cow smuggling
-
Rajasthan elections 2023: మియో వర్సెస్ ‘రక్షక్’
రాజస్తాన్‌లోని ఆళ్వార్ జిల్లా ఆవుల స్మగ్లింగ్, సంబంధిత హింసాకాండతో గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మత ఘర్షణలు కూడా అక్కడ పరిపాటి. ఈ నేపథ్యంలో ఆవులను కాపాడేందుకు అక్కడ కొన్నేళ్లుగా గో రక్షకులు కూడా తెరపైకి రావడంతో పరిస్థితి కాస్తా ముదురు పాకాన పడింది. స్థానిక మియో ముస్లింలు ఆవులను లక్ష్యంగా చేసుకున్నారన్నది వారి ఆరోపణ. కానీ ఆవుల స్మగ్లింగ్, వధతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ముస్లింలు వాదిస్తున్నారు. నవంబర్ 25న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల పట్ల వారిలో భిన్న స్పందన వ్యక్తమవుతోంది. నిత్యం తమపై బురదజల్లడం బీజేపీ నైజమని మియో ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా కమలం పారీ్టయే రాష్ట్రానికి ఆశా కిరణమన్నది గో రక్షకుల అభిప్రాయంగా కని్పస్తోంది. బీజేపీ అలా.. కాంగ్రెస్ ఇలా...! మియో ముస్లింలకు ప్రధానంగా పశు పోషణే జీవనాధారం. అభివృద్ధి, మెరుగైన ఉపాధి లభిస్తే తప్ప తమ జీవితాల్లో మార్పు రాబోదన్న నిశి్చతాభిప్రాయం వారి మాటల్లో ప్రతిఫలిస్తోంది. ఈ ముస్లిం ప్రాబల్య గ్రామాలు చాలావరకు వెనకబడే ఉన్నాయి. రోడ్ల వంటి మౌలిక వసతులు, స్కూళ్లు తదితర సదుపాయాలకు దూరంగా ఉండిపోయాయి. బీజేపీ నిత్యం తమను దోషుల్లా చిత్రిస్తుందన్నది వారి ప్రధాన ఆవేదన. ‘‘అందుకే మా జీవితాలను ఎంతో కొతం మెరుగు పరుస్తుందని పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేశాం. కానీ ఐదేళ్లయినా ఏ మార్పూ లేదు’’ అంటూ మొహమ్మద్ రఫీక్ వాపోయాడు. ‘‘ఓ 30 ఏళ్ల క్రితం దాకా మతపరమైన సమస్యలేవీ పెద్దగా ఉండేవి కాదు. హిందువులు, మేం కలసిమెలసి బతికేవాళ్లం. కానీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం మొదలయ్యాక పరిస్థితులు బాగు చేయలేనంతగా పాడయ్యాయి’’ అని అన్సారీ అనే వృద్ధుడు ఆవేదన వెలిబుచ్చాడు. గూండాలన్నా పట్టించుకోం! ఇక గో రక్షకుల వాదన మరోలా ఉంది. సనాతన ధర్మంలో గోవును మాతగా పూజించడం సంప్రదాయం. వాటికి అవమానం, ప్రాణాపాయం జరిగితే ఊరుకునేది లేదు’’ అని ఒక గో రక్షక్ స్పష్టం చేశారు. ‘‘నేను ఎనిమిదేళ్లుగా గో రక్షక్గా ఉంటున్నా. మాపై దొంగలు, బందిపోట్లు అని ముద్ర వేశారు. గూండాలని కూడా నిందిస్తున్నారు. అయినా దేనికీ భయపడేది లేదు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఆవుల స్మగ్లర్లు పోలీసుల సమక్షంలోనే మాపై దాడులకు దిగుతున్నా అడ్డుకునే దిక్కు లేదు. ఎప్పుడు ఏ కారును ఆపినా ఆవుల కళేబరాలే కని్పస్తున్నాయి. మేమెలా సహించేది?’’ అని ప్రశ్నించారాయన. ముస్లిం సంతుïÙ్టకరణతో కూడిన పేరు గొప్ప సోదరభావం తమకు అక్కర్లేదని మరో గో రక్షక్ స్పష్టం చేశారు. మత రాజకీయాలు ‘వారికి’ అలవాటేనని ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దాలంటే బీజేపీ రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌పై అసంతృప్తి అయితే కులమతాలతో నిమిత్తం లేకుండా ఆళ్వార్ ప్రజల్లో చాలామంది కాంగ్రెస్ పాలన పట్ల పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలూ జరగలేదన్నది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ నేతల మాటలు చేతల్లో ఎక్కడా కని్పంచలేదని వారు వాపోతున్నారు. ‘‘అందుకే కాంగ్రెస్‌కు మరోసారి ఓటేయాలని లేదు. అలాగని చూస్తూ చూస్తూ మమ్మల్ని అడుగడుగునా అనుమానించి అవమానిస్తున్న బీజేపీకి ఓటేయలేం. మా పరిస్థితి అయోమయంగానే ఉంది’’ అని స్థానిక ముస్లిం యువకుడొకరు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి మియో ముస్లింలు ఎవరికి ఓటేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఆ మూక హత్యలు మావాళ్లు చేసినవే’
జైపూర్: తన మద్దతుదారుల మూకదాడిలో ఆవుల స్మగ్లర్లు ఐదుగురు హతమయ్యారని చెప్పుకున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహూజాపై ఆల్వార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ దొంగతనం ఆరోపణలపై శుక్రవారం మేవాట్‌కు చెందిన ముస్లింలు చిరంజీలాల్ సైనీ అనే వ్యక్తిని కొట్టి చంపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో అహూజా ‘లావాండి ప్రాంతంలో మా వాళ్ల మూకదాడిలో ఐదుగురు హతమయ్యారు. ఇలాంటిది జరగడం మాత్రం ఇదే మొదటిసారి. ఆవుల దొంగలపై మూకదాడులకు పాల్పడిన మా వాళ్లకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చే పూచీ నాది’అని అంటున్నట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. -
పెహ్లూ ఖాన్: రాజస్థాన్ హైకోర్టు కీలక ఉత్తర్వులు
జైపూర్: గోరక్షకుల కిరాకత మూకదాడిలో మృతి చెందిన పెహ్లూ ఖాన్, అతని ఇద్దరు కుమారులపై నమోదైన ఆవుల స్మగ్లింగ్ కేసును రాజస్థాన్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. మూకదాడిలో చనిపోయిన పెహ్లూ ఖాన్, అతని కొడుకులపై గత మే నెలలో రాజస్థాన్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జంతువధ, జంతు తరలింపు నిషేధ చట్టంలోని సెక్షన్ 5,8, 9ల కింద ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అభియోగాలు మోపారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన పెహ్లూ ఖాన్ కొడుకులకు తాజాగా ఊరట లభించింది. 2017 ఏప్రిల్ 1వ తేదీన అల్వార్‌లో పెహ్లూ ఖాన్, అతని కొడుకులు ఓ వాహనంలో ఆవులను తరలిస్తుండగా.. అతను ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడనే అనుమానంతో గోరక్షకులు కిరాతక చర్యకు దిగారు. వారి వాహనాన్ని అడ్డుకొని.. వారిపై దాడి చేశారు. వృద్ధుడు అన్న కనికరం చూపకుండా గోరక్షకులు అతన్ని చితకబాదడంతో.. రెండురోజుల తర్వాత పెహ్లూ ఖాన్ ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో బాధితుడు, మృతుడైన పెహ్లూ ఖాన్‌కు వ్యతిరేకంగానే చార్జిషీట్ పోలీసులు దాఖలు చేయడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, గత బీజేపీ ప్రభుత్వం హయాంలో ఈ కేసు విచారణ జరిగిందని, ఆ విచారణ అనుగుణంగానే ఇప్పుడు చార్జిషీట్ వేశారని, . కేసు విచారణలో ఏమైనా వివక్షలు, అవకతవకలు ఉంటే.. కేసును మళ్లీ పునర్విచారణ జరిపిస్తామని అప్పట్లో సీఎం అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. మూకదాడిలో తండ్రిని కోల్పోయానని, అయినా తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని అప్పట్లో పెహ్లూ ఖాన్ కొడుకు ఇర్షాద్ (25) ఆవేదన వ్యక్తంచేశాడు. -
పెహ్లూ ఖాన్ కేసులో న్యాయం ఫెయిల్?
సాక్షి, న్యూఢిల్లీ : నాడు దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన పెహ్లూఖాన్ మూక హత్య కేసులో ఆరుగురు నిందితులు నిర్దోషులుగా విడుదలవడం అంతే సంచలనం సృష్టించింది. 2017, ఏప్రిల్ నెలలో రాజస్థాన్‌లో అల్వార్ ప్రాంతంలో పాలవ్యాపారి పెహ్లూ ఖాన్ (55)ను ఆవులను కబేళాకు తరలిస్తున్నాడనే అనుమానంపై బజరంగ్ దళ్, బీజేపీకి చెందిన కార్యకర్తలు దాడి చేసి చితకబాదారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన పెహ్లూఖాన్ కొన్ని రోజుల తర్వాత మరణించారు. ఈ సంఘటనను పలువురు సెల్ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అప్పుడది వైరల్ కూడా అయింది. పెహ్లూఖాన్ నుంచి పోలీసులు మరణ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఈ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులను అల్వార్ జిల్లా జడ్జీ బుధవారం నాడు విడుదల చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే ఉంది. ప్రభుత్వం ఒత్తిడికి లొంగిపోయిన రాష్ట్ర పోలీసులు కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించి ఉండవచ్చు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమి చేసినట్లు. మూక హత్యలను తీవ్రంగా పరిగణిస్తామని, ముఖ్యంగా గోవుల పేరిట జరుగుతున్న ఘోరాలను కఠిన నేరాలుగా పరిగణిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అందులో భాగంగా మామూలు హత్యల్లా కాకుండా మూక హత్యలను తీవ్రంగా పరిగణిస్తామంటూ ఈ ఏడాది మొదట్లో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ బిల్లును కూడా తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం మరీ రాక్షసంగా ఉందంటూ హిందూత్వ శక్తులు విమర్శించాయి కూడా. ఇలాంటి నేరాలను అరికట్టాలంటే కొత్త చట్టాలేవీ అవసరం లేదని, పోలీసులు చిత్త శుద్ధితో పనిచేస్తే ఉన్న చట్టాలు కూడా సరిపోతాయని ఇప్పుడనిపిస్తోంది. మూక దాడిని చిత్రీకరించిన సెల్ఫోన్లను పోలీసులు సక్రమంగా స్వాధీనం చేసుకోలేదు. పెహ్లూ ఖాన్ మరణవాంగ్మూలాన్ని కూడా పోలీసులు సరిగ్గా రికార్డు చేయలేక పోయారు. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వీడియోలను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడంలో కూడా పోలీసులు విఫలమయ్యారు. ఇదంతా పోలీసుల నిర్లక్ష్యమని భావించలేం. నేరస్థుల పట్ల పోలీసులు చూపించిన సానుకుల వైఖరి. అప్పటి ప్రభుత్వం పట్ల వారు ప్రదర్శించిన గురు భక్తి. ఇప్పుడు ఈ కేసును పైకోర్టులో అప్పీల్ చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తీర్పును పైకోర్టులో అప్పీల్ చేసినంత మాత్రాన న్యాయం జరుగుతుందని ఆశించలేం. పోలీసు విచారణలో ఎక్కడ పొరపాట్లు జరిగాయో గుర్తించి, మళ్లీ దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేయడం లాంటి చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అదికూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది. -
అతని మీదే ఉల్టా చార్జ్‌షీట్ వేశారు!
న్యూఢిల్లీ: గో రక్షకుల కిరాకత మూక దాడిలో మృతి చెందిన పెహ్లూ ఖాన్‌కు వ్యతిరేకంగా రాజస్థాన్ పోలీసులు గురువారం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. జంతువధ, జంతు తరలింపు నిషేధ చట్టంలోని సెక్షన్ 5,8, 9ల కింద పెహ్లూ ఖాన్, అతని కొడుకులపై ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అభియోగాలు నమోదు చేశారు. 2017 ఏప్రిల్ 1వ తేదీన అల్వార్‌లో పెహ్లూ ఖాన్, అతని కొడుకులు ఓ వాహనంలో ఆవులను తరలిస్తుండగా.. అతను ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడనే అనుమానంతో గోరక్షకులు కిరాతక చర్యకు దిగారు. వారి వాహనాన్ని అడ్డుకొని.. వారిపై దాడి చేశారు. వృద్ధుడు అన్న కనికరం చూపకుండా గోరక్షకులు అతన్ని చితకబాదడంతో.. రెండురోజుల తర్వాత పెహ్లూ ఖాన్ ప్రాణలు విడిచారు. ఈ నేపథ్యంలో బాధితుడు, మృతుడైన పెహ్లూ ఖాన్‌కు వ్యతిరేకంగానే చార్జిషీట్ దాఖలు చేయడంతో పోలీసులు యూటర్న్ తీసుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ‘గత బీజేపీ ప్రభుత్వం హయాంలో ఈ కేసు విచారణ జరిగింది. ఆ విచారణ అనుగుణంగానే ఇప్పుడు చార్జిషీట్ వేశారు. కేసు విచారణలో ఏమైనా వివక్షలు, అవకతవకలు ఉంటే.. కేసును మళ్లీ పునర్విచారణ జరిపిస్తాం’ అని తెలిపారు. పెహ్లూ ఖాన్ కొడుకు ఇర్షాద్ (25) మాట్లాడుతూ..‘గో రక్షకుల దాడిలో మా నాన్నను కోల్పోయాం. ఇప్పుడు మామీదే స్మగ్లర్లుగా చార్జ్‌షీట్ వేశారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ కేసును సమీక్షించి.. మాపై కేసును ఎత్తివేస్తారని భావించాం. ప్రభుత్వం మారడంతో న్యాయం జరుగుతుందని ఆశించాం. కానీ అలా జరగడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. -
మూక హత్య కేసులో మరో ట్విస్ట్
జైపూర్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజస్థాన్ మూక హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో గత శుక్రవారం రక్బర్ ఖాన్ (28) అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో అతను మరణించిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల నిర్లక్ష్యమే బాధితుడి మృతికి కారణమని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ అక్బర్ ఖాన్‌ను సకాలంలో ఆసుపత్రికి తరలించకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రికి తరలించకుండా బాధితుడిని 3గంటల 45 నిమిషాల పాటు పోలీస్ కస్టడీలో ఉంచారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. దీంతో కేసును స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్‌కు బదిలీ చేసినట్లు, పోలీసుల నిర్లక్ష్యంపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు జైపూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ హేమంత్ ప్రియదర్శి తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. దాడి జరిగినట్లు పోలీసులకు అర్థరాత్రి 12.41 సమాచారం ఇచ్చామని, వారు 1,20కు ఘటనాస్థలికి వచ్చినట్లు స్థానిక మానవ హక్కుల కార్యకర్త నవల్ కిషోర్ తెలిపారు. బురదతో ఉన్న బాధితుడు రక్బర్ ఖాన్‌కు పోలీసులు స్నానం చేయించారని, అనంతరం తన ఇంటికి వచ్చి ఆవులను తరలించడానికి వాహనం ఏర్పాటు చేయమని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సమయంలో పోలీసులు బాధితుడిపై చేయిచేసుకున్నట్లు కిషోర్ కుటుంబ సభ్యులు ఒకరు చెప్పారు. అతను అప్పుటికి బతికే ఉన్నాడని కూడా తెలిపారు. మరోవైపు బాధితుడు గాయాలతో అరుస్తున్నా.. పోలీసులు పట్టించుకోకుండా టీ తాగుతూ కాలక్షేపం చేశారని కిషోర్ పేర్కొన్నారు. అనంతరం తను ఆవులను గోశాలకు తీసుకెళ్లానని, పోలీసులు బాధితుడిని స్టేషన్ తీసుకెళ్లారని చెప్పారు. ఇక ఆసుపత్రి డాక్టర్‌ను సంప్రదించగా.. పోలీసులు బాధితుడి తీసుకొచ్చేలోపు అతను మరణించాడని స్పష్టం చేశారు. రక్బర్ ఖాన్, అతని స్నేహితుడు అస్లాం లాడ్‌పూర్‌లో రెండు ఆవులను కొనుగోలు చేసి, హరియాణాలోని కొల్గాన్‌కు తీసుకువెళ్తుండగా.. అల్వార్ జిల్లాలోని లాలావండి అటవీ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. అస్లాం వారి నుంచి తప్పించుకోగా రక్బర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే బాధితుడి మరణానికి పోలీసులు కూడా కారణమని ఆరోపణలు రావడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఇప్పటికి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఈ ఘటన పట్ల సీరియస్‌గా ఉన్నారు. గతంలో కూడా గోరక్షణ పేరిట అల్వార్ జిల్లాలో ఇలాంటి దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో పాలరైతు పెహ్లూ ఖాన్ గతేడాది ఏప్రిల్‌లో చనిపోగా.. అతని బంధువు ఉమర్ అహ్మద్ నవంబర్‌లో మృతిచెందాడు. చదవండి: రాజస్తాన్‌లో మూక హత్య.. -
ముస్లిం కన్నా గోవుగా ఉండటమే నయం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో చాలా చోట్ల ముస్లింగా కన్నా గోవులా ఉండటమే సురక్షితమని అనిపిస్తోందని శనివారం ట్వీట్ చేశారు. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలపై రాజస్తాన్‌లో ఓ యువకుడిని కొట్టి చంపిన నేపథ్యంలో థరూర్ ఇలా స్పందించారు. అయితే, కాంగ్రెస్ పోరాటాన్ని బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేసే నేతలపై చర్యలు తప్పవని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఆయన ప్రత్యేకంగా ఎవరి పేరూ ప్రస్తావించకున్నా థరూర్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
రాజస్తాన్‌లో మూక హత్య..
జైపూర్: సుప్రీం కోర్టు ఎన్ని హెచ్చరికలు చేసినా, ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా మూక హత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న అనుమానంతో శుక్రవారం రాజస్థాన్‌లో అక్బర్ ఖాన్ వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టి చంపేశారు. అక్బర్ ఖాన్ (28), అతని స్నేహితుడు అస్లాం లాడ్‌పూర్‌లో రెండు ఆవులను కొనుగోలు చేసి, హరియాణాలోని కొల్గాన్‌కు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో అల్వార్ జిల్లాలోని లాలావండి అటవీ ప్రాంతం గుండా వెళుతుండగా ఐదుగురు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా అస్లాం వారి నుంచి తప్పించుకోగా అక్బర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారనే అనుమానంతోనే వారిపై వారు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. బాధితుడి మరణ వాంగ్మూలం ప్రకారం ఐదుగురు వ్యక్తులు దాడి చేసినట్టు తెలుస్తోందని, వారిలో ధర్మేంద్ర యాదవ్, పరమ్‌జీత్ సింగ్ సర్దార్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని జైపూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ హేమంత్ ప్రియదర్శి తెలిపారు. కఠిన చర్యలు తీసుకుంటాం: సీఎం ఈ ఘటనను సీఎం వసుంధరా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘ టనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని హోంమంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం ఈ ఘటనపై భగ్గుమంది. మూక దాడులకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించింది. ఇది దారుణ ఘటనగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అభివర్ణించారు. -
అత్యంత అమానుషంగా కొట్టి చంపారు
జైపూర్ : గోరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సుప్రీం కోర్టు పలుమార్లు హెచ్చరించినా అలాంటి దాడులు మాత్రం ఆగడం లేదు. రాజస్థాన్‌లో ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారనే నెపంతో ఇద్దరి యువకులపై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తప్పించుకున్నారు. గత అర్ధరాత్రి మృతుడు అక్భర్(28), అస్లామ్ అనే మరో వ్యక్తితో ఆవులను తీసుకెళ్తుండగా.. రామ్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్వార్ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో భయాందోళనలకు గురైన ఆ యువకులు ఆవులను వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు వారిని వెంబడించి మరీ అక్బర్‌ను పట్టుకోగా.. అస్లామ్ తప్పించుకున్నాడు. అక్భర్పై మూకుమ్మడిగా దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడి, మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఆ రెండు ఆవులను సమీప గోశాలకు తరలించామని, ఈ ఘటనకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసునమోదు చేశామన్నారు. అయితే మృతుడు హర్యానాకు చెందినవాడని, ఆవుల అక్రమ రవాణకు పాల్పడ్డారా లేదా అనే విషయం తెలియదని, దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. గతంలో కూడా గోరక్షణ పేరిట అల్వార్ గ్రామంలో ఇలాంటి దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో పాలరైతు పెహ్లూ ఖాన్ గతేడాది ఏప్రిల్‌లో చనిపోగా.. అతని బంధువు ఉమర్ అహ్మద్ నవంబర్‌లో మృతిచెందాడు. చదవండి: గోరక్షణ దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
అది దాడి కాదు..
జయనగర: అక్రమంగా నిర్వహిస్తున్న గోవధ కబేళాపై ఫిర్యాదు చేసినందుకు దాడికి గురైన మహిళా ఐటీ ఇంజినీర్ నందిని వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీనిపై ఇప్పటివరకు వెలుగులోకి వచ్చినవన్నీ అవాస్తవాలనీ పోలీసు పెద్దలు కొట్టిపారేశారు. నందిని కేసులో ముగ్గురిని, యలహంకలో కబేళా తనిఖీల్లో పోలీసులపై దాడి చేసిన కేసులో మరో 10 మందిని అరెస్ట్ చేశామని నగర పోలీస్‌కమిషనర్ సునీల్‌కుమార్ తెలిపారు. బుధవారం నగర కమిషనరేట్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత శనివారం సిటీలో తలఘట్టపుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆవలహళ్లిలో మహిళా టెక్కీ నందినిపై దుండగులు దాడికి పాల్పడినట్లు బాధితురాలు చెబుతున్నారు. ఆమె కారు ధ్వంసం కాగా, కుడిచేతికి గాయాలు కూడా తగిలినట్లు ఆమె మీడియా ముందు ప్రకటించారు. అయితే దాడి ఘటనలో కొత్త విషయాలను కమిషనర్ వెల్లడించారు. మహిళా టెక్కీ నందినీపై గూండాల దాడి జరగలేదని, నందినీ కారు ఆటోను, మాంసం దుకాణాన్ని ఢీకొనడంతో స్థానికులు ఆమెపై దాడికి పాల్పడ్డారని కమిషనర్ చెప్పారు. కానీ నందిని గోవధపై తాను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినందుకే దుండగులు దౌర్జన్యం చేశారని ఫిర్యాదు చేసిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని కమిషనర్ తెలిపారు. తనపై దాడికి పాల్పడిన వారు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని నందీని ఆరోపించారని ఇది అవాస్తవమని అన్నారు. అలా ఎవరూ నినాదాలు చేయలేదని కమిషనర్ సునీల్‌కుమార్ స్పష్టం చేశారు. మరో కబేళా కేసులో 10 మంది అరెస్టు అలాగే మంగళవారం దొడ్డబెట్టహళ్లిలో ఉన్న కసాయిఖానా మూసివేయాలని నోటీస్ ఇచ్చిన పోలీసులపై దుండగులు దాడికి దిగడం జరిగిందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు నియమించిన కమిషన్, గోగ్యాస్ ఫౌండేషన్ సభ్యులు కసాయిఖానా వద్దకు వెళ్లగా కొందరు దాడికి పాల్పడ్డారన్నారు. 10 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఒక కారు, మినీ వ్యాన్‌ను సీజ్ చేసి, నాలుగు పశువులను రక్షించడం జరిగిందన్నారు. -
బంగ్లాదేశ్‌లో పెరిగిన గోమాంసం ధరలు!
పొరుగు దేశాల్లో కబేళాలకు తరలించేందుకు మన దేశం నుంచి జరిగే ఆవుల స్మగ్లింగును తాము గణనీయంగా తగ్గించామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రెండు రోజుల పాటు తన నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్లిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి వల్లే భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు నిఘాను పెంచాయని, దానివల్ల ఆవుల స్మగ్లింగ్ బాగా తగ్గిందని చెప్పారు. ఇంతకుముందు ఏడాదికి 13 లక్షల ఆవులు బంగ్లాదేశ్‌కు స్మగుల్ అయ్యేవని, ఇప్పుడా సంఖ్య 2-3 లక్షలకు పడిపోయిందని తెలిపారు. ఈ కారణంగా బంగ్లాదేశ్‌లో గోమాంసం ధరలు బాగా పెరిగాయని చెప్పారు. ఈ విషయాన్ని తనకు భారతదేశంలో బంగ్లాదేశ్ హైకమిషనర్ స్వయంగా చెప్పారన్నారు.