ముస్లిం కన్నా గోవుగా ఉండటమే నయం | Safer to be a cow than a Muslim | Sakshi
Sakshi News home page

ముస్లిం కన్నా గోవుగా ఉండటమే నయం

Published Mon, Jul 23 2018 4:48 AM | Last Updated on Mon, Jul 23 2018 4:48 AM

Safer to be a cow than a Muslim - Sakshi

శశిథరూర్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు శశిథరూర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో చాలా చోట్ల ముస్లింగా కన్నా గోవులా ఉండటమే సురక్షితమని అనిపిస్తోందని శనివారం ట్వీట్‌ చేశారు.  ఆవులను స్మగ్లింగ్‌ చేస్తున్నాడన్న ఆరోపణలపై రాజస్తాన్‌లో ఓ యువకుడిని కొట్టి చంపిన నేపథ్యంలో థరూర్‌ ఇలా స్పందించారు. అయితే, కాంగ్రెస్‌ పోరాటాన్ని బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేసే నేతలపై చర్యలు తప్పవని పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హెచ్చరించారు. ఆయన ప్రత్యేకంగా ఎవరి పేరూ ప్రస్తావించకున్నా థరూర్‌ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement