
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖను కరోనా కలవరపెడుతోంది. పలు పోలీస్‌స్టేషన్స్‌లో సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా థర్డ్‌వేవ్‌లో సుమారు 500 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. మొదటి దశలో 2,000 మందికి పోలీసులకు కోవిడ్ సోకింది. రెండో దశలో 700 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 50 మంది సిబ్బంది మృతి చెందారు. మూడు కమిషనరేట్‌ల పరిధిలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో అధికారులు పోలీస్ స్టేషన్‌లలో కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. బూస్టర్ డోస్‌ను సైతం వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హోమ్ గార్డ్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు బూస్టర్ డోస్ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment