పార్టీ టికెట్ వచ్చినా రాకున్నా పోటీలో ఉండాలనే ఉద్దేశంతో.. తమదైన శైలిలో నియోజకవర్గ స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితి వచ్చే ఎన్నికల్లో తమకు లాభిస్తుందని విపక్ష పార్టీలు ఆశిస్తుండగా, అసంతృప్తి అంశాన్ని టీఆర్ఎస్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. చర్చనీయాంశమైన ముగ్గురి భేటీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవలి కాలంలో వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నెల 8న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వనపర్తి జిల్లాలో పర్యటించగా, జూపల్లి అదే రోజు తుమ్మల, పొంగులేటితో భేటీ కావడం చర్చనీయాంశమైంది. తాను ఆయిల్‌పామ్ సాగు తీరును పరిశీలించేందుకే ఖమ్మం వెళ్లినట్లు జూపల్లి చెప్పినా, ఆ తర్వాత కొల్లాపూర్‌లో తన అనుచరులతో జూపల్లి భేటీ అయ్యారు. కొల్లాపూర్ శివారులోని ఓ తోటలో జరిగిన సమావేశంలో బీజేపీలోకి వెళ్లడం కంటే కాంగ్రెస్‌లోకి వెళ్లడమే బెటర్ అని అనుచరులు సూచించినట్టు సమాచారం. జూపల్లి మాత్రం తాను ఇప్పట్లో పార్టీ మారే ఉద్దేశం లేదని చెప్తూనే భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇచ్చినట్లు, వచ్చే ఎన్నికల్లో పోటీ తప్పదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిన తర్వాత తనకు ప్రాధాన్యత తగ్గిందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా టీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్పారు. అయితే పార్టీ అధిష్టానం తనను గుర్తించినా, లేకున్నా పోటీలో ఉండటం మాత్రం ఖాయమని ప్రకటించారు. వాస్తవానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం పొంగులేటి అసంతృప్తికి కారణమయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈసారి పరిస్థితిని అంచనా వేస్తున్న ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటూ తన కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇక తుమ్మల కూడా పార్టీ వేదికల మీద పెద్దగా కనిపించడం లేదు. పైగా పార్టీకి ద్రోహం చేస్తున్న శత్రువులు పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమయ్యింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సీనియర్ నాయకుడినైన తనను అధిష్టానం పట్టించుకోవడం లేదని తుమ్మల భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం మాదిరిగానే ఇతర చోట్లా.. వరుసగా రెండు పర్యాయాలు 2014, 2018 అసెం బ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లకు గాను టీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం ఒక్కోస్థానంలో మాత్రమే గెలుపొందారు. 2014లో జలగం వెంకట్రావు, 2018లో పువ్వాడ అజయ్ మాత్రమే విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా ప్రతి చోటా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. సిట్టింగు ఎమ్మెల్యేలకే టికెట్ దక్కే పక్షంలో తమ దారి తాము చూసు కోవాలనే భావనలో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. కాగా మెదక్‌లో పద్మా దేవేందర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, తాండూరులో రోహిత్‌రెడ్డి.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్ నాయక్.. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత మాలోత్, స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..ఎమ్మె ల్సీ కడియం శ్రీహరి నడుమ పొలిటికల్ వార్ కొన సాగుతోంది. ఇక సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారంతో స్థానిక కేడర్‌లో అయోమయం నెలకొంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పెద్దపీటపై కినుక ఆర్నెల్ల వ్యవధిలో 21 మంది ఎమ్మెల్సీలు ఎన్నికైనా తమకు అవకాశం దక్కకపోవడం కొందరు నేతలను అసంతృప్తికి గురిచేసింది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో ఖాళీలున్నా అడపాదడపా మాత్ర మే నియామకాలు జరుగుతున్నాయి. ఖాళీలు కొనసాగుతున్నా తమకు అవకాశం ఇవ్వకపోవడం ఆశావహుల్లో నిస్పృహకు తావిస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని గతేడాది అక్టోబర్‌లో జరిగిన ప్లీనరీ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినా అది కార్యరూపం దాల్చడం లేదు. పార్టీ పరంగా జిల్లా అధ్యక్ష పదవులు దక్కుతాయని భావించినా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకే పెద్దపీట వేయడాన్ని ఆశావహులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటీవలి కాలంలో పార్టీలోనూ, పాల న పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న అధి నేత కేసీఆర్‌కు పార్టీ పరిణామాలపై పూర్తి అవగాహన ఉందని, అవసరమైన సందర్భాల్లో పార్టీని ఏకతాటిపైకి తేవడం కష్టసాధ్యమేమీ కాదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
ప్రభుత్వానికి ట్రిబ్యునళ్లతో పని లేదా?
న్యూఢిల్లీ: వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో రాష్ట్ర, జిల్లా స్థాయి నియామకాల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ట్రబ్యునళ్ల అవసరం లేదనుకుంటే వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని రద్దు చేయాలంది. ట్రబ్యునళ్లలో ఖాళీలపై అత్యున్నత న్యాయస్థానం దృష్టి పెట్టాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని జస్టిస్ ఎస్కే కాల్, ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో కోర్టు తన విలువైన సమయాన్ని వెచ్చించే పరిస్థితులు రావడం అంత మంచిది కాదని కేంద్రానికి హితవు పలికింది. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధ్యక్షుడు, ఇతర సభ్యుల నియామకం జరగకపోవడం, ట్రిబ్యునల్స్‌లో కనీస మౌలిక వసతుల కల్పన లేకపోవడంతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా స్వీకరించి విచారించింది. వినియోగదారుల హక్కుల్ని కాపాడడానికి శాశ్వత న్యాయస్థానాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని అభిప్రాయపడింది. ‘కమ్యూనిటీ కిచెన్ల’పై విచారణకు సుప్రీం ఓకే దేశంలో ఆకలి కేకల నిర్మూలన కోసం కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించిన పథకాన్ని ప్రవేశపెట్టేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. కరోనా మహమ్మారి వ్యాప్తితో ఆరోగ్య, ఆర్థిక రంగాలు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయడం చాలా అవసరమని లాయర్ అషిమా మండ్లా చేసిన విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్వీకరించింది. దీనిపై 27న విచారణ చేపడతామని తెలిపింది. -
మరణావస్థలో కాంగ్రెస్!: సిద్ధూ
చండీగఢ్: కాంగ్రెస్‌ను తనదైన శైలిలో ఇబ్బందులు పెడుతున్న నవజోత్‌సింగ్ సిద్దూ మరోమారు గళం విప్పారు. యూపీలో జరిగిన రైతు మరణాలకు సంబంధించి ఆయన మొహాలి నుంచి లఖిమ్‌పూర్‌కు యాత్ర చేపట్టారు. దీని ఆరంభానికి ముందు పంజాబ్ సీఎం రాక ఆలస్యం కావడంతో ఆయన అసహనంగా కనిపించారు. దీంతో సిద్ధూను కేబినెట్‌మంత్రి పర్గాత్ సింగ్ శాంతింపజేయడానికి ప్రయతి్నస్తున్న వీడియో ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. సీఎం త్వరలో వస్తారని పర్గాత్ చెప్పడం, ఈ యాత్ర విజయవంతమవుతుందని కాంగ్రెస్ పంజాబ్ సీడబ్లు్యసీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సముదాయించడం వీడియోలో కనిపించింది. వీరి మాటలకు సిద్ధూ స్పందిస్తూ ‘‘విజయం ఎక్కడ? నాకు పగ్గాలు అప్పజెప్పిఉంటే మీకు విజయం కనిపించేది. ఇప్పుడు కాంగ్రెస్ మృతావస్థలో ఉంది.’’ అని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా కనిపించింది. సీఎం మార్పునకు నిరసనగా కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ అనంతరం అధిష్టానం బుజ్జగింపుతో మెత్తబడ్డట్లు కనిపించారు. అయితే ఆయన రాజీనామాను అధికారికంగా ఉపసంహరించుకోలేదు. ఆయనలో అసంతృప్తి చల్లారలేదని తాజా వ్యాఖ్యలు చూపుతున్నాయి. సిద్ధూకు దళితులపై గౌరవం లేదని, కేవలం ఎన్నికల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష అకాలీదళ్ విమర్శించింది. కాంగ్రెస్ సమస్యలకు తక్షణ పరిష్కారాలు దొరకవు! న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సమస్యల పరిష్కారానికి తక్షణ మార్గాల్లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. లఖీమ్‌పూర్ ఘటనతో పార్టీకి తక్షణ పునర్వైభవం వస్తుందని ఆశించేవారు నిరాశ పడకతప్పదంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌లో చేరడానికి ప్రశాంత్ తయారవుతున్నారన్న ఊహాగానాల నడుమ ఆయన తాజా ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. జీఓపీ(గ్రాండ్ ఓల్డ్ పార్టీ– కాంగ్రెస్) వెనువెంటనే పునర్వికాసం చెందేందుకు లఖీమ్‌పూర్ ఘటన ఉపయోగపడుతుందని చాలామంది ఆశిస్తున్నారని, వీరంతా త్వరలో అతిపెద్ద నిరాశను ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ప్రశాంత్ చేరికను కొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజా ట్వీట్‌తో తనకు, పార్టీ నాయకత్వంతో విభేదాలున్నట్లు ప్రశాంత్ పరోక్షంగా చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితులను ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీసింది. ఇతర హత్యల కేసుల్లోనూ నిందితుల పట్ల ఇలాగే వ్యవహరిస్తున్నారా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అని ఘాటుగా ప్రశ్నించింది. ఈ ఘటనపై వేరే దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలా వద్దా అనేది తర్వాత నిర్ణయిస్తామని, అప్పటిదాకా ఆధారాలను భద్రంగా ఉంచాలని డీజీపీకి కోర్టు మాటగా చెప్పాలని యూపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనను సుమోటోగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రధాన నిందితుడికి సమన్లు జారీ చేశామని చెప్పారు. 8 మంది మృతికి కారణమైన ఘటనలో సాధారణంగా నిందితులను వెంటనే అరెస్టు చేయాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. బాధితుల శరీరాల్లో బుల్లెట్ గాయాలు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లు హరీష్ సాల్వే చెప్పగా.. ఇదే కారణంతో అరెస్టు చేయలేదా? అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని సీజేఐ తెలిపారు. దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ చేపడతామంటూ అక్టోబర్ 20కి ధర్మాసనం వాయిదా వేసింది. కాగా, లఖీపూర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలను జస్టిస్ ఎన్.వి.రమణ కలుస్తారంటూ ఓ ఆంగ్ల పత్రిక ట్వీట్ చేయడంపై సీజేఐ స్పందిస్తూ.. మీడియా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, అదేసమయంలో ఈ రకంగా చేయడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న తాను లక్నోకు ఎలా వెళ్లగలని ప్రశ్నించారు. మిశ్రాను తొలగించకపోతే 18న రైల్ రోకో: కిసాన్‌మోర్చా లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రాను ఈ నెల 11వ తేదీలోగా పదవి నుంచి తొలగించకపోతే 18న రైల్ రోకో చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటించింది. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో నిందితులను వారం రోజుల్లోగా అరెస్టు చేయకపోతే ప్రధాని మోదీ నివాసాన్ని దిగ్బంధిస్తామని దళిత నేత, ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరించారు. ఆశిష్‌ను అరెస్టు చేసేదాకా నిరాహార దీక్ష కొనసాగిస్తానని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఆయన శుక్రవారం నిరాహార దీక్ష ప్రారంభించారు. సమన్లకు స్పందించని ఆశిష్ శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ యూపీ పోలీసులు జారీ చేసిన సమన్లకు ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా స్పందించలేదు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ పోలీసులు తాజాగా నోటీసు జారీ చేశారు. ఆశిష్ అనారోగ్యం కారణంగా శుక్రవారం పోలీసుల విచారణకు రాలేకపోయాడని అజయ్‌కుమార్ మిశ్రా చెప్పారు. కాగా, లఖీమ్‌పూర్ ఖేరిని ప్రతిపక్ష నేతలు సందర్శిస్తుండడం పట్ల యూపీ సీఎం ఆదిత్యనాథ్ వ్యంగ్యంగా స్పందించారు. వారిది రాజకీయ పర్యాటక కార్యక్రమం(పొలిటికల్ టూరిజం) అని ఎద్దేవా చేశారు. -
బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఇమడలేక సతమతమవుతున్నారా? దశ దిశా లేకుండా దిక్కులేని పక్షిలా సాగుతున్న పార్టీ ప్రయాణంతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నారా? జనంతో సంబంధం లేకుండా నిత్యం మీడియాలో కనిపిస్తూ.. చంద్రబాబు, లోకేష్ భజన చేస్తూ పబ్బం గడుపుకునే నేతలకే ప్రాధాన్యం ఇస్తూ తమను అవమానిస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోనని, మరో అభ్యర్థిని చూసుకోవాలని కేశినేని నాని.. చంద్రబాబుకు స్పష్టంగా తేల్చిచెప్పడాన్ని బట్టి సీనియర్ నాయకుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని అంటున్నారు. ఇటీవలే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నడుస్తున్న తీరు బాగోలేదంటూ ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. చంద్రబాబు జోక్యం చేసుకుని బుజ్జగించడంతో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని బుచ్చయ్య వాయిదా వేసుకున్నారు. అయితే పార్టీ అధినాయకత్వం పట్ల ఆయన అభిప్రాయం మాత్రం మారలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి సైతం పార్టీ తీరు పట్ల బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రైవేటు సంభాషణలో టీడీపీ పని అయిపోయిందని, ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’ అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. వీరే కాకుండా ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు టీడీపీ మునిగిపోతున్న నావ అనే అభిప్రాయంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. చురుగ్గా లేని సీనియర్ నేతలు గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు ఎవరూ ప్రస్తుతం చురుగ్గా లేరు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా చక్రం తిప్పిన నారాయణ దాదాపు పార్టీకి దూరమయ్యారు. మరో మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నారో, లేదోననే పరిస్థితి ఉంది. రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు, ఎంపీలు, ఇతర నేతల్లో నలుగురైదుగురు మినహా ప్రస్తుతం ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వారి నియోజకవర్గాల్లో సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించినా పట్టించుకోవడం లేదు. టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు (వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరామకృష్ణమూర్తి) ఆ పార్టీకి దూరమయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో సగం మంది గోడ దూకడానికి ఎప్పుడో సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. టీడీపీకి ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు వైఖరే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆయన తన తనయుడు లోకేష్‌కి పెత్తనం అప్పగించడం సీనియర్లకు మింగుడుపడడం లేదు. తన భజన చేసే వారినే ఆయన ప్రోత్సహిస్తుండడం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందంటున్నారు. -
ఇదేం పద్ధతి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ట్రిబ్యునళ్లలో నియామకాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాను పక్కనపెట్టి కొందరినే ఏరికోరి నియమించడం ఏమిటని నిలదీసింది. ‘నియామక పత్రాలను పరిశీలిస్తే సెలెక్ట్ లిస్ట్ నుంచి కేవలం ముగ్గురిని ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. మిగిలిన వారంతా నిరీక్షణ జాబితాలో ఉన్నవారే. సెలెక్ట్ లిస్ట్‌లోని ఇతరుల పేర్లను తిరస్కరించారు. సర్వీసు చట్టం ప్రకారం.. సెలెక్ట్ లిస్టును కాదని వెయిటింగ్ లిస్టుకు ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదు. ఇదేం పద్ధతి? ఇదేం ఎంపిక ప్రక్రియ?’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుల సుప్రీంకోర్టు ధర్మాసనం అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. సెలక్షన్ కమిటీ సిఫారసు చేసిన జాబితాలోని పేర్ల నుంచే ట్రిబ్యునళ్లలో ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని వేణుగోపాల్ బదులిచ్చారు. ట్రిబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది. ఇన్‌కం ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) కోసం సెలక్షన్ కమిటీ 41 మందిని సిఫారసు, అందులో నుంచి కేవలం 13 మందిని ఎంపిక చేశారని లాయర్ అరవింద్ దాతర్ చెప్పారు. ఇదేం కొత్త కాదు, ప్రతిసారీ ఇదే కథ అని ధర్మాసనం ఆక్షేపించింది. ట్రిబ్యునళ్లలో నియామకం కోసం తమ దృష్టికి వచ్చిన పేర్లను షార్ట్‌లిస్టు చేయడానికి కోవిడ్ కాలంలో కోర్టు ఎంతగానో శ్రమించిందని సీజేఐ జస్టిస్ రమణ అన్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నమంతా వృథా అయ్యిందని అసహనం వ్యక్తం చేశారు. తాజా నియామకాలను పరిశీలిస్తే ట్రిబ్యునళ్లలో సభ్యుల పదవీ కాలం కేవలం సంవత్సరమే ఉందని పేర్కొన్నారు. సంవత్సరం కోసం జడీ్జలు ట్రిబ్యునల్ సభ్యులుగా వెళ్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వమే పాటించకపోతే ఎలా? సెలక్షన్ కమిటీ సిఫారసులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉందని వేణుగోపాల్ చెప్పగా ధర్మాసనం ప్రతిస్పందించింది. ‘‘మనది రూల్ ఆఫ్ లా పాటించే దేశం. రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నాం. ‘సిఫారసులను అంగీకరించను’ అని ప్రభుత్వం చెప్పడం సరైంది కాదు’’ అని హితవు పలికింది. నియామకాల ప్రక్రియను ప్రభుత్వమే పాటించకపోతే ఆ ప్రక్రియకు విలువ ఏమున్నట్లు? అని వ్యాఖ్యానించింది. ఆదరాబాదరగా నియమించాలి్సన అవసరమేంటి? నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తాత్కాలిక చైర్‌పర్సన్‌గా జస్టిస్ వేణుగోపాల్‌ను ఆదరాబాదరగా నియమించడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై గురువారం విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. -
అప్పటికి మూడో వేవ్ ముగుస్తుంది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు మార్గదర్శకాలు రూపొందించడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘కరోనా మరణాలకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని మేము గతంలోనే ఆదేశించాం. ఆ తర్వాత గడువును పొడిగించాం కూడా. మీరు మార్గదర్శకాలు రూపొందించే సమయానికి మూడో వేవ్ కూడా ముగిసిపోతుంది’’ అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుధ్ బోస్‌లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. శుక్రవారం ఈ కేసుని విచారిస్తూ మార్గదర్శకాలను ఈ నెల 11లోగా రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నష్టపరిహారం అసలైన వారికి చేరాలంటే కోవిడ్–19 డెత్ సర్టిఫికెట్ జారీకి కూడా కేంద్రం మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందంటూ కొందరు అడ్వకేట్లు గతంలోనే వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని విచారించిన సుప్రీం కోర్టు ఇప్పటికే మార్గదర్శకాల రూపకల్పనకు రెండు సార్లు గడువు పొడిగించింది. ఇక మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. మరణ ధ్రువీకరణ పత్రం జారీకి సంబంధించి మార్గదర్శకాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. కేంద్రం తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఈ అంశం ఉందని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. -
రాజస్తాన్‌పై కాంగ్రెస్ దృష్టి
జైపూర్: పంజాబ్‌లో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తన దృష్టి రాజస్తాన్‌పైకి మళ్లించింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ల మధ్య ఇంకా ఘర్షణాత్మక వాతావరణమే కొనసాగుతోంది. కేబినెట్లో బెర్త్‌ల కోసం సచిన్ పైలెట్ వర్గీయులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. దీనిపై కాలయాపన జరుగుతూ ఉండటంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మూడు రోజుల క్రితమే సచిన్ పైలెట్ అధిష్టానం తమ డిమాండ్లను నెరవేరుస్తుందని సూచనప్రాయంగా వెల్లడించారు. ఆ తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకునే సభ్యులపై కసరత్తు చేయడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, రాజస్తాన్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ అజయ్ మాకెన్ జైపూర్‌కు చేరుకొని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో మంతనాలు జరిపారు. ఈ నెల 28న కేబినెట్ విస్తరణ చేపట్టాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోత్సారా ఆదివారం ఉదయం 25 మంది ఎమ్మెల్యేలతో సమావేశమై కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపారు. ఈ సమావేశానికి హాజరైన సచిన్ పైలెట్ కేబినెట్లో తన వర్గీయులకి చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. తొమ్మిది ఖాళీలు వేణుగోపాల్, అజయ్ మాకెన్ గత రెండు రోజులుగా వరుసగా పార్టీ నాయకుల్ని కలుసుకొని మాట్లాడుతున్నారు. ఆదివారం ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. ‘‘కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపాం. జిల్లా, బ్లాక్ స్థాయిలో పార్టీ చీఫ్‌ల నియామకం, వివిధ పాలకమండళ్లు, కార్పొరేషన్లలో నియామకాలకు సంబంధించిన కసరత్తు మొదలైంది. రాజస్తాన్ కాంగ్రెస్‌లో ఎలాంటి విభేదాలు లేవు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నేతలందరూ చెబుతున్నారు ’’ అని మాకెన్ తెలిపారు. రాజస్తాన్ కేబినెట్లో అత్యధికంగా 30 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం సీఎం గహ్లోత్‌తో సహా కేబినెట్లో 21 మంది మంత్రులే ఉన్నారు. ఇంకా తొమ్మిది మందికి కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉంది. గత ఏడాది 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి గహ్లాత్‌పై సచిన్ పైలెట్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ అధిష్టానంతో సయోధ్య కుదిరి ఆయన వెనక్కుతగ్గారు. -
కేబినెట్ విస్తరణతో యూపీలో అసంతృప్తి షురూ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని సైతం కమలదళం వదులుకోవట్లేదు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సామాజిక సమీకరణాలపై దృష్టిపెట్టేందుకు పెద్ద ఎత్తున చేసిన కసరత్తు కారణంగా, ఎన్డీఏలో భాగస్వామ్యపక్షమైన అప్నాదళ్ అధ్యక్షురాలు అనుప్రియా సింగ్ పటేల్‌కు సహాయ మంత్రి పదవి దక్కింది. అయితే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న నిశాద్ పార్టీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో నిశాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిశాద్ ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు. తప్పులు సరిదిద్దుకోవాల్సిందే నిషాద్ పార్టీ (నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్) వ్యవస్థాపకుడు సంజయ్ నిషాద్ తన కుమారుడు ఎంపీ ప్రవీణ్ నిషాద్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. కొన్ని సీట్లలో ప్రభావం చూపే అప్నా దళ్ అనుప్రియ పటేల్‌కు కేబినెట్లో చోటు దక్కించుకోగలిగితే, 160 సీట్లలో ప్రభావం చూపే ప్రవీణ్ నిషాద్‌ను మంత్రిమండలిలో ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. నిషాద్ వర్గానికి చెందిన ప్రజలు ఇప్పటికే బీజేపీని వీడుతున్నారని, ఇప్పటికైనా పార్టీ తన తప్పులను సరిదిద్దుకోకపోతే, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం తాను బీజేపీతోనే ఉన్నానని, అయితే బీజేపీ అధిష్టానం ఈ విధంగా నిషాద్లను విస్మరిస్తూ ఉంటే, రాబోయే సమయంలో తన వ్యూహాన్ని పునః పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. 18 శాతం నిషాద్‌లు మోసపోయారు ప్రవీణ్ నిషాద్‌ను మంత్రివర్గంలో చేర్చకపోవడం నిషాద్ సమాజానికి జరిగిన ద్రోహం అని సంజయ్ నిషాద్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 18 శాతం ఉన్న నిషాద్ సమాజం మరోసారి మోసానికి గురైందని, కేవలం 4 నుంచి 5 శాతం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అనుప్రియా పటేల్‌ను ఉద్దేశించి విమర్శించారు. 2017లో జరిగిన గోరఖ్‌పూర్ ఉపఎన్నికలో సంజయ్ నిషాద్ కుమారుడు ప్రవీణ్ నిషాద్ ఎస్పీ అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్ కంచుకోటలో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించి వెలుగులోకి వచ్చారు. అయితే, 2019 ఎన్నికల సందర్భంగా ప్రవీణ్ నిషాద్ కాషాయ కండువా కప్పుకొని సంత్ కబీర్ నగర్ సీటు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ప్రవీణ్ నిషాద్ ప్రస్తుతం బిజెపి ఎంపిగా ఉండగా, అతని తండ్రి నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. కేబినెట్లో చోటుదక్కలేదన్న కారణంతో ఒకవేళ పార్టీని వీడితే ఆయన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సంజయ్ నిషాద్, బీజేపీతో కేవలం బెదిరింపు రాజకీయాలు నడుపుతున్నార న్న చర్చ మొదలైంది. కేబినెట్లో సామాజిక సమీకరణాలు వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట వేశారు. యూపీ కోటాలో ఓబీసీ, బ్రాహ్మణ, దళిత సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభించింది. అనుప్రియా పటేల్ కుర్మి సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్నారు. తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని కుర్మి ఓట్లపై ఆమె ప్రభావం చూపుతారు. బి.ఎల్.వర్మ లోధి ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతారని బీజేపీ అధిష్టానం విశ్వసిస్తోంది. కౌషల్ కిషోర్ యూపీ బీజేపీ షెడ్యూలు కులాల ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. భాను ప్రతాప్ సింగ్ వర్మను కేబినెట్లో చేర్చడం ద్వారా ఆయన షెడ్యూలు కులాల ఓట్లపై ప్రభావం చూపగలరని బీజేపీ భావిస్తోంది. అజయ్ మిశ్రా బ్రాహ్మణ వర్గ ప్రతినిధిగా నూతన కేబినెట్లో స్థానం సంపాదించుకున్నారు. -
Supreme Court of India: ఇది జాతీయ సంక్షోభం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను సుప్రీంకోర్టు ‘జాతీయ సంక్షోభం’గా అభివర్ణించింది. కరోనా వ్యాప్తి కట్టడి, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కష్ట సమయంలో ప్రజలు తమ ఇబ్బందులను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేయడాన్ని కూడా నేరంగా భావించడం తగదని కేంద్రంతోపాటు రాష్ట్రాల డీజీపీలకు తీవ్ర హెచ్చరికలు చేసింది.కరోనా సంక్షోభం, నిర్వహణపై సుమోటో కేసును జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్రం పరిగణించాల్సిన ముఖ్యమైన విధాన మార్పులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని, తగిన ఆదేశాలు రూపొందిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. మే 10వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఆర్డరు ప్రతిని శనివారం ఉదయం వెబ్సైట్లో పొందుపరుస్తామని స్పష్టం చేసింది. విచారణ సమయంలో కేంద్రాన్ని ధర్మాసనం పలు అంశాలపై ప్రశ్నించింది. వందశాతం వ్యాక్సిన్లు కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదని నిలదీసింది. శ్మశాన వాటికల్లో పనిచేసే వారికి టీకా ఎలా అందిస్తున్నారు? పేటెంటు చట్టాలు వర్తింపజేస్తున్నారా వంటి పలు ప్రశ్నలు ధర్మాసనం వేసింది. ఢిల్లీ తరఫు న్యాయవాది డార్వా వాదనలు వినిపిస్తూ ఆక్సిజన్ కొరతపై మాట్లాడుతుండగా.. కర్ణాటక, ఏపీ, తెలంగాణ, ఢిల్లీల్లో కొరత ఉందిగా అని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అఫిడవిట్ సమర్పించారు. రాష్ట్రాలకు ఆక్సిజన్ అవసరాలు, కేటాయింపులు వంటి పలు అంశాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. దీనిపై న్యాయమూర్తులు పలు ప్రశ్నలు సంధించారు. సరైన ప్రణాళికే లేదు..! ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లు ఆసుపత్రులకు చేరడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని జస్టిస్ డీవై చంద్రచూడ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘అఫిడవిట్లో సరైన ప్రణాళిక లేదు. వ్యాక్సిన్ అవసరం ఎంత? ఇంటర్నెట్ సదుపాయం లేనివారు, నిరక్షరాస్యులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు? వ్యాక్సిన్ డోసులను 100 శాతం కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదు? కేంద్రం, రాష్ట్రాలకు అమ్మే ధరల్లో వ్యత్యాసం ఎందుకుంది? నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం పాలసీ ప్రకారం ఎందుకు నడుచుకోవడం లేదు? ఆ మేరకు సేకరణ పూర్తిగా కేంద్రమే చేపట్టి, పంపిణీ వికేంద్రీకరించవచ్చు కదా? వ్యాక్సిన్ తయారీదారులు డోసులను అందించే క్రమంలో ఎలా సమానత్వాన్ని ప్రదర్శించగలరు? 18–45 మధ్య దేశ జనాభా ఎంత అనేది కేంద్రం అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొనాలి. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపులో కేంద్రం పెట్టుబడి వివరాలు చెప్పాలి. ప్రైవేటు కంపెనీలకు కేంద్రం నిధులిచ్చి కేంద్రం చాలా కీలకమైన జోక్యం చేసుకుంది. వ్యాక్సిన్ తయారీదారులు ఈక్విటీని ఎలా నిర్ణయిస్తారు? అని ఆయన నిలదీశారు. ఈ సంక్షోభ సమయంలో కోర్టు జోక్యం అవసరమైన చోట ఆదేశాలు ఇస్తున్నామని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు తెలిపారు. ‘అమెరికా ప్రజలకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తక్కువ ధరకే లభ్యం అవుతోంది. కానీ మనం ఎందుకు ఎక్కువ చెల్లించాలి’ అని జస్టిస్ రవీంద్రభట్ అన్నారు. ‘టీకా ధరలను కేంద్రం నియంత్రించాలి. కేంద్రం అఫిడవిట్లో పది ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయని చెబుతోంది. లైసెన్సు తీసుకొని ఉత్పత్తి ప్రారంభించొచ్చు కదా? రూ.4,500 కోట్లు వ్యాక్సిన్ తయారీ దారులకు ఇచ్చారు. ఈ గ్రాంటు ఏంటో మాకు తెలియలేదు. ఈ సమయంలో కీలకంగా ఉన్న నర్సులు, వైద్యులు ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, వసతులు లేక ఎలా మృతి చెందుతున్నారో చూస్తున్నాం’ అని అన్నారు. సమస్యలు చెప్పుకుంటే కేసులా? ‘సమాచార వ్యాప్తి స్వేచ్ఛగా జరగాలి. ఈ సంక్షోభ సమయంలో అడ్డంకులు సృష్టించరాదు. ప్రజలు తమ ఆవేదనను ఇంటర్నెట్ ద్వారా తెలుపుకుంటున్నారు. అయితే, తప్పుడు సమాచారం పెడుతున్నారంటూ వారి గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం తగదు’అంటూ కేంద్రంతోపాటు పోలీస్ చీఫ్‌లకు సుప్రీంకోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ‘ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్లు, వైద్యుల కొరత, ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు తమ సమస్యలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదు. తప్పుడు సమాచారం అంటూ అలాంటి పోస్టులపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం. ఈ విషయం అన్ని రాష్ట్రాల డీజీపీలకు తెలియజేయండి’ అని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం అందిస్తున్నారంటూ జాతీయ భద్రతా చట్టం కింద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొందరిపై చర్యలు చేపట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన ఈ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
టీడీపీలో కాకరేపుతోన్న తిరుగుబాటు నేతల తీరు
సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చంద్రబాబు నిర్ణయం టీడీపీలో ముసలం పుట్టించింది. చంద్రబాబు నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీలో తిరుగుబాటు నేతల తీరు కాకరేపుతోంది. చంద్రబాబు తీరుపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పలు చోట్ల ప్రచారంలో టీడీపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా... చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ పెందుర్తిలో బండారు సత్యనారాయణ ప్రచారం నిర్వహించారు. సబ్బవరంలోనూ బాబు నిర్ణయాన్ని టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థులు వెనక్కు తగ్గొద్దని టీడీపీ సీనియర్లు అభ్యర్థిస్తున్నారు. ప్రచారం చేయండి, పార్టీని బతికించుకోవాలంటూ అభ్యర్థిస్తున్నారు. పార్టీ బతకాలంటే పోటీలో ఉండాలని విశాఖ టీడీపీ సీనియర్లు అంటున్నారు. విజయనగరం జిల్లాలో ఒక జెడ్పీటీసీ, 12 ఎంపీటీసీల్లో ప్రచారం నిర్వహించారు. ఓడినా ఫరావాలేదు, పోటీలో ఉంటామని అభ్యర్థులు అంటున్నారు. తప్పుకునే ప్రసక్తే లేదని అశోక్ గజపతిరాజు వర్గం అంటున్నారు. చంద్రబాబుకు ధిక్కరణ.. గుంటూరు జిల్లా మంగళగిరి, దుగ్గిరాలలోనూ బాబుకు ధిక్కరణ ఎదురవుతుంది. చంద్రబాబు, లోకేష్ నిర్ణయం సరికాదని టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరిలో కొన్ని చోట్ల బాబు నిర్ణయానికి తమ్ముళ్లు తిలోదకాలిచ్చారు. చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీలో కొందరు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పార్టీ బీ - ఫారాలు ఇచ్చింది, వెనక్కి తీసుకోలేమన్నారు. పోటీలో ఉన్నవారు ఓటు బ్యాంకు చెదరకుండా చూస్తే తప్పేం లేదంటూ గోరంట్ల వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ప్రచారం చేసే పోటీలో ఉన్నవారిపై చర్యలు అవసరం లేదని బుచ్చయ్య చౌదరి అన్నారు. పార్టీ పుట్టి ముంచడం ఖాయం.. పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కంటే స్వప్రయోజనాల కోసమే చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయంటూ జ్యోతుల వ్యాఖ్యానించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో టీడీపీలో పుట్టిన ముసలం ఆ పార్టీ పుట్టి ముంచడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: టీడీపీలో కల్లోలం: జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతి అసంతృప్తి జెండా ఎత్తేసిన చంద్రబాబు -
కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు
సమర్థులను ఎంపిక చేసి బీఫామ్ అందివ్వాలని అధిష్టానం యోచిస్తోంది. అభ్యర్థుల ఖారారు అన్ని సామజిక సమీకరణలు పరిగణలోకి తీసుకున్నా కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే వారిని సైతం పక్కకు పెట్టి కనీసం బలం లేని వారికి సీటు ఖారారు చేయడం పార్టీ శ్రేణులకు మింగుడు పడని అంశంగా తయారైంది. దీంతో కొన్ని స్థానాల నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారు కొందరు రోడెక్కి నిరసన వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు అగ్రనేతలపై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్‌లో పలు అభ్యర్థిత్వాల ఖరారుపై అసంతృపి జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని స్థానాలకు తీవ్ర పోటీ నెలకొనడంతో వాటి అభ్యర్థిత్వాల ఖరారుపై ఇంకా తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఐదు విడుతలుగా దాదాపు 116 డివిజన్లకు అభ్యర్థిత్వాలను ఖరారు చేసి జాబితా ప్రకటించింది. నామినేషన్ దాఖలు గడువు ముగిసినా మిగిలిన 34 స్థానాలకు అభ్యర్థిత్వ ఖరారును పెండింగ్‌లో పడేసింది. అయితే ఆ స్థానాలకు పోటీపడుతున్న ఆశవహులు మాత్రం నామినేషన్లను దాఖలు చేసినట్లు పార్టీ అధిష్టానవర్గంపై అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. రాంగోపాల్‌పేట్ డివిజన్ నుంచి టికెట్‌ను ఆశించిన మనోజ్ ఏకంగా ఆందోళనకు దిగి మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. చివరి క్షణం వరకు టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ మనోజ్ వర్గం ఆందోళనకు దిగింది. పార్టీ తిరగుబాటు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరికొన్ని డివిజన్ల విషయంలో సైతం పోటీ నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. చదవండి: ముగిసిన జీహెచ్ఎంసీ నామినేషన్ల ప్రక్రియ శివార్లపై ఆశలు కాంగ్రెస్ పార్టీకి శివారు డివిజన్లు ప్రతిష్టాత్మకంగా మారాయి. మొత్తం డివిజన్లలో 30 శాతంపైగా డివిజన్లు శివార్లలోనే ఉన్నాయి. అత్యధికగా శివారు డివిజన్లు మేడ్చల్–మల్కాజిగిరి పరిధిలో ఉండటంతో పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డికి సవాల్‌గా మారాయి. మరోవైపు మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డికి తమ పరిధిలోని డివిజన్లు ప్రతిష్టాత్మకంగా మారాయి. 22న మేనిఫెస్టో విడుదల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదలను 22కు వాయిదా వేసింది. వాస్తవంగా ఈ నెల 21న విడుదల చేయాలని భావించినప్పటికీ ఒక రోజు ముందుకు పొడిగించింది. మరోవైపు అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం కోసం పది మందితో స్టార్ క్యాంపెయిన్ జాబితాను ప్రకటించింది. ఇప్పటికే పార్లమెంట్, అసెంబ్లీ వారిగా సమన్వయకర్తలను నియమించి బాధ్యతలు అప్పగించింది. ఉనికి కోసం టీజేఎస్ సాక్షి, మేడ్చల్ జిల్లా: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి(టీజేఎస్) ఉనికి చాటుకునేందుకు 31 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. గ్రేటర్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి టీజేఎస్ తహతహలాడుతోంది. ప్రధాన పార్టీల కంటే ముందుగానే తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. గురువారం 27 డివిజన్ల అభ్యర్థులను ప్రకటించగా, శుక్రవారం సీతాఫల్మండి, హాబ్సిగూడ, కవాడీగూడ, బంజారాహిల్స్ డివిజన్ల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. వీరందరికి పార్టీ నాయకత్వం బీ ఫారాలు అందజేసింది. పట్టుకోసం కమ్యూనిస్టుల పాకులాట ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మహానగరంలో ప్రజాపోరాటాల్లో తమ పట్టు కోసం గ్రేటర్ ఎన్నికల్లో 26 డివిజన్లలో పోటీ చేస్తున్నాయి. సీపీఐ 14 డివిజన్ల నుంచి బరిలో నిలవగా, సీపీఎం 12 డివిజన్లలో తమ అభ్యర్థులను పోటీలో పెట్టింది. -
ఎస్బీఐలో వీఆర్ఎస్ ప్రతిపాదన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) అమలు చేయాలని భావిస్తోంది. దీన్ని వినియోగించుకునేందుకు సుమారు 30,190 మంది ఉద్యోగులకు అర్హత ఉంటుందని తెలుస్తోంది. వీఆర్ఎస్ ముసాయిదా ఇప్పటికే సిద్ధమయినట్లు, బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ’సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వీఆర్ఎస్ – 2020’ పేరిట ప్రతిపాదించే స్కీమును ప్రధానంగా మానవ వనరుల వినియోగాన్ని, ఖర్చులను మెరుగుపర్చుకోవడానికి ఉద్దేశించినట్లు వివరించాయి. తమ కెరియర్లో ఆఖరు స్థాయికి చేరినవారు, అత్యుత్తమ పనితీరు కనపర్చలేని పరిస్థితుల్లో ఉన్న వారు, వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు, ఇతరత్రా వ్యాపకాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నవారు గౌరవప్రదంగా నిష్క్రమించేందుకు కూడా ఇది తోడ్పడగలదని పేర్కొన్నాయి. అయితే, ప్రతిపాదిత వీఆర్ఎస్ స్కీముపై బ్యాంకు యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దేశమంతా కరోనా వైరస్ మహమ్మారితో కుదేలవుతున్న తరుణంలో ఇలాంటి ప్రతిపాదనలు చేయడం ఉద్యోగులపై యాజమాన్యానికి ఉన్న వ్యతిరేక ధోరణులను సూచిస్తోందని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రాణా వ్యాఖ్యానించారు. పాతికేళ్ల సర్వీసు.. కటాఫ్ తేదీ నాటికి 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయస్సు నిండిన పర్మినెంట్ ఆఫీసర్లు, సిబ్బందికి ఈ స్కీము అందుబాటులో ఉంటుంది. ముసాయిదా ప్రకారం వీఆర్ఎస్ పథకం డిసెంబర్ 1న ప్రారంభమై, ఫిబ్రవరి ఆఖరు దాకా అమల్లో ఉంటుంది. వీఆర్ఎస్ దరఖాస్తులను ఈ వ్యవధిలో మాత్రమే స్వీకరిస్తారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం 11,565 మంది అధికారులు, 18,625 ఇతర సిబ్బందికి వీఆర్ఎస్ ఎంచుకునేందుకు అర్హత ఉంటుంది. 2020 జూలై వేతనాలు బట్టి అర్హత కలిగిన ఉద్యోగుల్లో కనీసం 30 శాతం మంది దీన్ని ఎంచుకున్నా బ్యాంకుకు నికరంగా సుమారు రూ. 1,663 కోట్ల దాకా మిగులుతుందని అంచనా. వీఆర్ఎస్ ఎంచుకున్న వారికి గ్రాట్యుటీ, పెన్షన్, ప్రావిడెంట్, వైద్యం తదితర ప్రయోజనాలన్నీ కూడా లభిస్తాయి. అలాగే దీని కింద రిటైరైన వారు పదవీ విరమణ తేది నుంచి రెండేళ్ల తర్వాత తిరిగి బ్యాంకులో చేరేందుకు లేదా సర్వీసులు అందించేందుకు వెసులుబాటు ఉంటుంది. గతేడాది 2.57 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 2020 మార్చి ఆఖరు నాటికి 2.49 లక్షలకు తగ్గింది. -
క్రెడిట్ ఇవ్వండి ప్లీజ్
‘‘పాటకు పదాలు ముఖ్యం. ఆ పదాలు రాసేవాడికి క్రెడిట్ ఇవ్వడానికి ఎందుకంత అశ్రద్ధ? మేం రాసిన పాటకు మా పేరు వేయండి. క్రెడిట్ ఇవ్వండి ప్లీజ్’’ అంటూ ఓ పాటను విడుదల చేశారు బాలీవుడ్‌కు చెందిన పలువురు పాటల రచయితలు. మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్ రచయితలకు క్రెడిట్ ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ 15 మంది పాటల రచయితలు ‘క్రెడిట్స్ దేదో యార్’ అనే పాటను రిలీజ్ చేశారు. రచయితలు వరుణ్ గ్రోవర్, కౌశర్ మునిర్, సమీర్ అంజాన్, స్వానంద్ కిరికిరే, అమితాబ్ భట్టాచార్య, నీలేష్ మిశ్రా, మనోజ్ ముంతాషిర్, మయూర్ పూరి, షిల్లే, పునీత్ శర్మ, అభిరుచి చంద్, హుసేన్ హేడ్రీ, రాజ్ శేఖర్, అన్విత దత్, కుమార్ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రెండున్నర నిమిషాలున్న ఈ ‘క్రెడిట్ దేదో యార్’ పాటను ఈ 15మంది ఆలపించారు. ఈ ఉద్యమంలో శ్రోతలు కూడా భాగమవ్వాలన్నారు. గీత రచయిత పేరు (క్రెడిట్) లేకుండా ఏ మ్యూజిక్ కంపెనీ అయినా, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయినా పాట కనిపిస్తే ప్రశ్నించండి అని వీళ్లంతా ట్వీటర్ ద్వారా కోరారు. -
గల్వాన్‌పై చైనాలో అసమ్మతి సెగ!
బీజింగ్: గల్వాన్ ప్రాంతంలో దురాక్రమణకు పాల్పడటం ద్వారా పొరుగుదేశం చైనా ఏం బావుకుందో ఏమో తెలియదుగానీ.. దేశంలోనే కాకుండా.. విదేశాల్లోని స్వదేశీయుల నుంచి అసమ్మతిని మాత్రం మూటగట్టుకుంటోంది. చైనాలో ప్రభుత్వం కనుసన్నలలో నడిచే మీడియా, సామాజిక మాధ్యమాల్లో భారత వ్యతిరేక వ్యాఖ్యానాలు చర్చలు కొనసాగుతున్నా.. ఇతర మాధ్యమాల్లో, విదేశాల్లోని చైనీయుల మధ్య జరుగుతున్న ఆన్లైన్ సంభాషణల్లోనూ గల్వాన్ లోయలో చైనా వ్యవహారంపై పలువురు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే పూర్తయి వివరాలు వెల్లడి కావాల్సిన ఓ ఆన్లైన్ సర్వే ద్వారా ఈ విషయం తెలుస్తోందని జాతీయ స్థాయి టెలివిజన్ చానల్ ఒకటి ఒక కథనాన్ని ప్రచురించింది. సుమారు 75 వేల మంది సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్‌లను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు సెక్‌ల్యాబ్ అండ్ సిస్టమ్స్ అనే సంస్థ చెబుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చైనా ప్రభుత్వం మద్దతుతో నడిచే కొన్ని వ్యూహాత్మక సంస్థల్లో పనిచేసే వారు కూడా ప్రభుత్వం తీరు సరికాదని వ్యాఖ్యానించడం. సెక్ ల్యాబ్ అండ్ సిస్టమ్స్ సోషల్‌మీడియా నెట్‌వర్క్‌లను గణిత శాస్త్ర సూత్రాల ఆధారంగా విశ్లేషించింది. ప్రవాస చైనా జర్నలిస్టుల సోషల్ మీడియా పోస్టుల్లో గల్వాన్ విషయంలో చైనా వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతూండగా.. అదృశ్య శక్తి ఒకటి ఒకటి వీటన్నింటి వెనుక ఉందని చైనా ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని వీరు భావిస్తున్నారు. వీరే కాకుండా.. హాంకాంగ్, తైవాన్లలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్న వారు, ఇతర మద్దతుదారుల్లోనూ ఇదే తరహా సెంటిమెంట్లు నడుస్తున్నాయి. ట్విట్టర్లో సుమారు 34 వేల మంది ఫాలోయర్లు ఉన్న జర్నలిస్ట్, చైనీస్ కుమిన్‌టాంగ్ విప్లవ కమిటీ సభ్యుడు డెంగ్ యూవెన్ భారత్‌తో సరిహద్దు గొడవలు చైనా నేతలకు ఏమాత్రం తగని పని అని ఒక కథనంలో వ్యాఖ్యానించారు. భారత్ చైనాల మధ్య యుద్ధం అసాధ్యమని గతంలో అనుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని యూవెన్ వ్యాఖ్యానిస్తున్నారు. ట్విట్టర్లో రెండు లక్షల కంటే ఎక్కువమంది ఫాలోయర్లు ఉన్న హు పింగ్ కూడా యూవెన్ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైనాలోనే కొంతమంది పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని, కమ్యూనిస్టు పార్టీ అంతర్గత సమావేశాల రికార్డింగ్‌లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వాంగ్ కియాన్‌కిన్ ఒక ట్వీట్ చేశారు. కొంత కాలానికే ఈ ట్వీట్ డెలిట్ కావడం గమనార్హం. భారత్ అత్యవసరంగా రష్యా నుంచి 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తూండటం వారి సంబంధాలు చైనా కంటే ఆ దేశంతోనే బాగున్నాయని నిరూపిస్తున్నాయని ట్వీట్ ద్వారా వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, ట్వీట్లు, ఆలోచనలు ఒక పద్ధతి ప్రకారం వస్తున్నవి ఏమీ కావని, ప్రస్తుతానికి వీటిని గుసగుసలుగానే పరిగణించాలని సెక్‌ల్యాబ్స్ నిర్వహించిన సర్వే చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఊపిరిపోసుకుని ఆ తరువాత ఓ వ్యవస్థీకృత ఉద్యమంగా మారిన పలు ఉద్యమాలు కూడా ఇలాంటి చెదురుమదురు అసంతృప్తికర వ్యాఖ్యలతోనే మొదలైన విషయాన్ని గుర్తించాలని చెబుతోంది. -
కాలుష్య పరిశ్రమలపై చర్యలేవి?
సాక్షి, హైదరాబాద్: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో అలాంటివి పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ నగర శివారు జీడిమెట్లలో పారిశ్రామిక కాలుష్య కట్డడికి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చేపట్టిన చర్యలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భూగర్భ జలాలు కలుషితం అవుతుంటే పీసీబీ చర్యలు ఆశాజనకంగా లేవని పేర్కొంది. పరిశ్రమల నుంచి కాలుష్యం వెదజల్లుతుంటే గత నాలుగేళ్లల్లో 45 కేసులు మాత్రమే నమోదవడం పీసీబీ పనితీరును తెలియజేస్తోందని వ్యాఖ్యానించింది. జీడిమెట్లలో భూగర్భ జలాలు కలుషితంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. 799 ఫార్మా కంపెనీలు ఉంటే వాటిలో 708కే అనుమతి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ చెప్పారు. 24 కంపెనీలకు నోటీసులు, 2 కంపెనీలను మూసివేయాలని, అలాగే పలు కంపెనీలపై 23 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ గత ఆరు నెలల్లోనే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే కోర్టులో కేసు దాఖలైన తర్వాతే పీసీబీ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోందని తప్పుబట్టింది. శివారుల్లోని 220 బల్క్ డ్రగ్స్ యూనిట్స్‌లో చేసిన తనిఖీల నివేదికలను ఎందుకు వివరించలేదని ప్రశ్నిస్తూ తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది. -
సంక్షేమం స్లో...
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలకు ప్రభుత్వం సకాలంలో నిధులివ్వకపోవడంతో ఆశించిన స్థాయిలో అర్హులకు లబ్ధి చేకూరలేదని కాగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2018 మార్చితో ముగిసిన సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక సమర్పించింది. ఇందులో పలు సంక్షేమ పథకాల అమలు తీరును ప్రస్తావిస్తూ నిధులివ్వని కారణంతో లబ్ధిదారులకు సాయం అందించలేకపోవడాన్ని ప్రస్తావించింది. కేసీఆర్ కిట్ పథకానికి రూ.605 కోట్ల బడ్జెట్ నిర్ధారిస్తే రూ.271.07 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసింది. దీని కింద 6 లక్షల మంది లబ్ధిదారులు నమోదవుతారని భావించినా 6.57 లక్షల మంది నమోదయ్యారు. దీంతో బడ్జెట్ కేటాయింపులకు తగినట్లు ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. దాదాపు రూ.274.23 కోట్లకు సంబంధించిన బిల్లులు ఆర్థిక శాఖ ఆమోదించకపోవడంతో పథకం వెనుకబడిపోయిందని కాగ్ తెలిపింది. ఆరోగ్యలక్ష్మి పథకం అమలుకు రూ.429 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే రూ.176.32 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.ప్రభుత్వం నిధులను స్తంభింపజేయడంతో కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయి లో ఉపయోగించుకోనట్లు కాగ్ తెలిపింది. కల్యాణలక్ష్మి పరిస్థితి కూడా అంతే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉన్నట్లు కాగ్ గుర్తించింది. కల్యాణలక్ష్మి కింద బీసీ సంక్షేమ శాఖకు రూ.400 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే రూ.382.42 కోట్లు ఖర్చు చేసింది. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తే కేటాయించిన బడ్జెట్ కంటే అదనంగా రూ. 276.87 కోట్లు అవసరమని ఆ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఆ నిధులివ్వలేదు. నిధుల సమస్య కారణంగా పలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. వీటిని క్యారీఫార్వర్డ్ చేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ కాగ్‌కు వివరించింది. బీసీలను గుర్తించలేదు.. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమంకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన్ లక్ష్య సాధన ప్రశ్నార్థకంగా మిగిలినట్లు కాగ్ అభిప్రాయపడింది. ఈ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయిస్తే చైర్మన్, ఉద్యోగుల వేతనాల కింద రూ.4.06 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అత్యంత వెనుకబడిన కులాలను ప్రభుత్వం గుర్తించకపోవడం, ఎంబీసీ కార్పొరేషన్ తయారీకి రూపొందించి న కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించకపోవడంతో నిధులు వినియోగం కాలేదని కాగ్ పేర్కొంది. చేనేత కార్మికులకు సాయం కింద కేటాయించిన రూ.1,200 కోట్ల లో రూ.444.98 కోట్లు విడుదల చేసింది. 30 వేల మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా 20 వేల మందికి మాత్రమే పథకాలను వర్తింపజేశారు. పరిశ్రమల శాఖ ద్వారా కేవలం రూ.313.60 కోట్లు మాత్రమే ఖర్చు కాగా, మిగతా రూ.131.38 కోట్లు బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు కాగ్ గుర్తించింది. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపట్టాల్సిన మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి లక్ష్యం 0.32 శాతమే సాధించినట్లు కాగ్ పేర్కొంది. భూపంపిణీ పథకానికి సంబంధిం చి పురోగతి సంతృప్తికరంగా లేదని తెలిపింది. సాధించింది శూన్యం.. పట్టణ పేదలకు గృహ నిర్మాణాల విషయంలో 2017–18 సంవత్సరానికి గాను రూ.1,000 కోట్లు కేటాయించగా, ఖర్చు చేసిం ది రూ.75 కోట్లు మాత్రమేనని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఆ సంవత్సరంలో 2.8 లక్షల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉండ గా, సాధించింది శూన్యమని కాగ్ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు నిధులు రాకపోవడంతో ఎలాంటి పనులు చేపట్టలేకపోయామని గృహనిర్మాణ సంస్థకు వెల్లడించినట్టు కాగ్ తెలిపింది. dissatisfaction with -
వైద్య బీమా పాలసీ... ప్చ్!
వైద్య బీమా ప్రాధాన్యాన్ని నేడు ఎంతో మంది అర్థం చేసుకుంటున్నారు. వైద్య సేవల వ్యయాలు బడ్జెట్‌ను చిన్నాభిన్నం చేస్తున్న రోజులు కావడంతో ఆర్జించే వారిలో ఎక్కువ మంది వైద్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. దీని పట్ల ఇటీవలి కాలంలో అవగాహన కూడా విస్తృతం అవుతోంది. ఇది నాణేనికి ఒక వైపు. కానీ, వైద్య బీమా పాలసీలు తీసుకున్న వారిలో అందరూ సంతోషంగానే ఉంటున్నారా...? దాదాపు సగానికి సగం అసంతృప్తే వ్యక్తం చేస్తున్నారు. ఇది నాణేనికి మరో వైపు కోణం. తాము తీసుకున్న పాలసీల్లోని ఫీచర్ల పట్ల సంతోషంగా లేమని 48 శాతం మంది తెలిపారు. పెద్ద వయసు వారిలో ఇది మరీ ఎక్కువగానే ప్రస్ఫుటమైంది. 65 ఏళ్లు, అంతకంటే పెద్ద వయసు వారిలో 67 శాతం మంది (ప్రతీ ముగ్గురిలో ఇద్దరు) తాము తీసుకున్న వైద్య బీమా పాలసీల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇటువంటి ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. అసంతృప్తి ఎక్కువే 48% అంటే సగం మంది హెల్త్ పాలసీల పట్ల అసంతృప్తితో ఉన్నారంటే దీన్ని బీమా సంస్థలు కచ్చితంగా విస్మరించకూడని అంశమే. మరీ ముఖ్యంగా పెద్ద వయసు వారిలో మూడింట రెండొంతుల సంతృప్తిగా లేరంటే వారు ఆశించిన ప్రయోజనాలు బీమా సంస్థలు అందించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద వయసులోనే వైద్య బీమా అవసరం ఎక్కువగా ఉంటుంది. వారు తరచుగా పాలసీ కవరేజీని వినియోగించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. అందుకే వైద్య బీమా పాలసీ తీసుకునే ముందే పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఏజెంట్లకో, మధ్యవర్తులకో దరఖాస్తు పత్రాన్ని నింపే బాధ్యతను వదిలేయకుండా, డాక్యుమెంట్‌ను పూర్తిగా చదివి, అందులోని ఫీచర్లను అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయానికి రావడం అవసరమని ఈ సర్వే ఫలితాలు గుర్తు చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల పాలసీ తీసుకున్న తర్వాత ఎక్కువ శాతం విధానపరమైన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ‘‘పాలసీ షెడ్యూల్, నియమ, నిబంధనలు, కస్టమర్ సమాచార షీట్ వంటివన్నీ పాలసీ కిట్‌లో ఉంటాయి. పాలసీలో కీలకమైన సెక్షన్లు అన్నీ ఉంటాయి. అలాగే, కొత్త పాలసీదారులను ఆహ్వానిస్తూ వారిలో కొందరికి కాల్ చేసి, ముఖ్యమైన ఫీచర్లు, షరతులు, నియమాలు వివరించడం జరుగుతుంది’’ అని సిగ్నా టీటీకే హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ప్రసూన్ సిక్దార్ తెలిపారు. రెన్యువల్ ప్రీమియం భారం పాలసీదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలు ఎక్కువగా కంపెనీలు రెన్యువల్ ప్రీమియంను భారీగా పెంచేయడంపైనే ఉన్నాయి. ‘‘రెన్యువల్ ప్రీమియం పెరగడం అన్నది వాస్తవికం. ఇతర ఉత్పత్తులకు భిన్నంగా ఇది ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది’’ అని మ్యాక్స్‌బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో ఆశిష్ మెహ్రోత్రా తెలిపారు. బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) 2013లో క్లెయిమ్ ఆధారిత ప్రీమియం పెంపు విధానాన్ని నిషేధించింది. పాలసీదారులు క్రితం సంవత్సరంలో క్లెయిమ్ చేసుకుని ఉంటే, మరుసటి ఏడాది రెన్యువల్‌కు ప్రీమియం పెంచే విధానాన్ని కంపెనీలు అనుసరించేవి. అలాగే, వయసు పెరుగుతున్న కొద్దీ రెన్యువల్ ప్రీమియం పెంపు సైతం బీమా సంస్థలు అనుసరిస్తున్న మరో విధానం. ఉదాహరణకు 30–35 ఏళ్ల గ్రూపు నుంచి 36వ సంవత్సరంలోకి ప్రవేశించిన పాలసీదారునికి ప్రీమియం రెన్యువల్ భారం కొంచెం ఎక్కువే. వీరు 36–40 వయసు గ్రూపులోకి ప్రవేశించినట్టు. ఇలా బీమా సంస్థలు ఐదేళ్లకొక వయసును గ్రూపుగా పరిగణించి రిస్క్ పారామీటర్ల ఆధారంగా ప్రీమియం పెంచేస్తున్నాయి. వైద్య బీమా పాలసీని జీవిత కాలం పాటు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉన్నా.. అది ఏడాది కాల కాంట్రాక్టేనని గుర్తించాలి. కనుక పాలసీ తీసుకున్నప్పుడే ప్రీమియం రేట్లను పోల్చి చూడడం కూడా అవసరం. క్లెయిమ్ సెటిల్మెంట్ 60% పాలసీదారులు క్లెయిమ్స్ విషయంలోనూ అసంతృప్తిగానే ఉన్నారు. ఎన్నో మినహాయింపులు చూపించి పాక్షికంగానే కంపెనీలు పరిహారం చెల్లించాయన్నది 65 శాతం మంది చెప్పిన మాట. ఎక్కువ మంది తమ బీమా సంస్థల క్లెయిమ్ పరిష్కార రికార్డు పట్ల సంతోషంగా లేకపోవడం ఆందోళనకరమేనని, దీన్ని సత్వరమే మార్చాల్సిన అవసరం ఉందన్నారు ఐసీఐసీఐ లాంబార్డ్ అండర్‌రైటింగ్, క్లెయిమ్స్ విభాగం చీఫ్ సంజయ్ దత్తా. పాలసీదారులు సైతం బాధ్యతగా పాలసీ తీసుకునే సమయంలోనే తమ వైద్య చరిత్ర గురించి ఏ మాత్రం దాచిపెట్టకుండా పూర్తి వివరాలను తెలియజేయడం కూడా అవసరమేనని నిపుణులు గుర్తు చేస్తున్నారు. దాదాపు అన్ని బీమా కంపెనీలు పాలసీదారులకు ముందు నుంచి ఉన్న వ్యాధులకు... ఏడాది నుంచి నాలుగేళ్ల తర్వాత కవరేజీ కల్పిస్తున్నాయి. ఆయా వ్యాధుల ఆధారంగా వెయిటేజీ పీరియడ్ ఆధారపడి ఉంటుంది. ‘‘పాలసీ ప్రయోజనాల విషయంలో కంపెనీలు పారదర్శక పాటించడం అవసరం. అలాగే, కస్టమర్లు పాలసీ తీసుకునే ముందు అన్ని వివరాలు వెల్లడించడం, సేవల సమయాన్ని నిర్దేశించడం వంటివి కస్టమర్ల సంతృప్త స్థాయిలను మెరుగుపరిచేందుకు ఉపకరిస్తాయి’’ అని సంజయ్ దత్తా పేర్కొన్నారు. ముఖ్యంగా పాలసీదారులు పాలసీలో ఉన్న మినహాయింపుల విషయమై అవగాహన కలిగి ఉండడం కూడా వివాదాలకు దారితీయకుండా ఉంటుంది. బీమా సంస్థలు అనుసరించాల్సిన మినహయింపుల ప్రామాణిక జాబితాను ఐఆర్డీఏ లోగడే గుర్తించింది. బీమా సంస్థలు తప్పనిసరిగా దీనికి బద్ధులై ఉండాలి. దీన్ని ఉల్లంఘిస్తే వివాదాల పరిష్కార వేదికలను ఆశ్రయించొచ్చు. అయితే, పాలసీదారులు గమనించాల్సిన అంశం ఒకటుంది. రెన్యువల్ సమయంలోనూ బీమా సంస్థలు కొత్తగా మినహాయింపులను చేరుస్తున్నాయి. ‘‘రెన్యువల్ చేసుకుంటున్నందున పాలసీ ఒప్పందం అంతకుముందు మాదిరే ఉంటుందని పాలసీదారులు అనుకుంటుంటారు. కానీ, రెన్యువల్ సమయంలోనూ ఏకపక్షంగా బీమా సంస్థలు మినహాయింపులు చేర్చడాన్ని పాలసీదారులు ఎదుర్కొంటున్నారు’’ అని ప్రసూన్ సిక్దార్ తెలిపారు. అందుకే వైద్య బీమాకు సంబంధించి, ఇండివిడ్యువల్ విభాగంలో ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో (ఐసీఆర్) చూడాలంటున్నారు నిపుణులు. ఓ కంపెనీ వసూలు చేసిన ప్రీమియం, పరిహారం రూపంలో చెల్లించిన మొత్తాలను ఈ ఐసీఆర్ రేషియో తెలియజేస్తుంది. 75–85 శాతం మధ్య ఐసీఆర్ ఉంటే ఆరోగ్యకరమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు. పరిష్కారాలకు మార్గాలు పాలసీ తీసుకున్నాక కొంచెం అసంతృప్తి ఉంటే ఫర్వాలేదు కానీ, ఎక్కువ అసంతృప్తి ఉంటే అందులోనే కొనసాగాల్సిన అగత్యమేమీ లేదు. హెల్త్ పాలసీ పోర్టబులిటీ సదుపాయం ఉంది. మంచి ఫీచర్లతో, తక్కువ మినహాయింపులతో ఆఫర్ చేసే, చక్కని క్లెయిమ్ పరిష్కార రేషియో ఉన్న కంపెనీకి పాలసీని మార్చుకోవచ్చు. పోర్ట్ పెట్టుకున్నప్పటికీ, అంతకుముందు వరకు ఉన్న నో క్లెయిమ్ బోనస్ వంటి సదుపాయాలను కోల్పోవాల్సిన అవసరం కూడా రాదు. ఆశ్చర్యకరం ఏమిటంటే బీమా పోర్టబులిటీ సదుపాయాన్ని 2011లోనే ఐఆర్డీఏ కల్పించినప్పటికీ... తమకు ఆ విషయం ఇప్పటికీ తెలియదని ఈ సర్వేలో 27.12% చెప్పడం గమనార్హం. ఇక పాలసీదారులు క్లెయిమ్ విషయంలో వివాదాలు, అభ్యంతరాలు ఉంటే అంబుడ్స్‌మన్ ను ఆశ్రయించొచ్చు. తమ బీమా పాలసీ విషయంలో అసంతృప్తితో ఉన్నామని చెప్పిన వారిలో 70%కి పైగా అంబుడ్స్‌మన్ ను ఆశ్రయించలేదు. ఎందుకని అంటే... అంబుడ్స్‌మన్ కు వెళ్లి వివాదాన్ని పరిష్కరించుకోవడం అన్నది ఎంతో సమయం తీసుకునే, క్లిష్టమైన ప్రక్రియగా 77% మంది భావిస్తున్నారు. ఇక 42% మంది అంబుడ్స్‌మన్ గురించి తెలియదని చెప్పారు. ఒకవేళ అంబుడ్స్‌మన్ వద్ద జరిగిన నిర్ణయం పట్ల సంతోషంగా లేకపోతే దానిపై వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌లను ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. -
నోట్ల రద్దు సరిగ్గా అమలు కాలేదు
ముంబై: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా.. మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి సెగలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కూడా దీనిపై గళమెత్తారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని సరిగ్గా అమలు చేయలేదని.. దీన్ని మెరుగైన ప్రణాళికతో చేసిఉంటే ఫలితాలు విభిన్నంగా ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ‘డీమో’పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కూడా తన పుస్తకంలో డీమోను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. కాగా, నోట్ల రద్దువల్ల చిన్న వ్యాపారాలు ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. అయితే, వీటి పునరుత్తేజానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చర్యలను స్వాగతిస్తున్నట్లు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. ‘డీమో విషయంలో చిన్న విషయాలను పట్టించుకొని, ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉండాల్సింది. దీనివల్ల మరింత మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవి. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసినప్పుడు.. దీనికంటే అధిక విలువగల రూ.2,000 నోట్లను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అదేవిధంగా అమలు చేయడంలో వ్యూహం కూడా సరిగ్గా లేదు. భారీ స్థాయిలో నోట్లను రద్దు చేయాలని అనుకున్నప్పుడు, అందుకు తగ్గట్లుగా సరైన విలువ(డినామినేషన్) గల నోట్లను అంతే స్థాయిలో ఎందుకు అందుబాటులో ఉంచలేదు. ఇలాంటి అంశాలన్నింటినీ పట్టించుకుంటే ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. అయితే, డీమోతో ఫైనాన్షియల్ రంగానికి మాత్రం చాలా మేలు జరిగింది, నమ్మశక్యం కానంతగా పొదుపు పెరిగింది’ అని కోటక్ అభిప్రాయపడ్డారు. -
సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకత వస్తోంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ విఫలమైందని, ప్రజల్లో కేసీఆర్‌పై నెలకొన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో సైలెంట్ స్వీప్‌గా వస్తోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్య విలువ లు మృగ్యమైపోయాయని, భావప్రకటనా స్వేచ్ఛకు, పౌరహక్కులకు భంగం కలిగిందని ఆరోపించారు. విద్య, వైద్యం, ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష, నియంతృత్వ విధానాల అమలు వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూజేఎఫ్) సోమవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో చాడ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన నిరుద్యోగ యువత కు ఉద్యోగాలు భర్తీచేయకుండా చిన్నచూపు చూశారన్నారు. సీట్ల సర్దుబాటులో జాప్యం జరిగినా కూటమి ఏర్పడ్డాక కాంగ్రెస్‌కు మంచి ఊపు వచ్చిందన్నారు. ప్రజా ఫ్రంట్‌లో చేరికపై పార్టీదే నిర్ణయం ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో సీపీఐ చేరికపై పార్టీదే తుది నిర్ణయమని చాడ తెలిపారు. వామపక్ష ఐక్యతను దెబ్బతీసే విధంగా సీపీఎం వ్యవహరించడమే కాకుండా తాము కలిసి రాలేదని ఆపార్టీ ఆరోపిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి వేదిక పంచుకోలేమంటోన్న సీపీఎం జాతీయ స్థాయిలో మాత్రం రాహుల్ గాంధీతో వేదిక పంచుకుంటోందని, ఇది దేనికి సంకేతమో ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాలన్నారు. -
అగ్గి రాజుకుంటున్నా అలసత్వం!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కక అసంతృప్తితో రగిలిపోతున్న నేతలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పార్టీని నమ్ముకుంటే తీవ్ర అన్యాయం చేసిందని ఆశావహులు సెగలు కక్కుతున్నా వాటిని చల్లార్చే ప్రయత్నాలే కరువయ్యాయి. టికెట్ల ప్రకటనకు ముందు తూతూమంత్రంగా ఢిల్లీకి పిలిపించి మాట్లాడిన స్క్రీనింగ్ కమిటీ, ప్రకటన తర్వాత మాత్రం ఎవరి దారిన వారిని వదిలేశాయి. దీంతో ఆశావహులంతా కొందరు ఇండిపెండెంట్లుగా, కొందరు ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు కేటాయించే స్థానాలపై ఒకింత స్పష్టత వచ్చినప్పటి నుంచే పార్టీలో అసంతృప్తి రాజుకుంది. ముఖ్యంగా వరంగల్ వెస్ట్ టీడీపీకి కేటాయించనున్నారన్న సమాచారంతో టికెట్ల ప్రకటనకు మూడు రోజుల ముందునుంచీ అక్కడ టికెట్ ఆశిస్తున్న నాయిని రాజేందర్‌రెడ్డి వర్గీయులు డీసీసీ కార్యాలయంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. వారిని ఏ ఒక్క నేత సముదాయించే ప్రయత్నం చేయలేదు. దీంతో మరింత ఆగ్రహావేశాలకు లోనయిన రాజేందర్‌రెడ్డి వర్గీయులు జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ ఎంపీ వి.హనుమంతరావుపై తిరగబడ్డారు. సీనియర్ నేతను అవమానపరిచారని, కనీసం ఆందోళనలను పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పార్టీ పెద్దలు స్పందించకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఖానాపూర్ టికెట్ హరినాయక్‌కే కేటాయించాలని ఆ పార్టీ నేతలు మూడు రోజులు గాంధీభవన్‌లో నిరాహార దీక్షలకు దిగినా ఏ ఒక్క నేత కూడా వారి దీక్షలను ఉపసంహరించే ప్రయత్నం చేయకపోవడంపై వారంతా గుర్రుగా ఉన్నారు. ఇక మల్కాజ్‌గిరికి చెందిన నందికంటి శ్రీధర్ వర్గం ఆందోళనలతో హోరెత్తించినా వారిని పట్టించుకున్న నాథులే లేరు. శేరిలింగంపల్లిలో భిక్షపతియాదవ్, స్టేషన్ ఘన్‌పూర్‌లో విజయరామారావు, జూకల్‌లో అరుణతార, కంటోన్మెంట్లో క్రిశాంక్, బాన్సువాడలో మల్యాద్రిరెడ్డి, చొప్పదండిలో గజ్జెలకాంతం వంటి నేతల పరిస్థితి ఇలాగే ఉంది. వీరిని అటు పార్టీ అధిష్టానంకానీ, రాష్ట్ర పెద్దలుకానీ కనీసం పిలిచి మాట్లాడటంగానీ, బుజ్జగించే ప్రయత్నాలుగానీ చేయడం లేదు. జిల్లా నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో వారు ఇండిపెండెంట్లుగా, రెబెల్స్‌గా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం ప్రకటించిన స్థానాల్లో ఎల్లారెడ్డి టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడ్డ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, ధర్మపురిలో కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు తమ భవిష్య త్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలను తీవ్రంగా నష్టపరిచేవేనని స్పష్టంగా తెలుస్తున్నా పార్టీ పెద్దలు మాత్రం పట్టనట్లే వ్యవహరించడం కేడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది. పార్టీ కోసం శ్రమించిన నేతలతో వెళ్లాలా? లేక పార్టీ నిర్ణయాల మేరకు నడుచుకోవాలా? అన్న అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలో నష్ట నివారణకు పార్టీ ఎలాంటి చర్యలు చేపడుతుందన్నది ఆసక్తిగా మారింది. -
కాంగ్రెస్‌పై ఉస్మానియ విద్యార్ధి నేతల అసంతృప్తి
-
కేంద్రంపై జస్టిస్ చంద్రచూడ్ అసంతృప్తి
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం సహా పలు సున్నితమైన కేసుల్లో తుది నిర్ణయాన్ని కేంద్రం కోర్టుల విచక్షణకు వదిలేస్తుండటంపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచూడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని నేషనల్ లా వర్సిటీలో 19వ బోధ్‌రాజ్ సావ్నీ స్మారక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఈ రాజకీయ నాయకులు కొన్నిసార్లు తమ అధికారాలను న్యాయమూర్తులకు ఎందుకు అప్పగిస్తున్నారు? ఈ తరహా వ్యవహారాలు సుప్రీంకోర్టులో నిత్యకృత్యంగా మారిపోయాయి. ‘ఐపీసీ సెక్షన్ 377(స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటోంది)పై నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నాం’ అనడం జడ్జీలకు చాలా సమ్మోహనపరిచే మాట. పొగడ్తలు ఎన్నటికైనా చేటు తెస్తాయనీ, వాటి కారణంగా ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని జడ్జీలు గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. స్వలింగ సంపర్కం నేరంకాదని ప్రకటించిన ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. ఇతరులు, సమాజంతో మన కలివిడి కారణంగానే వ్యక్తిత్వం ఏర్పడుతుందనీ, లైంగికత అలా ఏర్పడదని ఆయన అన్నారు. సెక్షన్ 377లోని కొన్ని నిబంధనలు ‘పురుషులంటే ఇలానే ఉండాలి, స్త్రీలంటే ఇలాగే ఉండాలి’ అంటూ ఉందనీ వెల్లడించారు. దీని కారణంగా స్వలింగ సంపర్కులపై కొందరు చాదస్తపు మనుషులు వివక్ష చూపారన్నారు. ప్రజలపై జాతి, లైంగికత, మతం, ప్రాంతం, రంగు ఆధారంగా వివక్ష చూపరాదని రాజ్యాంగంలోని 15వ అధికరణ చెబుతోందనీ, సెక్షన్ 377 దీన్ని స్పష్టంగా ఉల్లంఘించిందని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. -
ఆప్‌కు కీలక నేత రాజీనామా...
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన అశుతోష్ బుధవారం ఆప్‌కు రాజీనామా చేశారు. అత్యంత వ్యక్తిగత కారణాలరీత్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రతి ప్రయా ణానికి ముగింపు ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీతో నా అనుబంధం చాలా అందమైనది, విప్లవాత్మకమైంది. దీనికి కూడా ముగింపు ఉంటుంది. పార్టీకి రాజీనామా చేశా. పార్టీకి, నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఓ వ్యాపార వేత్తను పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపీగా పంపడంపై అశుతోష్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అంతేగాక తనకు ఆ టికెట్ ఇవ్వలేదని కినుక వహిస్తున్నట్లు కొందరు పేర్కొంటున్నారు. అయితే ఈ వార్తలను ఆప్ కన్వీనర్ గోపాల్ రాయ్ కొట్టిపారేశారు. రాజీనామాపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘మీ రాజీనామాను ఎలా ఆమోదించాలి. నా, ఇస్ జన్మ్ మే తో నహీ(ఈ జన్మలో ఇది సాధ్యం కాదు)’’అంటూ వివరించారు. అశుతోష్ జర్నలిస్ట్ నుంచి రాజకీయ నేతగా మారారు. రాజీనామాను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. -
జోసెఫ్ సీనియార్టీపై అసంతృప్తి
న్యూఢిల్లీ: జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని తగ్గించడంపై సుప్రీంకోర్టు జడ్జీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రాను కలిసి తమ నిరసన తెలియజేశారు. మంగళవారం జస్టిస్ జోసెఫ్‌తోపాటు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్‌లు బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో ఈ నిరసన వ్యక్తమైంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం యథావిధిగా జరపాలని, సీనియర్ జడ్జి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో మాట్లాడాక నిర్ణయం తీసుకుందామని సీజేఐ హామీ ఇచ్చినట్లు తెలిసింది. సీజేఐని కలిసి నిరసన తెలిపిన వారిలో కొలీజియంలోని ఇద్దరు సీనియర్ జడ్జీలు జస్టిస్ మదన్ బీ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఏకే సిక్రీ ఉన్నారు. కేంద్ర నోటిఫికేషనే ఫైనల్! కేంద్రం శుక్రవారం ముగ్గురు జడ్జీల పేర్లతో విడుదల చేసిన నియామకపు నోటిఫికేషన్లో జస్టిస్ జోసెఫ్ పేరును ప్రకటించినప్పటికీ ఆయన సీనియారిటీని తగ్గిస్తూ మూడోస్థానంలో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు సీజే జస్టిస్ వినీత్ సరన్‌ల తర్వాత మూడో స్థానంలో ఉత్తరాఖండ్ హైకోర్టు సీజే జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును పేర్కొంది. దీనిని రాష్ట్రపతి ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జడ్జీల వరుస క్రమం ఆధారంగానే సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. జనవరి 10న కొలీజియం సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాతోపాటుగా జస్టిస్ జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రతిపాదించింది. అయితే, ఇందు మల్హోత్రా పేరును అంగీకరించిన కేంద్రం.. జోసెఫ్ పేరును తిరస్కరించింది. మే 16న మరోసారి కొలీజియం జస్టిస్ జోసెఫ్ పేరును ప్రతిపాదనల్లో పెట్టింది. జూలైలో దీన్ని కూడా కేంద్రం తిరస్కరించింది. శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో జోసెఫ్ పేరును పేర్కొనడంతో కొలీజియం, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదానికి తెరపడ్డట్లేనని అర్థమవుతోంది. షెడ్యూల్ ప్రకారమే బాధ్యతల స్వీకరణ ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ బాధ్యతల స్వీకరణ మంగళవారం జరగనుంది. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడం, రాష్ట్రపతి ఆమోదం అయిపోయిన తర్వాత ఈ దశలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని కోర్టు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆలిండియా జాబితాలో జోసెఫ్ః39 ‘హైకోర్టు జడ్జీల ఆలిండియా సీనియారిటీ లెక్కల్లో జస్టిస్ బెనర్జీ 4వ స్థానంలో, జస్టిస్ సరన్ 5వ స్థానంలో, జస్టిస్ జోసెఫ్ 39వ స్థానంలో ఉన్నారు’ అని న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు జడ్జీలూ సీజేఐ కాలేరని.. ఎందుకంటే ఇప్పటికే సుప్రీం జడ్జీలుగా ఉన్న వారు వీరికంటే సీనియర్లని తెలిపాయి. ఈ ముగ్గురిలో జస్టిస్ జోసెఫ్ 2023లో రిటైరవుతుండగా.. జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 2024 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉంటారన్నాయి. అప్పటికి ఆయనే సీజేఐగా ఉండొచ్చన్నాయి. కాగా, సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తలచుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, జాబితాను మార్చేందుకు వీలుందని మాజీ సీజేఐ జస్టిస్ లోధా పేర్కొన్నారు. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ స్వాగతించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సీనియారిటీ ఆధారంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సీనియారిటీని పొందుతారని ఆయన వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్: కేంద్రం జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని తగ్గించారంటూ నెలకొన్న వివాదంపై కేంద్రం స్పందించింది. నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్లో సీనియారిటీ (హైకోర్టు సీనియారిటీ ఆధారంగా) నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సరన్‌లతో పోలిస్తే జస్టిస్ కేఎం జోసెఫ్ రెండేళ్లు జూనియర్ కాబట్టే ఆయన్ను సీనియారిటీలో మూడోస్థానం కల్పించినట్లు పేర్కొంది. జస్టిస్ జోసెఫ్ 2004 అక్టోబర్ 14న హైకోర్టు న్యాయమూర్తిగా.. 2014, జూలై 31న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన 2023 జూన్ 16న రిటైరవుతారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ 2002, ఫిబ్రవరి 5న హైకోర్టు జడ్జిగా 2017, ఏప్రిల్ 5న హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పదోన్నతి పొందారు. ఈమె 2022, సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైరవుతారు. జస్టిస్ సరన్ 2002, ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా, 2016 ఫిబ్రవరి 26న ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2022, మే 10న ఈయన పదవీ విరమణ చేస్తారు. జోసెఫ్‌తో పోలిస్తే మిగిలిన ఇద్దరు రెండేళ్ల ముందుగానే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన అంశాన్ని కేంద్రం ప్రాతిపదికగా తీసుకుంది. -
ఆర్టీఐ సవరణ బిల్లుపై సీఐసీ అసంతృప్తి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)–2005లో తీసుకురావాలని సంకల్పించిన సవరణలపై కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమాచార హక్కు చట్టాన్ని బలహీనపర్చేలా ప్రభుత్వం తీసుకురానున్న బిల్లుపై చర్చించేందుకు అందరు కమిషనర్లతో వెంటనే సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కేంద్ర సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు అత్యంత సీనియర్ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్‌కు లేఖ రాశారు. ఈ వివాదాస్పద బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని కమిషనర్లందరికీ లేఖలో విజ్ఞప్తి చేశారు. కొత్త సవరణ బిల్లుతో సమాచార హక్కు చట్టం మౌలిక ఉద్దేశం దెబ్బతింటుందని శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ముస్లిం కన్నా గోవుగా ఉండటమే నయం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో చాలా చోట్ల ముస్లింగా కన్నా గోవులా ఉండటమే సురక్షితమని అనిపిస్తోందని శనివారం ట్వీట్ చేశారు. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలపై రాజస్తాన్‌లో ఓ యువకుడిని కొట్టి చంపిన నేపథ్యంలో థరూర్ ఇలా స్పందించారు. అయితే, కాంగ్రెస్ పోరాటాన్ని బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేసే నేతలపై చర్యలు తప్పవని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఆయన ప్రత్యేకంగా ఎవరి పేరూ ప్రస్తావించకున్నా థరూర్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ఇళ్లు, ఆఫీసుల్లో ధర్నాలేంటి?
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ అధికారంతో ఆప్ ప్రభుత్వం ఈ ధర్నా చేపట్టిందని ప్రశ్నించింది. ధర్నాను ఆపడంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వనప్పటికీ.. ఇతరుల ఇళ్లు, కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం సరికాదని మండిపడింది. కేజ్రీవాల్ నిరసన, ఢిల్లీ ప్రభుత్వంపై ఐఏఎస్‌లు సమ్మె చేయడంపై దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ ఏకే చావ్లా, జస్టిస్ నవీన్ చావ్లాల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ధర్నా చేసే అధికారం ఎవరిచ్చారు. ఎల్జీ కార్యాలయంలో బైఠాయిస్తారా? ఇది ధర్నా అయితే.. కార్యాలయం బయట చేసుకోండి. ఒకరి కార్యాలయం, నివాసంలో ధర్నా చేసే అధికారం మీకు లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం విచారణను జూన్ 22కు వాయిదా వేసింది. ఐఏఎస్ అధికారులు విధుల్లో చేరేలా ఆదేశించడంతోపాటు.. పనులను అడ్డుకుంటున్న వారిపై ఎల్జీ అనిల్ బైజాల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూన్ 11 నుంచి ఎల్జీ కార్యాలయంలో కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. నిరసన రాజ్యాంగ హక్కు! ఢిల్లీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సుధీర్ నంద్రాజోగ్ వాదిస్తూ.. సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల హోదాలో కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్‌లు నిరసన చేపట్టారన్నారు. ఇది రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. విధులకు దూరంగా ఉంటున్న ఐఏఎస్ అధికారులు రోజూవారి మంత్రుల సమావేశాల్లో పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే, ఐఏఎస్ అధికారులు సమ్మె చేయడం లేదని.. కేజ్రీవాల్, అతని మంత్రులు వెంటనే ఎల్జీ కార్యాలయాన్ని ఖాళీ చేసేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వ విపక్ష నేత విజేందర్ గుప్తా కూడా కేజ్రీవాల్ తీరును నిరసిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఈ వివాదంలో జోక్యం చేసుకుని ఐఏఎస్‌లు తిరిగి విధులకు వచ్చేలా ఎల్జీని ఆదేశించాలని ఆయన కోరారు. అలాగైతే చర్చలకు ఓకే.. అధికారులకు రక్షణ కల్పిస్తామంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారులు స్వాగతించారు. ఈ విషయంపై సీఎంతో చర్చించేందుకు సిద్ధమేనని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ రక్షణ, గౌరవాన్ని కాపాడే అంశాలపై నిర్దిష్టమైన చర్యలుంటాయని ఆశిస్తున్నామన్నారు. ఇంతకుముందు లాగే చిత్తశుద్ధితో పనిచేసేందుకు సిద్ధమేనని ప్రకటించారు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై ఆప్ ఎమ్మెల్యే ఒకరు సీఎం సమక్షంలోనే దాడికి దిగిన నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు విధులకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ఆప్ పార్టీ కూడా భద్రతపై సీఎం భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు విధులకు హాజరు కావాలని కోరింది. ఆసుపత్రికి సిసోడియా కేజ్రీకి మద్దతుగా జూన్ 13 నుంచి నిరాహార దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అస్వస్థతకు గురవడంతో ఆయనను ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని కేజ్రీ ట్విట్టర్లో వెల్లడించారు. అనంతరం సిసోడియా ట్వీట్ చేస్తూ.. ‘మా అధికారులతో చర్చలు జరిపేందుకు సంతోషంగా అంగీకరిస్తున్నాం. వీరికి సరైన భద్రత కల్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఈ బాధ్యత ఎల్జీ చేతుల్లో ఉంది’ అని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ధర్నా చేస్తున్న మంత్రి సత్యేంద్ర జైన్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిసోడియా, జైన్ల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు కేజ్రీవాల్ ఫోన్ చేశారు. దీనిపై ఉద్ధవ్ స్పందిస్తూ.. ‘ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని పనిచేసుకునే పరిస్థితి కల్పించాలి. ప్రతి అడుగులో అడ్డంకిగా మారొద్దు’ అని కేంద్రాన్ని ఉద్దేశించి విమర్శించారు. -
కర్ణాటకలో మారుతున్న రాజకీయం
-
చిచ్చుపెట్టిన కేబినెట్ కూర్పు
బెంగళూరు: కర్ణాటకలో కేబినెట్ విస్తరణతో రేగిన అసంతృప్తి సెగలు మరింత పెరిగాయి. కేబినెట్లో చోటు దక్కని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు శాఖల కేటాయింపుపై జేడీఎస్ మంత్రులు అసహనంతో ఉన్నారు. జేడీఎస్ మంత్రులు జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య, సీఎస్ పుట్టరాజుకు చిన్న నీటి పారుదల శాఖల కేటాయింపు చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో చాముండేశ్వరి నుంచి మాజీ సీఎం సిద్దరామయ్యను జీటీ దేవెగౌడ ఓడించారు. పుట్టరాజు లోక్‌సభకు రాజీనామా చేసి మెల్కొటే అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. వారిద్ద్దరు రవాణా వంటి కీలక శాఖను ఆశించారు. ఆ శాఖను తమకు కేటాయించకుడా.. జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ బంధువు డీసీ తమ్మన్నకు ఇవ్వడంపై ఆగ్రహంగా ఉన్నారు. తమ నేతలకు కీలక శాఖలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. ఆ ఇద్దరు మంత్రుల మద్దతుదారులు మైసూరు, మాండ్యల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజాసేవకు ఏ శాఖ అయితే ఏంటి?: సీఎం జేడీఎస్ మంత్రుల అసమ్మతిపై సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసేందుకు ఏ శాఖ అయితే ఏంటని ప్రశ్నించారు. 8వ తరగతి చదువుకున్న జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య శాఖ కేటాయించడంపై స్పందిస్తూ.. నేనేం చదువుకున్నాను? ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదా? అని ప్రశ్నించారు. కుమారస్వామి బీఎస్సీ డిగ్రీ చదివారు. ఢిల్లీలో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు ఎంబీ పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు ఢిల్లీలో రాహుల్‌తో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం పాటిల్ మాట్లాడుతూ.. ‘రాహుల్‌తో నా అభిప్రాయాల్ని పంచుకున్నాను. ప్రత్యేకంగా ఏమీ డిమాండ్ చేయలేదు. సమావేశ వివరాలపై మిగతా 15–20 మంది ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. రాహుల్‌తో భేటీలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేశ్ గుండూరావుతో పాటు కర్ణాటక మంత్రి కృష్ణ బైరే గౌడ పాల్గొన్నారు. ‘విభేదాల్ని పరిష్కరించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి’ అని గౌడ చెప్పారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంబీ పాటిల్, దినేష్ గుండూరావు, ఆర్.రామలింగారెడ్డి, రోషన్‌బేగ్, హేచ్కే పాటిల్, శివశంకరప్ప, జర్కిహోళి వంటి వారికి కేబినెట్లో చోటు దక్కలేదు. వారంతా కుమారస్వామి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. బీజేపీలో చేరేందుకు పలువురు సిద్ధం: యడ్యూరప్ప కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన అనేక మంది అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కర్ణాటక ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప చెప్పారు. బెంగళూరులో పార్టీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘జేడీఎస్, కాంగ్రెస్‌ల్లో అసంతృప్తిగా ఉన్నవారిని చేర్చుకోవడం మన బాధ్యత’ అని అన్నారు. అసమ్మతిని ఎదుర్కొనేందుకు కొత్త ఫార్ములా పార్టీలో, ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసమ్మతిని అధిగమించేందుకు కాంగ్రెస్ నాయకత్వం కొత్త ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మంత్రులుగా తీసుకున్న వారిని రెండేళ్ల పాటు కొనసాగించి ఆ తర్వాత కొత్త వారికి అవకాశం కల్పించడం అందులో ఒకటి. మంత్రుల పనితీరుపై ఆరునెలలకోసారి సమీక్ష నిర్వహించి సరిగా పనిచేయని వారికి ఉద్వాసన పలికి కొత్తవారికి చాన్స్ ఇవ్వడం. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోవడం, ఆరు కేబినెట్ పోస్టుల్ని భర్తీ చేయకుండా అవసరమున్నప్పుడు విస్తరించడం వంటివి కూడా ఫార్ములాలో ఉన్నాయి. -
ప్రణబ్ దారెటు?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలపై పడిందా? తమ కార్యక్రమానికి హాజరుకావాలని ఆరెస్సెస్ పంపిన ఆహ్వానాన్ని ఆయన అంగీకరించడం పలు సందేహాలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సుమారు 50 ఏళ్లు పనిచేసినా, ప్రధాని పదవి దక్కలేదని ప్రణబ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రియాశీల రాజకీయాల్లో ఉన్నన్నాళ్లూ ఆరెస్సెస్ జాతి వ్యతిరేక, దుష్ట సంస్థ అని మండిపడ్డ ప్రణబ్..ఇప్పుడు అదే సంస్థ వలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాబోతుండటం దేనికి సంకేతమనేది అందరి మనసులను తొలుస్తున్న ప్రశ్న. ఆరెస్సెస్–బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్న సమయంలో ప్రణబ్ నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరెస్సెస్ అంటరాని సంస్థ కాదనే సందేశం ఎందుకు ఇవ్వబోతున్నారన్నది ఇప్పటికైతే శేష ప్రశ్నే. నాగ్‌పూర్ ప్రసంగంలో తేలుతుందా! ప్రణబ్‌కు ఉన్న హోదా రీత్యా ఆయన్ని ప్రస్తుతానికి ఎవరూ వేలెత్తి చూపట్లేదు. స్వయంగా కాంగ్రెస్ కూడా ఆయన నిర్ణయంపై ఇప్పటి దాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కేంద్రంలో, సుమారు 20 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో నడిపిస్తున్న ఆరెస్సెస్‌తో చర్చలు జరపడానికే ప్రణబ్ ఈ ఆహ్వానానికి అంగీకరించి ఉంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల నుంచి వైదొలగలేదని నాగ్‌పూర్ నుంచి ఏమైనా సందేశం పంపినట్లయితే ఆయనపై ఉన్న గౌరవం పోతుందని తెలంగాణ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. వెళ్లి వాళ్ల తప్పులేంటో చెప్పండి: చిదంబరం ప్రణబ్ నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరై ఆ సంస్థ సిద్ధాంతాల్లోని తప్పులేంటో చెప్పాలని ప్రణబ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని ప్రణబ్ ఎందుకు అంగీకరించారన్న దానిపై ఇప్పుడు చర్చించడం వృథా అని అభిప్రాయపడ్డారు. -
అది జాతిపితను అవమానించటమే!
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ స్మారకం (రాజ్‌ఘాట్) వద్ద విరాళాల హుండీని ఉంచటంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్య జాతిపితను అవమానించినట్లేనని పేర్కొంది. సేకరించిన నిధులను వేటికోసం వినియోగిస్తున్నారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. అయితే మహాత్ముడు స్థాపించిన ‘హరిజన్ సేవక్ సంఘ్’ ఈ హుండీని ఏర్పాటు చేసిందని.. ఈ సంస్థ అవసరాలకే నిధులు వినియోగిస్తున్నట్లు రాజ్‌ఘాట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కమిటీ వివరించింది. దీనిపై కోర్టు మండిపడింది. ‘ఇదేనా మనం జాతిపితకు ఇచ్చే గౌరవం. భారతీయులతోపాటు వేలసంఖ్యలో విదేశీయులూ రాజ్‌ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడ విరాళాల హుండీలు పెట్టడం గాంధీని అవమానించటమే’ అని స్పష్టం చేసింది. రాజ్‌ఘాట్‌లో కనీస ఏర్పాట్లపై వివరాలివ్వాలని సీపీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించింది. -
పల్స్ సర్వేపై అసంతృప్తి
సమస్యలు పరిష్కరించడంలేదని బాయ్‌కాట్ నెల్లూరు సిటీ : పల్స్ సర్వేలో ఎదురవుతున్న పలు ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని, సర్వే ఎన్యూమరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎన్యూమరేటర్లతో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ చిరంజీవి, రెవెన్యూ ఆఫీసర్ గిరిజలు సమావేశం నిర్వహించారు. కొందరు ఎన్యూమరేటర్లు ఫీల్డ్‌లో ఎదురవుతున్న సమస్యలను వారికి చెప్పారు. అధికారులు జేసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దీంతో ఎన్యూమనేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సమస్యలను పరిష్కరించడంలేదని మండిపడ్డారు. సర్వేకి వెళ్లిన సమయంలో సంబంధిత కుటుంబసభ్యులు అందుబాటులో లేకపోవడం, పత్రాలు సరిగా లేకపోవడంతో ఆలస్యమవుతుందన్నారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా ఒత్తిళ్లు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనంతరం సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. -
దర్యాప్తు ఏ దిశగా సాగుతోంది?
అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ తీరుపై హైకోర్టు అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అసలు దర్యాప్తు ఏ దిశగా సాగుతోంది? ఇప్పటివరకు దర్యాప్తులో ఏం తేలింది? తదితర వివరాలతో తదుపరి విచారణ నాటికి ఓ నివేదికను తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులను ఆదేశించింది. డిపాజిటర్ల విశ్వాసాన్ని పెంచేలా ఆ నివేదిక ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులు ఏవైనా బినామీ పేర్లమీద ఉన్నాయా? అన్న విషయాన్ని కూడా తేల్చి ఆ వివరాలను సమర్పించాలంది. అదే విధంగా ఎన్ని ఆస్తులు తనఖా రహితంగా ఉన్నాయి..? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..? వాటి వివరాలను తమ ముందుంచాలని అగ్రిగోల్డ్ యజమాన్యాన్ని ఆదేశించింది. తప్పుడు వివరాలు సమర్పిస్తే జైలుకు పంపేందుకు సైతం వెనకాడబోమని అగ్రిగోల్డ్ యజమాన్యానికి తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్య ప్రజల నుంచి అగ్రిగోల్డ్ యాజమాన్యం వివిధ రూపాల్లో వేల కోట్ల రూపాయలు వసూలు చేసి, వాటిని చెల్లించకుండా ఎగవేసిందని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యా యి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ‘అక్షయగోల్డ్’పై శ్రద్ధ చూపడం లేదు అదే విధంగా అక్షయగోల్డ్ కేసులో కూడా విచారణ అదే రోజుకు వాయిదా పడింది. అక్షయగోల్డ్‌కు చెందిన ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదని సీఐడీని ప్రశ్నించిన హైకోర్టు, ఈ కేసు గురించి అస్సలు శ్రద్ధ చూపడం లేదంటూ అక్షింతలు వేసింది. -
టీడీపీలో అసంతృప్తి జ్వాలలు
* తెలుగు తమ్ముళ్ల అసహనం * భీమవరంలో రెండు వర్గాలుగా పార్టీ శ్రేణులు భీమవరం : క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే అధికార తెలుగుదేశం పార్టీలోని నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. భీమవరం నియోజకవర్గంలో రెండేళ్లుగా నివ్వురుగప్పిన నిప్పులా ఉన్న కార్యకర్తల్లోని అసహనం బయటపడుతోంది. ఇందుకు పార్టీ సమావేశాలే వేదిక కావడం గమనార్హం. మంగళవారం వీరవాసరం, భీమవరంలో జరిగిన పార్టీ సమావేశాల్లో కార్యకర్తలు అసంతృప్తి వెళ్లగక్కారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వ్యవహార శైలిని తప్పుపట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. దీనిని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు కొందరు ఎన్నికల్లో ఆయనకు సరిగా సహకరించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా తమను కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రాధాన్యమిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. భీమవరంలో ఎగిసిన నిరసన భీమవరం పట్టణ పార్టీ అధ్యక్షుడు గనిరెడ్డి త్రినాథ్ అధ్యక్షతన జరిగిన పార్టీ పట్టణ, మండల క మిటీల సమావేశంలో నిరసన గళం వినిపించింది. ఏళ్ల తరబడి సేవ చేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని నాయకులు ధ్వజమెత్తారు. నామినేటెడ్ పదవుల పంపిణీలో కార్యకర్తలను సంప్రదించడం లేదని, పార్టీ కార్యక్రమాలు నిర్వహించినపుడు జనాన్ని తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వారిని కాదని వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారంటూ ఎమ్మెల్యే రామాంజనేయులు చర్యలను ఖండించారు. ఇంతలా జరుగుతున్నా మండల, పట్టణ పార్టీ కమిటీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇలా పలువురు వ్యతిరేక గళం విప్పడం పార్టీ అధ్యక్షులకు మింగుడు పడలేదు. దీని ప్రభావం వ్యవసాయ మార్కెట్ కమిటీ, గునుపూడి దేవస్థానం కమిటీల నియామకాలపై పడుతుందని పలువురు అంటున్నారు. సీఎం దృష్టికి.. భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం మండలంలో నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు కారణంగా వీరవాసరంలో నివాసం ఉండే రాష్ట్ర మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే రామాంజనేయులు వర్గాలుగా టీడీపీ శ్రేణులు విడిపోయాయి. ప్రతి కార్యక్రమంలో మంత్రి సుజాతను అవమానిస్తున్నారంటూ కొందరు రచ్చకెక్కారు. దీంతో మంత్రి సుజాత భీమవరం నియోజకవర్గం వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని దీనివల్ల పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయంటూ ఎమ్మెల్యే రామాంజనేయుల వర్గం సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోకపోడంతో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. నివురు గప్పిన నిప్పులా.. భీమవరం పట్టణంలో ఇళ్లస్థలాల పూడిక, వీరవాసరం మండలం మత్స్యపురిలో గొంతేరు డ్రెయిన్ మట్టి తరలింపు విషయంలో మంత్రి సుజాత, ఎమ్మెల్యే రామాం జనేయుల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. రెండేళ్లలో ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే నియోజకవర్గస్థాయి పార్టీ సమావేశం ఏర్పాటుచేయడంపై కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఇప్పటివరకు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే, పార్టీ పనితీరుపై బహిరంగంగా ఎక్కడా నోరువిప్పిన సందర్భాలు లేవు. వీరవాసరంలో మండిపాటు వీరవాసరం మండలం రాయకుదురులో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో తెలుగు తమ్ముళ్లు వాగ్వాదానికి దిగారు. మంత్రి సుజాతకు మండలంలో ప్రాధాన్యమివ్వడం లేదంటూ మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల పంపకంలో వీరవాసరం మండల నాయకులకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో పనులు చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. -
చంద్రబాబు ప్రకటనపై అంగన్వాడీల అసంతృప్తి
విజయవాడ: అంగన్ వాడీల వేతనాల పెంపుపై శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై అంగన్ వాడీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా.. 2015 సెప్టెంబర్ 1 నుంచి వేతనాలు పెంచూ జీవో జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 2016 ఎప్రిల్ నుంచి వేతనాలు పెంచుతూ జీవోను అమలు చేస్తామంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు అంగన్ వాడీలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. -
నైరాశ్యంలో తమ్ముళ్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మినీ మహానాడు సాక్షిగా అధినాయకులపై తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా ప్రయోజనం కనిపించలేదని పలువురు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా.. పార్టీ పదవులు లేవు.. పథకాలు దక్కటం లేదన్న అభిప్రాయం తమ్ముళ్లలో కనిపిం చింది. తమ పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. నెల్లూరులో సోమవారం టీడీపీ మినీ మహానాడు జరిగింది. ఈ సందర్భంగా అనేకమంది టీడీపీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసిన దేశాయిశెట్టి హనుమంతరావు తమ సంగతేమిటని మంత్రి, జిల్లా అధ్యక్షుడిని ప్రశ్నించారు. మీరు పదవులు పొందారు.. మా గురించీ ఆలోచించండంటూ చురకలంటించారు. బల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. రుణమాఫీపై ఇప్పటికీ స్పష్టత లేదు.. ఇప్పటికైనాస్వచ్ఛమైన నిర్ణయాన్ని ప్రకటించి రైతులకు రుణమాఫీపై ఉన్న సందేహాలను తీర్చాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలుకు జన్మభూమి కమిటీలు ఉన్నా.. అధికారులు తాము చెప్పిన వారికి ఇవ్వకుండా ఇష్టమొచ్చిన వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు. మెజారీటీ మండలాలు ప్రతిపక్షాల చేతిలో ఉండటంతో పథకాల అమలు తీరులో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. వైఎస్ఆర్ హయాంలో రూ.200 పింఛను తీసుకునేప్పుడు కనిపించిన ఆనందం ప్రస్తుతం రూ. వెయ్యి ఇస్తున్నా కనిపించటం లేదన్నారు. పార్టీని వీడిపోయే సందర్భంలో ఎమ్మెల్సీలు ఇచ్చారా? అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారని గూడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జోత్స్నలత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని వీడిపోతారన్న సందర్భంలో రెండు ఎమ్మెల్సీలు ఇచ్చారని ఆమె అన్నారు. ఆమె వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మహిళలకు పదవులేవీ ఇవ్వలేదని ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సైతం కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, వారికి సముచిత స్థానం కల్పించాలని నేతలను కోరటం గమనార్హం. డీసీసీబీ చైర్మన్ ధనుంజయరెడ్డి, సూళ్లూరుపేట జడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధానంగా ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కు గురవుతున్నారని గుర్తుచేశారు. అభివృద్ది అంటే సముద్రతీరంలో ఆరులైన్ల రోడ్లు, బకింగ్‌హాం కాలువ అభివృద్ధి మంచిదే అయినా... వాటి వల్ల చాల మత్స్యకార గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆ విభాగం అధ్యక్షుడు పోల్‌శెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. -
పెరిగిన చినబాబు జోక్యం-మంత్రుల అసంతృప్తి
ప్రభుత్వం, పార్టీ వ్యవహారాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు జోక్యం పెరిగిపోవడంతో మంత్రులు తీవ్ర అసంతృకి లోనవుతున్నట్లు తెలుస్తోంది. షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని కొందరు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చినబాబు వ్యవహార శైలిపై మంత్రులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రతి శాఖలో లోకేష్ జోక్యం పెరిగిపోయిందని కొందరు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. సీసీ కెమారాలు, గన్ మెన్లు , ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా తమపై నిఘా పెడుతున్నారని వారు అవమానంగా భావిస్తున్నారు. వారు చేస్తున్న పనులను, ప్రతి కదలికలను అనుమానించడమే వారి ఆగ్రహానికి కారణమని ప్రచారం జరుగుతోంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రులను అనుమానించే రీతిలో లోకేష్ వ్యవహరిస్తున్నడని లోలోపల రగిలిపోతున్నట్లు సమాచారం. అధికారుల బదీలీలు, ఐఎఎస్‌ల పోస్టింగ్‌ల్లో లోకేష్ పెత్తనం పెరిగిపోయిందని తెలుస్తోంది. మంత్రులను ప్రతి రోజు ఎవరు కలుస్తున్నారు? ఎందుకు కలుస్తున్నారు? మంత్రి పేషీల నుంచి ఏఏ ఫైళ్లు ముందుకు కదులుతున్నాయి? ప్రతి క్షణం చినబాబు తన వేగుల ద్వారా సమాచారం సేకరిస్తుండటంతో వారు చాలా అసౌకర్యంగా ఫీలవుతున్నారు. ఇదెక్కడి నిఘారా బాబు అని అనుకొంటున్నారు. మంత్రులు పేషీలలో వారికి ఇష్టమైన వారిని కాదని, లోకేష్ తనకు నచ్చిన అధిరాలను నియమించడంపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటీ కప్పుడు సీసీ కెమారాల ద్వారా వారి సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా జిల్లాల్లో కూడా మంత్రుల వ్యవహరిస్తున్న తీరుపై లోకేష్ ఎప్పుడికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. మీడియా లైజనింగ్ ఆఫీసర్ల పేరుతో మరి కొంత మంది అనుచరులను తమ పేషీల్లో నియమించాలనే ఆలోచనలో లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు పరిస్థితి మరీ దిగజారుతుందని వార ఆందోళ చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ చేయడానికి లోకేష్‌కున్న అర్హతలు ఏమిటని కొందరు వారిలో వారు ప్రశ్నించుకున్నట్లు వినిపిస్తోంది. ప్రభుత్వంలో పని చేస్తున్న మంత్రులకు లోకేష్ గ్రేడింగ్ ఇవ్వడమేమిటని కొందరు మండిపడుతున్నారు. ఏ ప్రాతిపదికన మంత్రుల పనితీరను ఆయన బేరీజు వేస్తున్నారని అడుగుతున్నారు. మంత్రులను ఇంటికి రప్పించుకొని వారి పనితీరుపై నివేదికలు ఏలా కోరుతారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఎటు వంటి బాధ్యతలు లేని లోకేష్ మంత్రులతో జరిగే సమీక్షలు, సమావేశాలలో ఎందుకు పాల్గొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ మంత్రులపై అజమాయిషీ చెలాయిస్తున్నాడని కొందరు వాపోతున్నారు. తమకు చినబాబు గ్రేడింగ్ మార్కులు అక్కరలేదని, తమ విషయాల్లో జోక్యం చేసుకోకుండా తమ పనిని తాము చేసుకోనిస్తే చాలని వారు ఆశిస్తున్నారు. అధికారుల బదీల్లో తాము సిపార్సు చేసిన వారి కంటే లోకేష్ చెప్పిన వారికే బదీలు జరుగుతున్నాయని, తమ జిల్లాల్లో తమకు నచ్చిన అధికారులను నియమించుకొనే స్వేచ్చ కూడా లేదని వాపోతున్నారు. -
మంత్రులతో విడిగా మాట్లాడతానన్న చంద్రబాబు!
హైదరాబాద్: తమ మంత్రుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. శుక్రవారం సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మంత్రులతో ప్రత్యేకంగా విడిగా మాట్లాడతానని చెప్పినట్టు తెలిసింది. మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించినట్టు సమాచారం. కాగా, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేకంగా నలుగురు అధికారులను నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. -
ఇసుక మాఫియాపై రగిలిన సభ
శాసన సభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి మృణాళిని సమాధానంపై విపక్షం అసంతృప్తి హైదరాబాద్: ఏపీలో ఇసుక మాఫియాపై మంగళవారం శాసన సభలో వాడి వేడి చర్చ జరిగింది. ఇసుక మాఫియాకు పరోక్షంగా అధికారపక్షం సహకరిస్తోందని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. మంగళవారం శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాజన్న దొర, చిర్ల జగ్గిరెడ్డి, జి.శ్రీకాంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి మృణాళిని సమాధానమిచ్చారు. మంత్రి సమాధానంపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజేంద్రనాధ్‌రెడ్డి మాట్లాడుతూ ఇసుక లభ్యత, విక్రయాల్లో ప్రభుత్వ విధానంలో స్పష్టత లేదని చెప్పారు. మాఫియాను ఎదుర్కొనేందుకు డ్వాక్రా గ్రూపుల శక్తి సామర్థ్యాలు సరిపోవేమోనన్న సందేహాన్ని వ్యక్తంచేశారు. ఇందుకోసం ఓ యంత్రాంగం ఉండాలన్నారు. ఇసు కధరల నిర్ధారణకు అనుసరిస్తున్న ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించా రు. ఇసుక రీచ్‌లను పేరుకే డ్వాక్రా మహిళా సంఘాలు నిర్వహిస్తున్నాయని, వాస్తవానికి అధికార పార్టీ వాళ్లే వీటిని నడిపిస్తున్నారని చెప్పారు. రాజమండ్రి ప్రాంతంలో ఇసుక తవ్వకాలపై ఇద్దరు అధికార పక్ష ఎమ్మెల్యేల మధ్య ఘర్షణే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఇందుకు మంత్రి మృణాళిని తీవ్ర అభ్యంతరం చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ చర్చకు అనుమతించవద్దని స్పీకర్‌ను కోరారు. అందరికీ ఆపాదించేలా వ్యాఖ్యలు చేయవద్దని స్పీకర్ సూచించారు. రాజేంద్రనాధ్‌రెడ్డి సోమవారం సభలో చేసినట్టుగా భావిస్తున్న ఓ వ్యాఖ్యను స్పీకర్ ఉదహరించారు. దీనికి రాజేంద్రనాధ్ అభ్యంతరం చెప్పారు. తనకా ఉద్దేశం లేదని, తాను మాట్లాడిన దానికి కొందరు లేనిపోనివి ఆపాదించడంవల్లే ఆ అపోహ కలిగిందని అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం మంత్రి మృణాళిని సమాధానమిస్తూ అంతా సక్రమంగానే ఉందని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన వెంటనే మరో 200 ఇసుక క్వారీలను గుర్తించి వేలం వేస్తామన్నారు. ఏ జిల్లాల్లో ఎన్ని సంఘాలకు క్వారీలను అప్పగించింది, ఎంతెంత తవ్విందీ, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని లిఖితపూర్వకంగా సభ ముందుంచారు. -
మీకో న్యాయం... మాకో న్యాయమా?
నామినేటెడ్ పోస్టులకు గడువుపై సిద్ధును ప్రశ్నించిన శంకర్ బెంగళూరు : నామినేటెడ్ పోస్టుల భర్తీ నేపథ్యంలో పలువురు నేతల్లో నెలకొన్న అసంతృప్తి విమర్శల రూపంలో భగ్గుమంటోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ సమయంలో అవకాశం దక్కని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా గురువారమిక్కడ ఓ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో కేపీసీసీ సభ్యుడు శంకర్ మునవళ్లి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు క్షీణిస్తోందని, ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే ప్రధాన కారకులని ఆరోపించారు. మొదటి నుంచే కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను సిద్ధరామయ్య తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక పార్టీలోని లింగాయత్ వర్గానికి చెందిన నాయకులను సైతం పార్టీలో లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టులను 18 నెలల గడువుతో పంచిపెట్టిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సీఎం కుర్చీకి కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారా అంటూ శంకర్ ప్రశ్నించారు. ఁనామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసిన వారికి 18 నెలల గడువును కేటాయిస్తూ పదవులను అప్పగించారు. మరి మీ సీఎం కుర్చీ విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారా? 18 నెలలు పూర్తయిన తర్వాత సీఎం కుర్చీని ఎందుకు విడిచిపెట్టలేదు* అని విమర్శలు గుప్పించారు. -
సణుగుడు గొణుగుడు
న్యూఢిల్లీ: ఎన్నికల తేదీ ఇంకా ప్రకటించనేలేదు, కాంగ్రెస్ పార్టీలో అప్పుడే అసంతృప్తి, పెదవి విరుపులు మొదలయ్యాయి. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో తమకు ఇచ్చిన హోదాపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు జూనియర్ మంత్రిగా పని చేసిన అర్విందర్‌సింగ్ లవ్లీ నేతృత్వంలోని కమిటీలో ‘నేను పని చేయడమా?’ అని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పెదవి విరిచినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తన అంగీకారం లేకుండా, కనీసం తనకు చెప్పకుండా తన పేరును కమిటీలో చేర్చడంపై దీక్షిత్ బాహాటాంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ ప్రకటించిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో దీక్షిత్‌తో పాటు మరో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రతిష్టను పునరుద్ధరించగలరన్న పూర్తి నమ్మకాన్ని కేంద్ర నాయకత్వం అర్విందర్ సింగ్‌పై ఉంచింది. లవ్లీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ కాంగ్రెస్‌లోని రెండు గ్రూపుల మధ్య ఉన్న విభేదాలను సైతం ఈ కమిటీ ఏర్పాటు బట్టబయలు చేసింది. ఒక గ్రూపు షీలాదీక్షిత్‌కు సన్నిహితమైనది కాగా, మరో గ్రూపు ఆమె అధికారంలో ఉన్న 15 ఏళ్ల కాలంలో ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన వారితో కూడి ఉంది. ‘‘షీలాదీక్షిత్ ఏ కమిటీలోనూ పని చేయడానికి సుముఖంగా లేరు. కానీ పార్టీకి మరో విధంగా సేవ చేయాలని ఆమె భావిస్తున్నారు’’ అని ఓ మాజీ ఎమ్మెల్యే చెప్పారు. ఈ ఎన్నికల కమిటీని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాటు చేశారని, షీలాదీక్షిత్ సహా ఎవరైనా సరే ఆ నిర్ణయంపై స్పందించడం వల్ల కలిగే ప్రయోజనమేదీ లేదని అర్వింద్ లవ్లీకి సన్నిహితుడైన మరో నేత అన్నారు. ఎన్నికల కమిటీపై ఎవరికీ ఎలాంటి అసంతృప్తి లేదని కాంగ్రెస్ ఢిల్లీ ప్రదేశ్ ప్రధాన ప్రతినిధి ముఖేశ్ శర్మ చెప్పారు. -
టీడీపీలో అసమ్మతి సెగలు
అసంతృప్తితో రగులుతున్న సీనియర్లు ‘తూర్పు’లో రెండు వర్గాలుగా విడిపోయిన నాయకులు గుడివాడలో ముదిరిన వర్గపోరు నూజివీడులో కులాలవారీగా జట్టు కట్టిన వైనం సాక్షి ప్రతినిధి, విజయవాడ : అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా నిండకముందే టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. జిల్లాలోని అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పలు నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలపైనే మాటల తూటాలు పేలుస్తున్నారు. గుడివాడ, నూజివీడు, విజయవాడ తూర్పు నియోజకవర్గాలతో పాటు జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్నికల నుంచే అసమ్మతి... సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటమి భయంతో ఇతర పార్టీల నాయకులను భారీగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఆ సమయంలో వారికి టీడీపీ అధినేత చంద్రబాబు పలు హామీలు ఇచ్చారు. కొందరికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని, మిగిలిన వారికి అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు కేటాయిస్తామని నమ్మించారు. అయితే, ఎన్నికల ముందే కొందరికి చంద్రబాబు టికెట్లు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మిగిలిన వారికి నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వకుండా తాత్సా రం చేస్తున్నారు. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో రోజురోజుకూ అసహనం పెరుగుతోంది. మరోవైపు ఒకే నియోజకవర్గంలో కొందరు నాయకులకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో వర్గ విభేదాలు పెరుగుతున్నాయి. ‘గుడివాడ’లో గందరగోళం గుడివాడ నియోజకవర్గంలోనూ టీడీపీ నాయకుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నియోజకవర్గానికి చెందిన పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రస్తుతం కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరైన పిన్నమనేని కూడా గత ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆయనకు ఆప్కాబ్ చైర్మన్ పదవి ఇస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారని పిన్నమనేని వర్గీయులు మండిపడుతున్నారు. ఇటీవల గుడివాడలో జరిగిన టీడీపీ నందివాడ మండల సమావేశంలో పిన్నమనేని మాట్లాడుతూ తన అనుచరులు, సహచరులకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. సామాజిక పింఛన్ల తనిఖీ కమిటీల్లో తాను చెప్పిన వారిని ఒక్కరినీ నియమించలేదని, మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని కూడా తాను సూచించిన వ్యక్తికి ఇవ్వలేదని పిన్నమనేని ఇటీవల మరోసారి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన రావి వెంకటేశ్వరరావు హవా సాగుతుండటంతో పిన్నమనేని వర్గీయులు జీర్జించుకోలేకపోతున్నారు. కనీస ప్రాధాన్యం దక్కని యలమంచిలి రవి! తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి టీడీపీలో కనీస ప్రాధాన్యత కూడా లభించడం లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన యలమంచిలి రవి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి దేవినేని నెహ్రూ (కాంగ్రెస్), గద్దె రామ్మోహన్ (టీడీపీ)లపై గెలుపొందారు. అప్పట్లో వంగవీటి రాధాకృష్ణ పూర్తిగా మద్దతు ఇవ్వడంతో రవి సునాయాసంగా గెలుపొందారు. అయితే, పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత రవి కొంతకాలం స్తబ్దుగా ఉన్నారు. గత ఏడాది జరిగిన రాష్ట్ర విభజన, ఇతర పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రవి మళ్లీ తూర్పు నియోజకవర్గ సీటును ఆశించారు. వివాదరహితుడిగా పేరున్న ఆయనకు సీటు ఇస్తానని చంద్రబాబు కూడా హామీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, ఎన్నికల ముందు సీన్ రివర్స్ అయ్యింది. తూర్పు టికెట్‌ను గద్దె రామ్మోహన్‌కు ఇచ్చారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రవికి తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో ఆయన వర్గీయులు అసమ్మతితో రగిలిపోతున్నారు. నూజివీడులో కులాల కుమ్ములాట నూజవీడు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కులాల వారీగా జట్టు కట్టి ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో నూజివీడు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన అని ఒక సామాజికవర్గ నేతలు చెబున్నారు. మరో సామాజికవర్గానికి చెందిన టీడీపీ నూజివీడు మండల అధ్యక్షుడు కాప శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు నూతక్కి వేణు కలిసి తమ నియోజకవర్గానికి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇన్చార్జి కాదని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో రెండు సామాజికవర్గాల మధ్య పోరు సాగుతోంది. మరోవైపు ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా ముద్దరబోయినకు వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. ఇలా జిల్లా అంతటా టీడీపీలో అసమ్మతి నెలకొంది. కొందరికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండగా నిలుస్తున్నారు. మరికొందరికి మంత్రి కొల్లు రవీంద్ర అండగా ఉంటున్నారు. ప్రతి ప్రాంతంలోనూ రెండు వర్గాలు ఆధిపత్యం కోసం కత్తులు దూస్తున్నాయి. కొన్నిసార్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం గొడవలకు దిగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. -
ఒడ్జెట్ పై టీఆర్ఎస్ అసంతృప్తి
-
తెలుగుతమ్మళ్లలో అసంతృప్తి సెగలు
-
గులాబీ ముళ్లు
టీఆర్ఎస్లో టిక్కెట్ల లొల్లి మొదలైంది. 13 అసెంబ్లీ స్థానాలకు 12 చోట్ల అభ్యర్థిత్వాలను కేసీఆర్ ప్రకటించిన వెంటనే పార్టీలో అసమ్మతి రాజుకుంది. తాము ఆశించిన సీట్లను మరొకరికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని అసమ్మతి నేతలు, అభ్యర్థులతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలో ఉండటానికి కొంతమంది ప్రయత్నిస్తుండగా, మరికొందరు పార్టీలోనే ఉంటూ అభ్యర్థిని ఓడించడానికి తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, మంథని, మానకొండూరు, కోరుట్ల నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై నేతల్లో అసంతృప్తి పెరిగిపోయింది. రామగుండంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు అవకాశం ఇవ్వగా, నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కోరుకంటి చందర్ రెబెల్‌గా బరిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థుల జాబితా విడుదల కాగానే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల మేరకు రెబెల్‌గా పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు. 2009లో చందర్ టీఆర్ఎస్ నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీచేయగా, సోమారపు సత్యనారాయణ రెబెల్‌గా బరిలోకి దిగారు. ఎన్నికల అనంతరమే 2014లో పార్టీ టికెట్ కోరుకంటి చందర్‌కు ఇస్తామని అప్పట్లో పార్టీ ప్రకటించింది కూడా. చివరకు చందర్‌కు పార్టీ మొండిచేయి చూపి, సత్యనారాయణకు టికెట్ ఇవ్వడంతో 2009 నాటి పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. పెద్దపల్లిలో పరిస్థితి మరోరకంగా ఉంది. అక్కడినుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి టికెట్‌ను ఆశించారు. పార్టీ హైకమాండ్ మాత్రం దాసరి మనోహర్‌రెడ్డి వైపే మొగ్గుచూపింది. దీంతో ఈద కూడా అసమ్మతితో రగిలిపోతున్నారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోకపోతే ఆయన దాసరికి మద్దతు పలకడం అనుమానమే. మానకొండూరులో టికెట్ తనకే ఖాయమనుకొని ధీమాగా ఉన్న నియోజకవర్గ ఇన్చార్జి ఓరుగంటి ఆనంద్ అనూహ్యంగా తెరపైకి రసమయి బాలకిషన్ రావడంతో ఖంగుతిన్నారు. రసమయి బాలకిషన్‌కు టికెట్ ఇవ్వడంతో ఆనంద్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన పుట్ట మధుకు మంథని టిక్కెట్ కేటాయించడంతో అప్పటివరకు టిక్కెట్ ఆశించిన చందుపట్ల సునీల్‌రెడ్డి రెబెల్‌గా పోటీలో ఉంటానంటున్నారు. ఈ నెల 4నే ఆయన నామినేషన్ సైతం సమర్పించారు. కోరుట్లలో ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ టికెట్ ఆశించారు. అయితే జిల్లా పరిషత్ చైర్పర్సన్ సీటు బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆమెను కథలాపూర్ నుంచి పార్టీ బరిలోకి దింపింది. కానీ స్థానికంగా టీఆర్ఎస్ ముఖ్యనేతలు సహకరించడం లేదనే అసంతృప్తి ఇతర నేతల్లో నెలకొంది. ఇది ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశం ఉన్నట్లు పరిశీలకుల అంచనా. ఇక చొప్పదండి టికెట్ ప్రకటించగానే అసమ్మతి వెల్లువెత్తే అవకాశం ఉందని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. అభ్యర్థుల జాబితా వెల్లడితో టీఆర్ఎస్లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న అసమ్మతిరాగం, అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుందా అనే కోణంలో పార్టీ అగ్రనాయకులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ముందుజాగ్రత్తగా అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు కేసీఆర్ కుటుంబసభ్యులు, పార్టీ సీనియర్లు రంగంలోకి దిగినట్లు తెలిసింది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, ఏదో ఒకరకంగా టికెట్ రాని లోటును భర్తీ చేస్తామని అసమ్మతి నేతలకు తాయిలాల గాలం వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసమ్మతిని ఆదిలోనే అధిష్టానం తుంచి వేస్తుందా లేక అభ్యర్థులను పుట్టిముంచే స్థాయికి చేరుకుంటుందా అనే మీమాంసలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. -
ఎంపీలు బాధ్యత తెలుసుకోవాలి
పార్లమెంటులో ఎంపీల పనితీరుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ పార్లమెంటేరియన్‌గా అపార అనుభవం ఉన్న ప్రణబ్ ముఖర్జీ, ప్రస్తుతం పార్లమెంటు పనిచేస్తున్న తీరు పట్ల తన అసంతృప్తిని తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలు, సమస్యలపై చర్చించాలని, అప్పుడే వారికి తమ అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఏ అంశం మీద అయినా చర్చించడానికి, అభ్యంతరాలు తెలియచేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి అసలు పార్లమెంటు అంటూ పనిచేయాలని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పార్లమెంటును అడ్డుకోవడం తగదని, ఎంపీలు తమ బాధ్యతలను గుర్తెరగాలని ప్రణబ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్లమెంటు నడుస్తున్నతీరుపై ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన తెలిపారు. -
కర్నూలు రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి
ఒంగోలు, న్యూస్‌లైన్ : కర్నూలు రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై కలెక్టర్, నగర పాలకసంస్థ ప్రత్యేకాధికారి విజయకుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు రోడ్డు విస్తరణ పనుల జాప్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ విజయలక్ష్మిని ఆదేశించారు. అద్దంకి బస్టాండ్ నుంచి బైపాస్ రోడ్డు వరకూ 1230 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పుతో సిమెంట్ రోడ్డు నిర్మించాల్సి ఉండగా కేవలం ఉత్తరం వైపు 960 మీటర్లు, దక్షిణం వైపు 740 మీటర్లు మాత్రమే రోడ్డు ఎందుకు నిర్మించారని కలెక్టర్ ప్రశ్నించారు. కేవలం మార్జిన్ ఉన్నంత వరకే సిమెంట్ రోడ్డు నిర్మించడం సరికాదంటూ ఇంజినీరింగ్ అధికారుల పనితీరుపై మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రోడ్డు ఆక్రమించి భవనాలు నిర్మించిన యజమానులకు 3 రోజుల్లో నోటీసులు అందించాలని ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే నోటీసులు ఇస్తున్నామని యజమానులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఒంగోలు ఊరచెరువులో నూతనంగా నిర్మిస్తున్న చేపల మార్కెట్ పనులు ప్రారంభించి రెండేళ్లయినా పనులు పూర్తికాకపోవడానికి కారణం కేవలం నిర్లక్ష్యమేనన్నారు. బాధ్యులైన ఇంజినీర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదనలు పంపాలని కమిషనర్‌ను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో లీజుకు ఇచ్చిన షాపులు యజమానుల ఆధీనంలో కాకుండా బినామీ చేతుల్లో ఉంటే లీజులు రద్దు చేసి కొత్తగా వేలం నిర్వహించాలని సూచించారు. నగరపాలక సంస్థలో నిర్మించే రోడ్లకు సైడు కాల్వలు అనుసంధానం చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. చెత్త చెదారాలను రహదారుల వెంట వేయకుండా చర్యలు తీసుకోవడంతో పాటు జాతీయ రహదారి వెంబడి ఉన్న చెత్తను 3 రోజుల్లో తొలగించాలని చెప్పారు. నగరపాలక సంస్థలో ఎంతమంది సిబ్బంది ఉండాలి.. ఎంతమంది ఉన్నారనే విషయాలతో కూడిన నివేదికను రెండు రోజుల్లో పంపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.