balapur
-
మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్
-
ముజ్రా పార్టీ గొడవ.. నిర్వాహకులపై ఫిర్యాదు
-
బాలాపూర్ లడ్డు వేలం పాట ఫుల్ వీడియో
-
బాలాపూర్ లడ్డూ మోదీకి అంకితం: కొలను శంకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ గణపతి లడ్డూ వేలంలో మరోసారి రికార్డు స్ధాయి ధర పలికింది. చరిత్రను తిరగరాస్తూ ఈసారి రూ.30లక్షల ఒక వేయికి లడ్డూను దక్కించుకున్నారు బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి. ఈ సందర్భంగా లడ్డూను దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. త్వరలో ఢిల్లీకి వెళ్లి పూర్తి లడ్డూను ఆయనకే అందిస్తానని చెప్పారు. వేలం పాట రూ.1116తో ప్రారంభమై.. క్రమంగా పెరుగుతూ.. రూ.30 లక్షల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత ఎవరూ వేలం పాట పాడేందుకు ముందుకు రాకపోవడంతో కొలను శంకర్ రెడ్డికే బాలాపూర్ లడ్డూ దక్కింది. గతేడాది కూడా లడ్డూ రూ.27లక్షల పలికిన విషయం తెలిసిందే. దీంతో, గతేదాడి కంటే మూడు లక్షల ఒక్క వేయి ఎక్కవ పలికింది. కాగా, బాలాపూర్ లడ్డూ వేలం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకమైంది. లడ్డూను దక్కించుకునేందుకు ఎంతో మంది ముందుకు వస్తుంటారు. ఇక, ఈ ఏదాడికి బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి అయ్యింది. 1994లో తొలిసారి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. తొలిసారి వేలంలో లడ్డూ రూ.450 పలికింది. ఇక, 30 ఏళ్ల నాటికి లడ్డూ ఏకంగా రూ.30లక్షలకు చేరుకుంది. ఇదే ఓ రికార్డుగా స్థానికులు చెప్పుకుంటున్నారు.30ఏళ్లుగా వేలం ఇలా..1994లో తొలిసారి రూ.450తో ప్రారంభం 2016లో రూ.14.65 లక్షలు, 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో 17.60 లక్షలు, 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు 2023లో రూ.27 లక్షలు 2024లో రూ.30,01,000(30లక్షల ఒక వేయి). ఇది కూడా చదవండి: వేలంలో రికార్డులు పటాపంచల్.. గణేశుడి లడ్డూ@ రూ.1.87 కోట్లు -
బాలాపూర్ లడ్డూ వేలం.. మరోసారి రికార్డు ధర
బాలాపూర్ గణేష్ నిమజ్జనం.. 👉బాలాపూర్ లడ్డూ వేలం ప్రారంభమైంది. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా లడ్డూ రికార్డు స్థాయిలో వేలం జరిగింది. రూ.30లక్షల ఒక వేయ్యి పలికిన లడ్డూ. కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూను దక్కించుకున్నారు. 👉 మరికాసేపట్లో ప్రారంభం కానున్న బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట👉బాలాపూర్ బడా గణపతి నిమజ్జన కార్యక్రమం తుది దశకు చేరుకుంది. నేడు నిమజ్జనం సందర్భంగా బాలాపూర్ వినాయకుడు ఉద్వాసన పూజలు అందుకున్నాడు. అనంతరం, వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైంది. 👉బాలాపూర్ వీధుల్లో గణపతిని ఊరిగేస్తుండగా వీధులన్నీ భక్తుల జన సందోహంతో నిండిపోయాయి. 👉బాలాపూర్ నిమజ్జనం నేపథ్యంలో బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.👉ఇక, ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియలో ఆరుగురు భక్తులు పాల్గొననున్నారు.👉ఇప్పటికే గత సంవత్సరం వేలంపాటలో పలికిన 27 లక్షల రూపాయలను ఆరుగురు భక్తులు డిపాజిట్ చేశారు. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాటకు 30 ఏళ్లు పూర్తివేలంపాట ప్రక్రియలో ఉత్సవ కమిటీ తాజాగా కొత్త నిబంధన పోటీదారులు ముందస్తుగా డబ్బులు డిపాజిట్ చేయాలని నిర్ణయంగ్రామస్తుల నుంచి వేలంపాటకు తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిబంధన1994లో తొలిసారి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాటమొదట రూ.450తో ప్రారంభం 2016లో రూ.14.65 లక్షలు, 2017లో రూ.15.60లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2019లో 17.60 లక్షలు, 2020లో కరోనా కారణంగా వేలం పాట రద్దు2021లో రూ.18.90 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు 2023లో బాలాపుర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు2023లో లడ్డూను దక్కించుకున్న స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి ఈ ఏడాది రూ.30 లక్షలు పలుకుతుందని అంచనాబాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలం పాట నిర్వహించడం ఆనవాయితీ -
Ganesh immersion: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న జరిగే గణేశ్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతోంది. ఎప్పటి మాదిరిగానే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్ఎండీఏ, వాటర్‌బోర్డు, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్‌సరీ్వసెస్, ఆర్టీసీ, ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, టూరిజం విభాగాలతోపాటు 108 ఈఎంఆర్ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పను లు చేయనున్నారు. జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్ల పరిధుల్లోనూ నిమజ్జనాలు జరిగే ప్రాంతాలవారీగా ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దారి పొడవునా దాదాపు కిలోమీటరుకు ఒక గ్రూపుచొప్పున పారిశుద్ధ్య కార్మికులతో గ్రూపులు ఏర్పాటు చేశారు. గణేశ్ యాక్షన్ టీమ్స్ పేరిట ఇవి మూడు షిఫ్టుల్లో పని చేస్తాయి. ఒక్కో టీమ్‌లో ప్రాంతాన్ని, అవసరాన్ని బట్టి అయిదుగురు నుంచి పన్నెండు మంది వరకు కారి్మకులుంటారు. దాదాపు మూడు వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధుల్లో పాల్గొంటారు. ఇబ్బందులు తలెత్తకుండా: ఆమ్రపాలి శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేందుకు భక్తులు సహకరించాలని కోరారు. మండపాల నుంచి నిమజ్జనాలు జరిగే చెరువులు, కొలనుల దాకా భక్తులకు సమస్యలు లేకుండా రహదారి మరమ్మతులు, వీధి దీపాలు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర పనులకు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, విద్యుత్ సిబ్బంది, జీవవైవిధ్య విభాగం, ఇంజినీర్లు కమిటీగా ఏర్పడి మండపాల నిర్వాహకుల సూచనల మేరకు తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 73 కొలనుల్లో ఏర్పాట్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడి ప్రజలక్కడే నిమజ్జనాలు చేసేందుకు వీలుగా 73 కొలనుల్లో నిమజ్జనాలకు ఏర్పాటు చేసినట్లు ఆమ్రపాలి పేర్కొన్నారు. వాటిలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 22 తాత్కాలిక కొలనులు ఉన్నాయన్నారు. వీటితోపాటు 5 పెద్ద చెరువుల (సరూర్ నగర్, జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్‌పురా మీరాలం చెరువు, కాప్రా ఊర చెరువు) వద్ద ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. నిమజ్జన ప్రదేశాల వద్ద విద్యుత్, 24 గంటల పాటు తాగునీరు అందుబాటులో ఉండేలా, పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగేలా అవసరమైన సిబ్బంది, సామగ్రి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో భోజన సదుపాయాలు కలి్పంచనున్నట్లు పేర్కొన్నారు. నమో.. మహా గణనాథా ఒక్కరోజే 4 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్: మహా గణపతి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తడంతో ప్రాంగణమంతా జనసంద్రాన్ని తలపించింది. సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచి్చనట్లు అంచనా. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్ల నుంచి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఖైరతాబాద్ రైల్వేగేట్ రోడ్డంతా కిక్కిరిసిపోయింది. మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతుండటంతో సోమవారం దర్శనం ఉండదని సైఫాబాద్ ఏసీపీ ఆర్.సంజయ్‌కుమార్ తెలిపారు. నిర్వాహకులు మాత్రం సోమవారం భక్తులు మహా గణపతిని దూరం నుంచి దర్శించుకోవచ్చన్నారు.బాలాపూర్ నుంచి.. ట్యాంక్‌బండ్ వరకు నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన డీజీపీ, సీపీలు చాంద్రాయణగుట్ట/పహాడీషరీఫ్: ఈ నెల 17న జరిగే బాలానగర్ వినాయక నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని డీజీపీ డాక్టర్ జితేందర్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం శనివారం ప్రధాన మార్గాన్ని పరిశీలించింది. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సి.వి.ఆనంద్, సు«దీర్ బాబు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు సీపీలు (శాంతి భద్రతలు) విక్రం సింగ్, పి.విశ్వప్రసాద్ (ట్రాఫిక్)లు ఇతర శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు. అంతకుముందు బాలాపూర్ గణనాథుడికి పూజలు చేశారు. అనంతరం నిమజ్జనం రూట్లోని రాయల్ కాలనీ, గుర్రం చెరువు కట్ట, బార్కాస్, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఇంజన్‌లి, శంషీర్‌గంజ్, అలియాబాద్, సయ్యద్ అలీ చబుత్రా, లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, చారి్మనార్, గుల్జార్‌హౌజ్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ట్యాంక్‌బండ్ వరకు 19 కిలోమీటర్ల రూట్‌ను పరిశీలించారు. అధికారులతో మహేశ్వరం, సౌత్, సౌత్ ఈస్ట్ డీసీపీలు సునీతా రెడ్డి, స్నేహ మెహ్రా, కాంతిలాల్ సుభాష్ పాటిల్, బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత ్డ ఉన్నారు. 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 👉 రహదారులపై వ్యర్థాలు తొలగించేందుకు గణేశ్ యాక్షన్ టీమ్‌లు 160. 👉 అందుబాటులో ఉంచిన మినీ టిప్పర్లు 102, జేసీబీలు 125. 👉 మొబైల్ టాయ్‌లెట్స్ 309 👉 తాత్కాలిక వీధి దీపాలు 52,270. 👉 రోడ్ల మరమ్మతులు, ప్యాచ్‌వర్క్స్‌కు సంబంధించిన పనులు 172. 👉 వీటికి చేసిన వ్యయం రూ.12.77 కోట్లు. 👉 రవాణాకు సంబంధించిన పనులు 36. వ్యయం రూ.16.35 కోట్లు. పనులన్నీ పూర్తయినట్లు జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు దర్శనమిస్తున్నాయి. ప్యాచ్‌వర్క్ పనులు పూర్తి కాలేదు. -
బండిని ఇంత సింపుల్ గా ఎత్తుకెళ్లాడు ఏంటి..!
-
బీటెక్ విద్యార్థి హత్య.. చంపింది వారు ముగ్గురే..
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్‌లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ హత్య కేసులో నిందితులను అతడి స్నేహితులుగానే గుర్తించారు పోలీసులు. ప్రశాంత్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.వివరాల ప్రకారం.. బాలాపూర్‌లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్‌ను హత్య చేశారు. బాలాపూర్ చౌరస్తాలోని హోటల్ 37 వద్ద ప్రశాంత్‌ను ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారు. దీంతో, కేసు నమోదు పోలీసులు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు డీసీపీ సునీతా రెడ్డి ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. అనంతరం, శుక్రవారం ఉదయం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు.. ప్రశాంత్, నిందితులు ముగ్గురు ఒకే బస్తీలో నివాసం ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఓ యువతి ప్రేమ విషయంలో నిందితులు.. ప్రశాంత్‌ను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, గడిచిన 15 రోజుల్లోనే బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జరిగాయి. -
కారుతో ఢీకొట్టి.. తుపాకీతో కాల్చి..
పహాడీషరీఫ్: బైక్‌పై వెళ్తున్న రౌడీషీటర్‌ను గుర్తు తెలియని దుండగులు కారుతో ఢీ కొట్టి.. కళ్లలో కారం చల్లి.. తుపాకీతో కాలి్చ.. కత్తులతో నరికి చంపిన దారుణ ఘటన బాలాపూర్ పీఎస్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్పేట్ షరీఫ్‌నగర్‌లో నివాసం ఉండే రియాజుద్దీన్ అలియాస్ మెంటర్ రియాజ్ (45) లలితాబాగ్ రక్షాపురంలో పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. గురువారం రాత్రి రాయల్ కాలనీలో జరిగిన ఓ విందుకు హాజరై.. స్నేహితుడు నజీర్‌తో కలిసి బాలాపూర్‌లోని వైన్స్‌లో మద్యం తాగారు.అనంతరం రాత్రి 10.30 గంటలకు నజీర్ ఇంటికి వెళ్లగా, రియాజ్ తన బైక్‌పై షరీఫ్‌నగర్‌కు బయల్దేరాడు. ఆర్సీఐ రోడ్డులో ‘మంచి’ స్కూల్ వద్దకు రాగానే ముందస్తు పథకంలో భాగంగా వెనక నుంచి కారులో వచి్చన దుండగులు బైక్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో రియాజ్ కింద పడిపోగా.. కళ్లలో కారం చల్లి, తుపాకీతో ఛాతీలో ఒక రౌండ్ కాల్పులు జరిపారు. అయినప్పటికీ కొన ఊపిరితో ఉన్నాడని భావించి కత్తులతో తల, ఛాతీ భాగాల్లో ఇష్టానుసారంగా పొడిచారు. వచి్చన కారులోనే పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత వాహనదారుల ద్వారా సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా.. రక్తపు మడుగులో పడి ఉన్న రియాజ్ అప్పటికే మృతి చెందాడు. రాచకొండ పోలీస్ కమిషనర్ సు«దీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, బాలాపూర్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్లు భూపతి, గురువారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. హత్యకు వినియోగించిన బుల్లెట్ షెల్‌తో పాటు ఐరన్ రాడ్డును స్వా«దీనం చేసుకున్నారు. క్లూస్ టీంతో శాంపిళ్లు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగి ఉంటుందని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని సీపీ తెలిపారు. రియాజ్‌తో పాటు మద్యం తాగిన నజీర్ ఇచి్చన పక్కా సమాచారంతోనే నిందితులు వెంబడించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
Keerthy Suresh Latest Pics: షాపింగ్‌మాల్‌లో కీర్తి సురేశ్ సందడి (ఫోటోలు)
-
Balapur Ganesh Laddu Auction 2023: బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట (ఫొటోలు)
-
బాలాపూర్ గణనాథుడు.. ఈసారి స్పెషల్ ఇదే
బాలాపూర్ గణనాథుని వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏటా గణేశుడి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్వామి వారి చేతిలోని లడ్డూకు ఎక్కడా లేని డిమాండ్ ఉంటుంది. ఈసారి ఐదు తలల నాగరాజు పడగల కింద స్వామివారిని సుందరంగా రూపొందించారు. విజయవాడ కనకదుర్గ ఆలయ నమూనాలో మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. కోల్‌కతాకు చెందిన కళాకారులు 11 రోజులుగా ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. 18 ఫీట్ల ఎత్తుతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి తెలిపారు. -
Hyderabad: బాలాపూర్‌లో అదృశ్యమైన యువకుడు దారుణ హత్య..
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్‌లో అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఉస్మాన్ నగర్‌కు చెందిన మామా జఫర్ కుమారుడు ఫైజల్ ఈనెల 12న రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి ఉస్మానియా హోటల్ వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. అర్ధరాత్రి దాటినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు అతడికి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి అతడి కోసం వెతికారు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇక లాభం లేదని ఫైజల్ తండ్రి జాఫర్ బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఫిబ్రవరి 25న(శనివారం) రాత్రి ఒంటి గంట సమయంలో హత్య జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. హంతకుడ్ని జబ్బార్(17)గా గుర్తించారు. మినర్ కాలనీకి చెందిన ఇతడు వృత్తిరీత్యా కాస్మెటిక్ సేల్స్ చేస్తుంటాడు. అయితే ఫైజల్‌ను జబ్బార్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తల, మొండెం వేరు చేసి తలను తీసుకెళ్లిపోయాడు. హత్య జరిగిన రెండు వారాల తార్వత దుర్గందం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. షాహిన్ నగర్లో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఫైజల్ మొండెం కన్పించింది. దుస్తుల ఆధారంగా అతడ్ని గుర్తుపట్టారు. తల ఇంకా లభించాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఫైజల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే జబ్బార్ ఫైసల్‌ను ఇంత కిరాతకంగా ఎందుకు హత్య చేశాడనే కారణం తెలియాల్సి ఉంది. పోలీసులు దీనిపై విచారిస్తున్నారు. ఫైజల్‌ను ఫిబ్రవరి 12నే కిడ్నాప్ చేసి, అదే రోజు హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. చదవండి: దోస్తు పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. 19 ఏళ్లకే గుండెపోటుతో.. -
హైదరాబాద్ బాలాపూర్ లో దారుణం
-
హైదరాబాద్: ‘మిస్సింగ్ బాలమ్మ’ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మిస్సింగ్ కేసులో బాధితురాలిని దారుణంగా హతమార్చినట్లు తేలింది. శవం దొరక్కుండా ఉండేందుకు.. విడి భాగాలను కాల్చేసి ఆ బూడిదను డ్రైనేజీలో కలిపారు నిందితులు. ఈ మేరకు నిందితులను రాములు, లలితగా గుర్తించారు. బొర్ర బాలమ్మ అనే మహిళ గత నెల 27వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఈ క్రమంలో ఆమె హత్యకు గురైనట్లు సోమవారం ధృవీకరించారు పోలీసులు. బాధితురాలిని హత్య చేసి ఆమె నుంచి నగలను దోచుకున్నారు నిందితులిద్దరూ. ఆపై మృతదేహాన్ని ముక్కలు చేసి.. కాల్చేసి ఆ బూడిదను మురికి కాలువలో కలిపేశారు. దర్యాప్తు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆరు తులాల బంగారం, 159 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. -
24 లక్షల 60 వేలు పలికిన బాలాపూర్ లడ్డూ వేలం
-
‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’
సాక్షి, హైదరాబాద్: అత్తింటి వేధింపులతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్నగర్కు చెందిన ఖాజా మోయియుద్దీన్ అన్సారీ ఐదో కుమార్తె ఫిర్దోస్ అన్సారీ (29) వివాహం రెండేళ్ల క్రితం మహ్మద్ సుల్తాన్ పటేల్‌తో జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. కొన్నాళ్లుగా భార్యపై అనుమానంతో భర్త వేధించసాగాడు. అంతేకాకుండా అదనపు కట్నం తేవాలంటూ సుల్తాన్‌తో పాటు అతని తల్లి కూడా వేధించారు. వేధింపులు తట్టుకోలేక ఫిర్దోస్ తల్లిగారింటికి వచ్చి నివాసం ఉంటోంది. అయినప్పటికీ సుల్తాన్ షాహిన్‌నగర్ వచ్చి తరచూ భార్యతో గొడవపడి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల ఒకటిన రాత్రి సుల్తాన్ భార్యను ఇష్టానుసారంగా కొట్టి, తిట్టి వెళ్లాడు. దీంతో జీవితంపై విరక్తిచెందిన ఫిర్దోస్ మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. గన్‌తో బెదిరించేవాడు.. తన మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వరాదంటూ.. తాను అనుభవించిన నరకాన్ని ఫిర్దోస్ డైరీలో రాసింది. గన్‌తో బెదిరించి చిత్రహింసలకు గురిచేశాడని రాశారు. ఎన్నో హత్యలు చేశానని, ఎవరికీ భయపడనని అంటూ కొట్టేవాడని పేర్కొన్నారు. -
అమ్మ, అమ్మమ్మ కలిసి.. అమ్మాయిని అమ్మబోయి..
పహాడీషరీఫ్: పేదరికమో, మరో కారణమో.. డబ్బుల కోసం 14 ఏళ్ల అమ్మాయిని ఓ కుటుంబం బేరానికి పెట్టింది.. భార్యకు విడాకులిచ్చి ‘మరో తోడు’ కోసం చూస్తున్న 61 ఏళ్ల వృద్ధుడికి ఆమెను అమ్మేందుకు సిద్ధమైంది. అమ్మ, అమ్మమ్మ కలిసి.. మరో ఐదుగురు మహిళలు మధ్యవర్తులుగా నిలిచి.. చేయబోయిన ఈ దారుణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం రాత్రి దాడులు చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని బండ్లగూడ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన సయ్యద్ అల్తాఫ్ అలీ (61) ఆరేళ్ల క్రితం తన భార్యకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు మరో తోడు అవసరమని భావించాడు. ఇందుకోసం హైదరాబాద్‌లోని క్యూబా కాలనీలో నివాసం ఉండే అఖిల్ అహ్మద్ (37)ను సంప్రదించాడు. ఇద్దరూ కలిసి షాహీన్‌నగర్, చాంద్రాయణగుట్ట పరిసరాలకు చెందిన మహిళలను అక్రమంగా రవాణా చేసే జరీనా బేగం (25), షబానా బేగం (38), షమీం సుల్తానా (45), నస్రీన్ బేగం (40), జాహెద్‌బీ (72)లను మధ్యవర్తులుగా పెట్టుకున్నారు. ఈ మధ్యవర్తులు బండ్లగూడ నూరీ నగర్‌కు చెందిన అష్రియా బేగం కుమార్తె (14 ఏళ్లు)ను అల్తాఫ్ అలీకి రూ.5 లక్షలకు విక్రయించేందుకు ఆమె అమ్మమ్మ చాంద్ సుల్తానా (65) సమక్షంలో మూడు నెలల కింద ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ అల్తాఫ్ డబ్బు చెల్లించడంలో ఆలస్యం చేయడంతో ఒప్పందం రద్దయింది. అయితే కొద్దిరోజుల కింద బాలిక మేనమామకు ప్రమాదం జరిగి, డబ్బులు అవసరం పడ్డాయి. దీనితో అష్రియా బేగం తన బిడ్డను విక్రయించేందుకు సిద్ధమై మధ్యవర్తులను ఆశ్రయించింది. వారు వెంటనే ముంబైకి చెందిన అల్తాఫ్ అలీకి సమాచారమిచ్చారు. డబ్బు అత్యవసరం కావడంతో ఈసారి రూ.3 లక్షలకే బాలికను కొనేందుకు బేరం కుదుర్చుకొన్నారు. డబ్బు చెల్లించి బాలికను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందడంతో.. బాలాపూర్ ఎస్సై శ్రీకాంత్ నేతృత్వంలోని పోలీసు బృందం ఆదివారం రాత్రి దామని ఎర్రకుంటలో దాడులు చేసింది. తొమ్మిది మందిని అరెస్ట్ చేసి బాలికను రక్షించింది. పోలీసులు నిందితులపై పోక్సో, మహిళల అక్రమ రవాణా చట్టాల కింద కేసు నమోదుచేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్‌లో కొత్త పోలీస్స్టేషన్లు.. ఎక్కడంటే!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. దశాబ్ద క్రితం వరకూ శివారు ప్రాంతాలు అనుకున్నవన్నీ నేడు ప్రధాన నగరంలో కలిసిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డును దాటేసి.. రీజినల్ రింగ్ రోడ్ వైపు పరుగులు పెడుతోంది. దీంతో అదే స్థాయిలో శాంతి భద్రతలను కల్పించేందుకు పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. కొత్త పోలీస్ సబ్ డివిజన్లు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా సైబరాబాద్‌లో కొత్తగా నాలుగు ఠాణాలు, రాచకొండలో ఒక డివిజన్, పీఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు. పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అనేది జనాభా, నేరాల సంఖ్యను బట్టి ఉంటుంది. ఐటీ కంపెనీలతో పశ్చిమ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, రాయదుర్గం, నార్సింగి, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ తదితర ప్రాంతాలు నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలలో శాంతి భద్రతలను పెంచాల్సిన అవసరం ఉందని ఓ పోలీస్ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సైబరాబాద్‌లో నాలుగు పీఎస్‌లు.. సెబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. దేశంలో లక్ష జనాభాకు 138 మంది పోలీసులు ఉండగా.. సైబరాబాద్‌లో 86 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు, 9 డివిజన్లలో 36 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మాదాపూర్ డివిజన్లోని నార్సింగి, మియాపూర్ డివిజన్లోని ఆర్సీపురం, చేవెళ్ల డివిజన్లోని శంకర్పల్లి పీఎస్‌ల పరిధిని కుదించి.. ఆయా ప్రాంతాలతో పాటూ కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను కలిపి కొత్తగా సైబరాబాద్ కమిషనరేట్‌లో నాలుగు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో నార్సింగి పీఎస్‌లోని గండిపేట, మెకిల్ల.. ఆర్సీపురం పీఎస్‌లోని కొల్లూరు, శంకర్పల్లి పీఎస్‌లోని జన్వాడ పేరిట కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో ప్రధాన నగరంలోని పోలీస్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గడంతో పాటూ నేరాల నియంత్రణ సులువవుతుందని తెలిపారు. 2 నుంచి 3 వేల పోలీస్ సిబ్బంది కూడా.. శివారు ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న పోలీస్ స్టేషన్లతో పాటూ కొత్తగా రానున్న వాటిల్లో పోలీసుల నియామం చేపట్టాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియ కొలిక్కి రానున్నట్లు సమాచారం. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అదనంగా 2–3 వేల మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌కు 9,403 మంది సిబ్బంది మంజూరు కాగా.. ప్రస్తుతం అన్ని ర్యాంక్‌లలో కలిపి 6,599 మంది సిబ్బంది ఉన్నారు. 2,804 పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. (ట్యాంక్‌బండ్‌పై అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు?) రాచకొండలో కొత్త డివిజన్, పీఎస్.. 5,091.48 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న రాచకొండ ఏరియా వారీగా దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్. రాచకొండలో అత్యధిక జనాభా ఉన్న ఎల్బీనగర్ జోన్ నుంచి కొన్ని ప్రాంతాలను విడదీసి కొత్త డివిజన్, పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఉన్న నాగోల్‌ను ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎల్బీనగర్ జోన్‌లోని వనస్థలిపురం డివిజన్‌ను విభజించి ప్రత్యేకంగా బాలాపూర్ పోలీస్ డివిజన్ ఏర్పాటు కానుంది. వనస్థలిపురంలోని డివిజన్లోని కొన్ని ప్రాంతాలను, బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లతో పాటు, ఇబ్రహీంపట్నం డివిజన్లోని పలు పోలీస్ స్టేషన్లను కలుపుకొని కొత్తగా బాలాపూర్ డివిజన్ ఏర్పాటు కానుంది. (చదవండి: హైదరాబాద్ రూపురేఖలు మార్చిన ఫ్లైఓవర్లు) -
అన్నతో ఎంగేజ్మెంట్, తమ్ముడితో పెళ్లి.. ఆపై ఆత్మహత్య
హైదారాబాద్: పెళ్లయి నెల గడవక ముందే ఓ యువతి జీవితం బలైపోయింది. తన ప్రమేయం లేకుండానే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములతో ఒకరితో ఎంగేజ్మెంట్, మరొకరితో వివాహం చివరికి ఆ యువతిని బలికొంది. ఇక పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.. పాతబస్తీకి చెందిన షబ్బీర్ అలీ కుమార్తె షాహిన్‌తో జల్పల్లి న్యూ బాబానగర్‌కు చెందిన మీర్ ఇస్మాయిలుద్దీన్ అలీకి గత నెల 12న పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. అయితే మూడు సంవత్సరాల క్రితమే ఇస్మాయిలుద్దీన్ వివాహం చేసుకున్న షాహిన్భేగంకు తన అన్నయ్య జలాలుద్దీన్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్నాళ్ళకి ఉపాధి నిమిత్తం అన్నదమ్ములిద్దరూ దుబాయికి వెళ్లారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో వివాహం చేసుకునేందుకు జలాలుద్దీన్ దుబాయి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అయితే కొద్ది రోజుల క్రితమే తన తమ్ముడు ఇస్మాయిలుద్దీన్ అలీ మాత్రం తిరిగి తన స్వస్థలం చేరుకున్నాడు. ఇది ఇలా ఉండగా దుబాయ్‌లో జలాలుద్దీన్ ఆచూకి తెలియని పరిస్థితి కుటుంబ సభ్యులకు ఎదురైంది. దీనితో తప్పని పరిస్తితుల్లో ఇరు కుటుంబాల పెద్దలు చర్చించి షాహిన్‌ను ఇస్మాయిలుద్దీన్ అలీకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గత జులై నెల 12న వారిరువురికి వివాహం జరిపించారు. అయితే ఇస్మాయిలుద్దీన్ అలీ మాత్రం తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ షాహిన్‌ను రోజూ హింసించసాగాడు. తన అన్న ఎంతో ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకున్న యువతిని తనకు ఇచ్చి పెళ్లి చేశారంటూ ఇస్మాయిలుద్దీన్ తీవ్రంగా ఆలోచించేవాడు. అంతేకాక తన అన్నకు భార్యగా ఉండాల్సిన యువతిని తన భార్యగా అంగీకరించలేనంటూ ఆమెను మానసికంగా వేధించినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఇరు కుటుంబాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే షాహిన్‌కు అత్తమామల నుంచి సైతం వేదింపులు మొదలయ్యాయి. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన షాహిన్ బేగం గత శనివారం తన గదిలో ఉన్న ఫాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే షాహిన్ బేగం మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
తెలంగాణ: హైదరాబాద్‌లో అర్దరాత్రి లాఠీగ్యాంగ్ హల్చల్
-
Hyderabad: అర్దరాత్రి లాఠీగ్యాంగ్ హల్చల్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్లో కొందరు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే అలాంటి వారిపై పోలీసులు కాకుండా కొందరు ముప్పేట దాడి చేస్తున్నారు. ఓ గ్యాంగ్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ దాడులకు పాల్పడుతున్నారు. ఎవరైనా బయటికి వస్తే ముప్పేట దాడి చేస్తుండడంతో కలకలం రేపుతోంది. అయితే ఆ దాడికి పాల్పడుతున్న వారిని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీలో ఇద్దరిని గుర్తించినట్లు సమాచారం. దీనిపై బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అర్దరాత్రి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షహీన్ నగర్ రోడ్లపై ఒక్కో బైక్‌పై ఇద్దరిద్దరు వ్యక్తులు హల్చల్ చేస్తున్నారు. కొందరు బైకులపై తిరుగుతూ లాఠీలు చేత బట్టుకొని కనిపించిన వారిని చితకబాదుతున్నారు. అయితే వారిని మొదట పోలీసులుగా స్థానికులు భావించారు. కానీ వారు జులాయి గ్యాంగ్‌గా గుర్తించారు. నాలుగు, ఐదు బైక్‌లపై పోలీస్ డ్రెస్ లేకుండా సంచరిస్తూ లాఠీలతో దాడి చేస్తుండడంతో స్థానికులు సీసీ ఫుటేజీలో గమనించారు. వారు పోలీసులు కాదని గుర్తించి బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
కరోనా జయించిన బాలాపూర్ సీఐ
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ సీఐ సుధీర్ కృష్ణ కరోనా జయించారు. కోవిడ్ బారినుంచి పూర్తిగా కోలుకుని విధుల్లో చేరారు. గతనెల 20న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో 14రోజులపాటు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరో 14 రోజులు హోం క్వారైంటన్లో ఉండనున్నారు. ఇంటినుంచే ఆయన విధులు నిర్వర్తించనున్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. మానసికంగా దఢంగా ఉండి కరోనాను ఎదుర్కోవాలని సుధీర్ అన్నారు. అధైర్య పడకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలని సూచించారు. ఉన్నతాధికారులు, డాక్టర్లు ఇచ్చిన మనోధైర్యం ఎంతగానో ఉపకరించిందని చెప్పారు. కరోనా సోకినపుడు మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యమని, వ్యాయామం, యోగా, ధ్యానంతో ఇమ్యునిటీ పవర్ పెంచుకోవచ్చని అన్నారు. మంచి పోషకాహరం తీసుకుంటే కరోనాను జయించవచ్చని సుధీర్ కృష్ణ తెలిపారు. (చదవండి: తీర్థాల ఘటనపై మంత్రి, కలెక్టర్ సీరియస్) -
బాలాపూర్‌లో దారుణం.. కాళ్లు, చేతులు కట్టేసి..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బాలాపూర్ పీఎస్ పరిధిలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు.. ఓ వ్యక్తి కాళ్లు, చేతులు కట్టేసి ఉరి వేశారు. దేవతలగుట్ట మార్గంలో ఓ వ్యక్తి మృతదేహం గేటుకు వేలాడుతూ ఉన్నదని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకుడిని బాలాపూర్ నివాసి జొన్నాడ ప్రశాంత్‌గా గుర్తించారు. ప్రశాంత్‌కు తల్లిదండ్రులు లేరని అతని అన్న శ్రీకాంత్ వద్ద ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రశాంత్ అన్నకు సమాచారం అందించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
మంచాల ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం
పహాడీషరీఫ్: పోలీస్‌స్టేషన్ ముందు ఓ ఏఎస్ఐ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది. వివరాల ప్రకారం.. బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కె.నర్సింహ ఏడాదిన్నర క్రితం నుంచి ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగైదు రోజుల క్రితం ఆయనను బదిలీ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ నెల 21న మంచాల పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరారు. శుక్రవారం మధ్యా హ్నం 3 గంటల సమయంలో బాలాపూర్ పోలీస్‌స్టేషన్ ముందున్న వాటర్‌ట్యాంక్ వద్దకు యూనిఫారంలో వచ్చిన ఆయన ట్యాంక్‌పైకి ఎక్కారు. ఇది గమనించిన పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఆయనను కాపాడేందుకు పైకి ఎక్కారు. ఈలోపే ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. పైకి చేరుకున్న సిబ్బంది ఆయనను కిందికి దించి చికిత్స నిమిత్తం సంతోష్‌నగర్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. 35 శాతం కాలిన గాయాలతో ఆయన చికిత్స పొందుతున్నారు. వివాదానికి కారణమైన వివాహ విందు.. నర్సింహ బంధువుల వివాహం బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్హాల్లో ఈ నెల 15న జరిగింది. విందుకు నర్సింహ తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. విందుకు బాలాపూర్ ఠాణా కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు వెళ్లారు. ఈ సమయంలోనే ఏఎస్ఐకి, సదరు కానిస్టేబుళ్ల నడుమ వివాదం నెలకొంది. దీనికి సంబంధించిన ఆధారాలను రాచకొండ సీపీ అధికార గ్రూప్‌లో కానిస్టేబుళ్లు పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సీపీ.. ఏఎస్ఐని మరుసటిరోజే బదిలీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఆ కానిస్టేబుళ్లు డబ్బులు డిమాండ్ చేశారంటూ బాలాపూర్ ఇన్స్పెక్టర్ సైదులుకి ఏఎస్ఐ కుమారుడు సాయికిరణ్ శుక్రవారం ఫిర్యాదు చేశాడు. అలాగే ఇన్స్పెక్టర్ సైదులు వేధింపుల కారణంగానే తన తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ సాయికిరణ్ ఆరోపించాడు. ఇన్స్పెక్టర్పై చర్యలు.. ఈ ఉదంతాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సింహను పరామర్శించి.. కుటుంబీకుల్ని ఓదార్చారు. అనంతరం ఇన్స్పెక్టర్ సైదులుతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ దశరథ్ను హెడ్‌క్వార్టర్‌కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాల్సిందిగా ఎల్బీ నగర్ డీసీపీని ఆదేశించారు. గతంలో సైదులు ఆత్మహత్యాయత్నం.. బాలాపూర్ ఇన్స్పెక్టర్ వి.సైదులు గతంలో ఆత్మహత్యాయత్నం చేశారు. వనస్థలిపురం పోలీసుస్టేషన్లో ఎస్ఐగా ఉన్న సమయంలో ఆయనపై అవి నీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. దీంతో సైదులు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వద్ద తనపై విచారణ చేయకుండా చర్యలు తీసుకున్నారని హల్చల్ చేశారు. విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. సైదులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయన సోదరుడు ఉన్నతాధికారులపై ఆరోపణలు చేశారు. -
బాలాపూర్ సీఐపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్ : బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏఎస్సై నరసింహను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరామర్శించారు. ప్రస్తుతం నరసింహ అపోలో డీఆర్డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నరసింహకు అపోలో వైద్యులు మెరుగైన చికిత్స అందిసున్నారని తెలిపారు. అయితే సీఐ సైదులు తనపై తప్పుడు రిపోర్టు ఇచ్చాడని నరసింహ ఆరోపించిన వ్యాఖ్యలను మేము పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో పాటు నరసింహ కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారాన్ని కూడా తీసుకున్నట్లు తెలిపారు. అయితే బాలాపూర్ సీఐ సైదులు, కానిస్టేబుల్ దశరథ్‌లను బదిలీ చేసి సీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశామని తెలిపారు. తదుపరి విచారణలో వీరిద్దరి ప్రమేయం ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. నగరంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఏఎస్సై నరసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒక కేసు విషయంలో తనకు సంబంధం లేకున్నా ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని నరసింహ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో 30 శాతం కాలిన గాయాలతో ఉన్న నరసింహను అపోలో డీఆర్డీవో ఆసుపత్రికి తరలించారు. వివరాలు.. ఇటీవల బాలాపూర్ సీఐ తనను వేధిస్తున్నాడంటూ అదే స్టేషన్లో ఏఎస్సై గా పనిచేస్తున్న నరసింహ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అతని ఫిర్యాదును పట్టించుకోకుండా నరసింహను బాలాపూర్ నుంచి మంచాలకు ట్రాన్స్పర్ చేశారు. తన తప్పు లేకున్నా సీఐ ఇచ్చిన తప్పుడు రిపోర్టుతో తనను అక్రమంగా బదిలీ చేశారని మనస్థాపం చెందాడు. దీంతో శుక్రవారం నరసింహ పెట్రోల్ బాటిల్‌తో బాలాపూర్ పీఎస్‌కు చేరుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది. -
అక్కా... మళ్లీ బడికి పోదామా
స్త్రీ చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు అని పెద్దలు అంటారు. కాని ఈ దేశంలో అమ్మాయిని ఒక రకంగా, అబ్బాయిని ఒక రకంగా చదివించే పరిస్థితులు ఉన్నాయి. చిన్నప్పుడు చదువు మానేసి పెళ్లి, కుటుంబం బాధ్యతలలో పడిపోయి హటాత్తుగా తిరిగి చదువుకోవాలనుకునే స్త్రీలకు మార్గం ఉందా? ఉంది. ఈ స్త్రీలు చదువుకుంటున్నారు. ఇలా చదువుకోవాలనుకుంటున్న స్త్రీలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ముప్పై ఏళ్ల క్రితం మమత చదువు ఏడవ తరగతితో ఆగిపోయింది. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడం, ఆమెకు సపర్యలు చేయడానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చదువుకోవాలనే ఇష్టం ఉన్నా ఇంటి వద్దే ఉండిపోయింది. ఆ తర్వాత మరో పదేళ్లకు ఇల్లాలయ్యింది. అత్తింటి బాధ్యతల బరువులో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఏడవ తరగతిలో అటకెక్కిన చదువు మళ్లీ ఆమెకు ఎప్పుడూ గుర్తుకురాలేదు. ఆ అవసరమూ లేదనుకుంది. ఇద్దరు పిల్లల్ని బడికి పంపడం, ఎలక్ట్రీషియన్ అయిన భర్తకు క్యారేజీ సర్ది ఇవ్వడం, ఇంటిల్లిపాది బాగోగులు చూసుకోవడంవంటి పనులలో మునిగితెలింది. పిల్లలిద్దరూ డిగ్రీ స్థాయికి వచ్చేశారు. ఉదయాన్నే పిల్లలు, భర్త ముగ్గురూ బయటకు వెళ్లిపోతారు. తనకు ఇప్పుడు కాస్తంత తీరిక దొరికింది. తోటి వారితో ఓ మహిళా సంఘంలో చేరింది. అక్కడ తెలిసింది మమతకు చదువుకోకపోవడంలో తలెత్తిన ఇబ్బందులు. ఏ అప్లికేషన్ నింపాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా బెరుకుగా ఉండేది. చదువుకోకపోవడంతో ఎవరో ఒకరి సహాయం తప్పనిసరి అయ్యింది. తనే చదువుకుంటే ఇలా ఇబ్బందులు పడేదాన్ని కాదనుకుంది. ఆగిపోయిన చదువు మళ్లీ చదువుకుంటే అనుకుంది. కానీ, ఇంత పెద్దదాన్ని అయ్యాక ఇప్పుడేం చదువుకుంటాం అని నిట్టూర్చింది. కానీ ఆమె కలకు ఓ ఎడ్యుకేషనల్ ఎన్జీవో సంస్థ భరోసాగా నిలిచింది. ఓపెన్ విద్యా విధానం ద్వారా ఇప్పుడు మమత పదోతరగతి చదువుతోంది. వదిలిన చదువు హైదరాబాద్ శివారులోని బాలాపూర్ గ్రామంలో బాలాపూర్ యూత్‌కు వెళితే ఓ పాతికమంది మహిళలు ఎప్పుడో వదిలేసుకున్న తమ కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉండటం మనం చూడచ్చు. అక్కడ పదహారేళ్ల వయసు నుంచి నలభై ఐదేళ్లు వయసున్న మహిళలు ఉన్నత విద్యను చదువుకుంటూ కనిపిస్తారు. ఆడపిల్లలకు చదువెందుకు అనే పెద్దల వల్ల కొందరు ప్రైమరీ పాఠశాల స్థాయిలోనే చదువు మానేస్తే, కొందరు టెన్త్ క్లాస్ ఫెయిలయ్యి ఆ తర్వాత చదువు కొనసాగించలేక మానేసిన వారున్నారు. ఇంకొందరు వారి ఇంటి ఆర్థిక స్థితి సరిగా లేక చిన్నప్పుడే ఇంటెడు బాధ్యతలు మోసినవారున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక తమ గురించి ఆలోచించుకునే స్థాయిని కూడా మర్చిపోయినవారున్నారు. అలాంటి కొంతమంది మహిళలు ఇప్పుడు మళ్ళీ పుస్తకాలను ముందేసుకొని ఒక్కో అక్షరాన్ని కూడబలుక్కుంటూ పదాలను నేర్చుకుంటున్నారు. తమ పంథాన్ని మార్చుకుంటున్నారు. పదవతరగతి పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని కొందరు, ఇంటర్.. డిగ్రీ స్థాయి చదువులు చదువుకోవాలని మరికొందరు, వృత్తి విద్యా కోర్సులు నేర్చుకొని తమ కాళ్ల మీద తాము నిలబడాలని కలలు కంటున్నవారు ఇక్కడ మనకు కనిపిస్తారు. ఎప్పుడో వదిలేసిన చదువును ఇప్పుడు కొనసాగిస్తూ ఆ స్థాయికి తగిన ఉదోగ్యాలు పొందిన వారూ ఉన్నారు. జీవితంలో మరో అవకాశాన్ని పొదివిపట్టుకొని ముందడుగు వేయాలని కలలు కంటున్నవారు ఉన్నారు. వారి కలలు సాకారం కావాలని కోరుకుందాం. డిగ్రీ చేస్తాను నాకు ముగ్గురు అమ్మాయిలు. నా చదువు స్కూల్ వయసులోనే ఆగిపోయింది. అందుకే ముగ్గురినీ చదివిస్తున్నాను. మా పిల్లలకు చదువు విషయంలో ఏదైనా చెప్పాలంటే ఇబ్బంది పడుతున్నాను. ఇప్పుడు నాకు మళ్లీ చదువుకునే అవకాశం వచ్చింది. పదోతరగతి ఆపేయకుండా డిగ్రీ కూడా పూర్తి చేస్తాను. – సునీత అదనపు అర్హత ఇంటికి ఆసరా కావాలంటే ఏదైనా ఉద్యోగం చేయాలి. పదో తరగతి సర్టిఫికెట్ కూడా లేని మాకు ఏ ఉద్యోగం వస్తుంది. ఎక్కడికెళ్లినా ‘పదోతరగతి చదివారా.. సర్టిఫికెట్ ఉందా!’ అని అడిగేవారు. దీంతో ఏదైనా చిన్న ఉద్యోగం చేయాలని ఉన్నా ధైర్యం చేయలేకపోయాను. ఇరవై ఏళ్ల క్రితం టెన్త్‌లోనే నా చదువు ఆగిపోయింది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు. వారి బాగోగులు. ఇప్పుడు టెన్త్ పాసై ఇంటర్ కూడా చదవాలనుకుంటున్నాను. – జయశ్రీ మా అబ్బాయి నేనూ ఒకే క్లాస్ కాస్త తీరిక దొరికితే ఏదైనా పుస్తకం చదవాలనుకున్నా ఒక్కో అక్షరం కూడబలుక్కొని చదవాల్సి వచ్చేది. చిన్నప్పుడు మానేసిన చదువు ఇప్పుడు పూర్తి చేస్తా. ఈ నాలుగు నెలలుగా అవన్నీ గుర్తుతెచ్చుకుంటున్నాను. ఇప్పుడు మా అబ్బాయితో పాటు నేనూ పదోతరగతి చదువుకుంటున్నాను. – వసంత ఇంగ్లిష్‌లో మాట్లాడాలి ఇంగ్లిషులో మాట్లాడాలనేది నా కల. కానీ, చదువుకోలేదు. ఎప్పుడూ ప్రయత్నించలేదు. చిన్నప్పుడు ఆపేసిన చదువును కొనసాగిస్తున్నాను. ఇంగ్లిషు నేర్చుకుంటున్నాను. – మమత బేసిక్స్ నుంచి మొదలు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ చదువుకోవచ్చు. జూన్‌లో మొదలైన ఈ క్లాసులు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేవరకు ఉంటాయి. ఆ తర్వాత కూడా వీరి అభిరుచి మేరకు వృత్తి విద్య కోర్సులు నేర్చుకోవచ్చు. మొదటి నాలుగు నెలలు అఆ లు, ఏబీసీడీల వంటి బేసిక్ చదువు చెప్తాం. కొన్నేళ్ల క్రితం వదిలేసిన చదువును కొనసాగించాలంటే బేసిక్స్ తప్పనిసరి. ఆ తర్వాత ఐదు సబ్జెక్టులనూ బోధిస్తున్నాం. – చిన్నికృష్ణ, ఇన్‌ఛార్జి, ప్రతన్ ఎడ్యుకేషన్ సంస్థ – నిర్మలారెడ్డి ఫొటోలు: సోమ సుభాష్ -
తండ్రి డైరెక్షన్లో దొంగతనం చేసిన మైనర్ బాలుడు
-
రూ.50 లక్షల విలువైన గుట్కా పట్టివేత
బాలాపూర్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఉస్మాన్ నగర్ కేంద్రంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిషేధిత గుట్కా తయారు చేస్తోన్న కేంద్రంపై బాలాపూర్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు రూ.50 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా తయారీకి ఉపయోగించే మెషిన్‌తో పాటు సామగ్రి సీజ్ చేశారు. పోలీసుల రాక గమనించి నిందితుడు తౌఫీక్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలాపూర్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి తెలిపారు. -
ఒంటెలతో అక్రమ వ్యాపారం
-
బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు ధరను సొంతం చేసుకుంది. లంబోధరుడి లడ్డూ ఈ ఏడాది ఏకంగా 15 లక్షల 60వేలు పలికింది. ఆది నుంచి హోరా హోరీగా సాగిన వేలం పాటలో నాగం తిరుపతి రెడ్డి పెద్ద మొత్తంలో వేలం పాట పాడి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. వెయ్యి నూట పదహార్లతో ప్రారంభమైన వేలం పాట.. చివర వరకూ ఉత్కంఠగా కొనసాగింది. లడ్డూను సొంతం చేసుకునేందుకు 21మంది భక్తులు పోటీ పడ్డారు. గత ఏడాది వేలంలో పాల్గొన్న 17 మందితో పాటు కొత్తగా మరో 4 మంది లడ్డూను సొంతం చేసుకునేందుకు వేలంలో పాల్గొన్నారు. చివరకు అత్యధికంగా పాట పాడిన గణేష్ లడ్డూ నాగం తిరుపతి రెడ్డిని వరించింది. గత ఏడాది రూ.14.65 లక్షల పలికిన లడ్డూ ఈ సారి 95 వేలు అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. బాలాపూర్ గణపతికి, ఆయన చేతి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నగరానికి దక్కిన ఈ ఖ్యాతి, ప్రపంచం నలుమూలా ఆసక్తిని రేకెత్తించింది. ఏటా వచ్చే వినాయక చవితి పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుని లడ్డూనే. మరి ఈ లడ్డూకు అంత క్రేజెందుకంటారా...! ‘కోరిన కోర్కెలు నెరవేర్చే లడ్డూ’గా పేర్కొంటుంటారు బాలాపూర్ వాసులు. లడ్డూ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేశారు. 1980లో మొదలై... గణేశునిపై బాలాపూర్‌వాసులకున్న భక్తి, సేవాతత్పరతను చాటి చెబుతూ 36 ఏళ్ల సుదీర్ఘ యానంతో చరిత్రను సృష్టించింది. గణేష్ నవరాత్రులు ముగిసేవరకు బాలాపూర్ వాసులు మద్య, మాంసాలను ముట్టకుండా గణేశునితో పాటు లడ్డూను కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. 1994 నుంచి బాలాపూర్ లడ్డూను వేలం వేస్తున్నారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా ఆ లడ్డూను దర్శించి పూజించిన వారు కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నామని భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తుంటారు. -
బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డు
-
మొదలైన బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర
-
బాలాపూర్‌లో గణేశుడి శోభాయాత్ర ప్రారంభం
-
బాలాపూర్‌లో ఉదయం 8 గంటలకు లడ్డూ వేలం
-
బాలాపూర్‌లో వినాయక చవితి సందడి
-
బాలాపూర్‌లో వినాయక చవితికి భారి ఏర్పాట్లు
-
పగిలిన కృష్ణా పైప్ లైన్
బాలాపూర్ చౌరస్తాలో ఉన్న కృష్ణా పైప్‌లైన్ ఫేజ్-2 రింగ్‌మెన్ వన్ జాయింట్ బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగి పేలిపోడంతో ప్రధాన రహదారిపై నీరు ఏరులై పారింది. ఆకస్మికంగా చోటు చేసుకున్న ఈ సంఘటనతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. రహదారి పై ప్రయాణిస్తున్నవాహనాలు.. నీటి ఉధృతికి కొట్టుకు పోయాయి. చుట్టుపక్కల దుకాణాలు నీట మునిగాయి. కాగా.. వత్తిడి కారణంగానే బాలాపూర్ చౌరస్తాలో కృష్ణా ఫేజ్ 2 పైప్ లైన్ పగిలి పోయిందని.. జలమండలి అధికారులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు సాహెబ్‌నగర్‌కు అనుసంధానంగా ఉన్న ప్రధాన కంట్రోల్వాల్ను ఆపివేశామని.. అయితే అప్పటికే పైప్గుండా సరఫరా అవుతున్న నీరు లీక్కావడంతో ఈఘటన చోటు చేసుకుందన్నారు. కంట్రోల్ వాల్వ్ ఆపడంతో బాలాపూర్, బార్కాస్ సబ్డివిజన్లకు నీటిసరఫరాలో అంతరాయం ఉంటుందని వివరించారు. పైప్ లైన్ నుంచి భారీగా నీరు రావడంతో.. రహదారిపై రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. ట్రాఫిక్ పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. -
పైప్‌లైన్ పగిలి చెరువును తలపిస్తున్న రోడ్డు
-
బాలాపూర్ లడ్డూ భలే గిరాకీ
-
రూ 10.32 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది10.32 లక్షలు పలికింది. ఆది నుంచి పోటా పోటీగా సాగిన వేలం పాటలో బాలాపూర్ గణేశుడి లడ్డూను కళ్లెం మదన్ మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఎప్పటి లాగానే.. రూ116 నుంచి ప్రారంభమైన వేలం పాట.. చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. లడ్డూను సొంతం చేసుకునేందుకు 24 మంది భక్తులు పోటీ పడ్డారు. చివరకు గణేశ్ లడ్డూ కల్లెం మదన్ మోహన్ రెడ్డి ని వరించింది. గత ఏడాది రూ 9.50 లక్షలు పలికిన ఈ లడ్డూ ఈ సారి మరో 82 వేలు అధికంగా పలికింది. ఈ లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏటా పోటీ పెరుగుతూ వస్తోంది. కాగా బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1980లో మొదలైంది. మూడు దశాబ్దాల పాటు సాగుతున్న ఈ వేలంలో ఏటేటా.. రికార్డు ధర పలుకుతోంది. గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకూ బాలాపూర్ వాసులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఇక్కడి లడ్డూను ప్రత్యేకంగా పూజిస్తారు. లడ్డూను వేలంలో దక్కించుకున్న వారే కాకుండా దాన్ని దర్శించి పూజించిన వారు సైతం సుఖ సంతోషాలతో ఉంటారన్నది ఇక్కడి వారి నమ్మకం. మొదట్లో వేలల్లో ఉండే ఈ లడ్డూ .. మెల్ల మెల్లగా లక్షలకు చేరింది. -
అత్యధిక ధర పలికే బాలాపూర్ లడ్డూ
-
తెగబడ్డ దోపిడీ దొంగలు
బాలాపూర్: షిరిడీ-మైసూర్ రైలులో దోపిడీ దొంగలు తెగబడ్డారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో రైల్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. రైల్లోకి ప్రవేశించిన 30 మంది దోపిడీ దొంగలు ఎస్ 1 బోగి నుంచి ఎస్ 14 బోగిల వరకు స్వైర విహారం చేశారు. ప్రయాణికులను బెదిరించి భారీగా బంగారం, నగదు దోచుకున్నారు. మహారాష్ట్రలోని బాలాపూర్ వద్ద ఘటన చోటు చేసుకుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
ఆస్తి కోసం ప్రాణాలు తోడేస్తున్నారు
- కుటుంబసభ్యుల ఉసురు తీస్తున్న కిరాతకులు - నిన్న షాహినాయత్‌గంజ్.. నేడు బాలాపూర్ సాక్షి, సిటీబ్యూరో: ఆస్తి కోసం కుటుంబసభ్యుల ప్రాణాలను బలిగొంటున్నారు కొందరు దుర్మార్గులు...మొన్న నాగోల్‌లో భార్య, కొడుకుని కిరాయి హంతకులతో చంపించాడో వ్యక్తి. నిన్న..షాహినాయత్‌గంజ్‌లో కన్న తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు మరో కిరాతకుడు. నేడు... బాలాపూర్ సాయినగర్‌లో మరో ఉన్మాది భార్య, కూతరు, తల్లిని కిరాతంగా చంపాడు. రక్తబంధాన్ని మరిచి ఆస్తి కోసం ఇలా మారణ కాండకు పాల్పడటం సభ్యసమాజాన్ని కలచివేస్తోంది. జంట కమిషనరేట్ల పరిధిలో ఏడాది కాలంగా ఆస్తి కోసం 30కి పైగా హత్యలు జరగడం కలకలం సృష్టిస్తోంది. యాదృశ్ఛికంగా కుటుంబ దినోత్సవం రోజున(శుక్రవారం) బాలాపూర్ సాయినగర్‌లో రాంరెడ్డి అనే ఉన్మాది భార్య రాధిక, తల్లి సుభద్ర, కూతురు అక్షయల గొంతు కోసి మారణకాండకు పాల్పడ్డాడు. వరుస ఘటనల నేపథ్యంలో నగరంలోని కొన్ని ఉమ్మడి కుటుంబాల్లో ఎప్పుడు ఎవరు ఉన్మాదిగా మారతారోనన్న అభద్రతా భావంతో కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆస్తి కోసం గతంలో జరిగిన కొన్ని ఘాతుకాలు... సెప్టెంబర్ 25, 2013: కేపీహెచ్‌బీకాలనీలో పీరమ్మ (55)ను దత్తపుత్రుడు ఠాకూర్‌పాషా స్నేహితులతో కలిసి గొంతునులిమి చంపేశాడు. సెప్టెంబర్ 31, 2013: అచ్చయ్యనగర్‌లో భార్య రజనిని భర్త బాలకృష్ణ కూల్‌డ్రిక్‌లో నిద్రమాత్రలు వేసి తాగించి కత్తితో గొంతులో పొడిచి కడతేర్చాడు. నవంబర్ 8, 2013: నాగోల్‌లో శశిధర్‌రెడ్డి అనే వ్యక్తి కిరాయి హంతకులతో భార్య విజయలక్ష్మిచ కొడుకు సాకేత్‌రెడ్డి చంపించాడు. సెప్టెంబర్ 1, 2014: తనకు తెలియకుండా రూ.30 వేలు బంధువులకు ఇచ్చిందని భార్య సబితను భర్త యాదగిరిరెడ్డి గొంతు నులిమి హతమార్చాడు. నవంబర్ 20, 2014: సరూర్‌నగర్ హుటా కాంప్లెక్స్‌లో భార్య రేణుక (26) మెడకు బెల్ట్ బిగించి భర్త ప్రసాద్ చంపేశాడు. ఏప్రిల్ 20, 2014: ఉప్పల్‌లో మాజీ ఎయిర్ హోస్టెస్ రీతును భర్త సచిన్ కొట్టి చంపాడు. నవంబర్ 21, 2014: బంజారాహిల్స్‌లో కుమారుడు అన్వర్‌బేగ్ తల్లి గౌస్యబేగం(60)ను చంపాడు. మార్చి 12, 2015.. షాయినాయత్‌గంజ్‌లో కొడుకు బాబు తల్లి లక్ష్మి (60)ని చంపి ఇంట్లోని పాతిపెట్టాడు. -
లంబో ‘ధర’ం
* వేలం పాటలో రికార్డు స్థాయి ధర పలికిన గణపతి లడ్డూలు హైదరాబాద్: భక్తుల కొంగుబంగారం.. లంబోదరుని మహా ప్రసాదం. సోమవారం రాజధాని వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేలం పాటల్లో గణపతి లడ్డూలు రికార్డు స్థాయి ధర పలికాయి. చారిత్రక ప్రసిద్ధి పొందిన బాలాపూర్ వినాయకుని లడ్డూను అదే ప్రాంతానికి చెందిన సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి రూ.9.50 లక్షలకు దక్కించుకున్నారు. లడ్డూల వేలంలో బాలాపూర్ గణపతితో పోటీపడే బడంగ్‌పేట విఘ్నేశ్వరుని లడ్డూ ఈసారి అమాంతం తగ్గిపోయింది. గతేడాది రూ.6.30 లక్షలు పలికిన ఈ లడ్డూ ధర ఈసారి రూ.4.05 లక్షలకు పడిపోయింది. దీనిని బడంగ్‌పేట నగర పంచాయతీ అధ్యక్షుడు (టీఆర్ఎస్) కర్రె కృష్ణ దక్కించుకున్నారు. లడ్డూని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు అంకితమిస్తున్నట్టు కృష్ణ ప్రకటించారు. ఈసారి గణపతి లడ్డూలను దక్కించుకునేందుకు ముస్లింలు సైతం ముందుకు రావడం విశేషం. -
కొత్తగా పది మున్సిపాలిటీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కొత్త మున్సిపాలిటీలపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. శివారు పంచాయతీలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం.. వీటిని మున్సిపాలిటీలుగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో కలెక్టర్ బి.శ్రీధర్ నేతృత్వంలోని అధికారుల బృందం కొత్త మున్సిపాలిటీలపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపింది. గ్రేటర్ విలీన ప్రతిపాదిత 32 గ్రామాలను పది మున్సిపాలిటీల పరిధిలోకి తేవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. జవహర్‌నగర్, గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీలను ఈ జాబితాల్లో చేర్చకూడదని భావించింది. శామీర్‌పేట మండలంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న జవహర్‌నగర్‌ను విలీనం చేసుకునేందుకు గ్రేటర్ పాలకవర్గం మొగ్గు చూపుతోంది. అక్కడే డంపింగ్ యార్డు ఉండటం, విస్తారంగా ప్రభుత్వ భూములు ఉన్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు ఈ గ్రామ విలీనం అనివార్యమని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఈ పంచాయతీని కలుపుకొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే గుండ్లపోచంపల్లి గ్రామాన్ని గ్రేటర్లో విలీనం చేయకుండా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేద్దామని తొలుత భావించినప్పటికీ, నిర్దేశించిన జనాభా లేనందున.. ప్రస్తుతానికి దీన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలనే అభిప్రాయానికొచ్చింది. పదింటికీ ఒకే..! గ్రేటర్లో శివారు గ్రామాల విలీన ప్రక్రియపై న్యాయస్థానం ఆక్షేపించడంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా తుది నిర్ణయాన్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాలతో త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు వారం రోజులుగా వీటి భవిష్యత్తుపై తర్జనభర్జనలు పడ్డ జిల్లా యంత్రాంగం ఓ నివేదికను రూపొందించింది. ఈ నేపథ్యంలో గుండ్లపోచంపల్లి, జవహర్‌నగర్‌ను మినహాయించి మిగతా గ్రామాలను 8 నుంచి పది మున్సిపాలిటీలు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు జిల్లా ప్రజాప్రతినిధులను సంప్రదించి తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాలని యోచిస్తోంది. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే రాష్ట్రంలోనే అత్యధిక మున్సిపాలిటీల(16)తో మన జిల్లా అగ్రస్థానంలో నిలవనుంది. -
లడ్డూ కావాలా నాయనా...?
బాలాపూర్ లంబోదరుడి లడ్డూ ఈ ఏడాది కూడా దుమ్ము దులిపింది. ఏకంగా తొమ్మిదిన్నర లక్షల రూపాయల వరకూ ధర పలికిన గణేశ్ లడ్డూ.. గత రికార్డులను బద్దలు చేసింది. బాలాపూర్ అంటే చాలు వినాయకుడు, లడ్డు ప్రసాదం గుర్తుకు వస్తాయి. బాలాపూర్ లడ్డూ వేలం రాష్ట్రవ్యాప్తంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈసారి రూ.9.26 లక్షల రూపాయల ధర పలికిన గణేశ్ లడ్డూ.. గత రికార్డులు తిరగరాసింది. గత ఏడాది రూ.7.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది మరో 1.76 లక్షలకు దాటడం విశేషం. బుధవారం ఉదయం హోరాహోరీగా సాగిన వేలంపాటలో టీకేఆర్ విద్యాసంస్థలు రూ.9 లక్షల 26వేలకు గణనాధుని లడ్డూని సొంతం చేసుకుంది. ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లడ్డూ లక్షల రూపాయలకు చేరుకుంది. లడ్డూను సొంతం చేసుకోవడానికి ఈ ఏడాది కొలను బాల్‌రెడ్డి 21వేల రూపాయలతో వేలం ప్రారంభించారు. 1994లో తొలిసారి నిర్వహించిన వేలంలో బాలాపూర్ లడ్డూ 450 రూపాయలు పలికింది. అప్పటి నుంచి ఏటా లడ్డూ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా బాలాపూర్ లడ్డూ వేలంపాటలో దూసుకుపోయింది. లంబోదరుడి లడ్డూ వేలం ఈసారి మొత్తం రికార్డులు బ్రేక్ అయ్యాయి. లంబోదరుడి లడ్డూ ప్రసాదం సొంతం చేసుకోవడం సంతోషకరంగా ఉందని టీకేఆర్ విద్యాసంస్థల అధినేత, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా 1994లో లడ్డూ వేలం వేయగా స్థానికుడైన రైతు కొలను మోహన్ రెడ్డి రూ.450లకు కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి కొలను కుటుంబ సభ్యులు ఆరుసార్లు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ ప్రాముఖ్యత పెరుగటంతో బాలాపుర్ గణేషుడి లడ్డూకు పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో లడ్డూ ధర ఏ ఏడాదికి ఆ ఏడాది పెరుగుతూ పోయింది. ఈ లడ్డూ వేలంలో కుల, మత, ప్రాంతీయ విభేదాలు లేకుండా వేలంపాటలో పాల్గొంటారు. అయితే 33 ఏళ్ల నుంచి బాలాపూర్‌లో గణేష్ ఉత్సవాలు నిర్వహించినప్పటికీ ఇంత స్థాయిలో ధర పలకడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాలాపూర్ లడ్డూను గెల్చుకోవడాన్ని స్థానికులు శుభప్రదంగా భావిస్తారు. లడ్డూను వేలం పాటలో దక్కించుకోవడం వల్ల బాధలు పోతాయని భక్తులు నమ్ముతారు. స్వామివారి లడ్డూను పొలంలో చల్లుకుంటే అధిక దిగుబడులు వస్తాయని, బావిలో వేస్తే నీళ్ళు ఎండిపోకుండా ఉంటాయని, వ్యాపారాలు సాఫీగా సాగుతాయని నమ్మకం. గణేష్ విగ్రహం గ్రామంలో ఉన్నంతవరకూ బాలాపూర్ వాసులు మద్యం, మాంసం ముట్టరు. అంతే కాకుండా లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బుతో గ్రామాభివృద్ధికి వెచ్చిస్తారు. ప్రతి ఏడాది లడ్డూ వేలం ధర పెరుగుతున్నా... లడ్డూ ధర కాస్ట్లీగా మారినా ... సొంతం చేసుకునేందుకు భక్తులు వెనకాడకపోవటం విశేషం. -
రూ.9.26 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
బాలాపూర్ : ప్రతిష్టాత్మక బాలాపూర్ గణేషుడి లడ్డూ ఈసారి 9లక్షల 26వేల రూపాయలు పలికింది. మాజీ మేయర్, టీకేఆర్ విద్యాసంస్థల అధినేత తీగల కృష్ణారెడ్డి కైవసం చేసుకున్నారు. లడ్డూ సొంతం చేసుకునేందుకు రేసు నరసింహారెడ్డి, టీకేఆర్ విద్యాసంస్థల మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. చివరకు రూ.9.26 లక్షలకు లడ్డూను టీకేఆర్ విద్యాసంస్థలు సొంతం చేసుకున్నాయి. గత ఏడాది రూ.7.50 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది మరో 1.76 లక్షలకు దాటడం విశేషం. 1994 సంవత్సరంలో రూ.450 లకు ప్రారంభమైన లడ్డూ వేలం ఏ ఏటికా ఏడాది పెరుగుతూనే ఉంది. బాలాపూర్ లడ్డూకి... రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్ని లక్షలు వెచ్చించి అయినా లడ్డూను దక్కించుకోవాలని భక్తులు పోటీపడుతున్నారు. 1984లో బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ ప్రారంభం కాగా 1994 సంవత్సరంలో రూ.450, 2000 సంవత్సరంలో రూ.66వేలు 2010లో రూ.5.35లక్షలు, గతేడాది 7.50 లక్షలు పలికింది. -
లడ్డూను దక్కించుకున్న మాజీమేయర్ తీగల కృష్ణారెడ్డి
-
రూ.9.26 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు
-
మరికాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం
-
లడ్డూ వేలం పైనే అందరి దృష్టి