సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి విశేష కృషి జరుపుతున్న వైద్య ఆరోగ్య, పోలీసు సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ 2 శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం (ఇన్సెంటివ్) కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇన్సెంటివ్‌ను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ప్రగతిభవన్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment