
జైపూర్: తన మద్దతుదారుల మూకదాడిలో ఆవుల స్మగ్లర్లు ఐదుగురు హతమయ్యారని చెప్పుకున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహూజాపై ఆల్వార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ దొంగతనం ఆరోపణలపై శుక్రవారం మేవాట్‌కు చెందిన ముస్లింలు చిరంజీలాల్ సైనీ అనే వ్యక్తిని కొట్టి చంపారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో అహూజా ‘లావాండి ప్రాంతంలో మా వాళ్ల మూకదాడిలో ఐదుగురు హతమయ్యారు. ఇలాంటిది జరగడం మాత్రం ఇదే మొదటిసారి. ఆవుల దొంగలపై మూకదాడులకు పాల్పడిన మా వాళ్లకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చే పూచీ నాది’అని అంటున్నట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది.