gang attack
-
రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
-
కెనడాలో హత్యకు గురైన భారతీయ విద్యార్థి
టొరంటో: కెనడాలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న భారతీయ విద్యార్థి ఒకరు దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని కరీంపూర్ చావ్లా గ్రామానికి చెందిన గుర్విందర్ నాథ్(24) టొరంటోలోని బ్రామ్టన్లో ఉంటూ బిజినెస్ స్కూల్లో చదువుకుంటున్నాడు. పిజ్జా డెలివరీ బాయ్‌గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మిస్సిస్సౌగాలో ఈ నెల 9న అర్థరాత్రి దాటాక 2.10 గంటల సమయంలో నాథ్ ఒక ఇంట్లో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా కొందరు దుండగులు తీవ్రంగా కొట్టి అతడి దగ్గరున్న విలువైన వస్తువులతోపాటు, కారును తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన నాథ్‌ను చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 14న నాథ్ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచాడు. దుండగులు అతడి కారును అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో వదిలేసి వెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ కారులో పలు ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు. నాథ్, దుండగులకు మధ్య గతంలో ఎటువంటి పరిచయం లేదన్నారు. అతడి కారు ఎత్తుకెళ్లేందుకే దుండుగులు పిజ్జా డెలివరీ చేసినట్లుగా భావిస్తున్నామన్నారు. ఘటనపై టొరంటోలోని భారత్ కాన్సుల్ జనరల్ సిద్ధార్థ నాథ్ విచారం వ్యక్తం చేశారు. అతడి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామన్నారు. ఈ నెల 27న నాథ్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2021 జులైలో కెనడా వెళ్లిన నాథ్ చివరి సెమిస్టర్లో ఉన్నాడని, చదువు పూర్తయ్యాక సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఎన్నో కలలు కన్నాడని అతడి స్నేహితులు తెలిపారు. ఆదివారం నాథ్ స్మత్యర్థం సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసౌగాలో కొవ్వొత్తులతో నివాళులరి్పంచారు. -
‘ఆ మూక హత్యలు మావాళ్లు చేసినవే’
జైపూర్: తన మద్దతుదారుల మూకదాడిలో ఆవుల స్మగ్లర్లు ఐదుగురు హతమయ్యారని చెప్పుకున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహూజాపై ఆల్వార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ దొంగతనం ఆరోపణలపై శుక్రవారం మేవాట్‌కు చెందిన ముస్లింలు చిరంజీలాల్ సైనీ అనే వ్యక్తిని కొట్టి చంపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో అహూజా ‘లావాండి ప్రాంతంలో మా వాళ్ల మూకదాడిలో ఐదుగురు హతమయ్యారు. ఇలాంటిది జరగడం మాత్రం ఇదే మొదటిసారి. ఆవుల దొంగలపై మూకదాడులకు పాల్పడిన మా వాళ్లకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చే పూచీ నాది’అని అంటున్నట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. -
దారుణం.. ఆలస్యంగా వచ్చాడని ఓలా డ్రైవర్‌ను చితకబాదిన గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. క్యాబ్ బుక్ చేస్తే అరగంట ఆలస్యంగా వచ్చినందుకు డ్రైవర్, అతని యజమానిని చితకబాదింది ఓ గ్యాంగ్. ఈ ఘటనలో డ్రైవర్, ఓనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఉప్పర్‌పల్లికి చెందిన వినయ్ రెడ్డి అనే యువకుడు ఓలా క్యాబ్ బుక్ చేశాడు. అరగంట ఆలస్యం కావడంతో డ్రైవర్‌ను నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఓలా డ్రైవర్‌పై వియన్ రెడ్డి అతని స్నేహితులు దాడి చేశారు. డ్రైవర్ ఈ విషయాన్ని తన యజమానికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. వెంటనే ఉప్పర్‌పల్లికి చేరుకున్న యజమానిని సైతం వియన్ రెడ్డి గ్యాంగ్ చితకబాదింది. రౌడీల్లా రెచ్చిపోయి ఉదయం 4 గంటల వరకు ఓ గదిలో బంధించి కొట్టారు. చదవండి: ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం -
మోడల్స్‌పై గ్యాంగ్ రేప్.. 67 మంది అరెస్ట్
జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో అక్రమ చొరబాటుదారులు పైశాచికానికి తెగబడ్డారు. మ్యూజిక్ వీడియో షూట్‌లోకి ఆయుధాలతో చొరబడి.. మోడల్స్‌పై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడ్డారు. అంతేకాదు.. మగవాళ్ల దుస్తులు ఊడదీసి.. వాళ్లతో డ్యాన్సులు చేయించి మరీ పైశాచిక ఆనందం పొందారు. దక్షిణాఫ్రికా జోహెన్నెస్‌బర్గ్ పశ్చిమంగా ఉన్న క్రూగర్స్‌డ్రాప్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. నిందితులను జామా జామాలుగా గుర్తించిన జోహెన్నెస్‌బర్గ్ పోలీసులు.. అక్రమ మైనింగ్ కోసం పొరుగు ప్రాంతాల నుంచి అక్రమంగా చొరబడతారని, తరచూ దోపిడీలకు పాల్పడతారని వెల్లడించారు. వాళ్లు దాడి చేసింది దోపిడీ కోణంలోనే అయినా.. మోడల్స్ కనిపించేసరికి అత్యాచారానికి తెగబడ్డారని, ఇలా జరగడం ఇదే మొదటి ఘటన అని పోలీసులు తెలిపారు. బాధితులంతా 35 ఏళ్ల లోపువాళ్లేనని తెలుస్తోంది. ఆపై మగవాళ్లతో నగ్న నృత్యాలు చేయించి.. వాళ్ల దగ్గర ఉన్న సొమ్ము, నగలను దోచుకెళ్లారు. గుంపుగా దుండగులు దాడి చేసినట్లు బాధితులు వెల్లడించగా.. 67 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లలో చాలామంది అక్రమ చొరబాటులేనని నిర్ధారించారు. ఇక ఘటనపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా స్పందించారు. అలాంటి మృగాలకు బతికే హక్కు లేదని, కఠిన శిక్ష విధించి తీరతామని తెలిపారు. -
వివాహేతర సంబంధం.. ఉదయం 5 గంటలకు దారికాచి
సాక్షి, సారంగాపూర్(కరీంనగర్): జిల్లాలో మరో హత్య జరిగింది. మూఢనమ్మకాలు, పాతకక్షల నేపథ్యంలో గతనెల 20న జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్‌కు చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను అత్యంత దారుణంగా చంపిన ఘటనను మరువక ముందే ఈ హత్య జరగడంతో జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో లచ్చనాయక్ తండాకు చెందిన భూక్య లక్ష్మణ్ (24) చనిపోయాడు. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్ కథనం ప్రకారం.. లక్ష్మణ్ గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 5 గంటలకు సేవాలాల్ భవనంలో మైక్ ఆన్ చేసేందుకు బయలు దేరాడు. తన ఇంటి ఎదుట నుంచి వెళ్తున్న లక్ష్మణ్‌పై భూక్య సురేందర్ రాడ్డుతో దాడి చేశాడు. తలపై బలంగా బాదడంతో లక్ష్మణ్ కుప్పకూలి, అక్కడికక్కడే మృతిచెందాడు. రక్తం చిమ్మి సమీప ఇంటిగోడలపై పడింది. తనకు రామ్, లక్ష్మణ్ కవల పిల్లలని, ఇద్దరికీ వివాహాలు చేయాలని అనుకుంటున్న తరుణంలో ఇలా హత్యకు గురయ్యాడని మృతుడి తల్లి అమ్మి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని సమాచారం. నిందితుడితోపాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చదవండిః కామాంధుడిని ఎన్కౌంటర్ చేయండి.. తల్లడిల్లిపోతున్న దీక్షిత తల్లిదండ్రులు -
మెక్సికోలో కాల్పులు .. ఇద్దరు చిన్నారులు సహా 8 మంది మృతి
మెక్సికోసిటి: మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది. గ్వానాజుటావో రాష్ట్రం సిలావో గ్రామంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్ మీద వచ్చి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులలో ఎనిమిది మంది అమాయకులు మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు.. ఆగంతకులను పట్టుకోని వారిపై దాడిచేశారు. దీంతో వారు కూడా మరణించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు దుండగులతో సహా, మరో 8 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, ఈ దాడులు నిర్వహించిన వారు డ్రగ్స్ ముఠాకు చెందిన వారిగా భావిస్తున్నారు. శాంటా రోసాడి లిమా, జాలిస్కో న్యూజనరేషన్ల మధ్య పోరాటం కారణంగా గ్వానాజువాటో అత్యంత హింసాత్మక ప్రదేశంగా మారింది. 2006లో మెక్సికో మాదక ద్రవ్యాల అక్రమరవాణాపై నియంత్రణ విధించినప్పటి నుంచి ఈ దాడులు అధికమయ్యాయి. కొన్ని డ్రగ్స్ గ్యాంగ్‌లు ఆధీపత్యం కోసం పరస్పరం దాడులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత నవంబరులో జరిగిన దాడిలో 11 మంది అమాయకులు మృతి చెందిన విషయం తెలిసిందే. 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల మంది అమాయకులు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: మరో రైల్వే స్టేషన్ పేరు మార్చేసిన యోగి ప్రభుత్వం.. ఇక నుంచి -
దొంగల బీభత్సం.. ఒక్కరాత్రే 11 ఇళ్లకు కన్నం
సాక్షి, నందిపేట్(నిజామాబాద్): నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ మంగళవారం రాత్రి దొండలు అలజడి సృష్టించారు. ఏకంగా తాళం వేసిన 11 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. నగదు, నగలు, ఇతర సామగ్రిని దోచుకెళ్లారు. కుద్వాన్‌పూర్‌లో పలు కుటుంబాలు తమ బంధువుల ఇళ్లలో శుభకార్యాలు ఉండడంతో తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు. కాగా మంగళవారం అర్దరాత్రి గుర్తు తెలియని దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బుధవారం ఉదయం తలుపులు తెరిచి ఉండడంతో చుట్టుపక్కల వారు చూసి బాధితులకు ఫోన్లలో సమాచారం అందించారు. వారి వచ్చి చూడగా ఇళ్లంతా చిందరవందరగా వస్తువులు పడి ఉన్నాయి. పోలీసులు క్లూస్‌టీంతో ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ల అపహరణ బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రాల్లో రెండు 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. జాతీయ రహదారి పక్కన ఉన్న పంట భూముల్లోని 202, 203 నంబర్లు ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను ఎత్తుకెళ్లి వాటి నుంచి కాపర్ తీగ, ఆయిల్ చోరీ చేశారు. దీంతో బుధవారం ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్ పరిశీలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకెళ్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మరో ఆసక్తికర పరిణామం.. జిరాక్స్ తీస్తే కొంపలు అంటుకుంటాయ్..!? -
ముల్తానీల్లో మార్పు వచ్చేనా..?
సాక్షి, ఇచ్చోడ (ఆదిలాబాద్): ఈసారైనా ముల్తానీల మార్పు సాధ్యపడేనా.? వారి మార్పు కోసం జిల్లా అధికార యంత్రాంగం తీసుకునే నిర్ణయాలు ఏకీభవించి వాటికి అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తారా.? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నేర ప్రవృత్తిలో కరుడుగట్టిన ముల్తానీలు పరస్పర దాడులు, పోలీసు కేసులకు బయపడే రకం కాదు. గుండాల, కేశవపట్నం, జోగిపేట్ గ్రామాల్లో నివసిస్తున్న ముల్తానీలపై 20ఏళ్లుగా 2వేలకు పైగా మందిపై జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కానీ ఇటీవల గుండాలలో ఉర్సు ఉత్సవాల్లో రెండు గ్రూపుల మధ్య జరిగిన దాడిలో ఇద్దరు దారుణ హత్యకు గురి కాగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో జిల్లా పోలీసు యంత్రాంగం అలర్ట్ అయింది. ముల్తానీల గ్రామాల్లో దాడులు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర గుండాల గ్రామ ప్రజలతో రెండు, మూడు సార్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ముల్తానీల్లో మార్పునకు తీసుకోవాల్సిన చర్యలపై మండల స్థాయి అధికారులతో ఓ టీంను ఏర్పాటు చేశారు. ఫలించని కృషి ముల్తానీల మార్పునకు గతంలో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్నప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. కలప స్మగ్లింగ్ చేస్తున్న వారికి మైనార్టీ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో పాటుగా బ్యాంకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ముల్తానీల గ్రామాల్లో పర్యటించి ప్రణాళిక తయారు చేసి అప్పటి కలెక్టర్‌కు అందజేశారు. కానీ పూర్తిస్థాయిలో ముల్తానీలకు స్వయం ఉపాధి కల్పించకపోవడంతో అధికారులు చేసిన కృషి ఫలించ లేదు. ప్రస్తుతం కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర మండల స్థాయి అధికారులతో టీంను ఏర్పాటు చేశారు. ఈ టీం ఆ గ్రామాల్లో పర్యటించి వారి మార్పునకు ప్రణాళిక సిద్ధం చేయనుంది. గుండాల్లో నాలుగుసార్లు దాడులు... గుండాల గ్రామంలో ఐదేళ్ల కాలంలో నాలుగు సార్లు దాడులు జరిగాయి. చిన్నచిన్న దాడులు తరుచుగా జరుగుతూనే ఉంటాయి. నాలుగుసార్లు కత్తులు, రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయాల పాలై చావు అంచుల వరకు వెళ్లి వచ్చినవారు ఉన్నారు. ఈ దాడులన్నీ ఉర్సు ఉత్సవాల సమయంలోనివే. ఇటీవల జరిగిన దాడిలో ఓ గ్రూపునకు చెందిన ఇద్దరు హత్యకు గురి కాగా జిల్లా అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. కేసులంటే బయం లేదు.. గతం నుంచి నేరప్రవృత్తి కలిగిన ముల్తానీలకు పోలీసు కేసులంటే అసలు బయమేలేదు. గుండాల, కేశవపట్నం, జోగిపేట్, ఎల్లమ్మగూడ గ్రామాల్లో 9వేల వరకు వీరి జనాభా ఉంది. వీరిలో 20నుంచి 60ఏళ్ల లోపుగల 2వేల మందిపై కేసులు ఉన్నాయి. అక్షరాస్యత లేక... ముల్తానీలు మార్పు చెందకపోవడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతే. వీరిలో పదో తరగతి వరకు చదుకున్న వారు పదుల సంఖ్యలోనే ఉంటారు. నాలుగైదు తరగతి చదివిన తరువాత బడిని మాన్పిస్తారు. ఒక్కో కుంటుంబంలో కనీసం 5నుంచి 12 మంది వరకు పిల్లలు ఉంటారు. ముల్తానీ మహిళలు కుటుంబ నియంత్రణ చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. మార్పునకు తీసుకోవాల్సిన అంశాలు... ► ముల్తానీల మార్పు కోసం జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ► బడీడు పిల్లలకు నిర్బంధ విద్యను అందించాలి. ► ప్రాథమిక విద్య అనంతరం పై చదువుల కోసం వారిని మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించాలి. ► పాఠశాలకు పిల్లలను పంపని వారి తల్లితండ్రులకు ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలి. ► కుటుంబ నియంత్రణ తప్పనిసరిగా పాటించేలా అవగాహన కల్పించాలి. ► నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసి ఉపాధి కల్పించాలి. ► అర్హులకు వృద్ధాప్య, వితంతువు పింఛన్లు ఇప్పించాలి. ► పోలీసు కేసులతో కోర్టుల చుట్టు తిరిగడం వల్ల కలిగే ఇబ్బందులు తెలియజేయాలి. వలస వచ్చి నివాసం.. పాకిస్తాన్‌ను నుంచి సుమారు 160 ఏళ్ల క్రితం వలస వచ్చిన ముస్లిం గిరిజన తెగకు చెందిన ముల్తానీలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల, కేశవపట్నం, జోగిపేట్ గ్రా మాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దేశ విభజన తర్వాత వీరు తిరిగిఅక్కడికి వెళ్లిపోకుండా ఇక్కడే ఉండిపోయారు. కలప అక్రమ రవాణాను ఉపాధిగా మార్చుకుని జీవించేవారు. రాష్ట్ర ప్రభుత్వం కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపడంతో నాలుగేళ్ల నుంచి కలప స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టింది. దీంతో వీరిలో కొంతమంది వ్యవసాయం, మరికొంత మంది చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. -
స్ట్రీట్‌ఫైట్: ఆ వ్యక్తి ప్రాణాలను తీసింది
హైదరాబాద్: పాతబస్తీలోని డబీర్‌పురాలో దారుణం చోటుచేసుకుంది. అద్నాన్కు, ప్రత్యర్థులైన అజీబ్, ముజీబ్, కమ్రాన్‌లకు మనస్పర్థలున్నాయి. ఈ క్రమంలో ఆ ముగ్గురు కలిసి అద్నాన్‌ను తీవ్రంగా కోట్టారు. ఈ క్రమంలో అద్నాన్ అపస్మారక స్థితిలోనికి చేరుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్సకోసం ఓక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే, అద్నాన్ చికిత్స పోందుతు మృతి చెందాడు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: అత్తారింట్లో గొడవ: చనిపోతున్నానని సెల్ఫీ వీడియో -
తెలంగాణ: హైదరాబాద్‌లో అర్దరాత్రి లాఠీగ్యాంగ్ హల్చల్
-
Hyderabad: అర్దరాత్రి లాఠీగ్యాంగ్ హల్చల్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్లో కొందరు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే అలాంటి వారిపై పోలీసులు కాకుండా కొందరు ముప్పేట దాడి చేస్తున్నారు. ఓ గ్యాంగ్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ దాడులకు పాల్పడుతున్నారు. ఎవరైనా బయటికి వస్తే ముప్పేట దాడి చేస్తుండడంతో కలకలం రేపుతోంది. అయితే ఆ దాడికి పాల్పడుతున్న వారిని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీలో ఇద్దరిని గుర్తించినట్లు సమాచారం. దీనిపై బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అర్దరాత్రి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షహీన్ నగర్ రోడ్లపై ఒక్కో బైక్‌పై ఇద్దరిద్దరు వ్యక్తులు హల్చల్ చేస్తున్నారు. కొందరు బైకులపై తిరుగుతూ లాఠీలు చేత బట్టుకొని కనిపించిన వారిని చితకబాదుతున్నారు. అయితే వారిని మొదట పోలీసులుగా స్థానికులు భావించారు. కానీ వారు జులాయి గ్యాంగ్‌గా గుర్తించారు. నాలుగు, ఐదు బైక్‌లపై పోలీస్ డ్రెస్ లేకుండా సంచరిస్తూ లాఠీలతో దాడి చేస్తుండడంతో స్థానికులు సీసీ ఫుటేజీలో గమనించారు. వారు పోలీసులు కాదని గుర్తించి బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
రెచ్చిపోతున్న అల్లరిమూకలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రశాంతమైన అందరూ ఇష్టపడే ఖమ్మం నగరం ఇప్పుడు అల్లరిమూకలకు అడ్డాగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లో బ్యాచ్‌లుగా విడిపోయి, రోడ్లమీదే తన్నుకునే పరిస్థితి ఏర్పడింది. అయినా పోలీసులకు పట్టడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ జీపు పక్క నుంచే వెళ్తున్నా.. ఖమ్మం నగరంలో దాదాపుగా శాంతిభద్రతలు అదుపు తప్పాయని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీస్ జీపు పక్క నుంచే వెళ్తున్నా, అందులో పోలీస్ అధికారి ఉన్నా రోడ్డుపైనే తన్నుకుంటున్నారు. కనీసం పోలీసులు వస్తున్నారనే మర్యాద కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. కొందరైతే పోలీస్ స్టేషన్లో పోలీసులనే దుర్భాషలాడుతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఖమ్మంలోని రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తరహా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్లపై విచ్చలవిడిగా రాడ్లు , కర్రలతో పోలీసుల ముందే తన్నుకుంటున్నా, అడ్డుకోబోయిన పోలీస్ సిబ్బందిని నెట్టివేసినా పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులతోపాటు, రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయని, దీంతో ఏమీ చేయలేకపోతున్నామని పోలీస్ అధికారులు వాపోతున్నారు. రోడ్లపై ఘర్షణలకు పాల్పడుతున్న అల్లరిమూకలను స్టేషన్‌కు తీసుకొచ్చిన 10 నిమిషాలలోపే రాజకీయ నాయకులు ప్రత్యక్షమవుతున్నారని, చివరకు శబ్ద కాలుష్యం ఏర్పడే డీజేలను స్టేషన్‌కు తరలించినా పైరవీలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తప్పుదారి పట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతల అదుపుకోసం అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలు , బ్లూకోల్ట్స్ ఏర్పాటు చేసినా అల్లరిమూకలను అదుపు చేసే పరిస్థితి కనిపించడంలేదు. గతంలో స్టేషన్‌కు ఒక్క పోలీస్ జీప్ ఉన్నా శాంతి భద్రతలను అదుపులో ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదనే విమర్శలు వినపడుతున్నాయి. త్రీటౌన్ పరిధిలో.. నిత్యం వ్యాపారాలతో కళకళలాడే త్రీటౌన్ గ్యాంగ్‌వార్‌లకు అడ్డాగా మారిపోయింది. యువకులు రోడ్డుమీదనే తన్నుకుంటున్నా పట్టించుకోనే దిక్కులేదు. పంపింగ్‌వెల్‌రోడ్, గాంధీనగర్, వ్యవసాయమార్కెట్ ప్రాంతం, బొక్కలగడ్డ , సారథీనగర్ , జూబ్లీపుర , ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లో ఆకతాయిలు ఎక్కువై అర్ధరాత్రి వరకు మద్యం, గంజాయి వంటివి సేవించి ద్విచక్రవాహనాలు అతివేగంతో నడుపుతూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు గ్యాంగ్‌లను పెంచి పోషిస్తూ్త తమ పబ్బం గడుపుకుంటున్నారని, కొందరు పోలీస్ సిబ్బంది కూడా సాయం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీంతో అల్లరిమూకలు మరింత రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. వనటౌన్, టూటౌన్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చొరవ తీసుకుని శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చే పోలీస్ అధికారులు సైతం కరువయ్యారనే అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి అల్లరిమూకలను, వారిని రెచ్చగొడుతున్నవారిపై ఉక్కు పాదం మోపకపోతే ఖమ్మం మరో బెజవాడగా మారే అవకాశం ఉందని, సామాన్యులకు రక్షణ ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై త్రీటౌన్ సీఐ సీహెచ్. శ్రీధర్‌ను వివరణ కోరగా.. అల్లరి మూకలపై గట్టి నిఘా పెట్టామని తెలిపారు. రెండుసార్లకు మించి అరెస్ట్‌యితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని అన్నారు. -
పోలీసులపై అల్లరి మూకల దాడి
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలోని ఎర్రముక్కపల్లి సర్కిల్లో ఇద్దరు కానిస్టేబుల్స్‌పై అల్లరు మూకలు దాడికి పాల్పడ్డాయి. పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తూ స్థానికుల ముసుగులో దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. బైక్ ప్రమాద విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ప్రమాదానికి గురైన బాధితులు 100 కాల్ చేశారు. దీంతో ఇద్దరు కానిస్టేబుల్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తుండగా స్థానికుల ముసుగులో అల్లరి మూకలు దాడి చేశారు. సీసీ కెమెరా పుటేజీలను పరిశీస్తున్నామని, దాడికి పాల్పడిన వారిని పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా పోలీసులపై దాడి చేసిన వారికి మద్దతుగా పీఎస్‌లో టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్ కూర్చోవడం గమనార్హం. -
యువకుల ప్రాణం తీసిన క్రికెట్
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ ఆట ఇద్దరి యువకుల ప్రాణం తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలో రైల్వేస్టేషన్ వెనుక ఉన్న గ్రౌండ్లో రెండు వర్గాలు క్రికెట్ ఆడుతుండగా ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరువర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈఘటనలో పవన్ కళ్యాణ్ యాదవ్, నర్సింగ్ యాదవ్ అనే ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ దాడిని వీడియో తీస్తున్న ప్రేమ్ కుమార్ అనే యువకుడిపై ఓ వర్గం దాడికి పాల్పడింది. దీంతో అతని తలకు తీవ్రగాయాలయ్యాయి. కాగా పాత కక్ష్యలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఒక బర్త్‌డే పార్టీలో, క్రికెట్ ఆడే సందర్భంలో గొడవలు జరిగాయని, ఆ గొడవలే కత్తిపోట్లకు దారితీసినట్లుగా భావిసున్నామని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
జనగామలో పార్ధీ గ్యాంగ్?
జనగామ : నరహంతక పార్ధీ ముఠా జనగామలో సంచరిస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది రఘునాథపల్లి మండలంలో ఓ కుటుంబంపై విరుచుకుపడి నలుగురిని పొట్టన బెట్టుకున్న పార్ధీ ముఠా సభ్యుల కదలికలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని సాయినగర్‌లో ఓ యువకుడు సృష్టించిన హల్చల్తో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. ఐరన్ రాడ్, కారం పొడితో ఏకంగా పోలీసులపై దాడికి పాల్పడే ప్రయత్నం చేయడంతో పార్ధీ ముఠాగా భావిస్తున్నారు. ఓ ఇంట్లోని బాత్రూంలో తలదాచుకున్న వ్యక్తిని స్థానికుల సాయంతో పోలీసులు రెండు గంటలపాటు కష్టపడి అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఇంటర్‌సెప్టర్ పోలీసుల వాహనం గస్తీ తిరుగుతోంది. హైదరాబాద్ హైవే.. ఓవా హోటల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఐరన్ రాడ్‌తో సాయినగర్ వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను గమనించిన వ్యక్తి పారిపోతూ సాయినగర్‌లో నివాసముంటున్న మెకానికల్ చంద్రయ్య ఇంట్లోకి దూరి, బాత్రూంలో తలదాచుకున్నాడు. వెంటనే ఇంటర్‌సెప్టర్ పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ ముష్క శ్రీనివాస్, ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాత్™Œరూంలో ఉన్న వ్యక్తి లోపల గడియ పెట్టుకోవడంతో పోలీసులు శతవిధాలుగా ప్రయత్నించారు. బాత్రూం లోపలి నుంచి ఐరన్ రాడ్‌తో పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. సీఐ, ఎస్సైలు రెండు కర్రల సాయంతో వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేశారు. రెండు గంటల తర్వాత తలదాచుకున్న వ్యక్తి బయటకు వచ్చి పోలీసుల కళ్లలో కారం చల్లుతూ పారిపోయేందుకు యత్నించాడు. ఈ దాడిలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పారిపోతున్న వ్యక్తిని పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. రైల్వేస్టేషన్ ఏరియాల్లో అప్రమత్తం రైల్వే లైన్ ఉన్న ఏరియాలనే దొంగలు ఎంచుకుంటున్నారు. దోచుకున్న సొత్తుతో దొంగలు రైలు ఎక్కుతూ దర్జాగా పారి పోతున్నారు. గతంలో పార్ధీముఠా సభ్యులు రైల్వే స్టేషన్ ఉన్న రఘునాథపల్లి మండలంలో దిగి ఓ కుటుంబాన్ని పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్ ఏరియాలో గస్తీ పెంచారు. ఈ సందర్భంగా జనగామ ఏసీపీ బాపురెడ్డి మాట్లాడుతూ తాము అదుపులోకి తీసుకున్న వ్యక్తి పార్ధీ ముఠాకు చెందిన వాడు కాదని, విచారణ తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఆ ముఠా పనేనా? పోలీసులకు పట్టుబడిన వ్యక్తి ఒకరేనా లేక గ్యాంగ్‌గా వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వచ్చే ముందు బాత్రూం నుంచే హిందీలో మాట్లాడుతూ సిమ్‌కార్డు విరగొట్టాడని స్థానికులు చెబు తున్నారు. ఫోన్ చేసింది ఎవరికి.. సిమ్ విరగ్గొట్టాల్సిన అవసరం ఏమిటనే అనుమానాలను నివృత్తి చేసుకుంటే.. కచ్చితంగా పార్ధీ ముఠా దిగవచ్చనే ప్రచారం జరుగుతోంది. పట్టుబడిన వ్యక్తి నుంచి పోలీసులు సెల్‌ఫోన్‌తోపాటు అస్సాం రాష్ట్రానికి చెందిన ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లి, అక్కడి నుంచి వరంగల్ కమిషనరేట్‌లోని సీసీఎస్‌కు తరలించారు. పోలీసుల అదుపులో ఉన్న అస్సాం యువకుడు -
ప్రేమ వ్యవహారం.. యువకుడిపై దాడి
అనంతపురం సెంట్రల్ : నగరంలో సుభాష్‌రోడ్డు నామాటవర్స్ సమీపంలో ఓ వ్యక్తిపై శుక్రవారం విచక్షణా రహితంగా దాడి చేయడం కలకలం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు.. నల్లచెరువు మండలానికి చెందిన లక్ష్మీపతినాయుడు నగరంలో భైరవనగర్‌లో నివాసముంటున్నాడు. అదే మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి బంధువు కుమార్తెను సంవత్సర కాలంగా ప్రేమించాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు వేరే యువకుడితో వివాహం నిశ్చయించారు. శుక్రవారం సుభాష్‌రోడ్డులోని హరిప్రియ ఫంక్షన్హాల్లో వివాహం జరిపించారు. విషయం తెలుసుకున్న లక్ష్మీపతినాయుడు శుక్రవారం ఉదయం ఫంక్షన్‌హాల్ సమీపంలో మాటు వేశాడు. గమనించిన వధువు తరుఫు బంధువులు కత్తులు, రాడ్లతో అతడిపై దాడి చేశారు. ఇష్టానుసారం చితకబాదారు. క్షతగాత్రున్ని స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ వెంకటరమణ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితుడితో ఫిర్యాదు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడిపై మూకుమ్మడి దాడి
పుట్టపర్తి అర్బన్ : పుట్తపర్తి మండలం బొంతలపల్లికి చెందిన చెన్నకేశవులు అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన నాగేశ్, అతని సోదరులు కేశవ, రామచంద్ర గురువారం రాత్రి విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని రూరల్ ఎస్ఐ రాఘవరెడ్డి శుక్రవారం తెలిపారు. తన భార్యతో చెన్నకేశవులు సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో నాగేశ్ తన సోదరులతో కలసి దాడి చేసినట్లు వివరించారు. ఈ విషయమై గతంలో పెద్ద మనుషుల సక్షమంలో పంచాయితీ సైతం జరిగిందన్నారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కుడి చెయ్యి, కుడి కాలు విరిగేలా రాళ్లతో కొట్టారన్నారు.దెబ్బలకు అతను స్పహతప్పి పడిపోగా, వెంటనే కర్నూలు పెద్దాస్పత్రికి తరలించినట్లు వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.