
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్ సీఐ సుధీర్ కృష్ణ కరోనా జయించారు. కోవిడ్ బారినుంచి పూర్తిగా కోలుకుని విధుల్లో చేరారు. గతనెల 20న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో 14రోజులపాటు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరో 14 రోజులు హోం క్వారైంటన్‌లో ఉండనున్నారు. ఇంటినుంచే ఆయన విధులు నిర్వర్తించనున్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయన డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నారు. మానసికంగా దఢంగా ఉండి కరోనాను ఎదుర్కోవాలని సుధీర్ అన్నారు. అధైర్య పడకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలని సూచించారు. ఉన్నతాధికారులు, డాక్టర్లు ఇచ్చిన మనోధైర్యం ఎంతగానో ఉపకరించిందని చెప్పారు. కరోనా సోకినపుడు మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యమని, వ్యాయామం, యోగా, ధ్యానంతో ఇమ్యునిటీ పవర్ పెంచుకోవచ్చని అన్నారు. మంచి పోషకాహరం తీసుకుంటే కరోనాను జయించవచ్చని సుధీర్ కృష్ణ తెలిపారు.
(చదవండి: తీర్థాల ఘటనపై మంత్రి, కలెక్టర్ సీరియస్)
Comments
Please login to add a commentAdd a comment