
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లో కొందరు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే అలాంటి వారిపై పోలీసులు కాకుండా కొందరు ముప్పేట దాడి చేస్తున్నారు. ఓ గ్యాంగ్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ దాడులకు పాల్పడుతున్నారు. ఎవరైనా బయటికి వస్తే ముప్పేట దాడి చేస్తుండడంతో కలకలం రేపుతోంది. అయితే ఆ దాడికి పాల్పడుతున్న వారిని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీలో ఇద్దరిని గుర్తించినట్లు సమాచారం.
దీనిపై బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అర్దరాత్రి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షహీన్ నగర్ రోడ్లపై ఒక్కో బైక్‌పై ఇద్దరిద్దరు వ్యక్తులు హల్‌చల్ చేస్తున్నారు. కొందరు బైకులపై తిరుగుతూ లాఠీలు చేత బట్టుకొని కనిపించిన వారిని చితకబాదుతున్నారు. అయితే వారిని మొదట పోలీసులుగా స్థానికులు భావించారు. కానీ వారు జులాయి గ్యాంగ్‌గా గుర్తించారు. నాలుగు, ఐదు బైక్‌లపై పోలీస్ డ్రెస్ లేకుండా సంచరిస్తూ లాఠీలతో దాడి చేస్తుండడంతో స్థానికులు సీసీ ఫుటేజీలో గమనించారు. వారు పోలీసులు కాదని గుర్తించి బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment